🌹*తల్లిదండ్రుల బిజీ లైఫ్..vs పిల్లలు* 🌹
రాత్రి తొమ్మిది అయింది. ఊపిరి తీసుకోకుండా మీటింగ్స్ ఉంటూనే ఉన్నాయ్.. ఏమి వర్క్ ఫ్రొం హోమ్.. ఏమో కానీ ప్రాణాలు తోడేస్తున్నారు అనిపించింది. పైగా ఈ అజైల్ ప్రాజెక్ట్ అంటే..రాత్రి పడుకునే ముందు ఏమి చేసామో చెప్పాకా.. మళ్ళీ పొద్దున్న ఏమి ఉంటుంది అప్డేట్ స్టేటస్ ....నా బొంద..
బెడ్రూమ్ లో నా ఆలోచనల లో నేనుంటే.. కిచెన్ లో ఏదో అలికిడి వినిపిస్తోంది..
ఏమిటా అని వెళ్లి చూస్తే మా చిన్ను గాడికి మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయి అని మా ఆవిడ అరుస్తుంది...
కాసేపు విన్నాక నేను కూడా కాస్త చెప్పి చూద్దాం అని శృతి కలిపాను...
"ఏరా చిన్ను.. మీ అమ్మ మన కోసం పొద్దున్నే ఇదింటికే లేసి టిఫిన్, బాక్స్ లు అన్ని సిద్ధం చేసి పంపుతోంది.. చదువుకోటానికి ఏంట్రా నొప్పి.. "
ఆ లాజిక్ కరెక్ట్ కాదు అని నాకు తెల్సు.. కానీ మంచి చెడు చెప్పక పోతే ఎలాగ చేయి జారీ పోతాడేమో అని భయం..
మేము ఇద్దరం నోరు నొప్పి వచ్చేలా అరవటమే కానీ వాడిలో ఏ స్పందన లేదు..
*** ****
. ఇది జరిగి వారం అయింది.. మళ్ళీ అవే అరుపులు..
చిన్నుకి మార్కులు తక్కువ వచ్చాయి అని..
కాసేపు వాడిని నిందించాము... కాసేపు స్కూల్ ని వాళ్ళ టీచర్స్ ని తిట్టిపోసాము.. అయ్యాక ఒకరిని ఒకరం నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు అంటూ కాస్త జగడం నడిచింది..
అలా ఒక గంట గడిచాక ఇల్లు అంతా నిశ్శబ్దం అలుముకుంది..
కుర్చీలో కూలబడి..దీర్ఘ ఆలోచనలో పడ్డాను..
నిజంగా చిన్ను తప్పు ఏమైనా ఉందా.. మన రోజుల్లో మనమే చదువుకున్నామా.. మన అమ్మానాన్న కూర్చోపెట్టి చదివించారా.. అని ఆలోచిస్తే.. నా రోజుల్లో అమ్మ నాన్న తమ సమయం ఎంత కేటాయించారో గుర్తొచ్చింది..
ఇప్పుడు ఒక్క నిమిషం దొరికితే ఫోన్ పట్టుకొని ఏదో వెతికేసే ప్రయత్నం లోనే అందరం ఉంటున్నాం.. ఆ డబ్బా లో ఏమి చావదు అని తెలిసినా మళ్ళీ ఆ ఫోన్ వైపే వేళ్ళు వెళ్ళిపోతుంటాయి తప్ప బాబుని కూర్చోపెట్టుకుని.
"బాబు ఏంట్రా నీకు ఏమి ఇబ్బంది.. నేను చెప్పనా "అని చదువు చెప్పే ఓపిక నశించింది అని అర్ధం అయ్యింది...
ఇంకా ఎవర్నో నిందించి ప్రయోజనం లేదు అని అర్ధం అయింది..
ఇక నుంచి రోజు ఒక గంట ఖచ్చితంగా బాబు చదువు కోసం వెచ్చించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను..
బాబు కూడా సంతోషాపడ్డాడు.. మనం బరిలోకి దిగితే వేరేలాగా ఉంటుంది అని నిరూపించాము..
వర్క్ బుక్స్ వదిలేసి.. టెక్స్ట్ బుక్ లో నుంచి నోట్స్ ఎలా రాసుకోవాలో నేర్పించాను...
ఫాస్ట్ గా కాకుండా స్లో గా ఎలా చదివితే బుర్రకి ఎక్కుతుందో చెప్పాను..
చూస్తూనే హాఫ్ ఇయర్లి ఎగ్జామ్స్ వచ్చాయి... నేను ఒకటే చెప్పాను
.. 1st ర్యాంక్ రావాలంటే .. 3 పాయింట్లు రాసుకో అని చెప్పాను
1) నాకు ఎంత టైమ్ ఉంది
2)ఎన్ని చదవాలి ( ఓకే పేపర్ లో అన్ని నంబర్స్ వేసి ఉంచుకో ) 🔲
3) ఎన్ని చదవగలిగాను ( చదివిన వి అన్ని టిక్ ✅ చేసుకో )
అన్ని నంబర్స్ కి టిక్స్ ✅ వచ్చాయి అంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. అని
అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ సిద్ధం గా ఉన్నట్టు..
ఇప్పుడు చిన్ను మార్క్స్ తక్కువ వస్తాయా రావా అని భాధ పడట్లేదు.. ఎందుకంటే ఎన్ని వచ్చునో ఎన్ని రావో ముందే తెల్సు కాబట్టి..
ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే.. చెప్పాడు.. తనకు మళ్ళీ మళ్ళీ మంచి మార్కులు వచ్చి నందుకు సెక్షన్ c నుంచి సెక్షన్ A కి మార్చారు అని సంతోషంగా...
మీకు నచ్చితే మీ స్నేహితులకు, మీ వారికి, బంధువులకు ఈ సందేశం పంపండి. 🌹
- --- సమాప్తం ----🌹🌹
No comments:
Post a Comment