డాక్టర్ అసిస్టెంట్ తో
ఈ బెడ్ మీద పడుకున్నవాడి ప్రోబ్లం యేమిటి?
అసిస్టెంట్: ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో బంగారం తులం పాతిక రూపాయలుండేదిట. అప్పుడు ఒక కేజీ బంగారం కొనుక్కోలేకపోయొనే అని బాధపడుతూ చిక్కి సగమయ్యాడు.
డాక్టర్: ఓఁ, మరి యీ రెండో బెడ్ మీద పేషెంట్ సంగతేమిటి?
అసిస్టెంట్: ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో గజం పది రూపాయలకి రెండువేల గజాల స్థలం ఆఫర్ వచ్చిందిట. అంత దూరంలో నాకెందుకని వదిలేసాడు. ఇప్పుడది గజం లక్ష రూపాయలు అయిందిట. కుళ్ళి కుళ్ళి యేడుస్తున్నాడు.
డాక్టర్: ఈ మూడో బెడ్ మీదివాడి సంగతేమిటి?
అసిస్టెంట్: ఈయన బియీడీ చేసి బ్యాంకు గుమాస్తా ఉద్యోగం గొప్పగా వుంటుందని జాయిన్ అయ్యాడట. వాడితో పాటు చదివి టీచరైన ఫ్రెండు లెక్చరర్ గా రిటైరయి లక్షలలో పెన్షన్ తీసుకుంటూవుంటే తన కొచ్చే పెన్షన్ చూసుకుని బావురుమంటున్నాడు.
డాక్టర్: ఇది మరీ బాగుంది. ఆ ప్రక్కనే ఒక బెడ్ నాకు రెడీ చెయ్యి.
అసిస్టెంట్; ఆశ్చర్యంతో మీకెందుకుసార్.
డాక్టర్: ఏమీ లేదయ్యా. నేను డాక్టరైన కొత్తలో ఒకాయన బియిడీ చేసిన వాళ్ళమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయడానికి రెండెకరాల భూమి, అరకేజీ బంగారం కట్నం యిస్తానన్నాడు. నేను ఫోజు కొట్టి వద్దన్నాను..
అసిస్టెంట్: పోన్లెండి సార్.
డాక్టర్; పోన్లెండేమిటయ్యా. ఆయన ఇస్తానన్న ఆ రెండెకరాలు యీరోజు హైటెక్ సిటీ మధ్యలో వుంది. బంగారమా కొండెక్కింది. ఆ అమ్మాయి ప్రొఫెసర్ గా రిటైరయి ఆరంకెల పెన్షన్ డ్రా చేస్తోంది.
నేనో: వెర్రోడిలా యీ హాస్పిటల్ లో నైట్ షిఫ్ట్ డాక్టర్ గా పని చేస్తున్నాను. తలుచుకుంటే కడుపులో బాధ పైకెగతన్నుతోందయ్యా.
ఊఁ త్వరగా బెడ్ రెడీ చెయ్.
VSN😊
No comments:
Post a Comment