. *స్నేహము*
. ***********
ఒకరి నొకరు సహకరించుకునే
సహజ లక్షణం స్నేహం.
కపట తత్వమునకు అసలే
తావు లేనిది స్నేహం.
సుఖ సంతృప్తుల ఆస్వాదిత
ఖజానా స్నేహం.
ప్రమాద పరిస్తితులలో సత్వరమే
స్పందించి కాపాడేది స్నేహం.
ఇట్టి స్నేహము
భోగమునకు పొంగనిది.
రోగమునకు క్రుంగనిది.
మోహమునకు లొంగనిది.
ద్రోహమునకు వంగనిది.
స్నేహములో ఒకరి నొకరి అనురక్తి
ముక్తికి సోపాన యుక్తి.
ఆగ్రహం లేనిది. అనుగ్రహం తరగనిది.
మనమెపుడూ కలిసుండేది
స్నేహ వాతావరణము వలననే.
స్నేహమనేది ఓ చక్కని జీవిత
సంబంధ నేపథ్య సారథ్యము.
ఈ బంధం గతి లేఠ విడిపోతే
తట్టుకోవడం చాలా కష్టం.
ఇది మన కష్టలను దూరం చేసే
సుస్థిర సహసంబంధం.
స్నేహం లేకుండా ఏవరూ
సరిగా బతకలేరు.
బ్రతికినా హాయిగా సంతృప్తిగా
ఉండలేరు. మనలేరు.
మనసులో ఏదో తెలియని
వెలితి. విసుగు.
మంచి గుణములే
స్నేహ నిలకడక ప్రేరణ.
మోసం, కుళ్ళు, కుతంత్రాలు
కనిపించవు ఒక స్నేహములోనే.
మన పరిచయాలను మెరుగు పరచి
స్థిరపరిచేది ఒక్క స్నేహమే.
నమ్మకం, సుసంస్కారం కనిపించేది
ఒక స్నేహములోనే.
అందం, ఆనందం అనేవి
స్నేహములో కనినిపించు
మధురానుభూతులు.
అందుకే మన జీవన విధానము
స్వచ్ఛము, ప్రియతత్వ భరితము.
ఈ స్నేహములో భయమునకు
అసలే తావు లేదు.
స్నేహం లేకుంటే మనం
ఎవరికెవరమో !
చెలిమి వలననే మన జీవనం
సుఖ సంతృప్తుల
నిత్య కళ్యాణ పచ్చ తోరణం !
ఇదే మన స్నేహ మహిమ !
స్నేహము వలనే మన జీవన
వాతావరణములో పరిమళిస్తుంది
మంచి ఘుమ ఘుమ !
అందుకే స్నేహం చేసి జీవించు
హాయిగా చక్కగా మనోహరంగా !!
*******************
రచన :---- రుద్ర మాణిక్యం. (కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా).
***********************************
No comments:
Post a Comment