Monday, April 29, 2024

బంధాలు, వాటి తాలూకు సుఖ దుఃఖ సంబంధాలు....

 🌹మనిషి జీవితం ప్రేమానుబంధాలతో నడుస్తుంది.జీవితం గడుస్తున్న కొద్ది, కాలములో కొన్ని బంధాలు కలుస్తుంటాయి. కొన్ని విడిపోతుంటాయి. కొన్ని బాధ పెడుతుంటాయి. కొన్ని ఆనంద పెడుతుంటాయి. ఈ బంధాల సంబంధాలు లేకపోతే భూమిపై మానవుని జీవితం చాలా కష్టం. కొన్ని బంధాలు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాయి. కొన్ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవటాలు సమముగా ఉన్న చోట బాంధవ్యం బాగుంటుంది. ఇరువైపులా చివరి వరకు ఆనందముగా జీవితం సాగుతుంది. కానీ ఈ సక్రమతను మనుషులు గుర్తించరు, పాటించరు. దీనివలన బంధాలను ఒక్కొక్కసారి కోల్పోవలసి వస్తుంది. ఈ ఎడబాటు చాలా బాధను కలిగిస్తుంది. కాని ఇటువంటి వారితో కలసి ఉండటం అంతకంటే దుఃఖముగా ఉంటుంది.జీవితం ఇంతే... ఇలాగే సాగుతుంది... ఎంత ఓర్చుకున్నా - నేర్చుకునేది ఉన్నంత కాలం సృష్టి ఆటలో మన జీవిత నడక ఇలాగే సాగుతుంది. బంధాలు,  వాటి తాలూకు సుఖ దుఃఖ సంబంధాలు - అంతరంగములో అంటించుకున్న అనుబంధాల ముద్రలు. ఇవి మనిషిని నిరంతరం కదుపుతూనే ఉంటాయి. అది సుఖమో, దుఃఖమో ఈ సంభంధ బాంధవ్యాల కదలికలు లేకపోతే జీవితమే లేదు. ఈ కదలికలు మన వైపు నుండి వీలున్నంత మంచిగా కదపటం తప్ప మన చేతిలో ఏమి లేదు. ఈ సత్యాన్ని గ్రహించి మనతో ఉన్న బంధాలన్నిటికీ పంచగలిగినంత ప్రేమను, మంచిని పంచటమే ఆధ్యాత్మికత. బంధాలు అంటే కుటుంబం మాత్రమే కాదు - నీకు తెలిసిన అందరూ, నువ్వు తెలిసిన అందరూ...
మంచి మనం మాత్రమే చేయగలిగినది... చేయించటం కుదరదు... 🌹god bless you 🌹
 హరిఓం  ,   

మానవునికి, మానవ జాతికి పరిష్కారము ఆత్మ పరిశీలన మార్గము నుండియే లభించును. ఆత్మ పరిశీలనము లేని మానవుడు పశుప్రాయుడే. ఆత్మపరిశీలన మున్నచోట అంతరాత్మ ప్రబోధముండును. ఎచ్చట అంతరాత్మ జీవ స్వభావమును అనునిత్యము ప్రశ్నించునో, అచ్చట జీవుడు బాధ్యతాయుతుడై జీవించగలడు. బాధ్యత ప్రధానమని తెలిసిన వాడికి జీవన నౌకకి చుక్కాని దొరికినట్లగును. 
        *****************
ఎప్పటికేది ప్రస్తుతమో తాత్కాలికముగ దాని నాశ్రయించి జీవించువాడు జీవితమున యెట్టి పురోగతి సాధించలేడు. కేవలము మాటకారియై సన్నివేశములందు తప్పించుకు తిరుగుచు తన్ను తాను మోసము చేసుకొనుచు బ్రతుకును.
                   
దైవంతో స్నేహం పొందాలనుకుంటే మానవ సంబంధమైన స్నేహాలను త్యాగం చెయ్యడానికి ఇష్టపడాలి.

ఆధ్యాత్మిక విశ్వాసం  మనకు ఒక దివ్యత్వ భావన కలిగిస్తుంది. విశ్వాసం వల్లనే మనం ఉత్కృష్టమైన దానికి దగ్గరగా మరింత దగ్గరగా చేరగలుగుతాము.

లెక్కలు కట్టటం వలన గానీ లేక కేవలం తెలివితేటల పట్టుతో గాని చేరాలనుకుంటే మన దారి బహుదూరం అవుతుంది.

ఆత్మ సమర్పణ ద్వారా మన అభ్యున్నతికి హద్దులే ఉండవు. అప్పుడు వ్యక్తి తన మొరటు స్వభావాన్ని దయారహిత భావనలను విడిచిపెట్టి తన హృదయ మందిరాన్ని తానే శుభ్రపరిచి పరమాత్మ రాకకై ఎదురు చూస్తున్నాడు అన్నమాట.

మన కోరిక దృఢమైతే ఆయన రాకుండా ఉండడు..............```
        
          🙏🙏 ........                                        -        వలిశెట్టి లక్ష్మీశేఖర్ ....                                    -         98660 35557.....                             -          28 .04 .2024 ....

Sunday, April 28, 2024

****సద్గురు: మనం పాశ్చాత్య దేశాల నుండి గ్రహించిన ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, "relationship" అనగానే

 సద్గురు: మనం పాశ్చాత్య దేశాల నుండి గ్రహించిన ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, "relationship" అనగానే, ప్రజలు సాధారణంగా అది శారీరక సంబంధం గురించి అనుకుంటారు. కానీ సంబంధాలు రకరకాలుగా ఉండొచ్చు. మీకూ మీ తల్లిదండ్రులకు మధ్య, మీకూ మీ స్నేహితులకు మధ్య, అలాగే మీకూ ఇంకా అనేక ఇతర వ్యక్తులకు మధ్య, ఇలా రకరకాల సంబంధాలు ఉంటాయి.
శారీరక సంబంధాల విషయంలో, కొంత కాలం తర్వాత, సహజంగానే ఒకరి శరీరం గురించి మరొకరికి ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. అలా జరిగినప్పుడు, వారిని దగ్గరకు చేర్చిన ఈ ప్రధాన అంశం కరిగిపోతున్నప్పుడు, ఎందుకో తెలియకుండానే, ఒకరి విషయంలో మరొకరు అప్రియంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు, ఎందుకంటే ఈ సంబంధం ప్రాధమికంగా, అవతలి వ్యక్తి నుండి మాధుర్యాన్ని ఇంకా ఆనందాన్ని పొందడం గురించి అయి ఉంటుంది! వారి నుంచి సంతోషాన్ని పిండాలని ప్రయత్నిస్తే, అది మునుపటిలా అదే ఫలితాలను ఇవ్వనప్పుడు, అప్రియ భావన రావడం ప్రారంభమవుతుంది. సంబంధాల స్వభావం ఎలా ఉంటుందంటే, వ్యక్తులు ఒకసారి కలిసి ఉంటే, వారు చాలా విషయాలు పంచుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఒకరివల్ల మరొకరు అసౌకర్యానికి గురై గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన పని ఏంటంటే - మిమ్మల్ని మీరు స్వతహానే ఆనందంగా ఇంకా ఉల్లాసంగా ఉండేలా మానేజ్ చేసుకోవడమే! అలాగే ఈ సంబంధాలు కేవలం వీటిని పంచుకోవటానికి మాత్రమే అయి ఉండాలి. అప్పుడు చూడండి, సంబంధాల విషయంలో ప్రజలు పడే పాట్లు మీరు పడాల్సిన అవసరం ఉండదు. మీరు అందరితోనూ అత్యుత్తమ సంబంధాలు కలిగి ఉండొచ్చు. మీరు జీవితంలో చక్కని సంబంధాలు కలిగి ఉండాలి!

****ఈ దృష్టిని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

ఈ దృష్టిని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి 

వ్యావహారికంగా బంధుగణంతో కలిసి ఉండటం సంసారం .. తత్వ జ్ఞాన పరంగా మూడు గుణములతో కూడి యుండుటయే సంసారం 

సంగత్వమే సంసారి ... అసంగత్వం ఆత్మ స్వరూపం 

తత్వ విచారం ఆత్మజ్ఞానం కొరకు 

త్రిగుణాతీతమైన .. త్రిగుణ రహితమైన స్థితి మాత్రమే నీ స్వరూపం 

త్రిగుణములచే కూడటం భ్రాంతి చే జరుగుతున్నది 

మూడు గుణాలతో కూడిన ఆనందాన్ని అనుభవించే భ్రాంతి జీవునకుంది ... ఆ ఆనందమే ప్రధానం అనే జీవనం జీవ భావం పునర్జన్మ హేతువు 

పదార్ధమయ.. శక్తిమయ.. తేజోమయ.. బ్రహ్మ మయ .. స్థితి దాటాలి .. సకల సృష్టిలో గుణాతీతులుగా ఉన్నవారు పరమాత్మ స్వరూపులు 

ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ .. స్థూల లక్షణం .. ప్రధమ గురువుగా ఆశ్రయించి స్వరూపజ్ఞానాన్ని పొందు 

నిద్రను ధ్యానం ..సమాధిగా  మార్చుకోవాలి ... లేనప్పుడు నిద్ర తమో గుణం 

అభ్యాసం చేసి స్వభావాన్ని మార్చుకుంటే తప్ప గుణాతీత స్థితి సాధ్యం కాదు 

గుణాలనే మాలిన్యాన్ని అంత: కరణ నుండి తొలగిస్తే ..అంత: కరణకు ఉనికి లేదు 

ఎవరికీ ఊహించటానికి ... దాటడానికీ వీలుకానట్టి మాయాశక్తి .. దాటటానికి నన్ను ఆశ్రయించిన వారికి మాత్రమే సాధ్యము .. అందుకే పరమాత్మ జగద్గురువు .. శంకరులు జగద్గురువు 

అంతటా పరమాత్మను దర్శించిన  వారికి జీవాత్మ లేదు 

సృష్టి.. దృష్టి.. వ్యష్టి ..  నీ దృష్టిని మార్చటం మీద దృష్టి పెట్టినప్పుడు..జ్ఞాన వైరాగ్యాలు దృష్టిలో ఏర్పడే మార్పులు 

నిస్త్రైగుణ్య అనే పధ్ధతిలో జీవించాలి 

జీవించి ఉన్నంత కాలం .. ఆత్మ విచారణ చెయ్యాలా?... అణువు నుంచి మహత్తు వరకు పరమాత్మను దర్శించేంత వరకు చేయవలసిందే 

ప్రాణ మనసులు ఆగిపోయిన నాడు .. ఈశ్వర సాక్షాత్కారం అయిననాడు .. ఈశ్వర స్మరణ చేయనవసరం లేదు 

నారము.. నీరు ... అయనము.. వ్యాపించిన వాడు .. నీటి అణువు యందు నారాయణుడున్నాడు .. ప్రాణాధారం .. ప్రాణవాయువు నారాయణుడు 

భవతీ భిక్షాందేహి .. మాధవ కబళం అడిగేవాడు నారాయణుడు 

శివశ్చ హృదయం విష్ణు: .. విష్ణుశ్చ హృదయం శివ: .. శివ కేశవులు అభేధం 

సృష్టి అనంతం .. చెప్పే మార్గాలు అనంతం .. లక్ష్యం బ్రహ్మం 

జీవాత్మ పరమాత్మ వేరనుకోవటం భ్రాంతి .. ప్రకాశం అధిష్ఠానం ... ప్రాణం ఆశ్రయం 

ప్రకాశమే ఉనికి సర్వ ప్రాణులకు .. అదే నేను .. చైతన్యం.. ఆత్మ .. బ్రహ్మ .. ఉన్నది ప్రకాశమే బ్రహ్మమే 

భగవద్గీత లక్ష్యం మోక్ష సన్యాసం .. జన్మ రాహిత్యం .. ఏ కర్మ చేసినా లక్ష్యం నుండి కిందకు పడిపోకూడదు 

ప్రాణం కొట్టుకోవడమే కర్మ .. బుధ్ధిని కర్మ బంధం నుండి విడిపించు .. గుణమే బంధం 
ఇదే Master key ( మాస్టర్ కీ) 
ఈ ఒక్కటీ చెయ్యి ..

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు భగవద్గీత 020

జై గురుదేవ 🙏

మాట మంత్రం ఎలా అవుతుంది!!

 *హరిఓం    ,                       -                మాట మంత్రం ఎలా అవుతుంది!!*

*మాట్లాడే శక్తి ఆలోచనా శక్తి మనిషికి మటుకే ఇచ్చాడు భగవంతుడు అది లేకుంటే జంతువుకీ మనిషికి తేడా ఉండదు.*

*మాట మంత్రం లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా శుద్ధంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది..*

*అగ్గిపుల్లతో దీపం పెట్టవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు, ఎలా వాడుకుంటారు అనేదే వివేకం, అహంకారం వేవికాన్ని పోగొడుతుంది.*

*బీజం అంటే అక్షరం , ఈ అక్షర బీజాన్ని ప్రతి మాటలోను పలుకుతున్నాము..:మాట ఎలా పలకాలో అమ్మ దగ్గర నేర్చుకునే టప్పుడే ఉపదేశం పొందుతారు ప్రతి ఒక్కరు..*

*మాట్లాడే ప్రతి మాట అక్షర సముదాయం అది పద్దతిగా పలడం అంటే మంచి మాటలు పలకడం మంచి ని కలిగిస్తుంది, చెడ్డ మాటలు చెడును కలిగిస్తుంది. మాటకు అంత శక్తి ఎలా వచ్చింది ఇది పలికేది మానవుడే కదా అని అనుకుంటే ప్రతి అక్షరం బీజం దానికి ప్రకృతిలో ఉన్న విశ్వప్రాణ శక్తి స్పందిస్తుంది..*

*ఆ ప్రకంపనలు శరీరాన్ని ఆకర్షిస్తోంది.. అదే కాస్మిక్ ఎనర్జీ అదే ప్రకృతిలో ని శక్తి..ఈ శక్తి మన వాక్కుతో స్పందించాలి అంటే ఏ బీజాన్ని దేనికి జత పరచాలి అనేది తెలిసి ఉండాలి అదే మంత్రం ఈ మంత్ర శాస్త్రంలో ఏ బీజాన్ని దేనికి చేరిస్తే ఎటువంటి ప్రకంపనలు కలుగుతుంది దాని ప్రయోజనం ఏమిటి అనేది మంత్ర శాస్త్రం*

*ఒక మంత్రం ఒకరికి ఫలించి ఒకరికి ఫలించక పోవడానికి కారణం వారి వాక్కు వారు పూజ చేసే టప్పుడు జపం చేసే టప్పుడు సంకల్పమ్ చెప్పే టప్పుడు ఇది నాకు ఫలిస్తుంది అనుకుని నమ్మకంగా చేసిన వారికి ఫలిస్తుంది దానికి తగ్గ నియమాలు పాటించి నప్పుడు అది పనిచేసే శక్తి మీకు కలుగుతుంది, మొదలుపెట్టక ముందు నుండి పెట్టాక ఇది జరుగుతుంది ఫలితం వస్తుందా అన్న అనుమానం వల్ల మీ వాక్కు మీకు శాపం అవుతుంది.. ఎవరు పలికిన] అదే బీజం ఎవరు చేసిన అదే పద్దది కానీ శక్తి అనేది మీ సంకల్పమ్ వల్ల లభిస్తుంది.. అది తెలియక మీ సాధన వృధా అవుతుంది.*

*వర్గాలు గా వర్ణాశ్రమం ధర్మాన్ని నిర్ణయించి నప్పుడు.. ఇది ఒకే వర్గం చేతిలో ఉండేలా నిర్ణయించారు దానికి కారణం ఇది దుర్వినియోగం కాకూడదు అని అలాగే అందరూ నేర్చుకుంటే వీరి ప్రత్యేకత ఉండదు అని రహస్యం గా ఉపదేశాలు ఇచ్చి నేర్పే వారు ఎవరైనా వారి అనుమతితో వారి వర్గంలో నే నేర్చుకోవాలి అని ఎవరైనా వారి ఉపదేశం లేకుండా తెలుసుకుని పాటిస్తే  చాలా రకాల బాధలు వస్తుంది అని భయపెట్టే విధంగా కొన్ని ఆంక్షలు విధించారు..అందువల్ల కొన్ని శాస్త్రాలు ఒక వర్గానికి అంకితం అయితే కొన్ని రహస్య సాధనలు విధానాలు కొన్ని కుటుంబాలకు పరిమితమై మరుగున పడిపోయి చివరికి వారి తరానికి కూడా అందుబాటులో లేకుండా పోయింది.*

*కొందరు దానికి కట్టుబడ్డారు వారి లోనే కొందరు కొత్త సాంప్రదాయం శాస్త్రాలు కొత్తగా తాంత్రిక ప్రయోగాలు కనిపెట్టే ప్రసిద్ధి పొందారు అందుకే ఇప్పుడు అన్ని రకాల శాస్త్రాలు ఏర్పడ్డాయి.*

*గురువు లేకుండా మంత్రం జపించ కూడదు కారణం ఈ మంత్రం లోని బీజాలకు నాడులు స్పందిస్తుంది తప్పుగా పలికితే అది నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది, అలాగే దేనికి ఎది ఉపయోగ పడుతుంది తెలుసుకుని చేయాలి..*

*ఒక జబ్బు చేసి నప్పుడు సొంతంగా ఔషధం మింగకూడదు ఒక జబుకి ఒకే రకం మందులు అందరికి పని చేయదు ఒకే రకం జబ్బుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి.. అలాగే ఒక సమస్యకు అనేక రకాల పరిష్కరాలు వారి వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది.. అందుకే ఏది ఎలా చేయాలి అని చెప్పే వారు ఉంటే అది తెలుసుకుని చేయాలి..*

*ఉదాహరణకు ఒక ఔషధం చేసే సమయంలో పఠించే మంత్రం ఉంటుంది అది చెప్తూ చేయడం వల్ల దానికి ప్రాణ శక్తి వస్తుంది అలాగే అది తీసుకునే రోగికి కూడా ఒక మంత్రం చెప్తూ సేవించే వాళ్ళు త్వరగా ఆ మందు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది.. అది రహస్యంగా ఉంచడం వల్ల ఔషధ తయారీ తెలుసు కానీ దాన్ని మంత్ర శాస్త్రం మరుగైపోయింది.*

*మనకు తెలిసి కూడా పాము కాటు తెలు కాటు, దిష్టి మంత్రాలు ఆడవాళ్లు కూడా తెలిసి ఉండేవి ఇప్పుడు అవి మూఢనమ్మకాలు అయిపోయింది.. పద్మనాభ స్వామి గుడిలో నాగ బంధానికి ప్రపంచం మొత్తం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన ఇవన్నీ ట్రాష్ అనే బుద్ది హీనులు ఉన్నారు..*

*కోటి మందికి ఈ శాస్త్రాల విలువ తెలుసుకుంటే అందులో కొందరు వివరం తెలుసుకుంటారు, అందులో కొందరు సాధన తెలిసుకుంటారు, అందులో కొందరు సాధన నేర్చుకుంటారు , అందులో కొందరు సాధన మొదలు పెడతారు ,కొందరు సాధనలో కొనసాగుతారు , అందరిలో ఒక్కడు సాధన సఫలం అవుతాడు ఆ ఒక్కడు కోటి మందికి నేర్పగల గురువు అవుతాడు.. ఇది నిజమా అని అనుకునే ముందు పద్మ పురాణం గురించి నేను పెట్టిన సందేశం గుర్తు చేసుకోండి ఆ మెస్సాజ్ కి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది.*

*కొన్ని మంత్రాలు ఔషదంలాగా ఉపయోగ పడటానికి మన ఋషులు మనకు అందించారు అలా అందించిన వారిలో ఉన్నది ఋషులు వారికి కులం మతం తో పని లేదు ఎందుకంటే ఋషులు అందరూ బ్రాహ్మణులు కాదు ఎదో  కులం వారు కాదు , అన్ని వర్గాలు వారు ఋషులు ఉన్నారు ,అందుకే వారు కులం ప్రస్తావించలేదు అలాగే ఆ శాస్త్రం అర్థం తెలుసుకుని చేసే వాడు లేదా చేసిన అనుభవం ఉన్నవారో అయితే నేర్చుకునే వారికి ఆటంకాలు ఉండదు అనే నియమాలు తప్పా , భయనకమైన శిక్షలు వాళ్ళు రాయలేదు ఎందుకంటే వారు పరిశోధించి ఈ శాస్త్రాలను అందించింది మానవ శ్రేయస్సుకోసమే..*

*అమ్మవారి అనుమతి తోనే ఏది ఎలా చేయాలో వివరంగా ఇచ్చినవి నమ్మకం ఉన్న వారు సాధన చేయండి, చేయడం ఇష్టం లేకున్నా సనాతన ధర్మం గురించి గొప్పగా తెలుసుకోండి, చేయకున్న పర్వాలేదు ఎవరిని విమర్శించకండి.. భగవంతుడు ఇచ్చిన వాక్కుని పొదుపుగా వాడుకోండి.. నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.. ఎక్కువగా మౌనంగా ధ్యానించడం అలవాటు అయితే మంత్ర శక్తి మన లోనే పుడుతుంది.*..........

  *      🙏🙏  .......                  -        వలిశెట్టి లక్ష్మీశేఖర్ ...                      -         98660 35557.....                           -          26.04.2024......

🕉️ మన చిన్నప్పటి ‘రాజుగారి కొడుకులు-ఏడు చేపలు‘ కథకు ఎంత గొప్పగా ఆథ్యాత్మిక అన్వయం 🕉️🙏

 *🕉️🙏 జై శ్రీ కృష్ణ🕉️🙏*

*🕉️ మన చిన్నప్పటి  ‘రాజుగారి కొడుకులు-ఏడు చేపలు‘ కథకు ఎంత గొప్పగా ఆథ్యాత్మిక అన్వయం 🕉️🙏*

*🕉️🙏రాజుగారు అంటే మనిషి.*🕉️🙏

*🕉️🙏ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.*🕉️🙏

*🕉️🙏కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.*🕉️🙏

*🕉️🙏జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.*🕉️🙏

*🕉️🙏రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే.*🕉️🙏

* 🕉️🙏మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )*🕉️🙏

*🕉️🙏1.కామ 🕉️🙏*
*🕉️🙏2.క్రోధ 🕉️🙏*
*🕉️🙏3.లోభ 🕉️🙏*
*🕉️🙏4.మోహ🕉️🙏*
*🕉️🙏5.మద 🕉️🙏*
*🕉️🙏6.మాత్సర్యాలు.*🕉️🙏

*🕉️🙏వీటన్నింటిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.*🕉️🙏
 
*🕉️🙏అందుకే కథలో ఆరు  చేపలను  ఎండగట్టినట్టు చెప్పారు.*🕉️🙏

*🕉️🙏రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.*🕉️🙏

*🕉️🙏ఏమిటా చేప. అది మనస్సు.*🕉️🙏

*🕉️🙏దీన్ని జయించడం చాలా కష్టం.*🕉️🙏

*🕉️🙏ఎంత ప్రయత్నించినా అది ఎండదు.*🕉️🙏

*🕉️🙏మనస్సు  అంటే ఏమిటి*❓🕉️🙏

*🕉️🙏మనస్సు అంటే సంకల్ప వికల్పాలు*🕉️🙏

*🕉️🙏ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.*🕉️🙏

*🕉️🙏మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.*🕉️🙏

*🕉️🙏కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.*🕉️🙏

*🕉️🙏మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.*🕉️🙏


*🕉️🙏ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.* 🕉️🙏

*🕉️🙏ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.* 🕉️🙏

*🕉️🙏గడ్డిమేటు అంటే ఏమిటి?*🕉️🙏

*🕉️🙏కుప్పపోసిన అజ్ఞానం.*🕉️🙏

*🕉️🙏గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?*🕉️🙏

*🕉️🙏మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.*🕉️🙏

*🕉️🙏కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయకమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️*🕉️🙏

*🕉️🙏ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.*🕉️🙏

*🕉️🙏దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.*🕉️🙏

*🕉️🙏మరి అది పోవాలంటే ఏం చేయాలి❓*🕉️🙏

*🕉️🙏ఆవు వచ్చి మేయాలి.*🕉️🙏

*🕉️🙏ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓🕉️🙏*

*🕉️🙏ఆవు అంటే జ్ఞానం.*🕉️🙏

*🕉️🙏జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.*🕉️🙏

*🕉️🙏లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.*🕉️🙏

*🕉️🙏అందుకే "భగవద్గీత"లో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)* 🕉️🙏

*🕉️🙏జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.*🕉️🙏

 *🕉️🙏ఈ గోవును ఎవ్వరు మేపాలి.*🕉️🙏

*🕉️🙏గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓*🕉️🙏

*🕉️🙏 జగద్గురుడు.*🕉️🙏

*🕉️🙏జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా‼️*🕉️🙏

*🕉️🙏అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.* 🕉️🙏

*🕉️🙏ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.*🕉️🙏

*🕉️🙏ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.*🕉️🙏

*🕉️🙏ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓*🕉️🙏

*🕉️🙏అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.*🕉️🙏

*🕉️🙏ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.*🕉️🙏

*🕉️🙏ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.*🕉️🙏

*🕉️🙏ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.* 🕉️🙏

*🕉️🙏ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓*🕉️🙏

*🕉️🙏వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.*🕉️🙏

*🕉️🙏సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.*🕉️🙏

*🕉️🙏ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది. మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా..లేదు,అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.*🕉️🙏

*🕉️🙏చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,*🕉️🙏

*🕉️🙏మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.*🕉️🙏

*🕉️🙏చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓*🕉️🙏

*🕉️🙏మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.🕉️🙏*

****౼౼౼౼◆ భగవద్గీత సూక్తులు ◆౼౼౼౼

 ౼౼౼౼౼◆ భగవద్గీత సూక్తులు ◆౼౼౼౼౼
 
1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది. 
 
2. శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు. 
 
3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది.  
 
4. కోపమే అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి. మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. 
 
5. కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి. 
 
6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు. 
 
7.  ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు. 
 
8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు. 
 
9. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. 
 
10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.
 
11. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు... సింహం నోరు తెరుచుకుని కుర్చున్నంత మాత్రాన వన్య మృగం దాని నోటి దగ్గరకి వస్తుందా...? 
 
12. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. 
 
13. భగవద్గీత లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!! 
 
14. దాచిపెట్టిన ధనం పరులపాలు  
అందమైన దేహం అగ్నిపాలు  
అస్థికలన్నీ గంగ పాలు  
కొడుకు పెట్టిన తద్దినం కుడు కాకుల పాలు  
నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో? 
కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు  
ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు  
 
15. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని.  
 
16. భగవద్గీత కు మించిన స్నేహితుడు  
కాలాన్ని మించిన గురువు... 
ఎక్కడ దొరకడు. 
 
17. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, 
ఓడినవాడు విచారంగా ఉంటాడు, 
అవి రెండూ శాస్వితం కాదని తెలిసిన వాడు  
నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. 
 
18. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది. 
 
19. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు. 
 
నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. 
 
20. జననం మరణం సహజం 
ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు 
వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు 
 
జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.
 
21. అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు. 
 
22. నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు. 
 
23. నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను.. 
ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే... 
 
24. ఆత్మ చేధింపబడజాలదు.. 
దహింపబడజాలదు.. 
తడుపబడజాలదు..  
 
25. మరణం అనివార్యం 
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు 
ఎవరూ అమరులు కాదు. 
 
26. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!  
 
27.ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో,నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను...  
 
28. ఓడిపోయావని భాదించకు 
మరల ప్రయత్నించి చూడు 
ఈసారి విజయం నీ తోడు వస్తుంది 
 
29. కుండలు వేరైనా మట్టి ఒక్కటే 
నగలు వేరైనా బంగారం ఒక్కటే 
అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే 
అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ 
 
30. గుర్తుంచుకో…ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఎం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది 
భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.
 
31. మానసిక శాంతి లేని జీవితం వృధా 
కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది 
 
32. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ  తెలుసుకొని జీవించడమే.! 
 
33. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది. 
 
34. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తూ భగవంతుడే  మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేదు. 
ఇహ మానవమాత్రులం మనమెంత.! 
 
35. నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. 
యుక్తుడు కానీ వానికి ధ్యానం కూడా కుదరదు. 
ధ్యానం లేనివాడికి  శాంతి లేదు. 
శాంతి లేనివాడికి సుఖమెక్కడ ? 
 
36. గురువులు ఎందరో  
సద్గురువులు ఎందరో 
మార్గాలు ఎన్నో  
బోధలు ఎన్నో  
శోధనలు ఎన్నో  
కానీ 
గురువులకు గురువు అయిన జగత్గురువు ఒక్కరే  
గీత తెలుపని  
మార్గాలు లేవు 
బోధలు లేవు 
సాధన లేదు. 
 
37. అభ్యాసం కంటే జ్ఞానం  
అంతకంటే ధ్యానం  
దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. 
త్యాగం వలనే శాంతి కలుగుతుంది. 
 
38. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్కపు 
పట్టుగలది.  దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా  
అనిపిస్తుంది, ఓ కృష్ణా. 
 
39. దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్ధ్యాలను నశింపచేస్తుంది. ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని నశింప చేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు...!! 
 
40. అగ్నిని పొగ ఆవరించినట్లు, 
అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, 
గర్భస్త శిశువుని మావి కప్పినట్లు, 
జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది. 
 
41. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు  
ఉద్ధరించుకొనుము, అంతేకానీ పతనమైపోవద్దు. 
ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. 
 
42. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు  
పతనమైపోతారు. విశ్వాసము లేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు.  
 
43. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి  
భగవద్గీతను మించిన ఆయుధం లేదు. 
 
44. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడము, లేకపోవడం,  భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి. 
 
45. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి..  వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది.  కానీ.. 
ఏ ఒక్కరికి తమలో ఉండే "గర్వం" తెలుసుకునే తెలివి ఉండదు. 
 
46. జీవితంలో వయసు ఉన్నపుడే భగవద్గీతను చదవండి! ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా.. ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి! 
 
47. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును.  
 
48. నువ్వు కోరితే కోరినదే ఇస్తాను, 
కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను. 
 
49. నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో... 
ఫలితాన్ని మాత్రం నాకు వదిలి పెట్టు!! 
 
50. 
నా దేశం భగవద్గీత 
నా దేశం అగ్నిపుణిత సీత  
నా దేశం కరుణాతరంగా  
నా దేశం సంస్కార గంగ  
 
భగవద్గీత ఆచరిద్దాము. ఆరాదిద్దాం.


సర్వం శ్రీకృష్ణార్పణం...🙏🏻🙏🏻🙏🏻

_*Namasthe*_🙏🏻🎊🙏🏻

"Knowing is not enough; we must apply. Willing is not enough; we must do"
-BG-

p t seshacharyulu xlic ananthapuramu

మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. ఇలా చెప్పా రు😌

 *మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. ఇలా చెప్పా రు😌

మాగాయ:-

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  
నరుల పట్ల  కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!

*************
ఆవకాయ:-

"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 
తనతోపాటు  శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

"నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను"  అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
(వాట్సప్ సేకరణ)🥭🎋🥀🦚

నాకు మూడు నీకు రెండు (పడీ పడీ నవ్వించే జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 *నాకు మూడు నీకు రెండు (పడీ పడీ నవ్వించే జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
     ఒకూరిలో ఒకడుండేటోడు. వానికి వాని పెండ్లానికి అస్సలు పడేదిగాదు. ప్రతిదానికీ నువ్వెంతంటే... నువ్వెంతంటూ... పందెం కోళ్ళలెక్క గొడవ పడేటోళ్ళు. ఎవరూ కొంచం కూడా వెనక్కి తగ్గేటోళ్ళు కాదు.
ఒకరోజు మొగుడు జొన్నపిండి తీస్కోనొచ్చి రొట్టెలు చేయమని పెండ్లానికిచ్చినాడు. సరే అని ఆమె పిండి తడిపి రొట్టెలు చేస్తే అవి సరిగ్గా ఐదంటే ఐదయినాయి. ఇద్దరికీ తలా రెండు పోతే ఇంకా ఒకటి మిగులుతుంది గదా... దాంతో గొడవ మొదలైంది.
"తెచ్చింది నేను కాబట్టి నాకు మూడు నీకు రెండు" అని వాడు, "కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు మూడు నీకు రెండు" అని ఆమె నాకెక్కువంటే నాకెక్కువంటూ కప్పేగిరి పోయేటట్లు అరచుకోసాగినారు.
అప్పుడు మొగుడు “ఇట్లాకాదుగానీ... మనమొక పందెం వేసుకుందాం... ఇద్దరమూ కదలకుండా మెదలకుండా మంచమ్మీద మట్టసంగా పండుకుందాం. ఎవరు మొదట కదిల్తే వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచినోళ్ళకి మూడు. ఓడినోళ్ళకి రెండు... సరేనా" అన్నాడు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సయ్యంటే సయ్యనింది.
ఇంగచూడు ఇద్దరూ తలా ఒక మంచమ్మీద కదలకుండా మెదలకుండా అచ్చం శవాల్లెక్క బిగదీసుకోని పండుకొన్నారు. గంటయింది....
రెండు గంటలయింది.....
మూడు గంటలయింది...... నాలుగు గంటలయింది......... వూహూ ఒక్కరంటే ఒక్కరు కూడా కదిల్తే ఒట్టు.
అప్పుడే పక్కింటామె తోడుకి కాస్త పెరుగు అడుగుదామని లోపలికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది. ఒకొక్కరూ ఒకొక్క మంచమ్మీద అడ్డంపడి అచ్చం శవాల్లెక్క బిగదీసుకోని పోయి కనబన్నారు. “ఏమయిందబ్బా వీళ్ళకి" అని ఆమె తట్టితట్టి లేపినా లేస్తే ఓడిపోతామని మరింత బిగదీసుకోని పండుకున్నారే గానీ ఒక్కరు గూడా వూ అనలేదు... ఆ అనలేదు...
దాంతో ఆమె వాళ్ళిద్దరూ చచ్చిపోయినారేమో అనుకోని వురుక్కుంటా బయటకు పోయి వూరందరినీ పిలుచుకోనొచ్చింది. వచ్చినోళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూసి "అయ్యో... పాపం... నిన్నటి వరకు బాగానే ఉండిరే. రాత్రికి రాత్రి ఏమయిందో ఏమో... ఒకేసారి ఇద్దరూ చచ్చిపోయినారు" అని బాధపడినారు. చచ్చిపోయినోళ్ళని ఇంట్లోనే వుంచరు గదా... శ్మశానానికి తీసుకోని పోవాల... దాంతో వూర్లో వాళ్ళు ఇద్దరినీ కూచోబెట్టి నీళ్ళతో స్నానం చేపిచ్చి... కొత్త బట్టలు తొడిగి... పాడె మీదికి ఎక్కిచ్చినారు. ఇంత జరుగుతావున్నా వాళ్ళు లేస్తేనా... పందెం పందెమే తగ్గేదే లేదు అనుకుంటా అట్లాగే కట్టు కదలకుండా మట్టసంగా ఎట్లున్నవాళ్ళు అట్లాగే వుండిపోయినారు.
వూరు వూరంతా వెంట రాగా వాళ్ళిద్దరినీ మోసుకుంటా.... ముందు తప్పెట్లు మోగుతా వుంటే... పూలు, బొరుగులు, డబ్బులు చల్లుకుంటా... చల్లుకుంటా... ఆఖరికి శ్మశానానికి తీసుకోనొచ్చినారు.
ఇద్దరినీ పాడె మీద నుండి దించి కట్టెల మీద పెట్టి... వాళ్ళ మీద గూడా ఒళ్ళంతా కట్టెలు, పిడకలు పేర్చి ఒకేసారి రెండింటినీ అంటించినారు. అంతే... మంట సుర్రుమని తగిలేసరికి అదిరిపడి ఇద్దరూ ఒకేసారి ఓ అని అరుస్తా పైకి లేచినారు. లేవడం... లేవడం... ఒకరినొకరు చూసుకోని నువ్వు ముందు లేసినావంటే... నువ్వు ముందు లేసినావంటూ... నేను మూడు తింటానంటే... నేను మూడు తింటానంటూ గట్టిగా అరుచుకోసాగినారు.
వచ్చినోళ్ళందరూ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చితి మీది నుండి అట్లా పైకి లేచేసరికి వీళ్ళు చచ్చి దయ్యాలయినారేమోనని భయంతో గజగజా వణికిపోయినారు. అంతలో “నేను మూడు తింటానంటే.. నేను మూడు తింటానంటూ" వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం చూసి... అవి తమని తినడానికే వంతులేసుకుంటున్నాయని బెదపడి “రేయ్... దయ్యాలు... దయ్యాలొస్తున్నాయి... పారిపోండి..... పారిపోండి" అని అరుచుకుంటా ఎక్కడి వాళ్ళక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వూరి వైపు వురకడం మొదలు పెట్టినారు.
దయ్యాలొస్తున్నాయనే సరికి వీళ్ళిద్దరు గూడా అదిరిపడి నిజంగా వస్తున్నాయేమో అనే భయంతో వాళ్ళు గూడా వూరోళ్ళ వెనకాల్నే వురకడం మొదలు పెట్టినారు. అట్లా ముందు వాళ్ళూ... వెనుక వీళ్ళు... ఒకర్ని చూసుకోని ఒకరు కిందా మీదా పడతా వురకడం వురకడం కాదు...
ఆఖరికి విషయం తెల్సుకోని వూరువూరంతా “ఓరినీ.. మీ మీద బండపడ... భయంతో సచ్చినాం గదరా... అనవసరంగా" అని నవ్వుకుంటానే వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినారు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
 ఓటరు మహాశయా..
ఎవడు మా *ఇంటి ముందు కరెంటు స్థంభం* పెట్టిస్తాడు, ఎవడు *మా ఇంటికి నల్లా* పెట్టిస్తాడు అని చూసి ఓటు వేయడానికి ఇప్పుడు జరిగేవి *స్థానిక ఎన్నికలు కాదు* ..

ఎవడు *ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు వేస్తాడు, ఎవడు ఉద్యోగుల బదిలీలు* చేస్తాడు, ఎవడు *ఉచితంగా డబ్బులు పంచి పెడతాడు* అని చూసి ఓటు వేయడానికి ఇప్పుడు జరిగేవి *అసెంబ్లీ ఎన్నికలు కాదు* ..
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఇప్పుడు జరిగేవి..దేశంలో *దమ్మున్న నాయకుడిని* ఎన్నుకునే ఎన్నికలు..

 *ఒక్క బాంబు బ్లాస్ట్ అయితే పోయే ప్రాణం మనది* ..
అందుకే *దేశంలో ఉగ్రవాదులను ఏరి పారేసి..మన ప్రాణాలు రక్షించే వాడిని దేశ నాయకుడిగా ఎన్నుకోవాలి* ..

 *వేరే దేశంలో యుద్ధం వస్తే.. అక్కడ మన భారతీయులు ఇరుక్కుపోయినా కూడా.. ఆ దేశాల నాయకులతో మాట్లాడి* మన వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చే దమ్మున్న నాయకుడిని ఎన్నుకోవాలి..

 *అభినందన్ వర్ధమన్ లాంటి ఒక్క పైలట్..తన విమానం కాలిపోయి పాకిస్తాన్* లో  పడిపోయినా కూడా.. *పైలట్ కి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బెదిరించి.. శత్రు దేశాన్ని భయపెట్టే మొనగాడిని* ఎన్నుకోవాలి..

 *ప్రపంచంలో భారతదేశంను అగ్రదేశంగా తీర్చి దిద్దగలిగే దేశభక్తుడిని* ఎన్నుకోవాలి..
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ఓటు వేసేటప్పుడు *గ్యాస్, పెట్రోల్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ లాంటి చిల్లర విషయాలు* ఆలోచించకుండా..
 *లోకల్ లో నిలబడ్డ అభ్యర్థి యొక్క కులం, పలుకుబడి లాంటి పనికిమాలిన విషయాలు* ఆలోచించకుండా..

 *దేశంలో ఒక్క బాంబు బ్లాస్ట్ జరగకుండా ప్రాణాలు కాపాడే వీరుడిని ఎన్నుకోడానికి..ఓటు వేయండి* ..
జై భారత్ మాత 
🇮🇳🇮🇳🇮🇳🙏🚩
 మహిళలందరికీ హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏వేసవి సెలవులు వచ్చాయి పిల్లలు,పెద్దలు అందరూ అమ్మలు చాలా ఫ్రీ గా ఉంటారు అనుకుంటారు అందరూ...కానీ పిల్లలు బడికి వెళ్ళే సమయం కన్న వెళ్లకుండా ఉండే సమయంలో అమ్మలకు,నాన్నలకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది అని తెలుసుకోలేక పోతున్నాము...ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మహారానులు...మీరు ఇప్పుడే పిల్లలకు వారి పని వారే చేసుకునే విధంగా మనం తయారు చేయాలి..చిన్న చిన్నవి..ఉదయము నిద్రలేవడం మొదలు...వారి బుక్స్ మరియు బట్టలు ఇంటి వస్తువులు సర్దుకునే వరకు మనం రోజుకు 2 నుండి 3 గంటల సమయం కేటాయించి వారికి చెప్పగలిగితే 21 డేస్ వారు అలా చేసేందుకు మనం గైడ్ చేయగలిగితే లైఫ్ లో ఎప్పటికీ ఎదుటి వారి మీద ఆధార పడకుండా వారి పని వారు చేసుకోగలుగుతారు...స్కూల్స్ కి లీవ్ కదా ఇంకొంచేపు పడుకొనిద్దం అయ్యోపాపం అని వారిని బద్దకస్తులని చేయకండి...తరువాత మనమే భాదపడుతాము...పిల్లలు మనల్ని చూసి,మనము చెప్పే మాటలను,మనము చేసే పనులను,అనుకరిస్తారు గమనించండి...ప్రేమతో వారికి ఆట,పాటలతో సహా ఇంటి పనులు,వంట పనులు నేర్పించాలి...రాబోయే పోటీ ప్రపంచంలో వారికి వారే పోటీ కావాలి..ఎవ్వరిమీద ఆధరపడకూడదు ఆడపిల్లలు,మగపిల్లలు అనే తేడా లేకుండా అన్ని నేర్చుకోవాలి...అప్పుడే మన పిల్లల మీద మనం పెట్టుకున్న కళలు ,పిల్లల కళలు నెరవేరుతాయి..ఆ చిన్ని చిన్ని చేతులకు పని చెప్పండి మీరు తోడు ఉంటూ ఆనందించండి.. వీడియోస్ తీసుకోండి జ్ఞాపకాలుగా పెట్టుకోండి..🙏🙏🙏👍👍👍👍🌟🌟🌟🦚🦚🦚
"అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి"🙏🙏🙏
 రేవును వదిలిన నావను
తీరం బేలగా చూసినా
కదిలే కొద్దీ పెరిగే దూరం
వదిలే కొద్దీ బిగిసే బంధం

మాసిపోని మమతల
మరపురాని క్షణాలు
మరలిరాని మజిలీ చేరిన
తరలిపోయిన బంధాలు

సాగే నీటిలో ప్రతి బిందువూ
కదిలే  కాలపు ప్రతి క్షణమూ
ఎంత ఎదురుచూచినా
మళ్లీ  తిరిగి రాదు

చేతిలో మిగిలిన క్షణాలు
కరిగిపోకముందే
మనసులో మరిగే ప్రశ్నలకు 
జవాబులు వెదకాలి

కలలన్నీ పండకపోయినా
కలతల్ని మరిపించుకుని
కనుల నిండ సంతోషంతో
కళకళలాడుతూ  ఉండాలి

ఆత్మీయత పంచాలి
అభిమానం పెంచాలి
అనురాగం నిలపాలి
అపేక్షలు గెలవాలి

అందరినీ కలుపుకుని
ఆత్మీయంగా కలుసుకుని
ఆప్యాయతలు పంచుకుని
ఆదరంగా చూసుకుంటూ

మనమందరికీ చిన్న
జ్ఞాపకంగా నిలవాలి
మన కంటూ మనసులు 
కొన్ని సొంతమవాలి

🌸 సుప్రభాతం 🌸

బృంద 🙏

గోదావరి పుష్కరలు* 🌊 రచన : వి. పద్మప్రియ

 *గోదావరి పుష్కరలు* 
🌊

రచన : వి. పద్మప్రియ 


మాధవపురం గ్రామంలో రాజయ్య అనే పేద 
రైతు రెండెకరాల పొలం సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతడి కొడుకు భీమన్న తెలివయినవాడు, కష్టపడి పని చేసే సుగుణం కలవాడూను. అయినా ఏం లాభం? తండ్రీ అతని కొడుకులు ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకు శ్రమపడ్డా, పంట సరిగ్గా పండేది కాదు. ఎందుకంటే అది బీడు పొలం. దాన్ని సరిగ్గా సాగులోకి తెచ్చి ఎక్కువ పంట పండేలా చేయాలంటే దాని మీద కనీసం పదివేలు అయినా పెట్టుబడి పెట్టాలి. అంత ధనం రాజయ్య వద్ద లేదు. అప్పు ఇచ్చే నాథుడు కూడా ఎవరూ లేరు. అందువల్ల చేసేదేం లేక అ రాజయ్య, భీమన్న ఆ బీడుపొలాన్నే సేద్యం చేసూ తినీ తినకా కాలక్షేపం చేస్తున్నారు.

ఇలా వుండగా ఒక రోజు రాజయ్య ఇంటి పెరట్లో పాదుల కోసమని గొయ్యి తప్వుతుండ గా గునపానికి ఏదో తగిలింది. రాజయ్య అత్రుతగా మట్టి పైకి తీసి, అదేమిటా అని చూశాడు. బాగా కిలుం పట్టిన ఇత్తడి బిందె ఒకటి కనిపించింది. దాని మీద ఉన్న మూతని తొలిగించాడు. బిందెనిండా బంగారు కాసులు. రాజయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అతడి ఆనందానికి హద్దులేకుండా పోయింది. అయితే ఆ బిందెలో వున్న ఒక రాగి రేకు మీద ఇలా రాసి వుంది.

'ఈ నిథి దొరికినవారు దీన్ని వచ్చే 'గోదావరి పుష్కరాలు అయ్యాక వాడుకోవాలి. అంతకు ముందే తొందరపడి దీన్ని బయటకు తీసి వాడుకున్నా, లేక ఈ విషయం ఎవరికయినా చెప్పినా వారు, వారి కుటుంబం సర్వనాశనం ఆవుతారు.'

ఇది చదివిన రాజయ్య హతాశుడైపోయాడు.
గోదావరి పుష్కరాలు రావడానికి ఇంకా పదేళ్ళుంది. చేసేదేంలేక రాజయ్య ఆ బిందెని యథాస్థానంలో పెట్టి, మట్టి కప్పేసి ఇంట్లోకి వచ్చాడు.

భీమన్నకి ఆ నిధి విషయం చెప్పేయ్యాలని రాజయ్య ప్రాణం కొట్టుకులాడింది. కానీ శాసనం గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. పుష్కరాలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూసిన రాజయ్య పాపం ! అవి రాక మునుపే మరణిం
చాడు.

ఆ తర్వాత పుష్కరాలు రానూ వచ్చాయి, వెళ్ళనూ వెళ్ళాయి. ఆ తర్వాత రెండేళ్ళకి భీమన్న ఒక రోజున పెరట్లో తండ్రి తవ్విన చోటునే యథాలాపంగా తవ్వుతూ వుండగా నిధి దొరికింది.

అందులోని బంగారుకాసులు చూసి భీమన్న సంతోషంతో ఉప్పొంగిపోయి..

"ఏమేవ్ ఇలా రా” అంటూ భార్యని కేక వేసి పిలిచాడు. ఆమె లోపల్నింది వచ్చి జరిగినది చూసి తను కూడా ఆనందంతో మురిసిపోయింది.

ఇంతలో బిందెలో కాసులతో పాటు వున్న రాగి రేకు ఆమె కళ్ళబడింది. అది తీసి చదివిన ఆమె భయభ్రాంతురాలయి, “ఇది చూడండి” అని భర్తకు ఇచ్చింది. భీమన్న అది చదవగానే

భార్య "ఏమండీ అయితే మనకి ఇంకో పది సంవత్సరాల దాకా ఈ నిథి వాడుకునే అదృష్టం లేదంటారా?” అన్నది బాధగా.

అందుకు భీమన్న నవ్వి. "పిచ్చిదానా! ఇందులో ఉన్న చిన్న కిటుకు నీకు అర్థం కాలేదు.. పుష్కరాలు రావడానికి పదేళ్ళు గడువు ఉంది అని అనుకుంటున్నావేగానీ, పుష్కరాలు ఆయిపోయి రెండేళ్ళు అవు తోందన్న నిజాన్ని గ్రహించవేం? దీంట్లో వున్నదేమిటి ? 'పుష్కరాలు అయిపోయాక తీసుకోవాలి' అని కదా. ఆ శాసనం ప్రకారం పుష్కరాలు అయ్యాకనే తీసుకుంటున్నాం మనం. రెండేళ్ళ క్రితమే అయిపోయాయి కదా పుష్కరాలు? పుష్కరాలనేవి ప్రతి పన్నెండే ళ్ళకీ వస్తాయి. అంటే ఈ నిధి ఎప్పుడు దొరికినా అప్పటికి పుష్కరాలు అయిపోయే ఉంటాయి. కాబట్టి ఈ నిథి దొరికిన వెంటనే తీసుకుంటే ఎలాంటి ప్రమాదమూ వుండదు. తెలివితేటలున్న వారికి నిథి దొరికితే అది సద్వినియోగమవుతుందన్న ఉద్దేశంతో మా పూర్వీకులు ఎవరో ఇటువంటి తమాషా శాసనం రాసి ఉంటారు " అన్నాడు.

భర్త తెలివికి భీమన్న భార్య గర్వపడింది.
భీమన్న ఆ నిథితో తన బీడు పొలాన్ని సస్యశ్యామలం చేసుకోవడమే గాక, ఇంకో పదెకరాల పొలం కూడా కొనుక్కుని సంతోషంగా జీవించాడు.
🌊🌊

꧁☆•┉┅━•••❀❀•••━┅┉

ధర్మ భిక్షవు* *మిలారేపా కధ - 2

*ధర్మ భిక్షవు* 
*మిలారేపా కధ - 2* 

☀️

రచన : శ్రీ శార్వరి 
    

*ఉపోద్ఘాతం*

*(ఆత్మ చెప్పిన కథ)*


శాక్యముని గౌతమ బుద్ధుని జీవితానికి ...
టిబెట్ లో అపర బుద్ధుడుగా ప్రసిద్ధుడైన మిలారేపా జీవితానికి పది విధాల పోలికలు ఉన్నాయి.

గౌతమ బుద్ధుడికి ఆత్మీయుడు, ఆనందుడు అనే శిష్యుడు.

మిలారేపాకు ఆత్మీయుడు, ప్రధమ శిష్యుడు రేచుంగ్ పై.

మిలారేపా మరణించిన తర్వాత రేచుంగ్ ప్రార్ధనతో మిలారేపా దివ్య శరీరంతో దర్శనమిస్తాడు.

రేచుంగ్ లో తన దివ్యాత్మను ప్రవేశపెట్టి తన కథను శిష్యుని నోటి ద్వారా చెప్పిస్తాడు. శిష్యులకు దర్శనమిస్తాడు.

ఇది ‘మిలారేపా' ప్రియ శిష్యుడు రేచుంగ్ నోట వినిపించిన కథ. 

గౌతమ బుద్ధుని ప్రియ శిష్యుడు, ప్రాణంలో ప్రాణం ఆనందుడు. బుద్ధుని ప్రవచనాల న్నింటిని ఆనందుడు తన జ్ఞాపకాల్లోంచి వెలికి తీసి వివరిస్తాడు. అది 'లలిత విస్తరం'. గౌతమ బుద్ధుడే స్వయంగా ఈశ్వరునికి, దేవతలకు చెప్పినట్లు ఆనందుడు వివరిస్తాడు.

ఇక్కడ బుద్ధుని స్థానంలో ఉన్నది మిలారేపా.
ఆనందుని పాత్ర పోషించింది రేచుంగ్ పా.


ఎనభైయవ ఏట బుద్ధుడు నిర్యాణం చెందడం చారిత్రకం. ఎనభై నాలుగవ ఏట మిలారేపా నిర్యాణం చెందడం ఐతిహ్యం. నిర్యాణానికి ముందర బుద్ధుడు తన శిష్యులను ఉద్దేశించి తన నిర్యాణానంతరం సమాధి చేసి, ఆ సమాధి పైన ఒక స్థూపం నిర్మించమని, అది భవిష్య కాలంలో బౌద్ధులకు పవిత్ర యాత్రా స్థలం అవుతుందని, సూచిస్తాడు. 

ఆ స్తూపాన్ని దర్శించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పాడు. కారణాంతరాల వల్ల బుద్ధుని అవశేషాలు, అస్థికలను ఎనిమిది భాగాలు చేసి ఎనిమిదిమంది పంచుకున్నారు. చితాభస్మాన్ని ఒక పాత్రలో ఉంచారు. ఆ చితాభస్మాన్ని మరొక బృందం దక్కించుకుంది. 

అలా మొత్తం మీద పది చోట్ల బౌద్ధ స్తూపాల నిర్మాణం జరిగింది. బుద్ధుని నిర్యాణానంతరం శిష్యులకు బౌద్ధం పైన నమ్మకం తగ్గింది. బౌద్ధ ధర్మం పట్ల విశ్వాసం సన్నగిల్లింది.

'భగవాన్ భౌతికంగా లేరు గదా!' మందలించే వారెవరు?

ఆ సందర్భంలో ముఖ్య శిష్యులు ఒక సమారోహం ఏర్పాటు చేశారు. గృధ్ర పర్వతం మీద ఒక గుహలో సమావేశమైనారు. 500 మంది శిష్యులు హాజరైనారు. గౌతమ బుద్ధుని బోధనలన్నీ సమీకరించాలని అక్కడ వారు ప్రతిపాదించారు. అందరికీ అన్నీ తెలియవు గదా! ఏ సమావేశంలో గౌతముడు ఏం బోధించింది అన్నది ప్రశ్న. ఆ పనిని ఆనంద భిక్షువుకు అప్పగించారు. ఆనందుడు బుద్ధుని బంధువు, ఆత్మబంధువు, ఆత్మీయ శిష్యుడు. అన్ని విషయాలు ఆనందునికి చెప్పేవాడు బుద్ధుడు. ఆనందుడు మహామేధావి, ఏకసంధాగ్రాహి. ఒకసారి విన్న విషయాన్ని మరచిపోవడం జరగదు. అక్షరాక్షరం పునరుద్ధరించగలడు. పూసగుచ్చినట్లు చెప్పేవాడు. "నేను విన్నంతవరకు - జ్ఞాపకం ఉన్నంత వరకు---" అంటూ చెప్పేవాడు. అది ఆనాటి సంప్రదాయం.

మిలారేపా విషయంలో రేచుంగ్ అదే సంప్రదాయం అనుసరించాడు. టిబెట్ వారు మిలారేపాను అపర బుద్ధుడుగా ఆరాధిస్తారు. బుద్ధుని మరొక 'జన్మ మిలరేపా' అని వారి విశ్వాసం.

మిలారేపా జీవిత కథను మొట్టమొదట సంపాదించినవాడు సాంగ్లియన్ హె మాకే. ఆయన అదే పద్ధతి అనుసరించాడు. 'నేను విన్నదాన్ని బట్టి' అని ప్రారంభించాడు.

టిబెట్ వారికి అసలు గౌతమ బుద్ధుడు తెలియదు. వారి దృష్టిలో మిలారేపాయే బుద్ధుడు. అక్కడ గృధ్ర పర్వతం లేదు. మిలారేపా సంవత్సరాల తరబడి తపస్సు చేసిన 'గర్భ గుహ' ఉంది. అది వారికి పవిత్ర యాత్రా స్థలం. మిలారేపా శిష్యులు, అభిమానులు అంతా టిబెట్ వారే. భారత దేశం నుండి బుద్ధ ధర్మాన్ని టిబెట్ కి చేర్చిన వాడు మార్పా లామా. బౌద్ధ తంత్రాన్ని టిబెట్ కి పరిచయం చేసినవాడు పద్మసంభవుడు. టిబెట్ బౌద్ధులు పద్మసంభవుని కూడా అపర బుద్ధునిగా ఆరాధిస్తారు. తర్వాతి కాలంలో మిలారేపా టిబెట్ బుద్ధుడిగా వాసికెక్కాడు. 

మిలారేపా 'భారతదేశం రాలేదు. బౌద్ధ ధర్మం అధ్యయనం చేయలేదు. ఆయన గురువు మార్పా తన జీవితకాలంలో మూడుసార్లు భారత్ దర్శించి బౌద్ధ వాఙ్మయాన్ని చక్కగా అనువదించి టిబెట్ తీసుకెళ్లాడు. మిలారేపా మార్పా శిష్యుడే అయినా కూడా స్వతంత్ర యోగి, ఆత్మ సన్యాసి అయినాడు.

మహాయానంలో ఒక ఆచారం ఉంది. నిర్యాణానంతరం బుద్ధుని గురించి చెప్పేటప్పుడు బోధిసత్వునిగా పేర్కొంటూ గత జన్మల కథలు ఏకరవుపెడతారు. మిలారేపా ప్రధాన శిష్యుడు రేచుంగ్ పా ది యదార్ధ సంఘటనలు కాస్త మార్చి వేసే స్వభావం. యదార్ధ సంఘటనలు కలల వంటివి అంటాడు.

ఆయన కలలో స్వర్గం చేరతాడు. అది 'బుద్ధియాన' అనే డాకినీ లోకం. అక్కడ అంతా తాంత్రికమే. వాయవ్య భారతంలో 'బుద్ధియాన' అనే ప్రదేశం ఒకటి ఉంది. అది పద్మసంభవుడి జన్మభూమి. అక్కడ రేచుంగ్ పా 'అక్షోభ్య' అనే గురువు వద్ద తంత్ర సాధన చేస్తాడు. శాక్యముని వలె అక్షోభ్య బౌద్ధ గురువుల కథలు చెబుతుంటాడు. అలా చెప్పిన కథలలో మిలారేపా జీవితకథ ఒకటి.

ఏడవ శతాబ్దం వరకు టిబెట్ దేశానికి బౌద్ధం తెలియదు. అప్పుడైనా జనంలోకి బౌద్ధం వెళ్లింది లేదు. రాజప్రాసాదాలకే పరిమితం. పదవ శతాబ్దంలో ఒక టిబెట్ రాజు ఒక యువకుడిని భారతదేశం పంపాడు ... బౌద్ధ ధర్మం నేర్చుకురమ్మని. పదిహేడు సంవత్సరా ల వయసులో వెళ్లిన ఆ యువకుడు మరో పదిహేడు సంవత్సరాలు భారత్లోనే ఉన్నాడు. తర్వాత ఒక బెంగాలీ సన్యాసి అలీషా 1042 లో టిబెట్ వెళ్లి బౌద్ధం ప్రచారం చేశాడు. ఆ తర్వాత మార్పా మూడుసార్లు భారత్ లో పర్యటించి బౌద్ధ విజ్ఞానం మొత్తం టిబెట్ కి తరలించాడు. మార్పా లామా శిష్యుడే మిలారేపా.

ఏడవ శతాబ్దంలో భారత్ లో పర్యటించిన చైనా యాత్రీకుడు హ్యూన్సోంగ్, ఆరు సంవత్సరాల పాటు భారత్లోనే ఉండి బౌద్ధ సాహిత్యాన్ని, ధర్మాన్ని అధ్యయనం చేశాడు. అందుచేత చైనా బౌద్ధం పై హ్యూన్సోంగ్ ప్రభావం ఉంటుంది. భారత్లోని బౌద్ధానికి - చైనా, టిబెట్ దేశాల బౌద్ధానికి చాలా తేడాలు ఉన్నాయి. మిలారేపా తర్వాతనే టిబెట్లో బౌద్ధం బాగా ప్రచారమైంది. 1042 తర్వాత ముస్లిం దండయాత్రల వల్ల భారతదేశంలోని బౌద్ధారామాలు, బౌద్ధ విద్యాకేంద్రాలు కనుమరుగయ్యాయి. అప్పటి నుండి టిబెట్ బౌద్ధ కేంద్రమైంది. బౌద్ధాన్ని తనలో దాచుకుంది. హీనయాన, మహాయాన, వజ్రయానాలు గౌతమబుద్ధుని బోధనలకు ఉపశాఖలైనాయి.

మిలారేపా గురువు మార్పా, మార్పా గురువు నారోపా. నారోపా సిద్ధయోగి. వారి ప్రమేయం తోనే తంత్రం బౌద్ధంలో ప్రవేశించి 'వజ్రయానం' రూపుదిద్దుకుంది.

అనేక జన్మలలో సంక్రమించిన పాప కర్మలను ఒక్క జన్మలో రద్దు చేసుకోవచ్చన్నది మిలారేపా సిద్ధాంతం. అందుకు తన జీవితాన్నే ఉదాహరణ చేశాడు. క్షుద్ర విద్యలు అభ్యసించాడు. ఘోర పాపాలు చేశాడు. కసితో ప్రతీకార చర్యలకు పాల్పడతాడు. అటు తర్వాత మహా తపస్వి, మహర్షి అయినాడు. మహా మహా సిద్ధులను సంపాదించి సిద్ధ పురుషుడు అని అనిపించుకున్నాడు.
🪷

*సశేషం* 
    
    
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

ధర్మ భిక్షవు మిలారేపా కధ - 1

 *ధర్మ భిక్షవు మిలారేపా కధ - 1* 

☀️

రచన : శ్రీ శార్వరి 
    

*ముందు మాట* 

ఉద్రేకం ఉరకలు వేసే వయసులో తన మంత్ర శక్తితో వడగళ్ల వాన కురిపించి పచ్చని చేలను చిందర వందర చేసి గ్రామస్తుల్ని భయ భ్రాంతుల్ని చేసిన వ్యక్తిని, 83 ఏళ్ల వయసులో శరీరం త్యాగం చేసే సమయంలో అదే ప్రజ ప్రేమ సుమాలతో అభిషేకించే స్థితికి చేరిన సద్గురువు ... మిలారేపా.

మంత్రశక్తితో కిరాతకమైన పనులు చేశావని చీదరించుకుని, హింసించి ఉపదేశం ఇవ్వని గురువు - అదే వ్యక్తిని మహా యోగులలో ఒకడిని చేయడం ... ఊహాతీతం.

నేను పదేళ్ల క్రిందట మిలారేపా జీవిత చరిత్ర చదివి ఎంతో చైతన్యం పొందాను. ఆ మహాత్ముని జీవిత సంఘటనలు ఎన్నో ఆత్మాన్వేషణలో సాధకులకు క్లిష్ట సమయం లో సహకరిస్తుంటాయి.

గౌతమ బుద్ధుని తర్వాత ఆయన ధ్యాన సూత్రాలు 'మహాముద్ర' పేర రత్నమతికి, ఆయన నుండి బోధిసత్వులకు అందాయి. మన దేశంలో శావరి నుండి నాగార్జునికి, తర్వాత టిబెట్ లో మైత్రిపా, తిలోపా, నారోపా, మార్పాలు అంది పుచ్చుకున్నారు. మిలారేపా కి గురువు మార్పా.

మానవ వికాసానికి, పరిణామానికి మహా ముద్ర బోధనలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి.

'మహాముద్ర' పద్ధతిలోనిదే మాస్టర్ సి.వి.వి. గారి యోగ పద్ధతి, మహాముద్ర ధ్యానంలో ముఖ్యంగా ఆరు అంశాలున్నాయి.

1. Dont' recall...

Let go what has passed

2. Dont' inquire...

Let go what may come

3. Don't think....

Let go what is happening

4. Don't examine...

Don't try to figure anything out

5. Don't control...

Don't try to make anything happen

6. Rest...

Relax right now and Rest


మిలారేపా జీవితం చదవబోతున్నారు. ప్రేమతో చదవండి. సృష్టికి ఆకారమైన మహా చైతన్యం (univerial consciousness) తో అనుసంధానం అయ్యే సాధకులకు, ప్రస్తుతం తాము ఏ స్థితిలో ఉన్నా, సరైన స్థితికి చేర్చి సిద్ధం చేస్తుంది. ఎక్కడో దక్షిణ టిబెట్ లోని ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడిలో, అందరిలో ఉండే ఆకాంక్షలు, అభినివేశాలు, రాగద్వేషాలు ఉంటాయి సహజంగా. తానేమిటి, తన మూలం ఏమిటి అని అన్వేషించే వారికి ఏదో ఒక పాత్రలో తనను చూసుకోవచ్చు. చదువుతున్నంత సేపు భౌతిక, మానసిక చైతన్యాలను మరచి ఒక విధమైన తన్మయత్వం, తాదాత్మత పొందగలుగుతారు. మన చైతన్యం మిలారేపా చైతన్యంలో ఒదిగిపోతుంది.

తండ్రి మరణానంతరం, ఆస్తి మొత్తం పిన తండ్రి, పిన్నమ్మల స్వాధీనం కాగా వారి ఈసడింపులకు గురై తల్లి, చెల్లి కష్టాలపాలు కాగా తనలోని ఆత్మాభిమానం రెచ్చగొట్టి ప్రతీకారం చేయమని తల్లి పురమాయిస్తుంది. అమ్మకిచ్చిన మాట కోసం, 'క్షుద్రవిద్య' కోసం గురువును అన్వేషిస్తూ ఇల్లు విడిచి, ఊరు విడిచి వెళ్లిపోతాడు.

మంత్ర సాధన సమయంలో మనిషిలోని బలహీనతలు పైకొస్తాయి. ఆ విషయాలన్నీ కథలో కలిసిపోయి ఉంటాయి కనుక పాఠకులకు కొత్త అనిపించవు. వాటిని విశ్లేషించి బయటకు లాగాలి. అస్థిరమైన మనసు ఎవరికైనా బలహీనంగా ఉంటుంది. సంకల్ప బలంతో దానిని ప్రేరేపించి, బలమైన చిత్తంతో సంధాన పరచి, లక్ష్యం సాధించడం మిలారేపా కథలో మొదటి భాగం.

ఆ దుష్కృత్యాల వల్ల జరిగిన నష్టాల్ని చూచి, ఆత్మ విచారణ చేసి చైతన్యం పొంది సన్మార్గం లోకి రావడం ఉత్తర కథ, మలినమైన మనస్సుతో, సంకల్ప బలంతో ఏదైనా సాధించగలననే అహంభావంతో పరమ దారుణమైన స్థితిలో ఉన్న మనసుని, స్వస్థితి కి చేర్చి, మరల సాధనకు ఎంత కష్టపడాలో ... ఈ కథ చదివితే తెలుస్తుంది.

జీవితానికి అర్థం తెలియకుండా బ్రతకడమే అసలైన అజ్ఞానం. చైతన్యం లేకపోతే అగాథం లోంచి బయటపడే అవకాశం ఉండదు. ధ్యాన ప్రక్రియతో, సాధన ద్వారా మనలోని చైతన్యాన్ని అనుభూతిస్తూ శరీరానికి, మనస్సుకి పరిమితమైన వ్యక్తిగత చేతనను మహా చైతన్యంతో జతపరచడం యోగ రహస్యం. ధ్యానానికి పరాకాష్ఠ. మనలోని చైతన్యాన్ని గమనికతో నివృతం చేసుకుంటూ' పోవడమే ధ్యాన లక్ష్యం ... లక్షణం. ఈ క్రియకు కొంతవరకు సహాయ పడేది మనసే అయినా, తర్వాతది స్వీయ చైతన్యమే. అది అన్ని విధాల ఆదుకుంటుంది.

మొదటి దశలోనే – అంటే మనసు సహాయం అవసరమైన దశలో భౌతిక (బాహ్య) గురువు సహాయ, సహకారాలు అవసరం. ఈ విషయం మిలారేపా తన గురువు మార్పా కోసం రాతి భవనం నిర్మించిన కాలంలో గమనించవచ్చు. తర్వాత సాధన తీవ్రతరం అయినప్పుడు, అంటే, అంతర్ చైతన్యం పైకొచ్చే స్థితిలో, గురు చైతన్యం తన చైతన్యంతో కలిసిపోయి మహా చైతన్యంగా పరిణమిస్తుంది. కథ చివరన మిలారేపా, అనేక కొండ గుహల్లో (28) సాధన చేస్తూ పొందిన అనుభవాలు ఈ పరిణామాన్ని సూచిస్తాయి.

తర్వాత ఆయనే శిష్యులకు 'నా పద్ధతి అనుసరించండి' అని చెబుతాడు. మొత్తం కధను హృదయపూర్వకంగా, ప్రేమతో చదివితే మన సైకాలజీ మొత్తం అవగాహన అవుతుంది.

'Evolvement of Consciouness' 
అర్థమవుతుంది. సత్యాన్వేషి సాధన ఎలా ఉండాలో మిలారేపా జీవితం నేర్పుతుంది. అటువంటి సాధకుని గురువు ఎలా ఉండాలో 'మార్పా' ప్రవర్తన, ప్రతిభ చెప్పక చెబుతాయి. మార్పాగారి అర్ధాంగిలో 'యోగమాత' దర్శనమిస్తుంది. గురువు ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తుంటే భౌతికమైన అవసరాలు 'గురుపత్ని' తీరుస్తుంది. వారిది చిత్రమైన దాంపత్య యోగం.

మార్పా లామా తన శిష్యుడైన మిలారేపాని తీర్చిదిద్దిన పద్ధతి మొదటి నుండి చిత్రంగా ఉంటుంది. కష్టం అనిపిస్తుంది. సానుభూతి కలిగిస్తుంది. మిలారేపాలో తాను ఆశించిన మార్పు రాని ప్రతిసారీ గురువు పద్ధతి మారుస్తుంటాడు. (అదే "మార్పా' ఏమో!) మిలాని తొలి ఇనిసియేషన్ కి సిద్ధం చేయడం కష్టమైంది. తర్వాత కడదాకా శిష్యుని హృదయంలో తానుండి నడిపించడం సద్గురు లక్షణం. తాను ఎందుకు అంత కష్టపెట్టవలసి వచ్చిందో చివరి వరకు చెప్పడు.

ఆరంభం నుండి గురుదంపతులు మిలారేపాని తమ ఆధ్యాత్మిక పుత్రునిగా ప్రేమిస్తారు. వారిద్దరికీ తెలుసు ఆ కుర్రవాడిని మామూలు పద్ధతుల్లో దిద్దలేమని. అంచేత కష్టమైన పనులు అప్పగించి కర్మ రహితుని చేస్తారు. అసలు శిష్యునిలో పట్టుదల లేకపోతే ఏ గురువు మాత్రం ఏంచేయగలడు? అందుచేత మిలారేపా కథ మన నేటి సాధకులందరికీ మార్గగామి.

మిలారేపా అంతటి దీక్షాదక్షుడైనప్పుడు ఆయన గురువు మార్పా ఎంతటివాడై ఉంటాడు! మార్పా మూడుసార్లు భారతదేశం వచ్చి 18 సంవత్సరాలు గురు శుశ్రూషలు చేసి బౌద్ధధర్మాన్ని వంటపట్టించుకుని, బౌద్ధ వాఙ్మయాన్ని తలదాల్చి టిబెట్ చేరాడు. మార్పా సిద్ధ యోగి మాత్రమే కాదు. గొప్ప వైజ్ఞానికుడు. సంసార పక్షంగా జీవిస్తూ మహాగురువైన మొదటి వ్యక్తి ఆయనేనేమో.

ఒకసారి మిలారేపాను శిష్యులు అడిగారు: "మేము మీలాగా బ్రహ్మచర్యం పాటిస్తూ సన్యాసి కావడమా లేక మీ గురువుగారి లాగా సంసార పక్షంగా ఉంటూ బుద్ధత్వం 'సాధించ గలమా?' అని, మీ గురువులాగా మీరెందుకు పెళ్లి చేసుకోలేదని అడిగారు.

మిలారేపా సమాధానం. "కుందేలు సింహాన్ని అనుసరిస్తే సింహం కాదు". సంసార జీవితంలో నిస్వార్థంగా ఉండడం సాధ్యం కాదు. స్వార్థం, బాంధవ్య బంధాలు లేకుండా జీవించగలిగితే అదే ఉత్తమమైన పద్ధతి..

మార్పాకి తెలుసు మిలారేపా తనను మించిన యోగి అని, ఏ గురువు తన శిష్యుల్ని పూర్తిగా తన మీద ఆధారపడనివ్వడు. మార్గం నిర్దేశిస్తాడు. స్వతంత్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తాడు. సద్గురువు ఒకే పద్ధతి అనుసరించడు. శిష్యుల మానసిక స్థితుల్ని బట్టి వారికి అనుకూలమైన పద్ధతులు నిర్దేశిస్తుంటాడు. మిలారేపా జీవిత కథలో ప్రతి సాధకుడు తనను చూచుకోవచ్చు.


*మిలారేపా బోధన*

"ఆత్మజ్ఞానం ఎవరికి వారు సాధించుకునేదే తప్ప ఒకరు ఇచ్చేది కాదు. పూర్వజన్మల కర్మ శేషాలన్నీ ఒక్క జన్మలోనే రహితం చేసుకుని జన్మ రహితులం కావచ్చు.."

మాస్టర్ మిలారేపా ... సుస్వాగతం!!

*రచయిత....*
🌼

*సశేషం* 
    
    
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•

Saturday, April 27, 2024

****నిజమైన ఆధ్యాత్మికత......

 🌹తనను తాను గమనించుకోకుండా ఎవరు మంచిగా ఉండలేరు. సహజముగా అవసరాలు, కోరికలు, బాధలు నిరంతరం పరుగులు తీయిస్తూ ఉంటాయి. వాటికీ తగ్గట్టుగా పరుగులు తీస్తుంటాము. ఈ పరుగులో ఎలా ప్రవర్తిస్తున్నాము అన్నది చాలా సార్లు స్పృహలోకి రాదు. ఈ స్పృహ, ఎరుక, గమనిక కలిగించుకోవటమే సాధన. మన ప్రతి కదలిక - మాటతో మొదలుకొని అన్నీ ముందు ఎరుకతో గమనించుకొని తరువాత కదిపితే - కదిలితే - అది మంచిగా మాత్రమే కదిలితే, చెడును గుర్తించి వదలి వేయగలిగితే - ఇటువంటి వారు అందరూ ఆధ్యాత్మిక సాధనలో వున్నట్లే... మతమైనా, దేముడైనా, గురువైనా, గ్రంధమైనా మనను అంతరంగములో మంచివారిని చేయటానికే అన్న విషయం మర్చిపోకండి. నిజమైన ఆధ్యాత్మికత నిత్య మంచి ఆచరణ కలిగిన జీవితము మాత్రమే... 🌹god bless you 🌹

Sekarana from devine planet YouTube channel community https://www.youtube.com/@divineplanet-designinglive1681/community

Friday, April 26, 2024

****కష్టాలు, కన్నీళ్లు... ఆలోచించి చూడండి...

 🌹సృష్టిలో ఉన్న అన్ని జీవులకు తమకు ఏమి కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అన్నీ తెలిసి సృష్టికి అనుకూలముగా, సృష్టిని గ్రహిస్తూ జీవిస్తూ ఉంటాయి. వాటికి ఋతువుల మార్పులు, సృష్టిలో జరగబోయే అనేక మంచి, చెడు పరిణామాలు ముందే గ్రహించి తదనుగుణముగా జీవించే ప్రయత్నం చేస్తాయి.. అది వాటిలో గొప్పతనం కాదు.అవి నిరంతరం సృష్టితోకలసి ఉండి, సృష్టిలో మార్పులు గమనిస్తూ బ్రతుకుతాయి.అందువల్ల సృష్టిలోని వాతావరణ, భౌగోళిక పరిస్థితుల మార్పులను వెంటనే గ్రహిస్తాయి.
కానీ మనిషి మాత్రం నేనులో పూర్తిగా ఇరుక్కుపోయి సృష్టి మాట దేముడెరుగు - పక్క మనిషినే పట్టించుకోక పోగా, హాని కూడా చేస్తాడు... ఇందువల్లే ఎక్కువ బాధలకు గురి అవుతూ వుంటారు. నేను సృష్టిలో భాగము అనే భావనతో దేనికి- ఎవరికి హాని చేయక, మేలుగా జీవించేవారికి సృష్టి శక్తి కూడా సహకరిస్తుంది. నేను అనే పరిమిత స్వార్ధభావన వల్ల సృష్టి శక్తికి వ్యతిరేక దిశలో సాగటం వల్ల మాత్రమే కష్టాలు, కన్నీళ్లు... ఆలోచించి చూడండి... 🌹god bless you 🌹

Wednesday, April 24, 2024

****మాంస దృష్టి - ఆత్మ దృష్టి

మాంస దృష్టి - ఆత్మ దృష్టి

నాయనా ! జనకా ! ఎందుచేతనో ఈ జీవుడు ఆత్మదృష్టిని ఏమరచి మాంస దృష్టిని కొన్ని దేహపరంపరలుగా పెంపొందించుకొన్నమవాడై ఉంటున్నాడు. ఈతడు మోహము చెందుచున్నాడు! ఈ భౌతిక దేహములు ఎటువంటివి ? మాంసముతోను, బొమికలతోను, గ్రంధులతోను, క్రొవ్వు - రక్త - చీములతోను తయారుకాబడిన భౌతికమైన (మెటీరియల్) బొమ్మలే కదా ! అవి కాస్త ప్రక్కన పెడితే ఏ దేహములో ఏమి ప్రత్యేకత ఉన్నది?

తత్ మాంసరక్త భాష్పాంబు పృథక్ కృత్వా విలోచనే, సమాలోకయ ! గమ్యం చేత్ కింముధా పరిముహ్యసి?
ఓ జీవుడా ! చర్మము - మాంసము - రక్తము - కన్నీరు… ఇవన్నీ విడివిడిగా ఒక చోట ఒక వరుసలో పెట్టి పరిశీలించిచూడవయ్యా. వీటన్నిటిలోని ఏ ఒక్కటిలో ఏమి ప్రత్యేకత ! ఏమి రమ్యత ? ఎందుకు నీవు పరిమోహము పొందుచున్నావయ్యా ? భావకవులు “మేరు శిఖరము మీద నుండి తెల్లటి మెరుపులతో కూడి జాలువాడుచున్న సెలయేరువంటి మల్లెపూలచే గ్రుచ్చబడిన పొడవైన జడవలె, గంగాజలము వంటి అధరామృతముతో”… ఇటువంటి వర్ణనలతో ముక్తాహారములతో కూడిన స్త్రీ - పురుష దేహములను వర్ణిస్తూ పాఠకుల భ్రమలను మరింత అధికము చేస్తున్నారు.

ఇటు వంటి వన్నీ మననము చేసుకొంటూ స్త్రీ - పురుష జీవులు ఒకరినొకరు దేహములవైపు చూచుకొనుచూ రస-సముల్లాసము పొందుచున్నారే! “జిలుగు - జిగేల్ వస్త్రములచే, పుష్పహారములచే అలంకరించబడిన భౌతిక దేహముల లోపల రక్త -చీము - మాంస - బొమికల అమరికయే కదా !”… అనేది ఈ జీవుడు గుర్తు పెట్టుకొని ఉండకపోతే ఎట్లా ? అభౌతికము - అప్రమేయము అయి, సర్వమును కదలుటకు కారణముగుచున్న ఆత్మను గుర్తించి దర్శించాలి కదా !

ఓయీ ! అమాయక జీవుడా !
శ్మశానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః శ్వభిరా అస్వాద్యతే కాలే లఘుపిండ ఇవాంధనః !
ఏ ఏ స్త్రీ స్థనములు, పురుషుల భుజస్కంధములు చూచి ఒకరికొకరు స్పృశించి మురిసిపోతూ ఆనందించుచున్నారో, అవన్నీ కూడా “కాలక్రమేణా ఒకానొక రోజు కుక్కల చేత - నక్కల చేత అన్నపు ముద్దలవలె, తమకు ఇవ్వబడగా లభించిన సొంత సొమ్ము వలెను గుటకలు వేస్తూ మ్రింగబడబోవుచున్నాయి కదా !"… అనునది గుర్తు కలిగి ఉండకపోతే ఎట్లా? ఎప్పటికప్పుడు మార్పు చెందుచున్న భౌతిక రూపములు చూచి పిచ్చిగా ఆకర్షితులవటము మానవ జన్మ పొందిన మీకు ఉచితమా? కాదు.

నల్లటి కురులు ధరించి మనస్సులో దుష్టమగు పరస్పర స్పర్శభావన - ఆలోచనలతో కూడుకొని ప్రియురాండ్లు ప్రియుల పట్లా, ప్రియులు ప్రియురాండ్ల పట్లా భౌతిక ధ్యాసలు పెంపొందించుకొని ఫలితంగా మండుటెండలో గడ్డివలె ఈ జీవులు కాలుతూ ఉడికిపోవుచున్నారు.

ఈ భౌతిక దేహములకు సంబంధించిన ధ్యాసలు ఎటువంటివంటే….

  • జ్వలితా అతి దూరేఽపి। : మనస్సు ఒక దేహముతో మమకారము - కోపము - కామము దృష్టితో సంబంధము పెట్టుకోవటము వలన తత్ఫలితంగా ఆ దేహము ఎక్కడో దూరాన ఉన్నప్పుడు కూడా … అతని మనస్సును జ్వలింపజేయగలదు. మకిలి నింపగలదు.
  • సరసాపి నీరసా :   భౌతిక దేహముతో కలిగి ఉన్న సంబంధము పైకి సరసముగా కనిపిస్తూ ఇంతలోనే నీరసముగా పరిణమిస్తోంది.
  • స్త్రీ యోహి నరకాగ్నీనామ్ ఇంధనమ్ చారుదాగుణమ్ : ఈ స్త్రీ - పురుషుల పరస్పర దేహాకర్షణ సమాచారములు ’నరకము’ అనే అగ్నిని హృదయములో దారుణముగా ప్రజ్వలించుటకు ఇంధనముగా అగుచున్నాయి. ‘కాముడు’ అనే కిరాతకుడు దృశ్యమునందు ధ్యాసలు గల జీవులు అనే పక్షులను (“నారీ దేహములు - పురుష దేహములు" అనే ఆకారములను) ఎరగ వేసి “అనేక దుర్వాసనలు” రూపముగల త్రాళ్ళతో తయారైన వలలో బంధించి “జన్మపరంపరలు” అనే పంజరములలో కట్టివేసి ఉంచుచున్నాడు. 

అన్ని దోషములకు పేటిక వంటిది ఈ నారీ సంబంధింత (దృశ్య సంబంధిత) వ్యవహారమంతా! ఇక్కడ ఏదో పొందాలి - కావాలి- ఏదో చేయాలి. అనునదంతా ఈ జీవునికి దాస్య శృంఖలములుగా పరిణమిస్తున్నాయి. అట్టి బంధములకు అంతూ-పొంతూ ఏముంటుంది?

అందుచేత,
అలమ్ అస్తు మమ స్త్రీయా - ఓ మనసా ! ఈ సంబంధములను, అనుబంధములను ఇక చాలించు. మనము అసలు విషయమునకు వచ్చి పరిశీలిద్దాము” … అని ఈ జీవుడు వివేకి అయి ఆత్మతత్త్వ జ్ఞానము కొరకై అత్యంత త్వరగా నాంది పలకటము ఉచితము.

యస్య స్త్రీ, తస్య బోగేచ్ఛా ! ని స్త్రీ కస్య క్వ భోగభూః? - స్త్రీ (దేహ) ధ్యాస కలిగి ఉంటేనే భోగేచ్ఛ ఉంటుంది ? భోగేచ్ఛ లేనప్పుడు భోగభూములూ ఉండవు. స్త్రీయం త్యక్త్వా జగత్ త్యక్త్వం ! స్త్రీ (సంబంధము)ను త్యజిస్తే జగత్తును త్యజించినట్లే అవుతుంది.

జగత్ త్యక్త్యా సుఖీ భావేత్ ! జగత్తును త్యజించినవాడు ‘సుఖి’ అగుచున్నాడు. (స్త్రీ = సత్వ + రజో + తమో = స + ర + త). ఈ పరస్పర సంబంధములు, భార్య - పుత్ర - కళత్ర - మిత్ర… ఇత్యాది వ్యవహారములు ఈ జీవుని భ్రమింపజేస్తూ ఉన్నాయి. ఈ జీవుడు సత్యము వైపుగా దృష్టి సారించకుండానే రోజులు - జీవితములలను గడిపివేస్తున్నాడు. ఈ సంసారమును నమ్మి ఉండకూడదు

ఎందుకంటే …

  • చాలా కాలము వరకు దంపతులకు సంతానము కలుగకపోతే అది వారికి ఎంతో దుఃఖము - నిరుత్సాహము కలుగజేస్తూ ఉంటుంది.
  • సంతానము కలుగుతూ ఉంటే… అది ఆ తల్లికి గర్భపాతము సమయములో ప్రసవవేదన.
  • సంతానము కలిగినప్పటి నుండి వారి అనారోగ్య బాధల వలన తల్లి తండ్రులకు ఎన్నో ఆదుర్దాలు ! ఉద్వేగాలు ! ముచ్చెమటలు పోస్తూ ఉంటాయి.
  • ఆ కుమారుడు అల్లరి - చిల్లరగా తిరుగుతూ ధూర్తుడైతే అది మరింత వేదన !
  • ఉపనయనము చేసినా విద్య అబ్బకపోతే మరింత మనఃతాపము.
  • ఒకవేళ పండితుడు అయితే కూడా అతనికి వివాహము అవ్వకపోతే … ఇల్లంతా నిరుత్సాహము “ఏమి చెయ్యాలిరా !" అని వేదన.
  • అతడు సంపదలు పొంది పరస్త్రీ వ్యామోహముతో దురభ్యాసి అయితే కష్టాలకు అంతు ఉండటము లేదు.
  • ఒకవేళ కొడుకు కుటుంబము దారిద్ర్య బాధ అనుభవిస్తూ ఉంటే, అది తల్లిదండ్రులకు మరింత కష్టకాలము.
  • కొడుకు పరుషంగా పలికేమాటలకు ఆ తల్లిదండ్రుల మనస్సులు వికలమైపోతూ ఉంటాయి.

ధనీ చేత్ మ్రియతే తదా!

ఒకవేళ, “అన్నీ బాగానే ఉన్నాయి కదా ! సంతానము, సంపద అన్నీ అనుకూలమే”… అని అనుకుంటూ మురిసిపోయేవారికి ఖరా-మృత్యువులు దేహగతియే మార్చివేస్తున్నాయి. ఎవ్వడూ కాలమును నమ్మి ఉండటము కుదరదు. ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా అవుతుందో ఎవ్వరూ ముందుగా తెలుసుకోలేని కాలగతి ఇక్కడ తాండవ మాడుతోంది. కాలమునకు “ఎర” కానిదేది, ఒక్క ఆత్మ తప్ప?
Reference link -  https://yhramakrishna.com/upanishads/html/vol1-Yajnavalkya-upanishad.html

Monday, April 22, 2024

ప్రశ్న : ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం. విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అన్నమాట !

 ప్రశ్న : ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం. విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అన్నమాట !
జవాబు: నిప్పుని పొగ మరుగు పరుస్తుంది. అట్లాగే, చైతన్యకాంతిని నామరూపాల సమ్మేళనమైన ప్రపంచం మరుగుపరుస్తుంది. కరుణామయమైన భగవదనుగ్రహం లభిస్తే మనస్సు పరిశుద్ధ మవుతుంది. అప్పుడు ప్రపంచపు నైజం ... భ్రమకొల్పే రూపాలు కాదు సత్యమేనని విశిదమవుతుంది.
*"జగత్తు సత్యము"* అనే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు ? మాయ అనే దుష్ట శక్తికి అతీతమైన మనస్సు కలిగి, ప్రపంచపు ధ్యాస విడచి, దానిపట్ల అనురక్తి లేకుండా ఉండి ... తద్వారా పరమసత్యాన్ని గ్రహించిన వారే అర్థం చేసుకోగలరు. అసలైన జ్ఞానం వల్ల దృక్పథం పరివర్తన చెందితే ... ఆకాశాది పంచభూతములు కల విశ్వం వాస్తవంగా, పరమసత్యంగా గోచరిస్తుంది.
అనేక నామరూపాలతో కిక్కిరిసి పోయి, ఇప్పుడు విభ్రమం కొల్పే ప్రపంచం యొక్క స్వరూపం ఆనందమే ! ఏకమే ! పంచరంగుల నెమలి యొక్క గుడ్దులోని సొన ఒకటే. ఆత్మనిష్ఠతో ఈ సత్యాన్ని గుర్తుంచుకో.
"నీ సహజస్థితిలో ఉండు"
భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు

భయంలోకి వెళ్లడం

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 136 / Osho Daily Meditations  - 136 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 136. భయంలోకి వెళ్లడం 🍀*

*🕉  భయం ఉన్నప్పుడల్లా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. నిజానికి, భయం నుండి సూచనలు తీసుకోండి. అవి మీరు ప్రయాణించాల్సిన దిశలు. భయం కేవలం ఒక సవాలు. ఇది మిమ్మల్ని పిలుస్తుంది: 'రండి!' 🕉*

*ఏదైనా నిజంగా మంచిగా ఉన్నప్పుడు, అది భయానకంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు కొన్ని అంతర్దృష్టులను తెస్తుంది. ఇది కొన్ని మార్పులకు మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఇది మిమ్మల్ని ఒక అంచుకు తీసుకువెళుతుంది, మీరు వెనక్కి వెళితే, మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించరు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ పిరికివాడిగానే గుర్తుంచుకుంటారు. ముందుకెళితే ప్రమాదమే. అదే భయంగా ఉంటుంది. కొంత భయం ఉన్నప్పుడల్లా, వెనక్కి వెళ్లకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే అది పరిష్కరించే మార్గం కాదు. అందులోకి వెళ్ళండి. మీరు చీకటి రాత్రికి భయపడితే, చీకటి రాత్రిలోకి వెళ్లండి-ఎందుకంటే దానిని అధిగమించడానికి అదే మార్గం.*

*భయాన్ని అధిగమించడానికి అదొక్కటే మార్గం. రాత్రిలోకి వెళ్లండి; అంతకన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. వేచి ఉండండి, అక్కడ ఒంటరిగా కూర్చోండి మరియు రాత్రిని పని చేయనివ్వండి. భయపడితే వణకండి. వణుకు ఉండనివ్వండి, కానీ రాత్రికి చెప్పండి, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయి. నేను ఇక్కడ ఉన్నాను.' కొన్ని నిమిషాల తర్వాత ప్రతిదీ స్థిరపడిందని మీరు చూస్తారు. చీకటి ఇప్పుడు చీకటి కాదు, అది ప్రకాశవంతంగా మారింది. మీరు దానిని ఆస్వాదిస్తారు. మీరు దానిని తాకవచ్చు- మృదువైన నిశ్శబ్దం, విశాలత, సంగీతం. మీరు దానిని ఆస్వాదించగలరు మరియు మీరు ఇలా అంటారు, 'ఇంత అందమైన అనుభవానికి నేను భయపడ్డాను ఎంత మూర్ఖుడిని!'*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 136 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 136. GOING INTO FEAR 🍀*

*🕉  Whenever there is fear, never try to escape from it. In fact, take hints from fear. Those are the directions in which you need to travel. Fear is simply a challenge. It calls you: "Come!"  🕉*

*Whenever something is really good, it is also scary, because it brings you some insights. It forces you toward certain changes. It brings you to a brink from where, if you go back, you will never forgive yourself. You will always remember yourself as a coward. If you go ahead, it is dangerous. That's what is scary. Whenever there is some fear, always remember not to go back, because that is not the way to solve it. Go into it. If you are afraid of the dark night, go into the dark night-because that is the only way to overcome it.*

*That is the only way to transcend the fear. Go into the night; there is nothing more important than that. Wait, sit there alone, and let the night work. If you fear, tremble. Let the trembling be there, but tell the night, "Do whatever you want to do. I am here." After a few minutes you will see that everything has settled. The darkness is no longer dark, it has come to be luminous. You will enjoy it. You can touch it-the velvety silence, the vastness, the music. You will be able to enjoy it, and you will say, "How foolish I was to be afraid of such a beautiful experience!”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

***శాంతి స్థాపన / Manifesting Peace

 *🌹 శాంతి స్థాపన / Manifesting Peace 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*శాంతి లోపల నుండి ఉద్భవిస్తుంది. అది మొలకెత్తడానికి మరియు ఎదగడానికి మరియు వృద్ధి చెందడానికి వేచి ఉన్న ఒక చిన్న విత్తనం వలె ప్రతి ఆత్మలో ఉంటుంది. ఇది మొలకెత్తడానికి ముందు సరైన పరిస్థితులు, సరైన వాతావరణం మరియు సరైన చికిత్స అవసరం. నిశ్చలంగా ఉండండి మరియు సరైన పరిస్థితులను సృష్టించండి. నిశ్చలంగా ఉండండి మరియు విత్తనం పాతుకోవడానికి అవకాశం ఇవ్వండి. మట్టిలో బాగా పాతుకు పోయిన తర్వాత, అది పెరుగుతూనే ఉంటుంది; అయినప్పటికీ, దాని లేత ప్రారంభంలో పోషణ మరియు సంరక్షణ అవసరం. కనుక నిశ్చలతని, ధ్యానం ద్వారా అభ్యాసం చేయండి*

*ప్రపంచ శాంతికి తాళంచెవి మీలోనే ఉంది. ప్రపంచంలోని గందరగోళం మరియు అశాంతి గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు, కానీ మీలో విషయాలను సరిగ్గా ఉంచడం ప్రారంభించండి. సంకల్పం చేయడంలో నిశ్శబ్దంగా ఉంటూ, దానితోనే ఉండండి. మీరు దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, జీవించండి. మీ స్వంత జీవితంలో అశాంతిని మరియు గందరగోళాన్ని -  శాంతి, ప్రశాంతత మరియు దివ్యతగా మార్చుకోండి. మీరు నివసించే సమాజంలో మరియు ప్రపంచంలో ఉపయోగకరమైన సభ్యుడిగా అవ్వండి. మీరు ఏదైనా చేయగలరని మీకు తెలిసిన చోట మీలో, మీతోనే ప్రారంభించండి, ఆపై బాహ్యంగా పని చేయండి. దివ్యతకి బాటలు వేయండి.*
🌹🌹🌹🌹🌹

*🌹 Manifesting Peace 🌹*

*Peace originates from within. It lies within every soul like a tiny seed waiting to germinate and grow and flourish. It needs the right conditions, the right environment and the right treatment before it can sprout. Be still and create the right conditions. Be still and give the seed the opportunity to take root. Once it is well rooted in the soil, it will continue to grow; however, in its tender beginnings it needs nurturing and care. Practice Silence through Meditation.*

*The key to world peace lies within yourself. Do not waste time worrying about the chaos and confusion in the world, but start putting things right within yourself. Be quietly busy doing your Will. You do not need to talk about it, just live it. Transform the chaos and confusion in your own life into peace, serenity and calm, and become a useful member of the society and the world in which you live. Start with yourself, where you know you can do something, and then work outwards.*
🌹🌹🌹🌹🌹

కర్మ అనేది ఒకరి కర్తవ్యాన్ని నిర్వర్తించడం

 *🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 233 / DAILY WISDOM - 233 🌹*
*🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 20. కర్మ అనేది ఒకరి కర్తవ్యాన్ని నిర్వర్తించడం 🌻*

*మానవ మనస్సులో అంతర్లీనంగా ఒక ధోరణి ఉంది. ఇది ఏమిటంటే, స్వచ్ఛమైన నిరాకార చైతన్యం ఐన ఆత్మ, తానుగా కనిపించని, ఇంద్రియాలతో అనుభూతి చెందబడే వస్తువుల పట్ల లాగబడుతుంది. మరియు ఈ ఇంద్రియ అనుభూతి రూపంలో అది ఏది కాదో తెలుసుకుంటుంది. అంతే కాదు, అది ఒక నిర్దిష్ట వస్తువు గురించి నిరంతరం స్పృహలో ఉండదు. ఇప్పుడు దీని గురించి తెలుసు; అప్పుడు మరో విషయం తెలిసింది. ఇది వస్తువు నుండి వస్తువుకు కదులుతుంది. ఆత్మ లేని దిశలో కదిలే ధోరణి-వస్తువుల బాహ్యత వైపు ప్రేరణని కల్మషం లేదా మల అని పిలుస్తారు.*

*మనస్సును నిరంతరం ఒక దానిపై స్థిరపరచడం అసాధ్యం. దీనినే పరధ్యానం లేదా విక్షేపం అంటారు.  అసలు అలాంటి ప్రేరణ రావడానికి కారణం అవరణ లేదా ముసుగు. ఈ మూడు లోపాలను దీర్ఘకాల స్వీయ-క్రమశిక్షణతో పాటు సరైన సూచనలతో క్రమంగా తొలగించాలి. ఇది దానికి కావాల్సిన సమయాన్ని అది తీసుకుంటుంది. కర్మ, భక్తి మరియు జ్ఞానం-లేదా కర్మ, ఉపాసన మరియు జ్ఞానం అని పిలువబడే యోగ సాధన యొక్క పద్ధతులు ఉన్నాయి. కర్మ అనేది కార్యకలాపం, పని, ఏ రకమైన పనితీరు అయినా-ఒకరి కర్తవ్యాన్ని నిర్వర్తించడం కర్మ అని మనం చెప్పవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 233 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 20. Karma is Discharge of One's Duty 🌻*

*There is a tendency inherent in the human mind by which the pure subjectivity, which is the consciousness of the Atman, is pulled, as it were, in the direction of what it is not, and is compelled to be aware of what it is not in the form of sense-perception. Not only that, it cannot be continuously conscious of one particular object. Now it is aware of this; now it is aware of another thing. It moves from object to object. The tendency to move in the direction of what the Atman is not—the impulsion towards externality of objects—is the dirt, or mala, as it is called.*

*The impossibility of fixing the mind on anything continuously is the distraction, or the vikshepa. The reason why such an impulse has arisen at all is the avarana, or the veil. These three defects have to be removed gradually by protracted self-discipline coupled with proper instruction. It takes its own time. There are techniques of yoga practice known as karma, bhakti and jnana—or karma, upasana and jnana. Karma is activity, work, performance of any kind—discharge of one's duty, we may say.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

ఫలితం అనుకూలమా .. ప్రతికూలమా అనే ప్రశ్నే లేదు నీ శక్త్యానుసారం చేయటమే

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ : 🙏

ఫలితం అనుకూలమా .. ప్రతికూలమా అనే ప్రశ్నే లేదు నీ శక్త్యానుసారం చేయటమే 

నా ప్రారబ్దం అని వదిలేస్తే తమోగుణం .. ఫలిత్సంతో సంబంధం లేకుండా నీవు లేవ వలసిన సమయానికి లేవవలసిందే .. నీ ప్రయత్నం .. సాధన నీవు చేయవలసిందే .. లక్ష్యానికి చేరతావో చేరవో .. అది సత్యం 

కర్మ సూత్రం సత్యమే అయినా .. కర్మ ఫల ప్రదాత అయిన ఈశ్వరుని పరమాత్మని దృష్టిలో పెట్టుకొని .. దివ్యజీవనాన్ని జీవిస్తే కర్మ బంధించదు .. సుఖ దు:ఖాల యందు సమభావం వస్తుంది .. ప్రభావితం కావు 

శరీరమే నేను గా ఉంటే మన సామర్ధ్యం 1% .. నేను ఆత్మ స్వరూపుడిని మన సామర్ధ్యం 100% ..  దైవ సంకల్పం మేరకే పని చేసే వాడికి ఓటమి లేదు 

స్వబుధ్ధి పనిచేసిన దగ్గర నుండి స్వీయ కర్మ పని చేస్తుంది ..

సాధనతో కర్మకు అతీతంగా ఉండి కర్మ చేయటం .. దివ్య జీవనం అవుతుంది 

బుధ్ధిని ఆత్మ భావనలో నిలిపి చేస్తే శ్రీరామ చంద్రుడివి .. లేకుంటే రావణాసురుడివి 

ప్రత్యగాత్మ స్థితి నుండి పరమాత్మను దర్శించటం .. దర్శనం 

సాంఖ్య దర్శనం - యోగ- ఉత్తర మీమాంస - పూర్వ - న్యాయ- తర్క .. షడ్దర్శనాలు 

సాధన పూర్వకంగా దివ్యజీవనాన్ని జీవించడానికి తొలిమెట్టు దర్శనం .. జీవాత్మ పరమాత్మల అభేధ నిర్ణయం దర్శనం 

కాల ధర్మాన్ని అనుసరించి కర్మ ఫలిస్తుంది .. సృష్టి అంతటికీ పరమాత్మ ఆధారం అయితే నేను కర్తను అంటున్నావు 

తత్వ జ్ఞానం దృష్ట్యా మంచి సాక్షియే ... సాక్షిత్వం కోల్పోయి చేసేది ఏదైనా చెడే .. ఏమి జరుగుతూందో అదే సత్యం .. సాక్షిగా ఆత్మగా .. 

శాస్త్ర మూలం .. గురు మూలం.. ఋషిమూలం వెదుక రాదు 

ఆసేతు హిమాచల పర్యటన చేసిన భగవత్పాదులు ఎవరినీ విమర్శించలేదు .. సంస్కరించారు అంతే .. ప్రజ్ఞను ధీ శక్తిలో నిలుపుకున్నారు కాబట్టి 

ప్రజ్ఞను నిరశిస్తే మిగిలేది అచలం 

అంత:కరణకు .. కర్మకు లోబడటం మానవుని బలహీనత 

మౌన వ్యాఖ్యగా తెలుసుకున్నదే సుజ్ఞానం ... గురువు గారి మౌనాన్ని అర్ధం చేసుకోవటమే గురువుని ఆశ్రయించటం 

అవగాహన జీవి యొక్క పరిపక్వతని బట్టి ఉంటుంది 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 

సమాధానాలు 

జై గురుదేవ 🙏

****కర్మ _పునర్జన్మ

 🔔 *కర్మ _పునర్జన్మ*🔔
                 
 మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.

1.మొదటిది
మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.

2.రెండవది
వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.

  3. మూడవది
ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.

ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు.

మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.

మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.

విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని “మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరి తో చంపబడి వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా?” అని అడిగితే వారు “ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము” అన్నారు.

మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.
                 
*యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః*
*జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః*
                                                                      
-భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో.

ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.
                  
*"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున
  జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”
                                                                     
        -జ్ఞాన యోగం: 37 శ్లో.
    
`"అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”
 *ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి?* 

`జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే…  మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.

మనం ఈ కర్మ రహస్యాన్ని...  జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.

 జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా!!

🙏🏻🙏🏻🔔🔔🙏🏻🙏🏻

నిజమైన కాఠిన్యం

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 135 / Osho Daily Meditations  - 135 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 135. నిజమైన కాఠిన్యం 🍀*

*🕉 లాటిన్‌లో వినడంకి ఒక పదం ఉంది. విధేయత అనే ఆంగ్ల పదం దాని నుండి వచ్చింది. మీరు ఏదైనా సరిగ్గా వింటే, అది విధేయతను సృష్టిస్తుంది. 🕉*

*మీరు సరిగ్గా చూస్తే, అది తన స్వంత క్రమశిక్షణను తెస్తుంది. అసలు విషయం ఏమిటంటే, లోపల, వింటున్నప్పుడు పూర్తిగా ఖాళీగా ఉండాలి, చూసేటప్పుడు పూర్తిగా ఖాళీగా ఉండాలి, అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎటువంటి పక్షపాతాన్ని తాకకుండా సంపూర్ణంగా ఖాళీగా ఉండాలి, ప్రమేయం లేకుండా ఉండాలి మరియు సూక్ష్మంగా ఒకవైపు వాలకుండా ఉండాలి, ఎందుకంటే ఆ వాలు సత్యాన్ని నాశనం చేస్తుంది. అస్సలు మొగ్గు చూపకుండా, సత్యాన్ని అనుమతించడం, అది వేరేది కావాలని బలవంతం చేయకుండా, అది ఏమైనా అనుమతించడం. ఇది మతతత్వ వ్యక్తి యొక్క కఠిన జీవితం. ఇది నిజమైన కాఠిన్యం: సత్యం యొక్క స్వంత మాటలను అనుమతించడం-భంగం కలిగించకుండా, రంగులు వేయకుండా, మార్పు చేయకుండా, ఒకరి స్వంత నమ్మకాల ప్రకారం దానిని ఏదో ఒక విధంగా నిర్వహించకుండా.*

*సత్యం తనకు తానుగా, నగ్నంగా మరియు కొత్తగా ఉండటానికి అనుమతించ బడినప్పుడు, మీలో గొప్ప క్రమశిక్షణ పుడుతుంది - అది విధేయత. మీలో గొప్ప క్రమం పుడుతుంది. అప్పుడు మీరు గందరగోళంలో ఉండరు; మొదటిసారిగా మీరు ఒక కేంద్రాన్ని సేకరించడం మొదలుపెడతారు, ఎందుకంటే తెలిసిన సత్యం వెంటనే మీ సత్యంగా మారుతుంది. తెలిసిన సత్యం వెంటనే మిమ్మల్ని మారుస్తుంది. మీరు ఇప్పుడు అదే వ్యక్తి కాదు. సత్యం అంటే ఏమిటి?  చాలా దార్శనికత, చాలా స్పష్టత మరియు అనుభవమే ఆకస్మిక పరివర్తన. ఇది నిజమైన మతం గురించిన విప్లవం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 135 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 135. AUSTERITY 🍀*

*🕉  They have a word in Latin for listening, obedire. The English word obedience comes from that. if you rightly listen, it creates obedience.  🕉*

*If you rightly see, it brings its own discipline. The basic question is that inside, one should be perfectly empty while listening, perfectly empty while seeing, perfectly empty while touching no prejudice for or against, staying uninvolved, and having no subtle leanings, because that leaning destroys the truth. Having no leanings at all, allowing truth to he, not forcing it to be something else but allowing it, whatever it is. This is the austere life of the religious person. This is real austerity: to allow truth to have its own say-not disturbing, not coloring, not manipulating, not managing it in some way according to one's own beliefs.*

*When truth is allowed to be itself, naked and new, a great discipline arises in you-obedience. A great order arises in you.  Then you are no longer in chaos; for the first time you start gathering a center, a nucleus, because truth known immediately becomes your truth. Truth known as it is immediately transforms you. You are no -longer the same person. The very vision, the very clarity, and the very experience of what truth is, is a sudden mutation. It is the revolution that real religion is all about.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

Sunday, April 21, 2024

వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! ‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ..

 🥭🥭🥭🥭
వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 

‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋 

... భలే తియ్యటి వాసన గదంతా! 
గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍

కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.
మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 

వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.

అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. 
వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 

‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇

వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి , బాగా బేరం చేసి కాయలు ఎక్కడ మంచివి దొరుకుతాయో చూసి కొనేవారు. 

కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.
అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !

‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. 

ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 
ఇక అసలు విషయానికొద్దాం. 

వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! 
వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది

అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. 
ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. 
నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡
నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.

అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤
ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝

అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. 
కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀

తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!

వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋

అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. 

మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? 
ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.

ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 

పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.  
అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.
లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. 
అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀

బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.

అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...

‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 

అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.

మావిడిపండంటే తీపే కాదు! 
తీపి జ్ఞాపకం కూడా! 
 💭 😍 🥭🥭🥭

మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో శ్రీ కొచ్చర్లకోట జగదీష్ అనే మహానుభావులు వ్రాసిన కధనం... , చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍 

 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰🥰

ఒక చిన్న భర్త కథ:-మీ అందరికోసం!

 ఒక చిన్న భర్త కథ:-మీ అందరికోసం!

పండు👨మధు👧ఇద్దరు భార్యాభర్తలు👬
పండు ఏదో తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు!మధు ఇంట్లోనే పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామలను సేవిస్తూ సాఫీగా జీవితం గడుపుతూ ఉండేవారు!
మధుకి భర్త అంటే ఎనలేని ప్రేమ 💕💕పండుకి భార్య అంటే ఎంతో అనురాగం!💗💗మధు అత్తమామలకి కోడలంటే!చెప్పలేనంత ప్రీతి!💑💑
ఈ కారణంగా నే మధు పుట్టిటింటికి పెద్దగా వెళ్ళేది కాదు వెళ్లినా ఒక్కపూట అర పూట లో తిరిగి వచ్చేది!
ఒకసమయాన మధు అన్న గారికి పెళ్లి కుదరడంతో మధు 15 రోజులు ముందే పుట్టిటింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది 
మధుని పంపడం పండుకి! అతని తల్లిదండ్రులు కు ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి...
మధు పుట్టింటికీ వెళ్లింది! పండు స్నేహితులతో కాలం గడుపుతూ!తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కాలం వెల్లదీస్తున్నారు!
ఇంతలో స్నేహితులలో ఒకరిది పుట్టినరోజు వచ్చింది.. తన స్నేహితులతో కలిసి అందరూ సరదాగా గడపాలి అనుకున్నారు పండుని కూడా పిలిచారు భార్య కూడా ఇంట్లో లేదు ఒంటరిగా ఎందుకు అని పండు కూడా పార్టీకి వెళ్లారు 
స్నేహితులు బలవంతం చేయడం వలన మద్యం తీసుకున్నారు!【పండుకు పెళ్లికి ముందు అలవాటు ఉంది మధుకి ఇష్టం లేదని మానేశారు】చాలా రోజుల తర్వాత అలవాటు గుర్తు చేసుకున్న పండు రోజూ స్నేహితులతో కలిసి మందు తాగడం అలవాటయ్యింది!ఇంతలో మధు అన్నగారి పెళ్లి తంతు దగ్గర పడింది పండు కుటుంబం అందరూ పెళ్లికి హాజరయ్యి తిరిగి వచ్చేశారు...మరుసటి రోజు కూడా పండు స్నేహితులతో కలిసి పార్టీలు గట్రా పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ స్నేహితులకు ఒక్క మాటచెప్ప సాగాడు
ఫ్రెండ్స్ నేను రేపటి నుండి రాలేను అని.......
వాళ్ళందరూ ఆశ్చర్యం గా పండు వైపు చూసారు!
ఏంటి బావ ఏమయ్యింది ఇంత అర్ధాంతరంగా ఈమాట చెప్పావు అన్నారు 
అప్పుడు పండు నవ్వుతూ రేపు మీ చెల్లెలు(మధు) వస్తుంది బావ అందుకే ఇక రాలేను అన్నాడు
అంతలోనే స్నేహితులలో ఒకరు పెళ్ళానికి బయపడుతున్నావా అని ఎగతాళి చేశారు
మరొకరు పిరికోడా అన్నారు
ఇంకొకరు చేతకానివాడు అన్నారు 
ఇవన్నీ వింటున్న పండు ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోయాడు 
మరునాడు సాయంత్రం రోజూలానే స్నేహితులని కలిసాడు
ఏంటి బావ రాను అన్నావుగా ఎందుకొచ్చావు!అన్నారు
మరొకరు వెంటనే మందుకు బానిసైతే అంతే బావ ఏదీ గుర్తు రాదు అన్నారు 
పండు వాళ్ళ అందరికి ఇలా చెప్పాడు 
రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాడిని కానీ తాగి వాగాను! అంటారు అందుకే ఇప్పుడు చెప్తున్నా 
★నా భార్య అంటే భయమే నాకు!ఎందుకంటే నేను తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది అని ఆలోచించి తనెక్కడ ఆరోగ్యం పాడుచేసుకుంటుందేమో అని!
★పిరికోడినే!ఎందుకంటే నేను చేసే పోరాపాటులన్ని సమర్ధించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరికోడినే!
★చేతకాని వాడినే!ఎందుకంటే నేను ఎంతటి వెర్రి చేష్టలు చేసినా భరించే ఆమె సహనం ముందు నేను చేతకాని వాడినే!
పండు సమాధానం విన్నాక అక్కడ మౌనం రాజ్యమేలింది 
అందరూ కొంత సేపటికి తేరుకున్నారు 
పండు కళ్ళలో చెమర్చిన కన్నీరు!స్నేహితుల మౌనం ఇవన్నీ పండుకు గర్వముగా అనిపించాయి!అందరూ పండుని క్షమాపణలు కోరారు పండు ఆనందంగా మధు దగ్గరకు వెళ్లిిపోయాడు

ఫ్రెండ్స్ మనలో కూడా చాలా మంది చెప్తుంటారు అయ్యో ఇంట్లో మా ఆవిడ ఉంది!అన్నాడు అంటే అతను భార్యకి బయపడినట్టు కాదు గౌరవిస్తున్నట్టు అని అర్ధం!భార్యను బాధపెట్టకూడదు అని అతని ఆతరంగికం!
మనం భార్యకు గౌరవం ఇవ్వకపోగా ఇచ్చేవాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నాము!😢😢😢

మా బాల్యం

 *మా బాల్యం*❤️

ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు. 
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. 
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..
 
గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!

కట్ చేస్తే..!

ఇప్పుడు..!
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..!

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు..  

ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి..!

ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ 😍😍😍