Tuesday, April 28, 2026

పిల్లాలకు అడ్వైస్ ఇచ్చే ముందు ఇది గుర్తుంచుకోండి! | Shiva Chandana | Square Talks

పిల్లాలకు అడ్వైస్ ఇచ్చే ముందు ఇది గుర్తుంచుకోండి! | Shiva Chandana | Square Talks

Author Name:Shiva Chandana

Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k23RtKDLf2Y



Transcript:
(00:13) హలో నేను చందన ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. అది ఏంటంటే సహజంగా పేరెంట్స్ పిల్లలకి ఏదైనా అడ్వైస్ ఇచ్చినప్పుడు మా పిల్లలు వినట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట. ఇది ఎందుకు అని మనం గనక ఆలోచిస్తే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కనిపిస్తాయి వాళ్ళు అసలు పూర్తిగా వినను కూడా వినట్లేదు లేదంటే మాట్లాడటం మొదలు పెట్టిన వెంటనే వాళ్ళు కౌంటర్ మాట్లాడేస్తూ ఉన్నారు లేదంటే మాకుేమి తెలీదు అంటారు ఇలా రకరకాలుగా పేరెంట్స్ చెప్తూ ఉంటారున్నమాట అంటే వాళ్ళు వినకపోవడాని గురించి వాళ్ళు ఆ టైంలో ఫేస్ చేసే సిచువేషన్స్ గురించి వాళ్ళు
(00:49) ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది మనం గనుక ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ప్రాబ్లం ఎప్పుడూ కూడా మాటల్లో ఉండదు అంటే మీరు ఏం చెప్తున్నారు అనే మాటల్లో కంటే ప్రాబ్లం ఎక్కువగా ప్రాబ్లం ఎక్కువ వచ్చేది ఎక్కడ అంటే పేరెంట్స్ చెప్పే టైమింగ్ అన్నమాట అంటే ఎప్పుడు పేరెంట్స్ చెప్తున్నారు అడ్వైస్ ఎప్పుడు ఇస్తున్నారు ఇది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసే ఏరియా అంటే ఏం చెప్తున్నాము అనేదే మోస్ట్లీ కన్సిడర్ చేస్తారు తప్ప తప్ప ఎప్పుడు చెప్తున్నాము
(01:28) అన్నది చాలాసార్లు పేరెంట్స్ ఏంటంటే ఓవర్లుక్ చేసేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే సహజంగా మనం టీనేజర్స్ లేదా పిల్లల నీడ్ తీసుకుంటే ఎస్పెషల్లీ టీనేజర్స్ లో వాళ్ళ నీడ్ ఏంటంటే నేను చెప్పేది ఒకళ్ళు వినాలి. నేను పిల్లలైనా అంతే అనుకుంటారు నేను మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు నన్ను వినాలి నేను చెప్పేది అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారున్నమాట బట్ రియాలిటీలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే అడల్ట్స్ ఎవరైతే ఉంటారో అది వింటున్నారో వాళ్ళకి విషయం అంతా అర్థంయపోతుంది.
(02:06) సో బేసిక్ గా వాళ్ళు ఏం చేస్తారు ఎలాగో విషయం అర్థమయింది కదా సో నేను చెప్పి టైం సేవ్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారున్నమాట. ఇక్కడ పేరెంట్స్ బాగా మిస్ అయ్యే విషయం ఏంటంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మిస్ అవుతూ ఉంటారు పిల్లలు ఏం కోరుకుంటున్నారు అనేది మిస్ అవుతూ ఉంటారు. పిల్లలకి ఏం కావాలి వాళ్ళు చెప్పేది పేరెంట్స్ లేదా అడల్ట్స్ వింటం కావాలి.
(02:31) బట్ ఇక్కడ రియాలిటీలో ఏమవుతుంది మీరు వాళ్ళు చెప్పేది కొంత అర్థమయిన వెంటనే పేరెంట్స్ చెప్పడం స్టార్ట్ చేసేస్తూ ఉంటారున్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నా మాట ఎవరు వినట్లేదు నేను చెప్పేది ఇంపార్టెంట్ గా ఎవరు కన్సిడర్ చేయట్లేదు అనేదే అనిపిస్తుంది తప్ప వాళ్ళు నాకోసం చెప్తున్నారు అనేది ఆలోచించలేకపోతారు అన్నమాట సహజంగా ఆ టైంలో పిల్లలు ఏం ఫీల్ అవుతారు అంటే నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని ఫీల్ అవుతారు అంటే నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పుకోలేను.
(03:09) ఇది నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే చోటు కాదు అని ఫీల్ అవుతుంటారు అన్నమాట. నెక్స్ట్ టైం వాళ్ళు ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరికైతే ఆల్రెడీ ఈ ఫీలింగ్ డెవలప్ అయిపోయి ఉంటుందో వాళ్ళు వినడం కూడా ఆపేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ కి పిల్లలకి మధ్య గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. దాంతో పాటు పిల్లలు ఏం ఫీల్ అవుతుంటారు అంటే నన్ను పేరెంట్స్ పాయింట్ అవుట్ చేస్తున్నారు లేదా విమర్శిస్తున్నారు అని ఫీల్ అవుతారు అన్నమాట.
(03:34) నిజానికి అక్కడ విమర్శిస్తున్నారా అని ఆలోచిస్తే గనుక నిజానికి పేరెంట్స్ కి విమర్శించే ఉద్దేశం గానీ వాళ్ళని పాంట్ అవుట్ చేసి వాళ్ళని ఏదో బాధ పెట్టాలన్న ఉద్దేశం గానీ ఉండదన్నమాట కానీ ఆ టైంలో మీరు చెప్తున్నప్పుడు వాళ్ళకి వెంటనే ఏమనిపిస్తుందంటే ఇది ఒక విమర్శ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఏంటి నేను చెప్పేది పూర్తిగా వినకుండానే వీళ్ళు చెప్పేయడం స్టార్ట్ చేశారు కదా అంటే వాళ్ళు వేరే వాళ్ళ సైడ్ తీసుకున్నారు.
(04:02) నాది పూర్తిగా వినలేదు నా వర్షన్ పూర్తిగా తెలియకుండానే మాట్లాడటం మొదలు పెట్టారు కాబట్టి వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు లేదా పాయింట్ అవుట్ చేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుంటారు తప్ప పేరెంట్స్ కి విషయం అర్థమయింది. నేను చెప్పకపోయినా వాళ్ళు అట్రిబ్యూట్ చేశారు.
(04:24) నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం చేసుకునే అవకాశం తగ్గిపోతుంది అన్నమాట అండ్ దాంతో పాటు పిల్లలు ఫీల్ అయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దాన్ని ఒక లెక్చర్ గా ఫీల్ అవుతారు అంటే ఇప్పుడు సహజంగా మనం ఫార్మల్ స్ట్రక్చర్ తీసుకుంటే స్కూల్స్ లో గాని కాలేజెస్ లో కానీ క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లలు వింటూ ఉంటారు. అంటే మొత్తం అయిపోయాక లాస్ట్ లో డౌట్స్ అడుగుతుంటారు.
(04:48) సో అలా ఎలా అయితే ఉందో పిల్లలు ఏం ఫీల్ అవుతారంటే మీరు చెప్పడం స్టార్ట్ చేసిన టైంలో వీళ్ళు నాకు క్లాస్ ఇస్తున్నారు ఒక లెక్చర్ ఇస్తున్నారు. నా డౌట్స్ ఏవైతే ఉన్నాయో లేదా నా ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగినప్పుడే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప నేను ఓపెన్ గా ఒక కాన్వర్సేషన్ లాగా ఇది నడవట్లేదు. ఎప్పుడైతే ఇదొక లెక్చర్ లేదా ఒక క్లాస్ అన్న ఫీలింగ్ వస్తుందో పిల్లలకి వెంటనే ఒక పేరెంట్ చైల్డ్ బాండ్ నుంచి వాళ్ళు వెంటనే ఒక టీచర్ స్టూడెంట్ బాండ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట సహజంగా చూడండి టీచర్స్ తో కంటే సహజంగా పిల్లలు పేరెంట్స్
(05:31) తో ఎక్కువ క్లోజ్ ఉంటారు ఎక్కువ చెప్పుకుంటారు అంటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ రియల్ లైఫ్ కి సంబంధించి కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉన్న విషయాలు కానివ్వండి అవన్నీ పేరెంట్స్ దగ్గర చెప్పుకోవడానికి ట్రై చేస్తారన్నమాట టీచర్స్ దగ్గర అన్నీ చెప్పరు అంటే వాళ్ళఎంత ఎంత క్లోజ్ గా ఫీల్ అయినా వాళ్ళ దగ్గర చెప్పలేకపోతారు.
(05:51) ఎప్పుడైతే పేరెంట్ టీచర్ రోల్ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్ పిల్లలకు కలుగుతుందో వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు నాకు పేరెంట్ కాదు. సో వీళ్ళు చెప్పింది నేను వినాలి తప్ప నేను చెప్పడానికి ఇక్కడ ఏం లేదు వాళ్ళు ఒక అథారిటేటివ్ పర్సన్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నన్ను వినట్లేదు నాకేం తెలియదు అనుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట.
(06:16) ఈ మూడు కేసెస్ లో ఏవైతే ఉన్నాయో ఫ్రీడమ కోల్పోతున్నాము అని ఫీల్ అవ్వడం గానీ లేకపోతే నన్ను ఎవరు వినట్లేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు లేదంటే నన్ను ఒక నాకు ఒక లెక్చర్ ఇచ్చినట్టుగా పేరెంట్స్ బిహేవ్ చేస్తున్నారు ఇలా రకరకాలుగా పిల్లలు అనుకుంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వెంటనే వినడం ఆపేస్తారు అండ్ అడ్వైస్ ని తీసుకోరన్నమాట అది ఎంత మంచి విషయమైనా మీరు చెప్పింది వాళ్ళకి లాజికల్ గా తర్వాత కన్విన్సింగ్ గా అనిపించినా కూడా తీసుకోరు చాలామంది ఇక్కడ పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు.
(06:47) వాళ్ళకు అర్థమైంది కదా అర్థమైనా కూడా ఎందుకు మొండిగా చేస్తున్నారు వాళ్ళకు అర్థమయింది బట్ అక్కడ వాళ్ళ ఈగో ఏదైతే ఉందో అది హర్ట్ అయింది అన్నమాట అంటే నన్ను వినకుండానే వీళ్ళు సలహా ఇచ్చేసారు అని పిల్లలు ఫీల్ అవుతుంటారు కాబట్టి మీరు ఇచ్చింది వాళ్ళకి నిజము అని అనిపించినా కూడా మీకు కౌంటర్ గా బిహేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఏంటంటే వెంటనే కౌంటర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు.
(07:15) సహజంగా ఏంటి మీరు ఎలా ఉండాలి ఏం చేయాలి పిల్లలు సహజంగా ఇంటికి రాగానే బ్యాగ్ సర్ది ఒక దగ్గర పెట్టుకోవాలి హోం వర్క్ చేయాలి అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు మీరు వెంటనే హోమ వర్క్ గుర్తు చేశారంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అప్పటివరకు వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం ఉంటుంది. బట్ పేరెంట్స్ చెప్పారు కాబట్టి నన్ను వినకుండా వీళ్ళు వెంటనే నేను ఏం చేయాలో చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు హోం వర్క్ చేయకూడదు అని అనుకుంటారున్నమాట.
(07:41) వెంటనే ఆడుకోవటం ఉంది లేదంటే నేను కాసేపు టీవీ చూస్తాను ఫోన్ తీసుకుంటాను ఇలా రకరకాలుగా మీరు మీరు చెప్పింది కాకుండా మిగతావన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా ఉన్నప్పుడు సహజంగా పేరెంట్స్ ఏం చేయాలి మరి అలా అని వదిలేస్తామా చెప్పాలి కదా చెప్పాలి కాకపోతే ఎప్పుడు అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి.
(08:03) దానిలో ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది వినడం వాళ్ళ వర్షన్ మొత్తం వాళ్ళని చెప్పనివ్వాలి పిల్లలు చెప్దాం అనుకున్నదంతా చెప్పాక అప్పుడు మాట్లాడటం మనం స్టార్ట్ చేస్తే అడల్ట్ గా వాళ్ళు కొంత కన్విన్స్ అవుతారున్నమాట అంటే నేను చెప్పిందంతా పేరెంట్ విన్నారు కాబట్టి ఓకే మనం కూడా కొంచెం సేపు విందాము వాళ్ళ వర్షన్ ఏంటో వాళ్ళు చెప్పనిద్దాము అని వాళ్ళు అనుకుంటారు.
(08:30) అలా కాకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే మనం వెంటనే వాళ్ళని కరెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వెంటనే కౌంటర్ అవుతారు తప్ప మనం చెప్పేది వాళ్ళకి ఎంత లాజికల్ గా తర్వాత కన్విన్సింగ్ గా అనిపించినా కూడా మనం చెప్పాం కాబట్టి చేయకూడదు అని చెప్పి కౌంటర్ గా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వర్షన్ మొత్తం వాళ్ళని చెప్పనివ్వాలి.
(08:53) తర్వాతే మనం మాట్లాడటం స్టార్ట్ చేయాలి. అప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆ టైంలో పిల్లలు ఏదైతే చెప్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళకి చాలా నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే బాగా కోపంతో చెప్పేయడం లేదా బాగా ఏడుస్తూ చెప్పడం ఇలా నెగిటివ్ ఎమోషన్స్ తో లేదా బాగా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్ గా చెప్తూ ఉంటారు.
(09:17) అలా వాళ్ళు చాలా హై ఎమోషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కాన్వర్సేషన్ ముఖ్యమైన విషయాలు పిల్లలతో చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇన్ జనరల్ ఏంటంటే పేరెంట్స్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు కదా లేదంటే ఇప్పుడు బాధపడుతూ నన్ను అడ్వైస్ అడిగారు కదా అని చెప్పి వాళ్ళు ఒక హై ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు.
(09:40) బట్ రియాలిటీలో ఏమవుతుందంటే ఆ ఎమోషన్ వాళ్ళకి తగ్గిపోగానే మీరు చెప్పిన విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారున్నమాట. సో పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా స్టేబుల్ గా ఉన్నారు అని అనుకున్న తర్వాతే చెప్పాలి. అలా కాకుండా మళ్ళీ ఎమోషనల్ గా హై లో ఉన్నప్పుడు లేదా లో లోలో ఉన్నప్పుడు అడిగారు కదా అడ్వైస్ అని చెప్పి పేరెంట్స్ చెప్పేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఆ క్షణానికి వాళ్ళక అది చేద్దామనే అనిపిస్తుంది.
(10:06) బట్ ఆ ఎమోషన్ తగ్గగానే మీరు చెప్పిన విషయము మర్చిపోతారు వాళ్ళు అడిగింది మర్చిపోతారు చేద్దామన్న ఉద్దేశము అప్పుడు వాళ్ళకి ఉండదున్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా టైమింగ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఎప్పుడు చెప్తున్నాము ఫస్ట్ వాళ్ళు చెప్పేదంతా విన్న తర్వాత మనం మాట్లాడటం స్టార్ట్ చేయాలి. అండ్ దాంతో పాటు మాట్లాడటం కూడా వాళ్ళ ఎమోషన్స్ కంప్లీట్ గా డౌన్ అయ్యాయి అన్న కన్ఫర్మేషన్ వచ్చాకే మాట్లాడటం స్టార్ట్ చేయాలి.
(10:36) వీటన్నిటితో పాటు ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం పేరెంట్స్ ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఎప్పుడూ కూడా అనుకరణ ద్వారా నేర్చుకుంటారు అంటే చూసి నేర్చుకుంటూ ఉంటారున్నమాట ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూసి నేర్చుకుంటారు కాబట్టి వీలైనంతవరకు వాళ్ళలో ఏదైతే మనం కోరుకుంటున్నామో అది మనలో ఉంది అన్నది అది వాళ్ళ కమ్యూనికేట్ అయ్యేలా చేయాలి.
(11:06) ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్ ఉన్నారు వాళ్ళ పిల్లలు రోజు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. చేయాల్సింది ఏంటంటే మీ డైట్ ప్లాన్ ఏదైతే ఉందో మీరు దాన్ని పిల్లలతో డిస్కస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకు మీరు హెల్దీ ఫుడ్ ని ఆప్ట్ చేసుకుంటున్నారు ఎందుకు హెల్దీగా తింటున్నారు అన్నది వాళ్ళు గమనించేలా మీరు చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళక ఒక క్యూరియాసిటీ వస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట మెల్లగా వాళ్ళకి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఓకే డాడీ లేదా మమ్మీ ఫుడ్ అనేది ఈ మధ్య ఆల్టర్ చేశారు డిఫరెంట్ గా తింటున్నారు వాళ్ళు
(11:45) టైమింగ్ సెట్ అయ్యాయి ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అంతకుముందులా కాకుండా ఒక టైం కి లంచ్ గాని డిన్నర్ గాని చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ ఒక టైం కి చేస్తున్నారు అన్నది వాళ్ళు అబ్సర్వ్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో అడుగుతారు అన్నమాట. ఆ అడిగినప్పుడు మీరు అప్పుడు మాట్లాడితే ఏంటంటే కొంత వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
(12:11) అలా కాకుండా నువ్వు ఇలా చేయాలి ఇలా వినాలి అని చెప్పినప్పుడు ఏంటంటే వెంటనే వాళ్ళు వేరే ఏదో ఒక విషయం తీసుకొచ్చి మీరు ఈ విషయంలో ఇలా ఉండట్లేదు కదా లేదా అన్నయనో తమ్ముడినో ఇలా చెప్పలేదు కదా అక్కని చెల్లిని అనట్లేదు కదా నాకే ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు అలా ఉంటే మాట్లాడట్లేదు కదా ఆ విషయంలో వదిలేశారు కదా ఇలా వాళ్ళు వేరే విషయాలు తీసుకొచ్చి మాట్లాడటం స్టార్ట్ చేస్తారుఅన్నమాట సో బెటర్ ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా పేరెంట్స్ లీడ్ చేసినప్పుడు పిల్లలు ఎక్కువ కన్విన్స్ అవుతారు.
(12:45) మాటల ద్వారా కంటే యక్షన్ ద్వారా చేసేది చాలా స్ట్రాంగ్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఈ మెథడ్స్ ఫాలో అయితే ఏంటంటే బెటర్ గా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినాలి అండ్ మీరు మాట్లాడదాం అనుకున్నప్పుడు ఏ టైమింగ్ లో మనం మాట్లాడుతున్నాము వాళ్ళ ఎమోషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి అనేది కన్సిడర్ చేసి మాట్లాడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చెప్పేది ఏదైతే ఉందో అది మీ బిహేవియర్ లో కూడా మీరు వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యేలా చేసినప్పుడు ఏంటంటే ఎక్కువగా పిల్లలు కన్విన్స్ అవుతారు అన్నమాట అమాట అప్పుడు మీరు చెప్పిన
(13:23) దానికంటే బెటర్ రిజల్ట్స్ వాళ్ళలో కనిపిస్తాయి అండ్ వాళ్ళ బిహేవియర్ లో కూడా మార్పు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు ఎంత ప్రాపర్ గా ఉన్నా మీరు ఎంత ట్రై చేస్తున్నా ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫాలో అయినా కూడా రిజల్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఏదన్నా ఇంటర్నల్ ఇష్యూ ఉందా వాళ్ళు ఏదనా విషయంతో సఫర్ అవుతున్నారా లేదా పర్సనాలిటీలో డిఫరెంట్ గా ఫామ్ అయిపోయిందా వాళ్ళకి అలాంటివి ఏదైనా ఉన్నాయా అని చెప్పి గైడెన్స్ మీరు తీసుకున్నట్లయితే మీ కిట్ కి సంబంధించి వాళ్ళు పర్సనల్ గా ఫోకస్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ లో బెటర్
(14:02) అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్ గా పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలక ఎప్పుడూ కూడా సలహాలు అక్కర్లేదు పేరెంట్స్ నుండి సహకారం కావాలి. సహకారం దొరికినప్పుడు మీరు సలహా ఇచ్చిన దానికంటే బెటర్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment