(252) (29.04.2025)
మనం కలిసి కాపురం చేసింది ఆరు నెలలు
ఆపై అందుకున్నాము విడాకులు
ఇక ముందు మనం ఆలుమగలం కాము
ఇంతకు ముందులా కబుర్లు చెప్పుకోలేము //
ఈ రోజు నుంచి నాది ఒంటరి జీవితము
ఒంటరి జీవితం గడపటం ఎంతో కష్టము
విడిపోవడానికి కారణాలు ఏమైనా కావచ్చు
ఇక మనము జీవితంలో కలవక పోవచ్చు //
పెళ్ళికి ముందు ఎన్నో ఊహాలు
పెళ్లి అయినాక అవి అన్నీ తీరని కలలు
తీపి గుర్తుగా మన పెళ్ళి వీడియోలు
వాటిని చూస్తుంటే ఆగకున్నవి కంటిచుక్కలు //
పెళ్ళికి ముందు ఏదేదో ఊహించుకుంటిని
ఆరు నెలల జీవితమని తెలుసుకోకుంటిని
ఆరు నెలలు ఆరు క్షణాలుగా గడిచాయి
చివరకు మీ జ్ఞాపకాలే నాకు మిగిలాయి //
6 నెలల కాపురంలో ఎన్నో అనుభవాలు
మీకు రుచి చూపిస్తిని ఎన్నో కొత్త వంటలు
చేతి వంట తిని నను కాదనుకున్నారో
ముందు ముందు నాతో కష్టం అనుకున్నారో //
చేతిలో విడాకుల కాగితాలు పెట్టినారు
ఆపై నను ఒంటరిని చేసినారు
మూడు ముళ్ళ ముచ్చట తీరలేదు
మీతో ఏనాడూ సరదాగా గడపలేదు //
ఇక నా మనసులోనికి పెళ్ళి ప్రసక్తి రానీయను
మీ తలంపులో వేరే వాడిని మనువాడలేను
ఊపిరి ఉన్నంత వరకు మీరే నా శ్రీవారు
ఊపిరి పోయినాక మనం ఎవరికి ఎవరు
ఈ జన్మకి ఈ పెళ్ళి ముచ్చట చాలు
మరిచిపోదామన్నా మరువలేని గాయాలు //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment