రవ్వ దోశ ఎలా పుట్టిందో, దానికి వాడే పిండి నీళ్లలా, పలచగా ఎందుకుంటుందో తెలుసా.?
దానికో కథ ఉంది.
ఒకప్పుడు ఒక పల్లెటూళ్ళో ఒక చిన్న కాకా హోటల్ లాంటిది ఉండేది. అక్కడకి అందరూ వచ్చి బాగా తినేవారు. పైగా దోశ లు బాగా ఫేమస్.
ఆ విషయం ఆ నోటా, ఈ నోటా విని ఒకావిడకి తెలిసింది. ఎలాగైనా తినాలని కూడా ఒక కుర్రాడిని తీసుకుని హోటల్ దగ్గరకి వచ్చింది.
తీరా చూస్తే ఓ తెగ జనం. ఒక అరగంటయింది, గంటయింది. అయినా ఖాళీ అవ్వలేదు.
చివరికి అవి తినే అదృష్టం లేదేమో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని లేచి నడుస్తోంది.
సరిగ్గా అప్పుడే ఒక పిలుపు వినబడింది.
"రా...అవ్వ.....దోశ" తిను ఇప్పుడే వేసా అని ఒక చెయ్యి ప్లేట్ తో సహా నడిచి వస్తోంది.
అంటే ఒక అరగంట ముందు ఆవిడ కూడా వచ్చిన కుర్రాడున్నాడు కదా ఆ కుర్రాడు లోపలకి వెళ్ళి "మా అవ్వకి పళ్ళు లేక పోయినా ఎంతో దూరం నుండి ఈ దోశ తినడానికి వచ్చింది" అని ఆ దోశ మాస్టర్ కి చెప్పాడన్నమాట.
కానీ జనం ఎక్కువగా ఉండటం వల్ల పిండి అయిపోయింది. ఎలాగా అవ్వకి పళ్ళు లేవని ఆఖర్లో మిగిలిన పిండిలో కొన్ని నీళ్ళు పోసేసి ఇలా పలచగా చేసి ఆ ముసలావిడకి ఇచ్చేశాడు.
కానీ ఆ ప్లేట్ ముసలావిడ దాకా వచ్చే లోగా మధ్యలో ఆ దోశ అవ్వకు అని తెలియని ఒకడు ఆ దోశ ప్లేట్ తీసేసుకుని "రా..అవ్వ..దోశ" ను కాస్తా "రవ్వ దోశ" భలే ఉంది ఇంకో రెండు వెయ్యి అన్నాడు.
దాంతో ఆ దోశ మాస్టర్ కి కొత్త ఐడియా వచ్చి ఆ గట్టి పిండితో వేసే దోశ లు, దిబ్బ రొట్లు, ఊతప్పాల తో బాటూ, పిండి పలచగా నీళ్లలా చేసి ఈ రవ్వ దోశ లు కూడా వెయ్యడం మొదలు పెట్టాడన్నమాట.
అదీ రవ్వ దోశ వెనక కథ.!
No comments:
Post a Comment