ఓ కృష్ణా ! గాలిని మూట కట్టుట సాధ్యము కానట్లే నిరంతరము, ఇంద్రియములను బాధపెట్టు మనస్సుకడు చంచలమై ఎంత మాత్రము నిగ్రహింపరాదు. కావున నీవు పేర్కొనిన యోగము మనస్సు నిలువరింపజాలని వారికెట్లు సాధ్యపడును? ప్రశ్నింపగా భగవానుడు - నిక్కముగ మనస్సు నిలువరింపరానిదే! కాని, అభ్యాసము చేతను, విషయ వైరాగ్యము చేతను దానిని నిలువరింపవచ్చును. అని సమాధానమిచ్చెను.
ఇట్లు చంచలమగు మనస్సును నిగ్రహించుటకు భగవన్మూర్తిని ధ్యానించుట సర్వోత్తమమార్గమని ఇచ్చట సూచింపబడినది. కావున భగవానుని నానావతారములలో ఏదేని మనసుకు నచ్చిన దానిని మూర్తిగా ముందుంచుకొని ఉపాసించుటయే మనోనిగ్రహ కారణమగును. కావుననే ఆగమశాస్త్రమునందు గూడ భగవానుని మూర్తి వైభవమును తెలియజేయుచు.
భగవంతుని దివ్యమంగళ విగ్రహమును ప్రతిమ రూపమున దర్శించిన వానికి చాలకాలము నుండి మనస్సును పట్టియున్న కుసంస్కారము, కుబుద్ధి ఇవియన్నియు పటాపంచలై మనస్సు భగవద్రూపముచే అంకితమగునని చెప్పబడినది. కావున భగవన్మూర్త్యు పాననమే మనోనిగ్రహ హేతువని యెరుగవలయును.
No comments:
Post a Comment