Monday, March 16, 2026

 *భగవన్నామం సకల దుఃఖనివారిణి.

*ఎట్టి ఉపాయమూ తోచని స్థితిలో మనసు నిండుగా భగవంతుని తలచి చూడండి, ఏదో ఒక రూపంలో పరిష్కారము అనుగ్రహించడం తప్పక అనుభవంలోకి వస్తుంది. 

*ఇంకా వేకువనే లేచి భగవంతుని స్మరించుట వలన ఆ దినమంతయూ శుభమే జరుగుతుంది. 

*సాధన చిన్నగా అనిపించవచ్చు కానీ పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. 

*పెద్ద అరణ్యములో త్రోవ చూపుటకు చిన్న దీపం చాలు కదా!

*అలాగే మన జీవితానికి సరైన త్రోవ చూపుటకు భగవన్నామ స్మరణ అనే చిన్న సాధన చాలును. 

*దీనికి తోడు సేవ అనేది మనము ప్రయాణించిన త్రోవను శుభ్రం చేయుటకు సహకరిస్తుంది. 

*కలియుగములో మానవజన్మ సార్ధకతకు, మోక్ష సాధనకు అతి సులువైన మార్గం ‘భగవన్నామస్మరణ- దీన జనసేవ'యే!

*నేటి పరిస్థితుల్లో వీటికి మించి సులువైన ఉపాయం మరొకటి లేనేలేదని చెప్పాలి.
.     

No comments:

Post a Comment