💐💐 *ఈ రోజు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి* 💐💐
దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్ లోని మధుర దగ్గర 'నగ్ల చంద్రభాన్' అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. *భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు*
వ్యక్తిగత వివరాలు
**జననం
1916 సెప్టెంబరు 25
నాగ్లా చంద్రభాన్(మథుర), ఉత్తర ప్రదేశ్
*మరణం*
11 ఫిబ్రవరి 1968 (aged 51)
రాజకీయ పార్టీ
భారతీయ జనసంఘ్
మతం
హిందూ మతం 1952లో భారతీయ జన సంఘ్‌లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణంతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపథంలో నడిపించారు. అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నొ దినపత్రిక 'స్వదేశ్'లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో 'చంద్రగుప్త మౌర్య' నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందినాడు.
భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అట్టడుగున పడివున్న మానవుడు ఐహిక సుఖంతో వర్థిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించాడు.
ప్రతి మానవుడి శరీరం, మనస్సు, తెలివితేటలు, ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీన దయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు. వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ, స్వావలంబన కల ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారం అని భావించాడు. భారతదేశం ఒక స్వతంత్ర, స్వాలంబన దేశంగా ఉండాలని భావించేవారు . వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి పాశ్చాత్య భావనలపై భారతదేశం ఆధారపడ కూడదని పేర్కొన్నాడు. స్వాతంత్య్రానంతర పాశ్చాత్యీకరణ నుండి బయటపడటానికి భారతదేశానికి ఇది అత్యవసరం అని దీన్‌దయాల్ అభిప్రాయపడ్డారు. భారతీయ రాజకీయాలు మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలలో పాతుకుపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రకారం, భారతీయ ఆలోచన యొక్క పెరుగుదలకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే, దానిని స్వీకరించాలని ఆయన కోరుకున్నారు, కానీ అది భారతీయ అవసరాలకు తగినట్లుగా ఉండాలని చెప్పేవాడు
No comments:
Post a Comment