*_మృత్యువుకి_*
*_మరోపేరు క్యాన్సర్..!_*
మొన్నంటే కోవిడ్
పీడించింది కాని..
ప్రపంచాన్ని
కబళిస్తున్న అసలైన
మహమ్మారి క్యాన్సర్..!
అప్పుడెప్పుడో వినేవాళ్ళం
రాచపుండని..
మారాజులకే సోకుతుందని..
వైద్యం ఖరీదని..
చేసినా బ్రతకడం దుర్లభమని..
అయ్యో..నాటి పెభువులకి
ఎంత కష్టమని నిట్టూర్చేలోగా
వర్తమాన ప్రపంచాన్ని
కమ్మేసింది క్యాన్సర్..!
అది మృత్యుదేవతకు
మరో రూపమో..
మానవాళికి శాపమో..
ఇంటికొకర్ని బలి
తీసుకునే రక్కసో..
మొత్తానికి క్యాన్సర్ వచ్చిందో
ఇక అటే..
ఈలోగా ఇల్లు ఒళ్ళు గుల్ల!
ప్రపంచవ్యాప్తంగా
ఎన్నో పరిశోధనలు..
రకరకాల వైద్య ప్రక్రియలు..
పరీక్షలు..రేడియేషన్..
కిమోధెరపీ..
ఇంకా ఎన్నో ఎన్నో..!
విజయాలు ఉన్నాయి..
కానీ ఇప్పటికీ మరణాలే జాస్తి
సోకిందంటే మహమ్మారి
ప్రాణాలు హరీ..
ఎప్పటికి వదిలేనో ఈ పీడ..
మృత్యుదేవత నీడ..
ఈలోగా కొనసాగుతూనే
ఉంటుంది మానవ ప్రయత్నం
క్యాన్సర్ రహిత ప్రపంచం..
మానవాళి కల..
నెరవేరే ఆ రోజున
జగతికి పండగ..
వాలిపోవాలి
క్యాన్సర్ పడగ..
అందాక..అందేదాక..
ప్రతి రోగిని కంటికి రెప్పలా
కాచుకునే ప్రక్రియ..
మరిన్ని ఆస్పత్రులు..
అందుబాటులో సేవలు..
పేదోడి పేనం..
పెద్దోడి ప్రాణం..
రెండూ ఒకటే..
ఎవరికైనా బ్రతుకు ఒక్కటే..
అదే ప్రాణం.. అంతే తీపి..!
ఉచితాలు..
ఓటు బ్యాంకు పథకాలు...
వీటి మీద కోట్లు కుమ్మరించే
ప్రభుత్వాలు..
విద్యను..వైద్యాన్ని
భారం చేసి
జబ్బులు పెంచుతూ
జబ్బలు చరచుకోడం
అదెంత ఖర్మం..
అధికార మర్మం..!
*_సురేష్..9948546286_*
No comments:
Post a Comment