*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ..*
*వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి.*
*తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు తండ్రి.*
*ఎందుకంటే..నాన్న ఎవరికీ చెప్పడు.*
*పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.*
*అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు.*
*బిజీగా ఉన్న నాన్న రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు..*
*"ఎప్పుడూ పనేనా..? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా.." అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం.*
*పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు.*
*నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతుంటాడు.*
*పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*
*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు.*
*ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.*
*వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.*
*వృద్ధాప్యం ఇంకా రాలేదు..*
*మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు.*
*ఎందుకంటే..ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*
*కొన్ని వందల సార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..?*
*నాన్న కూడా ఏడుస్తాడు.*
*కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*
*ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు.*
నాన్న గుండెల పై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు.
అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*
*మీ కోసం రిస్క్ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.*
*మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..*
*అమ్మానాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి*
No comments:
Post a Comment