*పెద్దరికం అంటే ఏమిటి....?*
_____________________
*పెద్దరికం అంటే కళ్ళతో భయపెట్టేది కాదండి … కళ్ళనిండా ప్రేమను కురిపించేది పెద్దరికం.*
*పిల్లలు తప్పు చేసేటప్పుడు దండించేది కాదండి పెద్దరికం ఆ తప్పు వెనకున్నటువంటి కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని తుంచి వేసి, ఆ తప్పు మరెప్పుడు చేయకుండా సరైన మార్గం సూచిస్తుంది చూశారు అదండీ అసలైన పెద్దరికం అంటే.*
*భయపెట్టి మాట వినేలా చేసుకోవడం కాదండి పెద్దరికం అంటే . ప్రేమతో చెప్పే ప్రతి మాటను తూ.చా తప్పకుండా పాటించేలా చేసేదండి అసలైన పెద్దరికం.*
*పెద్దరికం అంటే భయపడి మన వెంట నలుగురు తిరగడం కాదండి. ప్రేమతో మనకోసం , మనల్ని మెచ్చి , మనం నచ్చి మన వెంట ఒక్కడు తిరిగినా అదండీ పెద్దరికం అంటే..*
*అయినా పెద్దరికం అనేది వయసుతోనో, అనుభవంతోనో, మనం కోరుకుంటేనే వచ్చేది కాదండి పదిమంది మెచ్చి, మనకు అప్పజెప్పెది పెద్దరికం. కాబట్టి అలాంటి పెద్దరికం మనకు వచ్చినప్పుడు పెద్ద మనసుతో ఆలోచించి అందర్నీ అక్కని చేర్చుకోవాలి. అప్పుడే ఆ పెద్దరికానికి అసలైన అర్థం చేకూరుతుంది.*
No comments:
Post a Comment