You Are Not Weak. Your Cage Is Wrong. | Rat Park & the Truth About Addiction - TELUGU PSYCHOLOGY
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I60vHvxcGUA
Transcript:
(00:04) మనిషికి కొన్ని రోగాలు ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ వ్యసనానికి ట్రీట్మెంట్ ఉందా బోన్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్, రీల్స్ అడిక్షన్ అండ్ షుగర్ అడిక్షన్ ఈ వ్యసనాలని మనం ఎందుకు మానుకోలేకపోతున్నాం తప్పు వ్యసనంలో ఉందా నీలో ఉందా లేదా ఆ వ్యసనాన్ని అర్థం చేసుకోకపోవడంలో ఉందా? అసలు ఒక మనిషి దేనికైనా ఎందుకు అడిక్ట్ అవుతాడు 1960స్ లో అమెరికాలో డ్రగ్స్ గురించి ఒక పెద్ద భయం మొదలైింది.
(00:35) వియత్నాం యుద్ధానికి వెళ్ళిన అమెరికన్ సోల్జర్స్ చాలా మంది హెరాయిన్ తీసుకుంటున్నారని తెలిసింది. దాంతో అప్పటి గవర్నమెంట్ భయపడింది. ఎందుకంటే ఈ సోల్జర్స్ అంతా అమెరికాకు తిరిగి వస్తే మిగతా వారిని కూడా వ్యసనానికి గురి చేస్తారు. సో దేశమంతా హెరైన్మయం అయిపోతుందని భయపడింది. సో ఆ టైంలో సైంటిస్టులు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు.
(00:58) ఒక రాట్ ని తీసుకున్నారు దాన్ని ఒక చిన్న కేజ్‌లో ఒంటరిగా ఉంచారు. ఆ కేజ్ లో రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఒకటి ప్లెయిన్ వాటర్ ఇంకొకటి మార్ఫిన్ కలిపిన వాటర్ మార్ఫిన్ అంటే హరైన్ కి చాలా దగ్గరగా ఉండే డ్రగ్ సో ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాట్ మొదట్లో రెండు ట్రై చేసింది. కానీ మెల్లిగా మార్ఫిన్ వాటర్ వైపు మొగ్గు చూపించింది. రోజు రోజుకి ఎక్కువ తాగడం స్టార్ట్ చేసింది.
(01:22) తినడం తగ్గించింది ఆడటం మానేసింది. చివరికి ఒకరోజు చనిపోయింది. సో ఫైనల్ గా సైంటిస్ట్ులు ఏం చెప్పారంటే ఇదిగో ఇక్కడే ఉంది ప్రూఫ్ డ్రగ్ ఇట్సెల్ఫ్ అడిక్టివ్ డ్రగ్ తీసుకుంటే బ్రెయిన్ మారిపోతుంది. మళ్ళీ మళ్ళీ తీసుకోకుండా ఉండలేవు. ఇది ఛాయిస్ కాదు కెమిస్ట్రీ అని చెప్పింది. ఆ తర్వాత దశాబ్దాల పాటు ఈ బిలీఫ్ మొత్తం అడిక్షన్ సైన్స్ కి ఫౌండేషన్ అయింది.
(01:47) కానీ ఒక మనిషి ఈ ఎక్స్పెరిమెంట్ లో ఉన్న లోపం చూశడు. అతని పేరు బ్రూస్ అలెగ్జాండర్ అతను అడిగిన ఒక సాధారణమైన ప్రశ్న ఏంటంటే ఆ రాట్ చాలా ఒంటరిగా ఒక చిన్న కేజీలో ఏమీ చేయడానికి లేక తోడఎవ్వరూ లేక బతికింది. అలాంటి పరిస్థితుల్లో మార్ఫిన్ తాగిందంటే అది డ్రగ్ అడిక్టివ్ అని ప్రూవ్ అయిందా లేక ఆ నరక జీవితంలో పెయిన్ ని తగ్గించుకోవడానికి అది డ్రగ్ తీసుకుందని ప్రూవ్ అయిందా ఇలా ఒక క్వశ్చన్ అడిగాడు.
(02:18) సో వెంటనే 1970స్ లో బ్రూస్ అలెగ్జాండర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు దాని పేరు రాట్ పార్క్ అతను ఏం చేశడంటే ముందు గతంలో చేసిన నార్మల్ కేజ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేశాడు. సో రిజల్ట్స్ సేమ్ వచ్చాయి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ లో ఒక పెద్ద విశాలమైన కాంపౌండ్ తయారు చేశాడు. అందులో కేవలం ఒక్క ఎలుక మాత్రమే కాదు చాలా రాట్స్ ఉన్నాయి. ఆడ మగా ఉన్నాయి.
(02:43) ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయి. తినడానికి మంచి ఫుడ్ ఉంది పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది స్పేస్ ఉంది తోడు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాట్ కి కావలసిన ఒక డీసెంట్ లైఫ్ అనిపించే ఎన్విరన్మెంట్ ఉంది. సో ఆ రాట్ పార్క్ లో కూడా రెండు వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ప్లెయిన్ వాటర్ ఒకటి మార్ఫిన్ వాటర్ ఒకటి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ఎలుకలు మార్ఫిన్ వాటర్ నే దాదాపుగా తాగలేదు.
(03:08) అవి ప్లెయిన్ వాటర్ ని ఎంచుకున్నాయి అక్కడ డ్రగ్ అవైలబుల్ గా ఉన్నా కూడా వాటికి ఆ అవసరం అనిపించలేదు. అంతేకాదు అలెగ్జాండర్ ఒక స్టెప్ ముందుకవేసి స్వేచ్ఛగా తిరిగే ఆ రాట్ పార్క్ లోని ఎలుకలని బయటకి తీసి మరలా బందీగా చిన్నగా ఉన్న కేజీలో 57 రోజుల పాటు ఉంచి డైలీ మార్ఫిన్ వాటర్ ఇచ్చాడు. వాటిని ఫోర్స్ గా వ్యసనపరులని చేశాడు.
(03:32) 58 వ రోజు ఇప్పుడు ఆ అడిక్ట్ అయిన రాట్స్ ని ఫ్రీ రాట్ పార్క్ లో వదిలేశడు. కొన్ని రోజులు అన్‌కంఫర్టబుల్ గా ఉన్నాయి విత్‌డ్రావల్ సింటమ్స్ ఉన్నాయి వాటికి కష్టంగా ఉంది. కానీ మెల్లిగా ఆ రాట్స్ కూడా ప్లెయిన్ వాటర్ వైపు మల్లాయి చివరికి డ్రగ్ ని వదిలేసాయి. సో దీన్ని బట్టి మనక ఏం అర్థమయింది ఏ వ్యసనానికైనా డ్రగ్ ఒక్కటే కారణం కాదు.
(03:58) కాజ్ వాతావరణంలో ఉంది కాజ్ కాంటెక్స్ట్ లో కూడా ఉంది. లైఫ్ కి మీనింగ్ ఉంటే మీ తోటి వారితో కనెక్షన్ ఉంటే డ్రగ్ కి పవర్ తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వియత్నాం వారి దగ్గరికి వద్దాం. వియత్నాం లో ఉన్న అమెరికన్ సోల్జర్స్ దాదాపు 20% హెరైన్ యూస్ చేస్తున్నారని తెలిసింది. నెంబర్ చాలా ఎక్కువే దాంతో గవర్నమెంట్ పానిక్ అయింది. ఆ సోల్జర్స్ అమెరికాకి తిరిగి వస్తే దేశమంతా వ్యసనపరులు అవుతారని భయపడింది.
(04:23) కానీ ఏం జరిగింది ఆ సోల్జర్స్ తిరిగి వచ్చారు. వాళ్ళలో చాలా తక్కువ మంది అంటే కేవలం 5% మంది మాత్రమే అమెరికాలో కూడా హెరైన్ కంటిన్యూ చేశారు. మిగతా 95% మంది వదిలేశారు. వాళ్ళు మళ్ళీ అడిక్ట్ అవ్వలేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మొదటి రాట్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఒక్కసారి బ్రెయిన్ కెమికల్ అడిక్ట్ అయిందంటే అది తిరిగి మామూలు స్థానానికి రాదు డ్రగ్ వదిలేయడం ఇంపాజబుల్ అవుతుంది.
(04:53) కానీ రియాలిటీలో ఏం జరిగింది దాదాపుగా సోల్జర్స్ అందరూ డ్రగ్ ని వదిలేశారు. ఎందుకంటే కాంటెక్స్ట్ మారింది. వియత్నాం లో వాళ్ళు ఏ సిచువేషన్ లో హెరాయిని తీసుకున్నారంటే రోజు చావు ముందు నిలుచొని ఫ్రెండ్స్ ని పోగొట్టుకొని ఎప్పుడు ఏ బుల్లెట్ వస్తుందో తెలియకుండా పేరెంట్స్ ని భార్య పిల్లల్ని వదిలేసి ఇంటికి వేల మైళల దూరంలో ఉంటూ ఒక మీనింగ్ లెస్ వార్ లో తీసుకున్నారు.
(05:16) ఆ పెయిన్ లో హెరైన్ అనేది ఒక ఎస్కేప్ ఇచ్చింది. బట్ అమెరికాకి తిరిగివచ్చాక ఫ్యామిలీ ఉంది, సేఫ్టీ ఉంది, ఫ్యూచర్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ కి మీనింగ్ ఉంది. సో ఇక్కడ డ్రగ్ తీసుకునే వాతావరణం లేదు దానికి అవసరం తగ్గిపోయింది. కానీ మిగతా 5% ఎందుకు కంటిన్యూ చేశారు ఎందుకంటే వాళ్ళు అమెరికాకి తిరిగి వచ్చినా కూడా వాళ్ళ కేజ్ అలానే కంటిన్యూ అయింది.
(05:43) పావర్టీ, ట్రోమా పార్ట్నర్ మోసం చేయడం బ్రోకెన్ రిలేషన్షిప్స్ నో సపోర్ట్ నో ఫ్యామిలీ సో వాళ్ళు తిరిగివచ్చినా సరే వాతావరణం మారలేదు డ్రగ్ మారలేదు లైఫ్ మారలేదు. సో ఇప్పుడు థెరపిస్ట్లకి సైంటిస్టులకి ఉన్న సవాల్ ఏంటంటే ఆ 5% డ్రగ్ అడిక్ట్స్ ని ఎలా మార్చాలి దీనికి నేటి థెరపిస్ట్ులు ఏం చెప్తున్నారంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే అడిక్ట్స్ ని బ్లేమ్ చేస్తారు.
(06:08) నువ్వు చాలా వీక్ అని నీకు బాధ్యత లేదని నువ్వు సుఖానికి మరిగిన జంతువు అని ఇలా రకరకాలుగా సొసైటీ నుంచి ఫ్యామిలీ నుంచి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. అలా జడ్జ్మెంట్ చేయడమే మొదటి తప్పు అంటున్నారు. ఎందుకంటే అలా జడ్జ్ చేయడం వల్ల వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు. బట్ షేమ్ అనే ఎమోషన్ చాలా స్పెసిఫిక్ గా పనిచేస్తుంది. నేను చెడ్డవాడినని నాకు ఏది చేత కదని వాళ్ళకి వాళ్లే బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి దూరంగా ఉంటారు.
(06:37) అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే షేమ్ అనేది ఒక పెయిన్ ఫుల్ ఎమోషన్ ఎప్పుడైతే వాడు షేమ్ ఫీల్ అవుతాడో వాడిలో ఒక పెయిన్ పుడుతుంది. ఆ పెయిన్ ని తీసేయడానికి మళ్ళీ డ్రగ్ వైపు వెళ్తాడు. అంటే షేమ్ ని యూస్ చేసి వ్యసనపరుని కంట్రోల్ చేయాలని చూస్తే వాడు ఇంకా వరస్ట్ గా తయారవుతాడు. ఇక్కడ ఫస్ట్ వాడి అడిక్షన్ కి రూట్ కనుక్కోవాలి.
(06:59) ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు వాడు చిన్నప్పటి నుండి అబ్యూస్ చూశడు ఫాదర్ తాగుతాడు మదర్ ని ప్రతిరోజు కొడతాడు వాడు స్కూల్లో ఫెయిల్ కాలేజీలో ఫెయిల్ జాబ్ లేదు ఫ్రెండ్స్ లేరు పార్ట్నర్ లేదు. వాడు బ్రతుకు ప్రతిరోజు ఒక నిర్జీవమైన పెయిన్ఫుల్ ఎగ్జిస్టెన్స్ సో ఒకరోజు ఒకడు వచ్చి వాడికి డ్రగ్ ఇచ్చాడు. అది తీసుకున్న తర్వాత ఆ రెండు గంటలు పెయిన్ లేదు యంజైటీ లేదు ఒక వార్మ్ సేఫ్ అనుభవం మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనిపించింది.
(07:30) చివరికి దానికి అడిక్ట్ అవుతాడు. ఇక్కడ డ్రగ్ తీసుకోవడం వీక్ అవ్వడం కాదు వాడిది వీక్ క్యారెక్టర్ కూడా కాదు ఆ మూమెంట్ లో వాడి పరిస్థితికి అది ఒక రిలీఫ్ సో వ్యసనపరుడిని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. వాడి రూట్ తెలుసుకోవాలి వాడి కేజ్ గురించి తెలుసుకోవాలి తర్వాత ఆ కేజ్ ని మార్చాలని చెప్పాలి. నువ్వు ఉండే వాతావరణం నిన్ను చాలా ఇంపాక్ట్ చేస్తుంది.
(07:52) అండ్ ఒక మనిషికి కనెక్షన్ ఇవ్వడం ఒక రిలేషన్ ఉండడం, ఒక కమ్యూనిటీ, ఒక పర్పస్ ఒక సేఫ్ ప్లేస్ ఇవన్నీ ఒక వ్యసనపరుడిని మార్చగలవు. ఫర్ ఎగ్జాంపుల్ 2001 లో పోర్చుగల్ దేశం ఒక రాడికల్ డిసిషన్ తీసుకుంది. అన్ని డ్రగ్స్ ని డీ క్రిమినలైజ్ చేసింది. వ్యసనపరుల్ని జైల్‌కి పంపడం మానేసి బదులుగా వాళ్ళకి జాబ్ ట్రైనింగ్, హౌసింగ్, థెరపీ, కమ్యూనిటీ సపోర్ట్ ఇచ్చింది.
(08:19) చివరికి రిజల్ట్స్ ఏంటంటే డ్రగ్ యూస్ దాదాపు సగానికి తగ్గింది. ఇక్కడ డ్రగ్ మారలేదు లా మారింది. అంతే లైఫ్ కూడా మారింది. సో ఈ పాడ్‌కాస్ట్ ఎవరికి అప్లై అవుతుంది? కేవలం డ్రగ్ అడిక్స్ కి మాత్రమేనా కాదు నీకు నాకు మనందరికీ మనందరిలో ఏదో ఒక డ్రగ్ ఉంది ఫోన్ స్క్రోల్ చేయడం జంక్ ఫుడ్ తినడం ఫోన్ చూడడం ట్రోల్స్ ఎంజాయ్ చేయడం కోపంతో మాట్లాడడం వర్క్ లో కూరుకుపోవడం ఇలా ఏదైనా సరే ఒక నొప్పి నుండి ఒక శూన్యం నుండి ఎస్కేప్ కోసం మనం ఏదో ఒకటి యూస్ చేస్తాం.
(08:53) స్కేల్ వేరే అయినా మెకానిజం సేమ్ ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఆల్కహాల్ తీసుకునే వాడిని బ్యాడ్ అని షుగర్ తినేవాడిని అసలుఏమ అనకపోవడం లాంటిది మన ఈ అలవాట్లు ఆ తర్వాత వ్యసనాలుగా మారుతాయి. సో ఫైనల్ గా సొల్యూషన్ ఒక్క లైన్ లో చెప్పాలంటే ప్రాబ్లం డ్రగ్ కాదు నువ్వు ఉంటున్న కేజ్
No comments:
Post a Comment