Tuesday, January 31, 2023

:::::సత్యం::::::

 *::::::సత్యం::::::::*


        సత్యం  మనస్సు యొక్క(psycological mind) పరిధి లోనిది కాదు 

     మనసు కు అవతల ఏముందో మనస్సు తెలుసు కోలేదు.
         మనస్సు పరిధి లోకి వచ్చినది అంతా ఆలోచనే 
.
 
      వర్తమానం లో ఆలోచనకు స్థానం లేదు.
    
       కనుక మనస్సు (మానసిక మైన) సత్యాన్ని తెలుసు కోలేదు.

కనుక మనం మాట్లాడుకునేది, చెప్పుకునేది సత్యం కాదు.

*షణ్ముఖానంద 98666 99774*

****భక్తుల ముఖ్యలక్షణం*

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v

🌸 అమృతం గమయ 🌸

*భక్తుల ముఖ్యలక్షణం* 
 
మనం నిత్యం తెలుసుకుంటున్నటువంటి *భక్తుల ముఖ్యలక్షణాలు* అన్నీ కూడా మనకు శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినటువంటి సందేశాల ద్వారా మనకు అందించినటువంటి వరాలు. భగవద్గీత పట్టణం చేసిన వాళ్ళందరికీ ఈ పదాలు  తెలిసి ఉంటాయి.

*న హృష్యతి - న ద్వేష్టి* 
*న శోచతి - న కాంక్షతి* 
ఈ నాలుగు పదాలు మనకు భగవద్గీత  ద్వాదశోధ్యాయం భక్తి యోగం 17వ శ్లోకంలో కనిపిస్తాయి. ఇప్పుడు వాటి అర్థాన్ని చూద్దాం.

కోరికలు తీరితే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషం. అదే హృష్యతి. 

అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, నష్టం కలిగినా  కలిగేది శోకం. అదే శోచతి.

మనకి ఎవరైనా అపకారం చేస్తే అతడిపై ద్వేషం. అదే ద్వేష్ఠి. 

మనకు లేనిదాన్ని కోరుకుంటే కాంక్ష, అదే కాంక్షతి. 

ఈ హృష్యతి, శోచతి, ద్వేష్టి, కాంక్షతి - ఈ లక్షణాలన్నీ సామాన్యులకే గాని భక్తులకు ఉండవు. ఉండకూడదు. ఉంటే అతడు భక్తుడు కాడు. 

మనం సామాన్యులుగా ఉన్నంతకాలం ఈ లక్షణాలు మనలను వదలవు. ఎప్పుడైతే మనం భగవంతుని వైపుకు మరలి, భగవంతునితో సంబంధ బాంధవ్యం ఏర్పరచుకుంటామో, ఆ క్షణం నుండే ఈ అవలక్షణాల నుండి మనకు విముక్తి లభిస్తుంది.  అప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోవటమో, బాధతో విలవిలలాడి పోవటమో, ద్వేషంతో కుతకుతలాడటమో, కోరికలతో వేగిపోవటమో ఉండదు. భగవంతునితో బంధం పెంచుకుంటే  పరితృప్తి - సంతృప్తి.

అలాగే మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత కాలం సంతోషం, దుఃఖం, ద్వేషం, కాంక్ష - వీటితో సతమతమౌతూ ఉండాలి. ఒక్కసారిగా ఈ ప్రపంచంతో సంబంధం వదులుకొని పరమాత్మతో సంబంధం పెట్టుకున్నామా? - ఆ క్షణం నుండే మనం ఈ అన్ని అవలక్షణాల నుండి - అంటే కోరికలు (కాంక్ష), దుఃఖం (శోచతి), సంతోషం (హృష్యతి), ద్వేషం (ద్వేష్టి) అనే వాటినుండి విముక్తులమవుతాం. భగవత్ సాన్నిధ్యంలో ఆనందిస్తాం.
దీనికోసం ప్రపంచాన్ని నిషేధించక్కర్లేదు. భగవత్ సాన్నిధ్యంలో, ప్రపంచంలో ఉంటూ నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ సత్య జ్ఞానముతో కర్మలని ఆచరించగలిగేటువంటి పరిపుష్టి లభిస్తుంది.

ఈ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి సాధన చేయండి.

-- సత్ చిత్

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్య: స మే ప్రియ: 

భగవద్గీత - భక్తియోగం -  17వ శ్లోకం

ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

*****🌷అంతరాలోచన🌷

 🌷అంతరాలోచన🌷

జీవితం అంటే...,

ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.

చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,

బాధోస్తే బ్రతకలేమా?

సకల జీవులు భగవత్ అవతారములే..,

అందులో ఓ పది మాత్రమే అవతారములు గా ప్రాచుర్యం పొందినాయి.

➡ జీవుని తలంపు -
  కార్యరూపం దాల్చడానికి కొంత వ్యవధి అవసరం.

➡ భగవంతుని తలంపు -
తలంపు, కార్యం  ఏకకాలంలో జరుగుతాయి.

శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం/తపస్సు.
➡ ఢమరుకం - సంగీతం.
➡ తాండవాభినయం -  నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

భవబంధాలు తెగాలి అంటే:-

➡ ముందు భవము తెగాలి.,
అంటే 'నేను పుట్టాను' అన్న భావన పోవాలి.
➡ తర్వాత బంధాలు వాటికవే తెగిపోతాయి.

మనం ఇక్కడ నుండి అక్కడకు వెళ్లే వాళ్ళము కాదు.,

అక్కడ నుండి ఇక్కడకు వచ్చిన వాళ్లము.

➡ భక్తి కావాలంటే అరుణాచలం (అగ్నిలింగం) చుట్టూ తిరగండి.
➡ జ్ఞానం కావాలంటే అనిలాచలం (వాయు లింగం) చుట్టూ తిరగండి.

అనిలాచలం = శ్రీకాళహస్తి = వాయు లింగం = శ్వాస.

👉 శ్వాస మీద ధ్యాస (ధ్యానం) ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు.

సన్యాసం అనేది --
అంతరంగిక విషయం.,
బాహ్య విషయం కాదు.

లోకాన్ని ఉద్ధరించడం కూడా.,

తనను తాను ఉద్ధరించుకోవడం లో భాగమే.

➡ నాలుకను ఆపితే మాట ఆగుతుంది
➡ చిరునాలుకను ఆపితే మనసు ఆగుతుంది

నాలుకను పై దవడకి ఆనిస్తే, చిరు నాలుక కదలిక కూడా ఆగుతుంది. అప్పుడు మనసు నిశ్చలం అవుతుంది.

➡ నిశ్శబ్దం - నీ వెలుపలి విషయం.

➡ మౌనం - నీ లోపలి విషయం.

సైంటిస్టులు వెతికే దైవకణం బయట ఎప్పటికీ దొరకదు., తన లోపలే అది దొరుకుతుంది.

ఆ దైవకణమే -- నేను (ఆత్మ).

కర్తృత్వ భావనే బంధం;

అది తొలగితేనే మోక్షం.

దేనియెడల, ఎవరి యెడలా 'ప్రత్యేకత'ను కలిగి ఉండొద్దు.

అదే మోక్ష స్థితి.

'ఆచరణ' అనేది గొప్ప ఉపన్యాసము.

➡ పదార్థం గురించి చెప్పేది - సైన్స్ 

➡ పరమార్ధం గురించి చెప్పేది - ఆధ్యాత్మికం

గాఢనిద్రలో ఉన్న తన ఆనంద స్థితిని.,

మెలకువలో పొందాలనే ప్రయత్నమే 'ఆధ్యాత్మికం'.

'మౌనం'గా ఉండడమే నిజమైన దక్షిణామూర్తి స్తోత్రము.

👉 ఆత్మహత్యలో "భౌతిక శరీరం" పోతుంది.

👉 ఆత్మసాక్షాత్కారం లో "నేను" పోతుంది.

పైకి ఎలా కనబడిన సరే.,

ప్రతి ఒక్కరూ సృష్టి కార్యాన్ని నెరవేరుస్తున్నవారే.

ప్రాణం రెండు విధాలుగా అభివ్యక్తమవుతోంది--

➡ శ్వాసగా
➡ తలంపుగా

➡ పట్టుకుంటే - సంసారం.
➡ వదిలేస్తే - సన్యాసం.
➡ వదలగలిగి పట్టుకుంటే - ఆధ్యాత్మికం.

పుట్ట - శరీరం 
పాము - ఆత్మ

👉 ఒక్కొక్క పుట్టలో ఒక్కొక్క పాము ఉందనుకుంటే అది - స్వస్వరూప దర్శనం.
👉 అన్ని పుట్టల్లోను ఉండేది ఒకే పాము అని తెలిస్తే అది - విశ్వరూప సందర్శనం.

'అనంత విశ్వం'లోని సత్తువ కొంత --
నాన్న వీర్య కణమై, అమ్మ కడుపులో నలుసై ఈ భూమిపై పడి నాలుగు కాలాలు నడయాడి తిరిగి 'అనంత విశ్వం'లో కలుస్తుంది.

ఎందుకీ చక్రం?  ఎంతకాలమీ చిత్రం??

✳ ఇక్కడి వాళ్లు మేడలను చూడ్డానికి విదేశాలకు వెళుతున్నారు.
✳ అక్కడి వాళ్లు జ్ఞానులను చూడ్డానికి భారతదేశానికి వస్తున్నారు.

వారిది భోగ దేశం;  మనది యోగ దేశం.

➡ వ్యవహారంలో ద్వంద్వాలు ఉండడం తప్పనిసరి.

➡ అనుభవంలో మాత్రమే అద్వైతానుభవం ఉండడం సరి.

ఏ ఆలోచన అయినా,
ఏ క్షణానికి ఆ క్షణం మనసు నుండి శూన్యం అవ్వాలి.
అప్పుడు ఆ మనస్సే -- సాక్షాత్తూ "పరబ్రహ్మం" అనబడుతుంది.

(క్లాసు అయిపోగానే, బ్లాక్ బోర్డును డస్టర్ తో తుడిచేసినట్లు, తుడిచేయాలి.)

ఆధ్యాత్మిక ప్రశ్నకు సమాధానమే దొరకదు.

ఎందుకంటే,  'ప్రశ్నించే వాడే' సమాధానం కాబట్టి.

👉 జగత్తును చూసేవాడు తనను (ఆత్మను) చూడలేడు.

👉 తనను (ఆత్మను) చూసేవారికి జగత్తు లేదు.

✳ గ్రంథాల పారాయణం -  పారాయణం చేసిన తర్వాత ఫలితం.

✳ జ్ఞాన సూక్తుల పారాయణం - ఫలితాన్ని అనుభవిస్తూ చేసే పారాయణం.

👉 కోరిక - ఐహికమైనది.

👉 సంకల్పం - పారమార్థికమైనది.

బ్రహ్మం అంటే?
'ఉన్నది' ఏదో అది (సత్)

ఆధ్యాత్మికం అంటే?
ఆ బ్రహ్మము యొక్క స్వభావం (చిత్)

కర్మ అంటే?
సృష్టికి ప్రధాన కారణమైన ఆ బ్రహ్మము యొక్క విలాస సంకల్పము (ఆనందం)

వైరాగ్యం అంటే ...

➡ నీవు కోరకుండా ఉండటమే కాదు.,
➡ వచ్చిన దానిని కూడా వద్దనకుండా ఉండగలగటం.

దేవుడు రక్షిస్తాడని సనాతనధర్మం చెప్పదు. 

ధర్మం రక్షిస్తుందని చెప్తుంది. (ధర్మో రక్షతి రక్షితః)

👉 పుణ్యము పండినచో మనుష్య జన్మ వచ్చును.
👉 ఇంకను పండినచో ధర్మములందు అనురక్తి కలుగును.
👉 ఇంకను పండినచో ఆత్మానాత్మ విచారణ సిద్ధించును.
👉 ఇంకను పండినచో అఖండ ఆత్మతత్వానుభూతి కలుగును.

పుట్టినప్పుడు పేరు ఉండదు.,  ఊపిరి తప్ప.

పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.

ప్రపంచానికి ఒకడు చచ్చినట్లు కనబడ్డా!
నిజానికి., అతనికి ప్రపంచం చచ్చింది.

::::: ఆస్తులు రెండు రకాలు :::::

 *:::::: ఆస్తులు రెండు రకాలు :::::::::*
1)   *ప్రోగు చేసేవి.*
2)  *ప్రోది చేసేవి*.(పోషణ)
     1 *ప్రోగు చేసేవి* మనం అనేక రకాలైన ఆస్తులను సంపాదించి ,కూడ బెట్టి ప్రోగు చేస్తాం. నగలని, భూములని, విల్లా లని, పొలా లని, ఇందుకు నానా గడ్డి కరుస్తాము. మోసం, దోపిడి, కబ్జా, స్కాం,,శీలం పోయినా పర్వాలేదు.
2) *ప్రోది ( పోషణ) చేసేవి*
 మనం మనస్సు కి శిక్షణ ఇచ్చి క్రింది ఆస్తులను సాధన ద్వారా పెంచి పోషించు కుంటాము.
*శీలం* మంచి మాట, మంచి ప్రవర్తన, మంచి తనం, వీటిని ఆచరిస్తాము. ఇది మనలను ఇతరులను ప్రశాంతంగా వుంచుతుంది.
*స్నేహం* మనం ఇతరులతో ఎలాంటి వివక్షలు లేక స్నేహం గా మెసులుతాము. దీని వల్ల మానవ సంబంధాలు మానవీయంగా మారతాయి.
*సతి* ఎల్లవేళలా సతి(ఎరుక) కలిగి వుంటాము.  ఇది రాగ ద్వేష మోహాలకు గురి కానివ్వదు.
*ప్రజ్ఞ* సరైన అవగాహన, మరియి సరైన దృష్టి ని కలిగినదై మనలను దుఃఖం పారిన పడ నివ్వదు.
*షణ్ముఖానంద 98666 99774*

నారాయణ హృదయాలయ, బెంగుళూరు హార్ట్ స్పెషలిస్ట్ *డాక్టర్* *దేవి శెట్టి* గారు విప్రో ఉద్యోగులకు ఇచ్చిన సలహాలు:

 నారాయణ హృదయాలయ, బెంగుళూరు
హార్ట్ స్పెషలిస్ట్ *డాక్టర్* *దేవి శెట్టి* గారు
విప్రో ఉద్యోగులకు ఇచ్చిన సలహాలు:

 *ప్రశ్న 1* : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ? 
 *జవాబు* : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.
2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3)ధూమ పానం మానడం.
4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.
5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.

 *ప్రశ్న 2.* కొవ్వును కండగా మార్చుకొగలమా ?

 *జవాబు* : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు - కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.
కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం.
కొవ్వు కండగా మారదు.

 *ప్రశ్న 3 :* ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? 

 *జవాబు* : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

 *ప్రశ్న 4 :* గుండె పోటు వంశ పారం పర్యమా?
 *జవాబు* : అవును 
.
 *ప్రశ్న 5 :* గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది?
ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )

 *జవాబు :* జీవితం పట్ల మీ వైఖరి మారాలి.
ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

 *ప్రశ్న6* : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?

 *జవాబు* : నడక మంచిది.
జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

 *ప్రశ్న 7:* మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?

 *జవాబు* :వివేకానంద స్వామి !

 *ప్రశ్న 8:* లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?
 *జవాబు* : చాలా తక్కువ
.

 *ప్రశ్న 9 :* కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా ? 
(నా వయసు 22).
30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?

 *జవాబు* : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.

 *ప్రశ్న 10* : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?

 *జవాబు* : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు.
ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.

 *ప్రశ్న 11:* మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?
 *జవాబు* : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.

 *ప్రశ్న 12:* గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?
చెడ్డ ఆహారం ఏది?

 *జవాబు :* పళ్ళు , కాయగూరలూ మంచివి.
నూనెలు చెడ్డవి.

 *ప్రశ్న 13:* ఏ నూనె మంచిది ?
సన్ ఫ్లవర్,
వేరుశనగ నూనె,
ఆలివ్ ఆయిల్ ?

 *జవాబు* : అన్ని నూనెలూ చెడ్డవే.

 *ప్రశ్న 14:* ఏమేమి టెస్టులు చేయించుకోవాలి 
ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?

 *జవాబు* :
రొటీన్ షుగర్,
బి.పి,కొలెస్టరాల్ చాలు .
ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.

 *ప్రశ్న 15* : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?

 *జవాబు* : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి.
ఒక *ఆస్ప్రిన్* మాత్ర నాలుక కింద పెట్టండి .
 *సోర్బిట్రేట్* మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి .
వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి.
మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ . 

 *ప్రశ్న : 16 :* గ్యాస్ట్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ? 

 *జవాబు* : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.

 *ప్రశ్న 17:* యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ?
( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )

 *జవాబు* : యువతలో అవేర్నెస్ పెరిగింది.
అందు వలన కేసులు కనిపిస్తున్నాయి.
జీవన విధానం ( బద్ధకం ),
జంక్ ఫుడ్,
వ్యాయామం లేక పోవడం, 
పొగ తాగడం.
మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.

 *ప్రశ్న 18 :* బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా? 

 *జవాబు* : ఉంటారు.

 *ప్రశ్న 19 :* దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు.
వాస్తవమా?

 *జవాబు* : వాస్తవమే!
దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు. 

 *ప్రశ్న 20* : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. 
ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?

 *జవాబు* : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది
ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి.
కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.

 *ప్రశ్న 21:* ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? 
( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )

 *జవాబు* : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.

 *ప్రశ్న 22* : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ? 

 *జవాబు* : లేదు.

 *ప్రశ్న 23* : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?

 *జవాబు* : లేదు 

 *ప్రశ్న 24 :* మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?

 *జవాబు :* వేపుళ్ళు -- ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.

 *ప్రశ్న 25 :* భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!

 *జవాబు* : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.

 *ప్రశ్న 26 :* అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?

 *జవాబు* : నో.

 *ప్రశ్న 27 :*  గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?

 *జవాబు* : వెల్లకిలా పడుకోవాలి .
నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి.
అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.

 *ప్రశ్న 28 :* లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?

 *జవాబు :* కావు.
కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.

 *ప్రశ్న 29 :* మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు.
ఇంట్లో నడవడం,
మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?

 *జవాబు* : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.

 *ప్రశ్న 30 :* షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?

 *జవాబు* : ఉంది.
షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.

 *ప్రశ్న 31* : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

 *జవాబు* : 
ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.

 *ప్రశ్న 32 :* రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?

 *జవాబు* : నో .

 *ప్రశ్న 33 :* Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?

 *జవాబు* :
కొన్ని వందలు ఉన్నాయి .
మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు.
కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక).
ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.

 *ప్రశ్న 34 :* డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?

 *జవాబు* : అవును
.

 *ప్రశ్న 35 :* ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?

 *జవాబు* : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)

 *ఆఖరు ప్రశ్న :* గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ? 

 *జవాబు* :
ఆరోగ్య వంత మైన ఆహారం తినండి.
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి.
జంక్ ఫుడ్ తినకండి.
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ )

మీకు ఇతరులకు మేలు చెయ్యాలి అనే హృదయం ఉంటె మీరు చదువుతున్న ఈ మెసేజ్ మీ మిత్రులకు, బందువులకు షేర్ చేయండి.🙏

Monday, January 30, 2023

::::: జ్ఞాపకాలు రెండు రకాలు :::::

 *::::: జ్ఞాపకాలు రెండు రకాలు :::::::*
1) విషయాలకు చెందినవిగా వుండి మనకు  కావాలంటే  గుర్తుకు వచ్చేవి.
   2) విషయాలతో ముడిపడిన భావోద్వేగ  జ్ఞాపకం. అనగా మానసిక జ్ఞాపకం.
           ఉదా. నేను  దారిలో నడుస్తూ ఉంటే  కుక్క వెంట పడింది. నాకు భయం వేసి పరిగెత్తి  తప్పించు కున్నాను.
     1)ఈసంఘటన జ్ఞాపకంగా వుండిపోయింది. ఈ రకంగా సంఘటనలు, విషయాలు, సమాచారం,చదివింది, విన్నది , చూచింది జ్ఞాపకంగా వుంటుంది. ఇది  సహజం, 
       2)  కుక్క వెంట పడింది. ఆ సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. అలా గుర్తుకు రావటమే కాక ఇప్పుడు నాకు భయం కూడా వేస్తోంది. (ఇప్పుడు నా ఎదురుగా కుక్క లేదు అయినా సరే)
దీనిని మానసిక జ్ఞాపకం అంటారు.  ఇప్పుడు నాకు భయం కలగడం అసమంజసం.
అసందర్భం.(  కుక్క ను చూస్తే కలగ వలసిన భయం తలచు కుంటే కలుగుతుంది )
     *ధ్యానం మానసిక జ్ఞాపకాలను చెరిపి వేస్తుంది*
  *షణ్ముఖానంద 98666 99774*

****🌷అంతరాలోచన🌷

 🌷అంతరాలోచన🌷 

బ్రహ్మం అంటే?
'ఉన్నది' ఏదో అది (సత్)

ఆధ్యాత్మికం అంటే?
ఆ బ్రహ్మము యొక్క స్వభావం (చిత్)

కర్మ అంటే?
సృష్టికి ప్రధాన కారణమైన ఆ బ్రహ్మము యొక్క విలాస సంకల్పము (ఆనందం)

వైరాగ్యం అంటే ...

➡ నీవు కోరకుండా ఉండటమే కాదు.,
➡ వచ్చిన దానిని కూడా వద్దనకుండా ఉండగలగటం.

దేవుడు రక్షిస్తాడని సనాతనధర్మం చెప్పదు. 

ధర్మం రక్షిస్తుందని చెప్తుంది. (ధర్మో రక్షతి రక్షితః)

👉 పుణ్యము పండినచో మనుష్య జన్మ వచ్చును.
👉 ఇంకను పండినచో ధర్మములందు అనురక్తి కలుగును.
👉 ఇంకను పండినచో ఆత్మానాత్మ విచారణ సిద్ధించును.
👉 ఇంకను పండినచో అఖండ ఆత్మతత్వానుభూతి కలుగును.

పుట్టినప్పుడు పేరు ఉండదు.,  ఊపిరి తప్ప.

పోయినప్పుడు ఊపిరి ఉండదు., పేరు తప్ప.

ప్రపంచానికి ఒకడు చచ్చినట్లు కనబడ్డా!

నిజానికి., అతనికి ప్రపంచం చచ్చింది.

ఈ క్రింది ప్రశ్నలు చాలా మందికి కలగడం చాలా సహజం. వారి సందేహ నివృత్తి కోసం "నేను" చేసిన ప్రయత్నం:-

✳ ఆత్మ అనగా నేమి?
శక్తి (Energy), చైతన్యము(Consciousnes),  జ్ఞానం(Knowledge) -- ఈ మూడింటి యొక్క కలయిక రూపమే ఆత్మ (Self) అంటే.

✳ జీవాత్మ అనగా నేమి?
భౌతిక దేహంలో ప్రవేశించిన ఆత్మ నే 'జీవాత్మ' అంటారు.

✳ పూర్ణాత్మ :- 
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే 'పూర్ణాత్మ' అంటే. పరమ పూర్ణత అనగా చేపట్టిన ప్రతి పనిలో పూర్ణంగా జీవిస్తూ, జన్మ ప్రణాళికను సంపూర్ణంగా నిర్వహిస్తూ, దుఃఖరాహిత్యంగా సదా వెలుగుతున్న స్థితి.

✳ అంశాత్మ:- 
పరిపూర్ణతను సిద్ధించుకొని తాను స్వయంగా జనన-మరణ చక్రంలోంచి విడివడిన పూర్ణాత్మ, తనలోంచి 'నూతన ఆత్మలను' సృష్టించును. ఆ ఆత్మలనే 'అంశాత్మ'లంటారు. ఈ అంశాత్మలు తిరిగి జనన-మరణ చక్రంలో ప్రవేశిస్తాయి.

✳ పరమాత్మ :- 
విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తినే 'పరమాత్మ' అంటారు.(Controller of the whole Cosmos.)

✳ సృష్టి కర్త:-
నూతన లోకాలను గాని, నూతన అంశాత్మలను గాని సృష్టించగల సమర్ధుడే సృష్టి కర్త.

✳ దేవుడు:-
ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మన లాంటి మనుషులు మాత్రమే. (పూర్ణాత్మ)
పరమ పూర్ణతను సిద్ధించుకున్న ఆత్మే దేవుడంటే.

✳ సంభావ్యతా ఆత్మలు :-
ప్రతి అంశాత్మలోంచి వెలువడిన వివిధ గాఢ కోరికలు తాముగా జీవాన్ని సంతరించుకొని వివిధ సమాంతరలోకాలలో తమ తమ స్వంత జీవితాలను జీవిస్తూ ఉంటాయి. అవే మన సంభావ్యత ఆత్మలు.(Probable selves)

"నేను" 
➡ చదువుకుంటే
➡ చదువుకోకపోతే 
➡ ఉద్యోగం వస్తే 
➡ ఉద్యోగం రాకపోతే

పైన ఉన్న నేను అసలు 'నేను' (నేను= ఆత్మ).
కింద ఉన్న గీతలు నా కోరికలు., ఒక్కో కోరిక తీరుతూ ఉంటే ఆ యొక్క 'జ్ఞానం' కలుగుతూ ఉంటుంది.
👉 ఈ సంబంధం వల్ల మనం ఈ లోకం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం.
వివరణ :- చదువుకుంటే నేను ఎలా ఉంటాను? ఉద్యోగం వస్తే ఎలా ఉంటాను? అనే వివిధ కోరికలతో జన్మలు తీసుకోవడం. (ఇవి
సమాంతర లోకాలలో జరుగును)

✳ సమాంతర ఆత్మలు :-
ఒకే పూర్ణాత్మలోంచి ఉద్భవించిన వివిధ అంశాత్మలే సమాంతర ఆత్మలు. (Parallel selves or Alternative selves)

"నేను"
➡ ఎన్నో జన్మల నేను.
➡ గత జన్మల నేను.
➡ ప్రస్తుత నేను.
➡ నా కంటే తక్కువ వయస్సు ఉన్న నేను.

పైన ఉన్న నేను అసలు నేను, ఈ నేను అనేది కారణ లోకంలో ఉన్న ఒకానొక పూర్ణాత్మ.
కింద గీతలు అనేవి సమాంతర ఆత్మలు.
👉 ఈ సంబంధం వల్ల "మనం ఎల్లప్పుడూ అనంతంగానే జీవిస్తున్నాం " అని తెలుసుకొంటాము.
వివరణ :- నేను అనేది ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎన్నో జన్మలు తీసుకుంటుంది.
ఉదా: రాజుగా ఒక జన్మ, అదే ఆత్మ సాధారణ స్త్రీగా మరో జన్మ తీసుకుంటే.,  రెండు జన్మలలోనూ ఒకే ఆత్మ కావున ఆ రెండు సమాంతర ఆత్మలవుతాయి.

✳ సృష్టి మనం కూడా చేయవచ్చా?
తప్పకుండా.  ఒక ఉన్నత స్థాయికి చేరిన తర్వాత మనం కూడా ఒక సృష్టికర్త అవ్వవచ్చు.

✳ మనం ఇక్కడకు ఎందుకు వచ్చాము?
👉 సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి
👉 మన ఇతర జన్మల గురించి తెలుసుకోవడానికి 
👉 మన చుట్టూ ఉండే మనుషుల నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి. etc
మనం ఇక్కడకు వచ్చింది 'సున్న' మార్కులతో వచ్చి 'వంద' మార్కులతో పై తరగతికి వెళ్లడానికి.

✳ మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయి?
ఈ భౌతిక శరీరంతో తెలుసుకోబడే భౌతిక విశ్వం (Universe) ఒకానొక లోకం మాత్రమే. ఇలాంటి లోకాలు పూర్ణ సృష్టిలో (Cosmos) కోటానుకోట్లు ఉన్నాయి. ప్రతి లోకము ఒకానొక పౌనఃపున్యత (Frequency) తో కూడిన ప్రకంపనస్థితిలో ఉంటుంది.

✳ సమాంతర లోకాలు :-
భూలోకం లాగానే ఉండి దానికి అత్యంత సమీపంలో కొద్ది పౌనఃపున్యాల తేడాతోనే
ఉండే లోకాలే సమాంతర లోకాలు.
సమాంతర ఆత్మలు కానీ,సంభావ్యత ఆత్మలు కానీ వీటిల్లోనే జీవిస్తూ వుంటాయి.

✳ అన్ని లోకాలలో కూడా జీవం ఉంటుందా?
ఉంటుంది.,  కానీ మనలా ఉండదు. మన మానవ కంటితో చూడలేము. ఎందుకంటే అక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. ప్రతి లోకాన్ని సృష్టికర్త, ఆయనకు నచ్చిన విధంగా సృష్టిస్తారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. అక్కడ పరిస్థితులకనుగుణంగా శరీరాన్ని తీసుకుంటే., అక్కడి జీవాన్ని చూడవచ్చు.

::::: *మన జీవన శైలిని నిర్ణయించే అంశాలు* :::::

::::: *మన జీవన శైలిని నిర్ణయించే అంశాలు* :::::

 *ఆలోచనలు* ఎద్దు గిట్టలననుసరించి బండి చక్రాలు నడుస్తాయి.అలాగే మన ఆలోచనలను అనుసరించి మన జీవిత గమనం,నడక  వుంటుంది.
*సమాజం* మనం పుట్టి పెరిగిన సమాజం మనలను డిజైన్ చేస్తుంది 
*కుటుంబం*  మనం పుట్టిన కుటుంబం , తర్వాత మనం ఏర్పరచుకున్న కుటుంబం మనలను మలుస్తాయి 
*అవగాహన* మన చుట్టూ వుండే పరిసరాలను సంఘటనలు,వివిధ సామాజిక అంశాలను మనం ఎలా అవగాహన చేసుకొని మనం పరివర్తన చెందుతూ వున్నాము అన్నది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.
*స్వభావం* మనకు పుట్టుకతో జీన్స్ వల్ల, ఆరోగ్య కారణాల వలన ఒక స్వభావం సంతరిస్తూంది. దీని ప్రభావం మన జీవన గమనం పై వుంటుంది. 
*ధ్యానం* పై వాటి ప్రభావాలను సరిచేసి మనం జీవితాన్ని శీలవంతంగా, ప్రజ్ఞ కలిగినదిగా తిరిగి నిర్మిస్తుంది.

*షణ్ముఖానంద 98666 99774*

****సృష్టి.. స్థితి... లయాలకు ఆధారమైన ప్రక్రియ ధ్యానం .. త్రిపుటికి అతీతమైనది ధ్యానం ..

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

సద్గురువును త్రికరణ శుధ్ధిగా ఆశ్రయించిన దినం అది  అతని జన్మ  దినం. 

భౌతికమైన ... ఐహికమైన ఏ ఏ గురువులు సహాయపడ్డారో వారందరినీ ఈ సద్గురు మూర్తిలోనే దర్శించాలి. 

ప్రాణ సమానమైన దెవరయ్యా ... తల్లీ ... తండ్రీ ...గురువు ... దైవం 
ఈ నాలుగు ఆ సద్గురువే ఆశ్రయించిన వాడికి ... 

అనేక జన్మలలో ప్రాప్తించిన సంసార ప్రీతి భంగమవుతుంది. 

సత్శిష్యునికి ... సద్గురువుతో ఐక్యతా సిధ్ధి కలగాలంటే ... సంసార ప్రీతి భంగాయ. 

భ్రాంతి ఎక్కడ ఉంటే అక్కడ సంసారముంది.  

సద్గురు మూర్తిని ఆశ్రయించి భ్రాంతి రహితమైన జీవితాన్ని జీవించాలి. 

మూడు అవస్థలు ... త్రికాలము లందు భ్రాంతి రహితంగా ఉండాలి ... వాడు సంసార ప్రీతి భంగాయ ..

నేను ... నాది ఇవి రెండూ సంసారము ..పరిపూరకం.. సంపూరకం .

సాధకుడై .. సత్ శిష్యుడైన వాడు భ్రాంతి రహిత స్థితి పొందటం చాలా అవసరం .. పాత్రోచితమై .. వ్యాపకమై ఉంటాయి ... మానవ సంబంధాలు ... నేను నాది ఉంటాయి వాటిలో. 

నీ అంత:కరణ లేనిదని నిరూపితమైన రోజు సంసార ప్రీతి భంగాయ ... సంసారం తోచినంతకాలం .. నేను .. నాది 

మూడు అవస్థలలో .. నేను నాది 
అనే తాపత్రయం తో కూడిన సంసార ప్రీతి ఇమిడి .. అంతర్లీనంగా ఉంటుంది. 

వినిర్ముక్త: .. ఎప్పటికీ అంకురించని దశలో ... స్వరూప జ్ఞానంలో ఉండాలి. 

లోపల నిరశించటం .. ప్రధానం. 
లోపల పండితే ... బయట చెప్పనక్కరలేదు. 

ఐదు .. ఐదులుగా చెప్పబడే పిండాండ... బ్రహ్మాండ భాగాలు సమస్తాన్ని సంసార ప్రీతిగా చూడాలి. 

నీవు బ్రహ్మమై ఉన్నప్పుడు అవ్యక్తానికి అవతల ఉన్నావు కదా. బ్రాహ్మీ భూత స్థితిలో ఉండాలి. 

తురీయ నిష్టుడికి ... మెలకువ.. కల... నిద్రలు వచ్చిపోతుంటాయి .. వాడికి బింబ ప్రతి బింబ భావన బాటసారుల వలే .... 

అంగం.. దేహాత్మ... సంగం = ఇరవై ఐదూ ఒకటైన జ్ఞాత 
లింగం= సూత్రం తెలియటము 
భంగం= బింబ ప్రతిబింబ న్యాయం తెగిపోతే అది భంగము. 

సద్గురుమూర్తిని తల్లీ , తండ్రీ, గురువు, దైవం గా ఆశ్రయించి సంసార ప్రీతి పోగొట్టుకున్నాడో 
అతడికి నేను .. నాది పని చేయవు ... అన్యమేమీ తోచదు. 

అతడు కర్త అయ్యే అవకాశం లేదు ఏ కార్యమొనర్చినా .. అపవిత్రుడు కాడు కర్త లేదు కాబట్టి. 

సర్వదా సర్వ కాలము లందు .. ఏకాకీ.. నిస్ప్రుహ .. త్రిపుటి రహితం గా వ్యవహారం అతీతంలో చేస్తాడు కాబట్టి ... లోక కళ్యాణ కారకం. 

గురు శిష్యులిద్దరూ లేరని చెప్పటం గురుగీతా హోమం 

కర్త లేకుండా చేయబడేవన్నీ లీలలే 
కర్తృత్వ రహిత కర్మాచరణ లీల .. అది అమృత స్వరూపం. 

ఉన్నదంతా బ్రహ్మమే అనే వ్యవహారం కలిగినవాడు ఏది చెప్పినా లోకోపకారకం అవుతుంది. 

సర్వానందమయం... సర్వ సౌఖ్య ప్రదాయకం .. భుక్తి ముక్తి ప్రదాయకం అయి ఉండాలి ధ్యానం. 

సృష్టి.. స్థితి... లయాలకు ఆధారమైన ప్రక్రియ ధ్యానం .. త్రిపుటికి అతీతమైనది ధ్యానం ..

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
గురుగీత --41

జై గురుదేవ 🙏

****శ్రీ రమణులు…ధ్యానం నాన్న

 శ్రీ రమణులు…ధ్యానం నాన్న

ఆధ్యాత్మిక సంగమం శంబలనగరి
ఒక నాయకుడు తనకు ఎంతమంది అనుయాయులు ఉన్నా వారిలో ఒకరినో ఇద్దరినో నాయకుడిగా తయారు చేస్తారు. ఇందులో కూడా తన లాభం చూసుకుంటాడు. గురువు శిష్యులను తయారు చేస్తాడు. కానీ దేవుని అనుభూతి (పరమాత్మ సత్య అనుభూతి) ఇవ్వలేడు. అదే ఒక తపస్వి ప్రత్యక్ష, పరోక్ష శాశ్వత దైవాల అనుసంధాన చైతన్య అనుభూతిలో పరమాత్మ అనుభూతి నింపి ప్రతి మనిషిని పరమాత్మ సత్యం ను చేరే తపస్విగా చెక్కుతాడు. ఇలాంటి తపస్విలు గతంలోనూ ఉన్నారు. ధ్యానం నాన్నను ఒక్కసారి కనెక్ట్ అయితే ఈ అనుభూతిని పొందగలరు. సమాజ హితమూ, నిత్య గాయత్రి చింతన లేకపోతే పద్మాసనంలో ఒకే చోట సంవత్సరాల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు. స్వీకరించి, అనుసరించి, విశ్వసించడంలోనే ఉంది. స్వీకరణనుబట్టి బోధ ఉంటుంది. శ్రీ రమణులు గురించి ధ్యానం నాన్న చెప్పింది తెలుసుకుంటే అవగతమవుతుంది.

ఒకసారి 12 సంవత్సరాల కుర్రవాడు శ్రీ రమణ మహర్షి దగ్గరకు వాళ్ళ పెద్దలతో కలసి వచ్చాడు. మౌనంగా కూర్చున్న శ్రీ రమణులకు అందరూ నమస్కరించడం చూశాడు. వారు అలా నమస్కరించడం ఆ కుర్రవాడికి నచ్చలేదు. పైగా శ్రీ రమణులకు ఏమి తెలుసు అంటూ ఆక్షేపించాడు. తప్పు నాయనా అలా అనకూడదు దండం పెట్టు అంటే పెట్టనని భీష్మీంచాడు. పెద్దలు గదమాయిస్తే తాను అడిగిన దానికి సమాధానం చెబితే నమస్కరిస్తానన్నాడు. ఇది అంతా గమనించిన శ్రీ రమణులు సైగ చేసి ఆ కుర్రవాడిని దగ్గరకు రమన్నారు. ఏమిటి అని అడిగారు. దానికి ఆ కుర్రవాడు మీకు ఆర్క్ మెడీస్ గురించి తెలుసా ఆన్నాడు. శ్రీ రమణులు నాకు తెలియదు అన్నారు. దీంతో ఆ కుర్రవాడు ఈయనకు ఏమీ తెలియదు. తెలిసిందల్లా నమస్కారాలే అన్నాడు. ఇంతలో అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త ఒకరు శ్రీ రమణుల దర్శనార్ధం వచ్చారు. ఆయన వి ఐ పి కాబట్టి ఆ శాస్త్రవేత్తను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టారు. ఆయన దగ్గరకు వెళ్ళిన రమణ మహర్షి ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత అంతరిక్షం గురించి చెబుతుంటే ఆ శాస్త్రవేత్త చేతులు కట్టుకొని శ్రద్దగా విన్నారు. ఆ శాస్త్రవేత్త శ్రీ రమణుల కాళ్ళకు నమస్కరించి వెళ్ళారు. ఇది అంతా కిటికీ లో నుంచి చూసిన ఆ కుర్రవాడు ఆశ్చర్యానికి గురయ్యాడు. శ్రీ రమణ మహర్షి బయటకు వచ్చాక…అర్క్ మెడిస్ తెలియదన్నారు. కానీ సైన్స్, అంతరిక్షం గురించి అనర్గళంగా చెప్పారు. మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు శ్రీ రమణులు అన్నారూ…వాస్తవంగా నాకు ఏమీ తెలియదు. నా ఎదుట ఉన్న వారినిబట్టి నాకు తెలుసును. వారు మంచి శాస్త్రవేత్త కాబట్టి తెలిసింది. మరి నీవు? అందుకు నాకు ఏమీ తెలియదు అని శ్రీ రమణులు అనగానే ఆ కుర్రవాడు తల వంచుకున్నాడు. ఆధ్యాత్మికులు ఏమీ తెలియని స్థితి నుంచి అనంతం అనుభవిస్తారు. మరలా ఏమీ తెలియని స్థితికి వస్తారు. ఎదుటివారిని బట్టి వారి బోధ ఉంటుంది. ధ్యానం నాన్న బోధలు ఇందుకు అద్దం పడతాయి. ఒక్కోసారి చిన్న పిల్లవాడు అయిపోతారు.

రోగి కోరిన మందే వైద్యుడు ఇస్తే రోగం కుదుట పడదు. ఇద్దరూ లౌక్యం, తెలివి ప్రదర్శించినట్లే. ఆధ్యాత్మికంలో ఈ ధోరణులు కనిపిస్తున్నాయి. పై పై మనసు సహకారంతో చెప్పేది సమాజానికి ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి ఇవ్వదు. భారతీయ వేదాంత హైందవ గాయత్రి తపస్సు ఆధ్యాత్మిక సమాజానికి అవసరం. కొన్ని నదులు కలిసిన చోటును సంగమం అంటాము. ప్రత్యక్ష, పరోక్ష శాశ్వత దైవాల అనుసంధాన తపస్సు ప్రదేశాలు ఆధ్యాత్మిక తీర్ధ ప్రదేశాలు. శంబలనగరి అదే. అజ్ఞాత ఏకాంత నిత్య గాయత్రి తపస్వి ధ్యానం నాన్న. ఆ రుషి నిత్య గాయత్రి చైతన్యంతో నిండిన చైతన్యం. అలాంటి ప్రదేశానికి వచ్చి కొలువైన గాయత్రి మాత. శంబల చైతన్యాన్ని అందిచే గోవులు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ లోని విజియనగరం జిల్లా ఎస్ కోట సమీపంలో రాజీపేటలోని శంబలనగరి ఆధ్యాత్మిక సంఘమంను ఒకసారి దర్శించండి... 🙏🏻

ఎవరన్నా 40 యేళ్లు దాటితే చాలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు, చిన్న వయసులోనే కొందరి ప్రాణాలు క్షణాల్లోనే పోతున్నాయి !! *కారణం ఏమై ఉంటుంది ????*

 హలో కొద్ది సమయాన్ని కేటాయించి ఇది చదవగలరా !

*నందమూరి తారక రత్న మహా ఉంటే వయసు ఉంటుంది 40+*
ఒకటో రెండో మూడో,
ఒక్క రోజు కొద్ది సేపు బయట నడిస్తేనే కళ్ళు తిరిగి పడిపోవడం, మళ్లీ పరిస్థితి సీరియస్ విషమం అంటూ వార్తలు, ప్రాణాలకు ఆపాయం లేదు అంటూ బ్రేకింగ్ న్యూస్
*ఏంటి ఈ తరం ??*
*ఏం జరుగుతుంది అసలు???*

అంత డబ్బు, మంచి తిండి, పోషణ ఉంటున్నా కూడా ప్రముఖులు లేదా సామాన్యులు ఎవరన్నా 40 యేళ్లు దాటితే చాలు చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు, చిన్న వయసులోనే కొందరి  ప్రాణాలు క్షణాల్లోనే పోతున్నాయి !!
*కారణం ఏమై ఉంటుంది ????*
కన్నడ రాజ్ కుమార్ మరణం కూడా చాలా షాకింగ్ !!!

నాకు తెలిసి 1980 తర్వాత తరం చాలా ప్రమాదపు అంచుల్లో ఉంది
తినే ఆహారం కలుషితం,
తాగే నీరు కలుషితం,
పీల్చే గాలి పూర్తి విష తుల్యం.
అంతటా కల్తీ ఆహార పదార్థాలు రాజ్యం ఏలుతున్నాయి.

క్యాన్సర్ కారక సింథటిక్ ఫుడ్ రంగులు, ఆహార పదార్థాల్లో వేసే వెనిగర్, టేస్టింగ్ సాల్ట్, సాస్ లు, ఒకటికి పదిసార్లు కాచి ఫిల్టర్ చేసి అమ్మే కల్తీ నూనెలు, పాడైపోతున్న కుళ్ళిన వారాల పాటు డీప్ ఫ్రీజర్స్ లో నిల్వ చేసిన చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం, 
యూరియా సర్ఫ్ వేసి చేస్తున్న పాలు పాల ఉత్పత్తులు
భయంకరంగా చచ్చిన మూగ జీవాల శవాలు పేగులు వేసి చెరువుల్లో పెంచుతున్న రొయ్యలు చేపలు
ఇంజెక్షన్లు స్టెరాయిడ్స్ ఇచ్చి గుడ్లు పెట్టిస్తు
కిలోలు కిలోలు నెలరోజుల్లో బరువుపెరిగే కోళ్లు అన్నీ మానవ శరీరానికి నూటికి నూరుశాతం హని కలిగించేవే 
అవన్నీ ఇప్పుడు యదేచ్ఛగా
మార్కెట్లో పునుగుల బండి నుండి 5స్టార్ హోటల్ వరకు వాడుతున్నారు.
ఆరోగ్య శాఖ పర్యవేక్షణ సక్రమంగా లేదు. 

అసలు పండే పంటలోనే దమ్ము లేదు.
అంతా హైబ్రిడ్ వంగడాలు
అన్నీ క్రాస్ బ్రీడ్ పంటలు
ఎరువులు, పురుగుమందులు
ఒకప్పుడు పచ్చిమిర్చి బజ్జీ ఇరవై తినేవారం. తొక్క కూడా అరిగిపోయేది.
ఇప్పుడు మిర్చి తొక్క ప్లాస్టిక్ పేపర్ లా ఉంటుంది తొక్కైనా అరిగే అవకాశం లేదు
ఒకప్పుడు దోసకాయ తొక్క తీయకుండా వండేవారు చక్కగా కరిగిపోయేది కూరలో తింటే....అలాగే వంకాయ, టొమోటో, ఆపిల్ తొక్కలు కూడా ప్లాస్టిక్ పొరల్లా అయ్యాయి ఇప్పుడు తింటే అరిగే పరిస్థితి లేదు కారణం అర్థం చేసుకోవాలి???

దీనికి తక్షణ కర్తవ్యం ఏమిటి*ప్రభుత్వాలు ప్రజారోగ్యం మీద భవిష్యత్ తరాల కోసం అన్నా దృష్టి పెట్టాలి.....*

*బయట దొరికే ఆహారం*
*మరియు మన దేశంలో పంటలు విషయంలో దృష్టి పెట్టాలి.....*

*రైతుల్ని ప్రోత్సహించి*
*సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేపించాలి*

*దేశీయ పంటల్ని, విత్తనాల్ని అభివృద్ధి చేసి వాడుకలో తీసుకురావాలి.*

*నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు అమ్మే సంస్థలు, తయారీదారుల పట్ల ఉక్కు పాదం మోపాలి..... ఇది ప్రభుత్వం బాధ్యత ఈ బాధ్యతలు భాగం మనం కూడా పంచుకోవాలి.

😊😊😂😜పుట్టింటికి వెళ్ళిన భార్య...,తన భర్తకి పంపిన వాట్స్ అప్ మెసేజ్*

 Good morning friends 🌹

*😊😊😂😜పుట్టింటికి వెళ్ళిన భార్య...,తన భర్తకి పంపిన వాట్స్ అప్ మెసేజ్*

*** *పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరి నుండి వచ్చిందాకా పని మనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.*
😜😜😜😜😜😜😜😜😜

*** *10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నాతో పాటు హాండ్ బాగ్ లో ఉంది.*
😄😄😄😄😄😄😄😄😄

*** *మీరు చాలా హెల్దీగా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.*
😁😁😁😁😁😁😁😁😁

*** *మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి.*
😱😱😱😱😱😱😱😱😱

*** *మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విస్సెస్ చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం.*
😡😡😡😡😡😡😡😡😡

*** *పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి.*
😏😏😏😏😏😏😏😏😏

*** *అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడం వైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసు నుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?*
😒😒😒😒😒😒😒😒😒

*** *మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.*
😍😍😍😍😍😍😍😍😍

*** *మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి.....!!!!!!! మన వీధిలో ఉండే మిసెస్ సమంత , జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు.*
😄😄😄😄😄😄😄😄😄

*** *షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.*
😜😜🤔😂😍😂🤔😜😜

****మంచి మాటలు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *మంచి మాటలు * 
                  ➖➖➖✍️

* *మనలో చాలామంది బలహీనులం అవుతున్నది డబ్బు లేక అనుకుంటూ ఉంటాం...! కానీ... బలమైన తోడులేక అని తెలుసుకోలేక పోతున్నాం... ఒక దృఢమైన తోడు ఎంతో బలాన్నిస్తుంది మనకు....!!*

**తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు..!తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం....   గొప్ప విషయం....!!*

**పూర్వం మనుషులు భావుకులుగా ఉండేవారు. బంధాలను, బాధ్యతలను నిర్వర్తించే వారు. తర్వాత ప్రాక్టికల్ గా అయ్యారు. బంధాలను సొంత లాభానికి ఉపయోగించేవారు... ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారారు. లాభం ఉండే బంధాలను మాత్రమే స్వీకరిస్తున్నారు.*

**విలువలంటే... జనాలకు మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు.. జన్మంతా విలువల కోసం కట్టుబడటం....!!*

**జీవితం అనుకున్నంత సులభం కాదు,  కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా తప్పక శిక్ష అనుభవించాలి....!!*

**మీకు తెలియని దాని గురించి మాట్లాడకండి! మీదే కరెక్ట్ అని వాదించకండి. మీ వాదన మీలో ఉన్న అజ్ఞానాన్ని ఎదుటివారికి కళ్ళకు కట్టినట్టు చెప్తుంది..!!*

**అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనలను పంచుకోవటం మూర్ఖత్వం..!!*

**మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కరలేదు ఎదుటివారి గురించి ముందొక మాట వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు....!!*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, January 29, 2023

భావోద్వేగాలు

 *భావోద్వేగాలు*

ప్రతి మనిషినీ ఏదో సమస్య బాధిస్తూనే ఉంటుంది. ఆకలి బాధ, తిన్నది అరక్క బాధ, చదువురాని బాధ, చదివినా ఉద్యోగం దొరకని బాధ... పెళ్ళి కాలేదని బాధ, తరవాత సంతానం కలగలేదని బాధ, రోగం వస్తే బాధ, ఆర్జన ఎక్కువైతే ఎలా? దాచుకోవాలన్న బాద... పదవి రాలేదని బాధ, వచ్చాక ఎలా నిలుపుకోవాలన్న బాధ, కీర్తి రాకపోతే బాధ, వచ్చాక భజనపరులు చుట్టూ లేదన్న బాధ, శ్రమకు తగ్గ ఆదాయం, విశ్రాంతి లేవన్న బాద... మనసులోని స్వచ్ఛమైన ఆలోచనలను ఈ బాదలు, వ్యధలు ఆక్రమించి ఒత్తిడిని పెంచేస్తాయి. ఈ ఒత్తిడిని భరించలేనివాళ్లు ఒంటరిగా ఆత్మన్యూనతా భావంతో తమలో తామే కుంగిపోతుంటారు. కుమిలిపోతుంటారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలైపోతారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడతారు. 

లౌకిక వాంఛలు పెరిగి అవి తీరకపోతే, కామక్రోధాలు పెచ్చరిల్లి మనిషిని పశువుగా మార్చేస్తాయి. మెదడులోని బుద్ధి... బుద్ధిచెబుతున్నప్పుడు మనసు వినాలి. పట్టించుకోవాలి. లేకపోతే విశృంఖలత్వానికి దాసోహమై ప్రవర్తన పెడదారి పడుతుంది. అవసరాన్ని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అర్ధంలేని ఆలోచనలతో
మనసును నింపుకొన్నప్పుడు ఒత్తిడి తీవ్రమవుతుంది. చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించి, ప్రాధాన్యాంశాలను మనసులో పక్కకు పెట్టేస్తే మనిషి విచక్షణ కోల్పోతాడు. తాను చెయ్యగలదాన్ని గురించే ఆలోచించాలి. తన అధీనంలో లేని దాని గురించి ఆశించడం వల్ల మనిషి భావోద్వేగానికి గురవుతాడు.

ఒక చెంబును నీటితో నింపారు ఇంకాఇంకా పోస్తుంటే పార్లి కింద పడిపోతుంది. బిందెలో ఎంత చోటు ఉంటే అంతే నీరు పడుతుంది అదే. విధంగా, ఏ వస్తువు లేదా విషయం. గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఉంటుందో, ఎంత కాలం ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. హద్దు మీరితే ఒత్తిడి పెరిగిపోతుంది.

అవరోధం ఏర్పడినప్పుడు నిరాశకు గురికావడం సహజం, సాఫల్యం కోసం ప్రత్యామ్నాయం ఆలోచించడం ధీరుడి లక్షణం. ఎన్ని ఉలిదెబ్బలు తింటే శిల శిల్పమవుతుంది.. పెరుగు నెంత సేపు చిలికితే వెన్న వస్తుంది? ఎన్ని తుపానులను తట్టుకుంటే చెట్టు ఫలాలిస్తోంది. నాగలితో నేలను చీలిస్తేగాని నవధాన్యాలివ్వదు. గునపంతో తవ్వితే గాని ఖనిజాలివ్వదు. వీటినుంచి సహనం నేర్చుకోవాలి. ఎంత నీరు పోసినా, ఎరువు వేసినా రుతువు రానిదే మొక్క పుష్పించదు, ఫలించదు. ధ్యానం, మౌనం, యోగా, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన, సద్ధంగ పఠనం, సత్సాంగత్యం... మనిషిని ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉంచగలిగే ఉత్తమ సాధనాలు,

లంకలో సీతాన్వేషణ చేసిన హనుమ నిరాశా నిస్పృహలకు లోనై, ఒక్క క్షణం బలహీనుడై ఆత్మహత్యకు సంకల్పించాడు. స్థితప్రజ్ఞుడు కనుక మళ్ళీ తేరుకుని, ముందుకు సాగి విజయం సాధించాడు. వరదకు తలవంచిన గరిక, ఆది తగ్గాక తల ఎత్తడంలేదూ! ఒత్తిడి అనేది నీటిమీది నాచులాంటిది ఓర్పుతో నాచును తొలగిస్తే శాంతి అనే శుద్ధజలం చూడగలం. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన' అన్న సినారె పలుకులు గుర్తుంచుకుంటే మనసు ఏ భావోద్వేగాలకు బలి కాదు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

::::: సత్యం నిర్ధారణ:::::

 *::::::: సత్యం నిర్ధారణ::::::*
      ఇది సత్యం అని ఎలా నిర్థారణ చేయవచ్చు.
   సత్యం అని దేనిని అంటామో అది అన్ని కాలాల్లోనూ సత్యం అయి వుండాలి. అన్ని చోట్ల సత్యం అయి వుండాలి. అందరికి అది సత్యం అయివుండాలి.
     ఈ సూత్రాన్ని ఉపయోగించి క్రింద వాటిని పరీక్షిద్దాం.
  *మనస్సు కు చెందినవి*. . ఉదా ఇష్టాలు,అభిరుచులు, అభిప్రాయాలు, ఊహలు, కల్పన లు,పగటి కలలు. ఇవి వ్యక్తులను బట్టి మారుతాయి కనుక సత్యం కాదు.
*ఇంద్రియాలకు చెందినవి.*
ఇంద్రియాలు ఉన్న దానిని వాటివాటి పరిధిలలో గ్రహించ గలవే గాని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించ లేవు. ఉదా. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉన్నట్లు కన్ను చూస్తుంది. కనుక ఇది సత్యం కాదు.
*అనుభూతి లోకి రానిది* స్వీయ అనుభూతికి రానిది సత్యం కాదు.
*చెప్పబడినది* చెప్పిన వారు ఎంతటి వారైనా లేదా పవిత్ర గ్రంథం అయినా చెప్పబడినదిగా అది గతానిది.
కనుక సత్యం కాదు.
*సాపేక్షం* పోలికతో జన్మించినది కనుక సత్యం కాదు.
*షణ్ముఖానంద 98666 99774*

:::::సత్యం vs ఖాళీ మనస్సు:::::

 *:::::::::సత్యం vs ఖాళీ మనస్సు:::::*

     సత్యం తెలియాలి అంటే మన మనస్సు ఖాళీ అవ్వాలి.

  పుట్టినప్పుడు మనస్సు ఖాళీ గా వుంటుంది.
    అమ్మ ,నాన్న, కుటుంబ సభ్యులు,  అలాగే  బడి, గుడి,ఆట, పాట, పాఠం మొదలగు  వారి/వాటి, వలన,అనేక విషయాలతో మనస్సు నిండుతుంది.

  ఇలా నిండినవే ,భాష, భావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, ప్రబోధాలు, విషయాలు, జ్ఞానం. ఇవి సత్యం కాదు.

   నింప బడిన విషయాల ద్వారా సత్యం తెలుసు కోలేము. ఎందుకంటే ఇవేవి సత్యాన్ని తెలపవు

  నేర్చు కున్న భాష తో సహా మనస్సు ను ఖాళీ చేయండి. సత్యాన్ని దర్శించండి.

*షణ్ముఖానంద 98666 99774*

Saturday, January 28, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 41 భగవాన్ రమణ మహర్షి అవతారం ముగించుట తరువాయి భాగం

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 41
భగవాన్ రమణ మహర్షి అవతారం ముగించుట తరువాయి భాగం 

      ఏప్రిల్ 14 , 1950 వ సం || ము రానే వచ్చింది . ఆ రోజు భగవాన్ తమ అవతారము ముగించే రోజు . ముఖ్యమైన భక్తులు ఆ రోజు భగవాన్ కడకువచ్చి వారి ఆశీర్వచనము తీసుకుని కన్నీళ్ళు కార్చి వెళ్ళినారు . వైద్యులు కూడా అదే రోజున మళ్ళీ పరీక్షించి ఆశ వదులుకున్నారు . భగవాన్ నీరుతాగే పరిస్థితిలో కూడా లేరు కాని డాక్టరుగారి భార్య నారింజ రసం భగవాను ఇవ్వాలని కోరిక ఉండుటచే భగవాన్ భక్తుల కోర్కెను తీర్చుటకై నారింజ రసమును ఇవ్వమని అడిగినారు . *ఆ రోజు కృష్ణ పక్ష త్రయోదశి శుక్రవారం . ఆ సాయంత్రం 4 గంటల నుండే భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది . భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గ్రహించి వారి గదికి ఒక తెరను అడ్డుగా వేశారు* . కాని కరుణామయుడైన భగవాన్ ఆ తెరను తొలగించమని సాయంత్రం 6 గంటల వరకు దర్శనము ఇస్తూనే ఉన్నారు . రాత్రి 8 గంటలు అయిన తరువాత భగవానకు ఇష్టమైన ' అక్షర మణిమాల ' భక్తులు గానం చేయుచుండగా *ఆనాటి రాత్రి 8 గంటల 47 నిమిషములకు ఒక దివ్యకాంతితో గల జ్యోతి భగవాన్ ఉన్న గదిగోడనానుకుని పయనిస్తూ అరుణాచల గిరివైపు సాగినది . భగవాన్ తమ అవతారమును చాలించినారు* . ఆ జ్యోతి విషయము మరునాడు వార్తాపత్రికలలో వచ్చినది . ఆ జ్యోతి ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని గతరాత్రి 8 గంటల 47 ని || ములకు అనేక ప్రాంతాలలో జనులు దర్శించారని చివరకు ఆ జ్యోతి అరుణాచలం పర్వతాగ్రము చేరినదని ప్రచురించారు . రమణాశ్రమములోని భక్తులందరు ఎంతో రోదిచారు . ఇక భగవాన్ లేరని అనుకున్నారు భగవాన్ భౌతికకాయాన్ని వారు ఎల్లప్పుడు కూర్చునే హాలులో కూర్చుండబెట్టి దర్శనార్ధమునకై ఉంచారు . మర్నాడు ఉదయం భగవాన్ దేహానికి అభిషేకము చేసి మాతృ భూతేశ్వరాలయానికి ఉత్తరాన ఒక గుంటను త్రవ్వి భగవాన్ శరీరాన్ని కూర్చుండబెట్టి కర్పూరముతో , సుగంధ ద్రవ్యములతో నింపి సమాధి చేశారు . *భగవాన్ 1-9-1896 నుండి 14-4-1950 వరకు అరుణాచలంలోనే ఉన్నారు . భగవాన్ ఎక్కడికి పోలేదు . వారు సర్వాంతర్యామి* . భగవాన్ సజీవముగా ఉన్నప్పుడే భగవాన్ శ్రీరమణమహర్షుల నల్లరాతి విగ్రహాన్ని కూర్చున్ని వున్నట్లుగా ఉన్న ఆ విగ్రహాన్ని తయారుచేసి భగవాను చూపినారు . అది ఆశ్రమములో భక్తులు చూడవచ్చు . వారిని నమ్ముకున్న వారికి ఇప్పటికి కూడా ఏ లోటూ లేదు . ఆ శక్తి ఎక్కడికి పోలేదు . ఇప్పటికి కూడా ఎంతో మంది భక్తులు తిరువణామలైకి వెళ్ళి రమణాశ్రమంలో వారి సమాధిని దర్శించి ఎనలేని అనుభూతులను పొందుచున్నారు . భగవాన్ సమాధిపై కూడా లింగాన్ని స్థాపించినారు . ఇప్పటికీ కూడా యధావిధముగా భగవాన్ ఉన్న ప్పుడు ఏ విధముగా కార్యక్రమములు జరుగుతున్నవో ఇప్పుడు కూడా అవి జరుగుతూనే ఉన్నవి . నేటికి ప్రతిరోజు తెల్లవారు ఝామునే భగవాన్ సమాధిపై స్థాపించిన లింగానికి మరియు మాతృ భూతేశ్వర లింగానికి పూజలు , వేద పఠనములు , నైవేద్యములు , అన్నదానములు , పారాయణములు జరుగుతూనే ఉన్నవి . భగవానుని పరిపూర్ణముగా నమ్ముకున్న భక్తులకు భగవాన్ వారితో మాట్లాడుతూనేయున్నారు . వారి ఆశీస్సులు వారిని నమ్ముకున్న భక్తులకు ఇస్తూనే ఉన్నారు . సముద్రము కంటెను లోతైన స్వామి మహిమలను వారి జ్ఞానమును చెప్పటానికి లేదా రాయటానికి అంతటి సముద్రములో ఒక నీటి బొట్టు మాత్రమైన నేను ( రచయిత ) వారిని గురించి రాయటమంటే అది నేను అనే ఈ శరీరము లేదా వేరు గల జడమైన దేహము లోనున్న సత్యమైన నేను ద్వారా వ్రాసినదే . అది కూడా ఆశీస్సుల వల్ల పైకి కన్పించే నేను కాదని తెలుసుకొనుట వలన ఒక నీటి బొట్టునైన నేను అంతటి సముద్రమంత , ఆకాశమంత , అనంతమైన కొలువలేని జ్ఞానిని గూర్చి సేకరించి వ్రాయటం ఊహించలేనిది . అది కేవలం ఆ అరుణాచలం దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసి భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వామి వారి గురించి ఎన్నో పుస్తకాలు చదివి ఆ భగవానను శరణు వేడిన పిదప వారి ఆశీస్సులుచే కొన్ని విషయాలు మాత్రమే చెప్పబడినది . ఆ అనంతుని గురించి నా బోటి వాడు ఎంత చెప్పగలడు ! ఈ చెప్పిన వాటిల్లో కూడా తప్పు ఒప్పులున్న మన్నించమని భగవాన్ ని వేడుతూ ఈ రచనలో నా ప్రమేయము ఏమీ లేకుండా భగవాన్ చెప్పినదే వారు నా నోటినుండి పలికించినదే తప్ప సొంతము జ్ఞానము ఏమీ లేదని గ్రహించవలసినది . ఈ నా శరణాగతి మరింత బలమై ఏ మాత్రం అహంకారంకాని మెప్పులకు పొంగిపోవుటకాని తప్పులకు కృంగిపోవుటకాని రాకూడదని భగవాన్ ని శరణువేడుతూ భగవాన్ నీవే మాకు శరణాగతి .
 అరుణాచల శివ 
కోటంరాజు శ్రీనివాసరావు 
1-9-129 / 16 / 1 / B / 3 , 
రాంనగర్ , హైద్రాబాద్ , 
 సెల్ : 9346823570 9848438884
ద్వారా రాసినది రమణ సమూహం లో చేర దలచినవారు ఈ నెంబర్ కు మెసేజ్ పెట్టండి 9490860693 నేటితో నిత్య పారాయణ పూర్తి అయినది

శ్రీరమణీయం: ఆత్మసాక్షాత్కారానికి సన్యాసం తీసుకోవాల్సిందేనా ?

 💖💖💖
       💖💖 *"452"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఆత్మసాక్షాత్కారానికి సన్యాసం తీసుకోవాల్సిందేనా ?"*

*"సన్యాసం అంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవడమే కానీ కేవలం కాషాయం, కేశఖండనం కాదని భగవాన్ శ్రీరమణమహర్షి ఇదే ప్రశ్నకు సెలవిచ్చారు. వ్యక్తిత్వం అంటే తన ఉనికి తనకు గుర్తుకురావడం. తన ఉనికి తాను మరచిన వాడు ఎక్కడున్నా సన్యాసి జీవనమే గడపగలుగుతాడు. తాను సన్యాసినని నిరంతరం గుర్తుకు తెచ్చుకునే వ్యక్తి సన్యాసి వేషంలో ఉన్నప్పటికీ తాను సంసారే అవుతాడు. దేన్నైనా మనం నాలుగుసార్లు అనుకుంటున్నామంటేనే అందులో ఏదో లాభాపేక్ష ఉంటుంది. ఇతర విషయాలు మాత్రమే కాదు, మన గురించి మనకు ఎక్కువసార్లు గుర్తుకువచ్చినా అదే అర్థం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            

నేటి మంచి మాట.

 నేటి మంచి మాట.

“ *మన* తప్పులను *లెక్కించుటకు* మన *చేతి* వేళ్ళను *ఉపయోగించటం* మొదలు *పెడితే*,
*ఇతరుల* వైపు *వేలెత్తి* చూపే *తీరిక* ఎవరికీ *ఉండదు*.

*ఈ* జీవితం *పిరికిపందలా* సమస్యలనుండి *పారిపోవడానికి* కాదు. *జయాపజయాలను* లెక్కచేయకుండా *నిస్వార్థమైన* సంకల్పంతో *విజయాన్ని* సాధించడమే *మన* జీవిత *లక్ష్యం*. అదే *మన* అచంచల *దృఢ* సంకల్పానికి *సంకేతం*.”

*బంధం* కలవాలి *అంటే* 
                      ఋణం *ఉండాలి*.
*బంధం* నిలుపుకోవాలి.
                      *అంటే* గుణం *ఉండాలి*."

" *తగిలిన* దెబ్బనైనా *మరచిపోవచ్చు* కానీ*పొందిన* మేలును *ఎప్పటికీ* మరచిపోకూడదు."

*చికాకుతో* చూసే *ప్రపంచానికి*,
*చిరునవ్వుతో* చూసే *ప్రపంచానికి* 
*చాల* వ్యత్యాసం *వుంది*, 
 *ముళ్ళు*... *పూలుకున్నంతగ*..!!

ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

::::::: సున్నితత్వం :::::::

 *::::::::: సున్నితత్వం :::::::::::*

     కొంత మంది  మనస్సు చీటికి మాటికి  గాయ పడుతుంది.
   ఉతత్తుకే ఉలిక్కి పడతారు, ఏడుస్తారు,కంగారు పడతారు.
భయ పడతారు. 
   ఎదుటి వ్యక్తి ఏమి అన్నా వీరి మనో భావాలు దెబ్బ తింటాయి.
   పైగా నా మనస్సు చాలా సున్నితమైనది అని సమర్ధించు కుంటారు. సున్నితత్వం అంటే ఇది కాదు.
   
సున్నితత్వం అంటే

    రాగద్వేషమోహాలు ఏమాత్రం కలుగ కుండా ఎప్పటికప్పుడు ప్రజ్ఞ (wisdom)తో స్పందించ కలగడం.

ధ్యానం చేయండి. మనస్సు ని ప్రజ్ఞ తో నింపి సున్నితంగా వుంచండి 

*షణ్ముఖానంద 98666 99774*

Friday, January 27, 2023

సర్వం బ్రహ్మమయం

 *సర్వం బ్రహ్మమయం*

మానవ సృష్టికి మొదటి మానవుడు - *బ్రహ్మా*

ప్రజలందరికీ తండ్రి -  *ప్రజాపిత బ్రహ్మా*

అన్నింటికంటే గొప్ప విద్య - *బ్రహ్మా విద్య*

బ్రహ్మా జ్ఞానాన్ని ఆచరించేవాడు. - *బ్రహ్మాచారి.*

బ్రహ్మాజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే  *బ్రహ్మచర్యము.*

అన్నిటికంటే గొప్ప ముహూర్తం - *బ్రహ్మాముహూర్తం.*

అన్ని ఉత్సవాలలో కెల్లా గొప్పది - *బ్రహ్మోత్సవం.*
*అతిగొప్ప ప్రయత్నం - బ్రహ్మ ప్రయత్నం*

ఈ రాతను ఎవరూ చెడుపలేరు - *బ్రహ్మరాత.*

ఈ ముడిని ఎవరు విప్పలేరు -  *బ్రహ్మముడి.* 

ఈ అస్త్రానికి తిరుగులేదు - *బ్రహ్మాస్త్రం.*

అతి చెవుడు ఉంటే - *బ్రహ్మ చెవుడు*

ఏదైనా గొప్ప రహస్యం - *బ్రహ్మ రహస్యం*

ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారు అంటారు? - *బ్రహ్మరథం*


గొప్ప రాక్షసిని ఏమంటారు? - *బ్రహ్మ రాక్షసి*

ఏదైనా తినేది రుచిగా ఉంటే
ఏమని అంటారు? - *బ్రహ్మాండం*

బాలవాక్కుని ఏమంటారు ? *బ్రహ్మవాక్కు*


ఏ దేవుడు దిగివచ్చినా వీరు మారరు
అంటారు? -  *బ్రహ్మదేవుడు*

సరస్వతి కి మరొక పేరు - *బ్రహ్మ మానస పుత్రిక*

స్వర్గానికి మరొక పేరు - *బ్రహ్మాపగలు*

నరకానికి మరొక పేరు - *బ్రహ్మ రాత్రి*

ఆనందంలో కెల్లా గొప్ప ఆనందం_. *బ్రహ్మానందం*

అన్నింటికంటే గొప్ప ఉపదేశం - *బ్రహ్మోపదేశం*

అన్నింటికంటే పెద్ద నది - *బ్రహ్మపుత్రా నది*  
 అందుకే సర్వం బ్రహ్మ మయం..🙏🕉️🙏
🔯🔯✡️☑️✔️

ప్రతి అక్షరం బీజమే

 *ప్రతి అక్షరం బీజమే*

*పలికే ప్రతి అక్షరం మంత్రమే. ఒక్కో అక్షరం మంత్రం లాగా జపం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం తెలుసుకుందాం. ఆ ధ్వని వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని పొందుదాం.. "అచ్చులు ".*

*1."అ"కార శబ్ధధ్వని  నుండి వచ్చే మంత్రసాధన విశ్వములో వుండే అతీతశక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది.*

*1.అ  - అకార శబ్దము -థైరాయిడ్ గ్రంధి సమస్యలు, డిప్రెషన్ తగ్గించు కోవడానికి సహాయపడుతుంది.*

*2."ఆ" - *ఆకార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన సాధకుడు చేయుచున్న మంత్రములో శక్తి ఉత్పన్నం అవుతుంది.*

*ఆ "కార శబ్దము హార్ట్ బీటింగ్ లో వుండే కొన్ని సమస్యలను " ఎక్టోపిక్ బీట్" లాంటివి తగ్గించు కోవడానికి సహాయం చేస్తుంది.*

*3. "ఇ" - ఇకార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడికి కలుగు భౌతిక సమస్యలు ఊహించని విధముగా సంతోషకరముగా జరగటానికిసహాయము చేస్తుంది.*

*"ఇ" ఇకార శబ్ద ధ్వని - ఐరన్ డెఫిషియన్సీ వ్యాధి వలన కలుగు. స్త్రీలలో హృదయ భాగంలో ఎండిపోవటం, జుట్టు రాలటం, కాళ్ళు, చేతులు పీక్కుపోవటం, నివారణకు సహాయం చేస్తుంది.*

*4. "ఈ " - తన శక్తి సామర్ధ్యములు తెలుసుకోవచ్చు. *కొన్ని మంత్రాక్షరములు సంపుటిచేత కుటుంబ సభ్యుల మనోభావములు అంతర్ముఖముగా తెలుసుకోవటానికి సహాయం చేస్తుంది.*

*"ఈ" - కార శబ్ధ ధ్వని స్త్రీలకు  మెనోపాజ్ సమయంలో వచ్చే కొన్ని ఇబ్బందుల నివారణకు సహాయం చేస్తుంది. ఈస్ట్రోజన్ తగ్గడం వలన యోని సైడ్ వాల్స్ వీక్ అవుతాయి. ఈ సమస్య చేత లైంగిక సమయంలో బాధాకరంగా వుంటుంది. ఇటువంటి సున్నిత సమస్యలు నివారణకు సహాయం చేస్తుంది.*

*5. "ఉ"- "కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జరగబోయే కాలములో జీవుడు చేయు భౌతిక కర్మలు జయాపజయములు అంతర్ముఖముగా తెలుసుకోవుటకు సహాయం చేస్తుంది.*

*"ఉ" కార శబ్ధ ధ్వని జీర్ణకోశ వ్యవస్థ లోపాలు సరిదిద్దు కోవటానికి సహాయం చేస్తుంది.*

*6. "ఊ"కార శబ్దధ్వని వల్ల మంత్రసాధన ప్రేతాత్మలు ఆవహించిన వారివి గుర్తించవచ్చని పాశ్చాత్య పండితుల తంత్రగ్రంధములు, భారతీ పురాతన దత్తాత్రేయ,సిద్ధనాగార్జున తంత్రగ్రంధములు తెలియచేస్తున్నాయి.*

*"ఊ" కార శబ్ధ ధ్వని ఆస్తమా లాంటి దీర్ఘకాల వ్యాధుల నివారణకు సహాయం చేస్తుంది.*

*7. "ఋ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన ఆకాలమృత్యువు, అపమృత్యువు, యాక్సిడెంట్ల నివారణకు సహాయంచేస్తుంది.*

*"ఋ" కార శబ్ధ ధ్వని స్పాండిలోసిస్ అనబడే వెన్నుపూస సమస్యల నివారణకు సహాయం చేస్తుంది.*

*8. "ౠ" కార శబ్ధధ్వని   - మంత్రసాధనతో అంతర్ముఖముగా సాధకుడు నిత్యయవ్వనముగా ఉండవచ్చు, బాహ్యసౌందర్యము పెంచుకోవచ్చు లింగబేధములేకుండా.*

*"ౠ" కార శబ్ద ధ్వని నెర్వ్ కంప్రెషన్, రుమాటాయిడ్ వలన కలిగే సమస్యల నివారణకు సహాయము చేస్తుంది.*

*9." ఎ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన శత్రువులమీద విజయం సాధించడం, ఆత్మ రక్షణ కొరకు ఉపయోగపడుతుంది.*

*"ఎ" కార శబ్ద ధ్వని వంశపారంపర్య వ్యాధులు కొన్ని నివారణకు సహాయం చేస్తుంది.*

*10. "ఏ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడు ఆత్మజ్ఞానము కోసం చేసే ప్రయత్నములో విజయం కలగటానికి, చేయుచున్న మంత్రసాధన అవరోధములు కలుగకుండా సహాయంచేస్తుంది.*

*"ఏ" కార శబ్ద ధ్వని పురుషులలో బెలనైటిన్ అనబడే లైంగిక సమస్య, స్త్రీలలో వైట్ డిస్చార్జ్ నివారణకు సహాయం చేస్తుంది.*

*11. "ఐ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవునికి వాక్సిద్ది,జ్ఞాపకశక్తి పెరగటానికి, కోరుకుంటే అపరోక్ష జ్ఞానము కలుగుటకు సహాయం చేస్తుంది.*

*"ఐ " కార శబ్ద ధ్వని తల భాగంలో ఉండే కొన్ని వ్యాధులు టెంపోరల్ ఆర్టిరైటిన్, హై బి.పి., హైపర్ టెన్షన్ నివారణకు సహాయం చేస్తుంది.*

*12."ఒ"కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన దీర్ఘకాల ఆర్ధికసమస్యల నివారణకు (కోర్టు వ్యవహారాలు), శత్రువులు సాధకులకు మిత్రులగుటకు సహాయంచేస్తుంది.*

*"ఒ" శబ్ద ధ్వని డిప్రెషెన్ కొన్ని రకమైన లైంగిక పరమైన సమస్యల నివారణకు సహాయం చేస్తుంది.*

*13. ఓ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడు చేయుచున్న మంత్రసాధన వేగముగా సిద్ది కలగటానికి సహాయం చేస్తుంది..*

*"ఓ " కార  శబ్ద ధ్వని కొన్ని దీర్ఘకాల వ్యాధుల నివారణ కొరకు సహాయం చేస్తుంది.*

*14. "ఔ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన భూతప్రేతపిశాచములను, అన్నిరకములైన దుష్టశక్తుల నివారణకు సహాయంచేస్తుంది అని పురాతన తంత్రగ్రంధములలో వుంటుంది.*

*"ఔ " కార శబ్ద ధ్వని అన్ని రకములైన మానసిక రోగముల నివారణకు సహాయం చేస్తుంది.*

*15. "అం" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన భోగ, మోక్ష మంత్రసాధనలందు ఉత్తమంగా వుంటుంది. (శాక్తేయ మంత్రవిద్యల యందు).*

*"అం" కార శబ్ధ ధ్వని భౌతికవ్యాధులు గుర్తించుటకు అంతర్ముఖముగా సహాయం చేస్తుంది.*

*16. "అః"  కార శబ్ధధ్వని*
*వ్యాధినిరోధక సాధనము వంటిది. దీర్ఘకాల వ్యాధులందు ఉత్తమం.*

*అక్షర పరబ్రహ్మణే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత శరణం మమ*🙏🌷

మంచి మాట..లు(27-01-2023)

 _*🔱శుభోదయం🙏*_
ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐 లక్ష్మి సరస్వతి దుర్గ గాయత్రీ అమ్మవారు అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈరోజు వివాహ దినోత్సవాలు, జన్మదినోత్సవ జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ
*శుక్రవారం :-27-01-2023*
 ఈరోజు *AVB* మంచి మాటలు

_*చెప్పుడు మాటలు వినే వాడి జీవితం ఏప్పటికైనా చెదలు పట్టి పోవాల్సిందే,,*_

_*అంత దండి సూరులైన పంచపాండవులు రాజ్యమిడిచి దండకారి అడవిలోన ఉండలేద ఎండలోన,, అందుకే డబ్బుందని, పదవి ఉందని, పలుకుబడి ఉందని మురిసిపోకు, కాలం చాలా బలమైనది,,*_


_*మనం ఏడిస్తే ఈశ్వరుడు వస్తాడో రాడో తెలియదు కాని,, ఒక్కసారి నవ్వి చూడు,ఈర్ష్యతో ఎంత మంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి ఇదే నేటి సమాజం తీరు,,*_


_*కరువలేని కుక్కే అరుస్తది అన్నట్టు, మనతో పోటీ పడలేని వాడే మన గురించి తప్పుగా మాట్లాడతాడు,,*_

_*సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం,, ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలక పోవడం,, వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం, గుర్తుంచుకో,,*_
సేకరణ ✒️ *AVB* సుబ్బారావు

దైవమెక్కడ?

 *🙏🏻🌹శుభోదయం🌹*🙏🏻

*దైవమెక్కడ?*

           దైవం సర్వత్రా వ్యాపించి ఉన్నదని మాట్లాడేవారు,మానవుని మనస్సులో ఉన్న దైవాన్ని తెల్సుకోవడములో విఫలమవుతున్నారు. దైవం, వ్యక్తుల మనస్సులలో విడివిడిగా కాకుండా సమిష్టిగా ఉన్నది.ఉక్కిరి బిక్కిరి చేసే కోరికలు,దురాశ,మోహను వలన దైవమెక్కడో ఉన్నట్లు,మన మనస్సులలో లేనట్లు అన్పిస్తుంది. దురాశ, అపరిమితమైన కోరికలు దైవాన్ని, మనస్సు కందనంత దూరంలో ఉంచుతున్నాయి.
         దైవానికి మనమెంతదూరంలో ఉన్నామో తెలుసుకోవడం తేలికే.మీ కోరికలన్నీ ఒక పట్టీగా వ్రాయండి.పట్టీ ఎంత పెద్దదయితే దైవం మీ కంత దూరంలో ఉన్నట్లు తెలుసుకోండి. కోరికలను అధిగమించినప్పుడు దైవపు ఉనికి తెలుస్తుంది. మనస్సు సంతృప్తితో నిండి పోతుంది. పెరిగే కోరికలు మన జీవితంలోని ప్రతి క్షణాన్ని వశంచేసుకుంటాయి-ప్రణాళికలు వేసి, వాటిని అమలు పరిచి నైపుణ్యంతో వాటిని పూర్తి చేయడం- కాలమంతా అందులోనే గడిచి పోతుంది. కోరికలను విశ్లేషించి, అధిగమించడం తేలికే. అప్పుడు శాంతి,సంతృప్తి కల్గుతుంది- అక్కడే దైవాన్ని కనుగొనగలవు.

             తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి

****నేటి ఆణిముత్యాలు.

 నేటి ఆణిముత్యాలు.

     *సముద్రం అందరికీ* 
 *ఒకటే కానీ...* 
         *కొందరికి ముత్యాలు లభిస్తే*
      *కొందరికి చేపలు దొరుకుతాయి*
           *ఇ౦కొ౦దరికి* 
   *కేవలం కాళ్లు మాత్రమే తడుస్తాయి*
   *జీవితమూ అంతే, అందరికీ ఒకటే*
        *మనం దేని కోసం ప్రయత్నిస్తే* 
          *అదే మనకు దక్కుతుంది..*
       
*ఒక్కసారి దూరమై,* 
 *నమ్మకం పోగొట్టుకున్న తర్వాత..* 

 *మళ్లీ తిరిగొచ్చి, బంధం కలుపుకోడానికి ఎంతగా ప్రయత్నించినా....* 

 *ఆ బంధంలో ముందున్న ఆత్మీయత కనిపించదు.* 

 *విడిచి వెళ్లారన్న బాధ ముందు,* 
 *ప్రస్తుతం చూపించే అనురాగం* *దిగదుడుపే....!!!* 

*❤️ప్రేమానుభందాలు నిలకడగా వున్నపుడు...* 
 *ప్రకృతే పట్టుపరుపులు...* 
 *ఆప్యాయతలు ఆనందం పంచుతున్నప్పుడు...* 
 *మేడలు, మిద్దెలు లేకపోయినా రాజభోగమే ఆ మనసులకు..* 
 *ప్రేమను పంచే పెనిమిటి* 
 *చిరునవ్వులు పంచే చిన్నారి* 
 *ఇవే* *కదా అసలైన ఆస్తి...** 
 *పేదరికమనే మాటకే అర్థంలేదు ఇక్కడ* 
 *అర్థం చేసుకునే* *మనుషులమధ్య* 
 *జీవించడమే నిజమైన భాగ్యం .

ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

శ్రీ రమణాయ అధ్యాయము 40 ( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట తరువాయి భాగం )

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ
 అధ్యాయము 40 
( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట తరువాయి భాగం )

      భగవాన్ వారి చేతిపై వచ్చిన వ్రణము తద్వారా పొందిన భయంకరమైన చికిత్సలు రోజురోజుకీ వారి ప్రణబాధ వారు పడకపోయినా వారి భక్తులెల్లరు ఆ బాధను తట్టుకొనలేక భగవాన్ వద్ద మొరపెట్టుకుని సంకల్పముచేసుకుని వారినే నయము చేసుకోమని భక్తులు కోరగా భగవాన్ “ *శరీరము ఒకటున్నదని ఆ శరీరానికి చేతులున్నవని అందులో ఒక చేతికి వ్రణం ఉందని మీరంటుంటే నేను విని ఆ దృష్టితో చూస్తే తప్ప లేకుంటే నాకేమీ తెలియడం లేదే ? ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవాలి . నిజానికి మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే . ఎందుకంటే శరీరం నిర్జీవ పదార్థం కదా . దానికి ఆత్మఛాయ ఆవరించుటచే దానిలో చైతన్య క్రియాశక్తి కనిపిస్తుంది ” అని అనగా భక్తులు “ మా కొరకు సంకల్పం తెచ్చుకోండి " అని మళ్ళీ కోరగా భగవాన్ " తమరొకరున్నారా ఇక్కడ ? అంటే వారికి భేద దృష్టి ఏ మాత్రము లేదని తెలియుచున్నది* . వైద్యులు ఆ పుండులో వున్న చెడునెత్తురుని తీసివేయుటకై ఆ పుండును *జలగలచే కరిపించారు . అవి భగవాన్ చెడు నెత్తురుని పీల్చి పీల్చి ఆ కురుపుకు అంటుకుపోయి వ్రేలాడినవి* . నిజానికి అటువంటి బాధ ఎవ్వరూ భరించలేరు . భగవాన్ ఏ చలనము లేకుండా వైద్యులతో “ ఆ జలగలు జ్ఞానుల్లాగా సమాధిలోకి పోయినట్టులన్నవే ” అని అన్నారు . పైగా భగవాన్ “ *ఆ వ్రణం ఎందుకు వచ్చిందో దాని పని అది చూసుకుంటుంది ” అని చెప్పినా మీరు ఊరుకోలేదు . కత్తులతో కోసి మొదలు పెట్టుటవల్ల అది మీ పని ఇట్లా ఉందా అని బుస్సున పెరిగి కూచుంది . ఇక మీ ఇద్దర మధ్య యుద్ధమే . ఎవరు గెలుస్తారో మనదేం పోయింది ?" అన్నారు భగవాన్ ఒక మధ్యవర్తిలాగా* . ఒక్కొక్కసారి ఆ విషగ్రంధి వల్ల భగవాన్ కి చలి జ్వరం వచ్చేది . ఐనను భగవాన్ మామూలుగా హాల్లో వణుకుతూ కూర్చుండేవారు . భక్తులు భగవాన్ ని చూచి అయ్యో శరీరం వణుకుతుందే అని అనుకొనగా భగవాన్ " *ఓహో శరీరమా వణుకుతున్నదా ? వణకనీ ” అని అనేవారు పైగా అది నటరాజ తాండవమయ్యా దానికి ఎందుకు గాబరా అనేవారు*. భగవాన్ ఇన్ని బాధలు ఉన్నప్పటికీ భగవాన్ ని వైద్యం చేసే వైద్యులు తట్టుకొనలేక ఏడ్చారుకాని భగవాన్లో మటుకు ఎటువంటి బాధ పడలేదు . కొందరు భక్తులు భగవాన్ కోలుకోవాలని విశేష పూజలు చేస్తూ ఉంటే భగవాన్ " *అది మంచి పనే ధనవంతులకు కైంకర్యంమౌతుంది . బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది* " అని అనేవారు . చివరికి మూడవ ఆపరేషన్ కూడా జరిగినా ఏమీ మార్పు రాలేదు . అది తగ్గినట్లుగా తగ్గి పాత గ్రంధి ప్రక్కన ఇంకొక గ్రంధి కనబడి ఇది కూడా విషగ్రంధేనని గ్రహించి మళ్ళీ ఆపరేషన్ చేసినా ఉపయోగం లేకపోయింది . కొన్ని నెలల తరువాత ఇంకొక గ్రంధి కనబడింది . ఐనా భగవాన్ లెక్క చేయలేదు . రాను రాను వారి ఆరోగ్యంలో మార్పు రావుటచే వారు తమ దర్శనాన్ని హాలులోకి వచ్చి ఇవ్వకుండా వారున్న గదిలోనే ఉండి దర్శన మిచ్చేవారు . నాల్గవ ఆపరేషన్ కూడా చేశారు . దాని తరువాత వారికి వాంతి చేసుకుని ఇక ఆహారము తీసుకొనడం మానేశారు . 19.03.1950 తెలుగు ఉగాది పండుగ వికృతి నామ సంవత్సరము కావటం వల్ల ఆ ముందురోజు ఒక భక్తురాలు ప్రతి సం || ము తన ఆనవాయితీ ప్రకారము ఒక తుండు గుడ్డ , కౌపీనము భగవానక్కు తెచ్చి ఉగాది ముందురోజు అనగా 18.03 . 1950 న ఇవ్వగా భగవాన్ “ *ఓహో వచ్చిందీ ఉగాది ? వికృతి వచ్చింది* ” అని అన్నారు . 

      భగవాన్ వారు తమ అవతారము కొద్దిరోజులలో చాలిస్తారనగా ఒక పార్సీ భక్తుడు తన మతం ప్రకారం ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగ పడుతున్నాను అని ప్రార్థించగా భగవాన్ వెంటనే , “ *సూర్యుడు అస్తమిస్తున్నాడు . అదెట్లా సందర్భ పడుతుంది ” అని ముందే సూచించారు* . ఇంకొక భక్తుడు ఒక ఆయుర్వేదం డాక్టర్ని పంపించగా భగవాన్ “ *ఎంగిలి విస్తరిది ఎవరైనా జాగ్రత్త చేసుకుంటారా* " అని అన్నారు . ఏప్రిల్ 12 వ తేదీ 1950 వ సం || న భగవాన్ మందు పుచ్చుకొనుట పూర్తిగా మానివేసినారు . ఏప్రిల్ మొదటి వారం నుండే ఆయనకు మందులు ఇవ్వటానికి భక్తులు వస్తే భగవాన్ కి మందులన్న విసుగు వచ్చింది . 12 వ తేదీన వారసలు మందే పుచ్చుకొనలేదు . ముందురోజు రాత్రి భగవాన్ కి ఆయాసం రావటంచే వారి బంధువు మందు ఇవ్వగా “ *రెండు దినములలో పోవు దానికి మందెందుకు ?* " అని అన్నారు . అనగా భగవాన్ ఏప్రిల్ 14 , 1950 వ సం || న వారు నిర్యాణము అవుతున్నట్లు ముందుగనే సూచించినా భక్తులు తెలుసుకొనలేకపోయినారు . 

       మహాపురుషులకు జనన మరణములనేవి ఉండవు . వారు ఎలా అవతరించినారో అలాగే తమ అవతారమును చాలించెదరు . వారు తమ దేహాన్ని వదిలే మునుపు కొన్ని సూచనలు ముందుగానే ఇస్తారు . మానవమాత్రులమైన మనము వాటిని గ్రహించలేము . భగవాన్ వారు పడ్డ బాధలు పై రెండు అధ్యాయాలలో చదివితేనే మనము తట్టుకొనలేక ఎంతో నొప్పి మన గుండెకు కల్గినట్లు కనబడుతుంది . *మనకి ఆ మహాపురుషులకి భేదం ఇదే*. స్వయముగా భయంకరమైన బాధను అనుభవించిన భగవాన్ ఎటువంటి బాధ వారి కళ్ళల్లో కన్నీరు కాని ఎక్కడ కనిపించలేదు . వారసలు ఒక దేహమని అనుకుంటే కదా అలాంటి బాధలు పడి దుః ఖించటానికి . మనము మనదేహముపై ఉన్న వ్యామోహంచేత చదివితేనే తట్టుకొనలేక అటువంటి బాధలు ఎవ్వరికి రాకూడదని అనుకుంటూ ఉంటాము . మామూలు జ్వరమువస్తేనే భయపడి పదిసార్లు ఒళ్ళు వేడిగా ఉన్నదా లేదా అని చూసుకుంటాము . చిన్న గాయం తగిలితే పెద్ద కట్టుకడతాం . ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని ప్రశ్నించుకుంటే వ్యామోహం దేహముపై గల మమకారం ఇంకా ఇంకా జీవించాలని ఆశ . ఆ ఆశ ఉండాలికాని దీని పైనను అని ప్రశ్నించుకుంటే భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మ సార్ధకము చేసుకోవాలని దానికై ప్రాపంచిక సుఖాలకు లోబడి అశాశ్వత వస్తువుల కొరకు అదే ఆనందం అని భ్రమించి మధ్యమధ్యలో ఇటువంటి రోగాలు కలిగినపుడు దేహము పైనున్న మమకారం చేత బాహ్య ప్రపంచము సుఖమని అనుకొనుటచే దుఃఖమునకుపాలై మరణం అంటేనే భయపడి ఇంకా జీవించాలని ఆ మాయాజాల ప్రపంచములోనే కొట్టుమిట్టాడుతూ జన్మిస్తూ మరణిస్తూనే ఉంటాడు తప్ప శాశ్వతమైన సత్యాన్ని , ఆ నేనును అంటే ఆత్మను తెలుసుకోడు . కావున దైవమిచ్చిన ఈ జన్మ సార్ధకము కావాలంటే దృష్టిని అంతర్ముఖము చేసిన వానికి శాశ్వతమైన నేనును అన్వేషించు వానికి అటువంటి ఆత్మజ్ఞానికి భగవాన్లోగా ఎటువంటి బాధలు వచ్చినా వాటిని పట్టించుకొనక నిరంతరం ఆత్మ నిమగ్నులై ఉండుటచే మరణమన్న వారికి భయం ఉండదు . *కాని మరణానికి అటువంటి జ్ఞానిని చూస్తే భయపడును* . కావున నేను దేహమును కాను ఆత్మను నాకు మరణమే లేదు . ఈ రోగాలు బాధలు అన్నీ జడమైన శరీరానికి కేకాని ఆత్మకు కాదు అనే ఎరుక ధైర్యం అటువంటి బాధలు వచ్చినా తట్టుకొనే శక్తి భగవాన్ ని చూసిన తరువాత ప్రతివారు నేర్చుకోవాలని ఆ జ్ఞానం సంపాదించుకోవాలని అంతటి శక్తిని పొందటానికి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిని ప్రార్ధిద్దాం . 

ఓ రమణా నీవే మాకు శరణాగతి . 

అరుణాచల శివ 

🧘‍♂️91 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *సిద్ధ పురుషుడు:-*

 *🧘‍♂️91 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*సిద్ధ పురుషుడు:-*

శ్రీ రమణుడి అభీష్టం నెరవేర్చడం తన పరమ కర్తవ్యంగా భావించిన అమృతానంద, ఆయన నోటి నుండి వెలువడే మాటకు ఎంత ప్రాధాన్యమిచ్చేవాడో మరో విషయం చెబితే తెలుస్తుంది. ఒకసారి అమృతానంద యాత్రలు చేస్తూ చాలా చోట్లకుపోయి, రిషీకేషు కూడా వెళ్ళి, ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఒకప్పుడు గోవిందగిరి అనే ఒక సాధకుడు, రమణుణ్ణి దర్శించుకున్న తర్వాత, రిషీకేశ్లోని ఆ ఆశ్రమానికి వెళ్లి, తిరువణ్ణామలైకి తిరిగి వచ్చిన తర్వాత, ఒక రోజున రమణుడు ఏదో పుస్తకం గురించి అడిగాడు. ఆ పుస్తకాన్ని అమృతానంద రమణాశ్రమంలో చదువుకోడానికని తీసుకొని, అనుకోకుండా రిషీకేష్ ఆశ్రమంలో వదిలేసి వచ్చానని చెప్పాడు.

మర్నాడు అమృతానంద రమణాశ్రమంలో కనిపించలేదు. మధ్య మధ్యలో ఈ విధంగా అదృశ్యం కావడం అమృతానంద విషయంలో ఆశ్రమంలో అందరికీ అనుభవమే కాబట్టి, దీనిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆశ్రమం నుంచి అరువు తీసుకొని రిషీకేష్లో వదిలేసిన ఆ పుస్తకం కోసమై, అతడు అప్పటికప్పుడే తిరువణ్ణామలై నుండి బయలుదేరి మళ్ళీ రిషీకేష్ వెళ్ళి వచ్చాడని, తర్వాత తెలిసింది. రైల్వే వారు కూడా ఇతడి బీద వేషం చూచి, టిక్కెట్టు చూపించమని అడిగేవారు కాదు. కొన్నాళ్ళకు పుస్తకంతో సహా అమృతానంద మళ్ళీ రమణాశ్రమంలో కనిపించి, ఆ పుస్తకం రమణుడి చేతుల్లో పెట్టాడు. రమణుడి వాక్కు అమృతానందకు అనుల్లంఘనీయం ! శ్రమ ఎంతటిదై నప్పటికీ అదొక లెక్కలోనిది కాదు.

శ్రీ రమణుల తల్లి మరణించినప్పుడు, ఆమెను కొండ కింద ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. అక్కడి మొదటి పూలచెట్లను అమృతానందే నాటాడు. ఈ ప్రాంతం అంతా ఇప్పుడో చిన్న ఉద్యానవనంగా రూపొందింది. కొంతకాలం అనంతరం అతడు జాఫ్నాకు తిరిగి వెళ్ళి అక్కడే మరణించాడు. రమణుడికి ఈ వార్తను అందచేసినప్పుడు “అమృతానంత గొప్ప సిద్ధపురుషుడు” అన్నాడు.

ఎంతటి వాడినైనా రమణుడు ఊరకనే ప్రశంసించడనే మాట పాఠకులకు తెలియనిది కాదు. ఆ మాటకొస్తే “ఉన్నది ఉన్నట్లు చూచే వాడెప్పుడూ ఉన్నది ఉన్నట్లు తప్ప మరో విధంగా మాట్లాడడు. ఈ లోకుల నుంచి అతడాసించేది ఏమీ ఉండదు. కాబట్టి అనవసరంగా ఎవర్నీ మెచ్చుకోవలసిన పనిలేదు.

అమృతానంద సిద్ధపురుషుడనడానికి రమణుడికి మరెన్నో విషయాలు తెలిసి ఉండవచ్చును. కానీ ఆ సందర్భంలో రమణుడు చెప్పిన ఈ ఉదంతము ఒకటి తెలుసుకుంటే, రమణుడు ఆ మాట ఎందుకన్నాడో మనకూ కొద్దిగా స్ఫురిస్తుంది. ఒకసారి జాఫ్నాలో వర్షపు చినుకు పడనందువల్ల తీవ్రమైన క్షామం ఏర్పడింది. 

ఆ ప్రాంతంలో వర్షం పడేట్లుచేసి సస్యశ్యామలం చేయాలని అమృతానంద అభిప్రాయపడ్డాడు. అందుకని అక్కడే అడవిలో ఉన్న మరియమ్మన్ ఆలయానికి కుంభాభిషేకం చేయించాలని అమృతానంద నిశ్చయించాడు. బీదలకు అన్నదానం కూడా జరగడానికి ఏర్పాట్లు గావించ నారంభించాడు. కుంభాభిషేకం ముందు రోజు కొబ్బరికాయలు, నిమ్మకాయలు, బెల్లం మొదలైన వస్తు సామగ్రి తీసుకు వచ్చి, ఆ గుడి వద్దనున్న ఓ గదిలో దాచారు. ఆ గది తాళపుచెవి అమృతానంద చేతికిచ్చి చూచుకోమన్నారు.

కుంభాభిషేకం ముందు రోజునే చాలా మంది పేదలు, పెద్ద చిన్నా, ముసిలీ ముతకా, అంతా ఆ రాత్రికి అక్కడికి చేరుకున్నారు. ఆ ఎండాకాలంలో నడిరాత్రి వేళ వారందరికీ అమితంగా దాహం వేసింది. పిల్లలు ఏడవ నారంభించారు. పెద్దలు మూలుగుతున్నారు. అమృతానంద వీరందరి బాధ చూడలేకపోయాడు. ఓ పెద్ద పాత్ర తీసుకొని, లేత కొబ్బరికాయలన్నిటినీ కొట్టి ఆ నీరు ఆ పాత్రలో పోశాడు. నిమ్మకాయలు పిండి ఆ రసం కూడా అందులో పోశాడు. ఇంత బెల్లం కలిపాడు. కావలసినన్ని మంచినీళ్ళు పోశాడు. అక్కడి వారందరికీ ఈ మధుర పానీయం అందించాడు. అక్కడి పేదవారందరూ దాహం తీరి చాలా ఉపశమనం పొందారు.

మర్నాడు కుంభాభిషేకానికి ఆ ఆలయం వద్దకు వచ్చిన వారికి, ఈ విరిగిన కొబ్బరి చిప్పలు, నిమ్మకాయ తొక్కలు కనిపించాయి. 'ఇదేమిటని' అమృతానందను అడిగారు. “నేటి కుంభాభిషేకానికి అవసరమైన కొబ్బరికాయలు నిమ్మకాయలు, మిగతా వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పడివున్న మిగతా కాయలతో నేను నిన్న రాత్రే కుంభాభిషేకం చేశాను. మానవ సేవే మాధవసేవ అంటారు కదా?" అని సమాధానం చెప్పాడు అమృతానంద. అతడు చేసిన పనిని ఎవరూ విమర్శించకపోగా, అందరూ అతణ్ణి ప్రశంసించారు. “అమృతానంద అంతటి ఆత్మోన్నతి కలిగినవాడు” అని ముగించాడు శ్రీ రమణుడు.

రమణుడి భక్తి భావంలో జాలి, దయ, కరుణ, మానవత్వం మొదలైన గుణాలకే అధిక ప్రాధాన్యం ఉండేది. అలాంటి రమణుడికి అమృతానంద మీద అభిమానము ఉండటంలో ఆశ్చర్యమేముంటుంది?

అయితే ఆత్మసాక్షాత్కారం కలిగిన రమణ, అమృతానంద వంటి వారి మానవ సేవ మాధనసేవగా రూపొందడం వేరు. మనవంటి వారు ఇదే పదాలను వాడుతూ ప్రారంభించే ఆలోచనాపూర్వకమైన 'మావనసేవ' ఉద్దేశం వేరు; ఉద్దేశపూర్వకమైన ఈ సేవ ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తుంది. మనది అవ్యాజమైన కరుణ కాదు. 

అలాంటి కరుణ, లేక ఆత్మ, మనిషికి సాక్షాత్కరించిన తర్వాతనే, అంటే తనను తాను తెలుసుకొని నందువల్లనే, మానవుడెవరో అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు, ఆశ మిగలదు; కరుణ మాత్రమే ఉంటుంది. ఆ కరుణకు కారణం ఉండదు.

*మోక్షప్రాప్తి*

మోక్షమనగా నీవు పుట్టనివాడవని తెలుసుకోవడమే. నిశ్చలత్వము పొంది ‘నేనే బ్రహ్మము’నని తెలుసుకో. నిశ్చలత్వము పొందడమంటే మనోభావన లేవీ లేకుండా ఉండడం. కావలసినది 'తెలుసుకోడం' గాని 'భావించడం' కాదు 

:::: మనస్సు - సమస్యలు - ధ్యానం ::::

 *::::: మనస్సు - సమస్యలు -  ధ్యానం ::::*

    మానవుడి సహాజాతపు జీవితం తప్ప మిగితా సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంఘిక, సాంస్కృతిక,  వైవాహిక, కుటుంబ, నైతిక జీవితం అంతా తన మనస్సు చేత నిర్మించు కొన్నదే.

            కనుక మనస్సుకు సంబంధం లేకుండా మానవుడుకి ఏ సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా లేదు.

          అనగా మానవుడి అన్ని సమస్యలూ మనస్సు సరిగ్గా పని చేయక పోవటం చేతనే.

   
           మానవ మనస్సు సరైన పద్ధతి లో పని చేసేలా  చేసేది ధ్యానం.

         కనుక ధ్యానం మానవుడి అన్ని రకాల సమస్యలను పరిష్కరించ గలదు.

*షణ్ముఖానంద 98666 99774*

Thursday, January 26, 2023

✍️ చిట్కావైద్యం (గృహ వైద్యం)

 ✍️ చిట్కావైద్యం (గృహ వైద్యం):

విన్నపం: పనిలేక కాలక్షేపం కోసం మరియు పబ్లిసిటీ కోసం చేసిన పోస్ట్ కాదు. మీ ఆరోగ్యం కోసం ఎంతో విలువైన సమయం కేటాయించి చేయడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి వినియోగించుకోండి. మీ మిత్రులకి షేర్ చేయండి.🙏

పెరటి చెట్ట,ఇల్లు, ఇంటి పరిసరాల్లో లభించే వాటితోటే కావాల్సిన వైద్యం చేసుకోవచ్చు.ఒత్తిళ్ళతో కూడిన ఆధునిక జీవితం మనిషి అనారోగ్యానికి కారణమవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎలాంటి వారైనా ఏదో ఒక సందర్భంలో వ్యాధుల బారిన పడుతున్నారు. అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్ళడం కుదరదు. అందుకే ఇంట్లోనే వైద్యం చేసుకునే చిట్కాలు సాధన చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వ్యాధులకు గహ వైద్యం అందుబాటులో ఉంది. మరింకేం? ఈ చిట్కాలు అనుసరిస్తే చాలు.

ఆయుర్వేదం మనకు ఆనాదిగా వస్తున్న సాంప్రదాయ వైద్యం. వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ప్రాధాన్యం తగ్గడంలేదు. వ్యాధి తగ్గడానికి కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా ఇందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. 

కొన్ని ముఖ్య సమస్యలకు ఇంటివద్దే పరిస్కారం.

✍️శ్వాసకోశ వ్యాధులు:

👉జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.

👉మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.

👉అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.

👉సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

✍️రక్తహీనత:

👉నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.

👉నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.

👉విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.

👉విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.

✍️మూర్ఛ:

👉తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.

👉పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.

👉తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.

👉కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.

👉మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.

👉సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.

✍️తెల్లమచ్చలు:

👉వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.

👉పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.

👉తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

✍️నిద్రలేమి:

👉శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.

👉కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.

👉మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.

👉నోటి సమస్యలు:

👉లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.

👉వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి. 

👉 పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.

👉నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.

👉లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.

👉గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

✍️తల తిప్పటం:

👉అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.

👉10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.

👉మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.

✍️మొటిమలు:

👉పుదీన ఆకులను మెత్తగా నూరి క్రమం తప్పకుండా మొటిమలపై రాసుకుంటే అవి తగ్గుతాయి.

👉వెల్లుల్లి రసం తీసి ముఖానికి రాసుకున్నా లేదా మద్ధిపట గంధాన్ని మొటిమలపై రాసినా మంచి ఫలితముంటుంది.

👉ఆముదం, గ్లిజరిన్ మిశ్రమాన్ని రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు ఇట్టే మాయమవుతాయి.

👉మొటిమల వల్ల ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడితే నిమ్మరసాన్ని అద్ది సుతిమెత్తగా మర్దన చెయ్యాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

✍️రక్తపోటు (బి.పి.):

👉సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.

👉మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.

👉ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.

👉కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంది.

✍️అవాంఛిత రోమాలు:

👉గన్నేరు వేర్లు, నేపాలం వేర్లు, తెల్ల తెగడ వేర్లు అన్నీ కలిపి ఆవనూనెలో వేసి సన్నని మంటమీద వేడి చెయ్యాలి. చల్లారిన తర్వాత అవాంఛిత రోమాలు ఉన్న చోట మర్దన చేసి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.

👉నాగకేశరాలు, ఆవనూనె కలిపి ఎనిమిది రోజులు ఎండబెట్టాలి. ఆ తర్వాత ఆవాంఛిత రోమాలు ఉన్నచోట రాసి ఐదు నిమిషాల తర్వాత తుడుచుకోవాలి.

👉జమ్మివృక్షం పంచగాలు నానబెట్టి రుబ్బి అవాంఛిత రోమాల భాగంపై రాసి ఇరవై నిమిషాల తర్వాత తుడుచుకుంటే మంచి ఫలితముంటుంది.

✍️మలబద్దకం:

👉అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.

👉రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.

👉రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.

✍️అతిమూత్రం నివారణకు:

👉నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.

👉అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.

👉ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.

👉వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.

👉కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.

👉మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.

✍️తల వెంట్రుకలు పెరుగడానికి!

👉మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.

👉కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.

👉గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.

✍️అతిసారం:

👉బచ్చలికూర, పెరుగుతో కలిపి తింటే అతిసారం తగ్గుతుంది.

👉పాలకూరను నూరి చక్కెర కలిపి తీసుకున్నా లేదా గసగసాలు పటిక బెల్లం సేవించినా నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.

👉పుంటికూర (గోంగూర) ఆకును ముద్దగా చేసి తిన్నా చక్కని ఫలితముంటుంది.

👉చిరుబొద్ది ఆకుల రసం, దానిమ్మ పండ్ల రసం నెయ్యిలో కలిపి తీసుకున్నా విరేచనాలు తగ్గుముఖం పడతాయి.

✍️ఉబ్బసం:

👉తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.

👉అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.

✍️వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.

👉నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.

✍️గుండెజబ్బులు:

👉తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.

👉మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.

👉స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.

👉మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.

✍️పడిశం:

👉నీలగిరి (జామాయిల్) ఆకులు వేడి నీళ్లలో వేసి ఆవిరి తీసుకుంటే పడిశం ఇట్టే తగ్గిపోతుంది.

👉మరో సులువైన మార్గం చిటికెడు పసుపు వేడి పెనంపై వేసి ఆ పొగను పీల్చాలి. అలాగే, పసుపు పొడి కాగే నీటిలో వేసి ఆవిరి పట్టినా ఉపశమనం కలుగుతుంది.

👉మిరియాల పొడి కషాయం తాగినా, మిరియాల పొడిని తేనెలో కలిపి సేవించినా పడిశం తగ్గుముఖం పడుతుంది.

👉వస గంధం ముక్కుకు రాసుకుంటే పడిశం తగ్గుతుంది.

✍️పులిపిర్లు:

👉పులిపిర్లకు బొప్పాయి పాలను రాస్తే ఊడిపోతాయి.

👉అరటిపండు తొక్కకు ఉండే నారవంటి పదార్థం పులిపిరికాయల మీద రాసినా తగ్గుముఖం పడుతాయి.

👉సున్నం, బెల్లం కలిపి అవి ఉన్న చోట పెడితే ఫలితముంటుంది.

👉రెడ్డివారినాగబాల చెట్టు కొమ్మలను తెంపితే వచ్చే పాలను పులిపిరి కాయల మీద రాయాలి. ఇలా నాలుగు లేదా ఐదు సార్లు రాస్తే పులిపిర్లు ఇట్టే రాలిపోతాయి.

✍️ఎసిడిటీ:

👉ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.

👉పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.

👉దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.

👉అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.

👉ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.

✍️ఆకలి పుట్టడానికి:

👉అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.

👉మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.

👉నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.

👉ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.

✍️అధిక రుతుస్రావం:

👉ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.

👉ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.

✍️కడుపు ఉబ్బరం:

👉ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

👉అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.

✍️తలవెంట్రుకలు ఊడిపోకుండా...:

👉ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.

👉తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.

👉బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.

✍️దంత సమస్యలు:

👉నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.

👉వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.

👉జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

✍️కాళ్ళ పగుళ్ళు:

👉పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.

👉మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.

👉మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.

👉త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.

✍️అజీర్ణం:

👉రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.

👉ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.

👉జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

👉నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

✍️అతి బరువు (ఊబకాయం):

👉రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.

👉కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

✍️అలసట:

👉రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి. 

👉అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.

👉బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.

✍️నెలసరి నొప్పి:

👉స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.

👉టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.

👉రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.

✍️తలనొప్పి:

👉పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.

👉ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.

👉నడుం నొప్పి:👉

👉రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.

👉రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.

✍️బట్టతల:

👉సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.

👉గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.

✍️కీళ్ళ నొప్పులు:

👉నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.

👉మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.

👉ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

✍️గుండె జబ్బులు:

👉మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.

👉దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.

👉మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది.

✍️శిరోజాలు రాలుతుంటే:

👉జుట్టురాలడానికి ప్రధాన కారణం నీళ్లతో క్లోరిన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్‌ ‘ఏ’ లోపం కూడా.

👉రాత్రిపూట తలకు అరచెక్క నిమ్మరసం పట్టించి మర్నాడు తలస్నానం చేయాలి.దీనిలోని సిట్రిక్‌ ఆమ్లం శిరోజాల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

👉త్రిఫల చూర్ణాన్ని రెండు చెంచాలు తీసుకోని దానికి చెంచా చోప్పున మెంతి, ధనియాల పొడి కలిపి ఆహారంలో తీసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా పరిష్కారమౌతుంది.

✍️సైనసైటిస్ నివారణకు:

👉వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి.

👉టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.

👉250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.

👉300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.

👉మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

👉ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.

******************************

అర్థశౌచమే ఆనందం* అది ఎలాగో తెలుసుకుందాం

 *అర్థశౌచమే ఆనందం* అది ఎలాగో తెలుసుకుందాం

ప్రపంచమనే చక్రం డబ్బు అనే ఇరుసు మీదనే పరిభ్రమిస్తుంది. డబ్బు, అర్ధం, ధనం సమానార్ధక పదాలు, డబ్బు లేని బతుకు ఊహించడమూ కష్టమే అంతగా మనిషి జీవితంతో ముడివడిపోయింది అది. ధర్మ కార్యాచరణకు కామిత పురుషార్ధ అనుభవానికి సైతం అర్ధమే కారకమవుతుంది. పురుషార్థాల్లో అర్ధం రెండోది.

లోకంలో ప్రతికార్యం అర్థం చేతనే సిద్ధిస్తుంది కాబట్టి అందరూ అర్థాన్ని ఆపేక్షిస్తారు. ధనవంతుడే బలవంతుడు, గుణవంతుడు అనే దశకు అర్ధం తీసుకుని వెళుతుంది. ప్రపంచమంతటికీ ధనమే మూలమైనదనే నానుడులు అందువల్లనే పుట్టుకొచ్చాయి. డబ్బు సంపాదన కోసం సక్రమమైన పద్ధతుల్లో ప్రయత్నం చేయడమే ఉత్తమం. కానీ, అలా చేసేవారు లోకంలో తక్కువ. దాన్ని సంపాదించ డానికి అడ్డదారులు తొక్కేవారే ఎక్కువ. అది అనేక అనర్థాలకు దారి తీస్తుంది.

శుద్ధిగా ఉండటాన్ని శౌచం అంటారు. వాక్శుద్ధి, మనశృద్ధి, శరీర శుద్ధి, క్రియా శుద్ధి... వీటన్నింటినీ బాహ్యాభ్యంతర శౌచం అంటారు. సత్యం, ప్రియ, హిత వచనాల వల్ల దేవతా స్తుతుల వల్ల వాకుృద్ది కలుగుతుంది. సద్భావనల వల్ల మనశుద్ధి ఏర్పడు తుంది. పవిత్ర ప్రవర్తన వల్ల క్రియా. శుద్ధి, స్నానం ఆహార నియమాలతో.. శరీర శుద్ధి కలుగుతాయి. ఆ విధం గానే సంపాదించిన ధనం విషయం లోనూ శుభ్రత పాటించడం అవసరం.

'అర్ధశాచమే నిజమైన శౌచం' అని మనుస్మృతి చెబుతోంది. సంపాదనలో శుద్ధత ఉండాలి. అంటే న్యాయమా ర్గంలో సంపాదించినదై ఉండాలి. అక్రమంగా, అన్యాయంగా, మోసం: చేసి సంపాదించడం సముచితం కాదు. ధనానికి ఆర్జన, వినియోగం, సంచయం అని మూడు దారులున్నాయి. అంటే సంపాదించడం, ఉపయోగించడం. దాచుకోవడం అని అర్ధం. ఈ మూడు దశల్లోనూ శుద్ధత ఉండాలి. దీన్నే అర్థం అంటారు. ఎంత సంపాదించామని కాక, ఎలా సంపాదించామన్నదే ప్రధానం.
శుద్ధతను పాటించకుండా కొందరు అక్రమార్జన వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటివారు లేనిపోని ఇక్కట్లు పడతారు. అలా సంపాదించిన దాన్ని అక్రమా ర్జన అంటారు. ధనాన్ని ఎలా సంపాదించావు అనేదానిమీద దాని శుద్ధత ఆచారం.. పడి ఉంటుంది. ఆక్రమంగా ఆర్జించిన సంపాదనకు నిలకడ ఉండదు. ఫలితంగా వేదనతో కూడిన పరిస్థితులు నెలకొంటాయి. కొంతమంది అన్యాయార్జనతో ధనాన్ని పోగుచేసుకుంటూ దానిలో కొంత భాగాన్ని దేవతల పూజలకు వినియోగిస్తారు. మరికొంత దేవాలయాల్లోని హుండీలో వేసి తమ పాపాలు తొలగి పోయాయని మురిసిపోతుంటారు. కానీ, ఆక్రమార్జనను దైవానికి సమర్పిస్తే దాని దోషం చాలా బలంగా తగులుతుంది. కాబట్టి న్యాయంగా, ధర్మబద్ధంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే దైవకార్యాలకు, దానాలకు వినియోగించాలి.

ఎంత సక్రమంగా, నియమంగా, నిజాయతీగా ఆర్జించినా ఒక్కోసారి ఏదో విధంగా మనకు తెలియకుండానే చేసిన సంపాదనలో కాస్తంత అన్యాయం కలి సిపోవచ్చు. ఇది అజ్ఞాత దోషం. సంపాదనలో కొంత భాగం నిస్వార్థమైన సత్కార్యాలకు వెచ్చించడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది. కేవలం ధార్మిక సంపాదనే ఇలాంటి దోషాలను పోగొడుతుంది. అంతేకాని, ఉద్దేశ పూర్వకంగా చేసిన అక్రమాలకు వర్తించదు.

- వి.ఎస్. రాజమౌళి
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

❤️మనసులో మాట❤️

 ❤️మనసులో మాట❤️

క్షణక్షణమున అణువణువునా కరుగుతున్నా తన వెలుగును
ఈ లోనికి పంచక మానదు ద్వీపం ప్రేమ

తోలి స్పర్శతో పరవశం కలిగించి తన రూపును దోచుకుంటున్నా
కాంతి ని అడ్డుకోదు చీకటి ప్రేమ

ఎగిసిపడుతూ వచ్చి తాకి మరుక్షణంలో తనని విరహంలో
ముంచి పోయే కెరటాలను ఆపదు తీరం ప్రేమ

ఏ రూపు లేకుండా తన ఒడిని చేరి ఓ రూపు వచ్చినక
తననీ ఒంటరిని చేసి పోయే చినుకు పై ద్వేషం పెంచుకోదు నింగి ప్రేమ

బిడ్డలా ఒడినీ చేర్చుకుని సాకిన తన గుండెనే చీల్చి
ఎదుగుతున్న మొక్కను నాశనం చేయదు నేల ప్రేమ

తన ఉనికి తో తమ మనుగడను సాగిస్తున్నా
ప్రతిగా ఎటువంటి ఫలం ఇవ్వకున్నా జీవకోటిని విడిపోదు వాయువు ప్రేమ

ఇలా
తన చుట్టూ ఉన్న ప్రేమలలో ఏ ఒక్క ప్రేమనీ ఆదర్శంగా తీసుకున్న
చిరకాలం మధురస్ముతిగా నిలుస్తుంది .

" మనిషి ప్రేమ"🌟⭐❤️⭐🌟

     🌟 అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 🌟🙏

'అతి' ప్రగతికి అవరోధం

 *'అతి' ప్రగతికి అవరోధం* 

భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి అన్ని విషయాల్లో అతిగా ప్రవర్తిస్తాడు. మితిమీరిన ఆనందం, ఉత్సాహం, వాత్సల్యం, క్రోధం, కామం, లోభం, ప్రేమ- ఏదైనా అనేక అనర్థాలు తెచ్చి పెడుతుంది.

అతిగా మాట్లాడటం వాచాలత్వం అనిపించుకుంటుంది. ఈ వాచాలత్వం వల్ల పరుషమైన మాటలు బయటకు వస్తాయి. స్పష్టత, స్వచ్ఛత ఉండవు. ఔచిత్యం, సందర్భ శుద్ధి లోపిస్తాయి. ఆలోచనను, విచక్షణను ఆక్రమించిన ఆవేశం కట్టలు తెంచుకుని మనిషిని మృగం చేస్తుంది. 'అగ్ని వాక్కు నాశ్రయిస్తుంది. ఆత్మ అమృతత్వాన్ని, బ్రహ్మను ఆశ్రయిస్తుంది' అని శాస్త్రాలు చెబుతున్నాయి. సందర్భ శుద్ధి కలిగిన మితభాషి కనుకనే హనుమను 'వాక్యజ్ఞ' అన్నారు. మందర వాచాలత్వం కైక మనసులో విషబీజం నాటింది. రావణుడి అధర్మకాముకత బంగారపు లంకను భస్మీపటలం చేసింది. శకుని కుత్సిత సంభాషణ దుష్టచతుష్టయ దుర్మార్గానికి ఆజ్యం పోసింది. ధృతరాష్ట్రుడి పుత్రవాత్సర్యాతిశయం దుర్యోధనుణ్ని అహంకారాంధుణ్ని చేసింది. ఉత్తర కుమారుడి ప్రగల్భం. అతడిని చరిత్ర హీనుణ్ని చేసింది. శిశుపాలుడి వాచాలత వాసుదేవుడి చక్రఘాతానికి నశించిపోయింది. వదరుబోతుదనం వల్ల చాడీలు అసత్యం, అసభ్యత, ప్రాణహాని మానహాని అవగుణాలు బయటపడతాయి. అందుకే 'మౌనం పరం భూషణం" అన్నారు. ఈ మౌనం కూడా మితిమీరి ఉండకూడదు. మేధావి, లోకకల్యాణ ఆకాంక్షి తన ఎదుట అనర్ధాలు జరుగుతుంటే మౌనం వహించి,
నిరసించక మిన్నకుంటే ఆ ఆకృత్యాలను ప్రోత్సహించినట్లవుతుంది. శ్రమను మించిన సంపద, అర్హతను మించిన పదవి, చిత్త శుద్ధి లేని కీర్తి- అనర్ధాలకు మూలాలు. ప్రగతికి అవరోధాలు కొందరు తమ కార్యసాఫల్యం కోసం, ప్రతిఫలాపేక్షతో ఎదుటివారిని అదేపనిగా హద్దుమీరి సందర్భంతో నిమిత్తం లేకుండా పొగుడుతూనే ఉంటారు.

ఏవేవో కోర్కెలతో, మొక్కుబడులతో భగవంతుణ్ని ఆరాధించడం, అర్చించడం, అవి తీరకపోయేసరికి ఆయన్ని నిందించడం అసలైన భక్తి అనిపించుకోదు. కోర్కెలతో కొలిచే కొలువుకు విలువే ఉండదు. ఎవరైనా స్వస్థత కలిగి ఉండాలి. ఇది గ్రహించక, తమ ఆరోగ్య స్థితిగతులను లక్ష్యపెట్టకుండా విపరీతంగా ఉపవాసాలు చేసి ఎవరైనా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం వాంచనీయం కాదు. చెంతగల విత్తాన్ని చిత్తం వచ్చినట్లుగా, ఉచితానుచితాలు గమనించకుండా దానధర్మాలు చేయడమూ మంచిది కాదు. అతి అప్రమత్తత ఎంతటి ప్రమాదకరమో అతిప్రమత్తత కూడా అంతటి వినాశ హేతువే

తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా ప్రేమించి, గారాబం చేయడం ఎంత అసమంజసమో, చీటికి మాటికి దూషించి, దండించడమూ అంత అనుచితమే. ఆత్మస్తుతి, పరనింద అత్యంత హేయమైన లక్షణాలు ప్రతి విషయంలోనూ ఆత్మన్యూనతాభావం మనిషిని ఆభ్యున్నతి పథాన నడిపించలేదు. సాత్వికమైన మితాహారం ఆరోగ్యప్రదమైంది. అతినిద్రాలోలుడు సోమరితనానికి మిత్రుడు. విశ్రాంతి లేని శ్రమ అనారోగ్యకారకం. అతి వేగవంతమైన ప్రయాణం ప్రాణాంతకం. అతనిదానం కార్యవైఫల్యానికి హేతువు అతి సర్వత్ర వర్జయేత్ అన్నారందుకే.

చిమ్మపూడి శ్రీరామమూర్తి .
 సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

మన ఆరోగ్యం…! *డిప్రెషన్! (క్రుంగుబాటు)

 2211.      1-9.     270123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀108.
*మన ఆరోగ్యం…!

         *డిప్రెషన్! (క్రుంగుబాటు)*
                    ➖➖➖✍️

*డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?*

*చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం…*

*ప్రస్తుతం చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. వాటన్నింటిలో.. డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం. *

*దీని వల్ల బాధపడుతున్నవారు సైతం ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది.. ఈ డిప్రెషన్ తో బాధపడుతున్నారట.*

*ఏదైనా కోల్పోయిన సమయంలో, ఎక్కువ ఏడుస్తూ బాధపడే విషయంలో చాలా మంది ఈ డిప్రెషన్ కి గురౌతున్నారు. *

*తమకు నచ్చిన వ్యక్తి మరణించినప్పుడు.. ప్రేమలో బ్రేకప్, ఉద్యోగం పోవడం ఇలాంటి కారణాల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్ కి గురౌతున్నట్లు సర్వేలో తేలింది.*

*కాగా.. చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. *

*అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..*

*ఏదైనా అనుకోని బాధకలిగించే సంఘటన జరిగినప్పుడు మనకు దుఖం రావడం చాలా సహజం. అయితే... దానిని అనుభవించడమే బాధ. ఒక వ్యక్తి విచారంలో ఉన్నప్పుడు కూడా.. ఒక్కోసారి గతంలోని సంతోషకరమైన విషయాలు గుర్తుకు వస్తాయి. *

*వాటి వల్ల మరింత బాధ కలిగించే అవకాశం ఉంది. అయితే.. ఆ బాధ నుంచి త్వరగా బయటకు రాకుండా.. ఎక్కువ సేపు ఒంటరిగా.. విచారంగా ఉంటున్నారంటే.. వారు నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లు గుర్తించాలి.*

*ఎక్కువ విచారంగా ఉంటూ.. *

*తాము కోల్పోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ.. ఇతర ఏ పనిని పట్టించుకోకుండా ఉండటం వల్ల డిప్రెషన్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొందరికైతే సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి.  తమను తాము హానిపరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.*

 
*డిప్రెషన్ లక్షణాలు..*

*1. విచారంగా, నిరాశగా ఉండటం*

*2. చిరాకు, ఆత్రుత, రెస్ట్ మోడ్,  మూడీగా ఉండటం*

*3. ఇష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం*

*4. ఆకలి లేకపోవడం లేదా..! అతిగా తినడం*

*5. బరువు తగ్గడం లేదా పెరగడం*

*6. లైంగిక కోరిక అతిగా పెరగడం  లేదా పనితీరు తగ్గడం*

*7. చాలా నిద్రపోవడం లేదా చాలా తక్కువ నిద్రపోవడం *

*8. ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లేదా సాధారణ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సమస్య*

*9.  అసహ్యం, నిస్సహాయత , అపరాధ భావన పెరిగిపోవడం*

*10. అలసట*

*11. ఆత్మహత్య లేదా ఆత్మహత్య ఆలోచనలు*

*ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితంగా డిప్రెషన్ లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే..  మరింత ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. *✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀