Sri Rama Krishna Paramahansa garu cheppina kathalu ( శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన కథలు )
Author Name:Malladi kailasanadh Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@malladikailasanadhspiritua3637
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-DUSYHuuNBI
Transcript:
(00:01) శ్రీ గురుభ్యో నమః శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. వేదాంతం ప్రకారం ఈ జగత్తు మిధ్య ఒక కలలాగా అది కూడా అనిత్యం అంటే అనిత్యం అంటే టెంపరరీ అండి నాట్ పర్మనెంట్ అని పర్మనెంట్ కాదు ఇది కూడా టెంపరరీనే ఏది ఈ జగత్తు అంటే మనము అను చూస్తున్నటువంటి ఈ ప్రపంచము ఈ జగత్తు ఇది కూడా అనిత్యమే మిద్య అంటున్నారు.
(00:45) పరమాత్మ కేవలం సాక్షిగా ప్రక్కన నిలబడి చూసేవాడిగా ఉన్నాడు జాగ్రత్తు స్వప్నము సుషుప్తి అనే మూడు స్థితులకు అతడు సాక్షి జాగ్రత్తు అంటే ఏంటంటే మెలకువ వస్థితి అండి స్వప్నము అంటే కలలో ఉన్నటువంటి స్థితి సుషుప్తి అంటే నిద్రలో ఉన్నటువంటి స్థితి కనుక మూడు స్థితులు చెప్పారు మనకి ఈ మూడు స్థితులకు అతడు సాక్షి కల ఎంత నిజమో మెలకువకు కూడా అంతే నిజం ఈ ముందు కథ కూడా చదువుకుంటే మనకు బాగా అర్థం వుతుందండి.
(01:21) కల ఎంత నిజమో మెలకువ కూడా అంతే నిజమట అంటే అర్థం ఏంటంటే అండి కల నుంచి మెలుకువ రాంగానే కల వెళ్ళిపోతుంది కల కరిగిపోతుంది కదండీ కలలో ఉన్నది అది ఊరికే కలలో కనిపించింది కానీ మనకేమి సహకారం అవ్వదు అని అర్థం అవుతుంది గా మెలకువలో కూడా అంతే మెలకువలో మనకి కుటుంబం ఉంటుంది ప్రపంచం ఉంటుంది ఇల్లు ఉంటుంది పొలాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి హోదా ఉంటుంది కారు బంగళా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ మనం శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి కదండీ అదన్నమాట ఇక్కడ ఒక రైతు ఉన్నాడు అతడు ఒక నిజమైన జ్ఞాని వ్యవసాయమే అతడికి జీవనోపాధి ఈ రైతు తన పారమార్థిక చింతన వల్ల గ్రామస్తులకు
(02:09) అందరిక ప్రీతిపాత్రుడుఅయ్యాడు. వయసు మళ్ళిన తర్వాత అతడికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడికి హరు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులకు హరు అంటే పంచప్రాణాలు ఎందుకంటే అతడు లేకలేక పుట్టిన వంశాంకురం కదా ఒకరోజు ఈ రైతు పొలంలో పని చేస్తున్నాడు. అతడి పొరుగింటివాడు వచ్చి హరుకు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు.
(02:44) రైతు వెంటనే ఇంటికి వెళ్లి శక్తివంచన లేకుండా చికిత్స చేయించాడు. కానీ ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య మిగిలిన కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఏడుపులు పెడబొబ్బలతో ఇల్లు నిండిపోయింది. కానీ రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఏమి జరగనట్లే ప్రవర్తించాడు. భార్యను ఓదారుస్తూ ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి ఖనన సంస్కారం అంతా చేసి పొలంలో మిగిలిన పని చేయడానికి వెళ్ళాడు.
(03:21) సాయంత్రం అతడు యధాప్రకారం ఇంటికి రావడం చూచి భార్య నీది ఎంత రాతి గుండె పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండె పగిలి ఏడుస్తూ ఉంటే నీ కంటి వెంట ఒక్క నీటి బొట్టు అయినా రాలేదే అని ఆక్షేపించింది. దానికి ఆ రైతు తన భార్యను చూచి నాకు ఎందుకు ఏడుపు రావడం లేదో చెప్పమంటావా గడిచిన రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను ఒక రాజునైనట్లు నాకు ఏడుగురు కుమారులు ఉన్నట్లు కలగన్నాను ఆ రాజకుమారులు అందాల మూటలు సుగుణాల రాసులు సర్వవిద్యాపారంగతులు దృఢకాయులు
(04:04) ఇంతలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది కల చెదిరిపోయింది నేను ఇప్పుడు ఒక చిక్కులో పడ్డాను కలలో కనిపించిపోయిన ఆ ఏడుగురు పిల్లల కోసం ఏడవనా లేక ఈ హరు ఒక్కడి కోసం ఏడవనా అని అడిగాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నండి కల ఎట్లాంటిదో ఈ జీవితము అంటే ఈ మెలకువ స్థితి ఇది కూడా అలాంటిదే ఇది కూడా ఒకప్పటికీ కరిగిపోయేదే పిల్లవాడు చనిపోయాడు అంటే ఆ పిల్లవాడి ఆయుష్యు అంతవరకే ఉన్నది పైగా పిల్లవాడే కాదు మనమైనా ఎవరమైనా ఎప్పటికైనా పోవాల్సిందేగా కనుక ఇది టెంపరరీ ఈ జీవితం అనేటువంటిది ఇది టెంపరరీ ఇది పర్మనెంట్ కాదు శాశ్వతం
(04:51) కాదు ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే ఇది తెలిసినవాడు జ్ఞానండి అది ఇక్కడ చెప్తూ ఉన్నారు కనుక కలలాంటిదే ఈ జీవితం కూడా కలలో నాకు ఏడుగురు మంచి పిల్లలు ఉన్నారు ఆ కల నుంచి బయటికి రాంగానే ఆ పిల్లలు లేరు ఇప్పుడు మరి లేరుగా ఆ ఏడుగురు పిల్లలు లేరుగా అందువల్ల ఆ ఏడుగురు కోసం ఏడవనా ఈ పిల్లవాడి కోసం ఏడవనా అని అడిగాడండి అంటే ఈ పిల్లవాడు లేకపోవటం కూడా అటువంటిదే కదా అని అంటున్నాడు అంటే ఇది కూడా టెంపరరీనే ేగా ఒకనాటికి నేను వెళ్ళిపోవాలి తర్వాత నా పిల్లవాడు కూడా ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే అంటే అతను కాలంతో పాటు పోయేవాడే నేను కాలంతో పాటు పోయేవాడినే అని
(05:29) ఇది తెలిసినవాడు ఆ రైతు అండి అందువల్ల జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తూ ఉన్నారు. అట్లా అడిగాట్ట ఆ రైతు ఈ రైతు ఒక నిజమైన జ్ఞాని స్వప్నము జాగ్రత్తు అంటే ఏంటండి కల మెలకువ రెండు కూడా ఒక రకంగా అనిత్యాలేనని అతడికి తెలుసు ఉన్న సత్యం ఒక్కటే అదే ఆత్మ ఆత్మ అంటే భగవంతుడుండి ఉన్న సత్యం ఏంటి ఒక్కటే అదే ఆత్మ అంటే అన్ని టెంపరరీ మరి పర్మనెంట్ ఎవరండి అంటే పర్మనెంట్ భగవంతుడు ఒక్కడే శాశ్వతుడు భగవత వంతుడు ఒక్కడే అదండి ఈ కథ మనకు చెప్తోంది.
(06:09) ఈ కథను గురుదేవులు మహిమాచరణుడికి చెప్పారు మహిమాచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు అనేక ఇంగ్లీషు గ్రంథాలు చదివి కొంత పాండిత్యం సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండటం వల్ల ఉద్యోగం ఏమీ చేయకుండా శాస్త్ర పఠనంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగుణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతడికి పాండిత్య ప్రకర్షణం మీద కొంత అభిలాష ఉంది. అతడిది రాజసిక ప్రవృత్తి ఇది గుర్తించిన గురుదేవులు నిజమైన జ్ఞానం ఎలా ఉంటుందో నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఈ కథ ద్వారా అతడికి తెలియజేశారు స్వస్తి వాసుదేవా
No comments:
Post a Comment