Tuesday, April 28, 2026

ప్రాపంచిక స్థితిగతులతో ఉన్న నేను " సత్యం " కాదు. Your true nature is beyond reasoning

ప్రాపంచిక స్థితిగతులతో ఉన్న నేను " సత్యం " కాదు. Your true nature is beyond reasoning

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TVIsdY5XW_8



Transcript:
(00:03) నీ నిజస్థితిని మీరు దేవుడు అనే అంశంతోటి గురువు అనే అంశంతోటి ప్రాపంచికం అనేటువంటి అంశంతోటి స్థితిగతులు అనేటువంటి అంశంతోటి మరలా చెప్తున్నాను మీరు ఏర్పరచుకున్నటువంటి బంధము భయము అనేటువంటి అంశాలతోటి ధర్మమ అనేటువంటి అంశంతోటి క్రమశిక్షణ అనేటువంటి అంశంతోటి దాన్ని మీ నిజస్థితిని మీరంతా పూర్తిగా విధ్వంస పరుచుకుంటున్నారు మీ రియల్ నేచర్ ఏవైతే ఉందో నీ సహజమైనటువంటి జీవనం ఏదైతే ఉన్నదో అది అది సమృద్ధివంతంగా ఉంది.
(00:35) నువ్వు ఎప్పుడైతే నీ నిజస్థితి కోసము నీ పరాయస్థితి కోసము నువ్వు ఎప్పుడైతే అంచనాలు వేయకుండా ఉంటావో నీ నిజస్థితి కోసము లేదా నీ పరాయస్థితి కోసము ఎప్పుడైతే నువ్వు ఆధారపడకుండా ఉంటావో అప్పుడు నీవు నీవుగా చాలా స్వయంగా ప్రకాశిస్తా ఉంటుంది. మీ అనుభవాన్ని మీరు ఇతరుల తాలకు అనుభవాలు లేదా ఇతరుల తాలకు అభిప్రాయాలు లేదా ఆలోచనలతోటి మీ అనుభవాన్ని మీరు ఎప్పుడైతే అనుసంధాన పరుస్తారో సంబంధాన్ని ఏర్పరుస్తారో అప్పుడు మీరు మీరు కాకుండా మీకంటే భిన్నమైన వారిలా అది కూడా మీరే
(01:22) ప్రవర్తిస్తారు అంటున్నాను ఇది చాలా సున్నితమైన అంశం ఇది సాధనలకి తపస్సులకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది చర్చల యొక్క సారాంశానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది పూర్తిగా మీ నిజస్థితి యొక్క పరిపూర్ణమైనటువంటి సహజమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి మీ అంతరంగం యొక్క లోగర్భం యొక్క పరిపూర్ణమైన మహాస్పృహ అంటున్నాను నేను ఉండటము మీ ఉనికి యొక్క సహజ నైజము ఉండటము మీ ఉనికి యొక్క సహజ సౌందర్యము ఉండటము ఆ పరిపూర్ణమైన
(02:11) మహా తీవ్ర మౌనము యొక్క ఒక సహజ సిద్ధమైన మహా విస్తృతి అంటున్నాను నేను చాలా సహజంగా అర్థం చేసుకోవడము చాలా సహజంగా అర్థం చేసుకోవడము ఎక్కడ మీ కొనసాగింపు తీవ్రతరం అవుతుంది అనేటువంటి అంశాన్ని చాలా సహజ సిద్ధంగా చాలా సున్నితంగా మీకు మీరు చేరువయ్యేటువంటి ఆ క్రమంతో అనుసంధాన పరిచి అర్థం చేసుకోవడం
(02:56) అంటున్నాను మీరు చేయవలసింది అంటూ ఏమీ లేదు మీరు ఆచరించవలసింది అంటూ ఏదీ లేదు మీరు సంస్కరించవలసింది అంటూ ఏదీ లేదు ఇక్కడ ఏదైనా ఉంది అంటే అది పరిపూర్ణంగా మిమ్మల్ని మీరు యధాతదంగా అర్థం చేసుకోవడం ఒకటే ఉందంటున్నాను. ప్రతి ఒక్కరి స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సంఘపరమైనటువంటి విస్తృతిలోకి కొనసాగ కొనసాగబడుతున్నామ అంటున్నాను నేను మీరు చాలా నేరుగా ఉన్నారు
(03:44) మీరు చాలా సహజంగా ఉన్నారు మీరు చాలా సమృద్ధిగానే ఉన్నారు మీరు ఏర్పరచుకున్నటువంటి మీ నైతికత ఏదైతే ఉన్నదో మీరు ఏర్పరచుకున్నటువంటి మీ క్రమశిక్షణ ఏదైతే ఉన్నదో మీరు ఏర్పరచుకున్నటువంటి బంధము లేదా భయము ఏదైతే ఉన్నదో అదే మీ నిజ స్థితి నుంచి మిమ్మల్ని విభాగ పరుస్తుంది అంటున్నాను సహజంగా ఉండటం అనేటువంటిది అది సామాజిక బాధ్యతకు సంబంధించినటువంటి అంశం కాదు అంటున్నాను.
(04:28) సహజత్వం అనేటువంటిది సామాజిక బాధ్యత కాదు అంటున్నాను. సహజత్వానికి ఏ విధమైనటువంటి సామాజికత అనేటువంటి అంశము లేదు అంటున్నాను. ఒక్కటిగా ఉండటము పూర్తి ఒక్కటిగా ఉండటము సంస్థితమ అవ్వడము సంసిద్ధంగా ఉండటము ఈ రెండిటి యొక్క సంయోగ వియోగానికి సంబంధం లేకుండా
(05:19) ఏకమై సదా నీవు నీవుగా ఉండటం అంటున్నాను నేను మీ ప్రకటితము అది చాలా సహజ సిద్ధమైనది మీ ప్రకటితము అది చాలా సమృద్ధివంతమైనది ఆ ప్రకటితానికి దేశకాల స్థితిగతులు లేవంటున్నాను. మీరు మీ మీ సహజ సిద్ధమైనటువంటి ప్రకటితానికి మీరు మానసికమైనటువంటి సాంప్రదాయాన్ని లేదా మానసికమైనటువంటి కేవల దేహ పరిధితో ఏర్పరుచుకున్నటువంటి మానవీకమైనటువంటి సంస్కృతిని జోడించినప్పుడు మీరు విభాగం అయిపోతారు
(06:04) అంటున్నాను. ప్రతి లిప్తలోన మీ సంస్కృతిని జోడిస్తున్నారు అంటున్నాను ప్రతి లిప్తలోన మీ సాంప్రదాయాన్ని జోడిస్తున్నారు ప్రతి లిప్తలోని కూడా దానికి ఒక పూర్తి దృశ్య శబ్దాలతో కూడుకున్నటువంటి ఒక ఆకృతితోటే దాన్ని మీరు పరిశీలనతో చూస్తున్నారు అంటున్నాను నేను ఇది బోధించడానికి అవకాశం లేనటువంటిది ఇది అర్థం చేసుకోవడానికి ఏమాత్రము కూడా ఆ ప్రాధాన్యత లేనటువంటిది ఇది పూర్తిగా నీ అర్థం చేసుకునేటువంటి నైజం ఏదైతే ఉన్నదో దాని యొక్క సంస్కరణకు సంబంధించినటువంటిది కాదు అది పూర్తి ఆ
(06:51) విచ్చిన్నతకు సంబంధించింది అంటున్నాను అది విచ్చిన్నత యొక్క పరాకాష్ట అంటున్నాను బోధనలు బోధ యొక్క నైపుణ్యత అంది పుచ్చుకోవాలనేటువంటి నైజము ఆ తీర్చి దిద్దుకోవాలనేటువంటి ప్రాధాన్యత నిరంతరమైనటువంటి వ్యక్తిగత పోరాట ప్రతిమ
(07:40) ఇది నిన్ను ఇప్పుడు ఇక్కడ ఇలా పూర్తిగా విభాగ పరుస్తున్నాయి అంటున్నాను. వ్యక్తిత్వానికి ఎక్కడా ఉనికి లేదు సంకల్పానికి ఎక్కడా ఉనికి లేదు సంకల్పానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు సంకల్పం అనేటువంటిది ఏకకాలంలో విజృంభించి ఏకకాలంలో తన ఉనికిని చాటుకొని ఏకకాలంలో నిష్క్రమించేటువంటి అంశము దానికి మీ అనుభవాలని జోడించినప్పుడు మీ ప్రాధాన్యతలతోటి దాన్ని కలుపుకున్నప్పుడు అది సుదీర్ఘమైనటువంటి తన విస్తరణను
(08:25) చాటుకుంటుంది అంటున్నాను నేను అసలు పాజబిలిటీ లేదు ఆ పాసిబిలిటీ లేని దాన్ని కేవలము మన వ్యక్తిగత సంస్కృతి మన శారీరకమైనటువంటి సంస్కృతి కేవలము లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి సంస్కృతి తనకంటే భిన్నముగా అన్యముగా ఏదో ఒకటి ఉంది దాన్ని గుర్తించడము దాన్ని పరిశీలించాలనేటువంటి సంస్కృతి మానసికతతో సృష్టించుకున్న ఏర్పరచుకున్నటువంటి దైవము లేదా గురువు లేదా ప్రాపంచము
(09:14) అనేటువంటి సంస్కృతి ప్రతి లిప్తలోనూ మీ నిజస్థితి యొక్క ఆ సహజత్వాన్ని నేరుగా అడ్డుకుంటుంది అంటున్నాను నేను ఇక్కడ మీరు పూర్తిగా అవగాహన పరుచుకోవాల్సిందే ఉంది తప్ప ఆ అవగాహన పరుచుకొని ఆ అవగాహన నుంచి కూడా విడుదల పొందవలసినటువంటిదే ఉంది తప్ప అర్థం చేసుకుందాం అనేటువంటి పరిపక్వత నీ నిజ స్థితి నుంచి నిన్ను విభాగ పరుస్తుంది అంటున్నాను నేను వాస్తవానికి నీకు ఎటువంటి సామాజిక బాధ్యత
(09:58) లేదంటున్నాను. నీకు ఎటువంటి సామాజిక పరమైనటువంటి నైతికత లేదంటున్నాను అసలు నీకు సామాజిక పరమైనటువంటి క్రమమైనటువంటి శిక్షణ లేదంటున్నాను మీరంతా మీరు కానితనాన్ని అలవరుచుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ప్రతి లిప్తలోన విధ్వంస పరుచుకుంటూ వినాశనాన్ని సృష్టించుకుంటూ లేని దుఃఖంతో మమేకమై పరిపూర్ణమైన పతనానికి సంసిద్ధమవుతూనే ఉన్నారు అంటున్నాను
(10:47) మీరు ప్రతి లిప్తని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు ఇది మీ సహజత్వానికి ఆ పూర్తి పెనుముప్పు అంటున్నాను మీరు అలసట వచ్చింది ఆ అలసట నుంచి నిష్క్రమణను కోరుకోవడం కోసం ఆనందాన్ని రీప్లేస్ చేస్తున్నారు అంటున్నాను నేను దుఃఖాన్ని తీసి ఏం రీప్లేస్ చేస్తున్నారు అంటే ఆనందాన్ని రీప్లేస్ చేస్తున్నారు దేవుని రీప్లేస్ చేసి ఏం చేస్తున్నారు అంటే గురువుని అక్కడ గురువుని
(11:33) పెడుతున్నారు గురువుని రీప్లేస్ చేయాలనేటువంటి క్రమం తోటి ఇంకొక గురువుని పెడుతున్నారు అంటున్నారు ఒకరు మీకు నచ్చలేదు అనిఅంటే దాన్ని రీప్లేస్ చేసి మీకు అనుకూలమైనటువంటి వర్గాన్ని అక్కడ తీసుకొచ్చి అక్కడ చేరుస్తున్నారు అంటున్నాను నేను ప్రతిది రీప్లేస్మెంట్ే జరుగుతుంది వాస్తవికత రీప్లేస్మెంట్ లేదు అంటున్నాను నేను వాస్తవికతకి ఎలాంటి రీప్లేస్మెంట్ లేదు అంటున్నాను నేను మీ నిజమైన నైజము అది రీప్లేస్మెంట్ కి సంబంధించింది కాదు అంటున్నాను ప్రతిదాన్ని మనం ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా దాని స్థాయిలో ఇంకొక దాన్ని రీప్లేస్
(12:17) చేస్తున్నాం అంటున్నాను నీ నిజస్థితి అలా లేదు నీ నిజస్థితి అది చాలా సహజంగా ఉంది. నీ నిజస్థితిని మీరు దేవుడు అనే అంశంతోటి గురువు అనే అంశంతోటి ప్రాపంచికం అనేటువంటి అంశంతోటి స్థితిగతులు అనేటువంటి అంశంతోటి మరలా చెప్తున్నాను మీరు ఏర్పరచుకున్నటువంటి బంధము భయము అనేటువంటి అంశాలతోటి ధర్మమ అనేటువంటి అంశంతోటి క్రమశిక్షణ అనేటువంటి అంశంతోటి దాన్ని మీ నిజస్థితిని మీరంతా పూర్తిగా విధ్వంస పరుచుకుంటున్నారు మీ రియల్ నేచర్ ఏదైతే ఉందో నీ సహజమైనటువంటి జీవనం ఏదైతే ఉన్నదో అది అది సమృద్ధివంతంగా ఉంది
(13:01) నువ్వు ఎప్పుడైతే నీ నిజస్థితి కోసము నీ పరాయస్థితి కోసము నువ్వు ఎప్పుడైతే అంచనాలు వేయకుండా ఉంటావో నీ నిజస్థితి కోసము లేదా నీ పరాయస్థితి కోసము ఎప్పుడైతే నువ్వు ఆధారపడకుండా ఉంటావో అప్పుడు నీవు నీవుగా చాలా స్వయంగా ప్రకాశిస్తావు అంటున్నాను నేను

No comments:

Post a Comment