Wednesday, March 18, 2026

*యుగాది నాడు చేయవలసిన పనులు/ పాటించవలసిన విధి విధానాలు గురించి తెలియజేసిన మన గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు:*

 *యుగాది నాడు చేయవలసిన పనులు/ పాటించవలసిన విధి విధానాలు గురించి తెలియజేసిన మన గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు:*

--> నూతన సంవత్సరం కనుక తప్పక తలస్నానం చేయాలి. 
 
--> నూతన వస్త్రాలు తప్పక ధరించాలి. అలా కుదరని పక్షంలో, స్నానమాచరించిన తరువాత, కనీసం ఒక నూలుపోగునైనా తలపై ధరిస్తే సరిపోతుంది. 
 
--> ఉగాది పచ్చడిని కాలపురుషునికి (శివుడు లేక కేశవుడు) నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. 
 
-->  ఉదయాన్నే దేవాలయమునకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. సాయంత్రం శక్తిమేర తప్పక దానములు ఇవ్వాలి. 
 
--> మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి,  స్వయంపాకంగా దానం ఇవ్వాలి. 

 --> బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి.  

--> కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. 
 
--> తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. 
 
--> గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. 
 
--> లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. 
 
-->పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. 
 
-->పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. 
 
--> బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. 
 
-->   కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... 
 
      *సర్వే జన:సుఖినో భవంతు.*

No comments:

Post a Comment