Tuesday, April 28, 2026

ఆట కాదు… కోట్ల దోపిడి! IPL వెనుక నిజం ఇదే | Why Rich People Are Crazy About Buying IPL Teams!

ఆట కాదు… కోట్ల దోపిడి! IPL వెనుక నిజం ఇదే | Why Rich People Are Crazy About Buying IPL Teams!

Author Name:FN-20 TELUGU

Youtube Channel Url:https://www.youtube.com/@FACTNO20

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eqb1FnePOVg



Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఐపిఎల్ లో ఒక బౌలర్ వేసే ఒక బంతి విలువ ఎంతో అది కేవలం తోలుతో చేసిన బంతి కాదు దాని విలువ అక్షరాల 49 లక్షలు ఒక్క ఓవర్ పూర్తఅయ్యేసరికి సుమారుమూడు కోట్లు ఖర్చువుతాయి. ఒక పూర్తి మ్యాచ్ విలువ కోట్లు పైమాటే ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఇదొక అద్భుతం. ఒక పక్క ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ లాంటి దిగ్గజాలే గత ఐదేళ్లలో 4వేల కోట్లకు పైగా నష్టాల్లో కూరుకుపోయి వారి షేర్ విలువ 70 %ాతనికి పడిపోతుంటే మరో పక్క ఐపఎల్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండి ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీం కూడా వందల కోట్ల
(00:40) లాభాలను ఎలా గడిస్తోంది? అసలు ఐపిఎల్ లో ఒక టీం గెలవడానికి ఆ టీం యజమాని సంపాదించే లాభానికి ఏమైనా సంబంధం ఉందా?బిcసిఐ బిసిసిఐ కేవలం ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్ ద్వారా 48,390 కోట్లు ఎలా రాబట్టగలిగింది? ఈ బారి ఆదాయంలో టీమ్స్ వాట ఎంత? మనం స్టేడియం లో కూర్చుని చూసే ఆ మూడు గంటల ఆట వెనుక ఎన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం దాగి ఉందో తెలిస్తే మీరు విస్తుపోతారు.
(01:09) చాలా మంది ప్రేక్షకులు ఐపిఎల్ అంటే కేవలం ట్రోఫీ కోసం జరిగే యుద్ధం అనుకుంటారు. కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది. విజేతకు వచ్చే 20 కోట్ల ప్రైజ్ మనీ అనేది ఒక స్టార్ ప్లేయర్ ఒక నెల జీవితంతో సమానం. మరి అలాంటప్పుడు యజమానులు వేల కోట్లు పెట్టి టీమ్స్ ను ఎందుకు కొంటున్నారు? ఒక మ్యాచ్ కూడా ఆడకుండా ఒక్క బంతి కూడా పడకుండానే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టీమ్స్ అకౌంట్ లో 500 కోట్లు ఎలా వచ్చి చేరుతున్నాయి.
(01:36) బిసిసిఐ అనేది ఒక ప్రభుత్వ సంస్థ కాకపోయినా ఒక ప్రైవేట్ స్పోర్ట్స్ బాడీగా ఉండి దేశంలోని అతి పెద్ద వ్యాపారవేత్తలను సెలబ్రిటీలను తన కనుసన్నలలో ఎలా నడిపిస్తోంది? మక్డోనాల్డ్స్ ఫ్రాంచైజీ మోడల్ కు ఐపఎల్ స్ట్రక్చర్ కు ఉన్న ఆ వింతైన పోలిక ఏంటి?జియో జియో సినిమా ఐపిఎల్ ను ఉచితంగా చూపించడం వెనుక ఉన్న అంబానిీ మాస్టర్ ప్లాన్ ఏంటి? 10 సెకండ్ల యాడ్ కోసం కంపెనీలు 25 లక్షలు ఎందుకు చెల్లిస్తున్నాయి? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం ఐపఎల్ యొక్క పకట్బంది బిజినెస్ మోడల్ ను లోతుగా విశ్లేషించాలి.
(02:09) ఇది కేవలం 22 గజాల పిచ్ పై జరిగే ఆట మాత్రమే కాదు. ప్రతి సెకకు లక్షల రూపాయల ఆదాయాన్ని కురిపించే ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐపిఎల్ వెనుక ఉన్న ఆ మిలియన్ డాలర్ల రహస్యాలను సామాన్యులకు అర్థం కానీ ఆ మనీ గేమ్ ను అత్యంత వివరంగా డీకోడ్ చేయబోతున్నాం. ముందుగా ఐపఎల్ అనేది ఈరోజు కేవలం భారతదేశానికే పరిమితమైన ఒక టూర్నమెంట్ కాదు.
(02:38) ఇది అంతర్జాతీయ క్రీడా యవనికపై ఒక అజయమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీని స్థాయిని అంచనా వేయాలంటే అమెరికాలోని అత్యంత ప్రజాధారణ పొందిన ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ తో పోల్చాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా లీగ్లలో ఒక్కో మ్యాచ్ కు వచ్చే ఆదాయం పరంగా ఐపిఎల్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లాంటి దశాబ్దాల చరిత్ర కలిగిన ఫుట్బాల్ లీగ్లను సైతం వెనక్కి నెట్టి ఐపిఎల్ సాధించిన ఈ విజయం వెనుక బారి మార్కెట్ వ్యూహం ఉంది.
(03:06) సాధారణంగా అభిమానులు ఐపఎల్ అంటే కేవలం ఆ పచ్చటి మైదానంపై 20 ఓవర్ల పాటు జరిగే పోరాటం చివరికి ఆ మెరిసే ట్రోఫీని గెలవడమే పరమావధి అని భావిస్తారు. కానీ వాస్తవ ప్రపంచంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ లెక్కల్లో ఆ ట్రోఫీ విలువ చాలా స్వల్పం. ఐపిఎల్ విజేతకు దక్కే ప్రైజ్ మనీ కేవలం 20 కోట్లు రన్నర్ అప్ కు దక్కేది 12 కోట్లు మాత్రమే విజేతకు ఓడిపోయిన టీం కు మధ్య ఉన్న ఈ 8 కోట్ల వ్యత్యాసం ఒక ఫ్రాంచైజీ యజమానికి పెద్ద లెక్కలోనిదే కాదు.
(03:39) ఒక ఉదాహరణతో చెప్పాలంటే మిచెల్ స్టార్క్ లేదా ప్ాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ల ఒక్క సీజన్ వేలం ధర 20 నుండి 24 కోట్ల వరకు ఉంటుంది అంటే అంటే మొత్తం ఐపిఎల్ గెలిస్తే వచ్చే ప్రైస్ మనీ ఒక్క స్టార్ ప్లేయర్ జీతం కంటే కూడా తక్కువ మరి అలాంటప్పుడు యజమానులు కేవలం ట్రోఫీ ప్రైస్ మనీ కోసం అంత రిస్క్ తీసుకుంటున్నారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి.
(04:04) ఒక టీం యజమాని వందల కోట్లు పెట్టి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయడం వెనుక ఉన్నది ట్రోఫీ కాదు ఆ ప్లేయర్ ద్వారా వచ్చే బ్రాండ్ వాల్యూ మరియు వ్యూవర్షిప్ మరి గెలిచినా ఓడినా పెద్దగా తేడా లేనప్పుడు ఆ మైదానంలో ఆటగాళ్ళు అంత తీవ్రంగా ఎందుకు శ్రమిస్తారు? ఎందుకంటే అక్కడ ప్రతి బాల్ ఒక వ్యాపారం. టీం ఎంత బాగా ఆడితే ఆ టీం యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ అంత పెరుగుతుంది.
(04:28) తద్వారా ఆ టీం జర్సీ పై లోగోలు వేయించుకునే కంపెనీలు క్యూ కడతాయి. విరాట్ కోహ్లీ లేదా ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్లు తమ టీంలో ఉంటే ఆ టీం ఓడిపోయినా కూడా ఆ ప్లేయర్ల ముఖచిత్రాలను వాడుకుని యజమానులు వేల కోట్ల అడ్వర్టైస్మెంట్ డీల్స్ కుదుర్చుకుంటారు. అందుకే ఇక్కడ గెలుపోటంల కంటే ఎంగేజ్మెంట్ ముఖ్యం. ఐపఎల్ ఫ్రాంచైజీల ప్రధాన ఆదాయం కేవలం ట్రోఫీ ప్రైజ్ మనీ ద్వారా రాదు.
(04:53) బిసిసిఐ బిసిసిఐ కేటాయించే సెంట్రల్ రెవెన్యూ పూల్ ద్వారా వస్తుంది. అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా బిసిసిఐ కి మీడియా రైట్స్ ద్వారా వచ్చిన వేల కోట్ల ఆదాయంలో సగం వాట అన్ని టీమ్స్ కు సమానంగా పంచబడుతుంది. ఈ ఆర్థిక రక్షణ వలయం ఉండబట్టే ఐపిఎల్ టీమ్స్ ఏనాడు నష్టాల బాట పట్టలేదు. ఫుట్బాల్ క్లబ్బులు ఒక్క సీజన్ సరిగ్గా ఆడకపోతే దివాళ తీసే పరిస్థితి ఉంటుంది.
(05:16) కానీ ఐపిఎల్ లో మాత్రం ఆఖరి స్థానంలో ఉన్న టీం కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో లాభాల్లోనే కనిపిస్తుంది. ఇది కదా అసలైన ట్విస్ట్ ఆట మైదానంలో ఆటగాళ్ళు ట్రోఫీ కోసం పోరాడుతుంటే తెరవెనుక యజమానులు ఆ ఆట ద్వారా సృష్టించబడే బ్రాండ్ వాల్యూను నగదగా మార్చుకుంటున్నారు. ట్రోఫీ గెలవడం అనేది కేవలం అభిమానుల సంతృప్తి కోసం జరిగే ఒక ఎమోషనల్ ప్రక్రియ మాత్రమే కానీ నిజమైన బిజినెస్ మాత్రం ఆ మ్యాచ్ ప్రసారమయ్యే ప్రతి సెకండ్లోనూ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది.
(05:46) ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక టీం ఐపిఎల్ నుండి నిష్క్రమించినా కూడా ఆ టీం యజమాని బ్యాంక్ అకౌంట్ మాత్రం లాభాలతో నిండిపోతుంది. ఇదే ఐపిఎల్ సృష్టించిన ఒక వింతైన మరియు అద్భుతమైన బిజినెస్ మోడల్. ఐపిఎల్ అనే ఈ బారి యంత్రాంగం అసలు ఎలా పనిచేస్తుంది అని చాలా మందికి ఉంటుంది. దీని వెనుక ఉన్న అధికారిక నిర్మాణం ఏంటి అన్నది అర్థం చేసుకోవాలంటే మనం ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ చైన్మక్డోనాల్డ్స్ బిజినెస్ మోడల్ ను ఉదాహరణగా తీసుకోవాలి.
(06:12) మక్డోనాల్డ్స్ అనే ప్రధాన సంస్థ ఏ ఊరిలోనూ నేరుగా బర్గర్ అమ్మదు. అది కేవలం తన బ్రాండ్ పేరును రెసిపీని నాణ్యతను పర్యవేక్షిస్తూ ఇతరులకు ఫ్రాంచైజీలను ఇస్తుంది. ఇక్కడ బిసిసిఐ సరిగ్గా ఆ మక్డోనాల్స్ లాంటిది.బిcసిఐ ఏ టీం కు యజమాని కాదు అది కేవలం ఐపఎల్ అనే లీగ్ యొక్క సృష్టికర్త మరియు యజమాని మాత్రమే. మైదానంలో మనకు కనిపించే ముంబై ఇండియన్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ లాంటి టీమ్స్ అన్ని బిసిసిఐ దగ్గర లైసెన్స్ తీసుకున్న వ్యక్తిగత వ్యాపార సంస్థలు.
(06:44) రిలయన్స్ ముంబై ఇండియన్స్ ను నడుపుతుంటే షారుక్ ఖాన్ కేకెఆర్ ను నడుపుతాడు. పార్త్ జిందాల్ జెఎస్డ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ ను నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఒక వింతైన ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఏ వ్యాపారంలోనైనా ఎవరి లాభ నష్టాలు వారివే ఉంటాయి. కానీ ఐపీఎల్ లో అలా కాదు. ఇక్కడ సెంట్రల్ రెవెన్యూ పూల్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది.
(07:06) బిసిసిఐ కి మీడియా రైట్స్ మరియు టైటిల్ స్పాన్సర్షిప్స్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయంలో 50 %ాతన్ని తన నిర్వహణ ఖర్చుల కోసం ఉంచుకొని మిగిలిన 50 %ాతన్ని మొత్తం 10 టీమ్స్ కు పంచుతుంది. ఈ పంపిణీ విధానమే ఐపిఎల్ ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వ్యాపారంగా మార్చింది. ఎందుకంటే ఒక టీం పాయింట్ల పట్టికలో మొదటి స్థానం ఉన్నా లేదా 10 వ స్థానంలో ఉన్నా BCCI నుంచి వారికి అందే వాటా దాదాపు సమానంగానే ఉంటుంది.
(07:34) దీని అర్థం ఏంటో తెలుసా ఒక టీం సీజన్ మొత్తం ఒక మ్యాచ్ కూడా గెలవకపోయినా కనీసం గ్రౌండ్ లోకి దిగి ఒక బంతి కూడా వేయకముందే కేవలం ఐపఎల్ లో ఒక భాగమైనందుకు ఆ టీం యజమానికి బ్యాంక్ అకౌంట్ లో దాదాపు 400 నుండి 500 కోట్లు గ్యారెంటీగా వచ్చి చేరుతాయి. అసలు ఏ కష్టము పడకుండా కేవలం ఆ లీగ్ లో సభ్యత్వం ఉన్నందుకు ఇంత భారీ మొత్తం అందడం అనేది ఏ ఇతర క్రీడలోనూ సాధ్యం కాదు.
(07:59) అందుకే ముంబై ఇండియన్స్ లాంటి టీమ్స్ ఐదారు సార్లు కప్పు గెలిచినా ఆర్సబి 17 ఏళ్లుగా కప్పు గెలవకపోయినా ఆర్థికపరంగా రెండు టీమ్స్ సమానమైన లాభాల్లో ఉంటాయి. చెప్పాలి అంటే గత సీజన్ లో ఆర్cబి కప్ గెలిచి ఇంకా క్రేజ్ పెంచుకుంది. మరి ఈ సెంట్రల్ పూల్ విధానం వల్ల BCCI కి వచ్చే లాభం ఏంటి? ఇక్కడే అసలైన బిజినెస్ వ్యూహం దాగి ఉంది. ఒకవేళ ఐపిఎల్ లో ఏదైనా ఒక టీం ఆర్థికంగా నష్టపోయి టూర్నమెంట్ నుండి తప్పుకుంటే అది మొత్తం లీగ్ బ్రాండ్ వాల్యూ దెబ్బతీస్తుంది.
(08:30) అలా జరగకుండా ఉండాలనే టీమ్స్ గెలిపోవటంలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా లాభాలను పంచుతారు. ఫలితంగా ప్రతి టీం యజమాని తమ టీం పై ధైర్యంగా పెట్టుబడి పెడతారు. ఈ సెంట్రల్ పూల్ ఆదాయం నుండే ప్లేయర్ల వేలం ఖర్చులు ప్రయాణ ఖర్చులు మరియు హోటల్ బిల్లులు అన్ని చెల్లించిన యజమానుల చేతిలో ఇంకా వందల కోట్లు మిగిలి ఉంటుంది. అంటే మీరు స్టేడియంలో చూసే ఆవేశక ఆవేశాలు అభిమానుల ఏడుపులు, నవ్వులు అన్ని మైదానం వరకే పరిమితం.
(08:58) తెర వెనక మాత్రం యజమానులందరూ ఒకే తాటిపై ఉండి బిసిసిఐ పంపినీ చేసే ఆ భారి ఆదాయాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. గెలిచిన టీం కంటే ఓడిపోయిన టీం తక్కువ సంపాదిస్తుంది అనుకోవడం కేవలం బ్రహ్మ మాత్రమే. ఐపిఎల్ అనేది లాభాల గ్యారెంటీ ఉన్న ఒక కార్పొరేట్ స్వర్గం ఇక్కడ ఓడిపోవడం అంటే కేవలం ఆటలు వెనకబడటం మాత్రమే సంపాదనలో కాదు ఐపిఎల్ ఆదాయానికి అసలైన మూలస్తంభం మీడియా రైట్స్ దీనిని ఒక రకమైన కామదేను అని పిలవచ్చు.
(09:24) 2022 లో జరిగిన మీడియా రైట్స్ వేలంపాట భారత డిజిటల్ విప్లవానికి ఒక నిదర్శనం. స్టార్ స్పోర్ట్స్ టీవీ ప్రసార హక్కుల కోసం 23,575 కోట్లు చెల్లిస్తేరిలయన్స్ సంస్థకు చెందిన వయాకాం 18 డిజిటల్ హక్కుల కోసం 23,758 కోట్లు వెచ్చించింది. భారత క్రీడా చరిత్రలో టీవీ రైట్స్ కంటే డిజిటల్ రైట్స్ ఎక్కువ ధరకు అమ్ముడవడం ఇదే మొదటిసారి. దీని అర్థం ఏంటంటే భారతదేశం ఇప్పుడు టీవీల నుండి స్మార్ట్ ఫోన్ల వైపు పూర్తిగా మళ్ళంది.
(09:55) మరి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించిన కంపెనీలు ఆ డబ్బును ఎలా తిరిగి రాబట్టుకుంటాయి? ఇక్కడే అడ్వర్టైస్మెంట్స్ కు లెక్కలు మొదలవుతాయి. మీరు టీవీలో లేదా ఫోన్లో చూసే కేవలం 10 సెకండ్ల యాడ్ ధర అక్షరాల 15 నుండి 25 లక్షలు ఒక మ్యాచ్ లో ఉండే ప్రతిక్షణాన్నిబిసిసిఐ మరియు బ్రాడ్కాస్టర్లు నగదుగా మారుస్తారు. స్ట్రాటజిక్ టైం అవుట్డిఆర్ఎస్ రివ్యూ వైడ్ బాల్ పడినప్పుడు వచ్చే లోగోలు చివరకుఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడు పడే బ్రాండ్ పేర్లు ఇలా ప్రతి సెకను ఒక బంగారు గనిలా మారుతుంది.
(10:27) అయితేజియో సినిమా ఐపిఎల్ ను ఉచితంగా ఎందుకు చూపిస్తుందనే సందేహం మీకు రావచ్చు. వేల కోట్లు పెట్టి హక్కులు కొని ఉచితంగా చూపించడం వల్ల వారికి వచ్చే నష్టం సుమారు 4000 నుండి 5000 కోట్లు ఉంటుంది. కానీ అంబానీ దృష్టిలో ఇది నష్టం కాదు. ఇదొక డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 100 కోట్ల మంది భారతీయులను తన యాప్ లోకి రప్పించి వారి డేటాను సేకరించి ఆ అలవాటు ద్వారా భవిష్యత్తులో జియో సిమ్ జియోఫైబర్ మరియు ఇతర సేవలను అమ్ముకోవడమే దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్.
(10:58) ఇక కేవలంబిసిసిఐ ఇచ్చే వాట మాత్రమే కాకుండా ప్రతి ఫ్రాంచైజీ సొంతంగా మూడు ప్రధాన మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తుంది. మొదటిది స్పాన్సర్షిప్స్ ఒక ప్లేయర్ ధరించే జర్సీ మీద ఉండే ప్రతి లోగో వెనుక ఒక రేటు ఉంటుంది. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్ జర్సీ ముందు భాగంలో ఉండే ప్రధాన లోగో విలువ ఏడాదికి 50 నుండి 70 కోట్లు రెండో మార్గం టికెట్ సేల్స్ మరియు హాస్పిటాలిటీ.
(11:20) హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరిగినప్పుడు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 80% నేరుగా ఆ టీం యజమానికి వెళ్తుంది. దీనితో పాటు స్టేడియంలో అమ్మే ఆహార పదార్థాలు, పానీయాలు మరియు టీం మెర్సండైజ్ జర్సీలు, క్యాబ్స్ ద్వారా కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఇక మూడోది బ్రాండ్ వాల్యూ టీం ఎంత పాపులర్ అయితే దాని మార్కెట్ విలువ అంత పెరుగుతుంది.
(11:42) ముంబై ఇండియన్స్ లేదా సిఎస్కే లాంటి టీమ్స్ విలువ నేడు బిలియన్ డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో ఈ టీమ్స్ వాటాలను అమ్మితే యజమానులకు వచ్చే లాభం ఊహతీతం ఇవన్నీ ఒక ఎత్తయితే ఐపిఎల్ ఎన్నటికీ ఫెయిల్ కాకపోవడానికి కారణం హోప్ ఎకానమీ. యూరోపియన్ ఫుట్బాల్ లీగ్స్ లో కేవలం ధనిక క్లబ్బులే ఎప్పుడు గెలుస్తూ బోర్ కొట్టిస్తాయి. కానీ ఐపఎల్ లో ప్లేయర్ ఆక్షన్ మరియు శాలరీ క్యాప్ ఉన్నాయి.
(12:05) ప్రతి టీం దగ్గర ఖర్చు పెట్టడానికి సమానమైన బడ్జెట్ సుమారు 100 కోట్లు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏ ఒక్క టీం కూడా కేవలం డబ్బుతో స్టార్ ప్లేయర్లందరినీ కొనేయలేదు. ఫలితంగా అన్ని టీమ్స్ సమాన బలంతో ఉంటాయి. అందుకే గత 18 ఏళ్లలో ఎనిమిది వేరు వేరు టీమ్స్ ఈ అనిశ్చితి వల్లే ఈసారి మా టీం గెలుస్తుంది అనే ఆశ అభిమానుల్లో సజీవంగా ఉంటుంది.
(12:28) ఆ ఆశే వ్యూవర్షిప్ ను ఆ వ్యూవర్షిప్ే వేల కోట్ల ఆదాయాన్ని నిరంతరంగా సృష్టిస్తూనే ఉంటాయి. గెలిచినా, ఓడినా ఈ మనీ మిషన్ మాత్రం ఆగదు

No comments:

Post a Comment