ఎవరినైనా నమ్మేముందు ఒకటికి పది సార్లు అనుమానించాలి # sunita's world # YouTube shots #
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aVxZMpopQl4
Transcript:
(00:00) ఎవరైనా మనం మర్చిపోవచ్చుండి లైఫ్ లో కానీ నమ్మక ద్రోహం ఉంటుంది చూసారా అది మాత్రం మనల్ని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది ఎవరైనా వ్యక్తి మనల్ని నమ్మించి నమ్మించి నమ్మించి మీరంటే ఇష్టము అని చెప్పి చెప్పి చెప్పి మిమ్మల్ని పొగిడి మీరు లేకపోతే వాళ్ళు లేమని చెప్పి చివరికి మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నామ అని చెప్పి లాస్ట్ లో మిమ్మల్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వదిలేసినప్పుడు మీ మనసు పడే వేదన అంతా ఇంతా కాదండి మీరు ఏదైనా మర్చిపోతారు కానీ ఈ నమ్మక ద్రోహం అనేది మనసులో ముళ్ళులాగా జీవితాంతం గుర్చుతూనే ఉంటుంది. ఎవరైనా నిజమైన వ్యక్తులు మన
(00:35) జీవితంలోకి వచ్చినా సరే అనుమానాస్పద స్థితితో మనం చూస్తూ ఉంటాం. ఇలా చూడాలి కూడా తప్పు లేదండి ఎందుకంటే మన పెద్దలు చెప్పారు కీడెం మేలంచమని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి గుడ్డిగా బ్లైండ్ గా వాళ్ళ మాటలు వినేసి మోసపోవడం పెద్ద గొప్పేమి కాదండి. ఒకసారి మోసం జరిగిన తర్వాత అటువంటి మోసం మళ్ళీ జరగకూడదు అన్న ఉద్దేశంతోటి ఉండాలి.
(00:57) మొఖము మొఖాలు చూసుకుంటాం కదా మనలో మనం ఏంటి చేస్తే చేసాడులే మోసం మనోడే కదా అని చెప్పేసి మీకు క్షమించడానికి పెద్ద మనసు ఉండవచ్చు ఇది కనుక మీరు ఇలానే చేస్తూన్నారు అనుకోండి మిమ్మల్ని చేసినట్టుగా 10 మందిని మోసం చేసేస్తూ ఉంటారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మోసం చేసే వ్యక్తులని మనమేమి పెద్ద మనసుతో క్షమించాల్సిన అవసరం లేదు అటువంటి వ్యక్తులని దూరంగా పెట్టండి రెండోసారి మీతో మాట్లాడటానికి ట్రై చేస్తే ఎంతవరకో అంతవరకు ఉండండి కానీ మళ్ళీ క్షమించేసి మనోడే కదా అని చెప్పేసి మీ తొక్కలో మంచితన తోటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్
(01:29) ఎందుకంటే చాలా మంది కూడా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు గాని ఏదైనా సరే డబ్బు కన్నా ఎక్కువ మనకి ఎమోషన్స్ వాటితో ఆడుకునే వాళ్ళని మాత్రం అసలు క్షమించకండి అట్లాంటి వాళ్ళని దరిచేరనివ్వకండి ఎమోషనల్ గా డ్రై అయిపోయాము మనం అందులో నుంచి కోలుకోవడం చాలా కష్టం. మన దైనందిన పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ఎమోషనల్ గా మనం బ్లాక్ అయినప్పుడు కాబట్టి మన మనసు దృడంగా ఉంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు మనల్ని మోసం చేయడానికి ట్రై చేయరు మనం స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళకి అర్థంయపోతూ ఉంటుంది అన్నమాట అలా అర్థంఅవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే ఎదుటి
(02:07) వ్యక్తుల్ని పుసుక్కున నమ్మేసి డమాల్ని పడిపోవటం అట్లా పడకూడదండి అనుమానించండి తప్పులేదు అనుమానం పెనుబోతం లాగా ఉండాల్సిన రోజులు అండి ఇవి ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేను సొంతవాళ్ళు బంధువులు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరైనా సరే మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి మోసాలను ఎదుర్కోవాలి అనింటే మనం చాలా అప్రమతంగా ఉండటం మాత్రమే ఏకైక పరిష్కారం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాంండి థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment