"ఫిన్లాండ్" దేశం లో, ఓ ఖాళీ రోడ్, మన వాడు ఒకడు అలవాటుగా, సిగ్నల్ లేకుండా దాటబోయాడు... ఇంతలో పక్కనే వున్న ఆ దేశంవ్యక్తి
"రోడ్డు దాటవద్దు" అన్నాడు...
మనవాడు "రోడ్డు ఖాళీనే కదా దాటితే యేం" అన్నాడు...
అప్పుడా వ్యక్తి, "పిల్లలు ఎవరైనా చూస్తారేమో" అన్నాడు.మనవాడికి అర్ధం కాలేదు.
"పోలీసులు చూస్తే సమస్య గానీ.... పిల్లలు చూస్తే సమస్య ఏంటి" అని అడిగాడు.
అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు...,
పోలీసులు చూస్తే, నీకు క్రమశిక్షణ లేనందుకు, ఒక 5$ పెనాల్టీ వేస్తారు..., దాని వల్ల నువ్వు ఒక్కడివే నష్టపోతావ్...,
కానీ పిల్లలు చూస్తే, వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఒక తరం అంతా పాడవుతుంది" అని చెప్పాడు.
మనవాడు తేరుకోడానికి కొద్దిగా టైము పట్టింది.
అదీ భావితరాలను తయారు చేసే పద్ధతి.
No comments:
Post a Comment