Saturday, September 30, 2023

స్వామీ... నిను తలంచి.... ఈ గుప్పెడు మెతుకులు

 స్వామీ... నిను తలంచి.... ఈ గుప్పెడు మెతుకులు


వరి కంకులు కన్నీరు కార్చడం చూసారా ఎప్పుడేనా..! గోధుమ గింజ గుండె కొట్టుకోవడం విన్నారా ఏనాడైనా...! నూర్పిళ్ల నవ్వులు నిలిచిపోవడం కంట పడిందా ఒక్కనాడైనా...! పొడుగ్గా, చిక్కి శల్యమై నేల చూపులు చూస్తున్న ఆనాటి సంప్రదాయ వంగడాలకు కండ పట్టించిందెవరో గుప్పెడన్నం తినే ముందైనా జ్ఞప్తికి వచ్చిందా. బిడ్డకి అన్నం పెట్టిన తల్లిని చూసారు కదా.... దేశానికి అన్నం పెట్టిన తండ్రిని కాంచారా కలలోనైనా. దేశం మనకేమిచ్చిందని కాదు... మనం దేశానికి ఏమిచ్చాం అనే దొంగ దేశభక్తి కబుర్లలో పడి బతుకులిడ్చేస్తున్న వాళ్లం కదా. ఇవేవీ కనిపించే అవకాశం లేదు. " రైస్‌ ట్రీస్‌ ఎలా ఉంటాయి డాడీ"... "షుగర్‌ ఏ ఫ్లవర్‌ నుంచి వస్తుంది మమ్మీ" అని  ముద్దుగా అడుగుతున్న పిల్లల ముందు సగం కాలిన దేహాల్లా తచ్చాడవుతున్నాం కదా. మనకే తెలియని ఆ స్వామినాథన్‌ గురించి పిల్లలకేం చెబుతాం. వ్యవసాయం దండగన్న దోమల స్నేహితుడి గురించే నేటి చర్చంతా. 
విదేశాల భోజనం తయార్‌ బోర్డుల ముందు చేతులు కట్టుకున్న ఆనాటి దేశం మా భోజనం మీ కోసం అంటూ గోనె సంచుల్లో కీర్తిని నింపుతోందంటే ఆ స్వామినాథన్‌దే కదా పుణ్యమంతా. 
" బిక్షాందేహి కృపావలంబనకరీ" అన్న అన్నపూర్ణ స్తోత్రంలో అన్నపూర్ణేశ్వరి అనే పదం బదులుగా స్వామినాథన్‌ అనే పదాన్ని చేర్చాలనిపిస్తుంది నాకైతే. "సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే" అన్న ఆరుద్ర ఈ స్వామినాథన్‌ గురించే ఇలా రాసేరేమో అని కూడా అనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడల్లా. నూటికి డబ్భై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో పుట్టిన వ్యవసాయ విప్లవకారుడు స్వామినాథన్‌. పదొమ్మిదేళ్ల ప్రాయంలో దేశం జీర్ణాశయంలో జెర్రి పిల్లల్ని పెట్టడం చూసాడాయన. కరవుకు అమెరికా నుంచి అరువు తెచ్చుకుంటున్న
గోధుమలకు దేశమే పుట్టినిల్లుగా మార్చింది స్వామినాథనే కదా. దేశ వ్యవసాయానికి  కొత్త వంగడాలను కూర్చిపెట్టింది దేశం మీద ఈయనకున్న "స్వామి"భక్తే కదా. ఒక్కసారే కలిసాను. ఆ ఒక్కసారే చూసాను. నా వచ్చీ రాని ఇంగ్లీషులో ఆ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఒక్కసారంటే ఒక్కసారే మాట్లాడాను. నా జర్నలిస్టు వృత్తి నాకు ఇచ్చిన అపురూప అవకాశం అది. భూమి మట్టి రంగు కోటు తొడుక్కున్నట్లుగా ఉన్నారాయన. మొలకెత్తుతున్న కంకు నుంచి వస్తున్న లేత పాల నవ్వు. రిపోర్టర్‌గా అడుగుతున్న నా తెలుగు ప్రశ్నలకు  ది హిందూ రెసిడెంట్ ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన ఆనాటి సీనియర్‌ రిపోర్టర్‌ నగేష్‌ ఇంగ్లీషులో అనువదిస్తుంటే నా వైపే చూస్తూ సమాధానాలు ఇస్తున్న ఆ స్వామి నాథన్‌ కళ్లు దేశ సేద్యానికి వాడుతున్న నాగళ్లలా కనిపించాయి. ఇప్పుడంటే ఓట్ల మాయాజాలంలో రైతు భరోసా, పెట్టుబడి పథకం వచ్చాయి కాని దిగువ, మధ్య తరగతి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ నష్టనిధిని ఏర్పాటు చేయాలంటూ సూచించింది స్వామినాథనే. రాజకీయుడు కాదుగా... అందుకే పొద్దున్నే భుజాన నాగలి వేసుకుని పొలానికి వెళ్లే ప్రతి రైతు స్వామి నాథన్‌ కళ్లకు శిలువ మోస్తున్న జీసస్‌ క్రీస్తులాగే కనిపించాడు. రైతుల ఆత్మహత్యలన్నీ హత్యలే అని గ్రహించిన పెద్ద రైతు కదా అందుకే భూమి విలువతో పాటు కౌలు రౌక్కం, పొలం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని లెక్క కట్టి దానికి 50 శాతం ఎక్కువ గిట్టుబాటు ధర కల్పించాలని సూచించింది కూడా ఈ స్వామినాథనే. ఆ అద్భుత సూచన అమలు కావడానికి మనం ఉన్నది భారతదేశం కదా.... అందుకే ఆ సూచన పురుగు పట్టిన పంట చేనులా ఇంకా ఫైలులో  ఉండిపోయింది. రైతుల చూపుడువేళ్లను  తప్ప కడుపును చూడని వ్యవస్ధలో ఆ ఫైలుకి ఎరువులు దొరకకపోవచ్చు. నవ్వుకి పచ్చని రంగేసినట్లుగా ఉండే స్వామి నాథన్‌ను ఏలికలు పద్మవిభూషణుడు చేశాయి. బహుశా ఆయన్ని బాగా తెలిసిన వారికి స్వామినాథన్‌ వర్షం కోసం ఆకాశంలోకి చూస్తున్న రైతుగానే కనిపిస్తారు తప్ప పద్మవిభూషణుడిగా మాత్రం కనిపించరు. 
అయినా, నాకు తెలీక అడుగుతాను. ఆయన వెళ్లిపోయారంటేమిటి అందరూ. కంటి ముందున్న ఆకుపచ్చని ఆకులో పున్నమి చంద్రుడిలా మిలమిలా మెరిసిపోతూంటే...

- ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

Friday, September 29, 2023

" గుండె చప్పుడు".. -- ఊపిరి పోసుకున్న మరుక్షణం మొదలు ఊపిరి పోయినంత వరకు మానవుల దేహంలో జీవింపజేసేది గుండె.

 💔❤‍🔥❤‍🩹💓💗💘"
🙏" కరణం గారి అరుగు మీద." పంతులుగారి బృందం ముచ్చట్లు"
       🔥🔥🔥
🥁"సమర్పణ & సేకరణ:-
"మజుందార్, బెంగళూరు"
        👍👍👍
.❤️"  గుండె చప్పుడు".. --  ఊపిరి పోసుకున్న మరుక్షణం మొదలు ఊపిరి పోయినంత వరకు మానవుల దేహంలో జీవింపజేసేది గుండె. మెలుకువతో ఉన్న, నిద్రిస్తున్న, అసంకల్పితంగా, నిరంతరాయము ఒక మోటారు వలె రక్త ప్రసరణ వ్యవస్థ పంప్ చేయును.   అంటే‌ గుండె చప్పుడు ఆగకుండా గుండే నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.  అంతటి అతిముఖ్యమైన గుండెను ఎంతలా ఎంతగా మనం "కేర్"  తీసుకుంటూ కాపాడుకోవాలి.  ఈ విషయం మనల్ని గుర్తుచేసిందుకు, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహన కల్పించేందుకు" WHO" అనుబంధ సంస్థ( వరల్డ్. హెల్త్.  ఫెడరేషన్).. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 29న (ఈరోజే) వరల్డ్ హార్ట్ డే  2000వ సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది.  మన హరి బుర్రి  దినచర్యలో ఈ విషయాన్ని మనం అంతగా పట్టించుకోక పోవచ్చు.  ఫలితంగా "గుండె" కు ముప్పు ఏర్పడి వ్యాధులు రావచ్చు.. మరణాలు సంభవించవచ్చు.  ఈ కారణంగా ఏటా విశ్వవ్యాప్తంగా రెండు కోట్ల మంది చనిపోతున్నట్లు లెక్కలు తేలాయి.  ఇందులో 40 శాతం మంది 60 నుంచి 70 సంవత్సరాల వయసు లోపు వారే ఉండటం విశేషం.    అలార్మింగ్ ఫ్యాక్టర్.  30 శాతం మందికి ఈ గుండె జబ్బుల పట్ల సరియైన అవగాహన లేకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.  ఇటువంటి మరణాలు తగ్గే అవకాశాలు ఉండటంతో ఫెడరేషన్ మెంబర్లు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో తమ వంతు పాత్ర సమర్ధవంతంగా పోషిస్తున్నారు.   అన్ని వయసుల వారికి ముఖ్యంగా సిగరెట్టు మందు అలవాటు ఉండే వారికి, మానసిక ఒత్తిడి వలన జెనెటిక్ గా, కూడా వచ్చే అవకాశం ఉంది. కావున అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.  ఒక్కో సంవత్సరం ఒక్కో" థిమ్" తో ముందుకొస్తున్నారు.  ఈ 2023 థీమ్ ను..  use heart  know heart (హృదయం ఉపయోగించుకో హృదయం తెలుసుకో) గా నిర్ణయించారు.  మన గుండె గురించి తెలుసుకోవాలి..  ఎలా  సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.  ఇటువంటి అవగాహనా కార్యక్రమాలు చేపడితే కొంతవరకు మరణాలు కొంత వరకు తగ్గించవచ్చు.  హార్ట్ కేర్ విషయంలో 50 సం. దాటినవారు జాగ్రత్త పడాలి.  60 దాటినవారు మరింత జాగ్రత్త పడాలి.  70 దాటినవారు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.
 తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి.‌.
                            ❤️ 1) "నడక వ్యాయామం" నిద్ర, యోగా, ప్రాణాయామం వంటివి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి.
                   💗  2) అలసట ,ఆయాసం లేకపోతే మెట్లు ఎక్కడం దిగడం చేస్తుండాలి. కనీసం ఓ 30 మెట్లు అయినా ఎక్కి దిగుతూ ఉండాలి.

3)" వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా గుండెకి సంబంధింత పరీక్షలు E.C.G & Eco, Tread mill test,  చేయించుకోవాలి.  అవసరమైతే సూచించిన మందులు వాడాలి..

4)" కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి..

5)" ఒబెసిటీ "రాకుండా చూసుకోవాలి.

6)" ఆవేశాలకు ఒత్తిళ్ళకు లోనుకాకూడదు.  బీపి" హై" లో కాకుండా చూసుకోవాలి.

7)" ఆహారం విషయంలో శ్రద్ధ చాలా అవసరం.  ఉప్పు, పంచదార, మైదా, పాలు," white poisons" బాగా తగ్గించాలి..  ఆహారం మితంగా మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.

 8)"శారీరక మానసిక ప్రశాంతత చాలా అవసరం. H. D. L,.        L D.L, Tigly Cerirides,
చేయించుకోవాలి.

9)" మంచి మాట " మంచి మార్గం  మంచి నడవడిక అలవాటు చేసుకోవాలి.

 10) "పాజిటివ్ దృక్పథం" తోనే ఉండాలి..  --  చివరిగా  ఓ సందేశం..  కళ్ళు, కాళ్ళు" చేతులు కిడ్నీలు రెండేసి ఉంటాయి..  గుండె మాత్రం ఒక్కటే ..  ఆలోచించే  మెదడు ఒక్కటే.‌ ఒక్క హృదయం లేకపోతే జీవితమే లేదు.
స్టంట్"వేయించుకున్న వారు బైపాస్ ఆపరేషన్, చేయించుకున్న వారు, 
మంచి కార్డియాలజీ స్పెషలిస్ట్ ద్వారా మందులు మానకుండా ప్రతిరోజు వేసుకోవాలి.

 ❤‍🔥 "ప్రపంచ హృదయ దినోత్సవం"  సందర్భంగా ఈ పోస్ట్ ద్వారా మీకు   అవగాహనను  పెంచే  పుస్తకాలు చదవడం, చెయ్యాలి.  మెడికల్ షాపు వారు ఇచ్చే మందులు దయచేసి తీసుకోవద్దు.  సరియైన డాక్టర్ని సంప్రదించండి.
హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగానే తీసుకోవటం చాలా అత్యవసరము.   గుండె జబ్బు వచ్చిన తర్వాత, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మిమ్మల్ని సభ్యులుగా తీసుకోరు.  అందుకనే ఆలస్యం చేయకుండా చిన్నతనము నుండి హెల్త్ ఇన్సూరెన్స్ అధిక మొత్తంలో, చేయించండి!  నేడు కార్పొరేట్ వైద్యం వల్ల, వచ్చే, బిల్లులు కట్టటము చాలా కష్టము.  వైద్యము, వైద్య, ఉచితంగా ఇస్తే ఇది మనిషికి అవసరము.  ఇతర ఉచితలకు ఆశపడకండి! పెంచుకుందాం! ఆరోగ్యంగా ఉందాం!..  అవగాహన పెంపొందించే దిశగా అడుగులు వేద్దాం..  "గుండె" జర పదిలం అండి. అల క్ష యం చేయవద్దు.

" హరి సర్వోత్తమ"
" వాయు జీవోత్తమ"
👍👍🙏🙏👍👍

మనం తినే ఆహరం వల్లనే

 *మనం తినే ఆహరం వల్లనే మనం చేసే ఆలోచనలు రూపుదిద్దు కుంటాయి, అందుకే "జైసా అన్న్..వైసా మన్" అంటుంది శాస్త్రం. తమోగుణం అన్నది హింస తో మరి రాక్షసత్వం తో కూడుకున్న గుణం, మాంసపు భోజనం చేస్తూ హింసాత్మక ఆలోచనలు చేసే కిరాతకులు, వాళ్ళు వండేది శాకాహారమైన సరే అది హింసతో కలుషితం అయిపోయి తమోభోజనం కింద మారిపోతుంది, మీరు vegeterian hotel కి వెళ్లి శాకాహారమే తినుండచ్చు, కానీ దానిని వండింది మాంసాహారులు కనుక వారి రాక్షస లక్షణాలు మనకి వచ్చేస్తాయని తెలుసుకోవాలి, కాబట్టి ఆహరం విషయంలో జాగ్రత్త అవసరం, ఒక్క పూట పస్తులు ఉన్నా పరవాలేదు కానీ తమోగుణులు వండిన ఆహరం ఎంతమాత్రం తినకూడదు. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*

నిండా ముప్పై నిండలేదు , షుగర్ వచ్చింది. ఒకరి ఆవేదన.

సార్ నాకు నిండా ముప్పై నిండలేదు , షుగర్ వచ్చింది. ఒకరి ఆవేదన.
మా అమ్మాయి పట్టుమని పది అడుగులు కూడా నడవలేదు, బండి కావాలి. ఓ తల్లి వేదన.
మావాడు ఎప్పుడూ సెల్ తోనే ప్రపంచం. ఊబకాయం, ఓ తండ్రి దిగులు.
ఎందుకు ఇలా...!
పూర్వం అంటే 60సంవత్సరాల  క్రితం అంటే 1960 ప్రాంతాల్లో
పొద్దున్నే చద్దిఅన్నం, పెరుగు తినేవాళ్ళము. ఇంటిపని చేసే వాళ్ళము, అంటే బైట చిమ్మడం, బావి నుండి నీళ్ళు తేవడం, ఊరి చివర ఉన్న ఒకే మంచినీటి బావి నుండి మంచినీళ్లు తేవడం, సరుకులు తేవడం. స్కూల్ కు నడిచి వెళ్లే వాళ్ళము. చెప్పులు కూడా ఉండేవి కాదు. సంచి మోసుకుంటూ బాక్స్ లో అన్నం, పప్పు అంతే.
సాయంత్రం ఐదు నుండి ఆరు వరకు బైట మట్టి రోడ్డు మీద ఆటలు. ఏడు గంటలకు స్నానం చేసి అన్నం, కూర, మజ్జిగతో తిని హాయిగా పడుకోవడం. పొద్దున్నే లేచి చదువుకోవడం, మిగతావన్నీ మాములే.
1980 వచ్చేసరికి సైకిళ్ళు వచ్చాయి, ఉన్నవాళ్లు పిల్లలకు సైకిళ్ళు కొని పెట్టేవారు. ఇంట్లో పనిమనిషి సంస్కృతి కూడా వచ్చింది. తిండిలో కూడా ఖరీదైనవి చోటు చేసుకున్నాయి.
2000 వచ్చే సరికి ప్రతి ఇంట్లో బండి కంపల్సరీ. డబ్బు ఉంటే కారు కూడా. ప్రయివేటు స్కూళ్ల హవా. దర్జాగా నడిచే పని లేదు. బస్సుల్లో, ఆటోల్లో, సొంత వాహనాల్లో అడిగిన ప్రతిదీ కొని పెట్టె స్తోమత ఉన్నా, లేకున్నా పోటీ ప్రపంచం. పని తక్కువ, సుఖం ఎక్కువ, తిండీ ఎక్కువ. బైట రెడీ మేడ్ ఫుడ్,  కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, టీవీలు, ఫోన్లు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్, గిన్నెలు తోమడానికి పనిమనిషి. అన్నం, పప్పు కుక్కర్లతో సమయం ఆదా. ఆ సమయాన్ని టీవీల ముందు, ఫోన్ తో గడపడం. శ్రమ తక్కువ, తిండి ఎక్కువ, అదీ పోషకాలు లేని జంక్ ఫుడ్.
2020వచ్చేసరికి అందరూ ఆన్ లైన్ లో అన్నీ తెప్పించు కోవచ్చు. కరెంటు బిల్లు, కూరగాయలు, వండిన కూరలు, భోజనం, మందులు, సరుకులు, బట్టలు ఒకటేమిటి సమస్తం, బటన్ నోక్కితే ఇంట్లో,
అంతా సులభసాధ్యం, వళ్లు అలిసిపోదు. శరీరం రోగాల మయం. అరే నేను వాకింగ్ చేస్తానే అంటారు కొందరు, 
ఎలా, పార్కు వరకు కారు లేక బండి మీద అక్కడ కబుర్లు చెప్పుకుంటూ అరగంట నడక ,
దారిలో రెండు సమోసాలు, ఒక కూల్ డ్రింక్.
2040 లో  ఏముంది గర్వకారణం, శరీరం సమస్తం రోగాల మయం.
మేలుకోండి, ఇంట్లో వండుకొని మంచి కూరగాయల భోజనం, తినండి. మాంసాహారం కూడా పరవాలేదు వారానికి ఒక్కసారి. మీ పని మీరు చేసుకోండి. చిన్న చిన్న పనుల కోసం బండి తీయకండి. ముందు తరాలను రోగాల బారి నుండి కాపాడం మన చేతుల్లోనే ఉంది..🙏

ఆత్మ యొక్క ప్రేమ పూర్వక సోదరభావం

 *🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 147 / DAILY WISDOM - 147 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి  🍀*
*✍️.  ప్రసాద్ భరద్వాజ*

*🌻 26.  ఆత్మ యొక్క ప్రేమ పూర్వక సోదరభావం🌻*

*వేదాంతము ప్రపంచాన్ని అసహ్యించు కోవాలని లేదా ఇది కాకుండా వేరే ప్రపంచంలో ఒంటరిగా ఉండాలని బోధించదు. ఎవరైనా జీవితంలో తన విధులను విడనాడాలని లేదా ఆనందరహితంగా ముఖం పెట్టుకోవాలని లేదా ఏదైనా ప్రస్ఫుటంగా ప్రవర్తించాలని చెప్పదు. స్వార్థపూరితంగా ఉండకూడదని లేదా ఏ క్షణికమైన వస్తువుతో బంధం కలిగి ఉండకూడదని, విశ్వంలో ఆత్మ యొక్క ప్రేమపూర్వక సోదరభావం మరియు ఏకత్వం యొక్క చైతన్యంలో జీవించాలని, సత్యం అవిభాజ్యమైనదని, ద్వేషం, శత్రుత్వం, కలహాలు మరియు స్వార్థం ఆత్మస్వభావానికి విరుద్ధం అని, జనన మరణ బాధలు స్వయం యొక్క అజ్ఞానం వల్ల కలిగుతాయని చెప్తుంది.*

*అనుభూతి యొక్క అత్యున్నత స్థాయి బ్రహ్మాన్ని తెలుసుకోవడం అని, తద్వారా అమరమైన జీవితం గడపడమని,  ప్రతి ఒక్కరూ ఈ పరమ ప్రయోజనం కోసమే పుట్టారని, ఇది మనిషి యొక్క అత్యున్నత కర్తవ్యమని, ఇతర విధులన్నీ ఈ పరమ కర్తవ్యానికి సహాయకాలు మాత్రమే అని, బంధాలలో ఇరుక్కోకుండా అంకిత భావంతో తన నిర్దేశిత కర్తవ్యాలను నిర్వహించమని,  తమ చర్యలను పరమాత్మ పట్ల చేయమని, జీవితంలోని ప్రతి అంశమూ ఈ పరమాత్మ చైతన్యం తో  సంపూర్ణంగా నిండి ఉండాలి అని చెప్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 147 🌹*
*🍀 📖  The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 26. The Consciousness of the Loving Brotherhood 🌻*

*The Vedanta does not teach that one should detest the world or isolate oneself in some world other than this. It does not proclaim that anyone should forsake his duties in life or put on a grave face or behave in any conspicuous manner. His Vedanta declares that one should not be selfish or attached to any fleeting object, that one should live in the consciousness of the loving brotherhood and unity of the Self in the universe, that the truth of existence is one and indivisible, that division or separation, hatred, enmity, quarrel and selfishness are against the nature of the Self, that the pain of birth and death is caused by desire generated by the ignorance of the Self.*

*The highest state of experience is immortal life or the realisation of Brahman, that everyone is born for this supreme purpose, that this is the highest duty of man, that all other duties are only aids or auxiliaries to this paramount duty, that one should perform one’s prescribed duties with the spirit of non-attachment and dedication of oneself and one’s actions to the Supreme Being, and that every aspect of one’s life should get consummated in this Consciousness.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Thursday, September 28, 2023

బ్రహ్మసూత్రాలు - తెలిపేవీ, నడిపేవీ

 -------------
బ్రహ్మసూత్రాలు - తెలిపేవీ, నడిపేవీ 
-----------------------

 
బ్రహ్మ లేదా బ్రహ్మన్ అంటే నిరాకారమైన పరమాత్మ. అన్నిటికీ మించిన అంతటా పనిచేస్తూ ఉన్న సర్వాంతర్యామి బ్రహ్మ(న్). ఇక్కడ బ్రహ్మ ఆంటే నాలుగు తలల పౌరాణిక బ్రహ్మ కాదు. మహానిర్వాణ తంత్రం దేవతల్ని పూజిస్తే ఆ పూజ బ్రహ్మన్ చేత స్వీకరించబడుతుందని తెలియజేస్తోంది. బ్రహ్మన్ అన్ని శక్తులకు ఆది శక్తి. సూత్రం అంటే తెలియజేసే సూచిక (Clue లేదా Hint). బ్రహ్మ సూత్రాలు బ్రహ్మన్ గురించి తెలియజేసే సూచికలు లేదా బ్రహ్మన్ ను తెలుసుకునేందుకై మనకు ఇవ్వబడ్డ సూచికలు. ఋషి బాదరాయణుడు ఈ బ్రహ్మ సూత్ర రచన చేశారు. ఇవి మొత్తం 555. వైదికంగా (హిందు మత పరంగా అనడం సరికాదు) లేదా సనాతన ధర్మం పరంగా ప్రస్థానత్రయంలో ఉపనిషత్తుల తరువాతి స్థానం ఈ బ్రహ్మ సూత్రాలది. ఆది శంకరాచార్యులు ఈ బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాసిన తరువాత ప్రపంచానికి ఇవి మరింత చేరువయాయి.
 
మొట్టమొదటి బ్రహ్మ సూత్రం “అథాతో బ్రహ్మ జిజ్ఞాస”. బ్రహ్మ జిజ్ఞాస అన్నది ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానంగానూ, “ఇదుగో ఇందుకే బ్రహ్మ జిజ్ఞాస” అన్నదాన్ని తెలియజేస్తూనూ తొలి బ్రహ్మ సూత్రం మనల్ని ముందుకు తీసుకువెళుతోంది. సంస్కృతంలో ఏ రచననైనా అథ శబ్దంతో మొదలు పెట్టడం సంప్రదాయం. “అథ” అంటే శుభం అని అర్థం. శుభం(అథ) కనుక(అత:) బ్రహ్మ జిజ్ఞాస అని తొలి బ్రహ్మ సూత్రానికి తాత్పర్యం. మరొకటి కాదు. ఏ జిజ్ఞాస వల్ల శుభం కలుగుతుందో అది బ్రహ్మ జిజ్ఞాస. మరి ఏది బ్రహ్మ? మరో సూత్రం దానికి సమాధానం చెబుతోంది. “జన్మాదస్య యత:” అని. ఉత్పత్తి లేదా సృష్టికి ఆది ఎక్కడినుంచో అది బ్రహ్మ. మరోలా చెప్పుకోవాలంటే ఈ విశ్వానికి ఏది ఆదో అది బ్రహ్మ అని చెప్పుకోవాలి. బ్రహ్మన్ ఎలా తెలిసొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం మరో సూత్రం చెబుతోంది ”తత్తు సమన్వయాత్” అని. ఇక్కడ “తత్” అంటే బ్రహ్మ. తత్, తు, సమన్వయాత్. బ్రహ్మన్ సమన్వయం చేత మాత్రమే. ఇక్కడ సమన్వయం అంటే కలయిక (సింతసిస్. కోఆర్డినేషన్ కాదు). ఆలోచిస్తే ఈ కలయిక అనేదే లేకపోతే మనకు మైత్రి, ప్రేమ, బంధం, అనురాగం వంటివి ఉండవు కదా? ఈ సమన్వయాన్ని మనం రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి యోగులలో చూడచ్చు. యోగం అన్న పదం కూడా ‘యుజ్’ అంటే ‘కలయిక’ నుంచి వచ్చిందే. “బ్రహ్మన్ అనేది చూడబడేది కాదు. అది శబ్దం కాదు” ‘ఈక్షతేర్న అశబ్దం’ అని మరో సూత్రం చెబుతోంది. బ్రహ్మన్ ది  “రహస్య రూపం అని నిశ్చయంగా గానించబడుతోంది” అని ‘మాంత్ర వర్ణిక మేవచ గీయతే’ అన్న మరో సూత్రం చెబుతోంది. ఇక్కడ మాంత్ర అంటే రహస్యమైన అనీ, వర్ణిక అంటే రూపం కల అని అర్థాలు. ఆ బ్రహ్మన్ కు చిహ్నం, లేదా గుర్తు లేదా సంకేతం ఏదైనా ఉందా? “ఆకాశం దానికి లింగం” అని ‘ఆకాశ స్తల్లింగాత్’ అన్న మరో సూత్రం చెబుతోంది. బ్రహ్మన్ పై ఎలా అవగాహన వస్తుందని అన్న ప్రశ్నకు సమాధానాలుగా  “తలుచుకోవడం వల్లా” అని ‘స్మృతేశ్చ’ అన్న సూత్రమూ, “అర్థం చేసుకోవడం అనే పరిణామం లేదా క్రియ వల్లా” అని ‘ఆత్మ కృతేః పరిణామాత్’ అన్న సూత్రమూ చెబుతున్నాయి. ఇక్కడ ఆత్మ శబ్దానికి అర్థం అని తాత్పర్యం. బ్రహ్మన్ ఎలాంటిది?  ‘జగద్వాచిత్వాత్’ అంటే “కదిలేది అని చెప్పబడినందువల్ల” అని మరో సూత్రం తెలియజేస్తోంది. ఇక్కడ జగత్ అన్న పదం లోకం అన్న అర్థంలో కాకుండా కదలిక అన్న అర్థం లో వాడబడింది. బ్రహ్మన్ మనకు ఎలా లభిస్తుంది? “భావం లో మాత్రమే లభిస్తుంది” అని ‘భావేచో ప లబ్దేః’ అన్న సూత్రం తేటతెల్లం చేస్తోంది.
 
‘వైషమ్య నైర్ఘృణ్యేవ సాపేక్షత్త్వాత్త థాహి దర్శయతి’ ఆన్న సూత్రం  “అన్వయంతో కూడుకున్నదవడంవల్ల (బ్రహ్మన్ కు) వైషమ్యం, నిర్దయలు లేవు అని నిశ్చయంగా కనిపిస్తోంది” అనీ, ‘నిత్యమేవచ భావాత్’ అన్న సూత్రం బ్రహ్మన్  “భావం అవడం వల్ల నిత్యమైనదీ అనీ, ‘కరణవచ్చే న్న భోగాదిభ్య:’ అన్న సూత్రం “ బ్రహ్మన్ ను పొందడం “పని వంటిది కాదు, అనుభవం నుంచి పొందబడుతుంది” అనీ, ‘అస్తితు’ అన్న సూత్రం బ్రహ్మన్ “ఉంది” అనీ, ‘గౌణ్య సంభవాత్’ అన్న సూత్రం బ్రహ్మన్ ను “అర్థాలంకారాలతో చెప్పడం అసంభవం” అనీ, ‘జ్ఞాsత ఏవ’ అన్న సూత్రం బ్రహ్మన్ “చైతన్యం” అనీ ‘ఉత్ క్రాంతి గత్యా గతీనాం’ అన్న సూత్రం బ్రహ్మన్ “గతి, గతి రాహిత్యాలకు అతీతమైనది” అనీ, ‘ప్రదేశాదితి చే న్నాంతర్భావాత్’ అన్న సూత్రం బ్రహ్మన్ “ అంతర్భావం అవడం వల్ల నిర్ణయం కాదు” అనీ, ‘శ్రేష్ఠశ్చ’ అన్న సూత్రం బ్రహ్మన్ “శ్రేష్ఠమైనది” అనీ చెబుతున్నాయి. ఆ శ్రేష్ఠమైన బ్రహ్మన్ భావంలోనే లభిస్తుంది.  
 
ఆలోచిస్తే మనిషికి జీవితం భావం లోనే లభిస్తుంది. భావంలోనే మనిషి జీవితాన్ని అవలోకించాలి. మనల్ని మనం అవలోకనం చేద్దాం. మనం బ్రహ్మ సూత్ర అవలోకనం చేద్దాం. మనం బ్రహ్మన్ ను అవలోకనం చేద్దాం.
 
 
- రోచిష్మాన్
9444012279

4/1/2019 న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.

జ్ఞానదానం!

 *జ్ఞానదానం!*
                   

*జ్ఞాన సముపార్జన     మనిషికి అత్యంతావశ్యకం. జ్ఞానులు తమ జ్ఞానాన్ని ఇతరులకు పంచి సమాజ శ్రేయానికి తోడ్పడతారు. సమాజానికి మహోపకారులవుతారు.* 

*తనకు తెలిసిన విద్యను, జ్ఞానాన్ని ఇతరులకు బోధించడమనేది సర్వశ్రేష్ఠ దానం.*

*భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలిసిన వ్యాసమహర్షి కాలగమనంలో లోకంలోని యుగధర్మాలు గతి తప్పుతాయని, పాంచ  భౌతిక   శరీరాలకు   శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సార విహీనులు,    అల్పాయుష్కులు, దుర్బలురు అవుతారని దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. అన్ని వర్గాలకూ మేలు కలగాలనే ఆశయంతో ఒకటిగా ఉన్న వేదాలను విభజించాడు.* 

*పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులనే పూజ్యులు నాలుగు వేదాలను లోకోపకారార్థం శిష్య ప్రశిష్య సంప్రదాయ రూపంలో లోకంలో వ్యాప్తి చేశారని భాగవత పురాణం చెబుతోంది. ఆ విధంగా వేదం భూమిమీద భాసిల్లింది.*

*విశ్వశ్రేయాన్ని కాంక్షిస్తూ వ్యాసభగవానుడు అష్టాదశ పురాణాలు, మహాభారతం, భాగవతం రచించాడు.* 

*ఆయన కుమారుడైన శుకమహర్షి భాగవత కథను పరీక్షిన్మహారాజుకు వినిపించాడు.* 

*కవిత్రయం భారతాన్ని,    పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువదించి అమూల్యమైన పద్యసంపదను మనకందించారు.*

*పూర్వం    నైమిశారణ్యంలో    సూత మునీంద్రుడు శౌనకాది మహర్షులకు పురాణాలు, ధర్మశాస్త్రాలు వివరించాడు.* 

*ఆనాటి మహర్షులు విశదీకరించిన పురాణాలు నేటి మానవులకు ప్రవర్తనా నియమావళులై ధర్మమార్గాన్ని  ప్రబోధి స్తున్నాయి.* ఆదిత్యయోగి *

*విశ్వామిత్రుడు శ్రీరాముడికి బల, అతి బల అనే  రెండు విద్యలు ఉపదేశించాడు.*

*కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు బంధుశోకంతో వ్యాకులుడై దుఃఖంతో విలపించాడు. తనకు రాజ్యంపైన గాని, భోగభాగ్యాలపైన గాని ఆసక్తి లేదన్నాడు. తాను అరణ్యానికి వెళ్ళి శరీరాన్ని శుష్కింపజేసుకుంటా నన్నాడు. ధర్మరాజు విరక్తితో మాట్లాడుతున్నప్పుడు వేదవ్యాసుడు దివంగతులైన రాజుల కథలతోపాటు అనేక ధర్మసూత్రాలు వివరించి, ధర్మరాజు యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేశాడు. వేదవ్యాసుడి ఉపదేశంతో ఊరట చెందిన ధర్మరాజు రాజ్యపాలనకు అంగీకరించాడు.*

*శంకర భగవత్పాదులవారు తరతరాలకు తరగని ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహించారు. మనసును స్థిరపరచే మహిమాన్విత స్తోత్రాలను ప్రసాదించి మానవజాతికి మహోపకారం చేశారు. జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుందని శంకరులు నిర్ణయించారు. జ్ఞాన సంపాదన ఆవశ్యకతను వివరించారు.*

*రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణ మహర్షులు తమ జ్ఞానామృతాన్ని లోకానికి పంచి విశ్వమానవాళిని చైతన్యవంతం చేశారు. చంద్రగుప్త మౌర్యుడి గురువైన చాణక్యుడు విలువైన అర్థశాస్త్ర జ్ఞానాన్ని శిష్యులకు అందించాడు. జ్ఞానం పెన్నిధి వంటిది. దాన్ని జ్ఞాతులు వంచించి తీసుకోలేరు. దానం చేసినా తరగదు!*

*మనిషి మేధకు అపారమైన శక్తి ఉంది. నూతన శాస్త్రాలు ఆవిష్కరించాలనే తపనతో విద్యావంతులు నిరంతరం తమ మేధకు పదునుపెడుతూ మానవాభ్యుదయానికి పాటుపడుతున్నారు. కొందరి జ్ఞానం ఎందరికో ఉపాధి కల్పిస్తుంది. జ్ఞానం ఆత్మశోధనకు ఉపకరిస్తుంది.* 

*భగవంతుడు అనుగ్రహించిన బుద్ధిని సక్రమంగా వినియోగించగలవారు అద్భుతాలు సృష్టించగలుగుతారు.* 

*గురువుల బోధనలను ఏకాగ్రతతో ఆకళించుకుని క్రమశిక్షణతో ఎదిగిన శిష్యులు జ్ఞానవంతులవుతారు. నేటి శిష్యులే రేపటి గురువులై తమ జ్ఞానాన్ని వారి శిష్యులకు పంచుతారు. గురుశిష్య పరంపర నిరంతరం సాగుతూనే ఉంటుంది.....
                     

🙏లోకా సమస్తా సుఖినోభవంతు !🙏
 ఏ పాపం తెలియని ఓ పేద యువకుణ్ని రక్షకభటులు తీవ్రవాదిగా పొరబడ్డారు. ఖైదు చేశారు. ఆ హఠాత్ పరిణామానికి యువకుడు ఎంతో కలవరపడ్డాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తననే నమ్ముకుని జీవిస్తున్న ముసలి తల్లిదండ్రులు అనాథలవుతారని కుమిలిపోయాడు. దానికి తోడు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవాడు లేక అది బీడు పడిపోతోందంటూ తండ్రి నుంచి అందిన లేఖ మరింత కుంగదీసింది. మరణమే శరణ్యమనిపించింది.ఆదిత్యయోగి..

అంతలో అతడికి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన 'జీవన్ భద్రాణి పశ్యతి... బతికియున్నను సుఖములు బడయవచ్చుననే మాట గుర్తుకొచ్చింది. చచ్చి సాధించేదేమీ లేదని తనను తానే ఓదార్చుకున్నాడు. చటుక్కున ఒక ఆలోచన తోచింది. ఆశ చివురించింది. ఏం చెయ్యాలో. వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు. వారం తిరిగేసరికి తండ్రి నుంచి బదులు వచ్చింది. తమ పాలాన్ని రక్షకభటులే దగ్గరుండి దున్నించారని, వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదని తండ్రి రాశాడు.

తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ, ఆ యువకుడు 'నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ఆ భూమిలో కొన్ని ఆయుధాలను దాచి పెట్టానని నీకు రాశాను. ఇప్పుడిక నీవు అదను చూసి ఓపిక చేసుకుని విత్తనాలు జల్లు' అని రాశాడు. ఆశ మనిషిని బతికిస్తుంది. ఆలోచన ముందుకు నడిపిస్తుంది. అదే ఈ కధలోని సందేశం.

'మాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ రచయిత విక్టర్ ప్రాం గొప్ప మానసిక వైద్య నిపుణుడిగా పేరు గడించా ఆయనకోరోజు అర్ధరాత్రిపూట ఓ మహిళ ఫోన్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పింది. జీవితంలో తాను సర్వస్వాన్నీ కోల్పోయానని, ఒక బతకాలని లేదని చెప్పింది. ఆమెను అనునయిస్తూ విక్టర్ దారుణమైన ఆ నిర్ణయానికి గల కారణాలను రాబట్టాడు. జీవితం ఎంత విలువైనదో వివరిస్తూ ఆమె తన సమస్యలను ఎలా అధిగమించవచ్చో చెప్పాడు. బతకడానికి ఎన్ని
రకాల దారులున్నాయో చెబుతూ ఆమెతో చాలా పేపు చర్చించాడు. చాలా రోజుల తరవాత ఆమె విక్టర్ను కలిసింది. | తాను చెప్పిన ఏ అంశం ఆమెను ఓదార్చిందో, ఏ అంశం బాగా నచ్చి తన ఆలోచనను మార్చుకొనేలా చేసిందో- తెలుసుకోవచ్చా... అని విక్టర్ ప్రశ్నించాడు.

'తీవ్రమైన నిరాశలో మునిగిపోయి, చావుబతుకుల మధ్య సతమతమవుతున్న నాతో మీరంతసేపు ఓపికగా మాట్లాడటమే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బతుకుమీద ఆశను పుట్టించింది' అని బదులిచ్చిందామె.

సాటి మనిషికి సాయం చేయలేకపోయినా, కనీసం వారి కష్టాన్ని ఓపికతో విని, నాలుగు మంచి మాటలతో, ఓ చక్కని ఓదార్పుతో, ఓ చల్లని స్పర్శతో.. మనం భరోసా ఇవ్వగలిగితే ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతాం. ఇది బాహ్య ప్రేరణకు ఉదాహరణ. బతకడమే కాదు, నలుగురినీ బతికించాలన్న ఆలోచనతో జీవించడమే మనిషి బతుక్కి పరమార్ధం...
 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు.*
💖*పూజాద్రవ్యాలు శుభ్రంగా ఉండాలనుకోవడం సహజమే. కస్తూరి, పునుగు వంటి సుగంధ ద్రవ్యాల్ని జంతువుల నుంచి సేకరిస్తారు. ఆవుపాలను లేగదూడ, తేనెను తేనెటీగలు ఎంగిలి చేస్తాయి. అటువంటి బాహ్యసామగ్రికి సంబంధించిన శుచికైనా, శుద్ధతకైనా ఒక కొలమానం అంటూ ఏమీ లేదు. దైవానికి శుచిగా అర్పించదగినది మనస్సొక్కటే.*
❤️ *మనసు, బుద్ధి, చిత్‌, అహంకారంతో కూడినది అంతఃకరణ. దీన్ని శుద్ధి చేయాలంటే సంస్కరించాలి.* 💓 *మానవదేహం అన్నింటి సమాహారం. ఇందులో పరమాత్మ ఉన్నాడని అతడు గ్రహించి వ్యవహరించాలి. పవిత్రత ఉండటం, లేకపోవడం అనేవి కేవలం మనోభావాలు. దోషపూరితమైనవాటిని దోష రహితంగా చూసేదీ మనస్సే. దైవానికి అర్పించే పదార్థాల పరిధిని గుర్తించాల్సిందీ, వాటి యథార్థ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాల్సిందీ భక్తహృదయమే.*

💞 *సకల చరాచర సృష్టి పంచభూతాత్మక మయం. దీనికి చిహ్నంగా భగవంతుడికి చేసే అర్చన పంచోపచార పూజ.*
💕*భక్తుడు పృథ్వీతత్వంతో గంధాన్ని, వాయుతత్వంతో ధూపాన్ని, అగ్నితత్వంతో దీపాన్ని సమర్పిస్తాడు. జలతత్వంతో అర్ఘ్యం, ఆకాశతత్వంతో పుష్పం భగవంతుడికి అర్పిస్తాడు.*
💖 *దైవంలో లేనిదీ, దైవం కానిదీ ఏదీ లేదు. పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన సర్వజ్ఞత్వం, స్వతంత్రత, అనంతశక్తి తత్వాలతో భాసిల్లుతుంటాడు. ఆ మహాపూర్ణ స్వరూపానికి సమర్పించడానికి మనిషి వద్ద ఏదీ లేదు. చేతులు జోడించి శరణాగతి వేడటమే తప్ప మరో మార్గమూ లేదు.*
💓 *వస్తుదోషం, కర్మలోపం లేని కార్యం ఏదీ ఉండదు. విధి నిర్వహణలో లోపాలు దొర్లడమూ సహజం. సాక్షాత్‌ చతుర్ముఖ బ్రహ్యే యజ్ఞం చేసినా ఏవో కొన్ని కర్మలోపాలు తప్పవు. యజ్ఞయాగాదుల్లో చోటుచేసుకునే లోపాలకు ప్రాయశ్చిత్తహోమాలున్నాయి. వాటిలోనూ దొర్లే చిన్నపాటి తప్పిదాలకు క్షమాపణ అర్థించడమూ పరిపాటియే.*
💖 *భగవదారాధనలో వస్తువు పవిత్రత కన్నా పావనమైన భావనే మిన్న. శ్రద్ధగా కర్మల్ని ఆచరించాలి. బుద్ధిని వికసింపజేసి, సారాన్ని గ్రహించాలి. విగ్రహారాధన వల్ల నిగ్రహం కలుగుతుంది. భక్తి, శ్రద్ధ, ప్రపత్తులు దీని ఫలాలు. వీటితో భావశుద్ధికి బీజం పడుతుంది.*
💓 *ఆరాధనామార్గంలో తాత్విక దృష్టి, తార్కి కత, శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉన్నాయి. ‘నా ముఖాన్ని అవలోకించేందుకు అద్దం ఉపాధి (ఆధారం). నన్ను నేను తెలుసుకునేందుకు దైవం ఉపాధి’ అనే సత్యాన్ని భక్తుడు అవగతం చేసుకుంటే చాలు.*
💞 *’నాలోని పరమాత్మను నేను గుర్తించాలంటే, అందరిలోనూ ఆయనను దర్శించడాన్ని ముందుగా అలవరచుకోవాలి’ అని గ్రహించి మసలుకుంటూ, ఎదుటివారి లోపాల్నెంచక వారిని సంస్కరించడానికి ప్రయత్నించాలి. ద్వేషాన్ని ప్రేమతో జయించాలి.*
💖 *భావశుద్ధి ఉంటే, భావ సిద్ధి లభిస్తుంది. ఏ భావనతో అర్చిస్తే, పరమాత్మ ఆ భావననే సిద్ధింపజేస్తాడు. ఏ రూపంలో భావిస్తే, ఆ రూపంలోనే స్వామి దర్శనమిస్తాడు.*
💓 *ఒక భక్తుడు ఆధ్యాత్మిక దృష్టితో విష్ణుసాన్నిధ్యం కోరాడు. ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో మహాయజ్ఞాన్ని సంకల్పించాడు. సంబారాలు సమకూర్చాడు. రుత్విజులకు ఆహ్వానం పలికాడు. అంతలోనే అకాల మరణం పొందాడు. యజ్ఞసంకల్పం నెరవేరలేదన్న బాధ అతడిది. అయినప్పటికీ, ఆ భక్తుడికి విష్ణుపదం ఆహ్వానం పలికిందని పురాణ కథనం.*
💓 *‘నువ్వు తలపెట్టిన కార్యంతో పని లేదు, నీలో వెల్లివిరిసిన భావనే ప్రధానం’ అనే అంతరార్థాన్ని మనమిక్కడ గ్రహించాలి.*
💕 *మనకున్నదానితో సంతృప్తిపడటం ఉత్తమమే…!కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానమే ఔతుంది సుమా…!*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

ప్రకృతి పరిహాసం...!

 *ప్రకృతి పరిహాసం...!*

🌴🌴🌴🌴🌴🌴🌴

*(World Environmental Health Day...)*

*చెట్టుకు చేతబడి చేసి మొక్కను మొక్కుబడిగ మార్చేసి...*
ప్రకృతి మొత్తాన్ని పరిమార్చేసి
వనాలను మోడులుగా
పొలాలను బీడులుగా 
మిగిల్చేసి
*ఇప్పుడేడిస్తే ఏం లాభం?*
విపత్తు ముంచుకొచ్చాక  మొలిచేనా విత్తనం...
హరించేసినాక 
*చిగురించేనా హరితం...!?*

*నిన్ను మోస్తూ...అన్నీ ఇస్తూ*
*నీ పాపాలను భరిస్తూ...*
నువ్వు పెట్టే 
హింసలను సహిస్తూ
ఇన్నాళ్లూ...ఇన్నేళ్ళూ
రోదించింది తల్లి భూమి...
నీకు వినిపించ లేదా ఏమి...?
కట్ట తెగింది.గుండె పగిలింది...
ఇది నువ్వు,నేను మనందరం చేసిన తప్పు...
కొనితెచ్చుకున్న ముప్పు...
*పాపం పండినట్టే...*
*ఆయువు మూడినట్టే...!*

*మండుతోంది భూగోళం...*
*ఎండుతోంది పాతాళం...*
చినుకు రాలదు
చిగురు మొలవదు...
ఆరుగాలాలు పోయె
ఎండాకాలమె మిగిలె...
*క్రతువులు చేస్తే* 
*రుతువులు మారేనా...*
చెరువులు నిండేనా?
అంతా వృధా...వ్యధా...
*చేతులు కాలినాక* 
*పట్టేందుకు ఆకులు*
*సైతం మిగలని కాలం...*
*కలికాలం...ఆకలికాలం...*
తరుముకొస్తున్న ప్రళయం...
ముంచుకొస్తోంది విలయం...
ఎగసిపడుతున్న 
వెచ్చటి ద్రవం
ఇదే కదా విధ్వంసక ఉపద్రవం...
అంతానికి ఇదే సంకేతం
పిశాచాల విజయకేతనం...
విరక్తిగా భూదేవి హాసం...
*కసిగా మృత్యుదేవత* 
*వికటాట్టహాసం...!!!*

🌱🌱🌱🌱🌱🌱🌱

ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో...

 *ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో...*

      దొంగలు తుపాకీలు చూపిస్తూ మీరు కదిలితే చంపేస్తాం అని బ్యాంకులో ఉన్న వారిని బెదిరించారు..
       ఈ డబ్బు ప్రభుత్వానికి సంబంధించినది,
కానీ మీ ప్రాణాలు మీకు సంబంధించినవి.
కనుక మీరు ప్రశాంతంగా ఉంటే మా పని మేము చేసుకుని పోతాం అని చెప్పారు.

        *"మనసు మార్చే మాటలంటే ఇవే"*

దొంగలను పక్కదారి పట్టించాలని ఒక స్త్రీ
అనాగరికంగా ప్రవర్తించడంతో అందులో ఒక దొంగ మేము దొంగతనానికి వచ్చాము. అత్యాచారం చేయడానికి రాలేదు అని ఆమెను భయపెట్టాడు.

          *"దీన్నే అంటారు చేసే పనిలో నిమగ్నత అవసరం అని"*

       దొంగలు దొంగతనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అందులో ఒక దొంగ డబ్బును లెక్కపెడదామని చెప్పడంతో అందులో ఒకడు
ఎందుకు ఎంత డబ్బు పోయిందన్నది
ప్రభుత్వమే ప్రకటిస్తుందిలే అన్నాడు.

       *"దీన్నే అంటారు చదువు కన్నా అనుభవం గొప్పది అని"*

       బ్యాంక్ అధికారి దొంగతనం జరిగిన విషయాన్ని పోలీసుల కన్నా ముందు అతని పైఅధికారికి చెప్పగా... బ్యాంకులో దొంగతనం జరిగింది మొత్తం రూ.20 కోట్లు. మనం ఇంకో రూ.30 కోట్లు పంచుకుని మొత్తం రూ.50 కోట్లు చోరీ అయిందని చెబుదాం అన్నాడా అధికారి.!

       *"దీన్నే అంటారు అసందర్భాన్ని కూడా మనకు ఉపయోగకరంగా (అవకాశంగా) మార్చుకోవడం అని"*

      ఇది విన్న ఒక అధికారి ఏటా ఇలాంటి దొంగతనం జరిగితే బాగుంటుంది అని అనుకున్నాడు మనసులో.

       *"ఇదే స్వార్థం అంటే"*

✨మరుసటి రోజు షాక్⚡
దొంగతనం జరిగిన ￰మర్నాడు వార్తల్లో...
బ్యాంకులో రూ.100 కోట్లు దొంగతనం జరిగినట్లుగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ప్రకటించారు.
     _అంటే ఆ ముఖ్యమంత్రి వాటా రూ.50 కోట్లన్నమాట._

ఆశ్చర్యపోయిన దొంగలు డబ్బుని లెక్కపెట్టారు.
మొత్తం రూ.20 కోట్లు ఉన్నట్టు తేలింది.
అదేంటి మనం రూ.20 కోట్లు దొంగతనం చేస్తే మిగిలిన రూ.80 కోట్లు ఎవరు దొంగతనం చేశారని వారు ఆశ్చర్యపోయారు.!

       దొంగలకి విషయం అర్థం అయింది, దొంగల్లో ఒకడికి ఆవేశం కట్టలు తెంచుకున్నాయి.
మనం మన ప్రాణాలు పణంగా పెట్టి రూ.20 కోట్లు దొంగతనం చేస్తే, వీళ్లు మాత్రం దొరల్లా రూ.80 కోట్లు దోచేసుకున్నారు అని.

        *"చదువు అవసరం ఇప్పుడు తెలిసింది" అని అన్నాడు*

మన భారతదేశం ఇలాంటి దొంగల చేతుల్లోనూ, అధికారుల మాటల్లోనూ, రాజకీయ నాయకుల పాలనలోనూ నడుస్తున్నది.

         ఒక రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అప్పుడు ఎంపీ కృపాలాని ఎదురై ఇలా అన్నారట.

_కృపాలాని:_ ఏంటి అంబేడ్కర్ ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి.?

_అంబేడ్కర్:_ ఈ భారతదేశంలో రాణుల కడుపులో నుంచి రాజులు పుట్టటం చూశాం. కానీ నేను రాణుల కడుపులో నుంచి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్లపెట్టె నుంచి రాజులు పుట్టేలా ఏర్పాటు చేశాను.. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను.

_కృపాలాని:_ అయితే నీ సంతోషం ఎక్కువ కాలం ఉండదు..
ఎందుకంటే నీ ప్రజలు పేదవారు, నిస్సహాయులు, అడుక్కునే వాళ్లు, అమ్మడుపోయే వాళ్ళు..
మేము వారి ఓట్లు కొని మా ప్రభుత్వాలు ఏర్పాటుచేసి ప్రజల సొమ్మును దోచుకుని వాళ్లను బిచ్చగాళ్లను చేస్తాం, నువ్ ఏమీ చేయలేవు.

_అంబేడ్కర్:_ నా ప్రజలు పేదలే, నిస్సాహయులే, అడుక్కునే వారే, అమ్ముడుపోయే వారే..
వారి ఓట్లను కొని,
మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు..
కానీ, ఏ రోజయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీకన్నా బిచ్చగాళ్లు ఎవరు ఉండరు, అది గుర్తుంచుకోండి అన్నారు బాబాసాహెబ్.

*_ఇది కథ కాదు.. జరిగిన సంఘటన._*

*నీ ఓటు విలువ నువ్వు గుర్తించే వరకూ ఈ అవినీతిపరుల చేతుల్లో బలవుతూ ఉండాల్సిందే*.🤝💪👍

మనం మనలాగే ఉండాలి.. విజ్ఞానం

 మనం మనలాగే ఉండాలి.. విజ్ఞానం🌹
అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు. 
చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది. 
కొంతకాలం తరువాత .." అమ్మా  స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు. 
" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు 
అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ?  " అని అనునయించింది. 
మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని  నన్ను పొరుపెడుతున్నారు.
బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు. 
"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని..  వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి.  ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు. 
ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు.  " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.
తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు. 

అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త
 " సి.వి.రామన్ " .

 తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు. 

" Raman the great."

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ గారికి తన తల్లి మాట అంటే శిరోధార్యమే.

జై శ్రీమన్నారాయణ !

Tuesday, September 26, 2023

వామన అవతారం

 *𝕝𝕝 ॐ 𝕝𝕝 _25/09/2023 - శ్రీ వామన జయంతి_ 𝕝𝕝 卐 𝕝𝕝*
~~~~

🙏 *_వామన అవతారం_* 🙏
~~~~~

ప్రజలు తమ బాధలు తట్టుకోలేని ప్రతిసారీ ఆ భగవంతుని తల్చుకోవడం నైజం. దైవకృపతో ఆ బాధలు తీరిపోతాయని వారి నమ్మకం. కానీ దేవుడు వస్తే కానీ తీరని బాధలు కలిగితే సాక్షాత్తు ఆ దైవమే కిందకి దిగిరాక తప్పదు. అలా ‘కిందకి దిగడం’ అన్న మాటను అవతరించడం అంటారు. అలా విష్ణుమూర్తి మానవాళిని రక్షించేందుకు తొమ్మిది అవతారాలు ఎత్తినట్లు చెబుతారు. వాటిలో ఐదవది వామనావతారం.

 విష్ణుమూర్తి ధరించిన అవతారాలలో మొదటి మానవ అవతారం వామనుడు. ఈ వామనుడి ప్రసక్తి రుగ్వేదంలోనే ఉందని చెబుతారు. ఇక భాగవతంలో అయితే ఈయన ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది. ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడట. ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే! బలి మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా కొలుచుకునేవాడే. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు.

 స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను ఆదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించి బలిని అణచివేసే రోజు కోసం ఎదురుచూడసాగాడు.

మహాబలి ఒకసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టాడని తెలిసింది. అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడి (వామనుడు) రూపంలో యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు. అతనికి ‘ఏం కావాలో కోరుకోమంటూ’ బలి అడిగాడు. ‘నేను ఒంటికాయ శొంఠికొమ్ముని నాకు నగలూ నట్రా అవసరం లేదు. ఓ మూడు అడుగుల స్థలం చాలు,’ అని అడిగాడు వామనుడు.

వచ్చినవాడు సామాన్యుడు కాడని రాక్షసగురువు శుక్రాచార్యడు గ్రహించాడు. కానీ ‘ఆడిన మాట తప్పేది లేదంటూ’ బలి తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సిద్ధపడిపోయాడు. ఎలాగైనా ఈ దానాన్ని ఆపాలనుకున్న శుక్రాచార్యుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శాస్త్రోక్తంగా దానం చేసేటప్పుడు జలాన్ని విడుస్తూ దానిమిస్తారు. దీన్నే మనం ధారాదత్తం అంటాము. ఆ ధారాదత్తాన్ని అడ్డుకునేందుకు శుక్రాచార్యుడు కీటకంగా మారి కమండలంలోని నీటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వచ్చినవాడు సామాన్యుడు కాడు కదా! ఒక పుల్ల తీసుకుని కమండంలోకి చొప్పించాడు. దాంతో శుక్రాచార్యుని కన్ను కాస్తా పోయి ‘ఏకాక్షి’ గా మారాడు.

ఇంతకీ ఆ వామనుడు అడిగిన మూడు అడుగుల కథ గురించి అందరికీ తెలిసిందే! తొలి అడుగు కింద భూమినీ, రెండో అడుగు కింద ఆకాశాన్నీ, మూడో అడుగు కింద బలి తలనీ కోరుకున్నాడు. బలి రాక్షసుడే కావచ్చు. కానీ తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగివచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఈయమని వామనుడికి అడిగాడు. ఆ వరం ప్రకారమే ఏటా బలి పాలించినట్లుగా పేర్కొనే కేరళ రాజ్యానికి ఆయన వస్తాడని నమ్ముతారు. తన ప్రజలు సుఖసంతోషంగా ఉండటాన్ని చూసి, తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడట. ఆ సందర్భాన్నే ఓనం పండుగగా జరుపుకొంటారు.

మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్‌’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.

*𝕝𝕝 ॐ 𝕝𝕝 _జై శ్రీమన్నారాయణ_ 𝕝𝕝 卐 𝕝𝕝*

🥀🥀🥀🥀🥀🥀🥀

Monday, September 25, 2023

 *శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు - ఫలితాలు......!!*

*1.ఓం నమః శివాయ - మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి*

*2.ఓం నమో భగవతే రుద్రాయ - బలం కోసం , ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి*

*3.ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ  సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః - శరణాగతి కీ , సర్వ శుభాలకీ*

*4.త్రయంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ - ఆయుర్దాయం కోసం*

*5.ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి - మృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి.*
 🍃🪷 ఒక బంధం. బాగుండాలంటే..
ఒకరినొకరు గౌరవించుకోవాలి కానీ...
ఇద్దరిలో యే ఒక్కరైనా నోరు జారినా
ఆ బంధం...చేజారిపోతుంది...
బంధం...బాగుపడాలన్నా...
బలహీన పడాలన్నా...
మాటలే...కారణమౌతాయి...
మాటలకన్నా...బంధం గొప్పది...మరి...
భార్య భర్తల మధ్య ప్రేమ బలంగా ఉన్న చోట క్షమించే తత్వం పెరుగుతుంది...

బంధాలు, బంధుత్వాలు అభిమానానికి అవసరాలకు అహంకారానికి మధ్య నలిగిపోతున్నాయి బాధాకరం...

జనం నీ..వెనక చేరి...మాట్లాడుకుంటున్నారంటే...మనం వారి కన్నా నాలుగు అడుగులు
ముందున్నాం...అనుకోవాలి...
వారి స్థానం..మన వెనకనే.. ఎప్పుడూ...

ఈ ప్రపంచంలో...పుట్టగానే...ఎవరూ. శత్రువులు...ఎవరూ మిత్రులు...ఉండరు...అందరూ మంచి వారో చెడ్డ వారో కాదు...
కేవలం మాట్లాడే తీరు...మన నడవడిక వల్లనే మిత్రులనో శత్రువులనో తెచ్చిపెడుతుంది...

      🥀 నమస్తే థాంక్యూ.. ఆల్..🙏

🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్

భగవంతుని తోడ్పాటు God's Assistance

 🙏 తం సూర్యం ప్రణమామ్యహం 🙏

🍃🌷 భగవంతుని తోడ్పాటు God's Assistance) 🪷

🌷మనం సాధారణంగా భగవంతునిపై ప్రేమతో కాక, ఆయన సహాయాన్ని ఆశించి, ఆశ్రయిస్తూ ఉంటాము..!!

🌷భగవంతుని తోడ్పాటు లేనిదే మన మనుగడ అసాధ్యం అనీ, ఆయన సహాయంతోనే జీవితాన్ని జయించగలం అన్న విశ్వాసం మనలో జీర్ణించుకు పోయి ఉంది..!!

🌷భగవంతుని మద్దతు ఎవరికి లభిస్తుంది..? అందరూ..ఆయనను శరణు వేడుతారే, మరి ఎందుకు ఆయన సహాయాన్ని అందరూ పొందలేకున్నారు..?!

🌷ఎవరిలో అయితే జీవితంలో ఉన్నత దిశా నిర్ధేశం ఉంటుందో, కార్యశీలత,తపన ఉంటుందో, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా..వెనుకడుగు వేయక, ధైర్యంగా నిలుస్తారో..వారికే భగవంతుని తోడ్పాటు ఉంటుంది..!!

🌷భగవంతుని తోడు ఉండటం అంటే..ఆయన శక్తులు మనకు సదా అనుభవం అవ్వటమే..!! కనుక.." భగవంతుడా..!! నాకు మద్దతు ఇవ్వు అని యాచించక, ఆత్మిక స్థితిలో ఉంటే సహజంగానే ఆయన మద్దతు లభిస్తుంది..!!L

🌷సర్వులూ..ఆత్మిక స్థితిని అభ్యసిస్తూ, పరమాత్మునితో యోగాన్ని(connection) జోడించి, ఆయన తోడ్పాటు పొందాలి అదే ధ్యానం, అదే తపస్సు..

          🌷ఓం శాంతి🙏

🍃🌷 ఆత్మీయ పలకరింపుతో శుభోదయం మీకు వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్

Sunday, September 24, 2023

సంస్కృత భాష - దేవీ రూపం

 *🌷సంస్కృత భాష - దేవీ రూపం🌷*

*"ఆద్యా మహార్హా సా మూలం సర్వస్య ఇతి నిగద్యతే"*

ఆది యందు పుట్టింది ఆద్యా. ప్రపంచ భాషలలో మొదట పుట్టినది సంస్కృత భాష. అది అపౌరుషేయము. 

ప్రపంచ భాషలన్నియు దానినుండే పుట్టాయి‌. గొప్ప పూజనీయమైన మాతృస్వరూపము. అమ్మ రూపమే భాష. అదియు సంస్కృత భాష. అమరభాష. 

మొదట *"౦"*. పూర్ణము. అది *పరమేశ్వర* రూపము.*¾ +¼= 1*. అందు *¾* భాగం *జ్యోతిఃపుంజము*, *అవ్యక్తము*. అది *నాదమయము*, *జ్యోతి నాదం*. 

దీపారాధన వెలుగుతుంటే దగ్గరగా అబ్జర్వ్ చేస్తే స్వల్ప శబ్దం వినిపిస్తుంది. అది *నాదవిద్య*. అమ్మ జగన్మాతను *నాదరూపా* అంటారు. *ఆ నాదం జ్యోతి లోనిదే, పరబ్రహ్మ లోనిదే*.

పరమేశ్వరుడు *"౦"* పూర్ణము అనుకుందాం. పూర్ణమునుండియే *"1"* వచ్చింది. ఆ ఒకటి‌ మనకు ఒక విలువగా కనిపిస్తుంది కావున వ్యక్తము. *"౦"* పూర్ణము విలువ అనంతం.‌అప్రమేయం. అనుపమం. అది అవ్యక్తము. 

*"౦"* పూర్ణము అవ్యక్తము అయితే, *"1"* వ్యక్తము. *"అవ్యక్తము (పురుషుడు) వ్యక్తము ప్రకృతి"* కనిపిస్తుంది. పూర్ణములో *అవ్యక్తము = ¾* . *వ్యక్తము = ¼*. ఆ వ్యక్తమే *జగత్తు*. మనమంతా జగత్తులోని వారం. ప్రకృతిలోని భాగం. 

పురుషుడు లోనుండియే ప్రకృతి వచ్చింది. *"ఏకోహం బహుస్యాం ప్రజాయేయ"* అని ఉపనిషత్తు బోధించింది. మొదట ఒకటే
 దాని రూపం పూర్ణం. అది బ్రహ్మం. *"బహు"* గా అవుదామని తలచింది. ఆ తలపే *¼ జగత్తు*.

*పురుషుడు ¾ + ప్రకృతి ¼ (అమ్మ-శక్తి)* పురుషునిలోని శక్తి యే అమ్మవారు= 1 నుండి 9 వరకు రూపం దాల్చింది. ఆతరువాత మరల 1, O. 

1 నుండి 8 జగత్తు. 1+8 = 9. *"9"* పరబ్రహ్మయే. అది ఏ అంకెతో హెచ్చించినా ఉదాహరణకు : 1×9= 9. 2×9= 18(1+8= 9), 3×9 = 27( 2+7= 9). 9 విలువ మారదు.

ఇదే *నవావరణ శ్రీ చక్రము*. 4+5= 9. 

*4* లో 
1. *మనసు*
2. *బుద్ధి*
3. *చిత్తము*
4. *అహంకారము*
ఇవి శివునకు సంకేతాలు. శివ చక్రాలు.

*5* లో పంచ భూతాలు. ఇదే *ప్రకృతి, శక్తిచక్రములు*. 

మొత్తం 9 ఇదే జగత్తు. ఇందు పరబ్రహ్మ కలిసే ఉన్నాడు.

     *శిశు జననము - జగజ్జననము*
              *విశ్వావతరణం*

1.*బిందువు* (బ్రహ్మరంధ్రము) పరమాత్మ
2.*త్రికోణం* (సీమంతం) నల్లని జుట్టు + పాపిటి
   (త్రికోణరూపిణీ శక్రిః, బిందురూప పరః శివః)
3.*అష్టకోణం* - లలాటం
4.*అంతర్దశారము* - భ్రుకుటి
5.*బహిర్దశారము* - కంఠం
6.*మన్వస్రం* -  హృదయం
7.*అష్టదళం* - నాభి
8.*షోడశదళం* - లింగ స్థానం
9.*భూపురం* - పాదములు 

పరబ్రహ్మ మది ఎలాగంటే సూర్యునిలో కాంతి, చంద్రునిలోని వెన్నెల, అగ్నిలోని వేడిమి ఇవి అవినాభావాలు. అలాగే *"పురుషుడు + ప్రకృతి"* పరబ్రహ్మ. *"ఓమ్ ఇత్యేతదక్షరమిదగ్ం సర్వం"* అని *మాండూక్యోపనిషత్* వచించింది. సహస్రారనాదం ఓంకారం. అందుండియే అక్షరమాల వచ్చింది. *"ఓమ్"* లో *మ* కారం *అమ్మయే*. 

*"ఓమిత్యేకాక్షరం బ్రహ్మ"* అని మనం ముప్పొద్దులా సంధ్యావందనములో స్మరిస్తాము. ఆ *'ఓం'* కారము, ఆ  పరమేశ్వరుడు ఒకడే. ఆతడు తననుండి జనించిన ప్రకృతిలోని సనకాది మహర్షులను ఉద్ధరించుటకు అనగా జ్ఞానమయుల జేయుటకు అనగా అక్షరాస్యులను చేయుటకు 5+9 = 14 పర్యాయాలు శివుడు తన ఢమరుకాన్ని మ్రోగించాడు. ఆ 14 నాదములు 14 సూత్రములు. మహేశ్వరసూత్రములు. 

ఇవి శ్రీ చక్ర సూచకములు. శ్రీ చక్రములో 8 కోణాలు ఉంటాయి. ఆ 8+ 3 వృత్త రేఖలు + 3 చతురస్ర రేఖలు= మొత్తం 14. శివ సూత్రములకు, శ్రీ చక్రమునకు సరిపోతుంది. శ్రీ చక్రము *అమ్మ + అయ్య* ల స్వరూపం.

వర్ణమాల - పార్వతీ పరమేశ్వర స్వరూపం
 శ్రీ చక్ర స్వరూపం పరబ్రహ్మ స్వరూపం.
     ఆ 14 అఇఉణ్ - ఋ లుక్ - ఏ ఓఙ్ - ఐ ఔ చ్ - హయవరట్ … ఇలా 14 సూత్రములు. ఇందు వచ్చే వర్ణాలు దీర్ఘాలు కాక 44. ఇవి శ్రీచక్రకోణాలు. ఒక్కొక్క వర్ణం ఒక్కో శ్రీచక్రమందలి కోణమే. 
        ••••••••••••••••••••••

*ఇది అక్షర మాల*

అచ్చులు 16. ఇవి అమృతకళలు + హల్లులు 34, అమృతకళలతో కలిస్తేనే పలుకబడుతాయి= 50 వర్ణమాల.*16 అచ్చులు శక్తి రూపాలు*. అమ్మ రూపాలు.
*34 హల్లులు శివయ్య రూపాలు*. 
       •••••••••••••••••••••

    అచ్చులు కంఠం వద్ద విశుద్ధ చక్రములో ఉన్నాయి.
 హల్లులు కంఠమునకు దిగువన ఉంటాయి.
కనుక మానవ దేహం అక్షరరూపం. శ్రీ చక్రరూపం. శివ శక్తుల రూపం.
    •••••••••••••••••••••••••

వర్ణోత్పత్తి స్థానాదులు-వశిన్యాది దేవతలు 8
వశిన్యాదిభిస్సంస్తుతా
1. *కంఠ్యములు* -'అ' వర్గ - వశినీ దేవి.
2.*తాలవ్యములు* - కామేశ్వరి - 'క' వర్గ
3.*దంత్యములు*   - మోదిని - 'చ' వర్గ
4. *ఓష్ఠ్యములు*    - విమల - 'ట' వర్గ
5. *మూర్థన్యములు* - అరుణ -'త' వర్గ
6. *ఆభ్యంతర ప్రయత్నము* - జయ -'ప'వర్గ
7. *బాహ్య ప్రయత్నములు* - సర్వేశ్వరి-'య'వర్గ
8. *నాలుక* - కౌళిని - 'శ'వర్గ

శక్తి లేకపోతే శివుడు లేడు *" శివశ్శక్త్యా యుక్తో…."* అని *ఆదిశంకరభగవత్పాదుల* వారు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో *"శక్తి లేక శివుడు ఏమీ చేయలేడు..‌"* అంటారు. అంటే అచ్చులు కలియనిదే హల్లులు పలుకుట సాధ్యంకాదు. శబ్దస్వరూపం రాదు. 

ఆ శబ్ద స్వరూపంలో *"వాక్కు + అర్థము= అమ్మ + అయ్య"* కలిసి ఉన్నారు. కనుక భాష *పార్వతీ పరమేశ్వర* స్వరూపము. 

*కాళిదాస* మహాకవి
*"వాగర్థావివ సంపృక్తౌ…"* అని పార్వతీ పరమేశ్వరుల ఉపాసన చేసి రఘువంశం ఆరంభించారు.

సంస్కృత భాష దేవీ రూపం.
వర్ణాలన్నీ షట్చక్ర స్థిత దేవతలు
మూలాధారం -  
(భూమి)4 గణపతి (56°)
స్వాధిష్ఠానం - 
(జలం) 6 బ్రహ్మ 1(52°)
మణిపూరం - 
(అగ్ని)  10 విష్ణువు2(62°)
అనాహతం - 
(వాయు) 12 రుద్రుడు3(54°)
విశుద్ధం-
(ఆకాశం)16 -మహేశ్వరుడు4(72°)
ఆజ్ఞ. -   
(మనస్సు 2 - సదాశివుడు5(64°)
-------------------------------------------
*6 చక్రాలు-50అక్షరాలు- పంచబ్రహ్మలు-360°*
*360°=  ౦ వృత్తము. సహస్రారదళకమలం*
-----------------------------------------
సహస్రారం - అమ్మ - పంచబ్రహ్మలపై ఉంది
పంచ బ్రహ్మలు - పంచభూతాలు - ఆసీనపంచ బ్రహ్మాసనాసీనా అమ్మ
అమ్మ సహస్రారం.
*'అ'* నుండి *'హ'* వరకు 50 అర్థ వృత్తం
*'హ'* నుండి *'అ'* వరకు  50 అర్థవృత్తం
 మొత్తం పూర్ణ వృత్తం. 50+50= 100× 10 వృత్తాలు= 1000 దళాలు. *"సర్వవర్ణోపశోభితా"*
దశ సంఖ్య దశ దిశలకు, దశ మహావిద్యలకు సంకేతం. అమ్మ దశమహావిద్యాస్వరూపిణి జగన్మాత. పరబ్రహ్మ మే. 

పరబ్రహ్మను  తెలిపే *"ప్రజ్ఞానం బ్రహ్మ -తత్త్వమసి-అహం బ్రహ్మాస్మి - అయమాత్మా బ్రహ్మ"* మహావాక్య శబ్ద స్వరూపిణి అమ్మ. అర్థస్వరూపిణి అమ్మ. *"భాషారూపా"* అని లలితాసహస్రనామం.
*"భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణభారతీ"*

వృత్తం= 360°
*108* అగ్ని కళలు - కిరణాలు
*116* సూర్యకళలు - కిరణాలు
*136* చంద్ర కళలు - కిరణాలు
వెరసి తటిల్లేఖ. శ్రీ కళ
360 మొత్తం కళలు - కిరణాలు
అటు లలితారూపం + భాషారూపముల సమన్వయం బాగుంటుంది.

*"అమంత్రమక్షరం నాస్తి"* ఖలు. ప్రతి వర్ణము ఒక బీజమే. 50 బీజాలు  విశ్వమహావృక్షమే భాష. అది గీర్వాణభాషకే చెల్లును. ప్రజ్ఞానం(ఆధ్యాత్మికత), విజ్ఞాన( సైన్సు)భరితం గీర్వాణభాష. విశ్వమే భాష. విష్ణుశీల.

 అమ్మ పంచబ్రహ్మాసనాసీన.
ఇటు 16 మంది + ఎదురు 16మంది ద్విజులు= 32 *ద్విజులు = బ్రహ్మ జజ్ఞానము* కలవారు.
ద్విజబృంద నిషేవితా. బ్రహ్మజ్ఞానవంతైః సేవితా షోడశీ(16) మంత్ర సేవితా
ఇటు 4+అటు 4 = వశిన్యాదిభిస్సంస్తుతా

*"ఓంకారపంజరశుకీమ్ ఉపనిషదుద్యానకేళికలకంఠీం*
*ఆగమవిపినమయూరీం అంతర్విభావయే గౌరీమ్"*

అమ్మ *'ఓమ్'* కారమనే పంజరంలో చిలుక.
ఉపనిషత్తులు అనే ఉద్యానవనం లో విహరించే కమ్మని అధ్యాత్మవిద్యా మణిరవాలను కుహూ కుహూ అని వినిపించే *"కోకిల"*
వేదాలనే  అరణ్యసంచారిణి యైన వేద నాద హొయలులతో కులికే *"నెమలి"*.

ఆమె స్వరూపం నాలో ఉంది. ఆ అమ్మను నాలో అంతర్యాగము ద్వారా దర్శిస్తాను.

*ఏతత్ ఫలమ్ సర్వమ్*
 *శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు*


🌷శ్రీ మాత్రే నమః🌷

రామాయణ కాలంలో హిమాలయాలలో ఉన్న , నాటి ఓషధులు

 *రామాయణ కాలంలో హిమాలయాలలో ఉన్న , నాటి ఓషధులు*

యుద్దకాండ పరిశీలిస్తే, మనకి ఇలా తెలుస్తోంది..

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణునికి ధైర్యం చెప్పి ఇంద్రజిత్తు యుద్ధ రంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను నిశిత శరాలతో చీల్చి చెండాడ సాగాడు. 

వానర వీరులంతా సంజ్ఞా విహీనులై పోయారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. 

అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదుకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని 

*"అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?"* అని అడిగాడు.

అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు 

*"హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది"* 

అని జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది 
*మృత సంజీవని*, 
*విశల్యకరణి*, 
*సౌవర్ణకరణి*, 
*సంధాన కరణి* 
అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు..

ఈ సందర్భములో వాల్మీకి మహర్షి 74 సర్గలో చెప్పిన శ్లోకాలు కొన్ని పరిశీలిద్దాము. 30వ శ్లోకము నుండి మహర్షి విశేషంగా *రిషిభ*, *కైలాస* పర్వతముల మధ్యన దేదీప్యమానంగా వెలుగుతున్న సంజీవనీ గురుంచి చెపుతారు..

ततः काञ्चनमत्युग्रमृषभं पर्वतोत्तमम् |
कैलासशिखरं चापि द्रक्ष्यस्यरिनिषूदन || ६-७४-३०
తతః కా౦చనమత్యుచ్ఛమ్ ఋషభం పర్వతోత్తమమ్
కైలాస శిఖరం చాపి ద్రక్ష్యస్యరినిషూదన 30

तयोः शिखरयोर्मध्ये प्रदीप्तमतुलप्रभम् |
सर्वौषधियुतं वीर द्रक्ष्यस्यौषधिपर्वतम् || ६-७४-३१
తయోః శిఖరయోర్మధ్యే ప్రదీప్తమతుల ప్రభమ్
సర్వౌషధి యుతం వీర ద్రక్ష్యసి ఔషధి పర్వతమ్ 31

मृतसञ्जीवनीं चैव विशल्यकरणीम् अपि |
सौवर्णकरणीं चैव सन्धानीं च महौषधीम् || ६-७४-३३.
మృత సంజీవనీం చైవ విశల్య కరణీమ్ అపి
సావర్ణ్య కరణీం చైవ సంధాన కరణీ౦ తథా 33

*మృతసంజీవిని* : వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు.,

*విశల్యకరణీ* : దీనిని వాసనచూస్తే, శరీరంలోని గాయాలు మానుతవి. 

*సావర్ణ్యకరణీ* : దీనిని వాసన చూస్తే పెద్దగాయలతో మూర్చపోయినవారికి తెలివి వస్తుంది.

*సంధానకరణీ* : విరిగిన ఎముకలు దీనిని వాసనచూస్తే అతుకుబడుతవి..

तस्य वानरशार्दूलचतस्रो मूर्ध्नि सम्भवाः |
द्रक्ष्यस्योषधयो दीप्ता दीपयन्त्यो दिशो दश || ६-७४-३२.
తస్య వానర శార్దూల చతస్రో మూర్ధ్ని సంభవాః
ద్రక్ష్యస్యోషధయో దీప్తా దీపయన్త్యో దిశో దశ 32

तावप्युभौ मानुषराजपुत्रौ |
तं गन्धमाघ्राय महौषधीनाम् |
बभूवतुस्तत्र तदा विशल्या |
उत्तस्थुरन्ये च हरिप्रवीराः || ६-७४-७३.
తావప్యుభౌ మానుష రాజపుత్రౌ
తం గన్ధమాఘ్రాయ మహౌషధీనామ్
బభూవతుస్తత్ర తదా విశల్యౌ
ఉత్తస్థురన్యే చ హరిప్రవీరాః 73

ఈ సర్గలోని 32, 73 శ్లోకాలు హనుమ ఆ ఓషధీ పర్వతం ఎక్కడ ఉన్నదా అని చూస్తున్నప్పుడు తనకు కనబడిన దృశ్యాలను మహర్షి చెపుతారు.

అప్పుడు ఆ ఓషధులు హనుమ తమను తీసుకుపోతాడని *తమ ప్రకాశము తగ్గించుకుని, లొపలికి అణగిపోయాయి*. దీనిని హనుమ గ్రహించి *"రామకార్యమునము మీరు సాయం చెయ్యరా"* అని ఆగ్రహించి మొత్తం పర్వతశిఖరము పెల్లగించాడని వాల్మీకి రామాయణములొ ఉంటంకించారు. 

. ..(స్వస్తి)...
Bhagavadgeetha *Class-5 day*


*ముఖ్యాంశాలు*

1. ఈరోజు మనం రెండవ శ్లోకంలో మొదటి అధ్యాయం రెండవ శ్లోకం.... 
*దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం  దుర్యోధన స్తధా |*
*ఆచార్య ముపసంగమ్య  రాజా వచన మబ్రవీత్||* 
 ఆ సమయంలో రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యునీతో ఇట్లు అంటున్నాడు.

2. దుర్యోధనుడు ద్రోణాచరుని వద్దకు వెళ్లి ఏమంటున్నాడంటే బుద్ధిమంతుడైనటువంటి నీ శిష్యుడు అయినటువంటి ద్దృష్టద్యుమ్నుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మహా వ్యూహాన్ని చూడు, ఈ సైన్యాన్ని చూడు అని అంటున్నాడు. కానీ ఇక్కడ దుర్యోధనను ఈ యొక్క ప్రవర్తన గనక మనం గమనిస్తే నిజానికి మన జీవితంలో గొప్ప జీవిత పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ద్రోణాచార్యులు కురుపాండవుల యొక్క గురువు సమస్త విద్యలను కూడా నేర్పించినటువంటి గురువు. ఆయనే కౌరవుల పక్షాన పాండవులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

3. ద్రౌపది యొక్క సోదరుడు ద్రుపద పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు సైన్యాన్ని మొహరింపజేసి ఉన్నాడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఒకసారి చూడండి నీ బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు ఎంత గొప్ప వ్యూహాన్ని రచించాడో చూడండి అంటున్నాడు. 

4.మొదటి అధ్యాయంలో భగవంతుడు ప్రస్తావించడం జరిగింది. భగవద్గీత ఈ మొదటి శ్లోకంలో దుర్యోధనుల గురించి ద్రోణాచార్యుల గురించి దృపదని గురించి దుష్టమును గురించి వీరి యొక్క పేర్లను ప్రస్తావించడం జరిగింది. 

5.భగవద్గీతలో ఏ ఒక్క పదము కూడా మనము తీసేయడానికి లేదు ప్రతి పదము నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. 

6.ఇక్కడ దుర్యోధనుడు అన్నటువంటి పేరు భగవద్గీత శ్లోకాలు చోటుచేసుకుందంటే మరి ఆ దుర్యోధన వెనకాల ఉన్నటువంటి కొన్ని పాఠాల్ని  నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి జీవితం గురించి పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ద్రోణాచార్యులు దృక్పథుడు వీరు వీరి జీవితాల ద్వారా మనకు ఏం సందేశాన్ని ఇస్తున్నారు, వారి జీవితాలు మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది, ఇక్కడ మనం మామూలుగా చాలామంది జీవితంలో గొప్ప విజయాలు సాధించాలి గొప్ప అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి తమ జీవితాలను అత్యున్నతంగా మార్చుకోవాలని సక్సెస్ అయిన వారు లేదంటే గొప్ప వారి యొక్క జీవితాల నుంచి మాత్రమే పాఠాలు తీసుకోవాల్సిన అవసరం నుంచి కూడా వైఫల్యాలు పొందినటువంటి వారి నుంచి కూడా మనం అద్భుతమైనటువంటి తీసుకోవచ్చు ఎక్కడ కూడా దుర్యోధన ఒక ముఖ్యమైనటువంటి పాత్ర మహాభారతంలో దుర్యోధను అనబడే ఒక ముఖ్యమైన పాత్ర మనకేం బోధిస్తుంది.. మనం ఏం నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి ఇది మనము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం అదేవిధంగా గురించి వారి పేర్లను ప్రస్తావించడం జరిగింది. 

7.ఏర్పాటు చేసినటువంటి వ్యూహాన్ని చూడు అనకుండా నీ బుద్ధిమంతుడైనటువంటి శిష్యుడు ద్రుపద పుత్రుడు అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు దృక్పథుడు యాక్చువల్ గా దుర్యోధనుడికి శత్రువు పాండవ పక్షంలో ఉన్నవాడు మరి శత్రువుని బుద్ధిమంతుడు అని ఎందుకు అంటున్నాడు అంటే ఇక్కడ దుర్యోధనుడి యొక్క ఇంటెన్షన్ మనం గ్రహించాలి. అది నిజానికి చాలామందిలో ఉంటుంది. మనందరిలో కూడా ఉంటుంది అదేంటంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులను భావోద్వేగాలను బట్టి కుదిపేసేలాగుంటాయి. ఇతరులను రెచ్చగొట్టేటట్టు, వాళ్లకు ఆందోళన కలిగించినట్టు, వాళ్లకు భయాన్ని కలిగించినట్లు ఈ విధంగా మాట్లాడే తమకు కావలసిన విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు. ఈ విధంగా మనుషులను రెచ్చగొట్టడంలో యుద్ధ రంగంలో కర్ణుడిని గాని ఎద్దేవ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా రెచ్చగొట్టి మాట్లాడి ఇది చాలా చాలా నీచమైనటువంటి హేయమైన చెప్పుకున్నాం. అనుద్వేగకరం ప్రేమహితం అని మనం చెప్పుకున్నాం. 

8.మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే ఇతరుల ఉద్వేగాన్ని కలిగించకూడదు. ప్రతి మాట కూడా ఎదుటివారి హృదయంలో శాంతిని నెలకొల్పాలి. శాంతి కలిగే విధంగా, భయం పోయే విధంగా, అభయాన్ని కలిగించే విధంగా ఈ యొక్క మాటలు ఉండాల్సి ఉంటుంది. 

9.ఎవరైనా సరే తాము తరించిపోవడానికి ఒక పరమ లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ప్రపంచానికి మేలు చేయడానికి ఒక పరమ లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ పగ ప్రతీకారంతో అల్లాడిపోతూ జీవితం మొత్తాన్ని ఒక వ్యక్తి పైన పగ తీర్చుకోడానికి ఉపయోగించేసాడు. అతను మరణించాడు. చూడండి ఒక మనిషికి అంతిమ లక్ష్యం ఎప్పుడూ కూడా భగవంతుని చేరుకోవడమై ఉంటుంది. మరి అటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టేసి, పగప్రతీకారాల చేత పిచ్చి పిచ్చి లక్ష్యాలు అన్ని పెట్టుకుని జీవితాలను అద్భుతమైనటువంటి జీవితాలను గడపవలసి ఉంటుంది.  ఈ దృక్పథం నుంచి ఎటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండకూడదు పగ ప్రతీకారం.. ఇటువంటి లక్ష్యంతో మనం జీవితాన్ని గడపకూడదు.


గమనిక:-
ఈ రోజు గురువు గారు చెప్పిన క్లాస్ లో మమకారం, అహంకారం మొదలైన రాక్షస గుణాలు మానవునిలో ఉంటే వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో దుర్యోధనుని పాత్ర ద్వారా సవివరంగా వివరించారు.


------------------

ఓం శ్రీ గురుభ్యోనమః. 🙏. 
         ఈరోజు క్లాస్ లో దుర్యోధనుడు పతనానికి కారణమైన దుర్గుణాలను గురించి చాలా బాగా తెలియజేశారు. అసూయ ఎంతటి పతనానికి కారణం అవుతుందో తెలిసింది. అదే అసూయ కొంచెం గా ఉంటే మన డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుందని మనల్ని మోటివేట్ చేసుకోవడానికి పనికొస్తుందని చాలా బాగా చెప్పారు.
             కపటము, మొండితనము, దురభిమానము, క్రోధము ,పరుషంగా మాట్లాడడం ,అజ్ఞానము ఇవన్నీ రాక్షసు గుణాలని తెలియజేశారు.
             "ఇనుము నాశనం అవ్వడానికి కారణము దానికి పట్టిన తుప్పే" అని చక్కటి ఉదాహరణ ఇచ్చారు. మన జీవిత పతనానికి కారణం కూడా మనలో ఉన్న ఈ రాక్షస గుణాలే అని అర్థమైంది.
             కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు మన గుణాలను మనము సరిజేసుకుంటూ మన ఆలోచనలను ధనాత్మకంగా ఉంచుకుంటూ మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ఉపయోగకరంగా మారి మన జన్మ కారణం తెలుసుకొని వినయ విధేయతలతో ఉంటూ సమాజానికి ఉపయోగపడేటట్లు తయారయ్యి మన జన్మకు ఒక సార్థకత తెచ్చుకోవాలని చాలా బాగా సెలవిచ్చారు గురువుగారు ధన్యవాదములు. 🙏🙇

-----------------------

🙏🏻ఓం శ్రీ గురుభ్యోన్నామహ🙏🏻
ఈ రోజు క్లాస్ లో గురువుగారు చెప్పిన సారాంశము ….
నిత్య సాధన నీ చేస్తే  కనుక నిజంగా  ….. 
అసూయ. , ప్రతీకారం , స్వాభిమానం. , అహంకారం లాంటి దుష్ట గుణాల యొక్క ప్రభావం నుండి పూర్తిగా విముక్తి కలిగి , సత్యాన్వేషణ వైపుకి మరల్చుకోగలుగుతారు. 

మనం …. మంచి గుణాలు కలిగి ఉన్న వారి నుండే నేర్చుకోవడం కాకుండా ,
దుర్యోధనుడి లాంటి ….. పూర్తి negitiv గుణాలు కలిగివున్న వారి నుండికూడా …..
ఎలా జీవించకూడదో తెలుసుకుని తీరాలి. 
ఇలాంటి దుష్ట పాత్రలు వల్ల కూడా 
గుణ పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. 

అన్నిటికీ మించి .. అహంకారం …………
ఈ గుణం కలిగి ఉండడం వల్ల ….……
ఎంత మంచితనం ఉన్నా కూడా ఉపయోగం ఉండదు. 
ఆ గుణం వానిని అదఃపాతాలానికి చేర్చేస్తుంది. 
అలాగే , ఎదుటివారికి కూడా హాని కలుగుతుంది. 

🙏🏻ఓం శ్రీ గురుభ్యోన్నమహ🙏🏻

Friday, September 22, 2023

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝𝑻𝒐𝒏𝒚 𝒕𝒐𝒐𝒌 𝒂 𝒕𝒂𝒙𝒊 𝒂𝒏𝒅 𝒕𝒐𝒐𝒌 𝒐𝒇𝒇 𝒇𝒐𝒓 𝒂𝒊𝒓𝒑𝒐𝒓𝒕. 𝑻𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓 𝒘𝒂𝒔 𝒅𝒓𝒊𝒗𝒊𝒏𝒈 𝒊𝒏 𝒓𝒊𝒈𝒉𝒕 𝒍𝒂𝒏𝒆 𝒂𝒏𝒅 𝒔𝒖𝒅𝒅𝒆𝒏𝒍𝒚 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒕𝒂𝒙𝒊 𝒈𝒐𝒕 𝒐𝒇𝒇 𝒊𝒕’𝒔 𝒑𝒂𝒓𝒌𝒊𝒏𝒈 𝒔𝒑𝒂𝒄𝒆 𝒓𝒊𝒈𝒉𝒕 𝒊𝒏 𝒇𝒓𝒐𝒏𝒕 𝒐𝒇 𝒉𝒊𝒔 𝒕𝒂𝒙𝒊.
❤️𝑻𝒐𝒏𝒚’𝒔 𝒕𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓 𝒂𝒑𝒑𝒍𝒊𝒆𝒅 𝒃𝒓𝒂𝒌𝒆𝒔 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆𝒚 𝒘𝒆𝒓𝒆 𝒔𝒂𝒗𝒆𝒅 𝒋𝒖𝒔𝒕 𝒃𝒚 𝒂𝒏 𝒊𝒏𝒄𝒉 𝒇𝒓𝒐𝒎 𝒈𝒆𝒕𝒕𝒊𝒏𝒈 𝒊𝒏𝒕𝒐 𝒂𝒏 𝒂𝒄𝒄𝒊𝒅𝒆𝒏𝒕 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒂𝒕 𝒕𝒂𝒙𝒊.
💖𝑫𝒓𝒊𝒗𝒆𝒓 𝒐𝒇 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝒕𝒂𝒙𝒊 𝒍𝒐𝒐𝒌𝒆𝒅 𝒃𝒂𝒄𝒌 𝒂𝒏𝒅 𝒔𝒕𝒂𝒓𝒕𝒆𝒅 𝒚𝒆𝒍𝒍𝒊𝒏𝒈 𝒂𝒕 𝑻𝒐𝒏𝒚’𝒔 𝒕𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓. 𝑯𝒊𝒔 𝒕𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓 𝒅𝒊𝒅𝒏’𝒕 𝒈𝒐𝒕 𝒂𝒏𝒈𝒓𝒚 𝒂𝒏𝒅 𝒋𝒖𝒔𝒕 𝒔𝒎𝒊𝒍𝒆𝒅 𝒂𝒏𝒅 𝒘𝒂𝒗𝒆𝒅 𝒊𝒏 𝒓𝒆𝒔𝒑𝒐𝒏𝒔𝒆 𝒕𝒐 𝒉𝒊𝒎.
💞𝑻𝒐𝒏𝒚 𝒘𝒂𝒔 𝒔𝒖𝒓𝒑𝒓𝒊𝒔𝒆𝒅 𝒕𝒐 𝒔𝒆𝒆 𝒕𝒉𝒊𝒔 𝒓𝒆𝒔𝒑𝒐𝒏𝒔𝒆 𝒐𝒇 𝒉𝒊𝒔 𝒕𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓 𝒂𝒏𝒅 𝒂𝒔𝒌𝒆𝒅 𝒉𝒊𝒎, “𝑾𝒉𝒚 𝒅𝒊𝒅 𝒚𝒐𝒖 𝒅𝒐 𝒕𝒉𝒂𝒕?? 𝑾𝒆𝒓𝒆𝒏’𝒕 𝒚𝒐𝒖 𝒂𝒏𝒈𝒓𝒚 𝒕𝒉𝒂𝒕 𝒉𝒆 𝒂𝒍𝒎𝒐𝒔𝒕 𝒈𝒐𝒕 𝒖𝒔 𝒊𝒏𝒕𝒐 𝒂𝒏 𝒂𝒄𝒄𝒊𝒅𝒆𝒏𝒕 𝒂𝒏𝒅 𝒊𝒕 𝒘𝒂𝒔 𝒉𝒊𝒔 𝒎𝒊𝒔𝒕𝒂𝒌𝒆 𝒂𝒏𝒅 𝒚𝒆𝒕 𝒉𝒆 𝒘𝒂𝒔 𝒚𝒆𝒍𝒍𝒊𝒏𝒈 𝒂𝒕 𝒚𝒐𝒖..!!”
💕𝑻𝒂𝒙𝒊 𝒅𝒓𝒊𝒗𝒆𝒓 𝒆𝒙𝒑𝒍𝒂𝒊𝒏𝒆𝒅, “𝑺𝒊𝒓, 𝑻𝒉𝒆𝒓𝒆 𝒂𝒓𝒆 𝒎𝒂𝒏𝒚 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒂𝒓𝒆 𝒍𝒊𝒌𝒆 𝒈𝒂𝒓𝒃𝒂𝒈𝒆 𝒕𝒓𝒖𝒄𝒌. 𝑻𝒉𝒆𝒚 𝒂𝒓𝒆 𝒇𝒖𝒍𝒍 𝒐𝒇 𝒇𝒓𝒖𝒔𝒕𝒓𝒂𝒕𝒊𝒐𝒏, 𝒂𝒏𝒈𝒆𝒓, 𝒅𝒊𝒔𝒂𝒑𝒑𝒐𝒊𝒏𝒕𝒎𝒆𝒏𝒕𝒔. 𝑨𝒔 𝒂𝒍𝒍 𝒕𝒉𝒆𝒔𝒆 𝒈𝒂𝒓𝒃𝒂𝒈𝒆 𝒑𝒊𝒍𝒆 𝒖𝒑 𝒂𝒏𝒅 𝒕𝒉𝒆𝒚 𝒏𝒆𝒆𝒅 𝒕𝒐 𝒅𝒖𝒎𝒑 𝒊𝒕 𝒂𝒏𝒅 𝒔𝒐𝒎𝒆 𝒕𝒊𝒎𝒆 𝒕𝒉𝒆𝒚 𝒘𝒊𝒍𝒍 𝒅𝒖𝒎𝒑 𝒊𝒕 𝒂𝒕 𝒚𝒐𝒖..
💖𝒀𝒐𝒖 𝒅𝒐𝒏’𝒕 𝒉𝒂𝒗𝒆 𝒕𝒐 𝒕𝒂𝒌𝒆 𝒊𝒕 𝒑𝒆𝒓𝒔𝒐𝒏𝒂𝒍𝒍𝒚 𝒂𝒏𝒅 𝒋𝒖𝒔𝒕 𝒘𝒂𝒗𝒆 𝒂𝒏𝒅 𝒔𝒎𝒊𝒍𝒆 𝒂𝒕 𝒕𝒉𝒆𝒎 𝒂𝒏𝒅 𝒎𝒐𝒗𝒆 𝒐𝒏.. 𝑾𝒆 𝒅𝒐𝒏’𝒕 𝒏𝒆𝒆𝒅 𝒕𝒐 𝒕𝒂𝒌𝒆 𝒕𝒉𝒂𝒕 𝒈𝒂𝒓𝒃𝒂𝒈𝒆 𝒂𝒏𝒅 𝒔𝒑𝒓𝒆𝒂𝒅 𝒊𝒕 𝒂𝒓𝒐𝒖𝒏𝒅 𝒂𝒕 𝒉𝒐𝒎𝒆 𝒐𝒓 𝒘𝒐𝒓𝒌..“
❤️ *𝑷𝒍𝒆𝒂𝒔𝒆 𝒋𝒐𝒊𝒏 𝒊𝒏𝒕𝒐 𝒕𝒉𝒆 𝑺𝒑𝒊𝒓𝒊𝒕𝒖𝒂𝒍 𝒈𝒓𝒐𝒖𝒑 𝑶𝒏 𝒎𝒆𝒔𝒔𝒂𝒈𝒊𝒏𝒈 𝒚𝒐𝒖𝒓 𝒊𝒏𝒕𝒆𝒓𝒆𝒔𝒕 𝒕𝒐 𝟗𝟗𝟔𝟔𝟖𝟕𝟎𝟒𝟒𝟕 𝒇𝒐𝒓 𝒔𝒖𝒄𝒉 𝒊𝒏𝒔𝒑𝒊𝒓𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝒊𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝒎𝒆𝒔𝒔𝒂𝒈𝒆𝒔. 𝑨𝒏𝒅 𝒔𝒉𝒂𝒓𝒆 𝒊𝒕 𝒊𝒏𝒕𝒐 𝒂𝒍𝒍 𝒈𝒓𝒐𝒖𝒑𝒔.*
_*~𝑺𝒓𝒆𝒆𝒓𝒂𝒎 𝑳𝒂𝒙𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑴𝒖𝒓𝒕𝒉𝒚*_
💖𝑾𝒉𝒂𝒕 𝒔𝒑𝒆𝒄𝒊𝒇𝒊𝒄 𝒃𝒆𝒉𝒂𝒗𝒊𝒐𝒓𝒔 𝒎𝒂𝒌𝒆 𝒂 𝒑𝒆𝒓𝒔𝒐𝒏 𝒎𝒐𝒓𝒆 𝒎𝒂𝒈𝒏𝒆𝒕𝒊𝒄 𝒕𝒐 𝒐𝒕𝒉𝒆𝒓 𝒑𝒆𝒐𝒑𝒍𝒆?
❤️𝑨 𝒔𝒕𝒓𝒐𝒏𝒈 𝒑𝒓𝒆𝒔𝒆𝒏𝒄𝒆. 𝑾𝒉𝒂𝒕 𝑰 𝒎𝒆𝒂𝒏 𝒃𝒚 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒂𝒍𝒊𝒗𝒆; 𝒏𝒐𝒕 𝒍𝒊𝒌𝒆 𝒃𝒓𝒆𝒂𝒕𝒉𝒊𝒏𝒈 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒂𝒍𝒊𝒗𝒆 𝒃𝒖𝒕 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒃𝒖𝒛𝒛𝒊𝒏𝒈 𝒍𝒊𝒇𝒆 𝒕𝒉𝒓𝒐𝒖𝒈𝒉𝒐𝒖𝒕 𝒕𝒉𝒆𝒊𝒓 𝒃𝒐𝒅𝒚. 𝒀𝒐𝒖 𝒄𝒂𝒏 𝒖𝒔𝒖𝒂𝒍𝒍𝒚 𝒔𝒆𝒆 𝒕𝒉𝒊𝒔 𝒃𝒚 𝒕𝒉𝒆 𝒘𝒂𝒚 𝒕𝒉𝒆𝒚 𝒂𝒄𝒕. 𝑻𝒉𝒆𝒚 𝒅𝒐 𝒕𝒉𝒊𝒏𝒈𝒔 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒕𝒍𝒚, 𝒂𝒄𝒕𝒊𝒗𝒆𝒍𝒚, 𝒃𝒖𝒕 𝒔𝒎𝒐𝒐𝒕𝒉𝒍𝒚 𝒂𝒏𝒅 𝒈𝒆𝒏𝒕𝒍𝒚 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒔𝒂𝒎𝒆 𝒕𝒊𝒎𝒆.
💓𝑨 𝒔𝒕𝒓𝒐𝒏𝒈 𝒗𝒐𝒊𝒄𝒆. 𝑾𝒉𝒆𝒏 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒗𝒐𝒊𝒄𝒆 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒑𝒓𝒐𝒋𝒆𝒄𝒕𝒊𝒏𝒈. 𝑻𝒉𝒆𝒚’𝒓𝒆 𝒏𝒐𝒕 𝒍𝒐𝒖𝒅, 𝒃𝒖𝒕 𝒏𝒐𝒕 𝒒𝒖𝒊𝒆𝒕; 𝒕𝒉𝒆𝒚’𝒓𝒆 𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒈𝒆𝒕 𝒘𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒚 𝒘𝒂𝒏𝒕 𝒐𝒖𝒕 𝒐𝒇 𝒕𝒉𝒆𝒊𝒓 𝒎𝒐𝒖𝒕𝒉 𝒂𝒏𝒅 𝒎𝒂𝒌𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒖𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒚 𝒎𝒆𝒂𝒏.
💕𝑾𝒂𝒓𝒎𝒕𝒉 𝒂𝒏𝒅 𝒌𝒊𝒏𝒅𝒏𝒆𝒔𝒔. 𝑷𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒕𝒕𝒓𝒂𝒄𝒕 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒈𝒆𝒏𝒆𝒓𝒂𝒍𝒍𝒚 𝒕𝒆𝒏𝒅 𝒕𝒐 𝒃𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒏𝒊𝒄𝒆 𝒂𝒏𝒅 𝒌𝒊𝒏𝒅. 𝑻𝒉𝒆𝒚 𝒔𝒎𝒊𝒍𝒆 𝒂𝒕 𝒂𝒍𝒎𝒐𝒔𝒕 𝒆𝒗𝒆𝒓𝒚𝒐𝒏𝒆, 𝒂𝒏𝒅 𝒐𝒇𝒇𝒆𝒓 𝒉𝒆𝒍𝒑 𝒘𝒉𝒆𝒏 𝒕𝒉𝒆𝒚 𝒕𝒉𝒊𝒏𝒌 𝒊𝒕’𝒔 𝒏𝒆𝒆𝒅𝒆𝒅. 𝑲𝒊𝒏𝒅𝒏𝒆𝒔𝒔, 𝑰 𝒕𝒉𝒊𝒏𝒌, 𝒖𝒔𝒖𝒂𝒍𝒍𝒚 𝒕𝒆𝒏𝒅𝒔 𝒕𝒐 𝒂𝒕𝒕𝒓𝒂𝒄𝒕 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒃𝒆𝒄𝒂𝒖𝒔𝒆, 𝒘𝒆𝒍𝒍, 𝒏𝒐𝒘𝒂𝒅𝒂𝒚𝒔, 𝒊𝒕’𝒔 𝒉𝒂𝒓𝒅 𝒕𝒐 𝒇𝒊𝒏𝒅 𝒂 𝒈𝒆𝒏𝒖𝒊𝒏𝒆𝒍𝒚 𝒇𝒓𝒊𝒆𝒏𝒅𝒍𝒚 𝒇𝒂𝒄𝒆.
💕𝑪𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒄𝒆. 𝑾𝒉𝒊𝒍𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒍𝒊𝒌𝒆 𝒘𝒂𝒓𝒎 𝒂𝒏𝒅 𝒌𝒊𝒏𝒅 𝒑𝒆𝒐𝒑𝒍𝒆, 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒕𝒕𝒓𝒂𝒄𝒕 𝒐𝒕𝒉𝒆𝒓𝒔 𝒂𝒍𝒔𝒐 𝒕𝒆𝒏𝒅 𝒕𝒐 𝒃𝒆 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒕. 𝑻𝒉𝒆𝒚’𝒓𝒆 𝒏𝒊𝒄𝒆, 𝒃𝒖𝒕 𝒊𝒇 𝒚𝒐𝒖’𝒓𝒆 𝒕𝒂𝒌𝒊𝒏𝒈 𝒂𝒅𝒗𝒂𝒏𝒕𝒂𝒈𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆𝒎, 𝒕𝒉𝒆𝒚 𝒘𝒐𝒏’𝒕 𝒓𝒆𝒔𝒊𝒔𝒕 𝒇𝒓𝒐𝒎 𝒔𝒕𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒖𝒑 𝒇𝒐𝒓 𝒕𝒉𝒆𝒎𝒔𝒆𝒍𝒗𝒆𝒔. 𝑯𝒖𝒎𝒂𝒏𝒔 𝒍𝒊𝒌𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒓𝒆 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒕 𝒃𝒆𝒄𝒂𝒖𝒔𝒆 𝒕𝒉𝒆𝒚 𝒘𝒂𝒏𝒕 𝒕𝒐 𝒃𝒆 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒕 𝒂𝒔 𝒘𝒆𝒍𝒍, 𝒂𝒏𝒅 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒄𝒆 𝒊𝒔 𝒂 𝒔𝒊𝒈𝒏 𝒕𝒉𝒂𝒕 𝒚𝒐𝒖 𝒌𝒏𝒐𝒘 𝒘𝒉𝒂𝒕 𝒚𝒐𝒖’𝒓𝒆 𝒅𝒐𝒊𝒏𝒈, 𝒂𝒏𝒅 𝒘𝒆 𝒍𝒊𝒌𝒆 𝒕𝒐 𝒓𝒆𝒍𝒚 𝒐𝒏 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒘𝒆 𝒌𝒏𝒐𝒘 𝒘𝒆 𝒄𝒂𝒏 𝒕𝒓𝒖𝒔𝒕. (𝑰 𝒌𝒏𝒐𝒘 𝒕𝒉𝒊𝒔 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒄𝒐𝒏𝒏𝒆𝒄𝒕𝒔 𝒕𝒐 𝒕𝒉𝒆 𝒇𝒊𝒓𝒔𝒕 𝒐𝒏𝒆, 𝒃𝒖𝒕 𝒊𝒕’𝒔 𝒂 𝒃𝒊𝒕 𝒅𝒊𝒇𝒇𝒆𝒓𝒆𝒏𝒕.)
💖𝑾𝒊𝒔𝒅𝒐𝒎. 𝑭𝒐𝒓 𝒔𝒐𝒎𝒆 𝒓𝒆𝒂𝒔𝒐𝒏, 𝑰 𝒇𝒆𝒆𝒍 𝒍𝒊𝒌𝒆 𝒕𝒉𝒊𝒔 𝒌𝒊𝒏𝒅 𝒐𝒇 𝒕𝒊𝒆𝒔 𝒊𝒏𝒕𝒐 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒄𝒆. 𝑷𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒉𝒐 𝒂𝒕𝒕𝒓𝒂𝒄𝒕 𝒐𝒕𝒉𝒆𝒓𝒔 𝒂𝒓𝒆 𝒂𝒍𝒔𝒐 𝒓𝒆𝒂𝒍𝒍𝒚 𝒘𝒊𝒔𝒆. 𝑳𝒊𝒌𝒆 𝒎𝒆𝒏𝒕𝒊𝒐𝒏𝒆𝒅 𝒂𝒃𝒐𝒗𝒆, 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒍𝒊𝒌𝒆 𝒔𝒐𝒎𝒆𝒐𝒏𝒆 𝒘𝒉𝒐 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒚’𝒓𝒆 𝒕𝒂𝒍𝒌𝒊𝒏𝒈 𝒂𝒃𝒐𝒖𝒕, 𝒂𝒏𝒅 𝒌𝒏𝒐𝒘 𝒘𝒉𝒂𝒕 𝒊𝒔 𝒊𝒎𝒑𝒐𝒓𝒕𝒂𝒏𝒕 𝒂𝒏𝒅 𝒘𝒉𝒂𝒕’𝒔 𝒏𝒐𝒕.
Ⓒ ❤️ *ॐ श्री वेंकटेश्वराय नम:*
💕 *_~𝑺𝒓𝒆𝒆𝒓𝒂𝒎 𝑳𝒂𝒙𝒎𝒊𝒏𝒂𝒓𝒂𝒚𝒂𝒏𝒂 𝑴𝒖𝒓𝒕𝒉𝒚_*
 🙏🏻ఓం  శ్రీ గురుభ్యోన్నమహా 🙏🏻
ఈరోజు classలో…………..

కేవలం …నాదీ , నేను……. అనే స్వార్దం  ఉన్న ఏ వ్యక్తీనా సరే…..
ద్రుతరాష్ట్రుడిలా…… 
తాను పతనమౌతూ…….
ఇతరుల పఠనానికి కారణమౌతాడు. 
ఎందుకంటే…….తనదీ…. అన్న మమకారము ( వ్యామోహము, పిశాచము ) 
ఉన్న చోట…..ఆంతరంగిక అంధత్వము అనే….. అజ్ఞానపు మాయ లో పడి , తేనెలో పడ్డ ఈగలాగా కొట్టుకుపోతూ……బాహ్యంగా కనపడే ఈ జీవిత నాటకాన్నే…… నిజమన్న భ్రమలో
బ్రతికేస్తూ ఉంటాడు. 

ఈ…… మమకారము అనే పిశాచము  ….మనలో ఏ ఒక్కరినీ కూడా ఓడలనే ఒదలదు. 
ఎందుకంటే…. అది…. అంత దృఢమైనది. అనేకానేక  జన్మలనుంచీ…. మనిషి పతనమైపోవడానికి అదే ప్రధాన కారణము. 
జీవితాంతమూకూడా…… అది మనిషిని పీడించి పీల్చి పిప్పి చేసేస్తుంది. 
దాని కోరల్లో పడిన ఏ జీవైనాసరే…..ఏది సత్యమో….. ఏది అసత్యమో తెలుసుకోలేక……తుది వరకూకూడా…… నా వాళ్లు, 
నా ఆస్తి , నా  పరువు , ప్రతిష్ట  అంటూ …… సంసారము అనే ఊబిలోపీకలలోతు  కూరుకునిపోతూ…… పేడపురుగులా తుచ్చమైన జీవితాన్ని  ధృతరాష్ట్రునిలా జీవించేస్తున్నాడు. 

ఈ పిశాచం కోరల్లో ఉన్నంతవరకూకూడా…….సత్యాన్వేషణ వైపుకి….. దృష్టిని పోనీయదు. 

ఇలాంటి సమయంలోనే….. 
గురువు అనే దైవాన్నికనుక ఆశ్రయిస్తే……. ఆ పిశాచాన్ని కూకటవేళ్లనుండి తొలగించీ…. 
నేను ఎవరు ? అనే ఆత్మజ్ఞానాన్ని బోధించి….. మోక్షమార్గంవైపుకి నడిచేలాగ చేస్తారు🙇

మోక్షమంటే…. మరీదోకాదు. 
ఈ దేహముండగానే…. దుఃఖరాహిత్యాన్ని పొందడము. 🙏🏻
అంటే……. రాగద్వేషాలు అనే…. గుణాలకి లొంగినా కూడా…… వెంటనే…… తన సహజ స్థితిలోకి ( వర్తమానం )  వచ్చి….. తనని తాను గుర్తించగలిగే సాధన చేయడమే దైవత్వాన్ని పొందడమూ అంటే. 

పూర్వజన్మ అదృష్టము ఉంటీకానీ…..,
శ్రీ రమణా సాగర్ గురువుగారు దొరకరు. 🙇👏
ఆయన మనకి గురువుగా లభించడము నిజంగా మనందరి కీ లభించిన పూర్వపు గొప్ప వరము🙇
ఓం నమో  భగవతే శ్రీ రామానాయణమహ🙇🙇🙇
 *Class - 4 day*

*ముఖ్యంశాలు*
 
▪️ *అర్జున విషాద యోగము*
 మొదటి అధ్యాయం ఏ ఉద్దేశంతో చెప్పబడింది, ఆ ఉద్దేశం నిజానికి మొదటి శ్లోకం చివరి శ్లోకం ఈ రెండిటి మధ్యలోనే భగవద్గీత మొత్తం ఉంటుంది.

▪️మరి భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటంటే ధర్మ క్షేత్రే కురుక్షేత్రే... చివరి శ్లోకం యత్ర  యోగేశ్వరః ... ఈ రెండు శ్లోకాల మధ్యలోనే మనిషి యొక్క యావత్తు జీవితం ఉంది. మరి జీవితాన్ని మార్చుకోగలిగే అమృతతుల్యమైన రహస్యాలు ఉన్నాయి.

▪️ఈ మొదటి శ్లోకం
*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |*
*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||*
 ఈ శ్లోకానికంటే ముందుగా ఒక పదం ఉంటుంది భగవద్గీత ప్రారంభించబడినటువంటి పదం దృతరాష్ట్ర ఉవాచ. ఇక్కడ రెండు పేర్లు గుర్తు పెట్టుకోవాలి. దృతరాష్ట్ర, సంజయ. అతి పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత గ్రంథము మొట్టమొదట అర్జున విషాద యోగము అని విషాదము అనే నెగటివ్ వర్డ్ తో స్టార్ట్ అయింది. తరువాత మొట్టమొదటి పదమైన సరే ఒక పవిత్రమైనటువంటి పేరుతో లేదా ఒక మంత్రంతో స్టార్ట్ అవుతుందా అంటే అది కూడా దృతరాష్ట్ర ఉవాచా అంటూ మహాభారతంలోనే లోనే అత్యంత దారుణమైన, దౌర్భాగ్యమైనటువంటి ఒక నెగటివ్ క్యారెక్టర్ తో ప్రారంభమైంది. అంటే భగవద్గీత నెగిటివటితో మొదలై మనల్ని దివ్యత్వం వైపుకి తీసుకెళ్లాడానికి సూచిక.


▪️ మహాభారతంలో ఏ క్యారెక్టర్ గురించి తెలుసుకోకపోయిన నష్టం లేదు గాని, దృతరాష్ట్రుని గురుంచి మాత్రం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయన జీవితంలో నుంచి మనకు అంతులేని లెస్సన్స్ ఉంటాయి.

▪️దృతరాష్ట్రునిలో ఉన్న బలహీనమైన గుణాలలో మమకారం ఒక్కటి.

▪️ఈ మమకారం అత్యధికంగా ఉందంటే ఎనలేని ముప్పును తెచ్చి పెడుతుంది. నా బిడ్డలు, నా భార్య, నా తమ్ముళ్లు, నా బంధువులు అని మమకారం చూపితే అత్యంత ప్రమాదం పొంచి ఉంటుంది.

▪️దృతారాష్ట్రుడు ఈ మమకారం తోనే తన కుమారుని పట్ల ఎనలేని మమకారంతో ముప్పును తెచ్చుకొని కురుక్షేత్ర యుద్దానికే దారి తీసి ఎంతో మంది వినాశనానికి కారకుడవుతాడు.

▪️మనం కూడా అనేక వస్తువులతో దారుణంగా తెలియకుండా ఒక బలమైన ఇనుప సంకెళ్లు లాంటి బంధాల్ని పెట్టుకున్నాం.
 ఇది మనల్ని సుఖంగా ఉండనివ్వదు. మనల్ని అభివృద్ధి చెందనివ్వదు. మనల్ని ధర్మం వైపు నడవనివ్వదు. మనల్ని బయట ఉన్నటువంటి భగవత్ సత్యం వైపుకి నడవనియదు.
ఎంత సేపు నా సుఖము, నా ఇల్లు, నా పిల్లలు, ఇది నాకే చెందాలి అన్నటువంటి స్వార్తాన్ని పెంచేస్తూ నిన్ను ఇంకా గోతిలోకే పుడ్చేస్తుందే తప్ప, మరి ధర్మాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరిదులను దాటి స్వేచ్ఛ పొంది ఒక పరామర్థిక జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నించవలసి ఉంటుంది.

▪️ఏది నాది కకాదు, ఎవరు నవాళ్లు కాదు కేవలం నా కర్మ ఫలాలు పంచుకోవడానికి భార్యలుగాను, నా పుత్రులుగాను నా దగ్గరికి వచ్చారు. ఈ జన్మకు మాత్రమే నాతో కర్మ ఫలాలు పంచుకోవడానికి మాత్రమే వచ్చారు. ఆ కర్మ బంధమ్ అయిపోగానే వారు మన దగ్గరి నుంచి వెళ్ళిపోతారు.
ఈ పరమ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛగానే ఉండాలి.

▪️నేను ఏది లేకపోయినా, ప్రపంచంలో ఎవరు లేకపోయినా, నాలో ఈశ్వరుడు ఉన్నాడు. నేను సదా సంతోషంగా, సంతృప్తి గా, మనశాంతగా ఉండగలను. ఈ స్థితిని సాధించడమే పరమార్థం.

సంస్కర్తలు... బ్రహ్మజ్ఞాని.....

 *సంస్కర్తలు... బ్రహ్మజ్ఞాని.....*

మానవుని ఆయుస్సు వందేళ్లు. రెప్పపాటు జీవితం.
కానీ తానెవడో, ఈ భూమ్మీదకు ఎందుకొచ్చాడో తెలుసుకోకుండా.. ప్రపంచ స్థితిగతుల్ని మార్చాలని తన జీవితమంతా దారబోసి, ఏదో చేయబోతాడు చివరకు ఏదో జరుగుతోంది.. ఇదంతా సంఘసేవ అని చంకలు గుద్దుకుంటాడు. కానీ వాని సిద్ధాంతాలు వలన లోకం మరింత గందరగోళంగా తయారై ఉంటుంది. అప్పటికి వాడుండడు. వాడి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించి, ఉపాధ్యాయులు పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తారు.. "ఆదర్శపురుషులు" అని చెప్పి.

వ్యక్తిగతమైన సంస్కరణలోనే సంఘ సంస్కరణ ఇమిడి ఉంది అన్న గొప్ప రహస్యాన్ని మన ఋషులు కనుగొన్నారు. అందుకే మన ప్రాచీన భారతంలో.. ఋషులు ఉన్నారేగాని సంఘ సంస్కర్తలు లేరు.

అందుకే రామతీర్థులు.. "సంస్కర్తలు కావలెను.. అర్హత: తమను తాము సంస్కరించుకుని ఉండవలెను" అని పత్రికాప్రకటన ఇచ్చారు. దాని అర్థమేమంటే తనను తాను సంస్కరించుకుంటే మరొకరిని సంస్కరించడానికి వానికి ఇతరం, ఇతరులు గోచరించరు.

అందుకే భగవాన్.. ప్రపంచం సంగతి ప్రపంచం చూసుకుంటుంది. నీ సంగతి నీవు చూసుకో అనేవారు. అద్దంలో చూసుకుని తలదువ్వుకుంటే, ఏకకాలంలో ప్రతిబింబంలోని తల కూడా దువ్వబడే ఉంటుంది. ఈ ప్రపంచం తన ప్రతిబింబమే.. ఈ వ్యక్తిగతమైన సంస్కరణలో భాగమే
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమములు.. మన భారతీయ జీవన విధానంలోనే సంఘసంస్కరణ ఇమిడి ఉంది.

"సంఘసంస్కరణ" అనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏమీ అవసరం లేదు. సంఘాన్ని సంస్కరించడానికి కొంపా గోడు వదిలేసి దేశం మీద పడనక్కర్లేదు.. ఎవడికి వాడు వాడి వాకిలి శుభ్రం చేసుకుంటే, ఏకకాలంలో ఊరంతా శుభ్రమౌతుంది.. అంతేగాని నీవు చీపుర తీసుకుని ఊరినంతటినీ శుభ్రం చేయాలనుకోవడం మూర్ఖత్వం.

వివేకానంద అంతటివాడు విసిగిపోయి.. "ఈ లోకం కుక్క తోక వంటిది. అది అలానే ఉండడం దాని స్వభావం" అన్నారు.. సంస్కర్త తాను జీవించి ఉన్నంతవరకు కుక్కతోకను లాగి పట్టుకుని ఉంటాడు. వాడు మరుగవ్వగానే మళ్లీ వంకరే.

మరి చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా.. అంటారేమో.. నిజమే ఆ ఒక్కడు వేదబ్రాహ్మణుడు.
ప్రాచీన భారతంలో చక్రవర్తులు సైతం వారి రాకతో సింహాసనం మీద నుంచి లేచి ఎదురేగి అతిధిసత్కార్యాలు ఘనంగా చేసేవారు.. బ్రాహ్మణుడు అంటే కుల సంబంధమైన వ్యక్తి అని కాదు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు అని అర్థం.

అనగా.. తనను తాను సంస్కరించుకున్నవాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందినవాడు వాడు చంఢాలుడైనా సరే వాడు బ్రాహ్మణుడే.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించే సద్గురువును బ్రహ్మజ్ఞాని అనవచ్చు. నిన్ను అంతర్ముఖంలోకి నెట్టేవాడు యెవడైనా సరే వాణ్ణి బ్రహ్మజ్ఞాని అనవచ్చు.

ఎవడి పని వాడు చేసుకుంటే అదే గొప్ప దేశ సేవ అవుతుంది. నీ "కుటుంబం" అనే చిన్న యూనిట్ కు నీవు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగితే చాలు
లోకానికంతా నీవు మేలు చేసినవాడివే అవుతావు
అంటారు ఓ గురువుగారు.. నీవు, నీ కుటుంబం వరకే చూసుకో చాలు.. అనే మాటలు స్వార్థపరమైనవిగా అనిపిస్తాయి. కానీ కాదు.

"సేవ" అనే మాట కంటే మోసపూరితమైన మాట మరొకటి లేదు అంటారు ఆ గురువుగారు. ప్రతి ఒక్కరూ తాను, తన కుటుంబం వరకే చూసుకుంటే.. దేశంలో ఇంతమంది అనాధలు ఉండరు. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండవు. దేశంలో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పెరగడం దేశాభివృద్ధి కాదు.
కుటుంబ వ్యవస్థ కుంటుపడడమే వీటికి కారణం.
నేల విడిచి సాము చేయరాదు.. తన్ను విడిచి సేవ చేయరాదు... 

*|| ఓం నమః శివాయ ||*

Thursday, September 21, 2023

100 days Bhagavadgeetha free life coaching by Sagar Sindhoori




భారతీయ యువతకు ఆధ్యాత్మిక సాధకులకు నమస్కారం.
 నా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు  అంటూ సనాతన ధర్మం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక చర్చలు వాదనలు నడుస్తూ ఉన్నాయి. సనాతన ధర్మం పేరిట అనేక కల్లోలాలు, గొడవలు చేసే బదులు మనందరం అసలైన సనాత ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం. ధర్మ స్వరూపమైన భగవద్గీత జ్ఞానం ద్వారా సనాతన ధర్మం యొక్క  విశిష్టతను అర్థం చేసుకుందాం. అప్పుడే అర్థమవుతుంది, సనాతన ధర్మం కేవలం హైందవులకేనా లేక మానవజాతి మొత్తానికి నిర్దేశించబడిందా ! అన్నది. భగవద్గీత జీవితానికి రాజ్యాంగం, మార్గ నిర్దేశకం, ధర్మపథం, విజయ సోపానం , దుర్భర అజ్ఞానమయ జీవితానికి జ్ఞాన దీపం.
మనుషులు గీత తో రాత మార్చుకోవచ్చు. జీవితం నిరాశ,నిర్వేదాలతో, సమస్యల వలయంలో కూరుకుపోయి దారి తెన్ను కానరాక కృషించిపోయినటువంటి సమయంలో భగవంతుని గీతా వాణి ఏ విధంగా మనకు దారి చూపిస్తుందో మనం తెలుసుకుందాం. భగవద్గీతలోని
నిగూడ ధర్మ సూక్ష్మాలు, జీవన రహస్యాలు, యోగ రహస్యాలను ఈశ్వర కృప చేత అర్థం చేసుకొని జీవితాలను వికసింప చేసుకుందాం. మన జీవిత పరమార్ధాన్ని సాధించుకుందాం.

శ్రీ మాస్టర్ రమణా సాగర్.సింధూరి గారు 100 రోజులపాటు ఆన్లైన్ జూమ్ క్లాస్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ గీతా జ్ఞాన దాన యజ్ఞాన్ని 2023 సెప్టెంబర్ 18 నుండి ప్రతిరోజు సాయంత్రం 7 to 8 pm వరకు నిర్వహిస్తారు.
జాతి, కులమత వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని జీవితాలను పరిపుష్టం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం.
మీతో పాటు పదిమందిని ఈ భగవద్గీత లైఫ్ కోచింగ్ శిక్షణలో చేర్పించి సనాతన ధర్మసారధులుగా
మాతృభూమి రుణం తీర్చుకోండి.
సనాతన ధర్మ పరిరక్షణకు, భారతదేశ ఉన్నతిని లక్ష్యంగా చేసుకుని  నిస్వార్థంగా నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణలో చేరడానికి శుద్ధమైన శ్రద్ధ, అంతఃకరణ శుద్ధి మాత్రమే అర్హతలు.
వంద రోజులపాటు శిక్షణ పొందడానికి శ్రద్ధ,భక్తి.... ధృతి ఉన్నవారు మాత్రమే ఈ శిక్షణకు హాజరు కాగలరు.కోర్సులో జాయిన్ కావాలనుకునేవారు కింది వాట్సప్ లింకు ద్వారా గ్రూపులో జాయిన్ అవ్వండి, మీ తరఫున పదిమందిని జాయిన్ చేయించండి.
https://chat.whatsapp.com/DLnBEId4A5u78RXqS5HIsz


Click on live on page of URL:  https://youtube.com/@SAGARSINDHURI?si=NWLsSR7a3p5na9uV

Day 1

https://www.youtube.com/live/tXgdxaHw6Eg?si=avPQXhIaXizCVJrD

Day 2
https://www.youtube.com/live/cqM3e-0EoBc?si=CdAmTsl_bbfzy4j_

Day 3

https://www.youtube.com/live/d-uxIGs-388?si=c7s7WD_Tgqq2WmuX


శివుడే విష్ణువు విష్ణువే శివుడు..

 శివుడే విష్ణువు విష్ణువే శివుడు.. 
దేవుడు మనిషిని సృష్టించి పంచభూతాలతో ప్రకృతిని సృజించి అద్భుతమైన జీవనసౌఖ్యాన్ని అనుభవాన్ని పొందమన్నాడు అయితే హిందూ మతధర్మం, ఆర్ష విజ్ఞానం భోదించేది ఒకటే. దైవం ఒక్కడే భారత వర్షంలో మతవిధానము ఒక్కటే అని ఉద్భోదించినా, మనుషులు తమ స్వార్ధానికి నిర్మించుకున్న పాపకూపాలే వివిధ మతాలు అది శైవమైనా వైష్ణవమైనా అంతే. దైవానికి విభజన లేదు.
శివ సహస్ర నామస్తోత్రం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజుని శ్రీకృష్ణుడు భీష్మాచార్యు ని వద్దకు తీసుకుని వెళ్ళగా, కురువంశ పితామహుడు సకల ధర్మాలను, ధర్మ సూక్ష్మా లనూ ధర్మరాజుకు భోదించాడు. అంతా నేర్చుకున్న తరువాత ధర్మరాజు తన మనసులోని మాటను బయట పెట్టాడు. పంచమ వేదంగా పరిగణిస్తున్న శివ సహస్ర నామ స్తోత్రం గురించి చెప్పమని తాతగారిని కోరతాడు.
అప్పుడు బీష్మాచార్యుడు ఏ మాత్రం భేషజం లేకుండా ఇలా అంటాడు." ధర్మజా! శివుని గురించి సమగ్రంగా చెప్పగలిగినవాడు శ్రీకృష్ణుడు ఒక్కడే. వారిద్దరూ ఒకటే కనుక, శ్రీకృష్ణుడు మాత్రమే శివ సహస్ర నామ స్తోత్రాన్ని గురించి చెప్పగలడు." అని అంటాడు. అదే సందర్భంలో భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ధర్మరాజు మనోభిష్టాన్ని గ్రహించావు కదా! శివ సహస్ర నామ స్తోత్రం గురించి వివరించు ' అని అంటాడు.
దాంతో శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచన చేసి శివుని వెయ్యి నామాలను ధారాళంగా చెబుతాడు. అంత వేగంగా, తడుముకోకుండా చెప్పగలిగిన వాడు శ్రీకృష్ణుడు మాత్రమేనన్న తన మాట నిజమైనందుకు భీష్మాచార్యుడు సంతోషిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో ఇలా అంటాడు." ధర్మజా ! తెలియని వారు,సగం తెలిసినవారు శివ, కేశవులకు మధ్య భేదాన్ని సృష్టిస్తు ఉంటారు. సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులు ముగ్గురూ ఒకటే, వారిని వేరు చేసి చూడటం తగదు.
ఈ విషయాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా స్పష్టం చేసాడు. ఈశ్వరుని అంశతో జన్మించిన ఆంజనేయుణ్ణి తనకు నమ్మకమైన మిత్రునిగా, సచివునిగా శ్రీరామచంద్రుడు పరిగణించడానికి ప్రధాన కారణం ఇదే. శివ కేశవుల మధ్య ఎటువంటి భేదం లేదని చెప్పడనికి ఆంజనేయుడే ఉదాహరణ.
శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి తోడ్పడినట్లే, విష్ణుమూర్తికి శివుడు తోడ్పడాడు. ఈశ్వరాంశ సంభూతు డైన ఆంజనేయుడు సీతాన్వేషణలో శ్రీరామచంద్రునికి తోడ్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
"శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే " అని సంద్యావందనం శ్లోకాలు తెలుపుతున్నాయి.
శివ, కేశవుల్లో ఎవరిని అరాధించినా ఒకటే.ఇద్దరినీ అరాధించినా తప్పు లేదు. సృష్టిలోని ప్రాణులనునిలబెడు తున్నది విష్ణుమూర్తి అయితే లయం చేసుకుంటున్నది పరమేశ్వరుడు.

ఒక చిన్న కథ...🐵* *😌 కష్టం

 *🐍ఒక చిన్న కథ...🐵*
       *😌 కష్టం 😌*

*ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది... ఆ పాము కోతిని కాటు వేయబోయింది... భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి... చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం... కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది... మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే... మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి.*

*తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది... అలాగే భయంతో కూర్చుంది. అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు... ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది... వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయి" అన్నారు ముని... కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది.*

*ఇందులోని నీతి ఏంటంటే... మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలి పోదు... కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి... అలాగే మనం ఇబ్బందిలో ఉంటే మన బంధువులు, ఎవ్వరూ మనల్ని రక్షించడానికి మన కష్టం తీర్చడానికి ముందుకు రారు. ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోయే రోజులివి... కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు... కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు... కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమికొట్టాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం.*

*"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా,, నిజం మరచి నిదురపోకుమా" అన్నారు ఒక మహాకవి.*

*కాబట్టి సమస్య మనది, పరిష్కరించాల్సింది కూడా మనమే... మన సమస్యను మనం కాక వేరెవరో పరిష్కరిస్తారు అనుకుంటే పొరపాటే
🙏

విస్తరాకు.....మనిషి జీవితం

 *🌾🌾🌹🥀💐☘️🍀🌿🌴విస్తరాకు.....మనిషి జీవితం* *మిత్రమా*  *"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.  భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.  *"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము..  *'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.  *'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.  మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు  *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..   ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?   కనీసం  *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..   అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*...                                           *ఇదే జీవిత పరమార్ధం......!!🙏🙏🙏🙏🙏🙏🙏,,,, ,,,,,,,✍️

గుల్జార్" పొయెట్రీ......

 🌸

"గుల్జార్"  పొయెట్రీ......

"రాలిపోతున్న ఆకులు
నాకు నేర్పించాయి పాఠాన్ని
నీవు బరువు అయితే
నీవారే వదుల్చుకుంటారని."!!

*మూలం….    గుల్జార్..!
*అనువాదం:  ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.

చాలా అదృష్టవంతులకు తప్ప వృద్ధాప్యం
అందరికీ సుఖంగా వుండదు.. సుఖంగా గడవదు… పిల్లలు బాగుంటే అదో రకం.. పిల్లలు సరిగా లేకున్నా..‌ మన చేతిలో పైసల్లేకపోయినా… ఆ వృద్ధాప్య జీవితం నరకం కంటే తక్కువగా యేం వుండదు.. నూటికి పది శాతం మందికి మాత్రమే వృధ్ధాప్యం హాయిగా గడుస్తోంది… మిగిలిన వారికి దినదిన గండమే. మేం ఇంకాఎందుకు బతుకున్నాం రా దేవుడా! అంటూ మరణం కోసం ఎదురు చూసేవారే ఎక్కువగా వున్నారు.

ఏతావాతా… లోకంలో వృద్ధాప్యం అంటరాని
వసంతంతో సమానం. ఇది సత్యం. దీనికి..... సాక్ష్యం నానాటికి పెరుగుతున్న వృద్ధాశ్రమాలే.

గుల్జార్ (సంపూరణ్ సింగ్) 1934 లోనేటి పాకిస్తాన్ లోని 'దీనా' లోజన్మించారు. 1947లో భారత్, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దిల్లికి వచ్చేశారు. బిమల్ రాయ్, హృషికేష్ ముఖర్జీ లతో కలిసి గేయ రచయితగా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాలకు కథలు , స్క్రిప్టులు రాశారు. ఆతర్వాత, దర్శకత్వం కూడా చేశారు. సినిమా జీవితంలో ఆయన ఎన్నో వేలపాటల్ని రాశారు. గుల్జార్ తన…
అనుభవాలను కథలుగా మలిచి హిందీ,
ఉర్దూ, పంజాబీ భాషల్లో రాశారు.  ఆవి ఆంగ్లం, 
తెలుగు తో పాటు ఇతర భాషల్లోకి  కూడా 
అనువాదమయ్యాయి…

మన తరం కవుల్లో గుల్జార్ గొప్పకవి. భావుకుడు..‌. తాత్వికుడు.. నాలుగు పాదాల్లో.. నాలుగు దశల తర్వాతి జీవితాన్ని ముక్తసరిగా చెప్పాడు..

చెట్టుకు బరువైతే ఆకులు రాల్చుకుంటుంది.
అలాగే వృద్ధాప్యంలో మనం బరువనుకుంటే పిల్లలే మనల్ని వదిలించుకుంటారు. చెట్టును చూసి మనం ఈ విషయాన్ని గ్రహించాలి… బరువైతే నిర్మొహమాటంగా ఆకుల్ని రాల్చేస్తుంది.. దాన్నే మనం గ్రీష్మం అంటున్నాం… అలాగే బరువనుకుంటే, మన పిల్లలు కూడా మనల్ని పట్టించుకోరు సరికదా!వదిలించుకుంటారు..‌ మంచోళ్ళైతే వృద్ధాశ్రమాల్లో చేరుస్తారు.. లేకుంటే వీధులపాలు చేస్తారు..!!

చెట్టు ఆకులు రాల్చుకోవడం ప్రాకృతిక సత్యం.
బరువైతే మనల్ని మనవాళ్ళు(పిల్లలు)... వదిలించుకోవడం లోక సహజం.. కాబట్టి దీన్ని గురించి బాధపడకూడదు. ఆలోచించి తల…
బొప్పి కట్టించుకో కూడదు.. మనోవ్యాది అసలే పెట్టుకోకూడదు..!

మనకు డబ్బు, దస్కం, ఆస్తులు, అంతస్తులు
ఎన్నైనా వుండొచ్చు… మన చుట్టూ, మనల్ని
ఇష్టపడే.  ఓ నలుగురు లేకుంటే ఎన్ని వున్నా
వ్యర్ధమే..! 

అందుకే మనం వున్నంతకాలం నలుగురితో
మంచిగా వుండాల.  మన చుట్టూ‌ ఓ పాజిటివ్
వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసుకోవాలి..  మనల్ని
చిన్నచూపు చూసే వాళ్ళెవరైనా చివరకు వాళ్ళు కన్నబిడ్డలైనా దూరంగా వుంచాలి. వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా, వరంగా భావించాలి.. జీవితపు చివరి క్షణాల్ని పరిమళభరితం చేసుకోవాలి.. మనం  లేకున్నా.. మన గురించి మాట్లాడుకునే  నాలుగు మంచిపనుల్ని చేయాలి.. మన  జ్ఞాపకాలు ఆకుపచ్చగా    పది కాలాలుండేట్లు చూసుకోవాలి.. అప్పుడే  వృద్ధాప్యం దండగగా కాకుండా పండగవుతుంది. మన జన్మకు ఓ సార్ధకత దొరుకు
తుంది..!!

భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది.

 భగవంతుడికి...భక్తుడికి మధ్య జరిగే ఒక ఆసక్తికర సంభాషణ. చదివితే.. మీ జీవిత దృక్కోణమే మారిపోతుంది.

భక్తుడు : స్వామీ.. ఈ రోజు నీవు నాకు చాలా ఇబ్బంది కలిగించావు. నాకే ఎందుకు ఇలా జరగాలి...?

భగవంతుడు : ఏం జరిగింది...? నా వల్ల వచ్చిన ఇబ్బందేమిటీ...?

భక్తుడు : ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే..! ఆఫీసులో అర్జంటు పని ఉందని... తొందరగా  నిద్ర లేచేందుకు అలార్మ్ పెట్టి పడుకున్నాను... అది మ్రోగలేదు... దాంతో నేను లేటుగా లేచాను.

భగవంతుడు : అంతేనా...?

భక్తుడు : ఇంకా ఉంది. ఈ రోజే ఎప్పుడూ మొరాయించని నా కారు కూడా ఇబ్బంది పెట్టింది. దాంతో ఇంకా ఒత్తిడి పెరిగింది.

భగవంతుడు : అంతేగా...?

భక్తుడు : అప్పుడేనా...?  మధ్యాహ్నం భోజనం చేయడానికి మెస్ కు వెళ్తే అక్కడ నా ప్లేటు రావడానికి బాగా లేటయ్యి మరికాస్త అసహనాన్ని పెంచింది. ఇంకాస్త సమయం వృథా అయింది.

భగవంతుడు : సరే..ఇంకా...?

భక్తుడు : పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..స్నేహితుడితో మాట్లాడుతున్న ఫోను సడన్ గా కట్ అవడం...మళ్ళీ చేసేలోపు..బ్యాటరీ పూర్తిగా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం...ఏంటివన్నీ...?

భగవంతుడు : అయిపోయాయా...?

భక్తుడు : అసలైంది ఇప్పుడే స్వామీ...! చాలా అలసిపోయి, ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే, సరిగ్గా అప్పుడే ఫ్యాను, ఏ.సి. రెండూ ఒక్కసారే పని చేయకపోవడం... ఎందుకు స్వామీ.. నా మీద ఇంత కక్ష నీకు...?

భగవంతుడు : సరే..! నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను..!

ఇవాళ ప్రొద్దున్న అలార్మ్  మ్రోగితే నువ్వు వెంటనే స్నానానికని బాత్రూమ్ కు వెళ్ళేవాడివి. కానీ..ఆ సమయంలో అక్కడ ఒక నల్ల త్రాచు పడగవిప్పి సిద్ధంగా ఉంది. అందుకే అది వెళ్ళిపోయాక నువ్వు మేల్కోవాలని, అలార్మ్ మ్రోగనివ్వలేదు.

కారు మొరాయించకుండా ముందే బయల్దేరి వుంటే ఒక త్రాగుబోతు నడుపుతున్న ట్రక్కు వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగేది. 

ఇక భోజనమంటావా ,  నువ్వెళ్ళిన సమయంలోనే అక్కడి వంటవారు సాంబారులో ఒక బల్లిని గమనించారు...దాంతో ఆ మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, మళ్ళీ సాంబారు కాచి వడ్డించడం వల్ల లేటయ్యింది.

కారులో నీతో ఫోను మాట్లాడుతున్న వ్యక్తి మీ బాస్ దగ్గర నీ పరువు తీయాలనుకున్నాడు. ఆ కుట్రలో భాగమే ఆ ఫోను. ఆ క్షణంలో ఫోను బ్యాటరీ అయిపోవడం వల్ల వాడు నిన్నేమీ చేయలేకపోయాడు.

చివరిగా...ఫ్యాను, ఏ.సి. అంటావా... అవి ఆన్ చేసినట్లయితే షార్ట్ సర్క్యుట్ జరిగి.. ఆ రాత్రంతా నువ్వు చీకట్లో గడపాల్సి వచ్చేది. అవసరమంటావా...చెప్పు ?

భక్తుడు : స్వామీ...నా అజ్ఞానాన్ని మన్నించు. నన్ను కాపాడడానికే ఇవన్నీ చేసావని అర్ధం చేసుకోలేక  నిన్ను నిందించాను. క్షమించు స్వామీ..!

భగవంతుడు : క్షమాపణ అడగడం కాదు... నన్ను పూర్తిగా నమ్మడం నేర్చుకో..! ఏం జరిగినా... మన మంచికే అనుకోవాలి. మీ దగ్గర ప్రణాళికలెన్ని ఉన్నా.., మీకు మంచి జరిగే అత్యుత్తమ ప్రణాళిక నేనెప్పుడో సిద్ధం చేసి ఉంచాను.
శుభం భూయాత్....!💐
Ganga Swaroop Varanasi: ధర్మసూక్ష్మం

పూర్వం త్రేత, ద్వాపరయుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక పన్నెండేళ్ళపాటు కరువు సంభవించింది. భూమి బీటలు వారింది. ఏరులూ, చెరువులూ, కుంటలూ ఎండిపోయాయి. వ్యవసాయపు పనులు మందగించాయి. చెట్లూ, లతలూ వసివాడిపోయాయి. పశువులు మేత లేక చచ్చిపోయాయి. రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాల్ని లాక్కున్నారు. యాగాలూ, దేవతార్చనలూ కుంటుపడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి. తినటానికి తిండి లేక జనులంతా మలమల మాడసాగారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది.

ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహాముని ఆకలికి ఓర్చుకోలేక, తిండి కోసం యాచించి, ఎక్కడా దొరకక ఆకలిదప్పులతో తల్లడిల్లి పోయాడు. కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూరిగుడిసెలు కన్పించాయి. చుట్టూరా పశువుల ఎముకలు గుట్టలు! కుక్కల పుర్రెలు! పరమ అసహ్యంగా వుంది. దుర్గంధం ముక్కు బ్రద్ధలు చేస్తోంది. అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగుతీసి అడుగువేసే శక్తి కూడా పోయింది. కుప్పకూలిపోయాడు.

"అయ్యో! ప్రాణం పోయేటట్టుంది! ఎలాగైనా ప్రాణం నిలుపుకోవడం పరమధర్మం. ఇప్పుడు ఏం ఉపాయం ఉంది?" అని ఆలోచించటం మొదలుపెట్టాడు. అటూ ఇటూ గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి, గాలికి ఆరబెట్టిన కుక్కమాంసం కనిపించింది. విశ్వామిత్రుడికి ప్రాణం లేచివచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే విచారం కలిగింది.

"ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోటానికి గత్యంతరం లేదిప్పుడు. ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది! ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయమేదీ లేనప్పుడు దొంగతనం చేయడం, నీచులధనం ఆశించటం తప్పు కాదన్నారు. ఇదే మంచి అదను. అర్ధర్రాతి సమయం! అందరూ నిద్రపోతున్నారు. అనుకుని నిస్సత్తువగా పాకుతూ వెళ్ళి ఆ కుక్కమాంసం పట్టుకుని లాగాడు విశ్వామిత్రుడు. అక్కడకు దగ్గరలోనే పడుకున్న బోయవాడు అలికిడికి నిద్రలేచాడు. విశ్వామిత్రుణ్ణి చూశాడు.

"ఎవడురా నువ్వు. నేను నిద్రపోతున్నాననుకుని మాంసం దొంగిలిస్తున్నావా? నీ ప్రాణాలు తీస్తాను వుండు" అని ముని మీదకు వచ్చాడు వాడు.

విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు. "నేను విశ్వామిత్రుణ్ణి " అన్నాడు హీనస్వరంతో.

కిరాతుడు అదిరి పడ్డాడు. భయపడిపోయాడు. కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. "మహాత్మా! ఎవరో అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. తప్పు క్షమించండి! అయినా స్వామీ ఎందుకిలా చేస్తున్నారు? దీని అంతరార్ధమేమిటి?" అని వినయంగా అడిగాడు.

నాయనా! ఆకలితో శరీరం దహించుకుపోతుంది. పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోడానికి ఈ కుక్క మాంసం దొంగిలించబోయాను" అన్నాడు విశ్వామిత్రుడు.

"అయ్యో! మృగాలన్నిటిలో నీచమైనది కుక్క. దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు? మరో మార్గం వెతుక్కోండి మహాత్మా" అన్నాడు బోయ.

"ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా ధర్మమే! అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో వున్నాడు. అగ్నిస్పర్శతో సర్వదోషాలూ నశిస్తాయి. బతికివుంటే తపస్సు వల్లా విద్యవల్లా పాపం పోగొట్టుకుంటాను. ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం. నువ్వెన్ని చెప్పినా తినక మానను" అన్నాడు.

"ఇది చాలా నీచం స్వామీ!" అన్నాడు కిరాతుడు మళ్ళీ.

"అగస్త్యుడు రాక్షస మాంసం తిన్నాడు. అంతమాత్రంచేత ఆయన తేజస్సూ, పెంపూ నశించాయా? నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది. అందుచేత నేను ఈ మాంసం తినడం వల్ల నాకు ఏ పాపమూ అంటదు. నువ్వు మాత్రం నాకు అడ్డు రాకు" అన్నాడు విశ్వామిత్రుడు.

"అయ్యా! మాంసం పోతుందనే చింతేలుదు నాకు. ఈ పనివల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది" అన్నాడు బోయ.

"నాయనా! నీకు నా మీద దయ అనేది వుంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో. దానివల్ల నాకు దొంగతనం చెయ్యవలసిన అవసరమూ ఉండదు" అన్నాడు ముని.

"అయ్యా! మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు. నీచుడైన నాదగ్గరనుంచి ఏదైనా యాచించటం.... నాకు భయంగా వుంది స్వామీ! మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి" అంటూ బోయ కుక్కమాంసం ఇచ్చేశాడు. దాన్ని తిని ప్రాణం నిలుపుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు.

తరువాత ఇంద్రుడు కరువుతీరేలా వర్షించాడు. విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు.

కనుక ఆపద సమయాలలో అనుసరించతగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా వుంటాయని తెలుసుకోవాలి.

ఏది ముందు కావాలి?

 *ఏది ముందు కావాలి?*

*'అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె! ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆ ఇంట్లో ఉండేవారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలోకి  ఈ ఇంటి పెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు.
ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి బయల్దేరారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు. చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది.
ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు.

మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు.

‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు.

‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు. ‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను,’ అన్నాడు తండ్రి.

‘భలేవారే!మనం అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య.
ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు.

మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు.
అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.

Tuesday, September 19, 2023

 మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.
వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది. 
దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.

''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. 

 *వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట. 

అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, 

నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట. 

అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట. 

కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె, 

'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది. 

వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. 

ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....
అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు. 

వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. 

 *అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.* 

 *ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.* 

తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరూ, *ధన్యులు*

ఇది కదా మన దేశపు ఔన్నత్యం.  

👆This is a humble effort to translate the post in Marathi by Diwakar.

మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు.... ? (అందుకు ఒక కథ ఉంది)....!!

 🎻🌹🙏మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు.... ?
(అందుకు ఒక కథ ఉంది)....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు ?

🌸 ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది.

🌿 మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. 

🌸ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరియు కొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. 

🌿అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం. 

🌸గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. 

🌿"ఓ మహర్షి ! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి ?

🌸 పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి ?"

🌿"మునీంద్రులారా ! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) 

🌸తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని (అంతటా , అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు.

🌿 విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. 

🌸దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి.

🌿 చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. 

🌸ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు

🌿(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). 

🌸మృత్తికయే పరబ్రహ్మ కనుక , మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది.

🌿 అంతేకాదు మట్టి ఎక్కడైనా , ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా , ధనిక అనే తారతమ్యం లేదు.

🌸 సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి , మట్టి , వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు.

🌿 విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. 

🌸నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు.

🌿అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం , పూజ" అని చెప్పాడు సూతుడు....కాబట్టి మనము కూడా మట్టి వినాయకుని తెచ్చుకొని పూజించుదాము...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿