Thursday, April 24, 2025

 *మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు?*
*ఉన్నా ఎందుకు కనబడుటలేదు?*

*ఆయన్ని ఎలా దర్శించు కోవాలో శ్వేతశ్వతరోపనిషత్ తెలియ జేస్తుంది.*

శ్లో: తిలేషు తైలం దధినేవ సర్పి
ఆపస్స్రోత
స్స్వరణీషుచాగ్నిl
ఏవమాత్మా2త్మని
గ్రుహ్యతే2సౌ 
సత్యేనైనం తపసా
యో2ను పశ్యతిll

నువ్వులలో నూనె ఉంటుంది.
పెరుగులో వెన్న ఉంటుంది.
భూమిలో నీరు ఉంటుంది.
కట్టెలలో అగ్ని ఉంటుంది.

కానీ ఇవ్వన్నీ కంటికి కనబడవు.

నువ్వులను గానుగలో వేసి తిప్పుట వలన నూనె వస్తుంది.

పెరుగును చిలుకుట వలన వెన్న వస్తుంది.

భావి తవ్వుట లేక బోరు వేయుట వలన నీరు వస్తుంది.

యజ్ఞములు చేసేటపుడు అగ్గిపుల్ల గీసి అగ్నిని వెలిగించరు.
రెండు కర్రలను మదించి అగ్నిని పుట్టిస్తారు.

*"ఈశ్వర సర్వ భూతానాం హద్ధేశేర్జున తిష్టతి".*

ఈశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాలలో ఉంటాడు.

కానీ కనపడడు.

సత్యము, తపస్సు (ధ్యానము) చేయుట వలన ఆయనను దర్శించుకొన వచ్చును.

No comments:

Post a Comment