Tuesday, April 22, 2025

 *✅తెలుసు కుందాం✅*


*ఒకోసారి సముద్ర తీరం పక్కనే బావి తవ్వినా మంచినీరు పడుతుంది. ఒకోసారి సముద్రాలకు దూర భూముల్లో బావి తవ్వినా ఉప్పు నీరు పడవచ్చు. బావి నీటి రుచికి కారణాలేంటి?*

జవాబు: బావుల్లో ఊరే నీటి రుచికి సముద్రమే కారణం కానక్కర్లేదు. చాలా మటుకు భూమి పొరల్లో ఉండే భూగర్భజలం (ground water) బావుల్లోకి ఊటలాగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని భూగర్భాల్లో సముద్రపు నీరే చేరి ఉంటుందనుకోకూడదు. అది నిజమైతే సముద్రాల ఉపరితలంపై ఉండే విపరీతమైన ఒత్తిడి బావుల్లో నీరు పొంగిపొర్లాలి. అలా జరగడం లేదు కదా! కాబట్టి ఆ బావుల్లోకి చేరే నీరు చాలా సార్లు అక్కడి భూమి పొరల్లో ఇంకి ఉన్న లవణాల కారణంగా ఉప్పగా ఉండే అవకాశాలున్నా, కొన్ని సార్లు మంచి నీరు కూడా ఊరుతుంది. అలాగే సముద్రాలకు దూరంగా ఉండే పీఠభూముల్లో కూడా ఉప్పు నీరు పడే అవకాశాలు లేకపోలేదు. అది అక్కడి భూముల తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేలల్లోని లవణాలుంటే వాటిని కరిగించుకున్న నీరు ఉప్పగా ఉంటుంది. సాధారణంగా భూగర్భజలాల్లో లవణ శాతం, సరస్సులు నదుల్లోని నీళ్ల లవణ శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.

No comments:

Post a Comment