*✅తెలుసు కుందాం✅*
*🟥మొక్కల నుంచి మందులను ఎలా తయారు చేస్తారు?,How do medicines prepare from Plants?.*
🟢మందుల తయారీలో మొక్కలు ప్రాచీన కాలం నుంచీ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో జన్యుశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మందుల తయారీలో మొక్కల ఉపయోగం మరీ ఎక్కువైంది. మొక్కల్లో ప్రత్యేకమైన జన్యువులను ప్రవేశ పెట్టడం ద్వారా టీకాలు, రోగనిరోధక యాంటీ బాడీస్, హార్మ్లోన్లు, ప్రోటీన్లను తయారు చేస్తున్నారు. వీటిని జంతువుల కణాల నుంచి కాకుండా మొక్కల ద్వారా ఉత్పన్నం చేయడం సులువే కాకుండా, చవక కూడా. జీన్‌గన్ అనే యంత్రం ద్వారా కావలసిన జన్యువులను మొక్కల కణాలలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. మరో పద్ధతి ద్వారా సూక్ష్మక్రిములను ఉపయోగించి రకరకాల జన్యువులను మొక్కల్లోకి ప్రవేశపెడతారు. మానవ శరీరానికి ఉపయోగపడే హార్లోన్లను ఉత్పత్తి చేసే ఫార్మాస్యూటికల్ పొగాకును తొలిసారిగా 1986లో తయారు చేశారు. ప్రస్తుతం వివిధ జన్యువుల ద్వారా పరివర్తన చెంది, మందుల తయారీలో ఉపయోగపడే 80 జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.
No comments:
Post a Comment