నేటి మంచి మాట
అందర్నీ విమర్శించేవారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు కానీ ఇతరులను సరదాగా పలకరించే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు.
కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టే వారి కంటే నెట్టేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చే వారి కంటే ఏ మార్చే వారే ఎక్కువ ఈ లోకంలో.
తండ్రికి భారం కాకుండా నీ కాళ్లపై నువ్వు నిలబడే ప్రయత్నంలో ఉండటం బ్రహ్మచర్యం. నీవు నీ కాళ్ళపై నిలబడి కుటుంబాన్ని నడపటం గృహస్తం. కొడుకు పెళ్లి చేయగానే కోడలి చేతికి స్వచ్ఛంద విరమణ పొందటం వాన ప్రస్తం. కొడుకు కోడలు అడిగితే తప్ప సలహా ఇవ్వకూడదని వ్రతం పెట్టి సకల వ్యవహారాలకు సాక్షిగా ఉండటం సన్యాసం.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment