Tuesday, April 28, 2026

 *నిత్య జీవితంలో - గాయిత్రి ఆవశ్యకత - రక్షణ!!!*

     సకాలము న సంధ్యా వందనము నాచరించు పురుషుడు, సకలాభీష్టములనూ పొందును. 

గాయత్రీ మంత్రార్ధమును, చక్కగా  అర్ధము చేసికొనవలెను. 

బుధ్దిబలం, ఆత్మ శక్తి అభివృద్ధి అగుటకు, గాయత్రి ని సకాలంలో ఆశ్రయింప వలెను. 
    శరీరము వృధ్ధి అగుటకు ఆహారము ఎట్లు అవసరమో, అట్లే సూర్యుని తేజము భావనా రూపముగా, గాయత్రీ మంత్రముతో, మన శరీరము మందుండు తేజో స్థలమునకు ఆకర్షించు కొనవలెను.

    సూర్యతేజమునకు దీపము అవసరము ఉండదు కదా! అట్లే గాయత్రీ మంత్రజపమువలన,  బ్రహ్మ తేజో బలము కలుగును. 

   ఇంద్రియ ముల యెుక్క ప్రాణశక్తిని, గాయత్రీ మంత్రము రక్షించును. 
   ఈపవిత్ర మంత్రమే, విశ్వామిత్రుని రాజ ఋషిని, బ్రహ్మ ఋషిగా చేసినది.
    సకలవిద్యలకూ ఈమంత్రమే  దాత, అట్టి వేదమాత తనను ప్రార్ధించువారలను రక్షించి సర్వాభీష్టములనొసగును. 

ధర్మసూత్రములందు, ఆ దేవతను ఎట్లు వర్ణింపబడినదో,వానిని అర్ధం చేసుకున్న ,ప్రత్యక్ష సాక్షిగా మనకు బోధపడగలదు. 
    తనను గానము చేయువానిని(అనగా స్మరించుట జపించుట, భజించుట, ప్రార్ధించుట) రక్షించునని, కావున గాయత్రి అనబడును. 
   అంతేకాని, ఒక ఆడ దేవతగా భావించరాదు, ఒక విశ్వ శక్తి గాయత్రి. 
   ఇట్టి శక్తి ని ప్రార్ధించి, ధ్యానించి, సనాతన ధర్మ కర్మలను పునరుద్ధరణ చేయవలెను... అప్పుడే మానవ జన్మకి సార్థకత.

               *_🌷శుభమస్తు.🌷_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.*

No comments:

Post a Comment