Monday, April 7, 2025

 


సినిమా చూసిన రెండు వారాల తర్వాత కూడా నా మైండ్ లో నుంచి పోని ఆలోచనలు.....

ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రలు (తెలిసీ తెలియని మాయదారి వయస్సు కాబట్టి) చేసింది తప్పా ఒప్పా అనేది కాసేపు పక్కన పెడితే...

హీరో పాత్ర తల్లి చేసింది మాత్రం ముమ్మాటికీ తప్పే... 

వయసులో ఉన్న కొడుకు, తెలిసో తెలియకో ఇష్టపడిన అమ్మాయిని ఇంటికి తీసుకు వస్తుంటే,  ఆ విషయం భర్తకు తెలియకుండా దాచి సపోర్ట్ చేయడం,  సంసారం కోసం కష్టపడే మొగుడిని పిచ్చోడ్ని చేయడం నాకు సబబు అనిపించలేదు.

ఆమెకి కూడా హీరోయిన్ వయసు కూతురు ఉంది కదా,
చదువు మానేసిన కొడుకు ఏం చేస్తున్నాడో ఆమెకి కనీస అవగాహన లేకుండా సపోర్ట్ చేయడం, అలాంటి వాడి కోసం ఒక అమ్మాయి ఇంటికి వస్తే బుుద్ధిచెప్పాల్సింది పోయి ఈడొచ్చిన కూతురిని కూడా వాళ్ళతో కూర్చోబెట్టింది.
...
ఇకపోతే హీరోయిన్ పాత్ర మదర్...

మహాతల్లి, గొప్ప పెంపకం. గదిలోకి పోయి పెళ్లాట ఆడుకున్నాం అనగానే ప్రేమగా hug చేసుకుంటుంది పైగా   ఇదేం పని అని ఒక్క మాట కూడా అనలేదు.

అసలే తండ్రి లేడు, ఆ అమ్మాయి తల్లి ఎంత బాధ్యతగా ఉండాలి ?  అతనిని ఇష్టపడటానికి లేదా ప్రేమించడానికి ఒక్క కారణం కూడా అడగలేదు.

తీరా కేస్ అయిపోయాక కూతురిని తీసుకెళ్తూ ఒకరకమైన గర్వంగా నడుచుకుంటూ వెళ్లడం, ఆ అమ్మాయి వెళ్ళి హీరోని కలిసి వాటేసుకోవడం.

హీరో హీరోయిన్ ల తల్లుల క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు.

హీరో పాత్ర  చదువు మానేసాడు, సెటిల్ అవ్వలేదనే తండ్రి బాధ ఎవరికీ అక్కరలేదు.

చివరలో హీరోయిన్ వచ్చి హీరోతో నాకు 18 నిండాయి అని చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏమిటి?

శివాజీ  పాత్ర చెప్పే విధానం తప్పేమో గానీ, చెప్తోంది మంచే కదా.. మనింట్లో ఆడపిల్లను అలా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్ళి చేస్తామా లేదా ప్రేమ అంటూ తిరిగితే మౌనంగా ఉంటామా? అతన్ని విలన్ లా చూడ్డం ఏంటో ??

చట్టాలు ఎవరికోసం చేస్తున్నారో...వాళ్ళకే తెలియకపోతే ఎందుకు? అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా నిజంగా బాగా తీసారు...

పైన చెప్పిన ఆలోచనలు చాలామందికి రేకెత్తించారు. చట్టాల గురించి చర్చించే  ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి
 Hari Kishan:
అవ్వా  పొట్టేలు (సరదా జానపద కథ)
డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
********
         ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్దానికి నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కతే వండుకుంటా తింటా తిరుగుతా వుండేది. వాళ్ళింటి పక్కనే ఒక చెరువుంది. ఒకరోజు పక్కింటోళ్ళు ఆ చెరువులో చేపలు పడతా వుంటే చూసి ఆ ముసల్ది కూడా చేపలు పట్టుకుందామని ఒక చిన్న వల తీసుకోని పోయింది. పొద్దున్నించీ సాయంత్రం వరకూ వల ఇసుర్తా వుందిగానీ ఒక్క చేప గూడా పల్లేదు.
"ఎప్పుడూ నాలుగో ఐదో పడతా వుండేవి. ఈ రోజేమి ఒక్కటి గూడా పల్లేదు" అనుకుంటా ఆఖరిసారి చూద్దామని వల విసిరింది. లింగులిటుకుమని సరిగ్గా మన చిటికెన వేలుంటాది గదా అంత చిన్న చిన్న చేప ఒకటి పడింది.
ఏదో ఒకటి దొరికింది చాలనుకోని ఆ ముసల్ది దాన్నే తీసుకోని ఇంటి కొచ్చింది. చూసి చూసి అంత చిన్నదానిని కూర చేసుకోని తినబుద్ది కాలేదు. దాంతో “ఎట్లాగూ నాకెవరూ లేరు. ఈ చేపపిల్లనన్నా పెంచుకుందాం" అనుకోని దాన్ని తీస్కోనిపోయి ఒక చెంబులో ఏసింది. రోజూ దానికి మూడుపూటలా బాగా అన్నం, కూరలు, పండ్లు ఎంత తింటే అంత ఏయడం మొదలు పెట్టింది.
అట్లా ఆ చేపపిల్ల రోజూ బాగా తినీతినీ వారం రోజులు తిరిగేసరికి చిటికెన వేలంత వుండేది కాస్తా చెంబంత లావయింది. దాంతో ఆ ముసల్ది దాన్ని తీస్కోనిపోయి ఒక పెద్ద బిందెలో ఏసింది. ముసల్ది మూడుపూటలా బాగా తిండి పెడతా వుంది గదా, దాంతో అది బాగా మెక్కిమెక్కీ మరోవారం తిరిగేసరికి చెంబంత వున్నది కాస్తా బిందెంతయింది. అప్పుడా ముసల్ది దాన్ని తీస్కోనిపోయి జాలాడిలోనున్న పెద్ద గచ్చులో ఏసింది. కానీ వారం తిరిగేసరికల్లా అది బాగా తినీతినీ బిందెంత వున్నది కాస్తా గచ్చంతయింది. దాంతో ఆ ముసల్ది ఇంగ లాభం లేదనుకోని దాన్ని తీస్కోనిపోయి ఇంటి పక్కనే వున్న చెరువులో వదిలింది.
ఆ ముసల్ది యాడ తిరుగుతా వున్నా అన్నం సమయానికి మాత్రం చెరువు కాడికొచ్చి “ష్..ష్..." అని పిల్చేది. అట్లా ఆ ముసల్ది “ష్.. ష్..." అనడం ఆలస్యం ఆ చేప యాడున్నా సరే రయ్యిమని ఈదుకుంటా ఆమె దగ్గరకొచ్చేది. ఆ ముసల్ది తాను తెచ్చినేటివన్నీ దానికి ప్రేమగా ఒకొక్కటే తినిపిస్తా కబుర్లాడేది.
ఒకరోజు ఆ ముసల్దానికి ఏదో పనిబడి పక్కూరికి పోయింది. సాయంకాలానికి గానీ రాలేకపోయింది. ఆరోజు మధ్యాన్నం ఏం జరిగిందంటే కొందరు గొర్రెలోల్లు గొర్రెల్ని తోలుకుంటా ఆ చెరువు కాడికి వచ్చినారు. గొర్రెలు నీళ్ళు తాగినాక వాటిని అదిలిస్తా “ష్...ష్..." అన్నారు. అవ్వే వచ్చిందనుకోని ఆ చేపపిల్ల సంబరంగా బైటికొచ్చింది. దాన్ని చూసి వాళ్ళు "అబ్బ! ఎంత లావుగుందీ చేప. దీన్నెట్లాగైనా పట్టుకుంటే బాగా కూరొండుకోని కడుపు నిండా తినొచ్చు" అనుకోని మట్టసంగా చుట్టూ చుట్టుకోని పట్టేసుకున్నారు. దాన్ని ఇంటికి తీస్కోనిపోయి చంపి పులుసు చేసుకున్నారు.
అవ్వ సాయంత్రం ఇంటికి రాగానే “పాపం! మధ్యాన్నం నించీ ఎంత ఆకలిగా ఉందో ఏమో” అనుకుంటా బెరబెరా ఒక పెద్ద గిన్నె నిండా అన్నం చేసుకోని చెరువు కాడికొచ్చి ఎప్పట్లాగే “ష్... ష్..." అని పిల్చింది. కానీ అది లోపలుంటే గదా వచ్చేది. ఎంత సేపు పిల్చినా రాలేదు.
"ఇదేందిరా బగమంతుడా! రోజూ పిలుస్తానే రయ్యిమని ఎగుర్లాడుకుంటా వచ్చేది. ఈరోజేమి ఎంత పిల్చినా రావడం లేదు. ఏం జరిగిందో ఏమో" అనుకుంటా చుట్టూ చూస్తా వుంటే చెరువు కాడ మేకల, గొర్రెల కాలిగిట్టల గుర్తులు కనబన్నాయి. "కొంపదీసి ఈ మేకలోల్లుగానీ దాన్ని పట్టుకోలేదు గదా" అనుకోని నెత్తిన గొంగళి కప్పుకోని, చేతిలో చిప్ప పట్టుకోని, అడుక్కునే దాని మాదిరి ఆ మేకలోల్ల ఇంటి కాడికి పోయి “అమ్మా! అన్నం తినక నాలుగు రోజులైంది తల్లీ! కొంచం ఏమన్నా వుంటే పెట్టండమ్మా" అంటూ అరిచింది. ఆ మేకలోల్లు ఎవరో అడుక్కుతినేది అనుకోని చేపల పులుసు తెచ్చి ఆమె తట్టలో పోసినారు. దాంతో వాళ్ళే చేప పట్టుకోని తిన్నారని ఆ ముసల్ది గుర్తుపట్టేసింది. వెంటనే వురుక్కుంటా పోయి వూరోల్లందరినీ పిల్చుకోనొచ్చి "నా చేప నాకియ్యండంటా" మేకలోల్లతో పెద్ద గొడవ పెట్టుకోనింది.
చచ్చిపోయినాక ఏదీ తిరిగిరాదు గదా. దాంతో పూరోల్లందరూ “అయిపోయిందేదో అయిపోయింది. అదిగాకుండా వేరేది నీకేది ఇష్టమైతే అది కోరుకో, మేమిప్పిస్తాం" అన్నారు. ఆ ముసల్ది ఏం కోరుకోవాలబ్బా అని ఆలోచిస్తా వుంటే వాళ్ళ దగ్గర ఒక మాంచి పొట్టేలుపిల్ల కనబడింది. దాంతో అది కావాలనింది. సరేనని వూరోళ్ళు ఆ పొట్టేలు పిల్లను ముసల్దానికి ఇప్పించినారు.
అవ్వ ఆ పొట్టేలు పిల్లని చానా ప్రేమగా చూసుకొనేది. మంచి మంచి పండ్లు, కూరగాయలూ తీసుకోనొచ్చి పెట్టేది. అట్లా కొంతకాలానికి అది పెరిగి పెద్దగయింది. అవ్వ రోజూ తన కోసం అడవికి పోయి కష్టపడి అన్నీ తీసుకొస్తా వుంటే చూసి, ఒకరోజు పొట్టేలు "అవ్వా... అవ్వా.... రోజూ నా మేత కోసం ఎందుకంత కష్టపడతావ్. నేనిప్పుడు పెద్దదాన్నయినాను గదా. నేనే పోయి తినొస్తాలే" అనింది. ఆ ముసల్ది 'సరే' అనింది.

ఒకరోజు ఆ పొట్టేలు అడవిలో పోతావుంటే దారిలో దానికి ఇద్దరు దొంగలు ఒక గుహలో నుంచి బైటికి వస్తా కనబన్నారు. వాళ్ళట్లా బైటికి పోవడం ఆలస్యం ఇది మట్టసంగా లోపలికి దూరింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకోనొచ్చిన వజ్రాలు, రత్నాలు, మణులూ, మాణిక్యాలు, బంగారం, హారాలు... ఒకటిగాదూ రెండూ గాదు... కుప్పలు కుప్పలు కనబన్నాయి. వెంటనే ఆ పొట్టేలు అట్లాఇట్లా ఒకసారి చూసి కనబన్నవి కనబన్నట్లు కుప్పలు కుప్పలు నున్నగా మింగేసి ఇంటికి చేరుకోనింది.
అవన్నీ కడుపులోనికి పోయినాయిగానీ అరగవు గదా. దాంతో ఇంటికి చేరగానే “అవ్వా అవ్వా! కడుపు ఒకటే నొస్తావుంది. కాస్త రోకలిబండ తీసుకోనొచ్చి ఒకొక్క పక్క ఒకొక్క పోటు పొడుచే" అనింది. దాంతో అవ్వ “దారిలో అడ్డమైనవన్నీ తింటే కడుపు నొయ్యక ఏం నొస్తాది" అంటూ కోపంగా రోకలిబండతో ఎడమపక్క ఒక్క పోటు పొడిచింది. అంతే... ఆ పొట్టేలు నోట్లోంచి మణులూ, మాణిక్యాలూ దభీమని కిందపడినాయి. ఆ ముసల్ది ఆచ్చర్యపోతా ఈసారి కుడిపక్కన ఒక పోటు పొడిచింది. ఈసారి వజ్రాలూ, వైఢూర్యాలూ పడినాయి. అట్లా ఒకొక్క పోటుకు ఒకొక్కటి చొప్పున కడుపులో వున్నవన్నీ ఒక్కటి గూడా మిగలకుండా అన్నీ బైటికొచ్చేసినాయి.
ఆ ముసల్ది అవన్నీ చూసి చానా సంబరపడింది. వాటిని అమ్మి పెద్ద మేడ కట్టుకోనింది. అది చూసిన పక్కింటామె "నిన్న మొన్నటి వరకూ మామూలుగానే వుండెనే. ఒక్కసారిగా యాన్నించి వచ్చిందబ్బా ఇంత డబ్బు" అని ఆచ్చర్యపోయి ముసల్దాని దగ్గరికి పోయి “ఏంది కత" అనడిగింది. ఆ ముసల్ది జరిగినదంతా చెప్పింది.
ఆ పక్కింటామె దగ్గర ఒక కుక్కుంది. ఆమె ఇంటికి పోగానే “నువ్వూ వున్నావు ఎందుకు? మూడుపూటలా తిని కూచోడానికి తప్ప ఎందుకూ పనికిరావు. పో... పోయి ఆ పొట్టేలు మాదిరి యాడన్నా ఏమన్నా దొరికితే తిని రాపో" అంటూ దాన్ని తన్ని తరిమేసింది. పాపమా కుక్క అడవిలో ఎంత దూరం పోయినా దానికి ఏమీ కనబల్లేదు. దాంతో ఎముకలూ, చెత్తా, చెదారమూ తిని మట్టసంగా ఇంటికొచ్చింది.
కుక్క ఇంటికి రాగానే ఆమె సంబరంగా చాప పరచి కుక్కను దాని మీద పన్నబెట్టి రోకలిబండతో ఎడమ పక్కన ఒక పోటు పొడిచింది. అది ఎముకలు కక్కింది. “ఇదేందిరా నాయనా" అని కుడిపక్క పొడిస్తే నానా గబ్బూ కక్కింది. దాన్తో ఆమె “ఛీ! దరిద్రం దానా! ఇండ్లంతా కంపు కంపు లేపినావు గదే" అంటూ దాన్ని తన్ని తరిమేసింది.
*********
 *📖 మన ఇతిహాసాలు 📓*


*వికర్ణుడు.. కౌరవ సోదరుడే అయినా ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాడు*
    
రాజ్యాధికారం కోసం దాయాదుల మధ్య సాగిన వివాదం చివరకు కురు వంశ వినాశనానికి కారణమైంది. ద్వాపరయుగం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివిధ పాత్రల ద్వారా వేదవ్యాసుడు తెలియజేశాడు. మహాభారతంలోని కొన్ని పాత్రలు మాత్రం తరుచూ ప్రస్తావనకు వస్తాయి. వీటిలో కర్ణుడు పేరు తెలియనివారు ఉండరు. కానీ, కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తతమైన వ్యక్తి దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు. నిండు సభలో ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే పాండవులు సహా ధ్రుతరాష్ట్ర, రాభీష్మ, ద్రోణ, కృపాచార్యుడు చోద్యం చూసినా ఆ ఒక్కడే దుర్యోధనుని చర్యను ఎదిరించాడు. అలాగని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన నిలవలేదు. అన్నదమ్ముల రక్త సంబంధానికి కట్టుబడి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు.

వికర్ణుడు తన కౌరవ సోదరులతో హస్తినలో అల్లారుముద్దగా పెరుగుతూ సకల విద్యలను ఔపోసానపట్టాడు. దుర్యోధనాదులలతో కలిసి భీష్మ, ద్రోణ, కృపాచార్య లాంటి వారివద్ద యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. ద్రౌపది వస్త్రాపహరణంలో తన సోదరుడు దుర్యోధనుడిని ప్రశ్నించకపోయింటే నూరుగురిలో ఒక్కరిగా వికర్ణుని కథ సాగిపోయేదేమో. ద్రౌపదీ వస్త్రాపహరణం సమయానికి వెలుగులో వచ్చాడు. మాయా జూదంలో పాండవులను ఓడించిన దుర్యోధనుడు పణంగా పెట్టిన ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసనుని పంపుతాడు. ఆ తరుణంలో భీష్మ, ద్రోణ లాంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే ఒక్క వికర్ణుడు మాత్రం అలా చేయడం తప్పని వారించాడు. ఈ చర్యల వల్ల కురువంశానికే మచ్చవస్తుందని హెచ్చరించిన వికర్ణుడిని కర్ణుడు అడ్డుకున్నాడు.

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు షరతు ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం పూర్తిచేశారు. అనంతరం తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమంటూ కృష్ణుడు, సంజయుడు ద్వారా సాగించిన రాయబారం విఫలం కావడంతో కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. ధర్మం పాండవుల పక్షాన ఉందని, తమకు ఓటమి తప్పదని వికర్ణుడు ముందే గ్రహించినా తన సోదరుడు దుర్యోధనుడినే అనుసరించడానికే సిద్ధపడ్డాడు. అలాగని నామమాత్రంగా యుద్ధం సాగించలేదు. కురుక్షేత్ర మహాసంగ్రామం నడిచిన ప్రతిరోజూ అతని ప్రతిభ మార్మోగుతూనే ఉంది. విలువిద్యలో కర్ణుని తరువాత ఎన్నదగిన యోధుడు వికర్ణుడు. అందుకే భగవద్గీత తొలి అధ్యాయం ‘అర్జున విషాదయోగం’ఎనిమిదో శ్లోకంలో వికర్ణుని ప్రస్తావన వస్తుంది.

*‘భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ’* అని ద్రోణాచార్యులతో దుర్యోధనుడు అంటాడు. ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ లాంటి యోధులంతా తన సరసన ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడటం ఇందులో కనిపిస్తుంది. వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అధర్మం పక్షాన నిలిచి పోరాడటంతో మృత్యువు తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామం 14వ రోజున భీముడితో వికర్ణుడు తలపడ్డాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు. వికర్ణుని మరణానికి భీముని మనసు సైతం భారమైపోయింది. ఒక దశలో వికర్ణునితో యుద్ధం చేయడానికి భీముడికి మనస్కరించలేదు. కానీ క్షత్రియ ధర్మం ప్రకారం పోరాడి తీరాల్సిందే అంటూ వికర్ణుడు రెచ్చగోడతాడు. అలా చివరి వరకూ తను నమ్మిన ధర్మానికి కట్టుబడి కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు.

*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

Sunday, April 6, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-463.
4️⃣6️⃣3️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*48. వ శ్లోకము:*

*”సహజం కర్మ కౌన్తేయ! సదోషమపి న త్యజేత్l*
 *సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాఃll”*

“ఓ అర్జునా! మానవులకు తమ స్వభావసిద్ధమైన కర్మ దోషములో కూడినది అయినను, స్వధర్మమును వదలకూడదు. ఎలాగంటే అగ్ని ఎంతటి ప్రకాశాన్ని ఇస్తున్నా అగ్ని పొగతో కప్పబడి ఉన్నట్టు, ఈ లోకంలో చేయబడే ప్రతి కర్మ కూడా ఏదో ఒక దోషముతో కప్పబడి ఉంది.”
```
కర్మల గురించి మరి కొంచెం వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు మూడు గుణముల హెచ్చుతగ్గులతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది. ప్రకాశాన్ని ఇస్తుంది. వెలుగును ఇస్తుంది. కానీ అగ్ని పక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేము కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మఫలములను భగవంతుడికి అర్చిస్తే, ఆ కర్మలలో దోషం ఉన్నా, ఆ కర్మల వాసనలు అంటవు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదము వలన దోషములు ఉన్నా వాటిని పరమాత్మ పరంగా చేస్తే, వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నాడు పరమాత్మ.

ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాము. కాళ్ల కిందపడి ఎన్నోజీవులు మరణిస్తుంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా పంచ మహాయజ్ఞములు చేయమన్నారు. 
1. బ్రహ్మయజ్ఞము (దేవతలను ఆరాధించడం, శాస్త్రములు చదవడం, వినడం)
2. పితృయజ్ఞము అంటే పితృదేవతలను ఆరాధించడం, జలతర్పణములు, పిండప్రదానములు చేయడం.
3. దేవ యజ్ఞము అంటే సకల దేవతారాధన, హోమములు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం.
4. భూతయజ్ఞము అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం.
5. మనుష్య యజ్ఞము అంటే బ్రాహ్మణులకు, అతిధులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తి పరచడం, వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-462.
4️⃣6️⃣2️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*47. వ శ్లోకము:*

*”శ్రేయాన్స్వధర్మోవిగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్l*
 *స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥”*

“తనకు నిర్దేశింపబడిన ధర్మము అంటే స్వధర్మము గుణము లేనిదిగా కనపడినప్పటికినీ, కష్టతరమైనప్పటికినీ, ఇతర ధర్మములు ఎంత మంచివిగా కనపడినప్పటికిన్నీ, పరధర్మము కంటే స్వధర్మము శ్రేష్టమైనదే అవుతుంది. స్వధర్మాన్ని పాటిస్తే ఎటువంటి పాపము అంటదు.”
```
(ఇదే శ్లోకం మీకు మూడవ అధ్యాయం 35వ శ్లోకంగా కనిపిస్తుంది. ఆ శ్లోకాన్నే పదాలు మార్చి అదే భావాన్ని ఇక్కడ తెలియజేసారు వ్యాసుల వారు)

ప్రతి మానవుడికి ఒక ధర్మం, కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాసము. అది దాని ధర్మము. దాని ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కాని మనిషి విశ్వాస ఘాతకం, నమ్మకద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికిపుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించి పోయాడు. పిల్లి తన తోటి పిల్లిని చంపదు. పులి సాటి పులిని చంపదు. కాని మానవుడు తన తోటి మానవుని చంపుతున్నాడు. అంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద మక్కువ ఎక్కువ. మానవ ధర్మం మానవత్వం, అందరినీ సమానంగా తన మాదిరి చూడటం. ఇది చాలా కష్టం. అందుకే మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు. అంటే మానవులు ఎవరి ధర్మం వారు పాటించడం లేదు. పరధర్మాన్ని పాటిస్తున్నారు.

స్వధర్మం ఆచరించడం చాలా కష్టం. కాబట్టి స్వధర్మం పనికిరాదు అని అవివేకంతో అనుకుంటూ ఉంటారు. పరధర్మం చాలా మంచిది అని భావిస్తుంటారు. ఎలాగంటే విద్యార్థి ధర్మం పాఠశాలకు వెళ్లి కాలేజీకి వెళ్లి చదువుకోవడం, చదువుకున్న పాఠాలు రాత్రి వల్లెవేయడం. ఇది చాలా కష్టం. కాని స్కూలు కాలేజీ ఎగ్గొట్టి తిరగడం పరధర్మం, అది చాలా సుఖం. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమ తను విద్యుక్త ధర్మమును వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాలలో, ఇతర వ్యాపకాలలో పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మము. కాని వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవడం స్వధర్మం. అంటే నేను ఎవరు? కోహం? నేను వేరు దేహము వేరు అని తెలుసుకోవడం, నిష్కామ కర్మలు చేయడం, భగవంతుని సేవించడం. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం ఇది స్వధర్మం, ఇది చాలా కష్టం. నేనే ఈ శరీరము, ఇదంతా నాది, ఈ ప్రాపంచిక సుఖములు అనుభవిస్తాను, ఆస్తులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులే నా సర్వస్వం అనడం పరధర్మం. ఇది చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది.

ఆఖరుగా ఒక్క మాట. ప్రతి వ్యక్తికీ వివాహ బంధం ఉంటుంది. భార్యను సహధర్మచారిణిగా చూడటం భర్త ధర్మం. భార్యను వదిలిపెట్టి ఇతర స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం పరధర్మం. ఇదే సూత్రం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భార్య భర్తలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే, ఈ నేరాలు ఘోరాలకు ఆస్కారమే ఉండదు అని గ్రహించాలి. రాముడు స్వధర్మాన్ని పాటించాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. రావణుడు పరధర్మాన్ని ఆశ్రయించాడు. ఇతరుల సొత్తుకు ఆశించాడు. ఉన్న రాజ్యం పోయింది. తుదకు ప్రాణం కూడా పోయింది. ఇదే మంచి ఉదాహరణ.

ఎవరైతే కొంచెం కష్టమైనా స్వధర్మాన్ని పాటిస్తూ, పరధర్మం జోలికి పోకుండా ఉంటే, అతడికి ఎటువంటి పాపము అంటదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే స్వధర్మము అంటే ఆత్మధర్మము. ఆత్మజ్ఞానం సంపాదించడం. అలా కాకుండా ధనసంపాదనే ధ్యేయంగా, ప్రపంచ జ్ఞానం మాత్రమే సంపాదించడం పరధర్మం.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *ఎవరు దాత?*
                

```
కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి-   ’దాతృత్వం.’ 

స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. 

అలనాటి శిబిచక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకొన్నామా? కలియుగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. 

ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. 
కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు- శీలస్వభావాలు!

పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ- ‘శ్రియాదేయం’, ‘ప్రియా దేయం,’ ‘భియాదేయం... అనే మూడు లక్షణాలను చెప్పింది. 

దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్లుగా సంతో షంగా దానం చేయడాన్ని ‘శ్రియాదేయం’ అంటారు. 

‘అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం' అన్నాడు శృంగారనైషధంలో శ్రీనాథుడు. 

దానం చేయడంపట్ల ఆసక్తి, అవగా హన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదంది మహాభారతం. 

ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుపడుతూ దానం చేయడం ‘ప్రియాదేయమ’నే మాటకు తాత్పర్యం. 

ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం ‘ప్రియా దేయం’ అవుతుంది. 

ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- ‘భియాదేయం’. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. 

కామ్యకవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్తాడు. 
ఆ సందర్భంలో 'అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం ఏ మాత్రం దక్కదు' అని ధర్మరాజుతో చెబుతాడు. 

అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు.

‘శ్రియాదేయం’ ‘ప్రియాదేయం’ ‘భియాదేయం’... మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

చేయడానికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్యతను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. 

అంతే కాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దాన ఫలం దక్కదు సుమా... అంటూ భారతం ఆనుశాసనిక పర్వం హెచ్చరించింది. 

దాతలమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలేంటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.✍️
      -ఎర్రాప్రగడ రామకృష్ణ.```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *సంతానం తోనే  స్వర్గమా?*

        *‘అపుత్రస్య గతిర్నాస్తి ..?!'*
               


*ఇది ఎంతవరుకు నమ్మాలి ?'*
*(పిల్లలు లేకపోతే నరకమేనా ?)*

*పిల్లలు లేని వారి పరిస్థితి ఏమిటి? వారి ఆత్మ పరిస్థితి ఏమిటి? అని చాలా మంది అనుకుంటారు.*
```
వంశోద్ధారణ చేసే కొడుకు లేక పోతే.. అంటే, చనిపోయాక తలకొరివి పెట్టే వారు లేకపోతే తమ గతేమిటి? అనీ, పితృ కార్యాలు ఆగిపోతాయనీ వ్యధ పడుతూ ఉంటారు చాలామంది.

దీనికి సంబంధించి, ప్రాచీన గ్రంధాలు ఏమి చెబుతున్నాయి? శాస్త్ర నిర్ణయం ఏమిటి?

పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు!

వేదోక్త కర్మలు చేసేవారూ, జ్ఞాన సంపాదన చేసేవారూ, ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసే వారూ, పిల్లలున్నా, లేకున్నా, వారి వారి సత్కర్మల వల్ల ఉద్ధారం అవుతారు. 

పాపులూ, దుష్కర్మలు చేసినవారూ, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మలతోనో, పిండ ప్రదానాలతోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప, పిల్లలు లేరని నరకం లేదు.

మనకు భగవద్భక్తి లేక, సాధన చేయక పోతే, దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే, నరకమే. తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే 'సద్గతి'. 
అదే శాస్త్రం!


శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది..```


*పుత్రులు ఆరు రకాలు..*```

1. ఔరసుడు,
2. దత్తకుడు,
3. కృత్రిముడు,
4. గూఢోత్పన్నుడు,
5. అపవిధ్ధుడు,
6. క్షేత్రజుడు..

వీరికి రాజ్యములో కానీ, ఆస్తిలో కానీ భాగం ఉంటుంది..```


*ఇంకొక రకమైన పుత్రులు, ఆరుగురు ఉన్నారు..*```

1. కానీనుడు,
2. సహోఢుడు,
3. క్రీతుడు,
4. పౌనర్భవుడు,
5. స్వయందత్తుడు,
6. జ్ఞాతుడు..

వీరు కూడా పుత్ర సమానులే కానీ, వీరికి రాజ్యాధికారము కానీ, ఆస్తిలో భాగము కానీ వుండదు..

మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే, మన తర్పణ విధులలో, ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికీ, అటు తల్లి వైపు మూడు తరాల వారికీ పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము..

కాబట్టి, ఎవరికీ కొడుకు లేడని బాధ పడవలసిన పనిలేదు. యోగ్యులైన కూతురుయొక్క కొడుకులు తర్పణాలు విడిచినా, అవి ఆ తండ్రికి అందుతాయి..

తమకు పై లోకమున ఉత్తమ గతులు లభించుటకు పుత్రులు కావలయును అనుకుంటారు.. తమకు పుత్రులు కలగని వారు, అయ్యో, మాకు పుత్రులు కలుగ లేదు.. మాకు ఎట్లు ఉత్తమ గతులు కలుగును? అని అనుకుంటారు..```

*'కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై*
*కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్*
*వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్*
*చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా'..*```

కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగిననూ, వారి మూలమున అతడు ఏ ఉత్తమ లోకములు పొంద గలిగాడు? బ్రహ్మచారిగనే యుండి, సంతతియే లేకున్న శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? కనుక పుత్రులు లేని వానికి మోక్ష పదము లభించక పోవడము వుండదు. పుత్రులు గల వారికి కూడా ఉత్తమ గతులుగానీ, మోక్షముగానీ సిద్ధించక పోవచ్చును. పుత్రులు లేని వారికి అవి రెండూ సిద్ధించనూ వచ్చును..

కావున, కొడుకులు లేరని ఎవరూ బాధ పడకూడదు. మన పుణ్యం మనమే సంపాదించు కోవాలి. మన ఉద్ధారణ కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ ఈశ్వరుని దయ వలన ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై, మన ఉత్తమ గతులను మనమే సాధించుకోవాలి.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *పరీక్షలు కాదు…!*
   *మనలో… సహనాన్ని పెంచి,*
    *సత్యానికి చేర వేసే వారధులు..!!*
                 
   (అందరూ చదవాల్సిన చక్కని కథ.)

```
ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తూ గురువు గారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధ పడుతూ వుంటాడు. 

ఒక రోజు అగ్ని ప్రమాదం లో గురువు గారి ఆశ్రమం అంతా ఏమి మిగలకుండా అంతా కాలి బూడిద అయి పోతుంది.

అప్పుడు శిష్యుడు కి ఒక సందేహం వచ్చి గురువు గారిని ఇలా ప్రశ్నిస్తాడు…

“గురువు గారూ! మీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు, ఇది నేను చూస్తున్నాను. మీ లాగే ఎందరో గురువులు వారు కూడ మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు.

సోక్రటీస్,కబీర్,బుద్దుడు,ఓషో,రాముడు, కృష్ణుడు, సత్య హరిశ్చంద్రుడు, ఇలా ఇంకా ఎందరో మహానుభావులు అందరు కూడ ఎన్నో కష్టాలను చవి చూశారు కదా, అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే…  
మీ గురువులు అందరు కూడ ‘ధర్మం లో ఉండండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది!’ అని అంటుంటారు. మరి ఈ గురువులు అందరు కూడ ధర్మంగానే ఉన్నారు కదా మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు?” అని ప్రశ్నిస్తాడు.


ఈ ప్రశ్నవిన్న గురువు గారు శిష్యుడు కి ఇలా సమాధానం ఇస్తారు…

“నువ్వు ‘గురువులు అందరూ ఎన్నో  కష్టాలు అనుభవించారు!’ అని నువ్వు అనుకుంటున్నావు కానీ వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు.

“భౌతిక సుఖo కోసం ఆరాట పడే  వారు సహనం తో ఉండలేరు.  ఎవరైతే సహనంతో ఉండరో  వారు ఎప్పుడూ సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు.

మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే!
మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదుర్కుంటామో మనలో అంత సహనం పెరుగుతుంది.

మనం ఎంత సహనాన్ని పెంచు కుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము, చేరుకొగలుగుతాము.

అందుకే గురువులలో సహనాన్ని పెంచడం కోసమే… ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది.

కాబట్టి మనకు వచ్చే పరీక్షలను పరీక్షలు అని అనుకోకండి! అవి మనలో సహనాన్ని పెంచి సత్యానికి చేర వేసే వారధిలు అనుకోండి.”✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *♨️మానసిక ఒత్తిడిలో యువత……*
      ❈──────🎀─────❈
*_☛పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధిక సమస్య_*
*_☛ఊబకాయంతో హృద్రోగ ముప్పు_*
*_☛యంగ్‌లైవ్స్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడి_*
       ❈──────🎀─────❈
*_🌍ఈనాడు, హైదరాబాద్‌: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు తదితర కారణాలతో యువత మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతోందని యంగ్‌లైవ్స్‌ ఇండియా అధ్యయనం వెల్లడించింది. గత నాలుగైదేళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ మానసిక అనారోగ్య లక్షణాలు పెరుగుతున్నాయని తెలిపింది. సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 59 శాతం మంది ఏదో ఒక సమస్యతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై ఈ అధ్యయనం నిర్వహించారు._*

*_✍🏻నివేదికలో వెల్లడైన అంశాలివీ..._*
━━━━━━━━━━━━━━━━━━━━
 *_➯ఏపీతో పోలిస్తే తెలంగాణ యువతలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నత వర్గాలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఈ పరిస్థితులు ఎక్కువ._*
    
*_➯పేదరికం, తల్లిదండ్రుల్లో తక్కువ అక్షరాస్యత, వెనుకబడిన, అణగారిన వర్గాల కుటుంబాల్లోని యువత ఎత్తుకు తగిన బరువు లేక బలహీనంగా ఉన్నారు. ఆహార అభద్రత పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. చదువుకున్న, ధనిక కుటుంబాల్లోని యువతలో ఊబకాయం లక్షణాలున్నాయి._* 
    
*_➯పోషకాహార సమస్యలున్న కుటుంబాలు 38శాతం ఉన్నట్లు వెల్లడైంది._*
    
*_➯ఎత్తుకు తగిన బరువులేని యువత, అదే సమయంలో అధికబరువుతో బాధపడుతున్న యువత సమానంగా ఉన్నారు._*
    
*_➯యువతలో మధుమేహం, గుండె సంబంధిత తదితర నాన్‌కమ్యూనికబుల్‌ వ్యాధుల కారణంగా మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది._*
    
*_➯22 ఏళ్ల యువతలో 21 శాతం మంది, 29 ఏళ్ల యువతలో 13 శాతం మంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితులు యువతలో హృద్రోగœ సమస్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయి._*
    
*_➯తెలంగాణలో హృద్రోగ సంబంధిత ముప్పు 22 ఏళ్ల యువతలో 7.94 శాతం ఉంటే.. 29 ఏళ్ల యువతలో 15.51 శాతం ఉంది. ఏపీలో 22 ఏళ్ల యువతలో 9.22 శాతం ఉంటే.. 29 ఏళ్ల యువతలో 22.73 శాతం ఉంది._*
    
*_➯మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు 2021లో ప్రతి లక్ష మందిలో 1974 మంది ఉంటే.. ఇప్పుడు మరో 11 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది._*
    
*_➯సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 15 శాతం మందిలో స్వల్ప, మధ్యస్థాయి మానసిక ఆందోళన, నిరాశ లక్షణాలు కనిపించాయి. వీరిలో ప్రతి పదిమందిలో ఆరుగురు సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నట్లు అధ్యయనం గుర్తించింది._*
 😊 *దయచేసి* 🙏 *నవ్వండి* !😊
 

     మీరు ఉపాధ్యాయులైతే, మీరు నవ్వుతూ తరగతిలో ప్రవేశిస్తే, పిల్లల ముఖం పైన చిరునవ్వును చూస్తారు!

*దయచేసి నవ్వండి*…😊

     మీరు వైద్యులైతే , రోగికి నవ్వుతూ చికిత్స చేస్తే, అప్పుడు రోగి యొక్క విశ్వాసం రెట్టింపు అవుతుంది.

*దయచేసి నవ్వండి*… 😊

     మీరు గృహిణి అయితే, ఇంటి పనులన్నీ నవ్వుతూ చేయండి, ఆపై చూడండి- మొత్తం కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

*దయచేసి నవ్వండి*…😊

     మీరు ఇంటి పెద్ద అయితే, మీరు సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశిస్తే, మొత్తం కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది.

*దయచేసి నవ్వండి*…😊

     మీరు ఒక వ్యాపారవేత్త అయితే మీరు సంతోషంగా కంపెనీలోకి ప్రవేశిస్తే, ఉద్యోగులందరి మనస్సు యొక్క ఒత్తిడి తగ్గుతుంది చూడండి.
 
*దయచేసి నవ్వండి*… 😊

     మీరు దుకాణదారులైతే, నవ్వుతూ.. మీ కస్టమర్‌ను గౌరవిస్తే, కస్టమర్ సంతోషంగా ఉంటాడు, మరియు మీ దుకాణం నుండి వస్తువులను తీసుకుంటాడు, మీ బిజినెస్ పెరుగుతూనే వుంటుంది.

*దయచేసి నవ్వండి*…😊

      తెలియని వ్యక్తి వీధిలో తారసపడితే  వారిని చూసి చిరునవ్వు నవ్వండి, అతని ముఖం పై కూడా నవ్వు ని చూడవచ్చు, వాతావరణం ప్రశాంతత సంతరించుకుంటుంది.

*దయచేసి నవ్వండి*…😊

     ముఖం పై చిరునవ్వు కోసం  ఎలాంటి ఖర్చు అవసరం లేదు, కానీ  చిరునవ్వు వల్ల మన తో పాటు మన వారి జీవితాల్లో అనందం చూడవచ్చు.

*దయచేసి నవ్వండి*…😊

     ఎందుకంటే మీ చిరునవ్వు చాలా ముఖాల్లో చిరునవ్వు తెస్తుంది.

*దయచేసి నవ్వండి*…😊

     ఎందుకంటే మీరు ఈ జీవితాన్ని మళ్ళీ పొందలేరు.

*దయచేసి నవ్వండి*…😊

    ఎందుకంటే కోపంలో ఇచ్చిన దీవెనలు కూడా చెడుగా కనిపిస్తాయి, మరియు నవ్వుతూ, ప్రేమతో తిట్టినా కూడా బాధకలగదు, బాగుంటాయి.

*దయచేసి నవ్వండి*…😊

    ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వికసించే పువ్వులు, వికసించే ముఖాలు ఇష్టపడతారు.

*దయచేసి నవ్వండి*…😊

     ఎందుకంటే మీ నవ్వు ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది.

*దయచేసి నవ్వండి*…😊

     ఎందుకంటే ఒకరినొకరు చూసుకున్న తర్వాత మనం నవ్వుతూనే ఉన్నంతవరకు కుటుంబంలో సంబంధాలు బాగాఉంటాయి.

*మరియు అతిపెద్ద విషయం*..

*దయచేసి నవ్వండి*…😊 

    ఎందుకంటే ఇది మానవుడి గుర్తింపు. ఒక జంతువు నవ్వలేదు.  మానవులు మరియు జంతువుల మధ్య వ్యత్యాసం ఇదే!

     అందువల్ల, మీ స్వంతంగా చిరునవ్వు నవ్వి ఇతరుల ముఖంలో చిరునవ్వు తెచ్చుకోండి.

 🤝🌹🌻🍁☘️😀😂

====మొత్తం మీద...====

*నవ్వటం ఒక యోగం...!*
*నవ్వించటం ఒక భోగం... !!*😁
*నవ్వక పోవటం ఒక రోగం*!!! 😂
🙏🙏

... * 🙂🙏...
 తెలుగు భాషలో పురుషుడితో పోలిస్తే స్త్రీకి అనేక 
పర్యాయ పదాలున్నాయి. 

వివిధ నామములు 1.అంగన, 2.అంచయాన, 3.అంబుజలోచన, 4.అంబుజవదన, 5.అంబుజాక్షి, 6.అంబుజానన, 7. అంబురుహాక్షి, 8.అక్క, 9.అతివ, 10.అన్ను, 11.అన్నువ, 12.అన్నువు, 13.అబల, 14.అబ్జనయన, 15.అబ్జముఖి, 16.అలరుబోడి, 17.అలివేణి, 18.అవ్వ, 19.ఆటది, 20.ఆడది, 21.ఆడుగూతురు, 22.ఆడుబుట్టువు, 23.ఇంచుబోడి, 24.ఇంతి, 25.ఇందీవరాక్షి, 26.ఇందునిభాస్య, 27.ఇందుముఖి, 28.ఇందువదన, 29.ఇగురాకుబోణి, 30.ఇగురుబో(డి)(ణి), 31.ఇభయాన, 32ఉగ్మలి,33 ఉజ్జ్వలాంగి, 34ఉవిద, 35ఎలతీగబోడి, 36ఎలనాగ, 37.ఏతుల, 38కంజముఖి, 39కంబుకం (ఠ) (ఠి), 40.కంబుగ్రీవ, 41కనకాంగి, 42కన్నులకలికి, 43కప్పురగంధి, 44కమలాక్షి, 45కరభోరువు, 46కర్పూరగంధి, 47కలకంఠి, 48కలశస్తని, 49కలికి, 50కలువకంటి, 51కళింగ, 52కాంత, 53కించిద్విలగ్న, 54కిన్నెరకంఠి, 55కురంగనయన,56 కురంగాక్షి, 57.కువలయాక్షి, 58.కూచి, 59.కృశమధ్యమ, 60.కేశిని, 61కొమ, 32కొమరాలు, 63.కొమిరె, 64.కొమ్మ, 65కోమ, 66.కోమలాంగి, 67కోమలి,68 క్రాలుగంటి, 69గజయాన, 70గరిత, 71గర్త, 72గుబ్బలాడి, 73గుబ్బెత, 74గుమ్మ, 75గోతి, 76గోల, 77చంచరీకచికుర, 78చంచలాక్షి, 79చంద్రముఖి, 80చంద్రవదన, 81చక్కనమ్మ, 82చక్కెరబొమ్మ, 83చక్కెరముద్దుగుమ్మ, 84చాన, 85చామ, 86చారులోచన, 87చిగురుటాకుబోడి, 88చిగురుబోడి, 89చిలుకలకొలికి, 90చెలి, 91చెలియ, 92చెలువ, 93చే(డె)(డియ), 94చోఱబుడుత, 95జక్కవచంటి, 96జని, 97జలజనేత్ర,98 జోటి, 99ఝషలోచన, 100తనుమధ్య, 101తన్వంగి, 102తన్వి, 103తమ్మికంటి, 104తరళలోచన, 105తరళేక్షణ, 106తరుణి, 107తలిరుబోడి,108 తలోదరి, 109తాటంకవతి, 110తాటంకిని, 111తామరకంటి, 112తామరసనేత్ర, 113తీయబోడి, 114తీ(గ)(వ)బోడి, 115తెఱవ, 116తెలిగంటి, 117తొ(గ)(వ)కంటి, 118తొయ్యలి,119 తోయజలోచన, 120తోయజాక్షి, 121తోయలి, 122దుండి, 123ధవళాక్షి, 124ననబోడి, 125నళినలోచన, 126నళినాక్షి, 127నవ(ల)(లా), 128నాంచారు, 129నాచారు, 130నాచి, 131నాతి, 132నాతుక, 133నారి, 134నితంబవతి, 135నితంబిని, 136నీరజాక్షి, 137నీలవేణి, 138నెచ్చెలి, 139నెలత, 140నెలతుక, 141పంకజాక్షి, 142పడతి, 143పడతుక, 144పద్మముఖి, 145పద్మాక్షి, 146పర్వేందుముఖి, 147పద్మాక్షి, 148పర్వేందుముఖి, 149పల్లవాధర, 150పల్లవోష్ఠి, 151పాటలగంధి, 152పుచ్చడీక, 153పుత్తడిబొమ్మ, 154పు(వు)(వ్వు)బోడి, 155పువ్వారుబోడి, 156పుష్కలాక్షి, 157పూబోడి, 158పైదలి, 159పొ(ల్తి)(లతి), 160పొ(ల్తు)(లతు)క,161ప్రతీపదర్శిని,162 ప్రమద,163 ప్రియ,164 ప్రోడ,165 ప్రోయాలు,166 బంగారుబోడి,167 బాగరి,168 బాగులాడి,169 బింబాధర, 170 బింబోష్ఠి,171 బోటి, 172 భగిని,173 భామ,174 భామిని,175 భావిని,176 భీరువు, 177 మండయంతి,178 మగువ,179 మచ్చెకంటి,180 మడతి,181 మడతుక, 182 మత్తకాశిని,183 మదిరనయన,184 మదిరాక్షి,185 మసలాడి,186 మహిళ, 187 మానవతి,188 మానిని,189 మించుగంటి,190 మించుబోడి,191 మీననేత్రి, 192 మీనాక్షి,193 ముగుద,194 ముదిత,195ముదిర,196ముద్దరాలు,197 ముద్దియ, 198 ముద్దుగుమ్మ,198 ముద్దులగుమ్మ,200 ముద్దులాడి,201 ముష్టిమధ్య,202 203 మృగలోచన,204 మృగాక్షి,205మృగీవిలోకన,206 మెచ్చులాడి,207 208 మెఱుగారుబోడి,209మెఱుగుబో(డి)(ణి),210 మెలుత,211 మె(ల్త)(లత),212 మె(ల్తు)(లతు)క,213 యోష,214 యోషిత,215 యోషిత్తు,216 రమణి 217, రామ, 218 రుచిరాంగి,219 రూపరి,220 రూపసి,221రోచన,222 లతకూన,223 లతాంగి, 224 లతాతన్వి,225 లలన,226 లలిత,227 లలితాంగి,228 లీలావతి,229 లేడికంటి, 230 లేమ,231 లోలనయన,232 లోలాక్షి,233 వధువు,234వధూటి 235వనజదళాయతాక్షి,236 వనజనేత్ర,237 వనజాక్షి,238 వనిత,239 వరవర్ణిని, 240వరానన,241వరారోహ,242 వలజ,242వశ,244 వామ,245 వామనయన, 246వామలోచన,247 వారిజలోచన,248 వారిరుహనేత్ర,249 వారిరుహలోచన, 250 వారిరుహానన,251 వాల్గంటి,252 వాలుగకంటి,253 వాశిత,254 వాసుర, 255విరితీవబోడి,256విరిబోడి,257విశాలాక్షి,258 వెలది,259శంపాంగి,260 శఫరాక్షి, 261శర్వరి,262 శాతోదరి,263 శిఖరిణి,264 శుకవాణి,265 శుభదంతి,266 శుభాంగి, 267శోభన,268 శ్యామ,269 శ్రమణ,270 సకి,271సకియ,272 సారసాక్షి,273 సిత, 274సీమంతిని,275సుందరి,276 సుగాత్రి,277 సుజఘన,278సుదతి,279 సుదృక్కు, 280 సుధ్యుపాస్య,281 సునయన,282 సుప్రియ,283సుభాషిణి,284 సుభ్రువు, 285 సుమతి,286సుమధ్య,287 సుముఖ,288 సురదన,289 సులోచన,290సువదన, 291హంసయాన,
292 హరిణలోచన,293  హరేణువు,294 హేమ.
subhash. m
 జీవితమే సందేశం

పూర్వం ఒక ధనికుడి దగ్గర ఒక సామాన్యుడు పనిచేస్తూ ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. బావిలో నీళ్ళు తోడేవాడు. ఆ ఇంట్లో వారు చెప్పిన ఇతర పనులన్నీ చేసేవాడు.

యజమాని పెట్టిన తిండి తినేవాడు. ఇచ్చిన వస్త్రాలు ధరించేవాడు. ఏదో ఒక మూల నిద్రపోతూ ఉండేవాడు. అయితే అతనిలో జ్ఞానపిపాస ఉండేది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు అతను ఆలోచిస్తూ, ఆలోచిస్తూ తాదాత్మ్యస్థితిలోకి వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా అతనికి జ్ఞానోదయం కలిగింది. అతని హృదయంలో ప్రేమ, ఆనందం ఉప్పొంగాయి. క్రమంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతణ్ణి చూసినవారికి ఏదో తేజస్సు కనిపించేది. క్రమంగా జనం ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. అతణ్ణి అనేక విషయాల గురించి అడిగేవారు. అతను ఏదో చెప్పి తప్పించుకొనేవాడు. కానీ అతను గొప్పవాడనే ప్రచారం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది. గురువుగా అతణ్ణి భావించేవారు. అలాగే పిలిచేవారు.

ఈ గురువు గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి... తన సందేహాలను చర్చించడం కోసం దూరప్రాంతం నుంచి ఆ గ్రామానికి బయలుదేరాడు. ఊరు బయటే అతను కనిపించడంతో... పలకరించాడు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత... అతనికి జ్ఞానోదయం కలిగిందని స్పష్టమయింది. ''మీరు జ్ఞాని అయ్యారు కదా! అంతకుముందు మీరేం చేసేవారు?'' అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆ గురువు నవ్వి ''మా యజమాని కోసం కట్టెలు కొట్టి తెచ్చేవాణ్ణి. బావికి వెళ్ళి నీరు తోడి తెచ్చేవాణ్ణి'' అని సమాధానం ఇచ్చాడు.

''ఇప్పుడు మీరు జ్ఞాని కదా! ఇప్పుడేం చేస్తున్నారు?'' అని అడిగాడు ఆ వ్యక్తి.

''ఇప్పుడూ అదే పని చేస్తున్నాను అన్నాడు గురువు.

''మరి తేడా ఏముంది? మీరు జ్ఞాని కావడం వల్ల ప్రయోజనం ఏముంది?'' అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. అప్పుడు గురువు ''ఎంతో తేడా ఉంది. అంతకుముందు కట్టెలు కొట్టి తెచ్చినా, బావి నుంచి నీరు మోసుకువచ్చినా యజమాని మీద కోపంతో ఎప్పుడూ ఏదో గొణుక్కొంటూ ఉండేవాణ్ణి. ఆ పనులన్నీ తిట్టుకుంటూ చేసేవాణ్ణి. పనిపట్ల విసుగు, యజమానిపట్ల ద్వేషం ఉండేవి. తినే తిండి నచ్చేది కాదు. కంటికి నిద్ర పట్టేది కాదు. మనసుకు ప్రశాంతత అసలే ఉండేదికాదు. కానీ ఇప్పుడు ఆ పనులన్నీ నాకు ఎంతో ఆనందదాయకమైన, ఆహ్లాదమైన కార్యాలు. వాటిలో అందం, ఆనందం ఇంతా అంతా అని చెప్పలేను. ఇప్పుడు నా దృష్టిలో ఆ యజమాని... నా శ్రేయోభిలాషి, నా సంరక్షకుడు. అతని పట్ల నాకు అమితమైన కృతజ్ఞతాభావం ఏర్పడింది. ఎందుకంటే నాకు కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర ప్రసాదిస్తున్నాడు. సరే! ఇప్పటికే ఆలస్యమయింది. నా యజమాని నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు. వెళ్ళొస్తాను'' అని ప్రశాంతవదనంతో, మెరిసేకళ్ళతో చెబుతూ వెళ్ళిపోయాడు.

ఈ కథను ఒక సందర్భంలో ఓషో (రజనీశ్‌) ఉదహరించారు. శిష్యులతో సేవలు చేయించుకొనే గురువుల గురించి మాత్రమే విన్న మనకు ఇతరులకు సేవలు చేయడానికి ఉబలాటపడే గురువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ''ధ్యానం చేస్తాను, జపం చేస్తాను, ప్రవచనం చెబుతాను'' అనే గురువులే తెలిసిన మనకు... ''ఆకలైనప్పుడు తింటాను, నిద్రవస్తే నిద్రపోతాను'' అని చెప్పే గురువుల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ ఇది నిజం. ఇలాంటివారు ఎందరో ఉన్నారు. ఎంతో సాధారణ వ్యక్తుల్లా జీవిస్తారు. వారు ఎక్కడా ఏ ప్రత్యేకతా కోరుకోరు. ప్రతి పనిని మనస్ఫూర్తిగా, సంతోషంగా చేయాలి, వాటిలో ఆనందం వెతుక్కోవాలి. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించాలి. ఆదరించేవారిపట్ల కృతజ్ఞతతో ఉండాలి. అలాంటి జీవితాన్ని గడపడం ద్వారా... తమ జీవితాన్నే ఒక సందేశంగా బోధించే గురువులకన్నా గొప్పవారు ఇంకెవరుంటారు?
 దేవుడి నైవేద్యానికి ఉల్లి.. వెల్లుల్లి దూరం.. పరమార్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హిందూ సంస్కృతి అనేది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక సమృద్ధి, వైవిధ్యపూర్ణ, మరియు దీర్ఘకాలిక సంస్కృతి.

ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి సమాజం, ధర్మం, జీవనశైలి, భక్తి, నైతికత మరియు తాత్త్వికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. హిందూ సంస్కృతిలో దేవతల పూజ, యజ్ఞాలు, వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి. హిందువులు శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు. ఈ పూజలు, ప్రత్యేకమైన పండుగల రోజుల్లో, వారి భక్తి భావనను ప్రదర్శిస్తాయి. ప్రతీ పూజలో తీర్థ ప్రసాదాలు అందిస్తారు. దేవుడికి నైవేద్యంగా సమర్పించినదాన్నే భక్తులకు అందిస్తారు. అయితే దేవుడి ప్రసాదంలో ఎక్కడా ఉల్లి, వెల్లుల్లి వాడరు. దీనివెనుక పెద్ద పురాణ గాధ ఉంది. ఉల్లి, వెల్లుల్లి వాడకం దేవుడి నైవేద్యాలలో కొన్ని పరమార్థిక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి జ్యోతిష, ఆధ్యాత్మికత మరియు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.

ఆధ్యాత్మిక దృష్టికోణం:
ఉల్లి, వెల్లుల్లి వంటివి తేలికపాటి జీర్ణ సంబంధిత ఆహారంగాభావించబడతాయి. ఇవి కొన్ని హిందూ సంప్రదాయాల్లో 'తమసిక్‌' ఆహారాలుగా పరిగణించబడతాయి. 'తమసిక్‌' అంటే అశుభం, నశనాత్మకమైన దిశగా జరగడం. ఈ ఆహారాలు శరీరంలో నెమ్మదిని, అశాంతిని తీసుకురావచ్చు. అందువల్ల, దేవతలకు నైవేద్యంగా ఉల్లి, వెల్లుల్లి వాడటం కొన్ని సంప్రదాయాలలో నిషేధించబడింది.

పశుపతి లక్షణాలు:
ఉల్లి, వెల్లుల్లి కూడా పశువులు, కీటకాలు ఆకట్టుకునే వాసన కలిగి ఉంటాయి. ఈ వాసనలో ఈ కూరగాయలు పశువులుగా భావించబడతాయి, అవి పవిత్రతకు అనుకూలం కాదు.

రాక్షసుల నోటి నుంచి వచ్చినవిగా..
ఇక ఉల్లి, వెల్లుల్లి రాక్షసుల నోటి నుంచి వచ్చిన అమృత బింధువులతో ఏర్పడినవిగా భావిస్తారు. పాల సముద్రం మధిస్తున్నప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలు, రాక్షసులకు పంచుతుండగా.. విష్ణుమూర్తి గమనించి రాక్షసులకు అమృతం దక్కకూడదని భావిస్తారు . దీంతో వెంటనే తన సుదర్శన చక్రం సాయంతో రాక్షసుల తలలను నరుకుతారు. అయితే అప్పటికే నోట్లోకి వెళ్లిన అమృత బిందువుల కారణంగా తలలకు మరణం లేదు. అయితే తలలు తెగిపడుతున్న సమయంలో రాక్షసుల నోటి నుంచి బయట పడిన అమృత బింధువుల కారణంగానే ఉల్లి, వెల్లుల్లి ఉద్భవించిననట్లు భావిస్తారు. ఈ కరాణంగా కూడా దేవుళ్ల నైవేద్యాల్లో ఉల్లి, వెల్లుల్లి వాడరు.

ఆరోగ్య ప్రయోజనాలు..
ఉల్లి, వెల్లుల్లి ప్రాముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో వాటిని సాధారణంగా రోగ నివారణకు ఉపయోగిస్తారు. కానీ, దేవతలకు ఇవ్వడానికి ఈ ఆహారాలు పగిలిపోయిన లేదా అసాధారణ రుచులను తీసుకురావచ్చు, అందువల్ల ఈ రెండు కూరగాయలు నైవేద్యంగా వాడటం మానివేయబడింది. ఈ కారణాల వల్ల, హిందూ మతంలో ఉల్లి, వెల్లుల్లి వాడకం, ముఖ్యంగా పూజలకు సంబంధించి, కొన్ని ప్రాంతాలలో పరిమితమవుతుంది.
 తెలుగు కవి,బహుభాషావేత్త,శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు, పుట్టపర్తి గారు తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు  ఆనంద పరవశుడై వారిని  భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరినటువంటు గౌరవం పొందిన మహాకవి సరస్వతీపుత్ర
పుట్టపర్తి నారాయణాచార్యులు గారి జన్మదిన స్మరణ !
 
       🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

పుట్టపర్తి నారాయణాచార్యులు 
(మార్చి 28, 1914 - సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం అతనుది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

జీవిత విశేషాలు ....

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అతను తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి (ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. అతను గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
.....
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం అతనులో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు.
......
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. అర్ధాంగి పేరు పుట్టపర్తి కనకవల్లి. మొదట అతను పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి అతనుతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో అతను ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
......
అతను బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. అతనుకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారంప్రకారం అతను చేసిన అనువాదాలు - అవధీ భాషనుండి తులసీదాస్ రామయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారు. ఉర్దూ లో హంస రాజ్ రహబ్బర్ వ్రాసిన నవలను సంఘర్షణ పేరుతో తెలుగులో అనువదించారు.
......
హృషీకేశ్ లో అతను పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి అతనుకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. అతనుకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి అతను ఉంచుకున్నారు.
......
"లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో అతను స్వంత రచనలు. అతను ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. అతనుకు ఆంగ్లం నేర్పిన వి.జే. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఇతను వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
......
అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో అతను చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
......
అతను చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు అతను్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి అతనుకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "అతను్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, అతను దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
.......
భారత ప్రభుత్వం అతనుకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే అతను నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, అతనుకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్ప్శ్చాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో అతను సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు అతనుకు డి.లిట్. ప్రదానం చేశాయి. అతను కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పనిచేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

వ్యక్తిత్వం......

నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చలేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా." అనేవాడు.
......
ఒకసారి అతను అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "అతనుకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన అతను మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

రచనలు......

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత అతను విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో అతను ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయారు. అతను బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
......
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై అతనును భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
......
తెలుగులో అతను వ్రాసిన "శివతాండవం" అతనుకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. అతను గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని అతను స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.

మచ్చుకు :

“ 
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
......
పుట్టపర్తివారి శివతాండవము ఆ తాండవాన్ని చూపించే యత్నము, తాండవాన్ని చూచినప్పుడు వారికికలిగిన భావపరంపరను మనకు ఉత్సాహము కలిగించే ప్రయత్నము కాదు. వారిది చదువరులకు శివతాండవ దర్సనము పొందాలి అన్న భావన రూఢి అవుతుంది. అనగా ఇది ఒక కధాకావ్యము.దీని వస్తువు శివుని తాండవమూ పార్వతి లాస్యమున్ను, అతిలోకము. పశ్చిమచాళుక్యరాజులు పట్టదక్కలో తొలిసారి మలిపించినది మొదలు దక్షిణాత్య శిల్ప వీధులన్నిటా ఉజ్జ్వలంగా తీరినదీ శివతాండవ శిల్పము.పట్టదక్కలో జంబులింగ దేవాలయపు గుడిలో స్వామి అష్టభుజుడు, కుడివైపు నంది ఎడమవైపు దేవీ మాత్రమే ఉన్నారు.పాపనాధ దేవాలయ శిల్పంలో స్వాము చతుర్భుజుడు, నందీ అమ్మవారూ కూడా ఉదిక్తులై పాల్గొంటారు, ఎత్తిన పగడలతో పాములూ కదిలి పోతున్నాయి.బాదామిశిల్పి స్వామికి షోడశభుజములూ ఆయుధములూ కాక ప్రక్కన నందీ వినాయకుడు, మార్దింగికూడా ఉంటారు.ఎల్లోరా 14వ గుహలో పృధ్వీ ఆకాశముల నడుమ ప్రభువు తాండవం చేస్తూంటే, వేణుమృదంగాది వాద్యములను వాయించువారు కుడి దిగువునా, చకితురాలైన్ అమ్మవారు ఎడమవైపునా, పైన్ ఇటు అటు దిక్పాలకులు ఉన్నారు. నారాయణాచార్యులు గారు ఈ శిల్పములను ఈ కావ్యములో సమర్దము కూర్చినారు, అదే కాక ఇందులో విష్ణువును ప్రేక్షకునిగా తీర్చినారు. ఇందులో "ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు" అని అభినయానుకూలి అయిన ధ్రువమును చేర్చినారి కవిగారు.అంత్య ప్రాసలు కూడా పాదములను వింగడిస్తూ నర్తకికి వాచక విరామమే కాక అభినయవిరామము కూడా కలిగిస్తాయి.చివ్వర నర్తకి "అడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు" అని ఊపిరి తిప్పుకుంటుంది.

ప్రముఖుల అభిప్రాయాలు.....

1) పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. 
-భద్రిరాజు కృష్ణమూర్తి

2) శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. 

-తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి

3) కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి

4) ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!!

 -సి. నారాయణ రెడ్డి

మహమ్మద్ గౌస్ 

        🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
 *'నమస్కారం' మన సంస్కృతి* 

*'నమస్కారం' మన సంస్కృతి. దైవాన్ని గానీ, విద్యావృద్ధులను గానీ, వయోవృద్ధులను గానీ నమస్కారంతోనే గౌరవిస్తాం. ఈ నమస్కారంలో చాలా అద్భుత భావనలున్నాయి. "ఆరాధయితుః ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రహ్వభావో నమస్కారః" అని శాస్త్రకారుల నిర్వచనం.*

*ఆరాధించేవాడు అవతలివానిలోని గొప్పతనాన్ని గ్రహించినప్పుడు కలిగే సమభావమే నమస్కారం. భగవంతుని గొప్పదనాన్ని తలచుకొని అతని మహిమాతిశయాన్ని గుర్తించి భక్తుడు పొందే నమ్రభావన నమస్సు.*

*ఆ నమ్రభావనను వ్యక్తీకరించే పద్ధతులు అనేకం. శిరస్సువంచి, రెండు చేతులు దోయిలించి నమస్కరించడం ఎక్కువగా మన ఆచారం. ఆ దోయిలించడం కూడా సాధారణంగా హృదయానికి సమీపంలో చేస్తాం. దీనినే 'అంజలిముద్ర' అంటారు. హృదయాన్ని అంజలిగా సమర్పించడమే దీనిలో భావం.*

*"అంజలిః పరమాముద్రా దేవా క్షిప్రప్రసాదినీ" దేవతలు వెంటనే అనుగ్రహించేలా చేసే శక్తి 'అంజలి' ముద్రలో ఉంది. శిరస్సు ఆలోచనలకు స్థానం. 'చేతులు' ఆచరణకు సంకేతం. 'హృదయం' అంతరంగ స్థానం. ఈ మూడూ భగవత్భక్తిని అందుకొనేందుకు, భగవదర్పణం కావాలని ఈ ప్రక్రియలో అంతరార్థం శబ్దశాస్త్రంలో 'వర్ణవిపర్యయ న్యాయం' అని ఒకటుంది. హింస అనే శబ్దం, ఈ న్యాయాన్ని అనుసరించి 'సింహ'గా మారింది. హింసాలక్షణం అధికంగాగల జంతువు సింహమని అర్థం. అలాగే ఆ న్యాయాన్ని అనుసరించి 'మనస్' శబ్దమే 'నమస్' అయ్యింది. మనస్సును సమర్పించడమే నమస్సు. నమస్కారములో సమర్పణ మాత్రమే కలదు స్వీకరణ కూడావుంది... దేవతాశక్తిని అనుగ్రహించే మార్గం ఇదే...*

*"నమస్” సమర్పణ కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన వైదిక భారతీయ సంస్కృతి అనాదికాలంలో ఆవిష్కరించిన అద్భుత ప్రక్రియ ఇది. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడంటాడు. - "కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్"... "అసలు నీ తత్త్వం, మహిమ తెలిశాక నమస్కరించకుండా ఎవరు ఉండగలరు?"*

*తెలిశాక ఎలాగూ నమస్కరిస్తారు. కానీ నమస్కరిస్తే గానీ తెలియని అద్భుతత్వం భగవానునిది. నమ్రభావమున్నవాడే విశ్వచైతన్యాన్ని గ్రహించగలడు. గ్రహించాక ఆనందంతో నమ్రుడై జీవిస్తాడు.*

*ఇంత అర్థమూ, శక్తి ఉన్నాయి. కనుకనే నమస్కారాన్ని పంచప్రణవాలలో ఒకటి అన్నారు. పంచప్రణవాలు ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం.*

*ఇందులో మొదటి నాలుగింటికీ నియమాలు, పద్ధతులూ ఉన్నాయి. కానీ నమస్కారానికి ఏ పరిమితులూ లేవు. భక్తితో ఎప్పుడైనా ఎక్కడైనా ఆచరించవచ్చు. అందుకే దీనిని "ఆత్మయజ్ఞంగా" శివపురాణం వర్ణించింది.*

*నమస్కారం ఇతర ప్రణవాలవలె దేవతాహ్వాన వాచకం, మోక్షకారకం. వేదాలలో విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుని పలువిధాల నమస్కరించిన భాగం "నమకంగా" ప్రసిద్ధి పొందింది.*

*విశ్వమంతా ఈశ్వరశక్తియే నిండి ఉన్నదనీ పలురకాల విశ్వరూపుని పలువిధాల నమస్కరించడమే ఆ మంత్రభాగంలో ప్రధానాంశం.*

*అన్నింటిలోనూ ఈశ్వరునే చర్శించి నమస్కరించే 'నమ్రత' వల్ల మనిషి మహోన్నతుడౌతాడని తాత్పర్యం.*

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
            *దీనికి అహంకారం?*

*నిత్య వికాసమే జీవితం. అహంకారం, సంకుచితత్వమే మరణం. సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్ వ్యాఖ్య. నేను, నాది నావారు, పెరవారు అనేభావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి. స్వార్థపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం. అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు.* 

*అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు. మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్థపరులు. మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు. ఇలాంటివారిలోనే అహంకారం నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు వినాలని కౌంతేయుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు కానేకాదు. సమర్థులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష. ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.*

*సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.*

*చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.*

*మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. కానీ... మహా తేజోవంతులు హిందూ భారతీయులు ఆత్మబలాన్ని ఉదృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశారు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి.*

*అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం. గుణాల్లో కెల్లా ఉత్తమమైంది ప్రేమ. అందరినీ ప్రేమించగలిగితే అహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ. అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 *విశ్వాసంతో సద్గురువును ఆశ్రయించిన మోక్షం సిద్ధించును* 

*కోటికర్మలు చేసినా ఆత్మానుభూతికి సహాయపడజాలవు. విచారణ వల్లనే మోక్షప్రాప్తి అని కిందటి శ్లోకంలో విస్పష్టంగా ప్రకటించారు. అయితే కర్మలవల్ల ఎందుకు ఆత్మాను భూతి కలగదు? చిత్తశుద్ధి తద్వారా జ్ఞానాన్ని పొందటం విచారణ చేయటం దీని ద్వారానే ఎందుకు మోక్షప్రాప్తి కలుగుతుంది? ఈ విషయాన్ని ఉపమానం ద్వారా నిరూపిస్తున్నారి శ్లోకంలో అసలు ఉన్నది నిరాకార, నిర్గుణ, నిరంజన, నిర్వికార, నిరీహ, సర్వవ్యాపక బ్రహ్మం ఒక్కటే. అది ఆనంద సాగరం. అదే నీవు. అయితే ఈ విషయం తెలియనందున అజ్ఞానం వల్ల నామరూపాలతో కూడిన ఈ దేహమే నీవని, నీకన్న అన్యులు అన్యమైనవి ఎన్నో ఉన్నాయని భ్రమ కలుగుతున్నది. దానివల్లనే భయాలు, దుఃఖాలు అన్నీ. ఇవన్నీ తొలగాలంటే ముందుగా నీ ఈ భ్రమ తొలగాలి. నీ నిజస్వరూపం బ్రహ్మమని తెలుసుకొని బ్రహ్మంగా ఉండిపోవాలి.* 

*అప్పుడే సర్వ భయాల నుండి, దుఃఖాల నుండి, బంధాల నుండి ముక్తి. ఈ విషయాన్ని వేదాంతంలో తరచుగా వినిపించే రజ్జు సర్పభ్రాంతి ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. మనం రాత్రి సమయంలో మసక మసక చీకటిగా ఉన్న దారిలో వెళ్తూ ఉన్నాం. ఒంటరితనం, కాస్త భయంగా కూడా ఉంది. అంతలో దూరంగా ఏదో మెలికలుగా పడి ఉన్నది. మనం నడుస్తూ చూస్తుంటే అది కొంచెం కదులుతూ ఉన్నట్లుంది. దానితో అది పాము అని అనుకున్నాం. అంతే భయం వేసింది. అసలే చీకటి భయం, కొంచెం పిరికితనం. దానికి తోడు ఒంటరి తనం, భయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నాం. చీకట్లో ఏమీ కనబడటం లేదు. అంతలో ఏదో మొత్తగా కాలికి తగిలింది. వెంటనే పాము కాటు వేసిందనుకున్నాం. కెవ్వుమన్నాం. కొంచెం రక్తం కూడా కారుతున్నది. దానితో నొప్పి ఏడుపు లంకించుకున్నాం. ఈ భయమూ, బాధ, ఏడుపూ, అన్నీ కూడా అసలు సత్యం తెలియనందున అంటే అక్కడ ఉన్నది త్రాడేనని తెలియ నందున పాము అని భ్రమపడటం వల్ల కలిగినవి.* 

*మరి ఈ భయాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఏం చేస్తే తొలుగుతాయి. పాటలు పాడాలా, డాన్స్ వేయాలా, చెరువులో మునగాలా? భగవంతుని పూజించాలా? కర్రతో కొట్టాలా? ఎవరితోనన్నా చెప్పాలా? లేక ఏదైనా ముందు వేయాలా? ఏం చేస్తే తొలగుతాయి? ఇక్కడ ఏకర్మలూ పనిచేయవు. మరి? నీవు అది సర్పం అనే భ్రాంతిని పోగొట్టుకోవాలి. ఆ భ్రాంతి పోవాలంటే అది త్రాడు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ పామును కాల్చివేసినా, నీ బాధ తొలగదు. అ జ్ఞానం పోవాలి, జ్ఞానం కలగాలి, నీకు బాగా తెలిసిన వాడు, నీ మేలు కోరేవాడు, ఆప్తుడు నీకు తటస్థపడి అది కేవలం త్రాడేనని పాము కానేకాదని గట్టిగా చెప్పగానే మనస్సు కుదుటపడుతుంది. అయినప్పటికీ అది పాములాగా కనిపిస్తున్నందున పూర్తిగా నమ్మకం కుదరదు. అయితే తన ఆప్తుడైన వాడు, హితుడైన వాడు చెప్పినందున కొంచెం ధైర్యం కలిగింది. కనుక నిదానంగా దాని దగ్గరకు వెళ్ళి ఒక్కక్షణం తేరిపార చూస్తాడు. అది కదలటం లేదనిపిస్తుంది. దానితో ఒక కర్రపుల్లతో దానిని కదిలిస్తాడు. నిర్జీవంగా ఉన్నదని తెలుసుకుంటాడు.* 

*చివరికి దానిని చేతితో పట్టుకొని చూస్తాడు. ఆఁ ! నిజమే. అది త్రాడేనని స్పష్టంగా తెలుసుకుంటాడు. దానితో అతని భ్రాంతి సర్పభ్రాంతి తొలగిపోతుంది. భ్రాంతి తొలగిపోవటంతో భయం, బాధ అన్నీ మాయం. ఇదే సర్వదుఃఖాల నుండి విముక్తి కలిగించే మార్గం. అలాగే మన నిజ స్వరూపం ఆత్మ అయితే నామరూపాలతో కూడిన, మనోబుద్ధులతో కూడిన జీవుడిగా అహంకారంగా భ్రమపడ్డాం. దానితోబాధలు, దుఃఖాలు, ఆశలు, కోరికలు, కొరతలు అన్నిర కాల బాధలు భయాలు కలిగినవి. ఇవి పోవాలంటే ఎన్ని కర్మలు చేసినా లాభం లేదు. కోరికలు తీర్చుకోటానికి కర్మలు చేస్తుంటే క్రొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. దుఃఖాలు తొలగించుకోవాలని తప్పించుకునేందుకు ఏదో చేస్తుంటే క్రొత్త దుఃఖాలు వచ్చిపడుతూ ఉంటాయి. వీటికి అంతులేదు. మరెలా? తాను దేహాన్ని కాదని, బాధలకు దుఃఖాలకు లోనయ్యే జీవుణ్ణి కాదని గ్రహించినప్పుడే ఈ బాధల నుండి విముక్తి. అలా గ్రహించాలంటే నిజంగా తానెవరో తెలియాలి. తాను ఆనంద స్వరూప ఆత్మనని తెలియాలి. అజ్ఞానం తొలగాలి. ఆత్మజ్ఞానం కలగాలి. ఐతే ఎలా కలుగుతుంది? ఆప్తవాక్యం కావాలి. అదే శాస్త్ర జ్ఞానం, అనుభవజ్ఞానం ఉన్న ఒక సద్గురువు నీకు లభించాలి. ఆయన మీద నీకు విశ్వాసం ఉండాలి.*

 *శ్రీ ఆదిశంకరాచార్యుల వారి 'వివేకచూడామణి'* 

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*    
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
 *వినయం వివేక లక్షణమ్*

*శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీమద్రామాయణం లోని కథ*

*🔴 పరమాత్ముడైన శ్రీ రామ చంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానిపుణుడు. శ్రీ రాముడు బ్రహ్మర్షి అగు వసిష్ఠ మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు. గాయత్రీ మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మఱియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు. ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రులవారికే తెలియును. ఇదియే కాక పరమపూజనీయుడగు అగస్త్య మహర్షి శ్రీ రామ చంద్రునకు దివ్య ధనువు అక్షయ తూణీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను.*

*🔴 ఒక్క బాణముతో శ్రీ రామ చంద్ర మూర్తి మహాబలశాలియైన తాటకను నేలకూల్చెను ఒకేమాఱు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేశను మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను శ్రీ రాముడొక్కడే ప్రహరార్ధకాలములో (90 min.) ఖర త్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించెను ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీ రాముడు ఎప్పుడూ తనకుతానుగా బలప్రదర్శనము చేయలేదు. ఆ దయార్ద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను. దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము.*

*🔴 శ్రీ రాముని సైన్యము సముద్ర లాంఘనము చేయుసమయము వచ్చెను. సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎఱిగియు సహజ వినయవంతుడగుటచే పరమభాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు ఇట్లు పల్కెను “ఓ రఘునాయకా! మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు. ఐనను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన”.*

*🔴 రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మవారికి నెల రోజుల గడువు ఇచ్చెను. భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీ రామునికి దూరంగా ఉండజాలక శ్రీ రాముడు ఆలస్యమైన పక్షంలో శరీరత్యాగం చేసెదనని ప్రతిజ్ఞబూనెను. ఈ రెండు కారణముల వలన శ్రీ రాముని వద్ద అప్పటికి పట్టుమని ౩౦ రోజులుకూడాలేవు. ఐనను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాగరుని ప్రార్థింప నిశ్చయించెను.*

*🔴 శ్రీ రాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను. పిదప తీరమున దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను. ఇట్లు ౩ దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయె. చివరకు శ్రీ రాముడు “ఈతనికి సామముగా చెప్పిన వినడాయె. ఇటువంటి వారికి దండోపాయయే సరియైనది” అని సముద్రునిపై అస్త్రం సంధించెను. శ్రీ హరి కోపమును భరింపగలవారెవ్వరు? వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యెను. అంత దయాళువైన శ్రీ రాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను. సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను. అంతట శ్రీ రాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారముచేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను.*

  *ఈ కథలోని నీతులను చూద్దామ్*

*🔴 శ్రీ రాముడు ఎంత బలశాలి ఐననూ సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను. వినయం సజ్జనుని భూషణమ్.*

*🔴 మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణమ్. అందుకనే శ్రీ రాముడు విభీషణుని సలహా అడిగెను.*

*🔴 దయాగుణం ఉత్తమగుణమ్. సముద్రుడు తనకు చేసిన అపకారమును మన్నించి శ్రీ రాముడు అతనిని కాచెను.*

*🔴 సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు. వారు ఏది చేసినా అది లొకహితమే అవుతుంది. శ్రీ రాముడు సముద్రునిపై కినుకబూని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది.*

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏📌🙏 🪷🕉️🪷 🙏📌🙏
 *🔊Reels: రీల్స్‌ అతిగా చూస్తున్నారా.. కంటిచూపుపై తీవ్ర ప్రభావం: వైద్యుల హెచ్చరిక*

*🔶షార్ట్‌ వీడియో, రీల్స్‌ అతిగా చూడటంతో ‘బ్రెయిన్‌ రాట్‌’ (Brain Rot)బారిన పడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. తాజాగా కంటి సమస్యలూ పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.*

*🍥ఇంటర్నెట్ డెస్క్‌: నేటి సామాజిక మాధ్యమాల(Social Media) యుగంలో రీల్స్‌(Reels) చూడటం ఓ వ్యసనంలా మారిపోయింది. కొంచెం టైం దొరికితే చాలు అంతా స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్‌, షార్ట్‌ వీడియోలు చూడటంలోనే మునిగిపోతున్నారు. అయితే, దీంతో విలువైన సమయం వృథా కావడమే కాదు.. ఆరోగ్యానికీ ముప్పేనంటూ పలు అధ్యయనాలు గగ్గోలు పెడుతున్నాయి. షార్ట్‌ వీడియోలు అతిగా చూడటంతో ‘బ్రెయిన్‌ రాట్‌’ (Brain Rot)బారిన పడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. తాజాగా కంటి సమస్యలూ(Eye Disorders) పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుల హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి. ఇంతకీ వైద్యులేమంటున్నారు? ఈ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే?*

*💫స్మార్ట్‌ఫోన్‌తో మనిషి జీవితంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకోవడం ద్వారా మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అదేపనిగా సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో షార్ట్స్‌, వీడియోలను చూస్తున్న వారిలో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని.. మరీ ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టి లోపాలు  పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం దిల్లీలోని యశోభూమి - ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ,  ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్‌ సొసైటీ సంయుక్త సమావేశంలో ప్రముఖ నేత్ర వైద్యులు పలు కీలక అంశాలను వెల్లడించారు.*

*💥అదో నిశ్శబ్ద మహమ్మారి.. జాగ్రత్త*

*🌀అధిక స్క్రీన్ టైమ్‌తో కంటిపై పడే డిజిటల్‌ ఒత్తిడి ఓ నిశ్శబ్దపు మహమ్మారి అని ఆసియా పసిఫిక్‌ అకాడమీ ఆఫ్‌ ఆప్తమాలజీ (ఏపీఏవో) 2025 కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ లలిత్‌ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.  ‘‘ముఖ్యంగా రీల్స్ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్లు పొడిబారిపోవడం (డ్రై ఐ సిండ్రోమ్‌), హ్రస్వదృష్టి (మయోపియా) పెరగడం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్నప్పుడే మెల్లకన్ను రావడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఒక విద్యార్థి కంటి దురద, మసకగా కనిపిస్తుందంటూ మా వద్దకు వచ్చాడు. పరీక్షించి చూడగా.. ఇంట్లో ఎక్కువగా రీల్స్‌ చూడటం వల్ల అతడి కళ్లలో తగినంతగా కన్నీళ్లు రావడం లేదని గుర్తించాం. దీంతో వెంటనే అతడికి కంటి చుక్కలు వేసి.. 20 - 20 - 20 నియమాన్ని పాటించాలని సూచించాం’’ అని వివరించారు.*
  
*💥రీల్స్‌ చిన్నవే.. ప్రభావం జీవితాంతం*

*💠రీల్స్‌ చిన్నగానే ఉండొచ్చు.. కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందని ఆల్‌ఇండియా ఆప్తమాలాజికల్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ హర్బన్ష్‌లాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమస్య తీవ్రతను వివరించారు.  ‘‘చిన్న, ఆకర్షణీయమైన రీల్స్‌ను ఎక్కువసేపు దృష్టి నిలిపేలా డిజైన్‌ చేస్తున్నారు.  స్థిరంగా అలా చూడటం వల్ల బ్లింకింగ్‌ రేటు 50శాతం తగ్గుతోంది. ఇది కళ్లు పొడిబారడానికి, దృష్టిలోపాలకు దారితీస్తుంది. ఈ అలవాటు నియంత్రణ లేకుండా కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు, శాశ్వతకంటి సమస్యలకు దారితీస్తుంది’’ అని హెచ్చరించారు. రోజూ గంటలతరబడి స్క్రీన్స్‌కు అతుక్కుపోయే పిల్లల్లో ముందస్తు మయోపియా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పెద్ద వారు కూడా ఈ బ్లూ లైట్‌కు గురికావడం వల్ల తరచూ తలనొప్పి, మైగ్రేట్‌, నిద్రలేమి వంటి సమస్యల బారినపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అధ్యయనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.*

*💥కంటిచూపే కాదు.. సంబంధాలూ దెబ్బతింటున్నాయ్‌ ..*

*🥏అధిక స్క్రీన్‌ టైమ్‌తో సామాజిక, మానసిక ఇబ్బందులు సైతం పెరుగుతున్నట్లు ఏఐవోఎస్‌ అధ్యక్షుడు, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌ డాక్టర్‌ సమర్‌ బసక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌ను అదేపనిగా చూస్తుండటం వల్ల కంటిపై ఒత్తిడి, మెల్లకన్ను, కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎక్కువ సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. నిరంతరం రీల్స్‌ చూడటం వల్ల సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, మానసిక ఇబ్బందులకు గురైనట్లు గమనిస్తున్నట్లు చెప్పారు. రీల్స్‌లో మునిగిపోవడంతో  వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, చదువు, పనిపై దృష్టి తగ్గడం వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు.*

*💥20-20-20 రూల్‌ పాటిస్తే మేలు!*

*➡️కృత్రిమ కాంతి, వేగవంతమైన దృశ్య మార్పులు కంటిపై దుష్ప్రభావాన్ని చూపుతాయని ఏఐవోఎస్‌ కాబోయే అధ్యక్షుడు, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌ డాక్టర్‌ పార్థా బిశ్వాస్‌ అన్నారు. ఇది పూర్తిస్థాయి ప్రజారోగ్య సంక్షోభంగా మారకముందే తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అధికంగా రీల్స్‌ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.* 
    
*➡️మితిమీరిన, నియంత్రణలేని రీల్స్‌ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని. తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.* 
    
*➡️బ్లింక్‌ రేటు పెంచడం, స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్‌ చేయడానికి ప్రయత్నించడం, స్క్రీన్‌ సమయాన్ని తగ్గించడం,  క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి చర్యలతో దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు.*

*💥ఏమిటీ 20-20-20 రూల్‌?*

*🛟ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.*
 చూపున్న మాట 
ఉష్ణ ఉగ్రత... కావాలి భద్రత!

కొద్దిరోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. చెమట పట్టటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. లవణాలూ బయటకు పోతాయి. డీహైడ్రేషన్‌తో తలనొప్పి, మాటలు తడబడడం, స్పృహ కోల్పోవడం, వికారం, అలసట, రక్తపోటు అస్తవ్యస్తం కావటం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. కలుషిత ఆహారం, నీటితో వాంతులు, విరేచనాలయ్యే ప్రమాదముంది.  గుండె సమస్యలూ అదనం. వడదెబ్బ సరేసరి. ఏటా అనేకమంది దీని బారినపడి మరణిస్తున్నారు. కాబట్టి ఎండల నుంచి తప్పించుకుని, శరీరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఈ సమస్యలతో జాగ్రత్త...

వడదెబ్బ

ఇది చాలా తీవ్రమైన సమస్య. చెమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం ఆవిరవుతుంది. ఇది కొనసాగితే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలుతుంది. చివరికి చెమట పట్టడమూ ఆగిపోతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది. ఇదే వడదెబ్బ. కొందరికి 106 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరగొచ్చు. ఇందులో చర్మం పొడిబారుతుంది. ముట్టుకుంటే శరీరం కాలిపోతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు, ఫాస్ఫోలిపిడ్లు కరిగిపోవచ్చు. మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినటం మొదలవుతుంది. క్రమంగా అవయవాలు విఫలమై ప్రాణాపాయమూ సంభవించొచ్చు. చాలామంది ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. వేడి గాలి, వేడి వాతావరణం ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు. 

చికిత్స

    వడదెబ్బ తగిలినవారి శరీరం చల్లబడేలా చూడటం ప్రధానం. ఎండలో ఉంటే వెంటనే నీడకు చేర్చాలి. వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి. 
    బిగుతైన దుస్తులు.. టెర్లిన్, పాలిస్టర్‌ దుస్తులు ధరిస్తే తొలగించాలి. వదులైన, కాటన్‌ దుస్తులు వేయాలి.. 
    తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. ఐస్‌ ముక్కలను ప్లాస్టిక్‌ బ్యాగులో వేసి ఒళ్లంతా అద్దాలి. 
    లవణాలు, ఓఆర్‌ఎస్‌ కలిపిన నీరు తాగించాలి. మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం మజ్జిగ, కొబ్బరి నీళ్లూ ఇవ్వచ్చు. 
    ఒళ్లు కాలిపోతోందని పారాసిటమాల్, ఐబూప్రొఫెన్‌ వంటి మందులు ఇవ్వకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు. 
    ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా జ్వరం  పెరుగుతుంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సత్వర చికిత్స అవసరం.

చెమట పొక్కులు

ఇది మామూలు సమస్యే కావొచ్చు గానీ దురద, మంట వంటి వాటితో తెగ ఇబ్బంది పెడుతుంది. మధుమేహం వంటి సమస్యలు గలవారికి చర్మ ఇన్‌ఫెక్షన్లకూ దారితీయొచ్చు. మన చర్మ కణాల్లో కొన్ని నిరంతరం చనిపోతుంటాయి, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. మృతకణాలు కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. దుమ్ము, మురికి వంటివీ అక్కడ చేరుకోవచ్చు. ఇవన్నీ స్వేద రంధ్రాలకు అడ్డుపడితే చెమట బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంటుంది. చెమట పొక్కులకు కారణం ఇదే. ఎండాకాలంలో సహజంగానే చెమట ఎక్కువ పోస్తుంటుంది. ఇక అది బయటకు వచ్చే రంధ్రం మూసుకుపోతే.. అక్కడి చర్మం ఉబ్బిపోయి, చిన్న చిన్న పొక్కులు బయలుదేరతాయి. సాధారణంగా చెమట పొక్కులు పిల్లల్లో ఎక్కువ. 

చికిత్స

    నిజానికి చెమట పొక్కులు వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే కొందరికి ఇవి చర్మం లోపలి పొరల్లోకీ వ్యాపించొచ్చు. చీము కూడా పట్టొచ్చు. అందువల్ల పొక్కులు ఉన్న భాగం పొడిగా ఉండేలా, రాపిడి పడకుండా చూసుకోవటం మంచిది. 
    పొక్కులు బాగా వేధిస్తుంటే కొన్ని పూతమందులు బాగా ఉపయోగపడతాయి. 
    మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారిలో అరుదుగా కొందరికి పొక్కులు ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. వీరికి అవసరాన్ని బట్టి యాంటీబయోటిక్స్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

డీహైడ్రేషన్‌

తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బయట తిరగడం వల్ల, శరీరంలోని నీరు చెమటరూపంలో బయటకు వెళ్తుంది. పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్‌ స్థాయులు తగ్గిపోయి డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫలితంగా శరీరంలోని లవణాలు, సూక్ష్మపోషకాలు తగ్గుతాయి. నాలుక మీద తేమ తగ్గిపోయి...పొడిగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. చిన్నారుల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

చికిత్స

    శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలి.
    కీరదోస, పుచ్చకాయ వంటి నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లతో పాటు, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలి.
    మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుంటే, శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
    ఎక్కువసేపు ఎండలో తిరిగి రాగానే ఫ్రిజ్‌లోని నీటిని తాగడం కన్నా.. మట్టి కుండలోని నీరు ఉత్తమం.

కళ్లకు చేటే

వేసవిలో వీచే వడగాలులు చాలా ప్రమాదకరం. వేడికి కళ్లల్లోని తేమ సైతం ఆవిరైపోతుంది. ఫలితంగా కంట్లో ఇసుక వేసిన అనుభూతి కలుగుతుంది. కంటివద్ద చర్మం పొడిబారుతుంది. దుమ్ము, ధూళి కంట్లో పడితే కళ్ల దురద, మంటలు వస్తాయి. బలమైన సూర్యకాంతి వల్ల కార్నియా దెబ్బతింటుంది. నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు కూడా   పెరుగుతాయి. 

చికిత్స

    బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా సన్‌ గ్లాసెస్‌ ఉపయోగించాలి.
    ఇంటికి చేరిన వెంటనే చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. 
    వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఉన్న ప్రదేశంలో తిరగకపోవడం మంచిది.
    దురద, చికాకు, కళ్లు ఎర్రబడడం సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

కాళ్ల వాపు

ఎండాకాలం తొలిరోజుల్లో కొందరికి పాదాలు, మడమలు, కాళ్లు ఉబ్బుతుంటాయి. ఇది వేడిని అలవాటు చేసుకోవడానికి శరీరం చేసే ప్రయత్నమే. ఎండ, వేడిగాలి మూలంగా రక్తనాళాలు.. ముఖ్యంగా సిరలు వ్యాకోచిస్తుంటాయి. మరోవైపు అధిక వేడి కారణంగా శరీరానికి దూరంగా ఉండే కాళ్ల వంటి భాగాల నుంచి గుండెకు అంతగా రక్తం తిరిగి చేరుకోదు. దీంతో రక్తంలోని ద్రవం బయటకు వచ్చి పాదాలు ఉబ్బుతుంటాయి. కొందరికి చేతులు, వేళ్లు కూడా ఉబ్బొచ్చు. నిజానికిదేమీ పెద్ద సమస్య కాదు.

చికిత్స

    కిడ్నీ, కాలేయ సమస్యలేవీ లేకపోతే కాళ్ల వాపునకు అంతగా భయపడాల్సిన పనేమీ లేదు. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా అవసరం లేదు.
    పాదాలు ఎత్తుగా ఉండేలా కాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఎక్కువసేపు నిలబడకుండా, ఒకేచోట కూచోకుండా చూసుకోవాలి. 

ఇవి గుర్తుంచుకోండి

    బయటకు వెళ్లే ముందే తగినంత నీరు తాగాలి. దాహం వేస్తేనే నీళ్లు తాగాలని అనుకోవద్దు. మనకు దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీరు తగ్గిందని అర్థం. 
    బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకూడదు.
    లేతవర్ణం, తేలికైన కాటన్‌ దుస్తులు ధరించాలి. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించకూడదు.
    అల్కహాల్, టీ కాఫీ, సోడాలు వంటి డీ- హైడ్రేటింగ్‌ పానీయాలకు దూరంగా ఉండాలి
    రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగుపానీయాలు తాగకూడదు. 
    బయటకు వెళ్లినపుడు విధిగా గొడుగు తీసుకెళ్లాలి. వెడల్పయిన అంచులున్న టోపీ ధరించాలి.

పెద్దవాళ్లు జాగ్రత్త!

పెద్ద వయసులో ఉన్న వారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి 60 ఏళ్లు దాటిన వారు ఎండలోకి రాకపోవడం మంచిది. బీపీ, షుగర్‌ ఉన్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, జనరల్‌ ఫిజిషియన్,  విజయవాడ సర్వజనాసుపత్రి

ఈనాడు, అమరావతి

Saturday, April 5, 2025

 *_ఓ..మనిషి.._*
     *_రాకడ ఎందుకు..?_*
                *_పోకడ ఎందుకు..?_*

*_రాకడ పోకట యొక్క మర్మము తెలుసుకొని మసులుకో..._*

*_ఇంతకు.. నీదనేది ఏముంది ఈ లోకాన..?_*

✒️💦✒️💦✒️💦✒️💦

*_ఒక్కోసారి నాకు నేనే.. నాలోనే నేను.. నా మనసుకు ఇలా చెప్పుకుంటూ ఉంటాను._*

*_శవయాత్రలో.. పాల్గొంటూ.. రకరకాలుగా వారి గురించి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా! అదేనండి.._*

*_ఇలా చేయకుంటే ఇంకా బ్రతికి ఉంటుండే అని అంటూ ఉంటారు. కానీ, తాను మాత్రం బ్రతికే ఉంటాననే భ్రమను మాత్రం వీడడు._*

 *_ఏదో ఒక రోజు నేను కూడా ఇలా శవంగా  మారేదే ఉంది.. చివరికి వెళ్ళవలసిందే.. అనేది  మాత్రం అనుకోరు ఏంటో ఈ విడ్డూరం.._*

*_ఓ మనిషి..నాది, నాది అంటూ వెంపర్లాడుతుంటావు... ఇది నాదే..అది నాదే.. ఇదంతా నా కష్టార్జితమే అని విర్రవీగుతావు. ఇంతకు నీదనేది ఏముంది ఈ లోకంలో..?_*

*_నీ దేహమే ఒక అద్దె కొంప.. ఏదో ఒక రోజు  ఈ దేహం అనే కొంపను  ఖాళీ చేయక తప్పదు._*

*_నీవే శాశ్వతం కానప్పుడు.. నీ దేహమే బూడిద పాలవుతుంది అని తెలుసుకున్నప్పుడు. నీ కష్టార్జితము అనుకున్న..నీ ఆస్తి ఎక్కడుంటుంది..?_*

*_నీ కుటుంబ పరివారము,బంధువులు,  స్నేహితులు, ఆత్మీయులు,  శ్రేయోభిలాషులను చూసి.. ఇంతమంది ఉండగా నాకేమీ లోటు అని సంబర పడతావు కదా!_*

*_ఇంతకు నీ పరివారం, బంధుగణం, స్నేహితులు అందరూ నీ చుట్టారా.. ఉండగానే మాయమైపోతావు... నీవనుకున్న వీరందరూ నిన్ను రక్షించారా..?_*

*_అద్దెకు తీసుకున్న ఇల్లు యొక్క గడువు ముగిస్తే.. వెంటనే ఖాళీ చెయ్ అంటాడు ఇంటి యజమాని కదా! అలాగే..నాది,నాది అన్న నీ దేహమే నీ మాట వినకుండా నిన్ను బయటకు గెంటేస్తుంది._*

*_అలాంటిది  ఓ.. మనిషి..కాస్త ఆలోచించు..ఈ దేహం పై మమకారం ఎలా..?  దేహాభిమానాన్ని వదిలి,మనిషిలాగా మానవత్వంతో  ప్రవర్తించు, మానవత్వాన్ని నర నరాల్లో జీర్ణించుకో.._*

*_వారేంటి, గ్యారెంటీ లేని ఈ దేహాన్ని చూసిమొహమేల..?_*

*_అందుకే..నీ ముందున్న భోగాలన్నీ కేవలం నీవున్నంతవరకు  అనుభవించడానికి మాత్రమే!_*

*_ఈరోజు నీది అన్నది రేపు వేరొకడి సొంతం. నీ ముందున్నదంతా మాయేసుమా... ఇదంతా సప్నం లాంటిది... క్షణిక సుఖములాంటిది.._*

*_స్వప్నంలో ఎన్నో రకాల రాజభోగాలను చవిచూస్తావు, అనుభవిస్తావు. తీరా..కళ్ళు తెరవగానే అన్నీ మాయమవుతాయి.. కదా!_*

*_అదేవిధంగా  ఈ లోకంలో నీది అనేది ఏదీ లేదు అంతా నీ బ్రమనే.. అనేది జగద్గురు శంకరాచార్యులు.. సర్వ మానవాళికి హితం పలికారు._*

*_నిజానిజాలు గ్రహించు,మాయ నుండి బయటపడు.మాయల వలలో చిక్కి సతమతం అవ్వకముందే.. జ్ఞానాన్ని గ్రహించు._*

*_ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకో.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దైవాన్ని తెలుసుకోవడమే.._*

*_కేవలం నీ వనుకున్నదే నిజం అనుకుంటే..._*
*_ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులేరి..?_*

*_వారే..సర్వమనుకున్నా నీ ఆత్మీయులేరీ..?_*
*_నీ తాత ముత్తాత లేరి..?_*

*_ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారే కదా!అలాంటప్పుడు ఏదీ శాశ్వతం.తెలుసుకుంటే..అంతా ఆశాశ్వతం.._*

*_ఇంతకు నీవు ఎన్నాళ్ళు ఉంటావు..? ఏదైనా అగ్రిమెంటు,  లేదా ఇంతకాలం ఉంటా..అనే బాండు ఏదైనా నీ వద్ద ఉందా!  శశిరంగా శాశ్వతంగా ఉంటావా..?_*

*_అందుకే.. గర్వము, అహంకారము,చిన్న పెద్ద అనే బెదాన్ని వదిలి.ఉన్నంత వరకు అందరికి ప్రేమను పంచు..  ప్రేమతో పలకరించు.ఇదే నీవు మనిషిగా పుట్టినందుకు అంతిమకర్తవ్యం._*

*_ఎందుకంటే, ఏ పిలుపు  ఆఖరిదో.. ఏది చివరిదో.. చెప్పిరాదు. అందుకే నీ పాత్రను అద్భుతంగా పోషించు.. పదిమంది మెచ్చేలా. పదిమందికి నచ్చేలా.. శాశ్వతంగా ప్రతి హృదయంలో జీవించు..☝🏾_*
 *సీతాదేవి సందేశం.....* 

*దుష్టశిక్షణ శిష్టరక్షణలో భాగంగా, రాక్షససంహారంతో పాటు రావణసంహారం చేసి, లోకకల్యాణం జరిపించడానికి జనియించింది జానకీదేవి. ఆమె జీవనంలోని అడుగడుగూ నేటి సమాజానికి ఆదర్శమై, అనుకరణ యోగ్యమైన జీవిత సందేశాలను అందిస్తుంది.*

*దివ్య సౌందర్యం, దేదీప్యమానమైన తేజం, అచంచలమైన పతిభక్తితత్వం, అసాధారణ పాతివ్రత్యం, ధర్మ పరాయణత్వం, నిర్భయత్వం, సౌశీల్యం, త్యాగం, సహనశీలత్వం, సౌహార్థం, సంయమనం, సేవాతత్వం, సదాచారం, సాహసం, శౌర్యం, వినయం, క్షమాగుణం, ఇలా లెక్కకు మిక్కిలిగా మేలి సుగుణాల రాశి సీతమ్మ.*

*తండ్రిమాట నిలపడంకోసం అరణ్యాలకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు రాముడు. సీత దగ్గరికి వచ్చి విషయాన్ని తెలిపి, సీతను అయోధ్యలో జాగ్రత్తగా ఉండమని, తాను అరణ్యాలకు వెళ్ళి వస్తానన్నాడు.*

*అందుకు సీత రాముడితో, 'సమస్తసుఖాలకు నిలయమైన రాజభవనాల్లో నివసించుటకంటే, స్వర్గాది లోకాల్లో విమానాల్లో విహరించుటకంటే, అస్టైశ్వర్యసంపదలతో అంబరమున హాయిగా సంచరించుటకంటే, ఎన్నికష్టాలు అనుభవించాల్సివచ్చినా పతి అడుగుజాడల్లో సాగిపోవడమే సతికి సుఖప్రదం, శుభప్రదం, ధర్మసమ్మతం. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా వాటికి నేను ఇష్టపడను. మీ వెంట ఉండటం తప్ప ఇంక నాకేమీ అక్కరలేదు. మీరు నాతో ఉంటే చాలు ఎంత కష్టమైనా నాకు సుఖంగానే అనిపిస్తుంది. అక్కడ మీకు ఏ విధంగాను భారంకాను. నీవు నాకు దూరమైతే నేను మరణించటం తథ్యం. నా ప్రార్థనను మన్నించి నన్ను మీవెంటే తీసుకు వెళ్లండి. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా ఎప్పుడు భర్తవెంటే భార్య ఉండాలని, భర్త తోడులేనపుడు ఎంతటి సుఖమైనా వ్యర్థమేనని, భార్యాభర్తల శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అన్న చందంగా జీవించాలని చెప్పింది సీతమ్మ.*

*సీత అరణ్యాల్లో కూడా ఆనందంగా, నిర్భయంగా రామునితో ఉండేది. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు, రాక్షసులు పెడుతున్న బాధలను శ్రీరామునికి వివరించి, వారిని కాపాడమని కోరారు. రాముడు రాక్షసులందరినీ సంహరించి వారిని కాపాడుతానని మాట ఇచ్చాడు. ఆ తరువాత రాముడితో దారి మధ్యలో, రాక్షసులతో అకారణ వైరం వద్దని, హింసకు దూరంగా ఉండి ప్రశాంతంగా తాపసధర్మాన్ని స్వీకరించి పద్నాలుగేండ్లు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వెళదాం అనే ధర్మాన్ని సీతమ్మ భర్తకు బోధించింది. అకారణవైరం ఎప్పుడూ ఎవరితోనూ మంచిది కాదనేదే సీతాసందేశం.*

*యతివేషంలో వచ్చి సీతను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించి, తర్వాత తన నిజరూపాన్ని చూపి భయపెట్టిన రావణుడు లంకకు సీతను ఎత్తుకొని వెళ్ళి అక్కడ తన గొప్పదనాలు చూపి, రకరకాల ఆశలు పెట్టి, పరిపరి విధాలుగా భయపెట్టి, నయాన్నో, భయాన్నో సీతను లొంగ దీసుకోవాలి అని ప్రయత్నించిన రావణుడితో సీత ఇలా చెప్పింది. నేను రామపత్నిని, పతివ్రతను, ఆడసింహాన్ని, రాముని ముందు నీవు గడ్డిపరకతో సమానం. కోరి ప్రాణాలమీదికి తెచ్చుకోకు. నా పతియే నాకు దైవం. రాముడు లేనప్పుడు దొంగగా నన్ను అపహరించుకొని వచ్చావు. నీ ప్రాణాలు తీసి నా స్వామి నన్ను తీసుకు వెళతాడు. నా ప్రాణం పోయినా నేను రాముడిని తప్ప అన్యులను కన్నెత్తి కూడా చూడనని చెప్పింది. ఆపదలు ఎదురైనా మొక్కవోని నిర్భయత్వం, ప్రలోభాలకు లొంగని పతివ్రతాతత్వం, ఇవన్నీ కూడా నేటి సమాజానికి సీత ఇచ్చిన సందేశాలు ఎంతో మార్గదర్శకం.*

*హనుమంతుడు లంకలో ఉన్న సీతను ఎన్నో హింసలకు గురిచేసిన రాక్షసకాంతలను చంపేస్తాను, అనుమతి ఇవ్వమని అడిగాడు. అందుకు సీత హనుమా! వాళ్ళు రావణుడి దాసీజనం. వాళ్ళరాజు ఏమి చెప్పాడో అదే వాళ్ళు చేశారు. దోషం వాళ్ళది కాదు, ప్రభువుది. చెడు చేసినవానిపట్ల దయ ఉండాలి. అంతా మంచిగా ఉన్న వాడిమీద దయ ఎందుకు? కాబట్టి ఈ రాక్షసస్త్రీలపట్ల నేను దయతో ఉండాలి. నీవు ఇటువంటి వరం కోరకూడదు. వాళ్ళను చంపకూడదు. వీళ్ళందరికీ నారక్ష అని సీత హనుమంతుడితో పలికింది. ఇవి సీతమాతయొక్క దయ, క్షమాగుణాలు. భారతీయ స్త్రీలు ఇటువంటి గుణాలు కలిగి మంచి సంస్కారం కలిగి ఉండాలని సీత సమాజానికి సందేశాన్నిచ్చింది.*

*పద్నాలుగుసంవత్సరాల అరణ్యవాసానంతరం అయోధ్యలో పట్టాభిషేకానంతరం రాముడు సీత ఆనందంగా జీవిస్తున్నారు. సీత గర్భవతి అయ్యింది. మళ్ళీ లోకంలో ఎవరో సీతపై అపవాదు వేశారని వేగులు తెలపడంతో, రాముడు సీతను అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడితో కలిపి పంపాడు. గర్భవతియైన సీతను ఒంటరిగా అడవుల్లో రాముడి ఆజ్ఞ ప్రకారం వదిలి వెళ్ళిపోతున్న లక్ష్మణుడితో రాముడికి ఇలా తెలపమని, క్రింది విధంగా చెప్పింది.*

*లోకాపవాదం వల్ల రామునిపై వచ్చిన నిందను తొలగించడం భార్యగా నా ధర్మం. స్త్రీకి పతియే దైవం, బంధువు, గురువు, ప్రాణములకంటే మిన్న అన్నది. లోకులను కానీ, రాముణ్ణి కానీ, ఎవ్వరినీ సీత ఎన్నడూ నిందించని మహానుభావురాలు.*

*మానవుడిగా పుట్టి మాధవుడైన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని మించిన మహోజ్వలమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకొన్న సీతాదేవి జీవితంలోని అడుగడుగు ఆదర్శమే. సీత స్త్రీ జాతికి గర్వకారణం. ఆమె చరిత్ర లోకోపకారం. ఆమె జీవితంలోని ప్రతి అడుగూ ఆదర్శం.*

*పైన వివరించినట్లు నేటి సమాజానికి సీతాదేవి ఇచ్చే అమూల్యమైన సందేశాలు లెక్కకు మిక్కిలి. ఆ సందేశాలు ఆచంద్రతారార్కం మానవజాతి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేసే అద్భుతమైన అఖండజ్యోతులుగా వెలుగొందుతూనే ఉంటాయి.*

*┉┅━❀꧁జై మాత్రేనమః꧂❀━┅┉*
      *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🪷🦚🪷 🙏🕉️🙏 🪷🦚🪷
 🦚🌻🌹💎💜🦢🌈

*_🍁ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే..._*

*_సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన జీవి మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు._*

*_కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే... మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే._*

*_అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరో చోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి. ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు._*

*_రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు._*

*_ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది...☝️_*

 🦚🌻🌹🦢💎💜🌈
 *🌹🌹 శుభ శుభోదయం... 🌹🌹*

           *మన ఉన్నతిని కోరేవారు అప్పుడప్పుడు కఠినంగా ఉన్నా బాధ పడవద్దు.*

             *ఎందుకంటే, వాళ్ళు అలా ఉండడం వెనుక మనం బాగుండాలి అనే తపన దాగి ఉండవచ్చు కదా.*

            *మనకు వచ్చే కష్టం కన్నీళ్లనే కాదు, కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది.*

             *దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది.*

             *కష్టం మంచి నేస్తమే, నీలోని ధైర్యాన్ని, నీ సామార్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది.*

             *ఇంకా చెప్పాలంటే, నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది.*

              *అందుకే కష్టాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించండి.*

*🌹శుభ దినం శుభ మంగళవారo🌹*
*🙏🏻🚩 జై శ్రీరామ్ సర్వేజనా సుఖినోభవంతు 🚩🙏🏻*
 మహామృత్యుంజయ మంత్రం ఎలా కంపోజ్ చేయబడింది? మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరు రచించారు? దాని శక్తి తెలుసుకో,,,,,,,!

పరమశివుని భక్తుడైన మృకండ మహర్షి తనకు సంతానం లేని కారణంగా, సృష్టికర్త తనకు సంతానం కలిగించే అవకాశం ఇవ్వనందుకు విచారంగా ఉన్నాడు.మహాదేవ్ ప్రపంచంలోని అన్ని చట్టాలను మార్చగలడని మృకండ్ భావించాడు, కాబట్టి భోలేనాథ్‌ను సంతోషమృకండ్ తీవ్రమైన తపస్సు చేసాడు, భోలేనాథ్ మృకండ్ తపస్సుకు కారణం తెలుసు, అందుకే అతనికి వెంటనే దర్శనం ఇవ్వలేదు, కానీ భోలేనాథ్ భక్తుడి భక్తి ముందు నమస్కరిస్తాడు.పెట్టడం ద్వారా ఈ చట్టాన్ని ఎందుకు మార్చకూడదు.

మహాదేవుడు సంతోషించి, ధర్మశాస్త్రాన్ని మార్చడం ద్వారా నేను మీకు పుత్ర వరం ఇస్తున్నాను, అయితే ఈ వరంతో ఆనందంతో పాటు దుఃఖం కూడా ఉంటుందని మహర్షికి చెప్పాడు.భోలేనాథ్ ఆశీర్వాదంతో, మృకండ్‌కి మార్కండేయ అనే కుమారుడు జన్మించాడు. జ్యోతిష్యులు మృకంద్‌కు ఈ ప్రత్యేక బిడ్డ తక్కువ కాలం ఉంటాడని, అతని వయస్సు 16 సంవత్సరాలు మాత్రమేనని చెప్పారు.ఋషి ఆనందం విచారంగా మారింది, మృకండ తన భార్యకు భరోసా ఇచ్చాడు - ఎవరి దయతో బిడ్డ జన్మించాడో అదే అమాయక వ్యక్తి దానిని రక్షిస్తాడు, విధిని మార్చడం అతనికి సులభమైన పని.మార్కండేయుడు పెద్దయ్యాక, అతని తండ్రి అతనికి శివ మంత్ర దీక్షను ఇచ్చాడు. మార్కండేయుడి తల్లి బిడ్డ ఎదుగుదల గురించి ఆందోళన చెందింది. మార్కండేయుడికి తన చిన్న జీవితం గురించి చెప్పాడు.

మార్కండేయుడు తన తల్లిదండ్రుల సంతోషం కోసం, తనకు జీవితాన్ని ఇచ్చిన అదే సదాశివుడి నుండి దీర్ఘాయువు యొక్క వరం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు, అతను పదహారేళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు.మార్కండేయుడు శివుని ఆరాధన కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని రచించాడు మరియు శివాలయంలో కూర్చుని నిరంతరం జపించడం ప్రారంభించాడు.

ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ।

ఉర్వారుకమివ్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్ ।


సమయం ముగియగానే, యమదూతలు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చారు, ఆ పిల్లవాడు మహాకాళుడిని పూజించడం చూసి యమదూతలు కాసేపు వేచి ఉన్నారు. మార్కండేయుడు నిరంతర జపం చేసే ప్రతిజ్ఞ చేశాడు.యమదూతలు మార్కండేయుడిని తాకడానికి సాహసించక తిరిగి వచ్చారు. పిల్లవాడిని చేరుకోవడానికి తాము ధైర్యం చేయలేమని యమరాజ్‌కు చెప్పారు.దీనిపై యమరాజు మృకండ కుమారుడిని నేనే తీసుకువస్తానని చెప్పాడు. యమరాజు మార్కండేయుడిని చేరుకున్నాడు.బాల మార్కండేయుడు యమరాజును చూడగానే, మహామృత్యుంజయ మంత్రాన్ని బిగ్గరగా జపిస్తూ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు.

యమరాజ్ బిడ్డను శివలింగం నుండి దూరంగా లాగడానికి ప్రయత్నించినప్పుడు, ఆలయం పెద్ద గర్జనతో వణుకుతోంది. యమరాజ్ కళ్ళు తీవ్రమైన కాంతితో మిరుమిట్లు గొలిపాయి.శివలింగం నుండి మహాకాళుడు ప్రత్యక్షమయ్యాడు. చేతిలో త్రిశూలంతో యమరాజును హెచ్చరిస్తూ, నా ధ్యానంలో మునిగి ఉన్న భక్తుడిని లాగడానికి నీకు ఎలా ధైర్యం వచ్చింది?మహాకాళుని ఉగ్రరూపం చూసి యమరాజు వణికిపోయాడు. అతను చెప్పాడు- ప్రభూ, నేను నీ సేవకుడను. ప్రాణుల ప్రాణాలను హరించే క్రూరమైన పనిని మీరే నాకు అప్పగించారు.చంద్రశేఖరుని కోపం చల్లారినపుడు ఇలా అన్నాడు - నా భక్తుని స్తుతానికి నేను సంతసించి దీర్ఘాయుష్షును ప్రసాదించాను. మీరు తీసుకోలేరు.యమ అన్నాడు- ప్రభూ, నీ ఆజ్ఞ శ్రేష్ఠమైనది. నీ భక్తుడైన మార్కండేయుడు రచించిన మహామృత్యుంజయ పారాయణం చేసే ఎవరినీ నేను ఇబ్బంది పెట్టను.మహాకాళుని దయతో మార్కండేయుడు దీర్ఘాయుష్షు పొందాడు. ఆయన రచించిన మహామృత్యుంజయ్ మంత్రం కాలాన్ని కూడా ఓడిస్తుంది..🚩

మనిషి తాను స్వేచ్ఛా జీవిననుకుంటాడు కానీ నిజానికి సంఘజీవి- కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించుకోక తప్పదు. ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నపుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి. ఇంటి విషయాల్లో ఇతర కుటుంబసభ్యుల సలహాలకు విలువనివ్వాలి. మిత్రులతో కలసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి. తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియజేయవచ్చు కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రువులవుతారు. మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం. అలా కాకుండా దాని నియంత్రణలోకి వెళ్లిన వ్యక్తి కష్టాలపాలవుతాడు.
అందుకని ఏయే గుణాలను విడిచిపెట్టాలో భారత చెప్పింది. క్రోధం దుర్జయుడైన 
శత్రువు. లోభం అంతులేని వ్యాధి. మిత్రులను దూరం చేస్తుంది. ధర్మ మూఢత్వమే మోహం. హృదయ తాపమే మత్సరం అని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. కాబట్టి అరిషడ్వర్గాలను విడిచి పెట్టాలి. శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును పట్టి పీడించవు. సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి దోహదపడుతుంది.🕉️🚩
 *అయం మే హస్తో భగవాన్... శివాభిమర్శనః*_ 


💐 _*ఈ నా హస్తం భాగ్యవంతమైనది... పవిత్ర స్పర్శగలది♪.*_
          ‌                         -- అథర్వవేదం

మన చేతిలో దాగిన శక్తులు ఎన్నో♪!

మన భావచైతన్యమంతా మన శరీరంలో వివిధ అవయవాల ద్వారా ప్రసరించబడుతూ ఉంటుంది♪. అందులో ప్రధానమైనది చెయ్యి♪. ఈ చేయి ఆచరణ శక్తికి స్థానం♪. దేనిని స్పర్శించినా... ఆచరించినా... ఈ చేతులతోనే కదా♪!

కొందరి చేతులు తగిలితే చాలు మనలో దాగిన దుష్టశక్తుల్ని సైతం బైటపడవేస్తాయి♪. ఇంకొందరి హస్తస్పర్శ దుష్టభావాల్ని మనలో ప్రసరింపజేయవచ్చు♪. అది, ఆయా వ్యక్తుల ఉత్తమ, అధమ సంస్కారాల స్థాయిని బట్టి ఉంటుంది♪.

మన భావనాశక్తిని కేంద్రీకరించి ప్రసరింపజేస్తే శరీరమంతా అది చేతనత్వం పొందుతుంది♪. ప్రత్యేకించి హస్తాలలో♪...

దీని రహస్యం తెలిసే... భారతీయ సనాతన విజ్ఞానంలో కరస్పర్శకి సంబంధించి కొన్ని సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు♪.

మంత్రజపం, పూజ వంటివి చేసేటప్పుడు కరన్యాసం, అంగన్యాసం చేస్తాం♪. అంటే, మంత్రశక్తిని శరీరంలో ప్రసరింపజేయడానికి ముందుగా, చేతిలో ఉన్న ప్రతి వ్రేలిలోనూ, కరతలం (అరచేతులలోనూ) శక్తిని 'న్యాసం' (ఉంచడం) చేస్తాం♪. ఆ చేతిలో స్పర్శతో శరీరమంతా మంత్రశక్తిని న్యాసం చేస్తాం♪. అంటే, ముందుగా శక్తిని ప్రసరింపజేసుకొనే సాధనం హస్తమే♪.

ఈ హస్తం ద్వారానే దేవతాదులకు తర్పణం చేస్తాం♪. దేవతర్పణం, పితృతర్పణం, ఋషి తర్పణం - హస్తం ద్వారా జరుగుతుంది♪.

దీవించడం వంటివేకాక, గురువు శిష్యునకు ఇచ్చే దీక్షలలో హస్తస్పర్శ దీక్ష అత్యంత ప్రాముఖ్యమైనది♪. శిరస్సుపై కరాన్ని ఉంచి మహాత్ములు 'శక్తిపాతం' ద్వారా శిష్యుని అనుగ్రహిస్తారు♪.

నిత్యదైవోపాసన ఉన్నవారి దక్షిణ హస్తంలో 'అగ్ని' నిహితమై ఉంటుందనీ, అందుకే వారికి ఏదైనా దానం చేస్తే అగ్నికి అర్పించిన (యజ్ఞం చేసిన) ఫలం లభిస్తుందనీ సంప్రదాయం♪.

నియమంగా నిత్యం అనుష్ఠించే మంత్రాన్ని మనసా జపిస్తూ, రెండు అరచేతుల్ని రాపిడి చేసి, ఆ మంత్రశక్తిని కరతలంపై ఆవహింపజేసినట్లు భావన చేసి - వేడెక్కిన ఆ అరచేతిని - ఏ వ్యాధిగ్రస్తుని, లేదా అనారోగ్య పీడితుని శరీరానికి తాకించితే స్వస్థత శీఘ్రంగా చేకూరుతుంది♪. విభూదిని చేతిలోనుంచుకొని మంత్రించినా, ఈ అరచేతికున్న ‘దివ్యశక్తి గ్రహణ' సామర్థ్యం ద్వారా ఆ విభూది శక్తిమంతమవుతుంది♪.

విశేషమేమిటంటే - హస్తానికున్న ఐదు వ్రేళ్ళూ పంచభూతాలకి ప్రతీకలుగా, ఆ వేళ్ళతో..  _*'లం పృథ్వీ తత్త్వాత్మనే...'*_ మొదలైన మంత్రాలతో దేవతలకు పంచపూజ చేయడం ఆచారం♪.

మనలో చక్కని భావాలతో, ప్రేమ పూర్వకమైన ప్రశాంత చిత్తంతో, దైవాన్ని ధ్యానించి దేనిని స్పర్శించినా మన చేయి పవిత్రతను ప్రసాదించగలదు♪.

భగవత్శక్తి ప్రసరణకు స్థానభూతంగా ఉన్నది కనుక ఈ హస్తాన్నే 'భగవాన్' అన్నారు♪. అంతేకాక, దాని స్పర్శ 'శివం' కరమౌతుందనీ "శివాభిమర్శనః" అని వేదవచనం♪.

ఇటీవల ఈ సనాతన వైదిక భావనే తిరిగి విదేశాలనుండి "Healing Touch" పేరుతో వస్తూ ఉంటే, ఆ నూతన విధానాలవైపు వెళుతున్నాం♪.

కానీ, _*“పవిత్రస్పర్శ”*_ అనబడే శక్తిసాధన వైదిక సంస్కృతిలో పరిపుష్టంగా ఉంది♪. ఆ విధానాన్ని మన నిత్య అనుష్టానాలలో అమర్చి అందించారు మన పెద్దలు♪.

కానీ, మన సంప్రదాయాలపై, ధర్మంపై అవగాహన కోల్పోయి మన శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం♪.

'భైషజ్య' వేద' (వైద్య సంబంధమైన అథర్వవేదంలోని ఈ సిద్ధమంత్రం) స్పర్శాప్రధానమైన వైద్యవిధానాన్ని తెలియజేస్తోంది.

   🙏🌹🌴🪔🪔🪔🌴🌹🙏

*సమస్త దేవతల శుభాశీస్సులతో...*
*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*

*సర్వేజనాః సుఖినోభవంతు!*

*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*
*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*
*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*

*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*
*అందరికీ శుభమే జరుగుగాక!*

*సర్వేషాం శాన్తిర్భవతు!*
*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*

*సర్వేషాం పూర్ణంభవతు!*
*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*

*సర్వేషాం మంగళం భవతు!*
*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*
🙏🌹☘️🌹☘️🌹🙏

*వేదఆశీర్వచనము 👇*