Tuesday, February 4, 2025

 జ్ఞానార్జనలో అత్యున్నత స్థితిని చేరిన సాధకుడు. (ఋషతీతి ఋషిః); జ్ఞానం సంపాదించి, యజ్ఞాది వైదిక క్రియల ద్వారా, తపస్సు ద్వారా సిద్ధింపజేసుకొనే ఒక స్థితి ఋషిత్వం. (ఋషతి జ్ఞానేన సంసార పారం). దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అని మూడు తరగతుల వారు ఇందులో ఉన్నారు. నారదుడు దేవర్షి. వసిష్ఠుడు బ్రహ్మర్షి. జనకుడు రాజర్షి. ఆకాశంలో సప్తర్షి మండలం ప్రసిద్ధం. ఒక మన్వంతరంలో ఒక చోట ఉన్న మహర్షులు మరొక మన్వంతరంలో మార్పులు చేర్పులతో మరో చోట ఉండవచ్చు. ఉదాహరణకు ఒక మన్వంతరంలో (మహాభారతం ప్రకారం) మరీచి, అత్రి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వసిష్ఠుడు. మరొక మన్వంతరంలో (బ్రాహ్మణాల ప్రకారం) గౌతముడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి. హరివంశంలో మరికొన్ని మన్వంతరాల సప్తర్షి గణాల పేర్లు ఉన్నాయి. (మా.మా.వి.) ఋషులు మూడు కాదు ఏడు తెగలనే మరొక వాదం ఉంది. మహర్షి, పరమర్షి, శ్రుతర్షి, కాండర్షి అనే తరగతులను దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి తరగతులకు చేరిస్తే మొత్తం ఏడు తరగతుల వారు లెక్కకు వస్తారు

సప్త-ఋషులు:
(అ.) 1. మేధాతిథి, 2. పసుపు, 3. సత్యుడు, 4. జ్యోతిష్మంతుడు, 5. సవనుడు, 6. ద్యుతిమంతుడు, 7. హవ్యవాహనుడు [వీరు దక్షసావర్ణిక మనువు కాలమువారు].
(ఆ.) 1. ద్యుతి, 2. తపస్వి, 3. సుతపుడు, 4. తపోమూర్తి, 5. తపోధనుడు, 6. తపోనిధి, 7. తపోధృతి [వీరు రుద్రసావర్ణిక మనువు కాలమువారు].
(ఇ.) 1. మరీచి, 2. అత్రి, 3. అంగిరసుడు, 4. పులస్త్యుడు, 5. పులహుడు, 6. క్రతువు, 7. వశిష్ఠుడు [వీరు స్వాయంభువ మనువు కాలమువారు].
(ఈ.) 1. పృథుడు, 2. కావ్యుడు, 3. అగ్ని, 4. జమ్నుడు, 5. దాత, 6. అకపీవంసుడు, 7. ?? [వీరు తామస మనువు కాలమువారు].
(ఉ.) 1. యదుధ్రుడు, 2. వేదశిరుడు, 3. హిరణ్యరోముడు, 4. పర్జన్యుడు, 5. ఊర్ధ్వబాహుడు, 6. సత్యనేత్రుడు, 7. దేవబాహుడు [వీరు రైవత మనువు కాలమువారు].
(ఊ.) 1. భృగుడు, 2. నభుడు, 3. వివస్వంతుడు, 4. సుధాముడూ, 5. విరజుడు, 6. అతినాముడు, 7. సహిష్ణుడు [వీరు చాక్షుష మనువు కాలమువారు].
(ఋ.) 1. వశిష్ఠుడు, 2. అత్రి, 3. గౌతముడు, 4. కశ్యపుడు, 5. భారద్వాజుడు, 6. జమదగ్ని, 7. విశ్వామిత్రుడు [వీరు వైవస్వత మనువు కాలమువారు].
---------------------   

No comments:

Post a Comment