Wednesday, November 30, 2022

తాపత్రయాలు

 తాపత్రయాలు

మానవుల కష్టాలను మూడు విభాగాలుగా చెప్పారు మన పూర్వులు. వానిని ‘తాపత్రయ’మంటారు. మనిషిని తపింపజేసేవి తాపములు. ఆధిభౌతికం, ఆధిదైవికం, ఆధ్యాత్మికం అన్నవే ఆ కష్టాలు. ‘ఆధి’ అంటే ‘పీడ’ అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం- ఈ పంచభూతాలు ప్రకోపించినప్పుడు ఏర్పడే విపరీతాలను తట్టుకోలేక మనిషి అల్లల్లాడిపోయే పరిస్థితి ఆధిభౌతికం. ప్రారబ్దకర్మల ఫలంగా ఆయా అధిదేవతలు మనలను పెట్టే కష్టాలు ఆధిదైవికాలు. ‘అధ్యాత్మ అంటే ఏమిటి’ అన్న అర్జునుని ప్రశ్నకు, ‘స్వభావః’ అని సమాధానం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ‘ఈ శరీరం లోపల ఉన్నదేమిటి’ అంటే ‘పరమాత్మ అంశ’ అని సమాధానం. ఈ పరమాత్మాంశను ‘పురుషుడు’ అని కూడా అంటారు. ‘పురి శరీరే శేత ఇతి పురుషః’ అంటుంది ‘అమరకోశం’. పురమనగా శరీరం. అందుండువాడు గనుక పురుషుడు. పరమాత్మ పురుషోత్తముడు కనుక పరుషోత్తమాంశను దేహంలో కలిగి ఉన్న మనమంతా పురుషోత్తములమే. పురుషోత్తమ నామానికి అనుగుణంగా మనలను మనం మలచుకోవడమే ‘ఆధ్యాత్మికత’.
భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మిక చింతన స్థూలంగా మూడురకాలు (ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం). మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులను ద్వైతాద్వైత విశిష్టాద్వైత భావనలకు మూలకందాలుగా గుర్తెరిగి, పూజిస్తున్నాం. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. తన లీలావిలాసం కోసం ప్రకృతికి వలెనే పరమాత్మ జీవుణ్ని సృజించాడు. మానవుడు బుద్ధిజీవి గనుక పరమాత్మను సేవించి, ఆయన అనుగ్రహానికి పాత్రుడై నిరంతరమూ పరమాత్మ సన్నిధిలోనే ఉండేలా చూసుకోవాలి. పాపకృత్యాల వల్ల మనిషి పరమాత్మకు దూరమవుతాడు. కనుక, సత్కర్మాచరణమే పరమావధిగా జీవించాలి. ఇది ద్వైతం. కుండగా మారినంత మాత్రాన మట్టి మట్టి కాకుండా పోతుందా! ఒకానొక రూపాన్ని ధరించినందున దాన్ని ‘కుండ’ అంటున్నాం. రూపాన్ని ధరించక ముందు అది మట్టి మాత్రమే. కుండ పగిలి ముక్కలైనాక అది ఏ మట్టి నుంచి వచ్చిందో అందులోనే కలిసిపోతుంది. ఆకాశం ఉన్నందువల్లే సమస్త జీవజాలం ఉనికికి అవకాశం ఏర్పడింది. కుండ లోపల కూడా ‘ఆకాశము’న్నందువల్లే దానిలో నీరు నింపుకొన గలుగుతున్నాం. కుండకు బయట ఒక ఆకాశం, లోపల మరొక ఆకాశం ఉన్నట్లుగా భ్రాంతి కలుగుతున్నది. కుండ పగిలిపోతే మిగిలేది రెండు ఆకాశాలు కాదు, ఒక ఆకాశమే. ఇది జీవాత్మ పరమాత్మలకు చెందిన అద్వైత భావన. మానవ దేహంలో ప్రవేశపెట్టబడిన పరమాత్మాంశ విష్ణుమాయ కారణంగా తనను తాను పరమాత్మకు భిన్నంగా భావించుకొని, తన ఇచ్ఛానుసారం వర్తించడం మొదలుపెడుతుంది. ఈ కారణంగా ఏర్పడిన సంచిత ప్రారబ్దాలను అనుభవించడమే మానవ జీవనం. సంచిత ప్రారబ్దాలను అధిగమించేందుకు మానవుడు ప్రయత్నించే విధానమే భగవదర్చనం. ఈ పద్ధతిలో సామీప్య, సాలోక్య, సారూప్యాలను సాధించిన జీవుడు చిట్టచివరకు సాయుజ్యాన్ని పొందుతాడు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోవడమే సాయుజ్యం. ఇది విశిష్టాద్వైతం.

జీవుని శరీరంలోకి ప్రవేశించిన పరమాత్మ అంశను ‘జీవాత్మ’ అంటున్నాం. పరమాత్మ జీవాత్మగా మారే సందర్భంలో ఏ దేహంలో నివాసం ఉండేందుకు తాను వెళ్తున్నాడో ఆ దేహానికి చెందిన జీవ నిర్వహణకు మాత్రమే సరిపడేంత పరిజ్ఞానానికి పరమాత్మ తనను తాను ఇష్టపూర్తిగా కుదించుకుంటాడు. అందువల్లే, జీవాత్మకు తానే పరమాత్మననే స్పృహ ఉండదు. దీన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నమే ‘యోగసాధన’. ఒకసారి అనుభవంలోకి వచ్చిన ఈ స్పృహను కోల్పోకుండా నిలుపుకోవడమే ‘పూర్ణయోగం’. ఇది సిద్ధించిన వ్యక్తి తాను చేసే ప్రతి పనినీ పరమాత్మకు వలెనే చేస్తాడు. ‘పరమాత్మను పొందేందుకు ఈ దేహాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు’ అంటూ ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలను సమన్వయం చేసిన మహర్షి శ్రీ అరవిందులు ప్రబోధించారు.

ఓం నమో నారాయణాయ
 మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.
సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?
ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం.
హిందూమత గ్రంథాలు
కానీ మన మతంపైన  అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం.  
“వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము.
కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు.
అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు.
ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది.
ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి.
హిందూమతానికి ప్రవక్తలు ఎవరు?
ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు.
కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం.
ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి.

ఇది చాలదా?

 ఇది చాలదా?
అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని...  అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అంతర్యామిని మనిషి ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు. ఒకడు సంపదను, వేరొకడు సంతతిని, మరొకడు ఉద్యోగాన్ని, ఇంకొకడు పదవిని...  అంతటితో ఆగుతాడా! ఆ కోరికలనేవి ఒకదాని తరవాత మరొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటికి అంతు ఉండదు. హద్దుండదు. అన్నీ దొరికినా, సుఖంగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడా అంటే- అదీ ఉండదు. ఇవన్నీ సమకూరాక ‘స్వామీ! నాకు సుఖశాంతులు లేవు. ఆనందం లేదు. అవి కావాలి, ప్రసాదించు!’ అని కోరుకుంటాడు పరమాత్మను. ఇది అమాయకత్వం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా?

సుఖశాంతులనేవి మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట, ఆచరించే వ్యవహారం మీద ఆధారపడి ఉంటాయి. వీటన్నింటికీ మూలం ధర్మం. ధర్మాచరణ చేసేవాడు సంతోషంగానే ఉంటాడు. సంతోషం అంటే సంతృప్తి. సమయం, మాట, ఆలోచన, ఆచరణాల విలువ తెలిసినవాడు కచ్చితంగా సంతోషంగానే ఉంటాడు.
సంతోషం ఒకచోట లేనప్పుడు, మరోచోట దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు దొరక్కపోయినా మరొకప్పుడు దొరుకుతుంది. అందుకు సంయమనం అవసరం. ఓర్పు, ఓపిక అవసరం. రాగద్వేషాలకు అతీతంగా ఉన్నవాడు ఎప్పుడూ సంతృప్తి పొందుతూనే ఉంటాడు. అక్రమంగా, అవినీతి మార్గంలో ధనార్జన చేసినవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. అటువంటివాడికి సుఖం దొరకదు. శాంతీ లభించదు.

అత్యాశాపరులు రావణుడు, దుర్యోధనుడు ఎలాంటి దుర్గతిని, అపఖ్యాతిని పొందారో విదితమే. అహంకారి హిరణ్యకశిపుడు హరిని దూషించి నరహరి చేత నిహతుడయ్యాడు. ధర్మం తప్పినవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండలేడు. భయం అనే పిశాచి అతణ్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది.

సత్త్వరజస్తమోగుణాలతో సత్త్వగుణ శోభితుడైన మనిషి సర్వదా సంతుష్టుడై ఉంటాడని గీతాచార్యుడు చెప్పాడు. సాధువర్తనుడికి భయమే ఉండదు. ఐశ్వర్యవంతుడికి సంపద పోతుందేమోనని భయం. పదవిలో ఉన్నవాడికి పదవి పోతుందేమోనన్న భయం. కీర్తి కాంక్ష కలవాడికి ఎప్పుడు అపఖ్యాతిని పొందుతానోనన్న భయం. మమకార అహంకారాలున్న వాడికే ఈ భయాలు. ‘ఎదురుదెబ్బలు తగిలినా, సాధించాలనుకున్నది సాధించి సఫలీకృతుడయ్యేవాడే సంతోషానికి అర్హుడు’ అంటాడు చాణక్యుడు. సంతుష్టిని, ఆనందాన్ని బయటి నుంచి పొందాలనుకునేవాడు లౌకికుడు. ఆ ఆనందాన్ని తనలోనే అన్వేషించుకోగలిగేవాడు ఆత్మజ్ఞాని. ఇంకా ఏదేదో కావాలనుకుంటూ తపిస్తూ, అశాంతిగా సంక్షోభంలో సంఘర్షణలో కొట్టుమిట్టాడేవాడు ఎన్నటికీ సంతృప్తి పొందలేడు. ‘కలిసి పంచుకుందాం... కలిసి భుజిద్దాం, కలిసి నడుద్దాం’ అన్న ఉపనిషత్‌ వాక్యం సంతోష మార్గానికి సరైన దిక్సూచి. ‘తృప్తి కలిగితే సుఖం, తృప్తి తొలగితే దుఃఖం. తృష్ణ పెరిగితే దుఃఖం, తృష్ణ తగ్గితే సుఖం’ అన్నది మనుస్మృతి.

మునులు, యోగులు, అవధూతలు మనకు తమ కృతుల ద్వారా అమూల్యమైన జ్ఞాన భాండాగారం అందించారు. జిజ్ఞాస ఉండాలే కాని, వాటిని అధ్యయనం చేస్తే సచ్ఛీలురైన పౌరులం కాగలం. ఇది చాలదా? పరమాత్మ పంచభూతాత్మకమైన సృష్టిని ప్రసాదించాడు. సద్వినియోగపరచుకుంటున్నామా? అపూర్వ ఆవిష్కరణలు చేయగల మేధావులకు ఈ తపో భూమి మీద పుట్టుకనిచ్చాడు... లోక శ్రేయస్సు కోసం. ఇది చాలదా? ఇతర ప్రాణికోటికి లేని మనసు, మేధ ఇచ్చాడు... జగతి ప్రగతికోసం! ఇది చాలదా? ‘చాలదా హరి నామ సౌఖ్యామృతము మనకు’ అని ఏనాడో అన్నమయ్య భక్త కోటిని ప్రశ్నించి, హెచ్చరించాడు. వేటినీ సద్వినియోగపరచుకోలేక, అన్నీ వ్యాపారాత్మకం చేసి స్వార్థానికి వాడుకుంటున్నాం. మనకు యోగ్యత ఉంటే దైవకృప ఏదైనా చేతికందిస్తుంది. యోగ్యత లేకపోతే ఎంత వాపోయినా ఫలితం దక్కదు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ప్రారబ్ధానుభవం తప్పేది కాదు

 ప్రారబ్ధానుభవం తప్పేది కాదు

ఈ సృష్టిలో గల 84 లక్షల జీవరాశులలో భగవంతుడు మానవుని అగ్రభాగాన ఉంచాడు. ఏ ఇతర ప్రాణికీ లేనన్ని శక్తియుక్తులను, తెలివితేటలను ఇచ్చాడు. ప్రకృతిని అర్థం చేసుకోవడమేగాక.. కొంతవరకూ తన నియంత్రణలో ఉంచుకోగల్గిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ‘నీ ఇష్టానుసారం జీవితాన్ని గడపవచ్చు’ అంటూనే ఒక కఠినమైన, దాటలేని గీటు గీశాడు. ఏమిటా గీత అంటే.. కర్మ ఫలం. ‘‘నీవు మంచి చెయ్యి, చెడు చెయ్యి, అది నీ ఇష్టం. కానీ.. ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని గ్రహించడానికి నీకు విచక్షణ జ్ఞానం ఇస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకో. మంచి పని చేస్తే మంచి ఫలితం. చెడ్డ పని చేస్తే చెడ్డఫలితం’’ అని దైవశాసనం. ఒక్క మనిషికే ఈ నియమం. పశు పక్ష్యాదులకు, మృగాలకు, కీటక జాతులకు ఈ నియమం వర్తించదు. విచక్షణ జ్ఞానం సంతరించుకోని చిన్న పిల్లలకు కూడా ఈ నియమం వర్తించదంటారు ధర్మవేత్తలు.

ఉదాహరణకు ఒక ఆవును స్వేచ్ఛగా వదిలేస్తే తనకు ఇష్టమైన చోట, అనుకూలంగా ఉన్న చోట మేత మేస్తుంది. ‘ఇక్కడ మేయవచ్చా, ఇది నా యజమానిదా, పరాయి వారిదా’.. ఇవేవీ దానికి తెలియవు. ఇతరుల పంటపొలాలలో పడి తింటే దానికి స్వేచ్ఛనిచ్చిన యజమానిదే తప్పవుతుంది గానీ, పైరును మేసిన పశువుదిగాదు. అలాగే.. వేటాడి, ఇతర జంతువులను వధించి కడుపు నింపుకోవడం మృగజాతి లక్షణం. కనుక వాటికి పాప పుణ్యాల ఫలితాలు వర్తించవు. ‘పని’కి కర్మ అనే పేరుంది. పని చేయడమంటే కర్మ చేయడమని అర్థం. అందుకే.. పని ఫలితం అనకుండా ‘కర్మ ఫలం’ అంటున్నాం. మనం ఏ కర్మ చేసినా అంతే మోతాదులో కర్మ ఫలం అనుభవించవలసి ఉంటుంది. ఒక రకంగా ఆధునిక సాంకేతిక శాస్త్ర సూత్రాలు కూడా ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తున్నాయి. భౌతిక శాస్త్రంలో న్యూటన్‌ సూత్రాలు మూడు ఉంటాయి. వాటిలో.. ‘మనం చేసే ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది’ అనే సూత్రం కర్మఫలానికి అతికినట్టు సరిపోతుంది. కర్మసిద్ధాంతంలో దీనినే మన పెద్దలు ‘ప్రారబ్ధం’ అని చెబుతారు.

సైన్స్‌లో.. చర్యకు ప్రతిచర్య వెంటనే ఉంటుంది. కానీ, కర్మ సిద్ధాంతంలో మనం చేసే కర్మ తాలూకూ ఫలితం వెంటనే అనుభవంలోకి రావచ్చు. లేదా కొంతకాలానికి రావచ్చు. లేదా మరు జన్మలో, ఆపై జన్మలోనైనా అనుభవానికి రావచ్చు. అనుభవించడం మాత్రం తథ్యం. అది ఎప్పుడు ఎట్లా అనేది దైవ నిర్ణయం. 

‘జనని గర్భము నుండి జనియించినప్పుడు.. కంఠమాలలేవి కానరావు..
మంచి ముత్యపుసరుల్‌ మచ్చుకైననులేవు- మేల్మి బంగరు దండలు మెడకులేవు కాని,
కలదొకమాల మీ కంఠమందు,
అదియే మీ కర్మలన్నియు చేర్చిన కంఠమాల - ప్రారబ్ధమనియెడి చద్దిమూట’

అంటారు పెద్దలు. మన ప్రయాణం ఆరంభించినపుడు మధ్యలో తినడానికి ఎలాంటి పదార్థాలను మూట కట్టుకున్నామో.. ప్రయాణంలో అవే తినాలి కదా! వేరే పదార్థాలు ఎట్లావస్తాయి. ప్రారబ్ధమూ అంతే. అనుభవించక తప్పదు. కాబట్టి, ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఆ మంచి ఫలితాన్ని కూడా తీసుకోకుండా దేవుడికి అర్పిస్తే.. పాప, పుణ్యాలు లేక, మరుజన్మ ఎత్తే బాధ తప్పుతుంది. అదే మోక్షం.

ఓం నమో నారాయణాయ
 ప్రశ్న : కర్మలు ఎక్కడనుండి వస్తాయి?

జవాబు : కామ, క్రోధ, మోహ, మద, లోభ, మాత్సర్యాలనే "అరిషడ్వర్గాల" నుండి...

ప్రశ్న : ఇవి ఎక్కడ నుండి వస్తాయి ?

జవాబు : ఆలోచన, సఙ్కల్పము, స్పందన, ఆశ, భయము, ఆనందముల నుండి...

ప్రశ్న : ఇవి మరల ఎక్డ నుండి వస్తున్నాయి?

జవాబు : సత్వరజస్తమో గుణాల నుండి ( సత్వ గుణము, రజో గుణము, తమో గుణములు)

ప్రశ్న : ఈ సత్వరజస్తమో గుణాలెచట నుండి వస్తాయి?

జవాబు : ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తుల నుండి వస్తాయి.

ప్రశ్న : ఇవి ఎచట నుండి వస్తాయి ?

జవాబు : మనస్సు, బుద్ధి, అహంకారము నుండి...

ప్రశ్న : ఇవి ఎచట నుండి ఉత్పన్నమౌతాయి ?

జవాబు : ప్రాణ శక్తి నుండి...

ప్రశ్న : ప్రాణము ఎలా సృష్టింపబడుతుంది? ఎలా పోషింపబడుతుంది?

జవాబు : ఆహారము నుండి. సాత్వికాహారము భుజిస్తే మనస్సు సత్వ గుణాన్ని, రజో గుణాహారం తీసుకుంటే మనస్సు రజో గుణాన్ని, తమోగుణాహారం తీసుకుంటే మనస్సు తమో గుణాన్ని కలిగియుంటుంది.

అంటే తినే ఆహారాన్ని బట్టి మనస్సు ఉంటుంది, మన కోరికలుంటాయి, మన ఆలోచనా విధానముంటుంది, మనస్సును బట్టి గుణాలుంటాయి, వీటిని బట్టి మన భావాలుంటాయి. వీటిని బట్టి మన కర్మలుంటాయి, మన జన్మ పరంపర ఉంటుంది.

సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?

 💖💖💖
       💖💖 *"393"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"*

*"సత్యం వాక్కుకు, మనసుకి అందనిది. ఒక శాస్త్రవేత్త చాలాకాలం పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటాడు. కొత్త విషయం ఎక్కడి నుండో వచ్చి పడలేదు. అది మనసులో నుంచే ఉద్భవించింది. తన మనసులో నుండే వచ్చింది కాబట్టి అది అంతకుముందే వచ్చి ఉండవచ్చు కదా ! కానీ అది అలా జరగదు. సత్యం తనంతట తానుగా స్ఫురించే వరకు మనం వేచి ఉండాల్సిందే. శాస్త్రవేత్తకు సైన్స్ పరంగా తనలోనే ఒక నూతన అంశం ఎలా ఆవిష్కరించబడిందో, ఒక సాధకుడు పొందాలనుకునే భగవదానుభవం కూడా ఏదో ఒకరోజు తనలోనే ఆవిష్కరించబడుతుంది. శాస్త్రవేత్త అయినా, సాధకుడైనా సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఫలితం దానంతట అదిగా వ్యక్తమవుతుంది. అంతేగాని ఏ సాధనలోనైనా ఫలితం మనసుకి వాక్కుకి ముందుగానే గోచరించేది కాదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

శివపురాణం: అరుణాచలేశ్వరుడు

 *శివపురాణం* -20 వ  భాగం ప్రారంభం... 

అరుణాచలేశ్వరుడు :

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

*శివపురాణం* -20 వ  భాగం:(B) 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు లేఖ 87 (87) దైవబలం

 శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు

లేఖ 87

(87) దైవబలం

2వ ఫిబ్రవరి, 1947

నేను ఈ మధ్యాహ్నం 2-30 గంటలకు హాల్‌కి వెళ్లాను. భగవాన్ అప్పటికే అక్కడ ఉన్నాడు, ఎవరో తనకిచ్చిన కాగితం చదువుతున్నాడు. భగవాన్ ఏం చెబుతాడో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. భగవాన్ చిరునవ్వుతో కాగితాన్ని మడిచి ఇలా అన్నాడు, “ భగవాన్‌కు తనకు తేడా ఉందని ఎవరైనా అనుకుంటే ఇదంతా జరుగుతుంది. అలాంటి తేడా ఏమీ లేదు అనుకుంటే ఇదంతా జరగదు. ”

భగవాన్ కి మనకి తేడా లేదని చెబితే సరిపోతుందా? భగవంతునికి భేదం లేదని భావించే ముందు తానెవరో, తన మూలం ఏమిటో విచారించాల్సిన అవసరం లేదా? భగవాన్ ఎందుకు ఇలా అంటున్నాడు? భగవాన్ మనల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నాడని అడగాలని నేను ఆలోచిస్తున్నాను, కానీ అలా చేయడానికి తగినంత ధైర్యాన్ని సేకరించలేకపోయాను. భగవాన్ నా ఈ అపోహను పసిగట్టాడో లేదో నాకు తెలియదు; కానీ ఏమైనప్పటికీ, అతను మళ్ళీ ఈ క్రింది విధంగా మాట్లాడటం ప్రారంభించాడు:

“భగవాన్ మరియు భగవాన్ మధ్య ఎటువంటి భేదం లేదని గ్రహించే ముందు, మొదట అతనికి లేని అవాస్తవ గుణాలన్నిటినీ విస్మరించాలి. ఈ గుణాలన్నిటినీ విస్మరిస్తే తప్ప సత్యాన్ని గ్రహించలేరు. అన్ని విషయాలకు మూలమైన దైవిక శక్తి (చైతన్య శక్తి) ఉంది. ఆ శక్తిని మనం పట్టుకోని పక్షంలో ఈ ఇతర లక్షణాలన్నీ విస్మరించబడవు. ఆ శక్తిని పట్టుకోవడానికి సాధన అవసరం."
ఆ మాటలు వినగానే నాకు ధైర్యం వచ్చి, తెలియకుండానే, “అందుకేమైనా శక్తి ఉందా?” అన్నాను. "అవును," భగవాన్ జవాబిచ్చాడు, "ఒక శక్తి ఉంది. ఆ శక్తినే స్వస్ఫురణ (ఆత్మ స్పృహ) అని అంటారు. నేను వణుకుతున్న స్వరంతో అన్నాను, “భగవాన్ మనకు భగవంతునికి తేడా లేదని అనుకుంటే చాలు అని క్యాజువల్‌గా చెప్పాడు. కానీ మనం ఆ శక్తిని పట్టుకోగలిగితే మాత్రమే ఈ అవాస్తవ లక్షణాలను విస్మరించగలము. అది దైవిక శక్తిగా లేదా స్వీయ చైతన్యంగా ఉండనివ్వండి. ఏది ఏమైనా అది మనకు తెలియదా? మనం ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతున్నాం.

భగవాన్ కళ్ళు కూడా తడిగా మారాయని నా పక్కన కూర్చున్న ఒక మహిళ చెప్పింది.

ఇంతకు ముందెన్నడూ నేను భగవాన్‌ని ఇతరుల సమక్షంలో ఇంత ధైర్యంగా ప్రశ్నలు అడగలేదు. ఈరోజు, అంతరంగంలో ఆవేశం ఎంతగా ఉందంటే, ఆ సంభాషణలో నా నోటి నుండి మాటలు రావడం, కళ్లలో నీళ్ళు నిండిపోవడంతో, గోడవైపు మొహం తిప్పుకున్నాను. భగవాన్ కళ్ళు కూడా తడిగా మారాయని నా పక్కన కూర్చున్న ఒక మహిళ చెప్పింది. వినయస్థుల పట్ల ఆయన ఎంత సున్నిత హృదయం!

భగవాన్ అప్పుడప్పుడు ఇలా అంటుంటాడు, “జ్ఞాని ఏడుపుతో ఏడుస్తాడు, నవ్వుతూ నవ్వుతాడు, సరదాతో ఆడుకుంటాడు, పాడేవారితో పాడతాడు, పాటకు సమయం కేటాయించాడు. అతను ఏమి కోల్పోతాడు? అతని ఉనికి స్వచ్ఛమైన, పారదర్శకమైన అద్దం లాంటిది. ఇది మన చిత్రాన్ని సరిగ్గా ప్రతిబింబిస్తుంది. జీవితంలో అనేక పాత్రలను పోషించేది మరియు మన చర్యల ఫలాలను పొందేది మనమే. అద్దం లేదా అది అమర్చబడిన స్టాండ్ ఎలా ప్రభావితమవుతుంది? ఏదీ వారిని ప్రభావితం చేయదు, ఎందుకంటే అవి కేవలం మద్దతు మాత్రమే. ఈ లోకంలోని నటులు --- అన్ని కర్మలు చేసేవారు --- లోకకల్యాణం కోసం ఏ పాట మరియు ఏది చర్య, శాస్త్రాల ప్రకారం ఏది, ఏది ఆచరణీయమో స్వయంగా నిర్ణయించుకోవాలి. అని భగవాన్ చెప్పేవాడు. ఇది ఆచరణాత్మక దృష్టాంతం.

--కాళిదాసు దుర్గా ప్రసాద్. 

అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు"అమ్మని అమ్మాళ్/అమ్మని అమ్మన్"

 అరుణాచలేశ్వరుని ఉత్తర గోపురం పూర్తి చేసిన కారణ జన్మురాలు"అమ్మని అమ్మాళ్/అమ్మని అమ్మన్"


తల్లిదండ్రులు; గోపాల పిళ్ళై,అలు అమ్మాళ్
సోదరుడు: తాండవ పిళ్ళై
జన్మస్థలం: చెన్న సముద్రం గ్రామం,చెంగమ్ దగ్గర ,తమిళనాడు

అమ్మని జీవిత విశేషాలు
అమ్మని కి తమ తల్లిదండ్రులు పెళ్ళి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ఆమె ఇల్లు వదిలి అదేవూర్లో ఒక కొలను దగ్గర కూర్చుని ఉండి పోతుంది అప్పుడు అమ్మని స్వయంగా తన పూర్వ జన్మ వివరాలు తెలిపింది "పూర్వం తాను శివలోకంలో ఉన్న పరాశక్తి ని అని పరమేశ్వరుని పట్ల తాను చేసిన అపరాధం కారణం గా ఈ మానవ జన్మ ఎత్తినట్లు తెలిపింది ముందు జన్మలో అదే చెన్న సముద్రంలో "చెన్నమ్మ"అనే పేరుతో జన్మించి తనను కామించిన తురక రాజు నుండి  వెల్లియప్ప సిద్దార్ అను వారి సహాయంతో సప్త మాతృకలు రక్షణలో ఉన్న గుహ లోకి ప్రవేశించి జన్మ సమాప్తి గావించింది

రెండవ జన్మలో; అమ్మని అమ్మాళ్ గా జన్మించిన తాను అరుణాచలేశ్వరుని క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన శ్రీ వల్లాల మహారాజు గారి ద్వారా ప్రారంభం చేయబడి అసంపూర్తిగా ఉన్న ఉత్తర రాజ గోపురాన్ని పూర్తి చేయడమే తన కర్తవ్యంగా భావించి అరుణాచలం వచ్చి జోలి పట్టి యాచించి ఉత్తర గోవురాన్ని పూర్తి చేసింది
గోపురం చివరి దశలో పైకం లేనప్పుడు సర్వేశ్వరుడు ఆమెకు విభూతిని మంత్రించి ఇవ్వు అదే వారికి పైకంగా మారి పని పూర్తి అవుతుంది అని స్వప్నం లో అదేశమిస్తారు అలా ఈశ్వర ప్రేరణ అనుగ్రహం తో గోవురాన్ని పూర్తి చేసింది అమ్మని ,తనకు సహాయం చేసేందుకు ముందుకు రాని వారి వద్ద ఎంత డబ్బు ఉందొ చెప్పి వారికి కళ్ళు తెరిపించేది అమ్మని 
అలా ఉత్తర రాజగోపురం ఇప్పుడు "అమ్మని అమ్మాళ్"గోపురం గా పిలువబడుతు ఉంది 
అమ్మని ఈ కార్యం పూర్తి అయ్యాక జీవ సమాధి ప్రవేశం చేసింది 
ఈ తల్లి అధిష్టాన మందిరం ఈశాన్య లింగం దగ్గర ,ఈశాన్య దేశికుల మఠం పక్కనే ఉంటుంది
అరుణాచలం వెళ్లేవారు తప్పకుండా దర్శించుకోగలరు.

అరుణాచల శివ శివ
అరుణాచల శివ 🌹

మారిస్ ఫ్రిడ్మన్

 మారిస్ ఫ్రిడ్మన్


అరుణాచల రమణుణ్ణి ప్రప్రథమంలో గుర్తించి తమ ఇంగ్లీష్ పుస్తకాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో పాల్ బ్రంటన్, మారిస్ ఫ్రిడ్మన్లను ప్రధానంగా పేర్కొన్నవచ్చు. వృత్తిపరంగా ఫ్రిడ్మన్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్ అయినప్పటికీ, చిన్నప్పటినుండీ అతడిలో ఉన్న ఆధ్యాత్మిక అభిలాష, తపన, అతణ్ణి ఒక మహా అన్వేషకుడిగా రూపొందించాయి.

తాను జన్మించిన యూదు మతంతో కొన్నాళ్ళు తంటాలు పడి చూచాడు కానీ, 'ఇది చేయద్దు, అది చేయద్దు, నన్నసుసరించు, నేదోవ చూపిస్తాను' అనే పద్ధతి మీద అతడికి విసుగెత్తింది. అసలీ ఆధ్యాత్మికత, ఈ అన్వేషణ అంటే ఏమిటో, స్వేచ్ఛగా, సంతోషంగా, జిజ్ఞాసాపూర్వకంగా కనుగొనాలని నిశ్చయించు కున్నాడు.

యూరప్లో సంచరిస్తున్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తిని కలవ నారంభించాడు. సుమారు ఒక అర్థ శతాబ్దంపాటు కృష్ణమూర్తితో సన్నిహితంగా ఉన్నాడు. అసలు కథ ఎప్పుడు ప్రారంభమయిందంటే 1935లో మైసూరు సంస్థాన దివాన్ సర్ మీర్జా ఇసేయిల్ తన యూరప్ పర్యటన సమయంలో ఫ్రాన్స్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న ఈ ప్రజ్ఞాశాలియైన ఫ్రిడ్మన్ ను కలిశాడు. భారతదేశానికి వచ్చి తమ సంస్థానాభివృద్ధికి కృషిచేయమని కోరాడు.

వేదాంతం, ఉపనిషత్తుల మీద అప్పటికే అభిమానం పెంచుకున్న యువ ఫ్రిడ్మన్ అడిగిందే తడవుగా బయలుదేరి భారతదేశం వచ్చాడు. వచ్చిన రెండేళ్ళ లోగానే బెంగుళూరు లోని ప్రభుత్వ విద్యుచ్ఛక్తి పరికరాల ఉత్పత్తి ఫ్యాక్టరీలో సంస్థానానికి సరిపడేటన్ని స్విచ్ గీర్లు, ఇన్సులేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు చకచకా తయారు చేయించాడు.

ఇంజనీర్ ఫ్రిడ్మన్ కు ఇదంతా ఒక ఎత్తు అన్వేషకుడైన ఫ్రిడ్మన్ కు తన ట్రాన్స్ఫర్మేషన్' ఎలా అనేదే ప్రధాన సమస్య. భారతదేశానికి వచ్చిన ఆరు నెలలలోగానే అరుణాచల రమణుణ్ణి సందర్శించి ఆయన బోధను స్వీకరించ నారంభించాడు. తనకు సన్యాసమిప్పించ మని రమణుణ్ణి వేడుకున్నాడు.

'అయ్యా, నీకివ్వడానికి నావద్ద సన్యాసి దుకూలాలేవీ లేవు. అదీగాక, నీ వంటి వాడికి, వాటి అవసరమూ లేదు' అన్నాడు శ్రీ రమణుడు. కానీ సన్యాసం మీద ఫ్రిడ్మన్ మనస్సు ఎంతగా లగ్నమైందంటే, కర్ణాటక లోని కన్గన్హాడ్లో ఆనందాశ్రమాన్ని నడుపుతున్న స్వామీ రాందాస్ అనే మహనీయుడి వద్దకు వెళ్ళి ఆయన వద్ద సన్యాస దీక్ష పుచ్చుకున్నాడు.

శిరోముండన, పాశ్చాత్యవేష విసర్జన, స్వామి భరతానంద అనే నూతన నామధారణ మొదలైన వన్నీ జరిగిపోయినై. భిక్షమెత్తుకుంటానని ప్రతిజ్ఞచేసి, అందుకుగాను ఆఖరికి ఒక భిక్షాపాత్ర కూడా కొనుక్కొన్నాడు.

కానీ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ రమణుల సాన్నిహిత్యం కారణాన, ఈ పైపై వేషాలు అనవసరం అనే విషయం మెల్లగా గ్రహించాడు - 1947 నాటికి ఈ వేషధారణ వదిలేశాడు. ఆత్మాన్వేషణ మాత్రం నిరాఘాటంగా సాగిపోతూనే ఉండేది.

మారిస్ ఫ్రిడ్మన్, మనిషి ఎటువంటివాడో తెలుసుకుంటే, అతడి మానసిక సన్యాస మెటువంటిదో తెలుస్తుంది. బెంగుళూరు ఫ్యాక్టరీ మేనేజరుగా పనిచేస్తున్న రోజుల్లో ఫ్రిడ్మన్ నెల జీతం మూడువేల రూపాయలు. ఆనాడు ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నలభై, యాభై రూపాయల్లో సంసారం సుఖంగానే ఈదేవారంటే, మూడువేల జీతమెంతటిదో ఊహించుకోవచ్చు.

అసాధారణ ప్రజ్ఞావంతుడైన తనవిదేశీ ఇంజనీర్ సన్యాసం స్వీకరించి కాషాయాంబ రాల్లో కార్ఖానాకు వస్తున్నాడని, శిరోజాలు లేని శిరస్సుతో తిరుగుతున్నాడని, తనకు జీతంగా వచ్చే మూడువేల రూపాయలు దానధర్మాలకు వినియోగించి, తాను భిక్షాటన ద్వారా పొట్టపోసు కుంటున్నాడని తెలిసేసరికి, సర్ మీర్జాకు పట్టరాని ఆగ్రహ మొచ్చింది.

'నేను, ఫ్యాక్టరీలో పనిజేయడానికి ఒక ఇంజనీరిని నియమించాను కానీ, సన్యాసిని కాదు. ముందు ఆ వేషం తీసెయ్' అన్నాడు సర్ మీర్జా. నేనిక్కడ వృత్తిపరంగా చేయవలసిన పని అంతా శ్రద్ధగా చేస్తున్నాను. నేను ఏ వేషంలో ఉంటే మీకేమి సంబంధం? కాదు గూడదంటే, ఇదిగో తీసుకోండి రాజీనామా పత్రం' అన్నాడు మారిస్.

ఆ తర్వాత ఇద్దరికీ కాస్త కోపం దిగి వచ్చింది. ఫ్యాక్టరీకి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు సూట్ ధరించేటట్లు, అలాంటి అవసరం లేపప్పుడు మారిస్ తన సన్యాసి వలువలు వేసుకునే వీలు కల్పిస్తూ, ఒక అంగీకారం కుదిరింది.

ఔండ్ (Oundh) అనే ఒక చిన్న సంస్థానంలో గైనకాలజిస్టు సర్జన్ గా పనిచేస్తున్న నళిని అనే తన మిత్రుడి భార్య ఒకసారి బొంబాయిలో మారిస్తు కలిసినప్పుడు 'ఆ సంస్థాన కోశాగారంలో తగినంత డబ్బులేదు. అక్కడ పేదరాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన కనీస పనిముట్లు కూడా లేకపోతే నేనేమి చేయగలను?' అని తన విచారం వ్యక్తం చేసింది. 'ఎంత కావాలిసుంటుంది? అని అడిగాడు మారిస్. 'ఓపదివేల రూపాయలు అవసరముంటుంది' అన్నది నళిని. ఇంతకుముందే మనం అనుకున్నట్లు, పదివేలు అంటే, సామాన్యుడికి ఓ జీవిత కాలానికి సరిపడే మొత్తంగా భావించవచ్చు.

మర్నాడు ఉదయం మారిస్ నళిని వద్దకు నూరు రూపాయల నోట్ల రూపంలో పదివేలు పట్టుకు వచ్చాడు. 'పని ప్రారంభం చేయమ్మా” అన్నాడు. తన వద్ద ఎంత ఉంటే అంతా నిస్సంకోచంగా ఇచ్చేశాడు మారిస్. కరుణతో నిండిన అతడి హృదయ మటువంటిది. జీవితం చరమ దశలో ఈ మహానుభావుడు మరొక మహనీయుణ్ణి తారసిల్లాడు. బొంబాయి నగరంలోని ఒక చిన్న సందులో ఒక సామాన్య గృహంలో నివసించే "నిసర్గదత్త మహరాజ్" అనే మహారాష్ట్ర ఆధ్యాత్మికుడితో మారిస్కు పరిచయమేర్పడింది. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి, వంటి అధ్యాత్మిక సమ్రాట్టుల బోధను అవగాహన చేసుకున్న మారిసు నిసర్గదత్త మహరాజ్ బోధలోని విశిష్టతను గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు.

ఇక అంతే వీలైనప్పుడల్లా ఆయన వద్దకు వెళ్ళి కూచునేవాడు. మారిస్కు అనేక భాషలు వచ్చు. మరాఠీ కూడా నేర్చాడు. నిసర్గదత్తుని వద్దకు అనేకమంది జిజ్ఞాసువులు, సాధకులూ వచ్చి పోతూంటేవారు ఆయన బోధ యావత్తూ వీరితో జరిపే సంభాషణల ద్వారానే సాగిపోతూండేది.

నిసర్గదత్తుడొక సామాన్య గృహస్థు. ఇంట్లో వాళ్ళు అలవాటు ప్రకారం మాంసం వండితే కొద్దిగా తానూ తినేవాడు. బీడీలు కాలుస్తుండేవాడు. అందువల్లనే పదిమందీ అతణ్ణి "బీడీ బాబా" అని కూడా వ్యవహ రిస్తుండేవారు. కానీ కొల్లాయి గట్టితే నేమీ' అని కవివర్యుడు గాంధీజీని గురించి రాసినట్లు, నిసర్గుడు శాకాహారి కాకపోతేనేమి, పొగ తాగితేనేమి, హృదయాంతరాళాల్లో నుండి పుట్టుకొచ్చిన అతడి అనుభవ జ్ఞానం మాత్రం సనాతన, అధునాతన బోధకు ఏ విధంగానూ తీసిపోదు.

నిసర్గుని బోధ ఒక విధంగా 'అమృతధార' అనవచ్చు; మరోవిధంగా 'ఖడ్గధార' అని కూడా అనవచ్చు.
ఆ బోధ అతి నిశితమైనది, నిజంగా అర్థమయితే, అర క్షణంలో అహాన్ని విస్ఫోటన చెందించగలిగేటంత శక్తివంతమైనది.

ఒకప్పుడు కృష్ణమూర్తి రమణ బోధామృతాలను
గ్రోలి ప్రపంచానికి వాటిని పంచి పెట్టిన మారిసు మహనీయుడు తన చివరి కర్తవ్యంగా ఈ నిసర్గుని బోధను మరాఠీ నుండి ఆంగ్లంలోకి అనువదించి, లోకానికి తన చివరి కానుకగా సమర్పించు కున్నాడేమో ననిపిస్తుంది.

ఈ పుణ్య పురుషులిద్దరూ బొంబాయిలో తారసిల్లడం, నిసర్గదత్తుని వద్దకు రాకముందే జిడ్డు కృష్ణమూర్తి, అరుణాచల రమణుల సాంగత్య కారణాన ఆధ్యాత్మిక విద్యలో మారిస్ సుశిక్షితు డవ్వడం, నిసర్గుని మాటల్ని అమిత ఖచ్చితంగా, నిర్దుష్టంగా ఆంగ్లంలోకి సాధికారంగా అనువదించడం మన అదృష్టం. 'ఐ యామ్ దట్' అనే పేరుతో మారిస్ ఫ్రిడ్ మన్ ప్రచురించిన గ్రంథం పాశ్చాత్య దేశాల్లో ఎంత సంచలనం సృష్టించిందంటే, బ్రిటన్ లోని కొందరు యువకులు లండన్లో ప్లేన్ ఎక్కి నేరుగా బొంబాయి వచ్చి ప్లేన్ దిగి నిసర్గుని వద్దకొచ్చి ఓ వారం రోజులపాటు సంభాషణల్లో పాల్గొని, మళ్ళీ ప్లేన్ఎక్కి నేరుగా లండన్ వెళ్ళిపోతూండేవారు.

తన బోధను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారిలో ఫ్రిడ్మన్ ను ప్రథమంగా పేర్కొంటుండేవాడు నిసర్గదత్త మహరాజ్. అంతేకాక ఫ్రిడ్మన్ ఆధ్యాత్మిక హృదయాన్ని ఎంత లోతుగా చూశాడో ఏమో కానీ, ఫ్రిడ్మన్ మరణాంతరం, అతడి ఫోటోను మిగతా సంతులు, దేవతల ఫోటోల సరసన ఉంచి పూలు కుంకుమలతో అర్చిస్తూండేవాడు మహరాజ్. 

భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాము..

 [11/30, 03:24] +91 73963 92086: Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 51,వ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాము...🌹🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇపుడు భరద్వాజ మహర్షిని గురించి తెలుసుకుందాం . సప్తఋషులంటూంటారు విన్నారు కదా ! వాళ్ళల్లో ఒకడు మనం తెలుసుకోబోయే భరద్వాజ మహర్షి .

🌸ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు ' భరద్వాజ తీర్థ ' బృహస్పతి తన అన్నగారైన ఉతథ్యుడింటికి వచ్చాడు . బృహస్పతికి శాపం ఉండటం వల్ల వదిన గారైన మమతని ఇష్టపడ్డాడు .

🌿మమత తప్పని చెప్పినా వినిపించుకోలేదు . మరి శాపప్రభావం కదా ! వీళ్ళిద్దరికీ పుట్టినవాడు ' భరధ్వాజుడు ' మమత నాకిష్టం లేదు కాబట్టి ఈ పిల్లాడ్ని నేను పెంచనంది .

🌸బృహస్పతి నువ్వే పెంచమని మమతకి చెప్పి వెళ్ళిపోయాడు . మరుత్తులు ఆ పిల్లాణ్ణి పెంచుతున్నారు . దుష్యంత మహారాజు కొడుకు భరతుడు చక్రవర్తి వందలకొద్ది అశ్వమేధయాగాలు చేసినా పిల్లలు లేక బాధపడుతున్నాడు .

🌿మరుత్ స్తోకియం అనే యాగం చేశాడు భరతుడు . మరుత్తులు భరద్వాజుణ్ణి భరతుడికి అప్పగించారు . మమత బృహస్పతులు ఇద్దరితో వదిలివేయబడి భరతుడు పెంచినవాడు కాబట్టి భరద్వాజడని పేరు . 

🌸' భరద్వాజుడు ' మహాతపస్వి కదా ! తండ్రి భరతుడితో యజ్ఞాలు చేయించడం వల్ల నలుగురు కొడుకులు కలిగారు . కొంతకాలం తర్వాత భరద్వాజుడు కూడ పెళ్ళి చేసుకున్నాడు . 

🌿కూతురు దేవకర్ణి , కొడుకు మనువు అనే ఇద్దరు పిల్లల్ని పొందాడు . భరద్వాజుడు కొంతకాలం తర్వాత భరతుడి దగ్గర నుంచి గంగాతీరం వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకుంటూ వున్నాడు . 

🌸గంగానదిలో స్నానం చేస్తూ ఒక అప్సరసని చూశాడు . ఆమె వల్ల భరద్వాజుడికి ద్రోణుడనే కొడుకు కలిగాడు . ద్రోణుడు , వృషతుడనే రాజు కొడుకు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు . 

🌿ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు . ద్రోణుడికి వేదవిద్యలు , విలువిద్యలు నేర్పించి ' కృషి ' అనే అమ్మాయినిచ్చి పెళ్ళి చేశాడు భరద్వాజుడు . 

🌸ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు . ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది . భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి అనేక విషయాలు తెలుసుకున్నాడు .

🌿భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు .

🌸ఒకనాడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెడుతూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చాడు . మహర్షి శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిగా గుర్తుచేసి మర్నాడు ఉదయాన్నే బయలుదారి చిత్రకూటానికి వెళ్ళమన్నాడు .

🌿శ్రీరాముడు అరణ్యవాసం అయిపోయాక మహర్షి ఆశ్రమానికి వచ్చి తిరిగి అయోధ్య వెడుతున్నట్లు చెప్పాడు . నువ్వు విష్ణుమూర్తి అవతారమే అయినా నీకేంకావాలో అడగమన్నాడు మహర్షి మహాత్మా ! మీ ఆశ్రమంలో ఉన్నట్లే సాకేతపురం చుట్టూ చక్కటి ఉద్యానవనాలు ఉండేలా చెయ్యమని వరం తీసుకుని అయోధ్యకి బయలుదేరాడు రాముడు .

🌿భరద్వాజుడుకొన్ని యుగాలు తపస్సు చేసి తరువాత తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు . వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు . 

🌸గోపాల బాలకులతోనూ , బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు .

🌿భారద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు . 
పూర్వం మనువంశం వాడయిన వీతహవ్యుడనే రాజుకి వందమంది కొడుకులు . వాళ్ళు కాశేశుడనే రాజుతో యుద్ధం చేసి ఓడించారు .

🌸తర్వాత అతడి కొడుకు సుదేవుణ్ణి రక్షించమని భరద్వాజుణ్ణి అడిగాడు దివోదాసుడు . సుదేవుడి కొడుకు దివోదాసుణ్ణి కూడా ఓడించారు .

🌿భరద్వాజుడు రాజుకి అన్ని విద్యలు తెలిసిన కొడుకు ప్రతపర్ణుణ్ణి అనుగ్రహించాడు . హైహేయుల్ని అందర్నీ చంపగా వీతహవ్యుడు మిగిలి భరద్వాజాశ్రమానికి వెళ్ళి మహర్షిని రక్షించమన్నాడు . 

🌸భరద్వాజుడు తన శిష్యుల్తోపాటు వీతహవ్యుడ్ని ఉండమన్నాడు . ప్రతర్ధనుడు వెతుక్కుంటూ వచ్చి మహర్షి ఆశ్రమంలో వీతహవ్యుడున్నాడేమో అని అడిగాడు . 

🌿మహర్షి అప్పటికే వీతహవ్యుడ్ని బ్రాహ్మణ్ని చేశాడు గనుక ఇక్కడ క్షత్రియులు ఎవ్వరూ లేరని చెప్తే ప్రతర్థనుడు వెళ్ళిపోయాడు . ఈ విధంగా మహర్షి అందర్నీ రక్షిస్తూ ఉండేవాడు .

🌸భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ధ చూపు , కొంగ వినయం , కుక్క విశ్వాసం , సింహ పరాక్రమం , కాకి సంశయం , పాము నడక ఉండాలని , ధర్మకార్యక్రమాలు ఎలా చెయ్యాలో , దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు .

🌿ఒకసారి గొప్ప గొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్తోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు .

🌸ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలు పెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు . ఈ గ్రంధాన్నే ' భరద్వాజ స్మృతి ' అన్నారు .

🌿మీకొక గొప్ప విషయం చెప్తాను . మీరు మీ స్నేహితులకి కూడా చెప్పుకోవచ్చు . ఆశ్చర్యం కలిగించే విషయం .
[11/30, 03:24] +91 73963 92086: 🌸భరద్వాజుడు ' వైమానిక శాస్త్రం ' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని , ఒక గ్రంథం రాశాడు . మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట . 

🌿దీంట్లో ఏమేమున్నాయో చూదం. ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది , నాశనంకాకుండానూ వుంటుంది . 

🌸ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి . ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి . దొరికితే నాక్కూడా చెప్పండి  ! ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా , ఫోటోలు తీసుకోగలిగేలా , శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్ఛపోయేలా చెయ్యకలిగేవి చాలా పరికరాలుంటాయి . 

🌿అంటే ఇవి యుద్ధవిమానాలేమో . విమానానికి 31 భాగాలుండాలనీ . విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ , కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్ధాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు . 

🌸పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట .అంతటి గొప్ప మహర్షి భరద్వాజ మహర్షి..

🌿ఒకనాడు ఇంద్రుడు, ' మహర్షీ !  వేద విజ్ఞానం అపరిమితం.  ఒక్క మహావిష్ణువుకే  వేదసారమంతా తెలుసు. మనం తెలుసుకోవలసింది, వేదముల  ఉపయోగము, 

🌸మానవ జీవితంలో యెంత వరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే. 
అన్నివేదాల పరమార్ధము ఆ 
శ్రీ మహావిష్ణువే. అయన గురించి తపస్సు చెయ్యి. 

🌿ఆయనే నీకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తాడు. 
'  అని చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు తెలుసుకున్నాడు, '  వేదాలను పూర్తిగా గ్రహించడమంటే, శ్రీహరి కైవల్యం పొందడమేనని. ' 

🌸ఇంద్రుడు చెప్పిన విధంగా,  భరద్వాజుడు, శ్రీహరిని ప్రార్ధించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరకు, మట్టపల్లి అనే గ్రామం (  తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా ) వెళ్లి, అక్కడ నిత్యమూ, కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ,  నరసింహ స్వామిని గురించి తపస్సు చేసాడు.  

🌿భరద్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు,  మహర్షికి వైకుంఠ ప్రాప్తి కలుగజేసాడు. 
    
🌸భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవలసిన విషయాలు అపారం. ఇది విహంగ వీక్షణమే.

🌿ఇదండీ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Tuesday, November 29, 2022

ఒక #హిందువు_ముస్లింగా_మారడం #ఎంత_ప్రమాదకరమో ఈ కథనం చెప్తుంది!!!

 ఒక #హిందువు_ముస్లింగా_మారడం 
#ఎంత_ప్రమాదకరమో ఈ కథనం చెప్తుంది!!!

 ఒకరు #రాఘవరాంకౌల్ .ఈయన ఒక కాశ్మీరీ బ్రాహ్మణుడు.ఈయనకు బలవంతంగా #ఆవు_మాంసం తినిపించి ముస్లిమ్‌గా మార్చారు!  అతని #కొడుకు_పేరు_షేక్_ఇబ్రహీం.  
షేక్ #ఇబ్రహీం_కొడుకు పేరు #షేక్_అబ్దుల్లా.  
#షేక్_అబ్దుల్లా_కొడుకు పేరు #ఫరూక్_అబ్దుల్లా .... ఫరూక్ అబ్దుల్లా కొడుకు #ఉమర్_అబ్దుల్లా.
ఇది రాఘవ్ రామ్ కౌల్ అబ్దుల్లా కుటుంబం.హత్యలతో నిండిన కాశ్మీర్ చరిత్ర 70 ఏళ్లు.

మరొకరు చిత్పవన్ బ్రాహ్మణుడు, 
అతని పేరు #తులసీరామ్.  
అతను #టిప్పు_సుల్తాన్ నుండి తప్పించుకోవడానికి #ఇస్లాం_మతంలోకి_మారాడు మరియు తన పేరును #ఓవైసీగా తన ఇంటిపేరుగా చేసుకున్నాడు.  #తులసీరామ్_కొడుకు పేరు #అబ్దుల్_వాహిద్_ఒవైసీ.  
అబ్దుల్ వాహిద్ కొడుకు పేరు #సుల్తాన్_ఒవైసీ.  సుల్తాన్ ఒవైసీ కొడుకు పేరు #సలావుద్దీన్_ఒవైసీ.  సలావుద్దీన్ ఒవైసీ కొడుకు పేరు #అసదుద్దీన్_ఒవైసీ, #అక్బరుద్దీన్ ఒవైసీ.  మరి ఓవైసీ సోదరులు అసహ్యించుకునే గాడ్సే తమ సమాజానికి చెందిన వ్యక్తి అంటే చిత్పవన్ బ్రాహ్మణులు అనే వ్యంగ్యం చూడండి.. ఇతరులను భయపెట్టడానికి మరియు ప్రతి సంవత్సరం 15 నిమిషాల సమయం అడగడానికి వారికి కూడా అదే కథనం ఉంది.

 ఒకరు #పాకిస్థాన్_పితామహుడిగా పిలువబడే #మహమ్మద్_అలీ_జిన్నా.అతని #తండ్రి_పేరు #పుంజలాల్_ఠక్కర్.ఈయనొక #గుజరాతీ_హిందువు.  డబ్బు కోసం మతాన్ని విడిచిపెట్టాడు!  అతను అదే కథనాన్ని కలిగి ఉన్నాడు మరియు నేటికీ ఉన్నాడు!  తానే డబ్బు కోసం గిన్నె పట్టుకుని ఇతరులను కూడా పట్టుకునెలా చేసాడు.

 
భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని దాదాపు అందరి ముస్లింల పూర్వీకులు వాస్తవానికి హిందువులు, వారు మొఘల్ పాలకుల భయం మరియు దురాశతో ముస్లింలుగా మారారు.  ఈరోజు వారి పిల్లలు ఇస్లాం పేరుతో భీభత్సం లేదా హత్యలు చేస్తున్నారు.

 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈ ప్రజలు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే, అది హిందువులకు ఆమోదయోగ్యం కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది.

:::: మానసిక కాలము ::::

 *:::: మానసిక కాలము ::::::*

    రెండు ఆలోచనల మధ్య వ్యవధే మానసిక కాలం అనబడుతుంది.
    ఈ మానసిక కాలమే  మనకు బోరు కొట్టడం, కాలం గడవక పోవడం గా మనకు అనుభవం లోకి వస్తుంది. ఇది మనకు ఒక రకమైన మానసిక సమస్య. 

     భౌతిక కాలం మనకు మానసిక సమస్య అయిన కాలం గడవక పోవడం,లేదా బోరు కొట్టడంలను సృష్టించలేదు. ఆలోచనలు లేకుండా మానసిక కాలము లేదు. ఎందుకంటే మనస్సు ఆలోచనలు చేయకుంటే భౌతిక కాలంతో పాటు చలిస్తూ వుంటుంది.

  *ధ్యానం మానసిక కాలాన్ని సృష్టించదు.*

 *షణ్ముఖానంద9866699774*

శ్రీరమణీయం "సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"

 శ్రీరమణీయం

"సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"

"సత్యం వాక్కుకు, మనసుకి అందనిది. ఒక శాస్త్రవేత్త చాలాకాలం పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటాడు. కొత్త విషయం ఎక్కడి నుండో వచ్చి పడలేదు. అది మనసులో నుంచే ఉద్భవించింది. తన మనసులో నుండే వచ్చింది కాబట్టి అది అంతకుముందే వచ్చి ఉండవచ్చు కదా ! కానీ అది అలా జరగదు. సత్యం తనంతట తానుగా స్ఫురించే వరకు మనం వేచి ఉండాల్సిందే. శాస్త్రవేత్తకు సైన్స్ పరంగా తనలోనే ఒక నూతన అంశం ఎలా ఆవిష్కరించబడిందో, ఒక సాధకుడు పొందాలనుకునే భగవదానుభవం కూడా ఏదో ఒకరోజు తనలోనే ఆవిష్కరించబడుతుంది. శాస్త్రవేత్త అయినా, సాధకుడైనా సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఫలితం దానంతట అదిగా వ్యక్తమవుతుంది. అంతేగాని ఏ సాధనలోనైనా ఫలితం మనసుకి వాక్కుకి ముందుగానే గోచరించేది కాదు !"

"దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటంలో సాధకుడు ప్రధానంగా ఎదుర్కొనేవి ఏమిటి ?"

"1.దైవం తనలోనే ఉన్నట్లు సత్యం తెలియకపోవడం. 2.దైవానుభవం అంటే తన హృదయంలో జరిగేదేనన్న విశ్వాసం కలుగకపోవటం. 3.దైవానుభవం జరిగేవరకు సహనం వహించే ఓపిక లేకపోవటం !"

"దైవం అంటే సత్యం. సత్యం అంటే ఉన్నదని అర్ధం. దైవం అనే సంపద మనలోనే ఉంది. ఈ విషయంలో మనందరం ఆస్థిపరులమే. కానీ అనుభవపరులమే ఇంకా కాలేదు. దైవం విషయంలో జ్ఞానం కలుగకపోయినా, ఆ దైవం మనలోనే ఉన్నదనే సత్యంపై విశ్వాసం రావాలి. మనలోనే ఉన్న ఆస్థి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనకు తెలియకుండా పోదన్న ధీమా ఉండాలి. అలాంటి స్వాంతన వచ్చినప్పుడు దైవం అనుభవంలోకి రాలేదన్న వెలితి పోతుంది. దైవాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆదుర్దా తగ్గుతుంది. అప్పుడు సాధన ప్రశాంతంగా సాగుతోంది !"

భక్తుడు* :- యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?

 🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌺
               
*భక్తుడు* :-
   యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?
                
*మహర్షి* :- 
ఇతర శక్తులకన్నా అతని ఆత్మజ్ఞాన బలమే అధికము. తనలోని అహంకారం ఎంత తగ్గితే, తనకు అన్యం ( ఇతరములకన్నా తను వేరు అనే భావము ) అంత తక్కువన్న మాట. 

   ఇతరులకు నీవు ఇవ్వగల పరమ శ్రేష్ఠమైనది ఏది అంటే, ఆనందమే. అది శాంతి వలన వస్తుంది. విక్షేపం ( మనసు చెదరకుండా ఉండడం ) లేకుంటేనే శాంతి వర్థిల్ల గలదు. 
   
    మనస్సులో తలెత్తే ఆలోచనలే విక్షేపానికి మూలం. మనస్సే లేనిరోజున నిశ్చల పూర్ణశాంతి కలుగుతుంది. మనస్సును సర్వనాశనం చేయనంత వరకూ శాంతి ఆనందాలు లభించుట సాధ్యంగాదు. తనకే ఆనందం లేనివారా ఇతరులకు ఆనందం ఇవ్వగలిగేది?

  మనసే లేని పక్షంలో గుర్తించడానికి ఇతరములు కూడా ఉండవు. అందుచేత ఆత్మజ్ఞానం మాత్రమే ఇతరులకు ఆనందదాయకం కాగలదు.
               
🌻ఓం తత్సత్🌻 

శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?* *ఆధ్యాత్మికులు - ఆర్గనైజర్లు:-

 *🧘‍♂️73 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*

*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*ఆధ్యాత్మికులు - ఆర్గనైజర్లు:-*

శంఖులో పోస్తే గానీ తీర్థం కాదన్నట్లు, సంస్కృత శ్లోకం ఉటంకిస్తేగానీ కొందరికి గురి కుదరదు కాబట్టి, ముందు శ్లోకం చెప్పి ఆ తర్వాత అర్థం వివరిస్తాను.

శ్లో: అసన్మానాత్తపోవృద్ధిః 
సన్మనాత్తవసః క్షయః !
అర్చితః ఆపూజితో విప్రో 
దుగ్ధా గొరివ సీదతి!!

ఇక మనందరికీ అర్థమయ్యేట్లు చెప్పుకోవాలంటే “జనులు గౌరవించని ఎడల బ్రహ్మజ్ఞానం వృద్ధి పొందుతుంది. గౌరవించిన పక్షంలో బ్రహ్మజ్ఞానం క్షీణిస్తుంది. కనుక లోకుల ప్రశంసలు పొంది భోజన వస్త్రాలంకార దానాలను పుచ్చుకునే ఆత్మ జ్ఞాని ఒట్టిపోయిన గోవువలె ప్రయోజనం లేనివాడై నశిస్తాడు. 
జనుల నుంచి అవమానమే తత్త్వజ్ఞాని కోరుకోదగినది”. ఇక దీని తాత్పర్యం ఒక్క ముక్కలో చెప్పాలంటే "జీవితాన్ని 
నిజంగా అర్థం చేసుకోదలచుకున్న వాడు సంఘం నుంచి సన్మాన సత్కారాలు ఆశించకూడదు.”

కాని నేటి కాలంలో, “నేను ఆధ్యాత్మిక సాధకుణ్ణి. సంఘం ఇప్పటి వరకూ నన్ను గుర్తించక పోవడం శోచనీయం. ఇకనైనా త్వరపడి గుర్తించడం శ్రేయస్కరం” అన్నట్లు తిరిగే వారే ఎక్కువగా కనిపిస్తారు. అయితే అది అధ్యాత్మికత అనిపించుకోదు; మిగతా అన్ని వృత్తులలో గుర్తింపును ఆశించినట్లే ఈ రంగంలో కూడా గుర్తింపు కోరుతున్నాడన్న మాట. గుర్తింపు వెనకాలే ధనాశా, కీర్తికాంక్షా,అహంకారమూ,  అహంభావమూ తొంగి చూస్తుంటాయి.

ఆధ్యాత్మికులు అజ్ఞాతంగానే బ్రతకాలని, ఎవరికంటా పడరాదని అనడం లేదు. తాము ఉండదలచుకున్న చోట ఉంటూ తమ వద్దకు వచ్చిన వారికి చెప్పగలిగింది ఏదైనా చెప్పవచ్చును.

 తమని ఎవరైనా ఆహ్వానించి తత్త్వం బోధించమని ప్రార్థిస్తే, 
పర్యటించినా తప్పులేదు కాని అవతలి వారు ఆహ్వానించేటట్లుగా పరిస్థితులు కల్పించడం, వెళ్ళిన చోట అమితమైన స్వాగత సత్కారాలు ఆశించడం, ఉపన్యాసకులకు, రాజకీయ నాయకులకు వేషగాళ్ళకు చెల్లుతుంది కాని, తత్త్వజ్ఞానికి మాత్రం పనికిరాదు. కాని ఈనాటి “జ్ఞానులు” సమాజంలోని నలుగురితోబాటు వేదికలెక్కి కూచుంటారు. అందరితో బాటు పూలమాలాలంకృతులవుతుంటారు. సంఘంలో వర్తకులకూ, నాయకులకూ, దాతలకూ దక్కే గౌరవం వీరికీ దక్కుతుంటుంది. అందరితోబాటు వీరు కూడా ఏవో కొన్ని నీతులు వల్లిస్తారు.

 ఇటువంటి ప్రసంగం శ్రోతకు కర్ణపేయంగా ఉండవచ్చునేమో కాని, అతడిలో మౌలికమైన మార్పు మాత్రం తీసుకురాదు.

మతాన్ని గురించిన ఉపన్యాసం వేరు, తత్వజ్ఞాన బోధ వేరు. మతాచరణ వేరు, స్వస్వరూప జ్ఞానం కొరకై లోతులు తవ్వడం వేరు. ఈ తేడా సరిగా తెలియని ఒక పెద్ద మనిషి, నేటి ఆధునిక స్వాములు ఊరేగుతున్న చందంగా అరుణాచల రమణుల వారిని కూడా దేశమంతా తిప్పి ఉపన్యాసాలు ఇప్పిద్దామని ప్రయత్నించాడు. శ్రీమతి సూరి నాగమ్మ గ్రంథంలో ఆ ఉదంతం వివరాలను శ్రీరమణుల భాషలోనే చదవండి.

 “కొన్నాళ్ళు రాజేశ్వరానందస్వామి ఇక్కడ ఉన్నారు కదూ.
 అప్పుడు ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలకంతా భగవాన్ దయచేసి ఉపన్యాసాలిచ్చి బోధ చేయాలని, అందుకు గాను ట్రెయినులో స్పెషల్ క్లాసు ఏర్పాటు చేస్తానని, ఆ ఊళ్ళో అన్ని రోజులు, ఈ ఊళ్ళో ఇన్ని రోజులు ఆగాలని చెపుతూ, ఏమో ప్లాన్లు వేస్తుండేవారు. పలక్కుండా విని ఊరుకునేవాణ్ణి. సమ్మతమేనని అనుకున్నారు. చివరకు ఒక రోజు స్పెషల్ క్లాసూ అదీ ఇదీ ఏర్పాటు చేసి వారి సామానంతా మూట కట్టి, "స్వామీ, బయలు దేరుదామా?” అన్నారు. "ఆహా, దానికేమి పోయిరండి” అన్నాను.

 “భగవానో?” అన్నారు. 'నేనా, ఎందుకు?” అన్నాను. "ఆధ్యాత్మ తత్త్వం  బోధించాలి స్వామీ" అన్నారు. “సరిసరి, చేసేదేమి? ఉండేదెక్కడ, పోయేదెక్కడికి? నాకెక్కడికి పోయేందుకూ స్థలం లేదే” అన్నాను వారు నిర్ఘాంతపోయారు.”

మరొక చోటికి వెళ్లడం సబబా కాదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. అర్థశతాబ్దం పైగా రమణులు తిరువణ్ణామలైలో గడిపిన కాలంలో, ప్రత్యేకంగా ఉపన్యాసాలంటూ
ఏవీ ఇచ్చిన వారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే సందర్భానుసారంగా విషయాన్ని వివరించే వారు. సందేహ నివృత్తి చేసేవారు. ఎందరు శ్రద్ధాసక్తులతో ప్రశ్నించారు.

 ఎందరు వ్యర్థమైన ప్రశ్నలు వేసేవారు అనే మాట అటుంచి, ఎందరు ఆయన బోధను గ్రహించి, 
ఆచరించి తత్త్వం కనుగొన్నారు అనేదే ముఖ్యమైన ప్రశ్న.

 ఈ ప్రయత్నానికి పూనుకునే శక్తి చాలక, తాము తరించే మార్గం కనిపించక, ఇతరులను తరింపచేయడానికి మాత్రం స్వామి ఉపన్యాసాలిప్పిస్తామంటారు. ఇలా కేవలం "ఆర్గనైజ్" చేయబూనుకోవడం తమ ఆహాన్ని పెంచుకోడానికి ఉపకరిస్తుందేమోకాని, తనను ఏ నాటికీ ఉద్ధరించదు; తనని ఉద్ధరించుకోలేని వాడు మరొకరిని ఉద్ధరించనూలేడు.

*🧘‍♂️కర్మయోగం🧘‍♀️:-*

తాను కర్తననుకోకుండా కర్మచేయడమనేదే కర్మయోగం. కర్తృత్వ బుద్ధి లేకపోయినా కర్మలు వాటంతటవే జరిగిపోతాయి. ప్రతివాడూ ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం జన్మ ఎత్తుతున్నాడు. తాను కర్తనని అనుకున్నా అనుకోక పోయినా ఆ ప్రయోజనం కొనసాగి తీరుతుంది 

అరుణాచలం లో.. అరుణగిరి మామూలు కొండ కాదు... సాక్షాత్తూ శివ స్వరూపము.

 హరిఓం  ,                                       -                  -    అరుణాచలం లో..
అరుణగిరి మామూలు కొండ కాదు... సాక్షాత్తూ శివ స్వరూపము.
ఆ కైలాస శివుడే సకల ప్రాణులను ఉద్ధరించడానికి... స్వయంభువుగా ఆవిర్భవించిన శివ స్వరూపమే అరుణాచలం.

మనం చూసే ఎక్కువ దేవాలయాలు నిర్మితమైనవే . కానీ ' చాలాచోట్ల స్వయంభు శివలింగాలు ఉంటాయి . 
స్వయంభు శివలింగమునకు విశేషమైన విశ్వ శక్తి ప్రసరణ ఎక్కువ ఉంటుంది .
ఇక అరుణాచలం గురించి మాట్లాడాలంటే ....
ఈ భూమండలంపై వెలిసిన మొట్టమొదటి స్వయంభు శివలింగం -అరుణగిరి "
దీనికంటే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైనది లేదు .
ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ...
ఆదిదేవుడు మొట్టమొదటిసారి వెలసిన
శివలింగమే అరుణగిరి .
విదేశీయుల సైతం అరుణగిరి పై ఎన్నో పరిశోధనలు చేసి దీనిని ధ్రువీకరించారు .
అసలైన విషయానికి వస్తే ...
మిగతా వాటికి అరుణాచలం కు తేడా చెప్తాను . చిన్న శివలింగం ఉంటే అంత కాస్మిక్ ఎనర్జీ...ఉంటే . అరుణాచలేశ్వరుడే కొండంత లింగంగా వెలిసినప్పుడు దానికి ఎంత విశ్వశక్తి ఆకర్షణ ఉంటుంది ?
కానీ అది కొండ కదా అని అనుకోవచ్చు .
మనం దేవుడంటే ఇలా ఉండాలి .
శివలింగం అంటే ఎలా ఉండాలి అని మనకు మనం మానసికంగా డిజైన్ చేసుకున్నాము . 
అరుణగిరి శివస్వరూపం
అరుణగిరి శివలింగం !
ఇందులో ఏమాత్రం అనుమానం లేదు .
అరుణగిరిలో శివుడిని శివలింగాన్ని చూడలేని వాడు మాత్రమే
గిరి క్రిందనున్న ప్రధాన ఆలయంలో దర్శనానికి వెళ్తారు అని తమిళం బలంగా నమ్ముతారు .
ఉదాహరణకు ...
తమిళులు సాధారణంగా ఆలయ దర్శనానికి తక్కువ మంది వెళ్తారు .
వాహనం దిగుతారు గిరి ప్రదక్షిణ చేస్తారు
వెంటనే తిరిగి వాహనంలో వెళ్ళిపోతారు .
ఎందుకంటే వారు అరుణగిరిని శివలింగం భావిస్తారు గనక .
లేకపోతే ...
పౌర్ణమి రోజుల్లోనూ ' చైత్ర పౌర్ణమికి '
అరుణగిరి పై జ్యోతిని వెలిగించే రోజులలో కొన్ని లక్షల మంది గిరిప్రదక్షిణ వస్తారు . అన్ని లక్షల మంది దర్శనానికి వెళితే ఎన్ని కిలోమీటర్లు లైను ఉంటుందో ఒకసారి ఊహించండి .
అర్థమైంది అనుకుంటాను .
అరుణగిరే శివలింగం
శివ స్వరూపం '
కొండంత దేవుడు
ఓం అరుణాచలేశ్వరాయ  నమః .... ఓం  నమ  శివాయ నమః  .....  🙏🙏                                    -

✍️...నేటి చిట్టికథ కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు

 ✍️...నేటి చిట్టికథ

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు




💥రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 

కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు – మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు ఇంకోకవైపు నుంచి..

- దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం?” అని అడిగాడు.

"ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను” అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

"అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటు వేయబోయేది ఏదో నీటిపామో – బురద పామో అనుకుంటున్నావా?
సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు – తక్షకుడే స్వయంగా అయితేనో?” అన్నాడు.

"తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాము మంత్రమో – విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?" అని ప్రశ్నించాడు కశ్యపుడు.

"అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని” అని నిజ రూపం చూపించాడు తక్షకుడు.

అంతటా కశ్యపుడు, “సర్పరాజా! నీకిదే నా ప్రణుతి! దీనితోపాటే నా వినతి కూడా విను!
మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను!
తక్షణం విష హర మంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను.
ఇది నా దృఢ విశ్వాసం” ఆని  అన్నాడా కశ్యపుడు. 

అపుడా తక్షకుడు, “తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో – మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా!
లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది.
దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విష శక్తి చూడు!” అని ఆ చెట్టును కసి తీరా కాటు వేశాడు తక్షకుడు. 

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు.
తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు.
ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి,

అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!” అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచే తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 

ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహా వృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 

వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని “మహామంత్ర ద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసిన నా అజ్ఞానాన్ని మన్నించండి!
తమకు తెలుసో – లేదో! నిజానికి పరీక్షిత్తు శాప రూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే,
అంతటి ధర్మ మూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం.
త్వరలో కలి ప్రవేశం జరగబోతోంది.
అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి!
ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 

ఇంతకూ తమకు కావలసింది” అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా

"ధనమయ్యా! ధనం" అన్నాడు.
అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను" అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపేశాడు.

🔹🔸🔹🔸

💥ఇంత వరకూ కథ బాగుంది... ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సినది చాలా వున్నది.

మన తల వ్రాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.

ఓక వేళ నాబోటి వాడు బయలుదేరినా వాడిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం.
అదే మనం చేసుకొన్న పాపం.. "కర్మఫలం"

పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికా భగవంతుడు కూడా...

పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే.
ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు.

💥ఎందుకంటే వాడి కర్మ కలిసి రావాలి...
కౌశికుడు బయలుదేరినా, పరీక్షిత్తు యొక్క పాప కర్మ అడ్డు పడినది.

ఏమిటి ఆ పాప కర్మ?  ఒక ముని మీద చచ్చిన పామును వేయడం. మహా సాధువులతో చెలగాడటం….కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.

రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేత చనిపోయినాడు.
కర్మ బలీయమైనది.

అంతటి కృష్ణ కృపా కటాక్షములు వున్న వాడు కూడా మాయలో పడ్డాడు గదా!
కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు.

శ్రీ మహా విష్ణువు చేత రక్షింపబడి, గర్భం నుండి బయట పడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు...
అదే కాల మహిమ.

💥దీనిలో మరోకటి కూడా గమనించాలి...

తక్షకుడు విష నాగు అంటే ప్రారబ్ద కర్మ.
దానిని కూడా జయించింది మంత్ర శాస్త్రం.

కాటు చేత పుష్పించిన మహా వృక్షం కాలి బూడిద అయితే మంత్రం మరలా చిగురింప జేసినది... 
అంటే మంత్రం చేత ప్రారబ్ద కర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.

మంత్రం ప్రాణం పోస్తుంది.
కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి...
అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹

బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..

 Shobha Rani:
Shobha Rani:
🎻🌹🙏మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈ రోజు 50,వ బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇపుడు మనం తెలుసుకోబోయేది ఒక అతి అద్భుతమైన మహర్షి గురించి . నిజంగా ఏం గొప్పతనం ! ఎంత ఆయుషు ! ఎంత వినయం ! మహాద్భుతం . 

🌸చాలా చాలా యుగాలకి పూర్వం దాల్బ్యుడనే మహర్షి ఉండేవాడు . ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి ఎన్నికల్పాలయిపోయినా సరే మరణం లేకుండా ఉండే కొడుకు కావాలని వరం పొంది ఒక కొడుకుని పొందాడు .

🌿ఆహా ! ఎంత అదృష్టం . ఆయన ఎంత పుణ్యాత్ముడో ! అంత గొప్ప కొడుకుని కన్న తండ్రి తక్కువ వాడు కాదు కదా ... ! 

🌸ఆ పిల్లవాడు బక పుష్పం ఉన్నంత అందంగా చక్కటి సువాసనతో ఉన్నాడని బకుడని పేరు పెట్టారు .

🌿 తండ్రి పేరు కూడా కలిసి బకదాల్బ్యుడు అని , ఇతడ్ని పెంచిన తల్లిదండ్రులవల్ల ద్వ్యాముష్యాయణుడు , గ్లావుడు , గ్లావమైత్రేయుడు అని కూడ పేర్లున్నాయి .

🌸బకదాల్ఫ్యుడు చిన్నతనంలోనే ముఖ్య ప్రాణోపాసనం చేసిన మహాతపశ్శాలి , మహాత్ముడు అయ్యాడు .

🌿ఒకసారి ఒక తెల్లకుక్క కొన్ని చిన్న కుక్కలను ఒకదానితోక ఒకటి నోటితో పట్టుకుని వలయాకారంలో తిరిగి కూర్చుంటే చూసి ఋత్విజుల విధుల్ని నిర్ణయి బకదాల్బ్యుడు
ద్వైతవనంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు . 

🌸గొప్ప తపస్సు చేసి మరణాన్నే జయించి , అపర శివుడిలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు . కొంతకాలం తర్వాత పాండవులు ద్వైతవనంలో ఉండడానకి వచ్చారు . వాళ్ళని పెద్ద పెద్ద మునులందరూ వెళ్ళి పలకరించి వస్తున్నారు .

🌿బకదాల్భ్య మహర్షి ఒకసారి పాండవులని చూడ్డానికి వెళ్ళి ధర్మరాజు దగ్గర అతిథి సత్కారం తీసుకుని,

🌸నాయనా ! ఉత్తములైన బ్రాహ్మణులు మీ దగ్గరికి వచ్చి పోతూ వుంటే అగ్నికి , వాయువు తోడైతే అరణ్యాన్ని ఎలా దహిస్తాయో ,మా బ్రాహ్మణులు , మీ క్షత్రియులు కలిసినప్పుడు శత్రువులు కూడా అలాగే నశిస్తారు అన్నాడు .

🌿యుద్ధంలో ఏనుగుకి దారి చూపించడానికి అంకుశం ఎలా ఉపయోగపడుందో , రాజుని ధర్మమార్గంలో త్రిప్పడానికి బ్రాహ్మణుడు అలాగే ఉపయోగపడతాడన్నాడు .

🌸తర్వాత బకదాల్యుడు చిరంజీవుల్లో ఒకడై బ్రహ్మచారై ఎన్నో యుగాలు బ్రతికి సముద్రం మధ్యన ఒక దీవిలో తపస్సు చేసుకుంటున్నాడు .

🌿ఒకసారి ధర్మరాజు అశ్వమేథయాగం చెయ్యడానికి యజ్ఞాశ్వాన్ని విడిచి పెట్టినప్పుడు కృష్ణార్జునులు గుఱ్ఱంతో తిరుగుతూ మహర్షి ఉన్న చోటుకి వచ్చారు .

🌸అక్కడ కొన్ని యుగాలుగా పెరిగిన శరీరం , జడలు , గడ్డంతో , కోటి సూర్యుల తేజస్సుతో ఉన్న బకదాల్ఫ్యుణ్ణి చూసి కృష్ణార్జునులు రథం దిగి నడిచి వెళ్ళి నమస్కారం చేశారు .

🌿అర్జనుడు మహర్షిని చూసి ఆశ్చర్యపోయాడు .శరీరం చుట్టూ పుట్టలు ,.మోకాళ్ళు మోచేతులు నించీ చెట్లు , పుట్టల్లో ఎన్నో రకాల పాములు ఆ చెట్లమీద ఎన్నో రకాల పక్షులు చూసి అర్జనుడు మహర్షికి నమస్కారం పెట్టి ఈ మీ వింతకి పరమార్థం ఏమిటని అడిగాడు . 

🌸అర్జునా ! క్షణంలో పోయే ఈ శరీరానికి తూగుటుయ్యాలాలు , పూలపాన్పులు ఎందుకు ? ఈ మట్టి ఆకులు చాలవా ? అన్నాడు బకదాల్బ్యడు .అర్జునుడు స్వామీ ! మీ వయస్సెంత ? అన్నాడు .

🌿బక దాల్ఫ్యుడు నేను పుట్టాక ఇరవై మంది బ్రహ్మలు వెళ్ళారు .ఎంతో మంది మార్కండేయులు వెళ్ళిపోయారు .నీకొక చిత్రమైన విషయం చెప్తాను విను . 

🌸ప్రళయ కాలంలో ఏడు సముద్రాలు , ముల్లోకాలు కొట్టుకొచ్చి ఇక్కడికి చేరాయి .అప్పుడిక్కడ ఒక మట్టి చెట్టుండేది .దాని కొమ్మలు వెయ్యి పైగానే ఉన్నాయి .ఒక్కొక్క కొమ్మకి వెయ్యేసి బ్రహ్మాండాలు వ్రేలాడుతున్నాయి .

🌿ఆ మట్టి చెట్టుకి చిటారుకొమ్మ మీద ఒక చిగురాకు మీద పడుక్కుని కుడి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ నన్ను ప్రేమతో చూసి భయం లేదని అభయమిచ్చాడు ఒక బాలుడు .

🌸రమ్మనేవాళ్ళు లేక పొమ్మనే వాళ్ళు లేక అంతటికి తానే నాయకుడయ్యి హాయిగా పడుకుంటే అతని నాభిలోంచి ఒక కమలం దాంట్లోంచి ఒక బ్రహ్మ వచ్చి ఈ సృష్టినంతా చేశాడు . 

🌿అతడే శ్రీకృష్ణుడుగా పుట్టి నీకు బావై ఈ బాధలన్నీ పడుతున్నాడని చెప్పి కృష్ణుడ్ని కౌగిలించుకుని ఎలావున్నావయ్యా మూడులోకాల కుటుంబీ ! అన్నాడు బకదాల్భ్య మహర్షి శ్రీకృష్ణుణ్ణి .

🌸కృష్ణుడు బకదాల్బ్యుణ్ణి పొగుడుతుంటే , పొగడ్త ఎంతటి గొప్పవాడ్నయినా నాశనం చేస్తుంది , ఒక కథ చెప్తాను వినమన్నాడు మహర్షి .

🌿అర్జనుడికి కథలంటే ఇష్టం వెంటనే చెప్పండి చెప్పండి అన్నాడు .నేను ఒక మట్టి చెట్టు దగ్గర తపస్సు చేసుకుంటుంటే నాలుగు ముఖాల బ్రహ్మ వచ్చి నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు .

🌸నీలాంటి వాళ్ళని ఇరవైమందిని చూశాను .నువ్వు నాకేమిస్తావన్నాను . నేను , బ్రహ్మకి కోపం వచ్చి వెట్టివాడ్ననుకుంటున్నావా ? అన్నాడు .

🌿నేను నవ్వుతున్నాను .ఈలోగా మా ఇద్దరి మధ్యా భూమి చీలి పెద్దగాలి వచ్చి మమ్మల్ని వేరే బ్రహ్మాండంలో పడేసింది . అక్కడ ఎనిమిది తలల బ్రహ్మ మీరెవరో నాకనవసరం నాసేవ చెయ్యండన్నాడు .

🌸మళ్ళీ అలాగే జరిగి పదహారు తలల బ్రహ్మ తన సేవ చెయ్యమన్నాడు . బ్రహ్మాండాలు దాటుతూ బ్రహ్మల్ని చూస్తూ అలా వెడుతూనే వున్నాం .

::::శ్వాస ప్రాముఖ్యత::::

 *:::::శ్వాస ప్రాముఖ్యత::::::*
       శ్వాస ఆడకపోతే
చనిపోయాడని నిర్ధారిస్తారు. ఈ రకంగా శ్వాస *భౌతిక జీవితానికి* అత్యంత అవసరం.
         శరీరంలోని ఉద్రేక, శాంతతలను శ్వాస గమనం లేదా నడక మనకు చెపుతుంది. శ్వాస గమనాన్ని సహజ స్థితికి తీసుకు వచ్చి శరీర ఉద్రేక స్థితి ని శాంత పరచ వచ్చు.
    అలాగే మనస్సు అశాంతి గా వుంటే శ్వాస తప్పటడుగులు వేస్తుంది. శ్వాస నడక సరి చేసి  మానసిక ఉద్రేకాలను చల్ల పరచవచ్చు.   ఈ రకంగా *వ్యవహారిక జీవితాన్ని* ఆనందంగా చేయవచ్చు.
      శ్వాస పట్ల ఎరుక అంతర్ ఎరుకను introspection ని  కలిగిస్తుంది.అనగా
  శ్వాస పట్ల సతి (mindfulness) ధ్యాన స్థితి(Enlughtenment) కి ప్రవేశ ద్వారం లాంటిది.
   ఈ రకంగా *ఆధ్యాత్మిక జీవితానికి* శ్వాస ముఖ్య మైనది

*షణ్ముఖానంద9866699774*

శారదమ్మ గారు ... జీవుడు శరీరాన్ని విడిచేటపుడు ...?

 [11/28, 12:17] +91 73963 92086: హరిః  ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

శారదమ్మ గారు ... జీవుడు శరీరాన్ని విడిచేటపుడు ...?

గురుదేవులు ..... జీవునికి శరీరం భోగసాధనం. ఆ భోగ సాధనాన్ని యోగదృష్టితో అనుభవించాలి. అలా యోగం చే శరీరాన్ని వదిలి పెట్టగల నైపుణ్యాన్ని సంపాదించాలి జీవుడు. భోగమైనా యోగమైనా రెండూ జీవుడికే, ఆత్మకేమీ సంబంధం లేదు. అందుకని జీవాత్మ అంటాము. జీవుడికి ఆ శక్తి ఎక్కడి నుండి లభించింది? భోగించగలిగే శక్తి కానీ యోగించ గలిగే శక్తి కానీ ఆత్మచైతన్యం వలన జీవుడికి లభించింది. జీవుని యొక్క వాస్తవ ఉనికి ఆత్మ చైతన్యం. అది జ్ఞానం. అది స్వరూపం. కానీ అది వ్యవహారంలో భోగం కానీ యోగంగా కానీ ఉంది. భోగం వరకే ఉన్న జీవుడు వదలలేక వదలలేక వెళతాడు. కాబట్టి మనిషి భోగిగా జీవించాడా? యోగిగా జీవించాడా? అనేది చివరికాలంలో తెలియబడుతుంది అంటాము. 

అయితే ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. మానవుడు భగవంతుని ధ్యానం చేస్తూ ... అర్చన చేస్తూ .. అభిషేకాలు అడిగేది ఏమిటి? వినా దైన్యేన జీవనం ... అనాయేసేన మరణం .... దేహాంతే తవ సాయుజ్యం ... ఇది ద్వైతభావనలో ఉన్న కోరిక. జీవుడు వేరే, దేవుడు వేరే అన్న లక్షణాలతో భోగిగా ఉన్నట్టి వ్యక్తి అడిగే కోరిక. దీంట్లో మోక్షమనే కోరిక 'దేహాంతే తవ సాయుజ్యం' అని అడుగుతున్నాడు. అంటే విదేహముక్తిని అడుగుతున్నాడే కానీ జీవన్ముక్తిని అడగటం లేదు. 

జాగ్రత్తగా శరీరాన్ని తృణప్రాయంగా చూడగల స్థాయికి రావాలి. మొట్టమొదట త్యాగమనే బుద్ధి రావాలి. ఆ త్యాగమనే బుద్ధి రాదు ఎవరికీ కూడా. ఎందుకనీ? శరీరం భోగసాధనం. అది సుఖానికైనా దు:ఖానికైనా... శరీరం అనేది లేకపోతే అనుభవించలేడు. నా జీవితంలో దు:ఖాలన్నీ అయిపోయినాయి. నా జీవితంలో సుఖాలన్నీ అయిపోయినాయి. అదయిపోయింది, ఇదయిపోయింది అని ఎలా అనుకుంటున్నాడో, నా జీవితంలో ఇది కాలేదు. అది అవలేదు అనేది చిత్తంలో ఉండిపోతుంది. అవే చిత్తంలో ఉన్న వాసనామయ బీజాలు. ఈ వాసనామయ బీజాలతోనే సూక్ష్మశరీరం మరో స్థూలశరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆ సూక్ష్మశరీరానికి అధిష్టానమే జీవుడు. ఆ కారణశరీర స్థితిలో ఉండి అవిద్యామయంగా స్వరూపజ్ఞానం లేకపోవటం చేత ఇంకా నేనిది పొందాలనే భోగ అపేక్ష కల్గి ఉంటాడు. కాబట్టి వాడిని జీవుడని అంటున్నాము. ఆ భోగ అపేక్ష కలిగిన జీవుడు ఈ శరీరాన్ని పనిముట్టుగా వాడుకుంటూ ఉంటాడు. 
ఎంతోమంది ఇంకా మంచంలో తీసుకుని తీసుకుని ఎంతోకాలం ఉండిపోవటానికి కారణం .... ఈ భోగం నాకు ఇంకా పూర్తవలేదు అనే రెండు లక్షణాలతో శరీరమనే పనిముట్టు తో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఈ భోగము, యోగము స్వరూపజ్ఞానం వచ్చేప్పటికి పూర్తయిపోతాయి. అందుకే యోగానికి లక్ష్యం ఆత్మసాక్షాత్కార జ్ఞానం. అదొచ్చే సరికి యోగం దశ పూర్తయి పోయి జ్ఞానిగా మారిపోతాడు. 

జ్ఞానిగా మారిపోయినవాడు శరీరంలోనే విడిపోయినటువంటి శరీరిగా ఉంటాడు. ఆ శరీరి జ్ఞానానుభవం వచ్చేప్పటికి అశరీరిగా మారిపోతాడు. బ్రహ్మానుభవం అంటాము. జీవన్ముక్తానుభవం ... ఈ జీవన్ముక్తుడు జన్మరాహిత్య స్థితిని పొందేప్పటికి అశరీరి అవుతాడు. జీవన్ముక్తుడుగా ఉన్నప్పుడు శరీరిగా ఉంటాడు. ఇది స్థాయీ భేధం. శరీరమే నేనుగా ఉన్నప్పుడు భోగిగా ఉంటాడు. శరీరి నేనుగా ఉన్నప్పుడు జ్ఞానిగా మారుతాడు. అందుకే భవద్గీత రెండు మార్గాలే చెపుతుంది. సాంఖ్య యోగమనీ అలాగే ఉపాసనా యోగమనీ రెండే యోగాలు. అంటే అర్చన, అభిషేకం, ధ్యానం, యోగం ఈ నవవిధ భక్తి మార్గాలు ఈ మొత్తం ఉపాసనా మార్గమనీ, కర్మకాండ అనీ, రెండవది స్వరూప జ్ఞానానికి సంబంధించిన సాంఖ్య- తారక - అమనస్క విచారణతో కూడిన జ్ఞానమార్గమనీ ఈ రెండు మార్గాలు సగం సగంగా కలిపితే యోగమార్గం అవుతుంది. 

కర్మమార్గంలో కొంతభాగం, జ్ఞానమార్గంలో కొంతభాగం కలిసి భక్తిమార్గం అవుతుంది లేదా యోగమార్గం అవుతుంది. కాబట్టి కర్మ యోగమని, భక్తి యోగమనీ, జ్ఞాన యోగమనీ యోగమనే లక్షణం అన్నిటిలో చేరుతుంది. దాని అర్ధం ఏమిటి అంటే నీవు శరీరివి అనే నిర్ణయాన్ని ఎప్పుడూ పొంది ఉండాలి. ప్రతిక్షణం పొంది ఉండాలి. ప్రతిక్షణం శరీరంతో శరీరి విడిపోయి ఉంటాడు. ఆ విడిపోయి ఉన్నవాడికి మాత్రమే అనాయాస మరణం సాధ్యమవుతుంది. వాడికి సమిష్ట్యానుభవమైన కర్మానుభవం కూడా పూర్తయిపోతుంది శరీరికి. 
అదే శరీరమే నేనుగా ఉన్నవాడికి వ్యష్టానుభవం అయిన కర్మానుభవం దగ్గరే వాడి పరిణామం ఆగిపోతుంది. వ్యష్టానుభవం దగ్గరే కర్మానుభవం ఆగిపోయినవాడు అంత తొందరగా శరీరం వదిలి పెట్టలేడు, అది అకాల మరణమైనా సకాలమరణమైనా. 
సహజ మరణంగా కనపడే వాటిలో కూడా శరీరమే నేనుగా కనపడే లక్షణాలే ఉంటాయి. కాబట్టి అతని జీవితం ఎలా సాగింది. 
శరీరమే నేనుగా ఉన్నాడా? శరీరి నేనుగా ఉన్నాడా? ఆ నేను పోగొట్టుకొని అశరీరిగా ఉన్నాడా? 

అశరీరిగా ఉన్నటువంటివాడు ఎలా ఉంటాడయ్యా అంటే పండినటువంటి దోసకాయ ఎలా వదిలేస్తుందో అలా వదిలేస్తుంది. అదే మృత్యుంజయ మహామంత్రము సూచించేటటువంటి సూచన.
[11/28, 12:17] +91 73963 92086: శరీరి ఎలా ఉంటాడయ్యా అంటే హస్తామలకంగా ఉంటాడు. చేతిలో ఉసిరికాయలా ఉంటుంది వాడికి జీవితం. ఆ ఉసిరికాయ వదికిపెట్టడానికి ఎంతో సమయం పట్టదు. అలా వదిలేయ గలుగుతాడు. అదే శరీరమే నేనుగా ఉన్నవాడు గుమ్మడికాయలా ఉంటాడు. గుమ్మడికాయ అంత తొందరగా వదిలిపెట్టదు కొయ్యాల్సిందే. కొయ్యకుండా గుమ్మడికాయ తొడిమ ఊడి పడదు. తప్పనిసరిగా కొయ్యాల్సిందే. లేదంటే ఆ పండు అలా తొడిమని అంటుకునే ఉండి వడిలిపోతుంది తప్ప తొడిమ ఊడదు. అందుకని గుమ్మడికాయను చూపిస్తుంటారు. గృహప్రవేశం అపుడు గుమ్మడికాయ ఎందుకు కొడతారంటే నాయనా! ప్రయత్నం చేసి నువ్వు జీవ భావాన్ని విడవాలి. గుమ్మడికాయ జీవుడికి  గుర్తు. మనిషికి గుర్తు. అహానికి గుర్తు. అది వదిలి పెట్టదు. 
తొడిమ జీవితకాలంలో ఎప్పుడూ గుమ్మడికాయని.. ఎండి ఎండి వడిలి రాలిపోయినా అది అలాగే ఉంటుంది. వదిలిపెట్టదు. అదొక గుర్తు. 
రెండవ గుర్తు హస్తామలకం. జ్ఞానం ఎలా ఉండాలయ్యా? చేతిలో ఉసిరికాయలాగ ఉండాలి. శరీరికి స్వరూపజ్ఞానం చేతిలో ఉసిరికాయలాగ ఉంటుంది. వాడు బ్రహ్మాండాన్ని చేతిలో ఉసిరికాయలాగ చూస్తూ ఉంటాడు. వాడి దృష్టి అది. వాడికి గుమ్మడి కాయతో పని లేదు. చేతిలో ఉసిరికాయలాగ ఉంటుంది వాడి జ్ఞానం. వాడు ప్రయత్నించి పగలగొట్టేది, విరగ గొట్టేది, వదిలేసేది ఏమీ ఉండదు. చేతిలో ఉసిరికాయ కిందపడాలంటే ఊరికే చెయ్యి తిప్పితే చాలు పడిపోతుంది. అంత రెప్పపాటు ప్రయత్నంతో శరీరం పడిపోతుంది. శరీరం ఉసిరికాయ లాంటిది. బ్రహ్మాండమైనా ... పిండాండమైనా ఉసిరికాయే. 

అశరీరి .... అతడేమో పండిన దోసపండులాంటివాడు. దోసకాయ వదిలి పెట్టడానికి అసలు ప్రయత్నమే ఉండదు. సహజంగా పడిపోతుంది. ఆ సహజంగా పడిపోవటమనే శరీరం పడిపోవటాన్ని మనం అనేకరకాలుగా 'అనాయాసేన మరణం' అనే సూచనతో చూపిస్తున్నాం. కానీ 'అనాయాసేన మరణం' ఎవరికి సాధ్యమవుతుంది అంటే అశరీరికి సాధ్యం అవుతుంది. ఇప్పటికే ఆయాసం ఉంటుంది. దానంతటఅది అతనిని శరీరం వదిలేస్తుంది. అతడు శరీరాన్ని వదిలిపెట్టటం కాదు. అశరీరిస్థితిలో శరీరమే అతడిని వదిలి పెట్టేస్తుంది అంటే అర్ధం ఏమిటి? ఒక పండు పండింది, ఎండింది, చెట్టు నుంచి రాలింది. చెట్టు వదిలేసిందా? పండు వదిలేసిందా? అంటే పండే వదిలేసింది. అలా వదిలేస్తుంది శరీరం. అశరీరి అయినటువంటివాడు నిత్య వ్యాపకమైనటువంటివాడు. విశ్వ వ్యాపకమైనటువంటి వాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటివాడు అశరీరి. 

అదే బ్రహ్మానుభవం వరకే జ్ఞానం ఉండి జీవన్ముక్తానుభవం ఉన్నది అన్నవాడు ఒకనిశ్వాసతో వదిలేస్తాడు. ఒక ఊపిరి వదలటానికి ఎంత శ్రమ కావాలి? ఎంతో శ్రమ అవసరం లేదు. ఊరికే ఒక నిశ్వాస వదిలిపెడితే ఎలా శరీరం పడిపోతుందో అలా శరీరం పడిపోతుంది. అలా సులభంగా పడిపోయేటటువంటి స్థితిలో ఉన్నవాడు శరీరి. ఎంతో బ్రహ్మప్రయత్నముతో శరీరం వదిలిపెట్టేవాడేమో గుమ్మడికాయ లాంటివాడు.  వాడు శరీరమే నేనుగా ఉన్నటువంటి వాడు. 
 
ఇక వీటన్నిటికీ కూడా ఆధారం ఏమిటయ్యా అంటే అహంకారం అనేటటువంటి కొబ్బరి పీచు. అందుకని ప్రతిచోట అర్చనలలో అభిషేకాలలో అన్నింటిలో కూడా కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. ఆ కొబ్బరికాయ అహానికి గుర్తు అన్నమాట. ఎంత బాగా ఎన్ని దెబ్బలు కొడితే పగులుతుంది అనేది చెప్పలేము. ఒక్కొక్కటి ఒక్క దెబ్బకే పగిలిపోతుంది. ఒక్కోటి పదిదెబ్బలు కొట్టినా పగలదు. అలా మానవునిలో అహంకారానికి గుర్తు కొబ్బయికాయ.. ఈ రకంగా మానవ జీవితాన్ని సులభంగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయటమే జ్ఞానమార్గం.

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
26-11-2022

జై గురుదేవ 🙏

ధ్యాన సాధనలో కుండలినీ శక్తి పాత్ర.

 🔴 ధ్యాన సాధనలో కుండలినీ శక్తి పాత్ర.🔴

..."కుండలిని" అనే పదము, "కుండల" అనే సంస్కృత పదము నుండి వచ్చింది. కుండలం అనగా చుట్టలుగా చుట్టబడిన అని అర్ధం.  మహా చైతన్య వంతమైన ఈ కుండలినీ శక్తి, మూలాధార చక్రమందు వశిస్తూ యున్నది. ఈ మహా శక్తి, చైతన్యవంతమైతే...మూలాధారము నుండి పయనించే సుషుమ్నా నాడి యందు ప్రవేశించి ఊర్థ్వ గమనము చెందుతుంది.

ఈ కుండలినీ శక్తి అనేక పద్ధతుల ద్వారా చైతన్యం చెందితే, ఈ ప్రయాణంలో మజిలీలుగా ఉన్న అన్ని చక్రాలనూ (శక్తి కేంద్రాలను ) స్పృశిస్తుంది. అలా అన్ని చక్రాలనూ స్పృశిస్తూ, భేదిస్తూ...చివరకి సహస్రారాన్ని చేరుతుంది ఈ మహాశక్తి. ఈ చక్రం ఆత్మ సాక్షాత్కార స్థానం. 
అన్ని ఆధ్యాత్మిక శక్తులు ఈ సహస్రారంలో వికసించబడి ఉంటాయి కదా! 

వెనుబాము పొడవునా, 7 ప్రధాన శక్తి కేంద్రాలు లేదా 7 ప్రధాన చక్రాలు విస్తరించి ఉంటాయి. ఈ చక్రాలు, మనుజుని యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితానికి ఆధారభూతం. ఈ చక్రాలు మన శరీరమందలి నాడీ కూటముల వద్ద ఉంటాయి. ఈ చక్రాలు నాడుల ద్వారా అనుసంధానించబడతాయి. 

     కుండలినీ సాధనలో, కుండలినీ శక్తి ఊర్థ్వగమనం చెందుతున్నప్పుడు, మన శరీరం శక్తివంతంగా, సృజనాత్మకంగా, సకల సమన్వయంగా మారుతుంది.

   ప్రతి చక్రము కూడా భౌతిక శరీరంలోని ఒక లేదా కొన్ని అంతస్రావీ గ్రంథులతోనూ, కొన్ని శరీర భాగాలతోనూ అనుసంధానంగా ఉంటుంది. ప్రతి చక్రము కూడా...మన శరీరమందలి నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. ప్రతీ చక్రానికి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు ఉంటాయి. ఆయా చక్రాలను చైతన్యవంతం చేయగలిగితే, మన వ్యక్తిత్వం తత్సంబంధ గుణాలు పెంపొందించబడుతాయి.

సాధన - దివ్యానుభూతులు  :  

పిండ ధర్మానుసారం సాధన : 

సాధనయందు ప్రముఖముగా రెండు పద్ధతులు కలవు. ఒకటి సాకార సాధన అయితే, రెండవది నిరాకార సాధన. నిరాకార సాధకులు కేవలం ధ్యానము ద్వారా....ధారణా శక్తిని పొంది...తద్వారా సమాధి వైపు పురోగమించగలరు.  ఈ సాధకులకు  విభిన్న తంత్రములు, పరికరములు ఆవశ్యకత లేదు. ధ్యాన, ధారణ, సమాధులే వారికి నియమిత మార్గములు. ఏదో ఒక రోజున ఆ మార్గము సాధకుని నిర్గుణ నిరాకార సమాధి స్థితికి తీసుకొని వెళ్ళగలదు. రాజ యోగము అన్నిటి కన్నా ఉన్నత మార్గము.ఈ మార్గములో ఆత్మ సాక్షాత్కారము సులభముగా పొందవచ్చును. భక్తి మార్గములో కూడా ఆత్మ సాక్షాత్కారమునకు మహత్వ స్థానమీయబడినది. భక్తుడు - భగవానుల ఏకత్వమే దీనికి కారణము. అప్పుడు శ్రేష్ట సాధకుడు, స్వయముగా ఆత్మ సాక్షాత్కారమును పొందును. ప్రతి భక్తునకూ...అదే చరమావస్థ. భక్తి మార్గములో తమ తమ ఇష్ట దేవతను ధ్యానము చేయడం....అత్యావశ్యకముగా భావించబడినది. జ్ఞాన ప్రాప్తిని పొందుటకు.....నిరంతర ధ్యానమవసరము. ఈ విశ్వములో ఉన్నటువంటి అస్థిత్వములన్నిటి చరమావస్థను స్వయముగా పొందడమే జ్ఞానము. వర్ణమాలలో చివరి అక్షరము "ज्ञ". ఈ చరమావస్థను పొందడం జ్ఞానం.

Monday, November 28, 2022

:::ఇంద్రియ విజ్ఞానం vs సుఖం:::

 *ఇంద్రియ విజ్ఞానం vs సుఖం:*
    మనం మన ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచంతో సంబంధాన్ని కలిగి వుంటాం.
   ఇక ఇక్కడ నుండి  మన కథ మొదలు అవుతుంది
      అనగా దీని ఆధారంగా మనలో వేదనలు కలగడం, స్పందించడం,  కోరికలు, పుట్టడం, జరుగుతుంది 
          ఉదాహరణకు,మనం చూసాం. చూచినది పండు అని మనకు తెలుస్తుంది. చూచినది పండు అని తెలియడం ఇక్కడ మనకు అప్రస్తుతం.
      పండును చూడగానే మనలో వేదనలు (sensation and feeling)కలగినాయి.
     ఈ వేదనలు సుఖమా , దుఃఖమా, తటస్థమా, అన్న సంజ్ఞ కలుగుతుంది.
      పండు అని తెలియడం విషయ జ్ఞానం అయితే, ఆ   పండు తినడం ద్వారా  కలిగే వేదనలు సుఖమా దుఃఖమా అని తెలియడం సంజ్ఞ 
       ఇక్కడ అసలు twist వుంది.
     పండు తినగా కలిగించిన సుఖం,  మనకు  పండును చూడగానే తినాలి అన్న కోరికను కలిగిస్తుంది.
  ఇక మనకు ఆకలి వున్నా లేకపోయినా, అది ఇచ్చే సుఖానుభూతి కోసం తింటాం.
      ఇక్కడ గమనించాల్సినది మన ప్రవర్తన మంచి చెడుల మీద అవసరాలు మీద ఆధారపడి వుందా? లేక సుఖ దుఃఖ అనుభూతులు మీద ఆధారపడి పై విధంగావుందా?
*ధ్యాన స్థితి మనలను తగు విధంగా స్పందింప చేస్తుంది*

*షణ్ముఖానంద9866699774*

భగవంతునికి అర్పించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా, ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కనే చిక్కడు.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*
*_🌴భగవంతుడు కావాలంటే ఊరికే దొరకడు.  ఆ భావన నిజంగా మనసులో రావాలి. రాగానే వేదాలను ఆశ్రయించాలి.  శాస్త్రాలను పట్టుకోవాలి.  అంతవరకూ మనం విశ్రయించకూడదు. భగవంతుడు కోసం మన దారి మనమే వెతుక్కోవాలి. మన సాధన మనమే చేయాలి. పలు రకాల పరీక్షలను ఎదుర్కోవాలి. యోగి కానివ్వండి, భోగి కానివ్వండి, రోగి కానివ్వండి హృదయం పరిశుద్ధమైన తరువాతనే భగవంతుడు తన లోపలికి అనుజ్ఞ ఇస్తాడు. హృదయ పరిశుద్ధత లేనిదే భగవంతుణ్ణి పొందాలంటే కుదరదు. పాండిత్యం, శాస్త్ర పరిచయాలు, శ్లోకార్థాలన్నీ మన భావాలను విస్తృతము చేసుకోవడానికి పనికివస్తాయి తప్ప భగవంతుణ్ణి పొందడానికి కాదు. మనలను మనం భగవంతునికి అర్పించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా, ఎంత పాండిత్యం సంపాదించినా భగవంతుడు మనకు చిక్కనే చిక్కడు. 🌴_*

శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు లేఖ 86 (86) జ్ఞాన సంబంధమూర్తి

 శ్రీ రమణాశ్రమం నుండి ఉత్తరాలు

లేఖ 86

(86) జ్ఞాన సంబంధమూర్తి

ఫిబ్రవరి 1, 1947

సౌందర్య లహరి యొక్క తమిళ వ్యాఖ్యానం నుండి భగవాన్ చదివి, 'ద్రావిడ శిశు' అనే పదాలు సంబంధుడిని తానే సూచిస్తున్నాయని మాకు చెప్పిన తర్వాత, ఆ అంశంపై చర్చ హాలులో కొనసాగింది. రెండు లేదా మూడు రోజులు. దీనికి సంబంధించి ఒక భక్తుడు ఒకరోజు భగవాన్‌ని అడిగాడు, “సంబంధ అసలు పేరు అలుదయ పిల్లయార్ కాదా? ఆయనకు 'జ్ఞాన సంబంధమూర్తి' అనే మరో పేరు ఎప్పుడు వచ్చింది? మరియు ఎందుకు?" 

భగవాన్ ఇలా జవాబిచ్చాడు, “దేవత ఇచ్చిన పాలు తాగిన వెంటనే, అతనికి జ్ఞాన సంబంధ (జ్ఞానంతో పరిచయం) ఏర్పడింది మరియు అతనికి జ్ఞాన సంబంధమూర్తి నాయనార్ అనే పేరు వచ్చింది. అంటే మామూలుగా గురు శిష్య సంబంధం లేకుండా జ్ఞాని అయ్యాడు. అందుకే చుట్టుపక్కల వాళ్లు ఆ రోజు నుంచి ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అదే కారణం." నేను, “భగవాన్ కూడా మానవ రూపంలో ఉన్న గురువు సహాయం లేకుండానే జ్ఞానాన్ని పొందాడా?” అని అన్నాను. “అవును! అవును! అందుకే కృష్ణయ్య, సంబంధానికీ, నాకూ మధ్య ఉన్న పోలికలను చాలా బయటికి తెచ్చాడు’’ అన్నాడు భగవాన్.

“శ్రీ రమణ లీలలో, సంబంధుడు తిరువణ్ణామలైకి వస్తుండగా అడవి తెగలు అతని ఆస్తులను దోచుకున్నట్లు పేర్కొనబడింది. అతను జ్ఞానం మరియు జ్ఞానం ఉన్న వ్యక్తి.

అతనికి ఏ ఆస్తి ఉంది?” అని అడిగాను. “ఓహ్! అని! భక్తి మార్గాన్ని అనుసరించాడు, కాదా? అందుచేత ఈశ్వరుని ఆజ్ఞల ప్రకారం అతనికి బంగారు గంటలు మరియు ముత్యాల పల్లకి మరియు ఆ స్వభావం యొక్క ఇతర చిహ్నాలు ఉన్నాయి. అతనికి ఒక మఠం (సన్యాసుల కోసం ఒక స్థాపన) మరియు మఠానికి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి, ”అని భగవాన్ చెప్పాడు. "అవునా? అతనికి అవన్నీ ఎప్పుడు వచ్చాయి?" నేను అడిగాను.

భగవాన్ ఉద్వేగభరిత స్వరంతో ఇలా సమాధానమిచ్చాడు, “ఆయనకు జ్ఞాన సంబంధ అనే పేరు వచ్చినప్పటి నుండి, అంటే చిన్నతనం నుండి, అతను ఎడతెగని కవితా ప్రవాహంతో పాటలు పాడుతూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. అతను మొదట తిరుకోలక్క అనే పవిత్ర స్థలాన్ని సందర్శించాడు, అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్లి, తన చిన్న చేతులతో కాలాన్ని కొట్టాడు, భగవంతుడిని కీర్తిస్తూ పద్యాలు పాడాడు. దేవుడు దానిని మెచ్చుకున్నాడు మరియు సమయం కొట్టినందుకు అతనికి ఒక జత బంగారు గంటలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఏ పాట పాడినా, ఎక్కడికి వెళ్లినా ఆయన చేతిలో బంగారు ఘంటసాల. ఆ తర్వాత చిదంబరం మరియు ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించి, మారన్‌పాడి అనే పుణ్యక్షేత్రానికి వెళ్లారు.

ఆ రోజుల్లో రైళ్లు లేవు. ఆ ప్రదేశంలో ఉన్న పీఠాధిపతి ఈ చిన్న పిల్లవాడు కాలినడకన పవిత్ర స్థలాలను సందర్శించడం గమనించాడు.

అతని హృదయం జాలితో కరిగిపోయి, ముత్యాల పల్లకీ, ముత్యాల గొడుగు మరియు సన్యాసులకు తగిన ముత్యాలతో అలంకరించబడిన ఇతర ఉపకరణాలను సృష్టించి, వాటిని ఆలయంలో విడిచిపెట్టి, అక్కడ ఉన్న బ్రాహ్మణ పూజారులకు మరియు సంబంధకు కలలో కనిపించి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు. వాటిని సముచిత సత్కారములతో సంబంధునకు ఇవ్వు' అని చెప్పి, 'బ్రాహ్మణులు నీకు ఇవన్నీ ఇస్తారు; వాళ్ళను తీసుకెళ్ళండి.' అవి దేవుడిచ్చిన కానుకలు కాబట్టి వాటిని తిరస్కరించలేకపోయాడు. అందుచేత సంబంధుడు ప్రదక్షిణ, మొదలగునవి చేసి భక్తిపూర్వక నమస్కారములతో అంగీకరించి పల్లకీలో ప్రవేశించెను. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా ఆ పల్లకిలోనే తిరిగేవాడు. క్రమంగా కొంతమంది సిబ్బంది అతని చుట్టూ చేరి ఒక మఠాన్ని స్థాపించారు. కానీ అతను ఒక పవిత్ర స్థలం వద్దకు వచ్చినప్పుడల్లా, అతను పూజా మందిరంలోని గోపురం (గోపురం) చూడగానే పల్లకి నుండి దిగి, అక్కడి నుండి బయలుదేరేవాడు. అతను ఆ స్థలంలోకి ప్రవేశించే వరకు కాలినడకన ప్రయాణించాడు. తిరుకోయిలూర్ నుండి అరుణగిరి శిఖరం కనిపిస్తుంది కాబట్టి అతను కాలినడకన ఇక్కడికి వచ్చాడు. పెరియపురాణంలో ఆ సందర్శన గురించి స్పష్టంగా పేర్కొనలేదని ఒక తమిళ భక్తుడు చెప్పాడు, దానికి భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు: “లేదు. ఇది పెరియపురాణంలో లేదు. కానీ సంస్కృతంలో ఉపమన్యుని శివభక్తివిలాసంలో చెప్పబడింది. సంబంధుడు అరకందనల్లూర్‌లో విరాటేశ్వరుడిని పూజించి, తన పద్యాలతో భగవంతుని అనుగ్రహాన్ని పొంది, అదే విధంగా అతుల్యనాథేశ్వరుడిని పూజించాడు. అక్కడి నుంచి అరుణగిరి శిఖరాన్ని వీక్షించి, ఆనందంతో పద్యాలు పాడి, అదే ప్రదేశంలో అరుణాచలేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించాడు. దానికి భగవాన్ ఇలా సమాధానమిచ్చాడు: “లేదు. ఇది పెరియపురాణంలో లేదు. కానీ సంస్కృతంలో ఉపమన్యుని శివభక్తివిలాసంలో చెప్పబడింది. సంబంధుడు అరకందనల్లూర్‌లో విరాటేశ్వరుడిని పూజించి, తన పద్యాలతో భగవంతుని అనుగ్రహాన్ని పొంది, అదే విధంగా అతుల్యనాథేశ్వరుడిని పూజించాడు. అక్కడి నుంచి అరుణగిరి శిఖరాన్ని వీక్షించి, ఆనందంతో పద్యాలు పాడి, అదే ప్రదేశంలో అరుణాచలేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించాడు. దానికి భగవాన్ ఇలా సమాధానమిచ్చాడు: “లేదు. ఇది పెరియపురాణంలో లేదు. కానీ సంస్కృతంలో ఉపమన్యుని శివభక్తివిలాసంలో చెప్పబడింది. సంబంధుడు అరకందనల్లూర్‌లో విరాటేశ్వరుడిని పూజించి, తన పద్యాలతో భగవంతుని అనుగ్రహాన్ని పొంది, అదే విధంగా అతుల్యనాథేశ్వరుడిని పూజించాడు. అక్కడి నుంచి అరుణగిరి శిఖరాన్ని వీక్షించి, ఆనందంతో పద్యాలు పాడి, అదే ప్రదేశంలో అరుణాచలేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించాడు.

అక్కడ ఒక మండపం మీద కూర్చున్నప్పుడు , అరుణాచలేశ్వరుడు అతనికి మొదట జ్యోతి (కాంతి) ఆకారంలో మరియు తరువాత వృద్ధ బ్రాహ్మణుడి ఆకారంలో కనిపించాడు.

ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎవరో సంబంధానికి తెలియదు. బ్రాహ్మణుని చేతిలో పూల బుట్ట ఉంది. సంబంధికుని మనస్సు అయస్కాంతంలా ఆ బ్రాహ్మణుని వైపు ఆకర్షితుడయ్యింది. ఒక్కసారిగా ముకుళిత హస్తాలతో 'ఎక్కడి నుంచి వచ్చావు' అని అడిగాడు. 'నేను అరుణాచలం నుంచి ఇప్పుడే వచ్చాను.

నా గ్రామం ఇక్కడే ఉంది, దగ్గరలో ఉంది' అని బ్రాహ్మణుడు బదులిచ్చాడు. సంబంధుడు ఆశ్చర్యంగా అడిగాడు, 'అరుణాచలా! అయితే నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది?' బ్రాహ్మణుడు ఉదాసీనంగా బదులిచ్చాడు 'ఎంతకాలం క్రితం? రోజూ ఉదయాన్నే ఇక్కడికి వచ్చి అరుణాచల స్వామికి పూలమాల వేసి, మధ్యాహ్నానికి తిరిగి వస్తాను. సంబంధా ఆశ్చర్యపడి, 'అదేనా? కానీ ఇక్కడికి చాలా దూరం అన్నారు?' వృద్ధ బ్రాహ్మణుడు, 'మీకు ఎవరు చెప్పారు? మీరు ఒక్క అడుగులో అక్కడికి చేరుకోవచ్చు.

అందులో గొప్పదనం ఏముంది?' అది విని, సంబంధుడు అరుణాచల దర్శనానికి ఆరాటపడి, 'అలా అయితే, నేను అక్కడ నడవగలనా?' వృద్ధుడు, 'అయ్యా! నాలాంటి పెద్దాయన అక్కడికి వెళ్లి రోజూ ఇక్కడికి వస్తుంటే నీలాంటి యువకుడు చేయలేడా? మీరేం చెపుతున్నారు?' “సంబంధ గొప్ప ఆత్రుతతో, 'అయ్యా, అలా అయితే, దయచేసి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లండి' అని అడిగాడు మరియు తన పరివారంతో ఒక్కసారిగా బయలుదేరాడు. బ్రాహ్మణుడు ముందుగానే వెళుతున్నాడు మరియు పార్టీ వెనుక ఉంది. అకస్మాత్తుగా బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. పార్టీవారు అక్కడా ఇక్కడా చూస్తుండగా, అయోమయానికి గురైన వేటగాళ్ల గుంపు వారిని చుట్టుముట్టి, పల్లకీ, గొడుగు, బంగారు గంటలు మరియు అన్ని ముత్యాలు మరియు ఇతర విలువైన వస్తువులను, వారి సామగ్రి మరియు వారు ధరించిన దుస్తులను కూడా దోచుకున్నారు. వారి నడుము బట్టలు మాత్రమే మిగిలాయి. వారికి దారి తెలియలేదు; అది చాలా వేడిగా ఉంది మరియు ఆశ్రయం లేదు, మరియు ఆహారం తీసుకునే సమయం కావడంతో అందరూ ఆకలితో ఉన్నారు. వారు ఏమి చేయగలరు? అప్పుడు సంబంధుడు దేవుడిని ప్రార్థించాడు. 'ఓ! ప్రభూ, నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు? నాకు ఏమి జరిగినా పట్టించుకోను, కానీ ఈ నా అనుచరులకు ఈ కఠిన పరీక్ష ఎందుకు పెట్టాలి?' ఆ ప్రార్థనలు విన్న భగవంతుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై, 'నా కుమారుడా, ఈ వేటగాళ్ళు కూడా నా ప్రమథ గణాలు (వ్యక్తిగత పరిచారకులు) అని చెప్పాడు.

ఎలాంటి ప్రదర్శన, ఆడంబరాలు లేకుండా అరుణాచల భగవానుని ఆరాధించడం ఉత్తమం అని వారు మీ ఆస్తులన్నింటినీ హరించారు. మీరు అక్కడికి చేరుకున్న వెంటనే మీ వస్తువులన్నీ మీకు పునరుద్ధరించబడతాయి. ఇప్పుడు మధ్యాహ్న సమయం. మీరు విందును ఆస్వాదించవచ్చు మరియు తరువాత మరింత ముందుకు వెళ్లవచ్చు. అలా చెప్పి అదృశ్యమయ్యాడు.

“ఒక్కసారిగా, దగ్గరలో ఒక సమతల స్థలంలో ఒక పెద్ద గుడారం కనిపించింది.

కొంతమంది బ్రాహ్మణులు గుడారం నుండి బయటకు వచ్చి, సంబంధుడిని మరియు అతని బృందాన్ని తమ గుడారానికి ఆహ్వానించారు, వివిధ రకాల రుచికరమైన వంటకాలతో మరియు చందనం (గంధం పేస్ట్) మరియు తాంబూలంతో వారికి విందు చేశారు .(తమలపాకులు). అందరితో పాటు ఇతరులను అలరించే సంబంధుడు స్వయంగా భగవంతుడే అలరించాడు. వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, డేరాలో ఉన్న ఒక బ్రాహ్మణుడు లేచి, 'అయ్యా, అరుణగిరికి వెళ్దామా?' సంబంధుడు చాలా సంతోషించాడు మరియు అతని అనుచరులతో పాటు బ్రాహ్మణునితో పాటు వెళ్ళాడు. అయితే వారు తమ ప్రయాణానికి బయలుదేరిన వెంటనే, దానిలోని వ్యక్తులతో కలిసి టెంట్ అదృశ్యమైంది. ఆ వింత సంఘటనలను చూసి సంబంధుడు ఆశ్చర్యపోతుండగా, అరుణాచలానికి దారితీసిన గైడ్ వారు అక్కడికి రాగానే అదృశ్యమయ్యాడు.

అకస్మాత్తుగా, గుడారం దానిలోని వ్యక్తులతో పాటు గతంలో వారిని దోచుకున్న వేటగాళ్ళు అన్ని వైపుల నుండి కనిపించి, వారు గతంలో దోచుకున్న వస్తువులన్నింటినీ సంబంధానికి పునరుద్ధరించారు మరియు అదృశ్యమయ్యారు. ఆనంద కన్నీళ్లతో, సంబంధుడు భగవంతుని గొప్ప దయకు మెచ్చి, కొన్ని రోజులు అక్కడే ఉండి, పద్య పుష్పాలతో పూజించి, తన ప్రయాణం కొనసాగించాడు. తనను భక్తితో సేవిస్తున్న సంబంధుడిపై ఉన్న వాత్సల్యంతో, దేవుడే కనిపించి, అతన్ని ఈ కొండకు ఆహ్వానించాడు. ఇలా చెబుతూ, భగవాన్ తన హృదయం భక్తితో నిండిపోయి, భావోద్వేగంతో వణుకుతున్న స్వరంతో మౌనం వహించాడు.

--కాళిదాసు దుర్గా ప్రసాద్

🛕 *త్రిపురాంతకం

 🛕  *త్రిపురాంతకం


⚜️ ప్రాచీన మంత్రం, చైతన్య విద్యలకు ప్రతీక, ఓషధీ మూలికల స్థావరం, భ్రమరాంబా మల్లికార్జుల నిలయం అయిన శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ప్రకాశం జిల్లాలోని *త్రిపురాంతక క్షేత్రం* ఉంది.

🔱 శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం.  

⚜️ స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో *‘’త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం‘’* అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం.

🔱 మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరంలో, గుంటూరు–కర్నూలు మార్గంలో రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

🔱 *త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం.* అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాసభూమి. అనేక దివ్యమైన ఔషధాలకు నిలయం.  *రస రత్నాకర, నాగార్జున సిద్ధ తంత్రం* మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియజేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. 

⚜️ *త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం* అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడు. త్రిపురాంతక లింగాన్ని *‘’తత్పురుష లింగం‘’* అంటారు

🛕 *స్థల పురాణం – త్రిపురాసుర సంహారం* 

🔱 తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివకుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు. ఈ యుద్ధంలో అలసిన శరవణభవుడు *‘’ఆదిశైలం’’* అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన *"కుమారగిరి‘’* అనే పేరు వచ్చింది. 

⚜️ *తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు.* తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్రతపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 

🔱 ఎవరి చేతిలోనూ చావు కలగ కూడదని వరం కోరుకున్నారు. అపుడు బ్రహ్మ, పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను చేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలనికోరుకున్నారు. సరేనన్నాడు బ్రహ్మ.

🔱 తారాక్షుడు బంగారంతో, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు. వారు పరమేశ్వరుని ప్రార్ధించారు. అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రధం, అపూర్వ బాణాలు అవసరమని చెప్పాడు. 

⚜️ వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింపజేశాడు. విశ్వకర్మ జగత్తు తత్త్వంతో రధాన్ని, వేదతత్త్వంతో గుర్రాలను, నాగ తత్త్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటి నారిని, సోమ, విష్ణు, వాయు తత్వాలతో బాణాలను తయారుచేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారధి అయ్యాడు. అ దివ్యరధాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు.

🛕 *త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం* 🙏

⚜️ ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన, మయుడి నిశ్చలతత్త్వం వలన ఆ దివ్య రధం భూమిలోకి కుంగిపోయింది. గుర్రాలు నిలవలేకపోయాయి.  ధనుస్సు పనిచేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్ధమైన రధం నిర్మించలేకపోయినందుకు కోపపడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. 

⚜️ పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు. పరదేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలావినోదిని బాలా త్రిపురాసుందరిగా ఆమె ఆవిర్భవించింది. శివుని ధనుసులో ప్రవేశించింది. దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. 

*‘’అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ –* *అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుధివీ ఆవివేశ* 

🔱 ‘’అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం ఎక్కుపెట్టాడు. దేవతలు అప్పుడు,  *‘’నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః‘’* అని స్తుతించారు.

⚜️ త్రిపురాలన్నీ ఒకే సరళరేఖలో చేరాయి. రుద్రబాణంతో అవి ఒకే సారి ద్వంసమైనాయి. దేవ, మునులు సంతసించారు. బాలాత్రిపురసుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది. పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన, *‘’వైడూర్య లింగం‘’* గా ఆవిర్భవించాడు. 

🔱 దీనికి సాక్ష్యంగా వేదమంత్రం ఉంది – వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్యజల లింగాన్ని ప్రతిష్టించాడు. ఇక్కడ జల లింగానికి చేసిన అభిషేకద్రవ్యంలోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగంలోనే లయమై లోపల ఉన్న త్రిపురాంతకేశ్వరుని చేరుతుంది.

⚜️ త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి. ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం, లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి. 

🔱 తారకాసుర సంహారం చేసిన తర్వాత కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. 

🔱 ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి,  ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి వెళ్తూఉంటారని శివపురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది –‘’

*'అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తరహ –*
*పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం‘’*

🔱 *పిలిస్తే పలికే దైవం*🙏

⚜️ పూర్వం త్రిపురాంతకేశ్వరుడు పిలిస్తే పలికేవాడట. పాల్కురికి సోమనాధుడు బసవపురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కథ దీనికి తార్కాణం. 

⚜️ ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచిఉంది.  దక్షిణ సోపాన మార్గానికి దగ్గర *మూలస్థానేశ్వర స్వామి దేవాలయం* ఉంది. ఈయన మహా మహిమ కల దైవం. అనేక మంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు. 

🔱 దీనికి దగ్గరలో....
 *శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం* ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూలస్థానేశ్వరునికి ఆగ్నేయంగా పంచబ్రహ్మలచే ప్రతిష్టింప బడిన  *‘’పంచ లింగ దేవాలయం‘’* ఉన్నది. ఈశాన్యంలో ఆవు పొదుగు ఆకారంతో లింగాలు దర్శన మిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలను ఇస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర *వీరభద్రాలయం* ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే *ఇష్టకామేశ్వారీ* దేవాలయం ఉన్నది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న *‘’అగస్త్య లింగం‘’* ఉన్నది.  దీనినే *‘’విన్ధ్యేశ్వర లింగం"* అని అంటారు. 

🔱 ముఖ్యదేవాలయం దగ్గరే *‘’అపరాజితేశ్వరుడు‘’* ఉన్నాడు. మన్యుసూక్తం తో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ *‘’యజ్ఞేశ్వర లింగం‘’* వాయవ్యంలో హనుమంతుడు నెలకొల్పిన *‘’మారుతి లింగం‘’,* ఉన్నాయి.  వీటిని పూజిస్తే ఆయుష్షు, బలం, యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్టితమైన *‘’ఉగ్రేశ లింగం‘’* ఉన్నాయి. ఉత్తరాన *‘’భేక సోమేశ్వరుడు’’* దర్శనమిస్తాడు. ఈయన ఆరాధనను చాలా జాగ్రత్తగా చేయాలి. ఆలయంలోని బలిహరణలను భక్షిస్తాడు. ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళా శోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియంలో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో  *‘’చీకటి మిద్దె‘’* అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ, శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృశ్చిక మల్లేశ్వరాలయానికి దగ్గరలో మఠం ఉంది. శ్రీ బాలాత్రిపురసుందరిని అర్చించడానికి సిద్ధ సాధువులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింతచెట్టు ఉండేది. దాని మూలంలో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండంలో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని *‘’నిత్య నాద సిద్ధుడు‘’* అనే యోగి,  *‘’రస రత్నారం‘’* అనే గ్రంధంలో రాశాడు. చీకటి మిద్దె ప్రకనే *‘’మహా గణపతి మండపం‘’* ఉంది. విగ్రహం శిధిలమైతే ప్రక్కన కింద పెట్టారు.

⚜️ ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. *"శ్రీ చక్రం శివయోర్వపుః’’* అంటే శివ పార్వతుల శరీరమే శ్రీచక్రం. 

🔱 స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడిపోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయంగా ఉంటాడు. జలలింగాన్ని దుండగులు పీకేస్తే కొండ కింద ఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు. పునః ప్రతిష్ఠలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు. 

🔱 త్రిపురాంతకేశ్వరునికి ఉత్తరాన పార్వతీదేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం, డమరుకం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది.

⚜️ స్వామి అభిషేకాలకు, భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది. ఇందులో స్నానిస్తే పుణ్యం, మోక్షం. 

🔱 త్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహానంది లో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలంతో ఉండే కోనేరుండేది. దీనికి *‘’పాప నాశనం‘’* అని పేరు. 

🔱 నాలుగు కొండల మధ్య ఉన్న *సోమతీర్ధం పాప నాశిని.* 

⚜️ కుమార గిరికి పడమర దూర్వానది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు. దీనికి దక్షిణంలో  *‘’ముక్త గుండం"* లో స్నానం చేస్తే మోక్షమే.

🛕 *తీర్థాలు-మిగిలిన గుడులు*🔱

⚜️ *త్రిపురాంతకం అష్ట భైరవ పరివేష్టితం.* కుమార గిరికి దక్షణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. 

🔱 పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు పడమరలో శ్రీరామనాధేశ్వరుడు మిక్కిలి పూజనీయుడు. ఉత్తరాన ఉన్న కొండను పూలకొండ అంటారు ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. 

⚜️ దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమతీర్ధం ఉంది. ఇది సర్వ రోగనివారిణి. 

🔱 తూర్పున పంచబ్రహ్మలు ప్రతిష్టించిన పంచలింగాలున్నాయి. వాయవ్యంలో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యినూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతంగా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌషధి *’’సంజీవిని‘’* ఉన్నదని జ్ఞానులు చెబుతారు.

🛕 *శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం* 🛕

🙏 *చిదగ్ని కుండ సంభూత* 🙏

🔱 కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీబాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపుర గర్భగుడిపై నిర్మాణ శైలి వైవిధ్యంతో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ  గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత.  *’’త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ’’*  అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే.  అమ్మవారు నిర్గుణ శిలాకారంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం.  దీన్ని స్థానికులు *‘’నడబావి‘’* అంటారు.  

🔱అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది. చిదగ్నిగుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట.

🔱 ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యధిదేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలాకార రూపంలో అమ్మవారు కనిపిస్తుంది. 

🔱 దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్షమాలా వరదాభయహస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు.  అలంకారాలన్నీ ఈ విగ్రహానికి.  

⚜️ ఈ విగ్రహానికి వెనక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వెనక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు.

🙏 *అమ్మవారిపై శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు –*

*‘’నూటోక్క శక్తు లెప్పుడు – నాటక మటు లాడు చుండ,* 
*నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –*
*వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’* అని పద్యం చెప్పారు .

🛕 *సిద్ధి మండపాలు* 🌈

🔱 చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే *‘’సిద్ధి మండపాలు‘’* అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు శ్రీవావిలాల మహాదేవయ్య గారు, శ్రీగోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుస్ఠానం చేసేవారట.

🛕 *శ్రీ చక్ర పాదుకలు*🛕

🔱 మెట్లు దాటి బయటికి వస్తే శ్రీచక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీచక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకూ చిదగ్నికుండ దేవికి తంత్ర సంబంధ అనుసంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు,  విద్య కావాలంటే తెలుపు, శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపం తో అమ్మవారిని ధ్యానించాలి.  ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని *‘’గురుపాదాలు‘’* అంటారు. శ్రీవిద్యా సాంప్రదాయంలో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో  *‘’గురుపాదకా మంత్రం ఉంది’’.* చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణామూర్తి లింగం ఉంది. స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.

🙏 *ఛిన్నమస్తా దేవి*🙏

🔱 చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే,  ‘’ఛిన్నమస్తాదేవి’’ చిన్న మండపంలో కనిపిస్తుంది.  ఈమెనే ప్రచండ చండిక అని, వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశమహావిద్యలలో ఆరవ మహావిద్య. ఈమెను ఉపాశిస్తే కలిగే ఫలితం *‘’యామళం’’* అనే గ్రంధం వివరించింది. 

⚜️ ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా చిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి.

🌈 *రక్త పాత్రలు*

⚜️ సాధారణంగా శక్తి ఆలయాలలో సింహవాహనం,  ధ్వజస్తంభం ఉండాలి ఈ రెండూ ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని, స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత.

🙏 *’’సవ్యాప సవ్య మార్గస్థా’’.* 🙏

🔱 ఒక్కప్పుడు ఈ ఆలయంలో  *‘’పంచ మకారార్చన’’* జరిగేది అందుకే గర్భాలయంలో రాతితో చేయబడిన *‘’రక్త పాత్ర‘’* ఉంది దీనికి *‘’ఉగ్రపాత్ర ‘’* అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అరఅడుగు ఎత్తు, రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా, ఒక్కోపొతు రక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యంలో మామూలు భక్తులకు వేరొక రక్త పాత్ర ఉన్నది దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే *‘’యూప స్థంభం‘’* కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు. 

దీన్ని ఒక కవి పద్యంలో

 *‘’మదపు టేనుగు నైన ,కొదమ సింగం బైన* – 
*యూప శిలకు దా, సమీప మంద* –
*మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న* –
*లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’* 

🌈 వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని *‘’దేవతాగ్రణీ’’* అని స్తుతించారు స్కాందపురాణం శ్రీశైలఖండంలో-

 *‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ* 
*దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’*

🙏 *కదంబ వనవాసిని* 🙏

🌈 త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబవనం. ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి.  అందుకే...‌ *‘’కదంబ కుసుమ ప్రియాయై నమః‘’* అని లలితాసహస్రం లో చెప్పారు. 

🌈 కదంబ వృక్షాలే కల్ప వృక్షాలని శ్రీ శంకరభగవద్పాదులు తెలియ జేశారు. 

🙏 *వీర శిలలు*🌈

⚜️ అమ్మవారి ఉత్తర ద్వారంకు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతిబింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే.  వివిధ ఆలంకారాలతో కేశపాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పోడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరక్రుత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.

🛕 *అపరాధేశ్వరీ ఆలయం – గుహలు*🛕

⚜️ అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద *‘’అపరాధేశ్వరీ‘’* లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిధిలరూపంలోనే ఉంది. దీనికి దగ్గరలో *చింతామణి గుహ* ఉన్నది.  ఇది అమ్మవారి ఆలయమేనని భావన ఆధారం *‘’చింతామణి గృహాంతస్థా"* అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీగణపతి ఆలయం ఉండేదట అమ్మవారికి వెనక ‘’వైడూర్య శిఖరం. అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమే ఎరుక.

🛕 *మహా సర్పం – మరికొన్ని విశేషాలు*🌈

🔱 బాలాత్రిపుర సుందరీదేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్ధులు, నాగ దోషము ఉన్నవారు ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు. ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్నిగుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట.

🔱 అమ్మవారి గుడికి దగ్గరే ఉండే తెల్లని గుండ్రాయి ని *‘’ఈశ్వరుని తల గుడ్డ‘’* అంటారు. ఇది మహత్వం కల శిల అని ఇప్పుడు చెరువులో కూరుకు పోయి కనిపించటం లేదు.

⚜️ త్రిపురాంతక శివునికి పడమరగా పదమూడు కిలో మీటర్ల దూరంలో ఒక కొండ, దానికి పశ్చిమంగా ఒక ద్వారం ఉన్నాయి అక్కడ నలభై అడుగుల దూరం లో   *‘’మండే కాంతులు‘’* కనిపిస్తాయి. అక్కడి మామిడి పండు ఆకారంలో ఉన్న రాళ్ళను గుడ్డలో వేసి మూట కట్టాలి. అది ఎర్రగా మారుతుంది. ఆ గుడ్డను పాలల్లో వేయాలి. పాలు ఎర్రగా మారుతాయి. ఆ పాలను సాధకుడు వారం రోజులు అదే విధంగా తాగితే వజ్ర సమాన శరీరుడు అవుతాడు, ఆయుస్సు పెరుగుతుంది అని ‘’రస రత్నాకరం‘’ లో నిత్య నాద సిద్ధుడు రాశాడు.

⚜️ *బిలాలు*

🔱 శివాలయానికి ఉత్తరాన *‘’కోకిలా బిలం"* ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. నలభై అడుగులు లొపలికి వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తే పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి, రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు. మహా బలవంతుడై వాయువేగం కలుగుతుంది.

🌈 గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరే కాశి కేశుడు, ఒక కోనేరు, నృసింహ బిలం ఉన్నాయి.  బిలంలో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు.

🛕 *ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం*  🙏

🔱 శ్రీశైలానికి తూర్పున శిఖరేశ్వరానికి దూరం గా కారడవిలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి విగ్రహాన్ని అందరు తప్పక దర్శించాలి. ఈమె పేరు తెలుగు సాహిత్యంలో ఎక్కడా చోటు చేసుకోకపోవటం ఆశ్చర్యం గా ఉంది. ధ్యాన మగ్నయై పద్మాసనంలో శిలాపీఠం పై దర్శన మిస్తుంది. నాలుగు భుజాలు ఉన్నాయి. పై రెండు చేతులతో కలువ మొగ్గలను కింది కుడి చేతితో రుద్రాక్ష మాల, ఎడమ చేతిలో శివలింగాన్ని కలిగి ఉంటుంది. పూర్వపు ఆలయం శిధిలమైంది. ఆలయానికి ఎదురుగా ఒక సిద్ధుని విగ్రహం ఉంటుంది. కాపాలికల దేవత అయి ఉండచ్చు. ఉత్తరాన ఒక వాగు నిరంతరం ప్రవహిస్తుంది. సుమారు ఎనిమిదవ శతాబ్దపు ఆలయం అనుకోవచ్చు జీపులలో అడవిలో ప్రయాణించి ఇష్ట కామేశ్వరిని దర్శించాలి. 

🙏 ఈ ఆలయాన్ని,  కంచి పరమాచార్యులవారు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రుల వారు మొదటిసారి దర్శించి లోకానికి తెలియజేశారు. అప్పటిదాకా ఎవరికీ తెలియదు. తర్వాత ఇటీవలికాలం లో శ్రీచాగంటికోటేశ్వర రావు గారు వెళ్లి దర్శించి, అమ్మవారి ప్రాభవాన్ని ప్రవచనాలలో తెలియజేస్తున్నారు. ఇప్పుడే ప్రభుత్వం పక్కారోడ్లు నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు.

🙏 *వీరశైవం –మఠాలు*

🔱 త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహదపడింది. ఇక్కడి *‘’గోళకీ మఠం’’* ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దంలో వీరశైవం విజృభించింది. 1312 నాటికి పూజారులు 72 నియోగాల వారు స్థానాధిపతులు శ్రీ అసంఖ్యాక మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి *‘’విశుద్ధ శైవ మఠం’’* ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేద వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది. పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య *‘’కాపాలిక మతం‘’* అభివృద్ధి చెందింది అప్పుడే *‘’పంచ మకారార్చన"* జరిగేది (మద్యం మాంసం మగువ ).

🛕 *ఉత్సవాలు*

🔱 ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంతనవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభషేకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిధిలావస్థకు చేరింది.  శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకొని పునరుద్ధరించి మళ్ళీ నిత్యధూపదీపనైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. 2006 లో కరివెన వారి బ్రాహ్మణ అన్నదాన సత్రం అమ్మవారి ఆలయానికి దగ్గరలో ప్రారంభ మైంది.  శివరాత్రి నాడు జరిగే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది.  

🙏 ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం వెళ్లి శ్రీ బాలాత్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి.

*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం*
*చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం* గురు చరణం  ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ9490860693 కి WhatsApp చేయండి.
🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌹