*_దొంగకి ఇచ్చేది దానమా!?_*
ఈ రోజు నేను
నా గడియారం..ఫోన్...
ఉంగరం...గొలుసు....
ఇంకా నా దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ ఒక వ్యక్తికి దానం ఇచ్చేశాను..
అప్పుడు అంత చీకట్లో కూడా
నా కంటికి ఒక దృశ్యం కనిపించింది..
దానం అందుకున్న వ్యక్తి నాకు కృతజ్ఞతాపూర్వకంగా దన్నం పెట్టలేదు కాని
ఆనందంగా తన చేతిలోని కత్తిని జేబులో పెట్టుకున్నాడు..
ఈ టైపు దానంలోనూ
ఇంత సంతోషం ఉంటుందా..!
దొంగకి సర్వం దోపెట్టి దానంగా కవర్ చేసుకోవడం..
*_అది తుత్తి..!_*
______________________
*_పులుల్ని వదిలేశాడు..!_*
నేను జూలో వాచ్ మన్ గా
పని చేస్తాను..
నా విధినిర్వహణలో ఎప్పుడూ ఏ విషయమూ మర్చిపోను..దొంగతనాలు జరక్కుండా చాలా జాగ్రత్త పడతాను..అలాంటి నేను ఒక్కసారి మాత్రం ఒక్క పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నా..అదేంటో తెలుసా..పులులున్న బోను
తాళాలు వెయ్యడం..అంటే పులుల్ని ఎవ్వరూ దోచుకుపోరు కదాని ధీమా..మర్నాడే ఉద్యోగం పీకేశారు.. పులుల్ని ఎవరు ఎత్తుకుపోయారో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదు..!
*_అది వృత్తిఖర్మం..!_*
_______________________
*_నాకు నేనే బాస్..!_*
నేను క్యాబ్ డ్రైవర్ని..
నాకు నేనే బాస్..
ఇలా చెయ్యి అని ఎవరూ నన్ను ఆదేశించరు..
అలా అనుకుంటున్నంతనే
క్యాబులోని వ్యక్తి కుడి వైపు తిరుగు అని ఆదేశించాడు..
*_అది అనివార్యం.._*
_______________________
*_బ్యాక్ డోర్ నుంచి ఎత్తుకుపో..!_*
నమ్మకమే పునాదిగా
పని చేసే బ్యాంకుల్లో
తెరిచి ఉన్న వేళల్లో
లాకర్ తో సహా తలుపులన్నీ బార్లా తీసి ఉంచడమే గాక
బడాబాబులు ఎన్ని కోట్లు అప్పు చేసి ఎగ్గొట్టినా పట్టించుకోరు గాని
ఎవరూ ఎత్తుకుపోకుండా
పెన్నుకు మాత్రం
తాడు కట్టి పెడతారు..
అదేమి చిత్రమో..!
*_అది అపనమ్మకం..!_*
_______________________
*_రోగికి వాకింగ్ ట్రాక్!_*
సూపర్ మార్కెట్లు కొన్నిటిలో
మందులు అమ్మే కౌంటర్లు
ఆ చివరన ఉంటాయి.
అదే మార్కెట్లో సిగిరెట్ ప్యాకెట్లు విక్రయించే స్టాల్స్ మాత్రం ఎంట్రన్స్ దగ్గరే కనిపిస్తాయి..
*_అది వ్యాపారసూత్రం!_*
_______________________
*_కారు షికారుకెళ్లుద్దని..!_*
లక్షలు ఖరీదు చేసే కార్లను రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలేసి
పనికి రాని చెత్తను భద్రంగా
గ్యారేజిలో దాస్తాము..
*_అది అభద్రత..!_*
_______________________
*_అంట్లు శుభ్రంగా ఉండాలిగా మరి..!_*
నిమ్మకాయ రసంలో
కలుషిత నీరు..అనవసర సుగంధాలు కలిపి తాగుతాం..
అంట్లు తోమే సబ్బు
మాత్రం అచ్చంగా నిమ్మకాయల వాసన
వచ్చేట్టు తయారు చేశామని
చెబితే ఎగబడి కొనేస్తాం..
*_అది అతి జాగ్రత్త..!_*
_______________________
*_విడివిడిగా ఉండలేక..!_*
ఒకదానికొకటి అతుక్కుని ఉండే ఇళ్లను "అపార్ట్" మెంట్
అంటారెందుకో..?
*_అది భాషాదోషం..!_*
_______________________
*_ప్రమాదమే ప్రమోదమేమో?_*
విమానాలకు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా బ్లాక్ బాక్స్
చెక్కు చెదరదు...
మరి అదే ముడి పదార్థంతో
విమానం ఎందుకు తయ్యారు చెయ్యరో..!?
*_అది ప్రయాణంలో ప్రమాణం..!_*
++++++++++++++++
*_సురేష్ కుమార్ ఇ_*
No comments:
Post a Comment