Saturday, May 31, 2025

 *గౌరవం కావాలంటే, ఇవి చేయండి!"*

*1. ఎవరినైనా ఒకేసారి రెండు సార్లు కన్నా ఎక్కువ కాల్ చేయొద్దు.*

*2. ప్రతి ఒక్కరితో అవసరం కంటే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండొద్దు.*

*3. ఎవరు అడగకపోయినా జ్ఞానం పంచొద్దు.*

*4. తక్కువగా మాట్లాడండి, కొంచెం రహస్యంగా ఉండండి.*

*5. మీ తదుపరి అడుగు ఎవరూ ఊహించలేకుండా ఉంచండి.*

*6. డబ్బు సంపాదించే విభిన్న మార్గాలను అన్వేషించండి మరియు -విరివిగా డబ్బు సంపాదించండి.*

*7. ఎవరైనా అవసరం కాకండి, వారి ఇష్టమైనవారిగా మారండి.*

*8. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు.*

*9. మీకు సరైగా అనిపించిన దానినే చేయండి, జనాలు ఏమన్నా సరే*

*10. ఎవరికైనా మీరు జీవితంలో విలువను పెంచేలా మార్పు చేయగలిగితే, వారికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోవద్దు...*


 *🌾🕉️నిర్వాణ షట్కమ్!!!🌾*

*🌺🌾పేరులోనే వున్నట్లుగా ఇది ఆరుశ్లోకాల మణిహారం.  అలతి పొలతి పదాలతో, సంస్కృత జ్ఞానం అంతగా లేకపోయినా, అర్ధం గ్రహించగలిగే, నవనీతపు ముద్దలు*.

*🌺🌾నిర్వాణ షట్కాన్ని ' ఆత్మషట్కమ్ ' అనికూడా వ్యవహరిస్తారు. జగద్గురువులు ఆదిశంకరులు ఈ ఆరుశ్లోకాలలో అద్వైతానికి మూలమైన  ' నేను ఎవరిని ? ' అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విధానం, ముముక్షువులకు కరదీపిక.   మహావాక్యాల సారమే ఈ నిర్వాణ షట్కమ్*.

*🌺🌾ఈ నిర్వాణ షట్కాన్ని ఆదిశంకరులు ఆశువుగా తన ఎనిమిదవయేట చెప్పారు.   నర్మదా నదిప్రాంతంలో, గురువు కొరకై అన్వేషిస్తున్న సమయంలో, గోవింద భగవత్పాదుల వారిని బాల శంకరుడు చూడడం సంభవించింది.  అప్పుడు వారు బాల శంకరుని, యదాలాపంగా,  ' నీవు ఎవరివి ? ' అని అడిగిన ప్రశ్నకు, ఈ ఆరు శ్లోకాలలో సమాధానం చెప్పారని ప్రతీతి*.  

*🌺🌾ఈ శ్లోకాలు విన్నవెంటనే, గోవింద భగవత్పాదులవారు, శంకరుని తమశిష్యునిగా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి పునాది వంటివి ఈ శ్లోకాలు*.

*🌺ఒక్కొక్క శ్లోకం*
  *చదువుకుందాం🌺*.

*శ్లో. మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం న శ్రోత్రం న జిహ్వాన చ ఘ్రాణనేత్రే /*
*న చ వ్యోమభూమిర్న తేజో న వాయు : చిదానన్దరూప శ్శివో>హం  శివో>హం // 1*

*🌺🌾నేను పరిపరివిధాలా ఆలోచనలుచేసే మనస్సును కాను, అనేక కర్మలు చేయడానికి ప్రేరేపించే బుద్ధిని కాను, అహంకారము మొదలైన వికారములు నేనుకాను. వినదగినవి వినదగనివి వినే వినికిడి సాధనమైన చెవిని నేను కాను*. 
*అనేక రుచులకు అలవాటు పడిన నాలుకను నేనుకాను. నానావిధ పరిమళములను, దుర్గంధాలతోసహా, ఆఘ్రాణించే నాసికను నేను కాను.* 
*చూడవలసిన, చూడకూడని దృశ్యాలుచూసే నేత్రాలు కూడా నేను కాను*

*🌺🌾జగత్తంతా ఆక్రమించిన ఈ శూన్య ప్రదేశము అయిన ఆకాశమును నేను కాను*, 
*సకలజనులను, ప్రకృతి సంపదలను మోసే భూమిని నేను కాను*. 
*సమస్తమును ఆహుతి చేయగల సత్తావున్న అగ్నిని నేనుకాను*. 
*విశ్వమంతావ్యాపించే వాయువును నేనుకాను.* 
*అదేవిధంగా, ఎక్కడికైనా చొచ్చుకుని పోగల జలమును కూడా నేను కాను*. 
*మరి నేను ఎవరిని ?  నేను వీటన్నిటికీ అతీతంగావున్న, సచ్చిదానంద రూపుడనైన మంగళప్రదుడనైన శివుడనే నేను.  ఆ శివుడనే నేను*.

*శ్లో.*
*నచ ప్రాణ సఙ్నో నవై పంచవాయుర్నవా సప్తధాతుర్నవా పంచకోశ* : /
*న వాక్పాణి పాదౌ న చోపస్థ పాయు: చిదానంద రూప శ్శివో>హం శివో>హం // 2*

*🌺🌾పైన చెప్పినవే కాకుండా, నేను ప్రాణమును కాను, జీవుడను కాను.  ప్రాణా>పానాది పంచవాయువులను కాను.  శరీరాన్ని సక్రమంగా నడిపించే ఏడు ధాతువులను నేను కాను*. 
*ఈ ఉపాధి మాట్లాడే శక్తి నాదికాదు.  అనేక విధములైన కర్మలు చేసే పలుచోట్లకు తిరిగే, చేతులు కాళ్ళు నేను కాను. అలాగే బాహ్య అంతరేంద్రియములు ఏవియు నేను కాను.  మరి నేనుఎవరిని ? నేను కేవలం సచ్చిదానంద స్వరూపుడను, మంగళకరుడను అయిన శివుడనే.  అవును నేను శివుడనే.*

*🌺🌾నేను సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడను తప్ప, వేరుకాదనే అఖండబోధను జగద్గురువులు నిర్వాణ షట్కమ్ ద్వారా వివరించిన విషయం గుర్తు చేసుకోవడం యెంతో సమంజసం*. 

*శ్లో. న మే ద్వేషరాగౌ న మే లోభ మోహౌ మదోనైన్యమే నైవమాత్సర్య భావ :*
*న ధర్మో నచార్దో న కామో న మోక్ష : చిదానంద రూప శ్శివో>హమ్ శివో>హం // 3*

*🌺🌾నాకు నావారు, పరులు అనే భేదభావనలు లేవు. అందువలన ఎవరిపై రాగద్వేషములు లేవు.  అదేవిధంగా నాది అంటూ నాకు ఏమీలేదు.  కాబట్టి దేనిపైనా నాకు లోభం కానీ మోహం కానీ వుండే అవకాశం లేదు*.

*🌺🌾అదేవిధంగా, ‘ నేను ఎవరికన్నా అధికుడను ‘  అనే భావం నాకు లేదు, నాకు ఎవరితో పోటీ లేదు.   కాబట్టి, నాకు మదము లేదు, ఏ ప్రాణితో నాకు మాత్సర్యము లేదు*.  

*🌺🌾నేను చేయవలసిన కార్యములు ప్రత్యేకంగా నాకు ఏమీలేవు. కాబట్టి, ఏ ధర్మమూ, నన్ను బంధించలేదు, ధనంతో నాకు పనిలేదు.  కోరికల ప్రసక్తే లేదు.  నేను సచ్చిదానంద స్వరూపుడను అయిన శివుడనే కాబట్టి,  ప్రత్యేకంగా మోక్షగామిని కాదు.  ఆ శివుడనే నేను*.

*🌺🌾' అహం బ్రహ్మాస్మి ' భావన, సాధకునికి రావడానికి ఇంతకంటే ప్రమాణం ఏమి వున్నది*. .

*శ్లో. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞా* : /
*అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శ్శివో>హం శివో>హం // 4*

*🌺🌾నాకు సంబంధించిన పుణ్యకార్యములు ఏవీలేవు.   అలాగే* *పాపకార్యములుకూడా.*  
*ఇక సుఖదుఃఖాల ప్రసక్తేలేదు మంత్రజపాలు తీర్ధప్రసాదాలు, వేదములు, యజ్ఞ యాగాలు ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు నేను భోగింపబడే వస్తువును కాదు, భోగములు అనుభవించేవాడను కాను*.  
*మరి నేను ఎవరిని ?  నేను శుద్ధ బుద్ధ స్వరూపుడను*.  
*పై చెప్పినవానికన్నింటికీ సాక్షీభూతంగావుండే శుద్ధ చైతన్యాన్ని.  నేను చిదానంద స్వరూపుడను.   నేను మంగళకరుడను. శివుడను*.

*🌺🌾ఇంత చక్కని భావన ముముక్షువులో అంకురించితే, మోక్షమార్గం పట్టినట్లే కదా* ! 

*🌺🌾ఇక్కడ, అపరిపక్వ దశలోవున్న సాధకుడు వితండవాదన చేసే అవకాశం వున్నది.  మోక్షగామికి భక్తిమార్గం అవసరం లేదనుకునే, అలసత్వం వచ్చే ధోరణి ప్రబలకుండా, గురుశుశ్రూషతో, భక్తిమార్గం ద్వారా జ్ఞానమార్గం పొందాలి*. 

*🌺🌾అలా చెయ్యకపోతే,  సాధకుడు రెంటికీ చెడిన రేవడి అయ్యే అవకాశం వున్నది.  పుణ్యపాపములు భస్మం అవ్వాలంటే ఆ ధోరణి భక్తిమార్గం ద్వారానే సాధ్యం*.

*🌺🌾' అహం బ్రహ్మాస్మి ' అనే భావనలో వున్న ముముక్షువునకు, పైన చెప్పినవి ఏవీ దైనందిన కారక్రమములలో వుండవు. కేవలం బ్రహ్మ భావన, జీవ బ్రహ్మఐక్యమే లక్షసాధన.  ఆ పరబ్రహ్మ తత్త్వం అనేది అలవడడమే, బ్రహ్మఐక్యాన్ని పొందడానికి హేతువు, అని సాధకుడు గుర్తించాలి*.

*శ్లో.*
*నమృత్యుర్న శంకా నమే జాతి భేద: పితామేనైవ న మాతా న జన్మ : /*
*న బంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య : చిదానందరూప శ్శివో>హం శివో>హం* // 5 .

*🌺🌾నాకు మృత్యువులేదు, నేను సచ్చిదానందమనే అమృతాన్ని ఎల్లప్పుడూ గ్రోలుతూండే వాడిని గనుక*.   *నాకు జన్మ మృతు జరా వ్యాధుల గురించి ఏ సందేహమూ లేదు, అవి నన్ను అంటలేవు కాబట్టి*.  
*నాకు ఉపాధిజ్ఞానమే లేనందున ఏజాతివాడను అనే స్పృహ లేదు.  ఏ జాతిమీదా తక్కువ భావం అసలేలేదు*.

*🌺🌾నేను సనాతుడను కాబట్టి, నాకు శాశ్వత తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గురువులు లేరు.  శిష్య పరంపర అసలే లేదు*
 
*🌺🌾నన్ను నేనుగాగాక వేరే ఏమీ స్పృహలోకి రానప్పుడు, నేను అద్వితీయుడనే*. 
*మరి సామాన్య జీవికి ఇవన్నీ ఉండడం యదార్ధమని మిధ్యాభావంలో నమ్ముతున్నప్పుడు, నీవు ఎవరివి ? నేను చిదానంద రూపుడనైన శివుడనే. ఆ శివతత్వమే నేను*.

*🌺🌾" తత్వమసి " అనే మహావాక్య సారమే ఈ సమాధానం గా జగద్గురువులు చెప్పారని తెలుసుకోవడానికి మనకు ఇంతకంటే తార్కాణం ఏం కావాలి ?* 

*ఈ లౌకిక ప్రాపంచిక జీవితంలో ప్రతిజీవి భ్రమతో తాదాత్మ్యం చెందుతున్న, శాశ్వతమనుకునే అశాశ్వత సంబంధాలైన తల్లిదండ్రులు*, *బంధుమితృలు, గురు శిష్య సంబంధాలను త్రిప్పి కొడుతున్నారు గురుదేవులు*.   
*ఎందుకంటే, అవి శాశ్వతములు కావని వారికి తెలుసు కనుక.*

*🌺🌾అలాగే జాతి భేదములు, మృత్యుభయమును.   మృత్యువే లేదను స్థిరభావం ఉన్నవాడిని మృత్యువు ఏం చేస్తుంది ?* 

*🌺🌾మృత్యువు తనకు, ఆ ఉపాధి మీద వుండే అధికారంతో తనపని తాను, ఆ వుపాధి మీద చూపించి, ఉపాధిని చైతన్యము నుండి వేరుచేస్తుంది.  నేనుకాని ఉపాధి నా నుండి వేరైతే నేనెందుకు భయపడాలి ?  ఇదీ అసలైన ఆత్మజ్ఞాన ఆవిష్కరణ.  ఇదే రమణ మహర్షుల విషయంలో జరిగింది.*

*శ్లో.*
*అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ్చ సర్వత్రా సర్వేంద్రియాణాం /*
*న చాసంగతం నైవ ముక్తిర్ణమేయ : చిదానందరూప శ్శివో>హం శివో>హం // 6*

*🌺🌾జీవ ఈశ్వర ఏకత్వము సిద్ధించిన వాడను కావున నేను నిర్వికల్పుడను, నిరాకారుడను, నేను అన్నిచోట్లా వ్యాపించి వున్నవాడను.*
*నేను ఇంద్రియముల అధీనములో లేను, సర్వేంద్రియములు నా* *అధీనములో వున్నవి.  నా చైతన్యము వలననే, అవి ప్రకాశించి ‘ వాటి పని అవి ‘ చేసుకో కలుగుతున్నవి*.

*🌺🌾నేను నిస్సంగుడను, నాకు ఏ విషయముతో సాంగత్యము లేదు.   నేను ముక్తుడనే అయివున్నాను కనుక, నాకు వేరే ముక్తిలేదు.  అసలు నాకంటూ ఉనికి లేనేలేదు.  మరి నేనెవరిని ? నేను చిదానంద రూపుడనగు శివుడను. మంగళకరుడను*.

*🌺🌾జగద్గురువులు చిన్న వయసులోనే, ఇంత నిశ్చయభావంతో, చెప్పారంటే, వారు అప్పటికే, తత్వజ్ఞాన ప్రతిబంధకములు అయిన సంశయాది భావనలు పోగొట్టుకుని, విపరీత భావనలను దూరంగాపెట్టి, సూక్ష్మబుద్ధితో ‘  తాను బ్రహ్మమును ‘  అని తెలుసుకున్నారు.*

*🌺🌾ఈ నిర్వాణ షట్క వాక్యాలను సాధకుడు అవగాహన చేసుకుంటే,  దీని ప్రభావం వలన,  చేతిలోనికి తీసుకున్న నీరు,ఎట్టి ప్రతిబంధకము లేక ఎలా సేవించవచ్చునో,  అట్టి విధంగా ‘ పరబ్రహ్మప్రాప్తి ‘ సునాయాసంగా లభిస్తుంది*. 

*🌺🌾కాబట్టి ‘ తత్వమసి, అహం బ్రహ్మాస్మి ‘ అనే మహావాక్యముల గురించి నిరంతరం చింతనజేస్తూ వానిలోనే సాధకుడు తాదాత్మ్యత చెందవలెను.*


గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

 నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

 

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

 

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

 ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

 గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

 1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

 3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

 4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

 5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

 7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

 8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

 9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

 10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

 11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత 
 “న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

 
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తేu కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!
 🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩
*🌾నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకము🌾*

*🌺రామ స్కందం* 
*హనూమంతం వైనతేయం వృకోదరం* |
*శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వ ప్నం- తస్య నశ్యతి ‖*

*🥀అపరాధ క్షమాపణ స్తోత్రం*

*🥀అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |*
*దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖*

*🥀కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా*
*శ్రవణ నయనజం వా మానసంవాపరాధమ్ |*
*విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ*
*శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖*

            *శుభరాత్రి*
 *జన్మ ద్వారా ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు...* ```
 “జన్మనా జాయతే శూద్రః!
కర్మణా జాయతే ద్విజః!!
వేదపాఠం తు విప్రాణాం!!
బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః “!!

సర్వజనములును జన్మచే శూద్రులుగనే పుట్టి, కర్మలచే ద్విజత్వము నొందుచున్నారు. వారిలో కొందరు వేదాధ్యయనముచే విప్రులయి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులైరి.

పుట్టుకతో ఎవరైనా శూద్రులే; 
చేసేపను(కర్మలు) ద్వారా మాత్రమే ద్విజుడౌతాడు!” అని అర్థం.

1.శరీర స్థాయిలో మాత్రమే... జీవితాన్ని గడిపేవాడు “శూద్రుడు,”
2. శరీర, మనో స్థాయిలు... రెండింటిలో జీవితాన్ని గడిపేవాడు “వైశ్యుడు,”
3. శరీర, మనో, బుద్ధి స్థాయిలు… మూడింటిలో జీవితాన్ని గడిపేవాడు  “క్షత్రియుడు,”
4. శరీర, మనో, బుద్ధి, జ్ఞానంతో … అన్ని స్థాయిలలోను జీవితాన్ని గడిపేవాడు “బ్రాహ్మణుడు.”```

మనిషి తన జన్మపరంపరలో క్రమక్రమంగా ఈ నాలుగు పరిస్థితులనూ అనుభవించి, జనన-మరణ చక్రంలోంచి చివరికి విముక్తడవుతాడు.    
                   

 _*🛕గ్రామ దేవతలను ఎప్పుడూ అలక్ష్యం చేయవద్దు🚩*_
🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋

 *🏕️ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సరక్షించే తల్లిగా, భూత ప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేర నివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచు కుంటాము. ప్రతీ ఏడు అమ్మవారికి జాతర చేసి, నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతీ గ్రామం లోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్రకోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకు తుంది.* 

 *ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించినా, అందులో నుండే ప్రకటమై పలుకుతుంది, కోరికలు తీరుస్తుంది, వ్యాధులు నివారిస్తుంది ఆ తల్లి. పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజా తంతులతో పనిలేదు, భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు, యద్భావం తద్భవతి అన్నట్లు మన భావాన్ననుసరించి కోరికలు నెరవేరుస్తుంది.* 

 *గ్రామ దేవతలను పూజించి, జాతరలు, తిరునాళ్ళు, అగ్ని గుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపు వేస్తుంటారు, ఆ జాతర రోజులలో ఎవరూ ఆ గ్రామా సరిహద్దులు దాటకూడదు అని నియమం ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి, వారు వెళ్తున్న పనిని అమ్మకు చెప్పుకుని, చీకటి పడడానికి ముందే తిరిగి గ్రామానికి వస్తామని చెప్పి మరీ వెళ్ళేవారు.* 

 *జాతర రోజులలో ఆ గ్రామం అంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. హరికధలు, తోలు బొమ్మలాటలు, కుస్తీలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, అనేక తినుబండారాల అమ్మకాలు, అగ్ని గుండంలో నడవడాలు, మొక్కులు తీర్చుకో వడాలు ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ప్రతీ ఇంటి వారు తమ చేతితో స్వయంగా చేసిన నైవేద్యాలు అమ్మవారికి నివేదించేవారు. విరివిగా అన్నదానాలు జరిగేవి. ఆ గ్రామ మంతా ఒకే కుటుంబంగా కలిసి మెలిసి జాతర చేసుకునేవారు.* 
 *మీరు జాతరలు చేసుకున్న రోజులు గుర్తున్నాయా, ఎలా జరుపుకునేవారు.* 

 *ప్రతీ ఏడు రైతులు తమ పంటలో కొంత భాగం అమ్మకు ఇచ్చేవారు. అనేక కారణాల వల్ల పోరుగూళ్ళలో జీవనాన్ని సాగించే వారు కూడా తమ గ్రామదేవతల జాతరకు తప్పకుండా వెళ్ళి వచ్చేవారు. విదేశాలలో స్థిరపడిన వారు సైతం జాతరకు వచ్చి వెళ్ళేవారు. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారి పోతున్నాయి. కొందరికి తమ గ్రామం పేరు కూడా తెలీదు. తమ గ్రామదేవత పేరు కూడా తెలీదు. అనేక చోట్ల వివిధ కారణాల వల్ల గ్రామా దేవతలను పూజించడం మానేశారు. గ్రామ దేవతలా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు, పూజలు ఆగిపోయాయి. కారణాలు మీకు తెలిసినవే వాటిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.* 

 *కొన్ని గ్రామాలలో తమ పిల్లలకు గ్రామదేవత పేరు కూడా జతచేర్చి నామకరణం చేసేవారు. వేరే ఊళ్లలో స్థిరపడేవారు తమ గ్రామ దేవత చిత్రపటం తమ ఇళ్ళలో పెట్టుకుని పుజించుకునేవారు. అలా తరతరాలుగా తమ గ్రామ దేవత ఉనికి తెలియబడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది గ్రామదేవతకు, ప్రకృతి మాతకు చేస్తున్నఅపరాధం. భయంకరమైన అంటువ్యాధులను సైతం గ్రామ పొలిమేర దాటకుండా ఆపే అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు. ప్రతీ ఇంట్లో తమ గ్రామ దేవత చిత్రపటం తప్పకుండా ఉండాలి. తరువాతి తరానికి గ్రామదేవత శక్తి, విలువ తెలియ జేయాలి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్రబలుతున్న అంటు వ్యాధులు ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇకనైనా మనం గ్రామదేవతలను అలక్ష్యం చేయక పుజించుకుందాం. ఆలోచించండి. ఈ కరోనా మహమ్మారి త్వరగా అంతరించిపోవాలని అమ్మవారిని వేడుకుందాం.* 

 *మీ గ్రామదేవత పేరు, మీ గ్రామం పేరు మీకు గుర్తుందా. ఒక్కసారి భక్తితో మీ అమ్మవారి స్మరించు కోండి. మచ్చుకకు గ్రామ దేవతల పేర్లు కొన్ని స్మరించుకుందామా.* 

 *గంగమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, గండి మైసమ్మ, పెద్దమ్మతల్లి, పోచమ్మతల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అంకమ్మ పేరంటాలు, అచ్చమ్మ - పాపయ్య, అచ్చమ్మ - వాసిరెడ్డి, అలివేలమ్మ, అద్దంకి నాంచారమ్మ, ఇరుమలమ్మ, కోటమహిషమ్మ, కొండమారెమ్మ (వానదేవత), కుంతిదేవి (గొంతేలమ్మ), గోగులమ్మ, గంటాలమ్మ, గంగానమ్మ, చంద్రమ్మ,తుంగ పల్లెమ్మ, తిరుపతమ్మ - గోపయ్య, తుమ్మలమ్మ, నాంచారమ్మ, నూకాలమ్మ, నీరమ్మ,పెద్దమ్మ, పోలేరమ్మ, పుట్లమ్మ, పెద్దింటమ్మ, పల్లాలమ్మ, బుచ్చమ్మ, బతకమ్మ, మద్దిరామమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, మాలచ్చమ్మ, ముత్యాలమ్మ, ముక్కొల్లు మహాకాళమ్మ, పెనమకూరు మంగమ్మ, ముప్పాళమ్మ, యల్లమ్మదేవత, రంగమ్మ పేరంటాలు, లంకమ్మ, వీరమ్మ పేరంటాలు, వాకాలమ్మ, వేలమ్మ, శ్రీలక్ష్మీ పేరంటాలమ్మ, సరోజనమ్మ, బాలసన్యాసమ్మ, చల్లలమ్మ, యాపారమ్మ, మామిళ్ళమ్మ, ఎల్లారమ్మ,ఏవుళ్ళమ్మ....* 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
 ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో... అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది...!!

అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు...!!
ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు...!!

అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు...!!

అమ్మమ్మ - తాతయ్య
నానమ్మ - తాతయ్య
పెద్దనాన్న - పెద్దమ్మ
చిన్నాన్న - చిన్నమ్మ
అత్త - మామ
అక్క - బావ
మరదలు - తమ్ముడు
వదిన - అన్నయ్య
చెల్లి - బావ గారు
మేనమామ - మేనత్త
మేనకోడలు - మేనల్లుడు
అని ఓ బంధాల అల్లికలు ఉండేవి...!!

పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది...
పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి...!!

కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ
ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు...
అల్లుడికి తగిన మర్యాద
కోడలికి తగిన బాధ్యత
ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది...!!

ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం...
అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది...!!

అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి...!!
ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు...!!

ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు...
పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ, వాళ్ళను ఒంటరిగా విడిచిపెడుతున్నారు...

వాళ్లకేమీ లేదు... హాయిగా దేవతామూర్తుల్లా కాలం వెళ్లదీస్తున్నారు...!!

ఈ నాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు...
వాళ్లు కట్టుకున్న ఇరుకుగదులే సుఖం అనుకుంటున్నారు...!!

కానీ...
డబ్బు కోసం పరుగులు తీయే భర్త
బాధ్యతలు మరిచిపోయిన భార్య
తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు
బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు
దుమ్మెత్తి పొసే బంధువులు
సెల్ ఫోన్ లో పలకరించే దిక్కుమాలిన బతుకులు

ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు...!!
భయం లేదు
భక్తి లేదు
ప్రేమ ఒక నాటకం
అభిమానం ఒక భూటకం

నవ్వునీ నటిస్తూ బ్రతుకుతున్నారు...
అవసరంలేని బంధాలని పట్టుకుని,
అవసరమైన బంధాలని విడిచి,
బంధీలుగా బ్రతుకుతున్నారు...!!

ప్రతి రోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది...
చాలావరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం...
మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం...

బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి,
మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం...!

ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం
మన పెద్దలను గౌరవిద్దాం
తల్లిదండ్రులను ప్రేమిద్దాం
మన పిల్లలకు సంస్కారం నేర్పుదాం
మనం మన సమాజానికి మంచి పంచుదాం

ఒక్కటిగా జీవిద్దాం - ఆనందంగా బ్రందాం
బంధాలు బలంగా నిలిపిద్దాం!!
 పుణ్యఫలం - ధనయోగాలు - అదృష్టం - దైవానుగ్రహం! @everyone 

మనిషికి ధనం 4 రూపాలలో వస్తుంది↓
1) యోగంద్వారా 2) అదృష్టం ద్వారా 3) ప్రాప్తము ద్వారా 4) శ్రమ ద్వారా.

1) యోగము: ఇది 3 రకాలుగా మారుతుంది.
1. ధనవంతునిగా పుట్టడం,
2. మధ్యవయసులో ఏదో ఒక వ్యాపారమో ఏదోఒక రూపంలో ఆకస్మాత్తుగా ధనవంతులు కావటం,
3. తన సంతానము ద్వారా వృద్దాప్యంలో సంపన్నుడు అవటం.

2) అదృష్టం: ఇది కూడా అంతే!↓
1. తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలసివచ్చి ధనవంతులు అవటం,
2. తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయము ద్వారా సంపన్నులు అవటం,
3. తన సంతానము ద్వారా ధనవంతులు అవటం.

3) ప్రాప్తము:
1. తనకు ఎవరో వ్రాసిన వీలునామా మూలకంగా ధనం రావటం,
2. నిధి, నిక్షేపాలు, దొరకటం,
3. ఏ లాటరీ ద్వారానో లేదా జూదవ్యసనం ద్వారానో ధనం రావటం.
ఈ ప్రాప్త్య ధనాన్ని అనుభవించే యోగ్యత చాలాతక్కువ.

4) శ్రమ: ద్వారా ధనము రావటం. ఇదే కలియుగములో సాథ్యం. మరే ఇతర విధములుగా ధనము రాదు.

ధనానికి నలుగురు శత్రువులు:-
1) అహంకారం
2) వ్యసనం
3) కామం
4) డాంభీకం
ఈ నాలుగూ లేకుంటే ధనం నిలుస్తుంది.

సామాన్యముగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనము వారు ఉన్నంతవరకూ ఉంటుంది, తరువాత పోతుంది.
మనము చాలామంది విషయంలో వింటూవుంటాము, చూస్తూవుంటాము, పెద్దలు ఇచ్చిన ఆస్థిని కరిగించివేసిన కారణంగా పిల్లలు రోడ్డుమీద ఉన్నారని కారణం ఇదే!

సాధారణముగా గురువులు కానీ, మరెవరైనా కానీ, ప్రాప్తాన్ని మార్చలేరు. కానీ సద్గురువుల సాంగత్యంలో యోగాన్ని మార్చవచ్చు.

ప్రతిజీవికి ఎక్కడో ఒకచోట ధనయోగం ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకురావచ్చు. మంత్రము ద్వారా కానీ, తంత్రము ద్వారా కానీ, పొందవచ్చు. ఇది మార్చాలంటే జాతకం లేదా ధ్యానము ద్వారా చేయవచ్చు. ప్రయత్నం, భయభక్తులుతో సాధన ద్వారా దైవానుగ్రహం అవసరం. అంటే కొంత శక్తి ని ధారపోసి చూడాలి.

నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు, 
విప్రతేజం✍️బ్రహ్మశ్రీగురు రాంభట్ల.రవిసోమయాజి గారు,
(శ్రీకాశీవిశ్వనాథుని స్వప్నాజ్ఞచే) కాశీ క్షేత్రపురోహితులు,
★పితృయజ్ఞ సత్ఫలిత ప్రసాధకులు,
 *👉®️వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది (సూచనలను ) వాస్తవాలను తప్పక గ్రహించాలి.....*

*🔹®️వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు....🔹*
************************

®️వివాహం అంటేనే సర్దుకు పోవడం...

®️ వివాహం అంటే స్వర్గం అని భావించకండి... 

®️ వివాహం బాధ్యతలతో కూడిన జీవితం... 

®️ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు / అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి...

®️వివాహం తరువాత నాది, నీది అనే స్వార్థం వీడాలి... 



®️వివాహం తరువాత ఫ్రెండ్స్ ని/ సహ ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది... 

®️మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి... 

®️మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బందువులకు  గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి...

®️సంతానం ను పొందటం బాధ్యత...

®️విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది...

®️వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి... 

®️జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి...

®️ముఖ్యం గా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి... 

®️భార్య భర్తలు తగువు ఆడటం సహజం. మళ్ళీ కలవటం మామూలే.. మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు... 

*🔹®️వధువు బాధ్యతలు :🔹*
*****************
®️వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల భాగోగులు, కుటుంబం లో ఇంకా మీ కంటే చిన్న వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి...

®️ ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు...

*🔹®️వరుడు బాధ్యతలు...🔹*
*****************

®️ వధువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని , మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి....

®️కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత... 

®️ పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి... 

®️మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. 

*🔹®️అమ్మాయి తల్లి తండ్రులు...🔹*
**********************

®️అమ్మాయికి  నేరుగా  ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించటం నేర్చుకోండి...

®️కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని, సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి... 

®️భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదు. మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి...

®️మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి... 

®️అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి...

*🔹®️అబ్బాయి తల్లి తండ్రులు...🔹*
**********************

®️మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి...

®️మీ వంశం ని నిలబెట్టే సంతానం ను మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపం గా చూసుకోవాలి అని మరువకండి...

®️మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే. మీ కూతురు ,కొడుకు మీ ముందు కన్నీరు పెట్టిన పర్వాలేదు. కానీ కోడలు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే...

®️మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో , మీ కూతురుని వాళ్ళ అత్త గారు లాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి... 

®️ఎవరో మహానుభావుడు ఎన్నో జీవితాలు చూసి ఈ వాస్తవాలను మన ముందు ఉంచారు... పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు...®️👆👍
 🔔 *సాధన* 🔔

*ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు...!!*
Part -1 


🕉️ *నిత్యాన్ని మరియు అనిత్యాన్ని వేరు చేసుకోగలిగినంత జ్ఞానాన్ని పెంపొందించాలి.*  
ఒకవేళ అన్ని అనిత్యమైనవి అని తెలుసుకుంటే, మనసు వాటి మీద అట్రాక్షన్‌ను తగ్గించుకుంటుంది.

🕉️ *ప్రతీ రోజు నిర్దేశించుకున్న సమయానికి ధ్యానం చేయాలి.*  
ఇది మనసును శాంతంగా ఉంచే మంత్రం, దైవ స్మరణలో మనల్ని మరింత లోతుగా గమ్మడి చేస్తుంది.

🕉️ *క్రమశిక్షణతో జీవితాన్ని ప్రభావవంతంగా మలుచుకోవాలి.*  
ఈ క్రమశిక్షణ ఆధారంగా ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ముందుకెళ్లగలిగే అవకాశం ఉంటుంది.

🕉️ *ప్రతిరోజూ కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాలి.*  
దేవుని అనుగ్రహం పొందినందుకు, ప్రకృతిని మన జీవితంలో భాగంగా ఉన్నందుకు కృతజ్ఞత చూపాలి.

🕉️ *బయటి సంక్లిష్టతల నుంచి వెనుకకు తగ్గి, లోపలికి వెళ్లి మన అంతరంగాన్ని తెలుసుకోవాలి.*  
మనసు లోపలి ప్రశాంతతను అనుభవిస్తే, నిజమైన శాంతి ప్రాప్తిస్తుంది.

🕉️ *ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి.*

🕉️ *నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి, విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి.*

🕉️ *ఈ సూత్రాలు పాటించకుండా ఎవరూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు.*

🕉️ *మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది... వంద వ్యాపకాలలో... దైవస్మరణ ఒకటి ఐతే... దైవ దర్శనం సులభ సాధ్యం కాదు.*

🕉️ *ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది. నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు.*

🕉️ *కానీ..‌. సంతోషాన్ని కావాలనుకోవటం, దుఃఖాన్ని వద్దనుకోవటం చేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి.*

🕉️ *ప్రతి పనిలోనూ త్రికరణశుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది.                   అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి.*

🕉️ *అందుకే, వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది!! ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చేయ్యాలి.*

ఈ సూచనలను ఒక నిత్య సాధనగా పాటిస్తే, జీవితంలో మానసిక ప్రశాంతత మరియు శాంతి పొందగలమని అనిపిస్తుంది. 

 🕉 *సర్వే జనా సుఖినోభవంతు* 🕉
 ఈ Cell phone గురించి ఎవర్రాశారో గానీ చాలా సరదాగా ఉంది.  సరళ సంస్కృతంలో ఉండటం వల్ల తెలుగు మాతృభాషలో  అందరికీ సులభంగా అర్థమవుతుంది.  పోతే రాసిన కవి ఎవరో తెలియదు కానీ ఆ అజ్ఞాత మనిషికి ఈ రూపకంగా శతాధిక అభినందనలు తెలుపుకుంటున్నా..

           *చరవాణి స్తోత్రమ్*

ప్రథమం  వాయుభాషణం| 
ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని    |
సప్తమం చిత్ర దర్శిని   |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ  సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం | 
సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ  | 
విద్యుత్ గ్రాస భక్షిణీ||1||

చిత్రగ్రహణ రూపేణ| 
యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |
గృహ ప్రాంగణ దర్శిని||2||

సర్వ స్తోత్రాణి గానాని  |
కర్ణాంతరాళ శ్రావణి  |
దూర ప్రాంతేషుమార్గాణి | 
అంతర్జాల సందర్శిని  ||3||

మధ్యమాంగుళ తర్జన్యా|
స్పర్ళ  మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥|4॥

సర్వక్రీడా సముత్పన్న | 
సర్వ వస్తు విలక్షణ| 
దూరభారాణి విచ్ఛేద |  
వాయుమార్గ సంచారిణీ ॥5॥

ఖండాంతర నివాసిన్యాం|
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥6॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే | 
సంభాషణే విశేషతః ॥7॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥8॥

వయో విత్తం జ్ఞాన శూన్యం|
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే  |
పశు రూపేణ గణ్యతే ॥9॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥11॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ | 
వాయు మార్గేన గమ్యతే ॥12॥ 

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ| 
  వ్యర్థేన కాలక్షేపాయ | 
కుర్వంతి వ్యర్థ భాషణం ॥13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత | 
ఇదం పత్ర వినాశేన | 
సర్వ సంబంధ నాశనం ॥14॥

             *ఫలశృతి* 
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ప్రయాణే  భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతే |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥

చరవాణీ యో జానాతి | 
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన| 
మృత్యు మార్గం చ గమ్యతే||
🙏🙏🙏🙏🙏
 *హనుమాన్ చాలీసా ' లో "అష్టసిద్ధి నవనిధికే దాతా" అనే నామం ఉన్నది.*

*అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?*

*అష్టసిద్ధులు...*

1.అణిమా,2.మహిమ,3.లఘిమ,4.ప్రాప్తి,5.ప్రాకామ్యము,6.ఈశత్వం,7.వశిత్వం,8.సర్వ కామసిద్ధి (కామావసాయిత్వము)
1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట
4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట
8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట

*నవనిధులు.*

1. పద్మం, 2. మహాపద్మం, 3. శంఖం, 4. మకరం, 5. కచ్చపం, 6. ముకుందం,7. నీలం, 8. కుందం, 9. వరం
(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి).

ఆంజనేయ స్వామి లంఖిణి జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంఖిణి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు వచ్చి. కొండంత శరీరాన్ని పెంచి లంఖిణిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. 
ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాప కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తారు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు.. 
‘శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప.

అందుకే హనుమంతుడు గొప్పనమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు.

Free yoga 🗓 Date: 1st June to 21st June 🕕 Time: 6-6:45 AM (IST)

 For centuries, sages ended their prayers not with requests for success or pleasure but with a simple, profound offering — may all beings be happy.
This chant was never just a mantra. It was a way of life, a vow to live with compassion, awareness, and shared joy. Our FREE live yoga camp "Journey to Joy" carries that same intention. It’s not just about how happy you feel, but how your presence brings peace to others. This is your chance to embody that ancient wisdom. 🗓 Date: 1st June to 21st June 🕕 Time: 6-6:45 AM (IST) 💡Recordings available Click here to learn more 👇 https://l.satvicmovement.org/quiz/j2j...


--------------------------------------------------------------------


Hello  🌼

Thank you for registering for the Journey to Joy 21-Day Yoga Camp. 

✨ This is a gentle reminder that your camp begins tomorrow.

📘 Read your Journey to Joy Intro Manual:

🧘‍♀️ Join all live sessions here:

📢 Join our official FB group for all future updates:

If you have any questions, feel free to reply to this message, we’re here for you.

Warmly,
Satvic Team
 🙏 *రమణోదయం* 🙏

*తన మనస్సుతో భోగలాలసలను ఆశించకుండా ఉండటమే నిరాహారదీక్ష. ఆత్మనిష్ఠని వదలకుండా ఉండటమే ఉపవాస దీక్షయని వివేకులు తెలుసుకొని శ్రద్ధతో అనుసరిస్తారు.*

వివరణ: *నిరాహార దీక్ష అంటే భోజనం చేయక పొట్టను మలమల మాడ్చటం కాదు. ఇంద్రియాలకి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా మాడ్చటమే నిజమైన నిరాహారదీక్ష. ఉపవాసం అంటే దగ్గర వసించుట అని భావం. అంటే మనస్సు ఆత్మకి సమీపంగా ఉండి ఆత్మను వదలకుండా ఆత్మతో మమేకమైయుండటమే నిజమైన ఉపవాసం.*

భక్తి అనేది భగవంతునితో
కొత్తగా ఏర్పడే సంబంధం కాదు.
మరచిపోయిన సంబంధాన్ని
గుర్తుకు తెచ్చుకోవడం!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

ఎలాంటి క్లిష్ట పరిస్థితైనా సరే
నీటి మీద గీతలా తీసుకో.
నుదుటి మీద వ్రాతగ తీసుకోకు.
అదే "జ్ఞాని లక్షణం"!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
 సాంస్కృతిక పునరుద్ధరణ దీప శిఖ రాణి.. అహిల్యాబాయి
---
( మే 31 – రాణి అహిల్యాబాయి జయంతి )

సాధారణంగా వీరనాని అనగానే మనందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి గుర్తుకు వస్తారు. కానీ మన దేశ చరిత్రను చూసుకుంటే తమ రాజ్యాల కోసం వీరోచిత పోరాటాలు చేసిన రాణులు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు మహారాణి అహిల్యా బాయి హోల్కర్. వీరోచిత పోరాటాలతో పాటు ఆదర్శ పరిపాలనను అందించిన స్త్రీ మూర్తి రాణి అహిల్యా బాయి. 18వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన రాణి అహిల్యా బాయి 1725వ సంవత్సరం మే 31న మహారాష్ట్రలోని ప్రస్తుత అహ్మద్‌నగర్ జిల్లాలోని చోండి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు మంకోజిరావు శిందే, తల్లి పేరు సుశీలాబాయి శిందే. అహిల్య 8వ ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఫలితంగా 1733లో ఖండేరావు హోల్కర్‌ను వివాహమాడి ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ ఇంట కోడలిగా అహిల్య అడుగుపెట్టింది.

అహిల్యలోని ప్రతిభను మామగారైన మల్హర్ రావు గుర్తించడమే కాక ఆమెకు రాజ్యపాలనలో, యుద్ధ వ్యూహాలలో తర్ఫీదు ఇచ్చారు. అయితే ప్రశాంతంగా సాగుతున్న అహిల్యాబాయి జీవితంలో భర్త ఖండేరావు 1754లోను, తండ్రి వంటి మామ మల్హర్ రావు 1766లోను, కుమారుడు మలేరావు 1766లోను ఆ తరువాత కుమార్తె ముక్తాబాయి ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఇలా ఒకదాని వెంట మరొకటిగా కష్టాలు ఆమెను వెన్నాడినా ఈ బాధలను దిగమింగి తన కర్తవ్యాన్ని ధైర్యసాహసాలతో ఎంతో సమర్థవంతంగా నెరవేర్చింది. తన పాలనను కేవలం రాజ్య విస్తరణకు, శాంతిభద్రలతను కాపాడటానికే పరిమితం చేయలేదు. ప్రజలకు, సమాజానికి, ధర్మానికి ఎనలేని సేవలు అందించింది.

అహిల్యాదేవి శకం మహిళాసాధికారకతకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. వరకట్నం, సతీసహగమనం వంటి దురాచారాలను నిషేధించింది. మహిళలకు విద్య, వితంతు మహిళలకు భర్త ఆస్తి పై హక్కు, పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు, సంతానం లేని వితంతువుల ఆస్తుల జప్తు విధానం రద్దు, మహిళా సైనిక దళాల నిర్మాణం ఇలా సాహసోపేత నిర్ణయాలు ఎన్నో తీసుకుంది. అహిల్యాబాయి దేశవిశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆలోచించేవారు. ఆంగ్లేయుల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను ముందే పసిగట్టి వారి నక్కజిత్తులకు మోసపోవద్దని సమకాలీన పాలకులనందరినీ ఆమె హెచ్చరించారు. మొగలాయీలూ నేలమట్టం చేసిన అనేక పవిత్ర దేవాలయాలను తిరిగి నిర్మించారు. ఆ దేవాలయాలు ధార్మికపరంగానే కాదు విదేశీ ముస్లింల విధ్వంసానికి, ముస్లిం వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ఈనాటికీ ప్రతీకలుగానే నిలుస్తున్నాయి. రామేశ్వరం నుంచి చార్‌ధామ్ వరకు, కాశీ నుంచి ద్వారక వరకు ఆమె ఎన్నో ఆలయాలను నిర్మించి ధార్మిక పునరుద్ధరణ నాయకురాలిగా రాణి అహిల్యాబాయి చరిత్రలో నిలిచిపోతారు.

అహిల్యాబాయి పరిపాలనా వ్యవస్థలో అవినీతికి తావు ఉండేది కాదు. న్యాయపాలనకు ప్రతీకగా అందరి పట్ల సమభావంతో రాణి అహిల్య వ్యవహరించేది. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వస్త్ర పరిశ్రమను నెలకొల్పింది. వ్యాపార అవకాశాలను పెంపొందించిది. బిల్లులు, గోండులను వ్యవసాయం వైపు మళ్లించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంకరాచార్యులలో ఉన్న విశాల దృష్టి, ఆర్యచాణక్యుని పాలనా, దౌత్యనీతులు, సమర్థ రామదాసు, సంత్ జ్ఞానేశ్వర్ దివ్యత్వాల మేలుకలయికే రాణి అహిల్యాబాయి. ప్రజా సమస్యల పట్ల సానుభూతి, అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వం ఎంత సాధించగలదో అనడానికి అహిల్య ఒక ఉదాహరణ కనుకనే ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా, గౌరవంగా పిలిచారు. పాశ్చాత్య చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న అహిల్యాబాయి 13 ఆగస్టు 1795న తన 70వ ఏట తనువు చాలించింది. ఆమెను భగవద్గీతలో చెప్పినట్లు కర్మయోగిగా పేర్కొనడం సముచితం. అహిల్య పాలన శాంతి సౌభాగ్యాలకు, సుస్థిరత్వానికి నిలయమై భారతదేశ చరిత్రకు వన్నెచిన్నెలు అద్ది, తరతరాలకు స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది.

****How Indian Education lost its Soul: Ancient Wisdom to Modern Misguidance

How Indian Education lost its Soul: Ancient Wisdom to Modern Misguidance



మీకు చిన్న కథ చెప్తా క్వైట్ ఇంట్రెస్టింగ్ అలెగ్జాండర్ ది గ్రేట్ విశ్వ విజేత కావాలని బయలుదేరినప్పుడు తన గురువు అరిస్టాటిల్ కి గురుదక్షణగా ఏం కావాలో అడుగుతాడు. అరిస్టాటిల్ నాలుగు కోరికలు కోరతాడు. ఎందరో యోగులు పుట్టిన భరతభూమి మట్టి జన్మ జన్మల పాపాలు కడిగే భారత జీవనదుల నీరు ధర్మార్థ కామ మోక్షాలు నేర్పించే భారతీయ వేదజ్ఞానం అన్నిటికంటే ముఖ్యంగా మోక్ష స్థితిని పొందిన ఒక యోగి. బ్రో బ్రో ఇదంతా మేము పుట్టక ముందు కదా అంటారా సరే మీకోసం ఈ మధ్య జరిగిన కొన్ని నిజాలు చెప్తా క్వైట్ షాకింగ్ వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్రాండ్ ఫౌండర్ ద బెస్ట్ సఈఓ అయిన ఒకాయన తన కంపెనీ పెట్టకముందు జీవితంలో ఏం చేయాలో క్లారిటీ లేక ఇండియా వచ్చాడు. ఎన్నో గుళ్ళు, గోపురాలు యోగుల్ని దర్శిస్తూ ఒకసారి నీమ్ కరోలీ బాబా దగ్గరికి వెళ్తాడు. తన జీవితానికే ఒక మార్గం దొరికింది అక్కడ. ఒక సంవత్సరం పాటు ఆశ్రమంలో ఉండి తర్వాత అమెరికా వెళ్లి పెట్టిన కంపెనీయేఆపిల్ ఆ సఈఓ నే స్టీవ్ జాబ్స్ ఆయన 19 ఏళ్ల వయసులో రాసుకున్న లెటర్ లో ఒక్కసారైనా కుంభమేలా వెళ్ళాలని రాసుకున్నాడు. ఆ లెటర్ ఆక్షన్ లో 4.32 క్రోర్స్ పోయింది. ఈ ఇయర్ మహా కుంభమేళకి ఆయన వైఫ్ పోవెల్ గారు అటెండ్ అయ్యారు. వరల్డ్స్ టాప్ మోస్ట్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నాడు. వరల్డ్స్ టాప్ మోస్ట్ జీనియస్ అయిన నికోలా టెస్లా మన స్వామి వివేకానంద శిష్యుడు. వరల్డ్స్ టాప్ మోస్ట్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన బ్రూస్లీ మన జిడ్డు కృష్ణమూర్తిని ఫాలో అయ్యేవాడు. లీస్ ఫిలాసఫీ ఆఫ్ జీత్ గుండో విచ్ ఎంఫసైజడ్ అడాప్టబిలిటీ అండ్ స్టైలిస్ స్టైల్ వాస్ ఇన్ఫ్లయన్స్డ్ బై కృష్ణమూర్తిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ ఫ్రమ ద నోన్. సద్గురు ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. థియరిటికల్ ఫిసిస్ట్ ఓపెన్ హేమర్ మెటా ఫౌండర్ మార్క్ జుకర్బర్గట్wిitటter కో ఫౌండర్ జాక్ డోర్సీ యక్టర్స్ విల్స్మిత్ రాబర్ట్ డౌనీ సిల్వెస్టర్ స్టాన్ జూలియర్ రాబర్ట్స్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతుంటేనే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది కదా ఇది సార్ మన భారతదేశం బ్రాండ్ మతం పుట్టకముందే మనిషి పుట్టుకకి అర్థం మోక్ష మార్గం చూపింది సనాతన ధర్మం అందుకే మంది మతం కాదు ధర్మం సనాతన ధర్మం ఎన్నో శతాబ్దాల నుండి ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ దేశాలకి విశ్వ గురువు అంటే ఒక్క భారతదేశం మాత్రమే దండయాత్రలు తీసిన దుర్మార్గులు విశ్వ గురువు స్థాయి నుంచి క్రమక్రమంగా ఎలా దొంగదెబ్బ కొట్టారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాల్యూబుల్ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. గురు గు అంటే డార్క్నెస్ రు అంటే రిమూవర్ అని అర్థం. ఆ గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ఆల్ డార్క్నెస్ అండ్ టేక్స్ యు టువర్డ్స్ ద లైట్ భారతదేశం విశ్వ గురువుగా నిలవడానికి మూల కారణం మన వేదజ్ఞానం. ఆ జ్ఞానం మనక ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎనీ గెస్ ఆప్షన్స్ ఇవ్వమంటారా? ఏ వశిష్ట మహర్షి బి రమణ మహర్షి సి వేదవ్యాస డి అపౌర్సయ పేర్లోనే వేదం ఉంది కదా అని వేదవ్యాస అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ ఎలాగో చెప్తా వేదాలు ఒక పర్టికులర్ వ్యక్తి రాసింది కాదు మన యోగులు డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు ఆ మంత్రాలు ఆ తంత్రాలు ధర్మ అధర్మ కామ మోక్ష స్థితిగతులు టోటల్ కాస్మోస్ శృతి రూపంలో ఈ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతాయి. శృతి అంటే విన్నది అని అర్థం. అలా ఎందరో యోగులు మహర్షులు ఎంతో తపస్శక్తితో వేదజ్ఞానాన్ని భారతదేశానికి అందించారు. మీకు ఫాక్ట్ చెప్పనా కృత త్రేత ద్వాపర యుగాల్లో రాక్షసులు ఋషులు చేసే సాధనని యజ్ఞకృతువులని డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళని మన పురాణాల్లో విన్నాంగా వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళ వేషం పూర్తిగా మారింది. ఆ యుగంలో ఈజీగా ఐడెంటిఫై చేసేయొచ్చు. ఈ యుగంలో వాళ్ళ డామినేషన్ే ఎక్కువ అండ్ వాళ్ళు మన మధ్య కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇది కలియుగం ద యుగ ఆఫ్ డార్క్నెస్ మరి కలియుగ రాక్షసులని ఎలా గుర్తుపట్టాలి ఒక దారి ఉంది. వాళ్ళు చేసే యక్షన్స్ ఇంటెన్షన్స్ ని బట్టి మనం వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి మాట్లాడుకుందాం. పూర్వం జ్ఞానం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి మెమరీ పవర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దీన్ని స్మృతి అంటారు. స్మృతి అంటే జ్ఞాపకం లేదా జ్ఞాపక శక్తి అని ఎగ్జాంపుల్ కి వేదం నేర్చుకోవాలి అంటే గురువు చెప్పిందాన్ని శిష్యులు ఉచ్చరిస్తూ నేర్చుకునే వాళ్ళు అందుకే మనకి వేదాన్ని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం రాలేదు. బట్ ఎప్పుడైతే నెక్స్ట్ కలియుగం వస్తుంది అందులో మనుషుల క్యాపబిలిటీస్ డ్రాస్టిక్ గా డౌన్ అయిపోయి పాపం పెరిగిపోతుందని తెలిసిందో వ్యాస మహర్షి ఫస్ట్ చేసిన పని అన్నిటిని ప్రాపర్ గా డాక్యుమెంట్ చేయడం. వేదాలని మొత్తం కంపైల్ చేసి వాటిని ఫోర్ డివిజన్స్ చేసి అందులోనూ సంహితాస్ ఉపనిషత్స్, అరణ్యకాస్, బ్రాహ్మణాస్ అని ఇంటర్నల్ డివిజన్స్ చేశారు. ఇంత పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ప్రపంచం మొత్తం వెతికినా ఎక్కడా ఉండదు ఇట్స్ ఏ ఛాలెంజ్ అందుకే వ్యాస మహర్షికి వేదా అనే బిరువిచ్చి వేదవ్యాసుడు అయ్యాడు. వేదాల నుంచి సకల శాస్త్రాలు గ్రంథాలు, దర్శనాలు పుట్టాయి. అంతేకాకుండా నాలుగు ఉపవేదాలైన ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వేద అండ్ శిల్పవేద కూడా వీటిలో భాగమే. సుశృత ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ సర్జన్ ఫాదర్ ఆఫ్ సర్జరీ అండ్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆచార్య నాగార్జునని ఐన్స్టీన్ ఆఫ్ ఇండియా అంటారు. సెకండ్ సెంచరీ సిఈ లోనే థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన వర్క్ చేశారు. సో లెక్క ప్రకారం ఐన్స్టన్ ని కదా ఆచార్య నాగార్జున ఆఫ్ జర్మనీ అని పిలవాలి. ఈరోజు ప్రపంచంలో ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ కి బేస్ అయిన కంప్యూటర్స్ వర్క్ అయ్యేది జస్ట్ జీరో 1 ఉండే బైనరీ సిస్టం తోనే ఇది ఇన్వెంట్ చేసింది ఆచార్య పింగాల లఘువు గురువు అని తెలుగు గ్రామర్ లో చదువుకున్నాం అదే ఇది. ఏ మేనేజ్మెంట్ కాలేజ్ కైనా వెళ్లి టాప్ ఫైవ్ మేనేజ్మెంట్ బుక్స్ అని అడిగితే కచ్చితంగా అర్థశాస్త్రం ఉంటుంది. ఇట్స్ ఈక్వల్ టు భగవద్గీత అని నా ఒపీనియన్ బికాజ్ రెండు ఈరోజుకి రెలవెంట్ ఇది జస్ట్ వీడియో లెంగ్త్ కన్స్ట్రైన్స్ వల్ల మెన్షన్ చేసిన కొన్ని పేర్లు మాత్రమే. మన భారతీయ ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ గురించి సపరేట్ వీడియో చేస్తా అక్కడ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరి ఇంతమంది మహానుభావులు పుట్టి ఇంత విస్తృత జ్ఞాన సంపద కలిగిన ఈ వేదభూమిలో మన జనరేషన్ వచ్చేసరికి మనక ఎంత మిగిలింది అసలు మనం ఎందుకు మన సొంత జ్ఞానాన్ని వదిలేసి వెస్టర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాం. దానికి ఆన్సర్ ఇంతకుముందే చెప్పానుగా కలియుగ రాక్షసులని వాళ్ళ వల్లే మనకి దుస్థితి పట్టింది. ఈ కలియుగ రాక్షసులు దండయాత్రలు చేసినప్పుడు దేశ సంపద జ్ఞాన సంపద స్త్రీలను మాత్రమే టార్గెట్ చేసేవారు. ఎక్కడ సంపద ఉందో దాన్ని దోచుకోవడం ఎక్కడ జ్ఞానం ఉందో దాన్ని తగలబెట్టి సునకానందం పొందడం ఎవరికీ జ్ఞానం ఉందో వాళ్ళని రాక్షసత్వంగా సజీవ దహనం చేయడం ఎక్కడ స్త్రీ ఉందో వారిని చెరిచి పైత్యం తీర్చుకున్నాక వాళ్ళ హారమ్స్ కి పంపడం దండయాత్రల పేరుతో 1200 సంవత్సరాలుగా మనకి జరిగింది ఇదే జనరల్ గా ఒక పేపర్ కాలడానికి ఎంత టైం పడుతుంది ఈజీగా అర నిమిషంలో కాలిపోతుంది. అదే ఒక బుక్కు కాలడానికి చిన్నప్పుడు భోగి మంటల్లో వేసే ఉంటారుగా ఈజీగాటూ మినిట్స్ లో బుక్ అంతా కాలిపోతుంది. ఒకేసారి 10 బుక్కులు భోగి మంటల్లో వేస్తే ఒకేసారి కాలడం వల్ల దానికి టూ మినిట్స్ే పడుతుంది. అలాంటిది నలంద విశ్వవిద్యాలయం జ్ఞాన సంపదను తగలబెట్టడానికి భక్తియార్ కిల్జీకి మూడు నెలలు పైన పట్టింది. ఈ జ్ఞానం మళ్ళీ ఇంకెక్కడ గ్రో అవుతుందో అన్న భయంతో అందులోని టీచర్స్ ని కూడా తగలబడుతున్న నలందాలో వేశడు. ఒక్క నలంద మాత్రమే కాదు తక్సిల గురుకులాలు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఎన్నో దండయాత్రలు ఎంతో జ్ఞాన సంపద ఇంత దారుణం చేసినా కూడా సరిపోక వాళ్ళ గురించి వాళ్లే మంచిగా సెల్ఫ్ డబ్బా బుక్స్ ఆటోబయోగ్రఫీస్ రాసుకున్నారు. బాబుర్ నామ అక్బర్ నామా ఐన్ అక్బరి అలంగిర్ నామా ఇలా ఎన్నో నిజమైన చరిత్రను తుడిచేసి అబద్ధాన్నే నిజాల్లా రాసుకున్నారు. దరిద్రం కొద్ది ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం వీళ్ళు రాసిన అబద్ధాలనే చదువుకుంటున్నాం. ఏనాటి సెన్ అయినా ఏడేళ్లకు వదులుతుంది. ఈ సెన్ ఎప్పుడు వదులుతుందో ఏమో మనకి మన పురాణాల్లో రాసిన పుష్పక విమానం బ్రహ్మాస్త్రం లాంటి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకు కేవలం కదలగానే మిగిలిపోవడానికి కారణం నేను చెప్పక్కర్లేదు అనుకుంటా మీకే క్లియర్ గా అర్థమయ ఉంటుంది. అయినా కూడా ఎక్కడా అదరకుండా ఎప్పటికప్పుడు మహానుభావులు ఈ నేలపైన పుడుతూ జ్ఞాన సంపదని సృష్టిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు. కానీ ఈసారి వ్యాపారం పేరుతో వచ్చిన తెల్లదొరలు తెలివిగా మాటేశారు. అప్పటికే బలహీనపడుతున్న మొగల్ చక్రవర్తులకి సామంతరాజులకి డబ్బు ఆయుధాలు ఎరగా వేశారు. ఒప్పుకుంటే సంధి లేదా సమరం అఖండ భారత మొత్తాన్ని ఆక్రమించాలంటే విద్యా వ్యవస్థ జ్ఞాన సంపద సంస్కృతి మీద దెబ్బకొడితే చాలు అని తెలుసుకున్నారు. కాకపోతే వీళ్ళ మోడ సూపర్ కొంచెం డిఫరెంట్ తగలబెట్టడాల లాంటివి చేయలేదు కానీ అంతకంటే పెద్ద స్కెచ్చే వేశారు. జ్ఞాన సంపద మీద దెబ్బ కొట్టాలంటే అసలు అందులో ఏముందో తెలుసుకోవడానికి మన వేదాల్ని పురాణాల్ని మాక్స్ మలర్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడు. భాష నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ట్రాన్స్లేషన్స్ చేశాడు. అందుకే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనే సామెత కొట్టిందేమో ఇందులో పోకెరీ రేంజ్ ట్విస్ట్ ఏంటంటే మాక్స్ మిల్లర్ తన జీవితంలో ఒక్కసారి కూడా భారత్లో అడుగు పెట్టలేదు. గురుముఖతః నేర్చుకోవాల్సిన వేదాన్ని టైం పాస్ కి పడుకొని చదివే నావెల్స్ రేంజ్ కి దిగజార్చాడు. మన రాజ్యాంగకర్త వేదాన్ని నేర్చుకున్నాను అని క్లేమ్ చేసుకుంది గురుముఖంగా కాదు మాక్స్ మలో నోవెల్స్ చదివి సాంస్క్రిట్ ఒక్క ముక్క కూడా రానివాడు అసలు మన భారతదేశంలో అడుగే పట్టనివాడు మన స్క్రిప్చర్స్ ని ప్రాపర్ గా ట్రాన్స్లేట్ చేసి ఉంటాడని ఎలా నమ్మారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంత పెద్ద మేధావ అయండి. ఇదంతా భారత్ కి బయట జరుగుతుండగా లోపల ఒకడు గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్ కి మన ఎడ్యుకేషన్ సిస్టం పైన లెటర్ రాశడు. వాడే థామస్ బాబింటన్ మెకాలే మినిటోన్ ఎడ్యుకేషన్ లోని ఫోర్ మెయిన్ పాయింట్స్ చెప్తా చూడండి. గురుకులాస్ కి పేట్రియనేజ్ ఇమ్మీడియట్ గా ఆపేయాలి. ఆ సింగల్ సెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాస్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ షుడ్ బి ద ప్రైమరీ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒక పర్టికులర్ క్లాస్ ని మాత్రమే ఎడ్యుకేట్ చేసి బ్రిటిష్ కింద ఉండేలా చేసుకున్నారు. దీన్నే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటారు. ఇది కాదా మరి డిస్క్రిమినేషన్ అంటే మెల్లగా గురుకులాలకి ఫండింగ్ ఆపడం వల్ల ఫోర్స్డ్ ఇంగ్లీష్ వల్ల డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ వల్ల భారత్లో ఒక కొత్త పారడైమ్ షిఫ్ట్ జరిగింది. బాడీ మాత్రమే భారత్ది మైండ్సెట్ మొత్తం వెస్ట్ ఉంది. భారత్లో భారత్ పోయి ఇండియా మిగిలింది. భారత్లో ఇండియా పోయి భారత్ వచ్చిన రోజు ఎకనామిక్ గా పొలిటికల్ గా కల్చరల్ గా ప్రపంచంలో మొట్టమొదటి స్థానం మనమే ఉంటాం. పార్టికల్ ఫిజిక్స్ లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ స్టడీ చేయడానికి సర్న్ మన నటరాజ్ ఫామ్ స్ట్రక్చర్ ని యూస్ చేస్తూ ఉంటే మనమేమో ఒకసారి డాల్టన్స్ అటామిక్ థియరీ నేర్చుకుంటాం. మళ్ళీ అది తప్పని తెలిసి రూతర్ఫోర్స్ అటామిక్ మోడల్ అది కూడా తప్పని ఇప్పుడు క్వాంటం మెకానిక్ మోడల్ నేర్చుకుంటున్నాం. ఇలా 50 ఇయర్స్ కి ఒకసారి మారే వెస్టరన్ సైన్స్ మైండ్సెట్స్ తో మన అస్తిత్వాన్ని కోల్పోయాం. కొన్ని వేల ఏళ్ల క్రితమే నటరాజస్వామి స్ట్రక్చర్ లో క్వాంటం ఫిజిక్స్ స్ట్రింగ్ థియరీ డైనమిక్ ఈక్విలిబ్రియం లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ ని డిపిక్ చేశారు మన మహర్షులు. రిక్బ్రిక్స్ అనే నాసా రసర్చర్ 1985 లోనే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ సాన్స్క్రిట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాడు. భారత్ ఇప్పటికీ ఎప్పటికీ విశ్వగురు అని మనం కాదు సర్న్ ఆ నాసా వాళ్లే చెప్పారు. మనం మన తలపత్ర గ్రంధాలని మ్యూజియం లో పెట్టుకుంటే వాళ్ళు వాటిలని రసెర్చ్ చేసి అడ్వాన్స్డ్ అవుతున్నారు. అదే మనకి వాళ్ళకి ఉన్న తేడా. సో మెకోలే గాడు రిప్రసెంట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టం నుంచి గురుకుల ఎడ్యుకేషన్ ని ఎప్పుడైతే గుర్తించి షిఫ్ట్ అవుతామో అప్పుడే మనది అసలైన రిపబ్లిక్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ సజెషన్స్ కామెంట్ బాక్స్ లో రాయండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి సో దట్ మనకి రీచ్ పెరిగి ఎక్కువ విజిబిలిటీ వస్తుంది. మన దేశానికి మనం కాకపోతే ఇంకెవరు నిలబడతారు. జై హింద్.
 *మానవ జన్మే ఒక "దశావతారం"*

1. మాతృమూర్తి గర్భం లో ఈదుతూ ఎదిగే - *"మత్స్యం"*

2. నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక - *"కూర్మం"*

3. వయసులోని జంతు ప్రవర్తన ఒక - *"వరాహం"*

4. మృగం నుంచి మనిషిగా మారే దశ - *"నరసింహం"*

5. మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు - *"వామనుడు"*

6. ఎదిగినా క్రోధం తగదని తేలిస్తే వాడు - *"పరశురాముడు"*

7. సత్యం, ధర్మ, శాంతి ప్రేమలతో తానే ఒక - *"శ్రీరాముడు"*

8. విశ్వమంతా తానే అని విశ్వసిస్తే నాడు- *"శ్రీకృష్ణుడు"*

9. ధ్యానియై, జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక - *"బలరాముడు"*

10. కర్తవ్య మొనరించి జన్మసార్ధకతతో కాగలడు - *" కల్కి"*

✅👉 తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరం... *"దశావతారం"*

✅👉 మలుచుకుంటే ఒక్కజన్మలోనే మనిషి -  *"దశావతారం"*

    *✳️ యతో ధర్మస్తతో జయః ✳️*

*🙏సర్వే జనాః సుఖినో భవంతు🙏* 

*┅━❀꧁ శ్రీమద్భగవద్గీత ꧂❀━┅*
                      *{గ్రూప్}*
        *ఆధ్యాత్మికం అన్వేషకులు*
🍁🙏🍁 🙏🕉️🙏 🍁🙏🍁
 *స్నానం: 💦*

*స్నానం చేయబోయే సమయంలో చెంబులోకి నీళ్లు తీసుకొని* 
*క్రింద ఇచ్చిన శ్లోకం చదవాలి.*
💦💦 💦💦 💦💦 💦💦
*అలా చేస్తే ఆయా నదుల్లో స్నానంచేసిన ఫలితమూ వస్తుంది.*

*💦గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరీ జలేస్మిన్ సన్నిన్ధిం కురు**

*🌾స్నానంచేసిన తరువాత క్రింద ఇచ్చిన నామాలని అంటూ నాలుగు నీటి చుక్కలను శిరస్సు మీద చల్లుకొంటే*
*మనం శరీరానికి వెలుపల,*
*లోపల కూడా పవిత్రులమవుతాం.*

*"పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!"*
🍏🌸
*హరే కృష్ణ గోవిందా*
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
           *రేపటి గెలుపు పిలుపు*

*మన ఎదురుచూపుల చివరి రోజులు వచ్చి పోతున్నాయి. కొత్త సంవత్సరం మొదలయ్యింది. నిత్యనూతనుడైన సూర్యుడు కొత్త కాంతులతో వేనవేల వెలుగు రేకలతో బంగారు భవిష్యత్తుకు దారి చూపుతూ వచ్చేసాడు. జగత్తును వెలిగించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆనంద ప్రదాత. సూర్యుడు శాశ్వతం కానీ, జీవన కాలం శాశ్వతం కాదు. ప్రతిక్షణం వేళ్ల సందులోంచి నీటిలా మనకు తెలియకుండానే జారి గతంలో కలిసిపోతుంటుంది. ఆ సంగతి తెలిసీ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం దాని కోసం ఎదురుచూస్తూ వుంటేనే జీవితం. రేపటి మీద ఆశలతో జీవించాలి. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ, భవిష్యత్తులోకి ప్రవేశించాలి. విశ్వంలో అన్నింటికి శక్తినీ తేజస్సునూ ఇచ్చేది- కనిపించే సూర్యుడు.*
*అయితే అతడి వెనక, ఈ విశాల విశ్వం వెనక ఉన్న ఏకైక సూర్యుడు ఆత్మ రవి. అతడే జ్ఞాన భాస్కరుడు. పగలనక, రాత్రనక ప్రతి జీవి హృదయంలో స్థావరజంగమాత్మక ప్రపంచాన్ని నడిపించే సూర్యుడు. రేపటికి అతడే ఆధారం. అతడే అందరికీ దారి చూపిస్తాడు. అందుకే ఆ రేపటి కోసం కోటి ఆశలతో కొత్త కోర్కెలతో అందరూ ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు.*

*ప్రహ్లాదుడి కోసం వచ్చిన నారసింహ స్వామిలా దైవం రావాలి. చెడును చీల్చి చెండాడి, మంచికి పట్టం కట్టాలి. దైవత్వాన్ని నిరూపించాలి. మన కలల తోటలో మనమే పిల్లలమై, రేపటి కోసం రంగురంగుల చిత్రాలెన్నో గీసుకోవాలి. ప్రతి ఇల్లు ఇంద్రధనుస్సు కావాలి. ఎంతో పోరాడి తల్లి గర్భంలోకి చేరి ఈ పుట్టుకను సాధించిన మనకి విజయం సాధించడమనేది జన్మహక్కు. విజయమే మన నినాదం. నిన్నటిని, నేటిని విత్తనాలుగా నాటి, రేపటి పంటను పండిద్దాం. ఈ రంగస్థలం మీద ఈ రోజుకు తెరపడగానే, వచ్చిన నూతన సంవత్సరానికి మరో ఆశల, ఆనందపు తెరను తీద్దాం. దేవుళ్లకు ప్రణ మిల్లి వేడుకుందాం... సత్యం వైపు నడిపించమని! కాలం ఇంద్రజాలంతో మాయ చేసినా తట్టుకుని నిలబడే శక్తిని ఇమ్మనమని!! పాత సంవత్సరానికి వీడ్కోలు పలికాం... మంచిని పదే పదే స్మరించుకోవాలి. చెడుని విస్మరించాలి. చెయ్యబోయే కొత్త సాహసాలకు అందరి దీవెనలు అందుకోవాలి. 'భూత, భవిష్యత్, వర్తమానాలు నేను' అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర మన భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు ఉన్నాయి అంటోంది గీత దేవుడు నిర్ణయించిందే మన భవిష్యత్తు అంటోంది శ్రీమద్భగవద్గీత.*

*ఈరోజు మనం నిజాయతీతో, నిర్భీతితో, ప్రేమతో, ధైర్యంగా, గొప్పగా చేసింది రాబోయే రోజులన్నింటిని మార్చి తీరుతుంది. రేపటి కోసం ఎదురుచూద్దాం. కొత్త సూర్యుణ్ని ఆహ్వాననించాం. సంతోషాలు, ఆనందాల కేరింతల్లో మునిగి నీతి, నియమాలు జీవన విలువలు విస్మరించవద్దు. గెలుపు కోసమే రేపటి మలుపు. ఇదే మనందరికీ పిలుపు!!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
 *ఆచార్య దేవోభవ!*

*ప్రపంచ దేశాల్లో భారతదేశానిది ఆచార్య స్థానం. మన దేశ ఆధ్యాత్మిక గురు పరంపర అందుకు మూల కారణం.*

*ఈ దేశం- మహర్షులు నిర్మించిన బడి. జీవన మార్గదర్శక సూత్రాలకు వారిదే ఒరవడి.*

*గురువు మనకు దైవంతో సమానం. 'ఆచార్య దేవోభవ' అనేది వేదాల నిర్దేశం. 'ఆధ్యాత్మిక ఆచార్యుడు నాతో సమానుడు. ఆయన నాకు అన్యుడు కాడు. ఆయనను చూసి అసూయపడరాదు, తాను మానవమాత్రుడని పొరబడకూడదు' అనిజీవితాన్ని గడుపుతూ ఇంద్రియాల్ని నిగ్రహిం చినవాడు), రాగద్వేషాలకు అతీతుడు, అహింసను వ్రతంగా కలిగినవాడు, వేదాంతశాస్త్ర పారంగతుడు, శిష్యుల పట్ల వాత్సల్యంగలవాడు సద్గురువు కాగలడని మనువు పేర్కొన్నాడు. భారతదేశంలో పరంపరాగతంగా సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడే ఈ లోకానికి వెల్లడించాడు.*

*'గురువు, గోవిందుడు ఒకేసారి నా ఎదుట పడితే నేను మొదటగా గురువుకు నమస్కరిస్తాను' అని కబీర్ ప్రకటించాడు. గురువును మన పురాణాలు 'నడిచే దైవం'గా అభివర్ణించాయి. అద్వితీయ స్థానాన్ని కట్టబెట్టాయి. 'గురుతర బాధ్యత'వంటి పదప్రయోగాలతో- అన్నింటికన్నా ఘనమైనది, బరువైనది, అత్యంత అధికమైనది, ఎత్తుగా ఉన్నది అనే అర్థాలు వచ్చేలా 'గురు' శబ్దాన్ని ఈ జాతి ఉపయోగిస్తూ వచ్చింది. గురు శబ్దానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించింది.*

*జీవితంలోని వివిధ దశల్లో మనిషికి ఎందరో గురువులతో అవసరం ఏర్పడుతుంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు- సూచక గురువు. సంస్కృతీ సంప్రదాయాలు, వివిధ ఆశ్రమ ధర్మాల్ని అధ్యయనం చేయించేది-వాచక గురువు. మంత్రోపదేశం చేసినాయన బోధక గురువు. జ్ఞానమార్గం అలవరచేది-విహిత గురువు. పరమాత్మతో సంధానాన్ని కూర్చేది- పరమ గురువు.*

*గురువు శిష్యుణ్ని తరింపజేసే మార్గాలూ రకరకాలు. దీక్షలు వాటికి ముఖ్య సాధనాలు. మంత్ర దీక్ష, స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష. చూపుతోనే తన శిష్యుణ్ని దీక్షితుణ్ని చేసే దృక్ దీక్షవంటి పద్ధతుల్ని గురువులు అనుసరిస్తారు. సనకసనందనాదులకు దక్షిణామూర్తి, ఎందరో శిష్యబృందానికి రమణ మహర్షి మౌనంతోనే ఉపదేశం అందించారు. 'నేను ఇరవై నాలుగుమంది గురువుల నుంచి జ్ఞాన సముపార్జన చేశాను' అని దత్తాత్రేయుడు ప్రకటించాడు.*

*సత్యవాది, సంయమి (నియమ నిష్ఠలతో జీవితాన్ని గడుపుతూ ఇంద్రియాల్ని నిగ్రహించినవాడు), రాగద్వేషాలకు అతీతుడు, అహింసను వ్రతంగా కలిగినవాడు, వేదాంతశాస్త్ర పారంగతుడు, శిష్యుల పట్ల వాత్సల్యంగలవాడు సద్గురువు కాగలడని మనువు పేర్కొన్నాడు. భారతదేశంలో పరంపరాగతంగా అనేకమంది సద్గురువులు ప్రభవించారు. ఆర్ష సంస్కృతికి ఆలంబనగా, సమాజానికి వేగుచుక్కలుగా, జ్ఞానదీపధారులుగా ఈ నేలను పావనం చేశారు. మార్కండేయ పురాణంలోని తాంత్రిక పరంపర దేవాది దేవుడైన పరమశివుణ్ని 'ఆదిగురువు'గా వర్ణించింది. లోకం శ్రీకృష్ణుణ్ని 'జగద్గురువు'గా ఆరాధించింది.*

*గురుశిష్య పరంపర అనాదిగా ఈ జాతికి జ్ఞానభిక్షను ప్రసాదించిది. దైవానుగ్రహానికి పాత్రులు కావాలంటే ముందుగా గురు కటాక్షం లభించి తీరాలి. సద్గురువు కోసం వెతుక్కోవడమే మన పద్ధతి కాదు. సరైన శిష్యుడిగా రూపొందడానికి ఎవరికివారే ముందుగా కృషి చేయాలి. శిష్యుడు కాదగిన యోగ్యత సిద్ధించగానే, గురువు ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు. ఇది ఎందరి విషయంలోనో ఎన్నోసార్లు నిరూపణ అయిన సత్యం. ఇదే ఆధ్యాత్మిక గురు పరం పరకు చెందిన మూల సూత్రం.*

*అలా అందరూ తయారుకావాలన్నదే సద్గురువుల ఆకాంక్ష!*

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌻🌼 🙏🕉️🙏 🌼🌻🌼
 *మార్గదర్శి.....* 

*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా...* 

*📿🪔📿 సమర్థుడి సహాయం-సదా సుఖకరం 📿🪔📿*

*జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, నష్టాలకు లెక్కలేదు. అవి చాల బాధను కలిగిస్తాయి. కష్టాలకు కారకులైన వారిని 'కనిపిస్తే కాల్చేద్దామన్నంత ఉద్రేకం కలుగుతూ ఉంటుంది. ఇది సహజం. కష్టాలు, నష్టాలు కనిపిస్తాయే తప్ప కారణాలు కన్పించవు. ఒక వేళ కారణాలుగ ఏ వ్యక్తులో కొందరు కనపడినా, మనకంటే వారు బలవంతులైతే, ఏమీ చేయలేక, లోలోపలే మండిపడుతాం. చేతకానితనానికి మరింత ఏడుస్తాం. నిజానికి కష్టనష్టాలకు కారణం బయటి పరిస్థితులా? ఆలోచించండి... కానేకాదు. బయట జరగవలసినవేవో, వాటిమానాన అవి సాగుతూంటాయి. వాటిని అర్థం చేసుకోలేని మనస్సు, దానిని బలవంతంగ చెడుమార్గాలవైపు లాక్కుపోయే ఇంద్రియాలే, మన కష్టనష్టాలకు మూలకారణాలు, వాటిని అదుపు చేయగలవారికి జీవితంలో ఏమీ కష్టమనిపించదు.*
*అది చేతకాని వారికి అన్నీ సమస్యలే. అయితే, ఈ ఇంద్రియాలు మన మాట వింటాయా? మనకులొంగుతాయా? మనస్సు మన అదుపాజ్ఞలలో ఇముడుతుందా? ఊహు! అవి మనతో ఉన్న, మనవస్తువులు కావు. కర్మానుభవానికి భగవంతుడు మనకు ఇచ్చాడు. శరీరంలో ఉన్నంతవరకూ వాటిని వాడుకోవచ్చు. అంతే! అవి మాటవిననపుడు, వానినిచ్చిన భగవంతునికి వాటినప్పగించాలి తప్ప, మనము రిపేరు చేసే ప్రయత్నం చేస్తే అవి మరింత దిగజారతాయి, అవి చాలా మొండివి. ఎవ్వరి మాటావినవు. వింటున్నట్టుగ ఉంటాయి. పూర్తిగ మునిగిపోయాక తప్ప, అవి ముంచాయనేది తెలియనివ్వవు.*

*మేనక వశుడైన విశ్వామిత్రుడు, పుత్రుని ఆయువును గూడ అడిగి తీసుకొని సుఖాలు అనుభవించిన యయాతి చక్రవర్తి దీనికి చక్కటి ఉదాహరణలు.*

*ప్రతిప్రాణికీ 10 ఇంద్రియాలుంటాయి. 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు. పనిచేసి శక్తిని బయటకు వదిలేవి కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, వాక్కు, మలద్వారము, మూత్రద్వారము అనే ఐదూ కర్మేంద్రియాలు. చూపుతెలిపే కన్ను, వాసన తెలిపే ముక్కు, స్పర్శతెలిపే చర్మము, రుచితెలిపే నాలుక, శబ్దము తెలిపే చెవి, అనే ఐదింటినీ జ్ఞానేంద్రియాలంటారు. ఇవి బయటి వస్తువులకుండే స్వభావాలను గుర్తించి, తెచ్చి మనస్సుద్వారా జీవుని కందిస్తాయి. వస్తువులకుండే రంగు, రుచి, స్పర్శ, వాసన, ధ్వని వంటి స్వభావాలనే విషయాలంటారు. ఇంద్రియాలు విషయాలను గ్రహించి, మనస్సులో నిల్వచేస్తాయి. తన వద్దనున్న నిల్వలను బట్టి, ఇంద్రియాలను పంపి, మనస్సు మరింతగ విషయాలకు బానిస అవుతూ ఉంటుంది. ఆ లోపలినిల్వలనే 'సంస్కారా'లంటారు. తాము సంపాయించిన సంస్కారాల కారణంగ ఇంద్రియాలు, మనస్సుగూడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, ప్రపంచంలో, కష్టనష్టాలను కొని తెస్తున్నాయి. మనం వాటికి బానిసలమై ఈ శరీరంలో బ్రతుకుతున్నాము. అంటే, మన సేవకోసం పెట్టుకొన్న సేవకులు, వారి దురలవాట్లు మనకి చెప్పి, తమ చెప్పుచేతల్లో మనని పెట్టుకొని ఆడిస్తున్నారన్నమాట! మనం బలహీనులం. మరిప్పుడేమి చేయాలి? మనస్సును, ఇంద్రియాలను వదిలేయగలమా? అంటే చనిపోవడమే కదా! అది చేయలేము. పోనీ అలానే ఏడుస్తూ బ్రతకాలా? మరింత దిగజారిపోతూనే ఉంటాము, ఇంద్రియాల ప్రభావంవల్ల.*

*ఇక, చేయవలసినది ఏమిటి? మనను అభిమానించిన, ఓ సమర్థుడైన స్నేహితుని సహాయం పొందాలి. ఈ ఇంద్రియాలకు, మనసుకుగూడ యజమాని, మన మీద నిష్కల్మషమైన ప్రేమాభిమానాలుకల శ్రీకృష్ణుని సహాయం పొందుదాం! శ్రీకృష్ణుడు మన సహాయకుడై, మనస్సును ఇంద్రియాలను ఇష్టమొచ్చినట్లు పోనీక, మంచి మార్గంలో నడిచే శిక్షణ యిస్తాడు. ఒక రథానికి భాగ తీసుకువెడతాయని 4 గుఱ్ఱాలు కట్టాము. ఆ గుఱ్ఱాలను నడిపేవాడు సారథి. ఆతడు గుఱ్ఱాలను సరిగా నడిపిస్తే రథం మార్గంలో నడిచి గమ్యం చేరుతుంది. ప్రయాణం చేసే వ్యక్తి సుఖపడతాడు. గుఱ్ఱాలు మాటవినకుండా నాలుగు దిక్కులకూ పరుగులు తీస్తే, సారథి మతిలేనివాడే అయితే, రథం నశించి, ప్రయాణీకుడు ప్రమాదంలో మునుగుతాడు. శరీరమొక రథమయితే, ఇంద్రియాలు గుఱ్ఱాలు. వాటిని, అదుపుచేసే మనస్సు కళ్ళెం. జీవుడనే మనము పయనిస్తున్నామిందులో. అయితే సారథిగ మన అల్పబుద్ధినే పెట్టుకుందామా? అతిశక్తివంతములైన ఈ గుఱ్ఱాలను నియంత్రించడం చేతకాదు. దానివల్లనే గద, మనం ఇన్నిరకాల ఇక్కట్లు కొనితెచ్చుకున్నాం. చివరకు రోజూ అసంతృప్తితో ఏడుస్తూ బ్రతుకడమే గతి. గుఱ్ఱాల శిక్షకుడు, సమర్థసారథిగ నేనే మీ వెంట ఉంటానంటున్నాడు. స్వామి శ్రీకృష్ణుడు. అన్ని గుఱ్ఱాలు ఆయన మాట వింటాయి. ఆయన్ని ప్రేమిస్తాయి. మన బుద్ధిని ప్రక్కన పెట్టు. ఈ ఇంద్రియాల పగ్గాలు శ్రీకృష్ణునిచేతికి అప్పగిస్తేచాలు. ఆయనపై 'బాధ్యతగల నా ప్రభువు శ్రీకృష్ణునకు భారమప్ప గిస్తున్నానని అనుకో. బాహ్యేంద్రియాలని, అంతర ఇంద్రియమైన మనస్సుని గూడ వెంటనే దారిలోకి తెస్తాడు. విధేయతగల సేవకులుగ తీర్చిదిద్దుతాడు. స్వాధీనంలో లేని తెరచాప, పడవను సుడిగుండాల్లోకి త్రోసివేస్తుంది. సమర్థుడైన నావికుడు, గాలివాటం గుర్తించి పడవను ప్రమాదాల బారిపడకుండా ఒడ్డుచేరుస్తాడు. శ్రీకృష్ణుడు సమర్థనావికుడు. మనస్సనే తెరచాపను, ఇంద్రియాలనే తెడ్లను సరిగావేస్తూ శరీరాన్ని చిక్కులపాలు కాకుండా రక్షిస్తాడు. బుద్ధికి బలాన్ని కలిగిస్తాడు.*

*అయితే వీటిని ఆయనవైపు పెట్టడం ఎలా?అందమనిపించిన వేవో ఇంద్రియాలను ఆకర్షిస్తాయి. లోకంలోని రంగులు, రుచులు, వాసనలు, స్పర్శలు, శబ్దాల వంటి వాటిలో అందాలన్నీ శ్రీకృష్ణునిలోంచే వచ్చాయి. ఆయన అందంలోని అల్పాంశాంశ మాత్రమే మనలను పిచ్చివాళ్ళను చేసేస్తున్నాయంటే ఇక ఆయన అందం ఎంతటిదో కద! అందుకే ఆయననొక చిన్నిరూపంలో మన మనస్సులో పెట్టుకుందాం!*

*దానినే శుభాశ్రయమంటారు. ఇంద్రియాలతో చేసేపనులన్ని ఆయన కోసమని, ఆయన సంబంధాన్ని గుర్తుచేస్తూఉందాం! అంటే, తినే పదార్థం, త్రాగే పదార్ధము ఏది కనిపించినా, అది శ్రీకృష్ణునికి అర్పించి గ్రహిద్దాం! వినే, చూసేవన్నీ శ్రీకృష్ణుని సంబంధంతో చూద్దాం! స్పృశించేవాటిలో శ్రీకృష్ణస్పర్శకై ప్రయత్నిద్దాం! ప్రతి భావనలో శ్రీకృష్ణుని గుర్తిద్దాం!*

*ప్రాపంచిక అనుభవాలను, శ్రీకృష్ణునిద్వారా పరిశుద్ధముగా వించుకుందాం!*

*ఎండు కట్టెలలో వేసిన నిప్పుకణము, వాటిని భస్మమయ్యేటట్లు దహించినట్లు క్షుద్రప్రాపంచిక విషయాలు శ్రీకృష్ణుని స్పర్శతో, మలినరహితాలై, పరిశుద్ధాలై, మన మనస్సులో చెడుసంస్కారాలను ఏర్పరచవు. గతంలో ఉన్నవి తొలగుతాయి. మనస్సు నిర్మలమౌతుంది. మంచి జ్ఞానం ఏర్పడుతుంది. ఇంద్రియాలు స్వాధీనాలౌతాయి. కష్టాలకు కారణాలనుకున్న సమస్యలనే, సుఖసాధనాలుగ మలచుకొని దుఃఖాలను దూరం చేసుకోగలుగుతాం!*

*ఇంట్లోచేరిన చెత్తాచెదారం మురిగిపోతే సమస్యే. కానీ వ్యవసాయదా రుడికి దాన్ని యిచ్చేస్తే - డబ్బులూ వస్తాయి. మురికీ తొలగుతుంది. ఆతనికి పంటా పండుతుంది. ఫలసాయం పెరుగుతుంది. శ్రీకృష్ణుడు గొప్ప వ్యవసాయదారుడు, ఆతనికి బాధ్యత నప్పగిద్దాం! మొండి ఇంద్రియాలను మనస్సునూ ఆతణ్ణి అదుపులో పెట్టమందాం! మనమా శ్రీకృష్ణుని శరణువేడుదాం! శ్రీకృష్ణుని సేవకులైన శక్తివంతమైన ఇంద్రియాలతో సుఖాలననుభవిద్దాం!*

*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
           *ఆధ్యాత్మి అన్వేషకులు*
🌺🦚🌺 🙏🕉️🙏 🌺🦚🌺
 🥬 మన ఆరోగ్యం

🍃 అమెరికాలో జరిగిన సర్వేలో మనసు బాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు 

🍃 మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి "బలహీనతలు" పెంచుకోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు

🍃 ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరిదిద్దే పనిలో పడ్డారు.

🍃 అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు.

🍃 ఇది వరకు తినకూడదు
అన్న అన్ని రకాల
ఆహారాన్ని నిరభ్యంతరంగా
తినమంటున్నారు.

🍃 పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.

🍃 ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. 

🍃 కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్ వాక్" చేయాలనుకుంటుంటారు. 

🍃 అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు.

🍃 ఒక్కసారిగా వీరి వైఖరి
ఇలా మారిపోడానికి
కారణం సరికొత్త
అధ్యయనాలలో
వెలుగుచూస్తున్న అంశాలే

🍃 కారణం

🍃 ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. 

🍃 దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.

🍃 "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::

🍃 కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. "మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !

🍃 "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::

🍃 ఉప్పు ఎక్కువగా తినే వారికంటే "ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే "అధిక రక్తపోటు" ఎక్కువట !

🍃 "అతిబద్ధకం" వల్ల చెడుకోలెస్టరాల్ ::

🍃 కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

🍃 "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే,

🍃 "అధికస్వార్ధం",

🍃 "మొండితనం" ఉన్నవారిలోనే ఎక్కువట !

🍃 "అతి విచారం" వల్ల ఆస్త్మా ::

🍃 ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట.

🍃 "ప్రశాంతత" లేక గుండెజబ్బులు ::

🍃 ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. 

🍃 అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట.

🍃 మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. 

🍃 అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం-

🍃 50% ఆధ్యాత్మికత-లోపంవల్ల

🍃 25% మానసిక కారణాల వల్ల

🍃 15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం
వల్ల

🍃 10% శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, 

🍃 "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.

🍃 వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే

- స్వార్ధం,
- కోపం,
- ద్వేషం,
- శత్రుత్వం,
- ఆవేశం,
- అసూయ,
- మొండితనం,
- బద్ధకం,
- విచారం,

🍃 👆 వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించుకోవాలి

- కారుణ్యం,
- త్యాగం,
- శాంతం,
- క్షమ,
- నిస్వార్ధం,
- స్నేహభావం,
- సేవాభావం,
- కృతజ్ఞత,
- హాస్య ప్రియత్వం,
- సంతోషం ,
- సానుకుల  దృక్పథంపెంచుకోవాలి

 💐💐💐💐💐🙏🙏
 *'మనో దౌర్బల్యమే మనిషి పతనానికి మూలం'* 

*తాను సుఖపడడు. ఇతరులను సుఖపెట్టడు. పరులు సుఖపడుతుంటే ఓర్వలేడు. ఇది క్లీబుడి (నపుంసకుడి) లక్షణం. ఇలా నపుంసకులుగా బ్రతుకొద్దంటున్నాడు భగవంతుడు. రెంటికీ చెడ్డ రేవడిలాంటి బ్రతుకు తగదంటున్నాడు. ఇది వదలమంటున్నాడు.*

*ఆత్మన్యూనతా భావం వల్ల ఈ క్లీబత ఏర్పడుతుంది. కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మనో దౌర్బల్యం ఏర్పడుతుంది. ఆలోచనలు క్రమం తప్పితే కర్తవ్యం మరుపుకొస్తుంది. తగనివాటిమీద ప్రేమ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది. కృప మంచిదేకాని, అది తగని రీతిలో, తగని వాటిపై కలగడమే ప్రమాదకరం. ఎంతటి వాడినయినా పాడుచేస్తుంది. హనుమంతునంతటివానినీ హృదయదౌర్బల్యం ఆత్మహత్య చేసుకుందామా అనేంతవరకు తీసుకెళ్ళింది. ఇది తగదు. హనుమంతుడు సీతాదేవి కన్పించకముందు అన్వేషణ ఇంకాపూర్తి కాకుండానే సీత ఇక దొరకదు అనుకున్నాడు.* 

*"వెనుతిరిగి వెళ్ళి సీత లభించలేదని చెబితే రాముడు ప్రాణం వదులుతాడు. అది చూసి లక్ష్మణుడు ఆపై సుగ్రీవుడు దానివల్ల వానరులు, అది తెలిసి అయోధ్యాపురజనులు, ఇందరూ ప్రాణం వదిలేస్తారు.* 

*ఇందరి ప్రాణం తీసేది తానే. సమాచారం చెప్పకపోతే అందరూ. ఆశతో బ్రతికి ఉంటారు" ఇలా వారందరిమీద జాలికలిగినట్లుగా భావించి వెళ్ళొద్దని నిర్ణయించేసుకున్నాడు. వెళ్ళకుండా లంకలో తానుండలేడు. వెళితే వారుండరు. ఇలా జీవించడంకంటే ప్రాణం వదలడమే మేలు అని, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. నిజానికి హనుమంతుడు వెతకకపోయినా, లంకకు వెళ్ళకపోయినా రాముడెవరో ఒకరిద్వారా సీతా సమాచారం తెలుసుకొని ఉండేవాడే. రావాణ వధకూడా చేసియుండేవాడే. హనుమంతుడికా అదృష్టాన్ని కలిగించాడు. నేనే చేసేస్తున్నాననుకున్నాడు హనుమంతుడు. ఆ గర్వం నిరాశ అయి, అది క్లీబతగా మారి ప్రాణానికే ముప్పు తెచ్చుకునేంతవరకు వెళ్ళింది. అయితే బుద్ధిమంతుడు కనుక మరొకడు చెప్పక్కర్లేకుండానే మనోదౌర్బల్యాన్ని వెంటనే దూరం చేసికొని కర్తవ్యాన్ని గుర్తించి పునరన్వేషణ ప్రారంభించాడు. సీత అక్కడే లభించింది. మనో దౌర్బల్యాన్ని ఎలా దూరం చేసుకున్నాడు? అనేది ప్రశ్న. తాను చేసేది సీతారాముల సేవ కనుక వారే తనకి శక్తినివ్వాలని వారికి శరణాగతి చేసాడు. వెంటనే ఫలించింది.*

*అర్జునుడికి తన కర్తవ్యమైన దుష్ట నిర్మూలన చేస్తే బంధువులు పోతారని, స్నేహితులు నశిస్తారని, నరకాలొస్తాయని అనవసరపు ఆలోచనలు మనోదౌర్బల్యాన్ని తెచ్చిపెట్టాయి. కర్తవ్యాన్ని మరిపించాయి. రోగం తొలగడానికి శస్త్ర చికిత్స చేయవలసిన వైద్యుడు ఆపరేషన్ రూములో జాలికలిగి, చికిత్సమాని, కత్తిని పారవేసినట్లు అర్జునుడు ధనుర్బాణాలు శ్రీకృష్ణునిముందరే పారేసి అంత యుద్ధరంగంలోను తన రథంలో చతికిలపడ్డాడు. సహజంగా పరంతపుడు. కాని అసహజమైన కృపవల్ల పనికిరాని క్లిబుడయ్యాడు. రెంటికి చెడ్డ రేవడిలా తయారయిన అర్జునుని శ్రీకృష్ణుడు మేల్కొల్పుతున్నాడు. అతనిని సాకుగ నిలిపి మన మనోదౌర్బల్యాన్ని పారద్రోలుతున్నాడు. ఉత్తిష్ఠ! అంటూ నిద్రాణమైన సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు. కర్తవ్యనిష్టులను కమ్మంటున్నాడు.*

*ఒకడు దేముడు లేడని అనుకున్నాడు. ఉన్నాడని శాస్త్రం చెప్పింది. పెద్దలూ చెపుతున్నారు. ప్రమాణాల్లో నిరూపిస్తారు. ఐనా తన నిర్ణయానికి విరుద్ధం కనుక, అస్తిత్వాన్ని అంగీకరించలేడు. లేడని తాను నిరూపించలేడు. ఉన్నాడన్న వాదనని ఖడించలేడు. ఇదో రకమైన మనోదౌర్బల్యం. అర్జునుడి స్థితి అలాగే ఉంది. మనలో చాలమందిలో ఈ స్థితి ఉంది. పెద్దలంగీకరించనిది, శ్రేయస్సును నాశనం చేసేది, కీర్తిని పాడుచేసేది ఐన మనో దౌర్బల్యాన్ని మట్టుపెట్టి సమాజానికి హాని కల్గించే దుష్ట ప్రవృత్తులను దునిమాడి శ్రీకృష్ణుడు చెప్పే సత్యమార్గములో ముందుకు సాగండి! పరంతపులు కండి! బలహీనతలను అణచివేయండి.*

*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
        *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
 *కురుక్షేత్ర యుద్ధంలో విజయం తర్వాత ధర్మరాజులో చెప్పలేనంత విచారం కమ్ముకుంది.  అందుకు కారణం*….  *అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు,  విరాట మహారాజు,  దుష్టద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మొదలగు పియ్రమైనవారిని, బంధువులను యుద్ధంలో కోల్పోవడమే*. *అంతమంది మరణానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించలేకపోయానని, ప్రియమైనవారి మరణంతో పొందే రాజ్యం నెత్తురు కూడుతో సమానమని భావించాడు ధర్మరాజు. అలాంటి ఆలోచనలతో రాజ్యపాలన చేయడానికి సుముఖత వ్యక్తపరచలేదు*.  

 *ఆ పరిస్థితుల్లో వ్యాసమహర్షి వచ్చి ధర్మరాజుతో   “ రాజ్యపాలన కోసమే క్షత్రియులను పుట్టించాడు  బ్రహ్మదేవుడు. ఆ  ధర్మాన్ని నువ్వు ఆచరించాల్సిందే* . *నీకు నువ్వేదో ఊహించుకుంటూ విచారానికి లోనవుతుంటే బ్రహ్మదేవుడి రాతకు విలువ ఉండదు. సృష్టిలో పదార్థాలు వృద్ధి చెందుతున్నాయంటే అవి నశించడానికేనని*,  *ఎత్తుగా ఎదగడం విరిగిపడేందుకేనని, దగ్గరగా రావడం *దూరమయ్యేందుకేనని, పుట్టడం గిట్టడానికేనని,   సుఖపడటం కష్టాలు పడేందుకేనని గ్రహించాలని” చెప్పాడు*.  
*ధర్మరాజులో అంత తొందరగా మార్పు కనబడలేదు. వ్యాసమహర్షి ఇంకా ఇలా హితబోధ చేసాడు*. 

 *విదేహ రాజైన జనకుడు బ్రహ్మజ్ఞానం పొందని సమయంలో ఆయన బంధువులు చనిపోగా కలిగిన దుఃఖంతో ఇల్లు విడిచి పోవాలనుకున్నాడు*.  *ఆయనకు కూడా నీకు వచ్చినట్టే విచారం, వైరాగ్యంఆవహించాయి.  అశ్మకుడనే బ్రాహ్మణుడు  ఆయనకు  హితబోధ చేశాడు. దాన్నే నీ అవగాహన కోసం వినిపిస్తాను*.  
 
*జీవితములో కష్టసుఖాలనేవి  కావడి కుండల్లా కలిసే ఉంటాయి*. *మేఘాల్ని గాలి చెదరగొట్టి నట్లు వాటికి లోబడి పోయేవారి  ఆత్మను చెదరగొడతాయి.ఎప్పుడూ సుఖాలను మాత్రమే పొందేవారు*, *ఎప్పుడూ దుఃఖాల్ని పొందేవారు   లోకంలో  ప్రత్యేకంగా  ఉండరు.  ఈ భూమండలానికి చక్రవర్తి అయినంత మాత్రాన ముసలితనాన్ని,  మరణాన్ని తప్పించుకోలేరు.  ఏది జరిగినా దైవ నిర్ణయమనే భావాన్ని అలవర్చుకోవాలి. అదే జ్ఞానుల పద్ధతి*.   

 *వైద్యులు  రాత్రింబవళ్లు శ్రమించి వైద్యశాస్త్రమంతా అధ్యయనం చేసి వ్యాధులకు ఏ  మందులు వాడాలో చక్కగా నేర్చుకుంటారు. రోగులు,  స్త్రీల దోషాల్ని తెలివితేటలతో గుర్తించి  వైద్యం చేస్తారు*.  *అంత శ్రమించినా ఒక్కొక్కసారి రోగం తగ్గదు .  వైద్యుల్ని కూడా రోగాలు బాధ పెడుతుంటాయి. దీన్ని బట్టి మానవుడి నేర్పు,  తెలివితేటలు కూడా  విధి వైపరీత్యాలను మార్చలేవని,  మానవుడి తెలివితేటల కంటే విధి బలమైనదని తెలుస్తోంది*. 

*శారీరక అందచందాలు,  బలం,  ఆరోగ్యం ,  అదృష్టం ,  భోగాలు  మొదలైనవన్నీ పూర్వ జన్మ కర్మఫలాన్ని అనుసరించి ఏర్పడతాయి*.  *ఇవన్నీ  మానవులు కోరితే వచ్చేవి,  వద్దనుకుంటే పోయేవి కాదు. దైవ ప్రేరితాలు.   ప్రవాహంలో గడ్డి పరకలు కలసి ప్రయాణం చేస్తూ  కొంతసేపయిన తర్వాత విడిపోతున్నట్టే బంధుత్వాలు కూడా తాత్కాలికమైనవే*. 

   *జనన మరణం వలయంలో అనేక మంది తల్లిదండ్రులని,  భార్యా పిల్లల్ని,  బంధువుల్ని పొందుతూ ఉంటారు.  వీరిలో  ఏ జన్మలో బంధుత్వం కోసమని దుఃఖించాలి. బంధుత్వాలు అశాశ్వతమని తెలుసుకోవడమే జ్ఞానం*. 

 *కాలమనే సముద్రంలో జనన మరణాలనేవి మొసళ్ల వంటివని తెలుసుకొని శోకాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవాలి*.  *మానవుడి శరీరమే కొన్నాళ్ళు భూమి మీద జీవించడానికి అప్పుగా తెచ్చుకున్నది.  శరీరమే సొంతం కానప్పుడు బంధుమిత్రుల మాట ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.  బంధుత్వాలన్నీ కూడా అశాశ్వతమైనవే*. 

 *పుట్టుక చేత రాజ్యపాలన చేయడం నీ ధర్మం . మిగిలినవన్నీ మర్చిపోయి ముందుగా ఆ పని చెయ్యి*.  *ఇంకా నీలో ఉన్న సందేహాలు,  మాలిన్యాలను  సత్పురుషుల సాంగత్యంలో నివృత్తి చేసుకో. అలా అశ్మకుడు చేసిన ఉపదేశంతో వైరాగ్యపు పొరలు విడిపోయి రాజ్యపాలన చేపట్టాడు జనకమహారాజు*.  *నువ్వు కూడా అదే పద్ధతిలో నీ కుల ధర్మమైన రాజ్యపాలన చేపట్టు.  మిగిలిన ఆలోచనలన్నీ విడిచిపెట్టు*.” 
*అలా వ్యాసుడు చేసిన హితబోధతో ధర్మరాజులో గూడుకట్టుకున్న విచారం  మాయమైంది*. 
  *శుభోదయం*

Friday, May 30, 2025

దేవుడున్నాడుగా...!

 *_🙏దేవుడున్నాడుగా...!_* 


*ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు...!మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు..!*

*సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు..! అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు...! తాను దారి తప్పి పోయాడని..!*

*అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి..! ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు..!*

*ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది...! నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు..!*

*అతనికి ఏం చేయాలో పాలుపోలేదు..! ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని, తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు..!*

*పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు...! తనకు తెలియకుండానే… 'భగవంతుడా...! నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు...!*

*వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??'   అని అనుకున్నాడు...!*

*అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని  కాపాడమని కోరుకోవాలనుకున్నాడు..!*

*వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి,తన మనసులో 'నారాయణా ..!నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు...!' అని మొక్కాడు..! మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది...!*
*ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు...! ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు...!*

*అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది!మీరేమైనా చూసారా?" అని అడిగాడు..! అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కలా  కూర్చున్నా..!ఈ వైపు ఏ కుందేలు రాలేదు..!" అన్నాడు..!*

*ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది!ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు..!ఈ రోజు వేట వృథా అయినట్టే...." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు...!*

*వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు..!నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా.!నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా...!" అంటూ కొంచం ధీనంగా అడిగాడు...!*
*అందుకు,ఆ వేటగాడు-ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు..*

*నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా...!ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు..!మనిషే కాపాడాడు..!నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి...!" అన్నాడు..!*

*ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి "ఏందయ్యా సామి?? దేవుడు లేడంటావా? మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు..! అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది..! ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను..!అలాంటిది,ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను..!అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు..! నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని, పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది..! అంతా విష్ణులీల" అన్నాడు...!*

*దానికి నాస్తికుడు "అంతా వైష్ణవ లీలనా? ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు, విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా...?" అని నవ్వుతూ ప్రశ్నించాడు..!*

*అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే, అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా...!" అంటూ......*

*ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి, తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు...!*

*ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి,కొంత డబ్బు తీసి,ఆ వేటగానికి ఇవ్వబోయాడు...!*

*అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు...!*
*అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు...!*

*ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి!కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని, నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయట పడేసావు..! నీవు నారాయణుడివో? నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణా ....! ఇదంతా నిజంగా నీ లీలనే...!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు..!*
🪷🪷🪷🪷🪷
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*

****♥️ *కథ* ♥️ మనలని యధార్థ లక్ష్యం వైపు తీసుకెళ్ళే వాహనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా?

 🧘🧘🧘🧘🧘🧘🧘🧘
♥️ *కథ*  ♥️

మనలని యధార్థ లక్ష్యం వైపు తీసుకెళ్ళే వాహనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా?

*మన* *వాహనం*!

నేను ముంబైలో ఒక అధికారిక పని మీద బెంగళూరు నుండి విమానం ఎక్కాను. నేను ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. విమానం ఎక్కగానే పైన ఉన్నఅరలో నా బ్యాగ్ పెట్టి నా సీటులో కూర్చున్నాను. సీటు బెల్టు పెట్టుకుని కూర్చునుండగా, నా ప్రక్కన కిటికీ వద్ద సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిని చూశాను.

మరుసటి రోజు ముంబైలో ఉపన్యాసం ఉండడంతో,  దానికి తయారవడంలో నిమగ్నమై, చివరిసారిగా దానికి సంబంధించిన అంశాలు చూసుకుంటున్నాను. దాదాపు 15-20 నిమిషాల తరువాత, నా పనిని పూర్తి చేసి, ఆ డాక్యుమెంట్లను భద్రంగా బ్యాగ్‌ లో పెట్టుకుని కిటికీలోంచి బయటకి చూస్తూ, నా పక్కన కూర్చున్న వ్యక్తి ముఖంలోకి యాదృచ్ఛికంగా చూసాను.

ఇంతకు ముందు ఎక్కడో ఈ మనిషిని చూసినట్లుగా నాకనిపించింది! నేను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, అనాలోచితంగా ఆయననే తదేకంగా చూస్తున్నాను, గుర్తొస్తుందేమోనని!

ఆయన వృద్ధుడు, కళ్ళ చుట్టూ, నుదిటిపై ముడతలు ఉన్నాయి. ధరించిన కళ్ళజోడు సాదాగా, మామూలు ఫ్రేమ్‌ తో ఉంది. ఆకట్టుకునేంతగా లేని సాధారణమైన ముదురు గోధుమ రంగు సూట్‌లో ఉన్నాడు. సహజంగా, నా దృష్టి ఆయన బూట్ల మీదకు వెళ్ళింది. అవి చాలా సాధారణమైన మామూలు బూట్లు మాత్రమే.

 తన మెయిల్‌ కు సమాధానాలు ఇవ్వడంలో, తన ఆఫీస్ కాగితాలను పరిశీలించడంలో నిమగ్నమై ఉన్నాడు. అకస్మాత్తుగా, ఆయన ఎవరో నాకు జ్ఞాపకం వచ్చింది.

నేను, “మీరు నారాయణ మూర్తిగారు కదా?” అని సంభాషణ మొదలుపెడదామన్నట్లుగా అడిగాను.
 నన్ను చూసి, నవ్వుతూ, “అవును”, అని బదులిచ్చారు.

నేను ఆశ్చర్యపోయాను!  కొన్ని క్షణాలపాటు నా నోటమాట రాలేదు. ఇంక అక్కడ నుండి సంభాషణను ఎలా కొనసాగించాలో నాకు అర్ధం కాలేదు.

నేను ఆయనని మళ్లీ చూశాను, కానీ ఈసారి మాత్రం ఒక భారతీయ కోట్లాధికారి, నారాయణ మూర్తి గారిని  చూస్తున్నాను!
ఆయన బూట్లు, సూట్, టై, కళ్లద్దాలు- అన్నీ చాలా మామూలుగా ఉన్నాయి. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి విలువ $2.3 బిలియన్లు, ఈయన ఇన్ఫోసిస్‌  సహ - వ్యవస్థాపకుడు!

నేను ఈ ప్రపంచంలోని అన్ని విలాసాలను పొందగలిగేలా, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించగలిగేంత ధనవంతుడిని అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. 

నా పక్కనున్న ఈ వ్యక్తి, మాత్రం,  మొత్తం ఎయిర్‌లైన్స్ కొనగలిగే స్థోమత ఉన్నవాడు, ఎకానమీ క్లాస్‌లో నాలాంటి మధ్యతరగతి వారితో ప్రయాణిస్తున్నాడు!

నేను ఆపుకోలేక, “ మీరు బిజినెస్ క్లాస్‌ లో కాకుండా ఎకానమీ క్లాస్‌ లో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు ?” అని అడిగాను.
“బిజినెస్ క్లాస్ లో ఉన్నవాళ్ళు త్వరగా గమ్యం చేరుకుంటారా?”, అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

అది ఒక చమత్కారమైన సమాధానం అయినా చాలా అర్ధవంతంగా అనిపించింది! 

అప్పుడు, నన్ను నేను పరిచయం చేసుకుని, సంభాషణ ఇలా కొనసాగించాను, “నమస్కారం అండీ ! నేను ఫ్రీలాన్స్ కార్పొరేట్ ట్రైనర్ ని,  (స్వతంత్రంగా సంస్థలకు శిక్షణ ఇచ్చేవాడు). నేను అనేక MNC లతో, పాన్-ఇండియాతో కలిసి పని చేస్తున్నాను."

తన ఫోన్ పక్కన పెట్టి, ఆయన చాలా శ్రద్ధగా నా మాట వినడం ప్రారంభించాడు. ఆ రెండు గంటల ప్రయాణంలో ఒకళ్ళకొకళ్ళం అనేక ప్రశ్నలు వేసుకున్నాం. ఒక్కో ప్రశ్నతో సంభాషణ ఇంకా లోతుగా సాగింది. ఆ తర్వాత,  ఈ విమాన అనుభవాన్ని నాకు మరింత చిరస్మరణీయం చేసిన ఆ క్షణం రానేవచ్చింది!

" ఈ ప్రపంచంలో చాలా మందికి మీరు ఆదర్శం. మీ జీవితంలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఉండచ్చు. కానీ, మీరు పశ్చాత్తాపపడిన సందర్భం ఏదైనా ఉందా?" అని నేను ప్రశ్నించాను.

అది వినగానే ఆయన మొహం కాస్త గంభీరంగా మారిపోయింది. కాసేపు ఆలోచించి సమాధానం చెప్పారు.
“కొన్నిసార్లు, నా మోకాలు చాలా నొప్పిగా ఉంటుంది.  నా శరీరాన్ని మరింతగా సంరక్షించుకోవలసిందని  అనుకుంటాను. వయసులో ఉన్నప్పుడు, పనిలో చాలా బిజీగా ఉండడం వల్ల, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నా వద్ద సమయం ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కువ పని చేయాలనుకున్నా చేయలేను, నా శరీరం అనుమతించట్లేదు."

“నీవు యవ్వనంలో ఉన్నావు, తెలివిగా, ఉన్నతస్థితిని కోరుకునేవాడిగా ఉన్నావు. నేను చేసిన తప్పు నువ్వు చేయకు. నీ శరీరాన్ని సరిగ్గా చూసుకో, సరైన విశ్రాంతి తీసుకో. భగవంతుని అనుగ్రహంగా నీకు లభించిన ఒకేఒక  శరీరం ఇదే!”

ఆ రోజు నేను రెండు విషయాలు నేర్చుకున్నాను, ఒకటి ఆయన నాకు చెప్పింది, మరొకటి నాకు చూపించినది!

మనమందరం భౌతికంగా మెరుగ్గా ఉండాలనే ఆశతో మన జీవితాలను గడుపుతాం. ఈ ప్రక్రియలో మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం! మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే, మన శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బ తినడానికి మార్గం సుగమం చేసినట్లే.
మన శరీరం బాధలో ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి విలాసవంతమైన వస్తువులైనా మనకు ఉపయోగపడవు. వాస్తవానికి, శరీరం సహకరించడం ఆగిపోయినప్పుడు ప్రతిదీ స్వయంచాలకంగా, అదంతట అదే ఆగిపోతుంది.

ఈ జీవితంలో మనలని ముందుకు తీసుకెళ్లడానికి లభించిన ఒకేఒక శరీరం ఇది, దానిని తేలికగా తీసుకోవడం మంచిది కాదు.
 బుద్ధుడు ఇలా చెప్పాడు, "మన శరీరం విలువైనది, జ్ఞాన సిద్ధికి ఇది మన వాహనం. దానిని సంరక్షించుకోండి."

ఆ రోజు, నా జీవితంలో చాలా అత్యవసరమైన పాఠం నేర్చుకున్నాను.

ఈ ప్రపంచాన్ని మన శరీరంతో పోల్చవచ్చు. ఏదైనా ఒక అవయవం అనారోగ్యస్థితిలో ఉంటే, శరీరమంతా ప్రభావితమవుతుంది. 🌼💌 ప్రతిరోజు మిమ్మల్ని మీరు గమనించుకోండి ఇంకా మెరుగ ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మనశ్శాంతిగా ఉండడానికి ఏమి చేస్తే బాగుంటుంది అని మీలో తపన కలిగే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి,
 జైహింద్

****_మోసపోవడం తప్పు కాదు.. మోసం లోంచి బయటకు రాకపోవడం ముమ్మాటికీ తప్పే !

 *_మోసపోవడం తప్పు కాదు.. మోసం లోంచి బయటకు రాకపోవడం ముమ్మాటికీ తప్పే !_* 
=================

*మన వాళ్ళే కాదు,  ఒక్కొక్కసారి మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు (sensory organs) కూడా మనల్ని మోసం చేస్తాయి..* 

*ఇది నేనంటున్న మాట కాదు. 7వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చెప్పిన మాట..*
 
*🐬నీటిలో ఉన్న చేప ఎరను చూడగానే , వాసన తగిలి ఎరకు తగులుకుని, జాలరి బుట్టలోకి పోతుంది.. అంటే దాని నాలుకే దానిని మోసం చేసింది..*
 
*🪳చుట్టుపక్కల ఎన్ని తినే పదార్ధాలున్నా, మంటను చూడగానే మిడత అందులో పడుతుంది.. దాని కన్నులే దానిని మోసం చేశాయి..* 

*🐝సంపెంగ పూవు వాసన తగలగానే భ్రమరం దాని మీద వాలి, మకరందాన్ని గ్రోలుతుంది. అందులోని విషపదార్థ ప్రభావం చేత భ్రమరం చనిపోతుంది.. (మిగిలిన ఏ పూవు మీద వాలినా ఏమీ కాదు, ఒక్క సంపెంగ తప్ప) .. అంటే... దాని నాశిక(ముక్కు) దానిని మోసం చేసిందన్న మాట..* 

*🐘మగ ఏనుగును వేటాడటానికి ఆడ ఏనుగును పంపు తారు.. అది మగ ఏనుగును రాసుకుంటూ వెళ్తుంది. చర్మ రాపిడికి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనుకే వెళ్ళి వేట గాళ్ళకు చిక్కుతుంది.. దాని చర్మమే దానిని మోసం చేసిందన్న మాట..* 

*🦌లేడి పిల్లల్ని పట్టుకోడానికి వేణువును ఊదుతారు.. వేణు గానం వినగానే అటు వైపు వెళ్ళి చక్కగా దొరికిపోతాయి.. వాటి చెవులే వాటిని మోసం చేశాయి..*
 
*ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుకుగా ఉన్న ఈ జీవులే ఇంతలా మోసపోతున్నప్పుడు, పంచేంద్రియాలూ చురుకుగా ఉన్న మనిషి మోసపోకూడదు అనుకుంటే... ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి..* 
_Good morning.._ 
*మీ... Somavajhala.. Venkateswarlu*
=================
*_{అంటూ ఈరోజు... (29-05-2024) సుప్రభాత సమయాన ఒక మంచి అంశంతో నన్ను పలకరించారు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.. మరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు.. శ్రీ సోమావఝల వేంటేశ్వర్లు గారు. ఈ అంశం మీకూ నచ్చుతుందని అందించాను.. : —వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
 అర్ధాంగి

*********

హమ్మయ్య, ఇంటికి చేరాం. ఎంతైనా ఎవరి ఇల్లు వాళ్ళకి స్వర్గం. తలుపు తాళం తీస్తున్న విశ్వనాధంతో అంది వరలక్ష్మి. నిజమే అనిపించింది అతనికి. నెలరోజులు బెంగళూర్ లో కొడుకు ఇంట్లో వుండి ఇప్పుడే ట్రైన్ దిగి ఇంటికి చేరారు ఇద్దరూ.

దుమ్ము పట్టిన ఇల్లుని చూసి పనమ్మాయికి ఫోన్ చేసి వచ్చిన సమాచారం ఇచ్చింది. విశ్వనాధం సందు చివర షాప్ లో పాలు, పెరుగు ప్యాకెట్ కొనటానికి వెళ్ళాడు. ఈలోపల కాఫీ డికాషన్ తీసి ఇల్లు దులిపే పనిలో పడింది వరలక్ష్మి.

టిఫిన్ కూడా బయట నుంచి తెద్దాం అనుకున్నాడు, కానీ భార్య ఎందుకు ఇంట్లో రవ్వ వుంది ఇంత ఉప్మా చేసేస్తా అన్నదని ఆగాడు. వాచ్మెన్ కి చెప్పి రెండు మూడు కూరలు తెచ్చి పెట్టమని డబ్బులు ఇచ్చాడు. ఇంక తను చేయవలసిన పనులు అయిపోయినట్టు వెళ్లి బాల్కనీలో కుర్చీ వేసుకుని పేపర్ చదవటంలో నిమగ్నమయ్యాడు.

పేపర్ పట్టుకున్నాడే కానీ మనసు వేరే ఆలోచిస్తోంది. వచ్చే నెలలో రిటైర్ అవుతున్నాడు తను. అందుకే ట్రయల్ రన్ లాగా కొడుకు దగ్గర ఒక నెల రోజులు ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. కోడలు మంచిదే. తన పని తాను చేసుకుపోతుంది. భార్య వరలక్ష్మి కూడా అంత అనే మనిషి కాదు. పెళ్ళప్పుడు నుంచి ఇద్దరు ఆడపడుచులు, ఒక  మరిది, అత్తగారు, మామగారు మధ్య ఇమిడి నెమ్మదితనం సర్డుకుపోయే లక్షణం మెండుగా వున్నాయి. గత అయిదేళ్ల దాకా అత్తగారికి సపర్యలు చేస్తూనే వుంది.

ఇప్పుడు కోడలుతో కూడా ఇబ్బంది లేదు. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలే. రెండున్నర ఏళ్ల పాపని డే కేర్ లో పెడతారు. వీళ్ళు వున్నారని నెల రోజులు ఇంట్లో వుంచారు. పొద్దున్న టిఫిను, పప్పు కూర వండేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయేది. భార్య ఇంట్లో పాపాయిని చూసుకుంటూ కాలక్షేపం చేసేది. రాత్రి వాళ్ళు వచ్చేసరికి వంట చేసి వుంచేది. భోజనాలు చేసి ఎవరి రూంలో వాళ్ళు వెళ్లిపోవటమే. శనివారాలు తప్పకుండా బయట భోజనాలు అనేవాడు. ఎందుకురా అంటే రోజు ఆఫీసు ఇంటి పనితో భార్యకి ఒకరోజు కాస్త రిలీఫ్ కావాలిగా, సంపాదించేది అనుభవించటానికే కదా అనేవాడు. భార్యని గౌరవంగా చూస్కునేవాడు. ఉత్తప్పుడు రాలేదు కానీ ఒకసారి అత్త కోడల్లకి చిన్న వ్యత్యాసం వస్తే, అమ్మా తనకి తెలీదు నువ్వు చెపితో పోయేది, సర్డుకుపోవచ్చు కదా అని అన్నాడు. 

వాడిని చూసినప్పుడు అనిపించింది విశ్వనాధంకు. తను ఏనాడు భార్యని ప్రత్యేకంగా చూడలేదు. ఇంట్లో తల్లి ఒకసారి పుల్లవిరుపుగా అంది అని వరలక్ష్మి బాధపడినా, అమ్మ తరపున చెప్పి భార్యదే తప్పు అని మందలించాడు. ఆమె ఇంక ఏనాడు అత్తగారు గురించి అతనికి నేరం చెప్పలేదు. పండక్కి మంచి చీర కావాలని కానీ నగా, నట్రా కావాలని కానీ కోరిక కోరలేదు. చెళ్ళల్లకో, అమ్మకి కొంటూ తనకి కొనేవాడు. అందరితో పాటు వరలక్ష్మి కూడా అనుకునేవాడు అంతే. కోడలు మొన్న దీపావళి పండక్కి అయిదు వేలు పెట్టి ఫ్యాన్సీ చీర కొనుక్కుని, వరలక్ష్మికి కూడా అంటే అంత డబ్బులు వద్దు అని మామూలు చీర తీసుకుంది. ఈనాటికి కూడా నలుగురిలో ఇలా ఉండాలి అలా వుండాలి అనుకునే రకం కాదు. వున్నది కట్టుకునేది, లేకపోతే బాధపడేది కాదు.

కానీ కొడుకు పెళ్ళయి పట్టుమని అయిదేళ్ళు కూడా అవలేదు కోడలి గురించి ఆలోచించి సుఖ పెట్టటానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు. భార్యని పెళ్ళి చేసుకున్న  ఈ ముఫై  సంవత్సరాలలో చూపించనిది తనకి చేయాలి. చిన్న వయసులోనే పెద్దకోడలిగా వచ్చి నిర్వహించింది చాలు, మళ్ళీ కొడుకు దగ్గర పెట్టి మనవరాలి బాధ్యత, కోడలి దగ్గర మాటలు తను పడనివ్వడు. 

విశ్వనాధం సెంట్రల్ గర్నమెంట్ ఉద్యోగం. పెన్షన్ బానే వస్తుంది. ఇంటి బాధ్యతతో పాటు రెండు, మూడు స్థలాలు కొనిపెట్టాడు. అవి ఇప్పుడు కోట్లల్లోనే పలుకుతున్నాయి. పిల్లలకి అంత అవసరం లేదు. ఇప్పటికే కొడుకు గేటెడ్ కమ్యూనిటీలో సొంత ఇళ్లు కొన్నాడు. ఇంకేవో బానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు. కూతురు అల్లుడు కూడా వాళ్ల దారి వాళ్ళది. అందుకే తన కష్టార్జితాన్ని భార్య సుఖానికి వాడుదాం అనుకున్నాడు. కొడుకు మీద ఆధారపడకుండా జీవితం సాగించచ్చు అని నమ్మకం కలిగించి, విశ్వనాధం లేకపోయినా స్వతంత్రంగా బతికే ఏర్పాటు చేయాలి అని నిశ్చయంచుకొన్నాడు.

ఆ రోజు రిటైర్ అయ్యాడు. పిల్లలందరూ చేరారు. రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి. వాళ్ళు వెళ్ళాక భార్య దగ్గరకి వొచ్చి నీకు నా రిటైర్మెంట్  గిఫ్ట్ ఏమీ కావాలి చెప్పు అన్నాడు. నాకెందుకు, నాకేమీ కోరికలు లేవు అని చిన్నగా నవ్వింది. తను అలా అంటుందని తెలుసు. సరేలే ఒక మూడు రోజులకు బట్టలు సర్దుకో.  రేపు పొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరుతున్నాము అన్నాడు. ఎక్కడికి అంది, సర్ప్రైజ్ అని కొంటెగా నవ్వి వెళ్తున్న విశ్వనాధంను చూసి ఏమైంది ఈనకి అనుకుని, సరేలే ఎప్పట్నుంచో భర్తను భద్రాచలం అడుగుతోంది అక్కడికేమోలే అని ఊరుకుంది.

ఎయిర్ పోర్ట్ కు తీసుకెళితే ఎక్కడికో అర్థం కాలేదు. ఫ్లైట్ టికెట్ చూసి ఆశ్చర్యపోయింది. ఇదేం పోయేకాలం మీకు. అవ్వ! ఎవరైనా వింటే నవ్వుతారు అంది. అదేమీ పట్టించుకోలేదు అతను. ఆ వొడాఫోన్ అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు తిరిగితే నువ్వు ముచ్చట పడలేదూ. వాళ్ళకంటే వయసు తక్కువే మనకి అన్నాడు. ఎప్పుడో పెళ్ళైన ఆరు నెల్లకి బాబాయ్ కొడుకు పెళ్ళంటే వైజాగ్ వెళ్ళారు. అప్పుడు భోజనాలయ్యాక,  ఖాళీ దొరికితే దొంగచాటుగా ఏదో వంకతో భార్యని బీచ్ కి తీసుకెళ్ళాడు. అంతే ఇద్దరూ కలిసి అనుభవించింది ఆ అరగంట ఏకాంత మధుర క్షణాలే. తర్వాత ఎన్ని  ప్రయాణలైనా ఇద్దరు కలిసి ఒంటరిగా వెళ్ళింది లేదు. 

ఆ రోజు సాయంత్రం సౌత్ గోవాలోని  కొల్వా బీచ్ లో నడుస్తున్నారు ఇద్దరూ. ప్రశాంతంగా వున్న ఆ బీచ్ లో పక్క పక్కన నడుస్తుంటే ముఫై ఏళ్ళ క్రితం గుర్తుకువచ్చింది ఇద్దరికీ. భర్త ఎప్పుడూ లేనిది ప్రత్యేకంగా తనవైపు చూస్తూ వుంటే, ఏమిటండి ఇది కొత్తగా అని సిగ్గుపడుతూ అడిగింది. లక్ష్మి , నేను నా పనులనుంచి రిటైర్ అయ్యాను. నువ్వు కూడా ఇంక నీ బాధ్యతల నుంచీ రిటైర్ అవ్వాలి. కూతురికి రెండు పురుడ్లు పోసేసావు, కొడుకు పెళ్లి చేసేసాము. ఇంక ఎవరి సంసార బాధ్యతలు వాళ్ళవి. నువ్వు ఇప్పుడు మనవరాలిని చూసుకుంటూ, కోడలితో సర్డుకుపోకుంటూ వుండాల్సిన అవసరం లేదు. నీకు నేను నాకు నువ్వు. మిగులు జీవితం ఓపిక వున్నంత వరకు నీతో ఆనందంగా గడపాలని నా ఆశ. భార్య కళ్ళల్లో కలిగిన ఆనందం, ఆశ్చర్యం చూస్తూ తన హృదయంలో రేగిన ఉత్సాహంతో, ఇక చూసుకో నెక్స్ట్ ట్రిప్ మా డార్లింగ్ ని డార్జిలింగ్ తీసుకెళతాను అని కన్ను గీటాడు. విశ్వనాధం  మాటలకి జీవితంలో మొదటిసారి వచ్చిన ఆనందభాష్పాలు తుడుచుకుంటూ తలవంచుకుని నడిచింది లక్ష్మి. ఆమె చేయి చేతిలోకి తీసుకున్నాడు.

ఎప్పుడో పెళ్లి రోజు ఏడు అడుగులు నడవటానికి పట్టుకున్నాడు, తర్వాత తను వదిలేసి తన దోవన జీవన గమనంలో ముందుకు వెళ్ళినా, తన అడుగు జాడలనే ఆసరాగా చేసుకుని నడిచింది తన భార్య. ఇకనుంచి వదలకుండా సుఖంగా చూసుకుంటా అని ఆమె చేయి పట్టుకుని, పక్కనే నడుస్తూ, కొత్త వెలుగులు ఇవ్వటానికి అస్తమిస్తున్న సూర్యుడి ముందు ప్రమాణం చేశాడు.

............
సుగుణ ప్రియ

****విరామం యొక్క శక్తి....కథ

 *విరామం యొక్క శక్తి....కథ*
 
ఒకప్పుడు ఒక స్త్రీకి ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే ఒక చెడు అలవాటు ఉండేది. ఆమెకున్న ఈ అలవాటు మొత్తం కుటుంబానికి ఆందోళన కలిగించేది. అందువల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఒక విభేదాత్మక వాతావరణం ఉండేది.
ఈ అలవాటు వల్ల ఆ మహిళ కూడా చాలా బాధపడుతూ ఉంది. ప్రతి చిన్న విషయానికి ఆమె వెంటనే ఉద్రేకపడి, కోప్పడిపోతూ ఉండేది.
ఒకరోజు, ఆమె భర్త యొక్క చిన్ననాటి స్నేహితుడు, వారిని చూడటానికి తన కుటుంబంతో వారి ఇంటికి వచ్చాడు. అతను వృత్తిరీత్యా వైద్యుడు. వారి సంభాషణలో, అతను మామూలుగా, "సోదరి, ఎలా ఉన్నావు?",అని అడిగాడు.

ఆ స్త్రీ హృదయాన్ని ఎవరో తాకినట్లుగా, ఆమె కళ్ళు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. "నాకు చాలా త్వరగా కోపం వస్తోంది. ఆ క్షణంలో, నేను కోరుకున్నప్పటికీ, దానిని నియంత్రించలేకపోతున్నాను. తరువాత, నేను నిజంగా చాలా పశ్చాత్తాపపడుతున్నాను, దీని కారణంగా నా ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నది, నాకు ఇప్పుడు ఏదీ నచ్చట్లేదు. నా జీవితంలోని ఆనందాన్ని నా కోపం దోచేసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది",అని అన్నది.

ఆ డాక్టర్ స్నేహితుడు చాలా ప్రశాంతంగా ఆమె కష్టాలన్నీ విన్నాడు. అప్పుడు ఆమెను చూసి, ప్రేమగా నవ్వి, “ఇంతేనా సోదరి,.. కొంతకాలం క్రితమే కోపానికి వైద్యశాస్త్రం ఒక మందు కనిపెట్టింది.
దీని వల్ల వేలాది మంది లబ్ధి పొందారు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ మందుని నా వెంటే ఉంచుకుంటాను", అని, తన బ్యాగ్లోంచి ఒక మందు సీసా తీసి ఆమెకు ఇచ్చాడు, *"నీకు కోపం వచ్చినప్పుడల్లా నాలుకపై నాలుగు చుక్కల మందు వేసుకొని, 10 నిమిషాలు లేదా నీకు హాయిగా అనిపించేంతవరకు నోటిలో పెట్టుకో. నీవు 10 నిమిషాల పాటు నోరు అస్సలు తెరవకూడదు, లేకపోతే ఈ మందు పనిచేయదు",* అని  చెప్పాడు.

ఆ స్త్రీ ముఖంలో ఒక ఆశ మెరిసింది, డాక్టర్ సూచించిన విధంగా మందును తీసుకోవడం ప్రారంభించింది. *కోపం వస్తున్నట్లు అనిపించిన వెంటనే ఆమె నోటిలో నాలుగు చుక్కల మందు వేసుకునేది. ఆమె 15 రోజుల పాటు ఆ పద్దతిని అనుసరించింది. ఆ స్త్రీకి కోపం వచ్చే అలవాటు కేవలం 15 రోజుల్లోనే తగ్గుముఖం పట్టింది.*
నెమ్మదిగా ఆమె సంతోషకరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించింది. 

15 రోజుల తర్వాత భర్తతో కలిసి వైద్యుడి వద్దకు వెళ్లింది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టగానే ఆమె కళ్లు మళ్లీ కన్నీళ్లతో నిండిపోయాయి, కానీ ఈసారి మాత్రం ఆనందంతో నిండాయి. ఆమె డాక్టర్తో, "ఈ మందుతో నా కోపం దాదాపుగా మాయమైపోయింది. ఇప్పుడు నాకు అంత కోపం రావడం లేదు, పైగా మా కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. నా జీవితాంతం మీకు కృతజ్ఞతతో ఉంటాను... దయచేసి ఆ మందు బాటిల్ ఇంకోటి ఇవ్వండి." అని అడిగింది.

అతను గట్టిగా నవ్వుతూ,"సోదరీ, నేను నీకు ఏ మందు ఇవ్వలేదు, కేవలం నీళ్ళు మాత్రమే ఇచ్చాను," అని చెప్పాడు.
ఆమె ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది, "అయితే నా కోపం ఎలా తగ్గింది?" అని అడిగింది.
డాక్టర్ చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు, *"నీకు కోపం వచ్చినప్పుడు, నోటిలో మందు పెట్టుకున్నావు - ఆ క్షణాల్లో, కోపం తాలూకు ప్రతికూల శక్తి స్థిరపడుతుంది, ఆ విరామం యొక్క క్షణాలే మనలోని వివేకాన్ని మేల్కొల్పుతాయి."*

*ఈ విధంగా మనం కోపం యొక్క వికృత శక్తిని, కారుణ్యమనే ఒక అందమైన పుష్పంగా మార్చగలం*.

మిత్రులారా, మనలో చాలా మంది ఈ అలవాటు వల్ల ఇబ్బంది పడుతుంటాం. దానిని వదిలించుకునే ఒక మార్గం కోసం వెతుకుతూ ఉంటాం.

‘దాజీ’ అని ప్రేమగా పిలుచుకునే హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ యొక్క గ్లోబల్ గైడ్ అయిన డాక్టర్ కమలేష్ డి పటేల్ ఇలా అంటారు,"ఈ సారి  *మీకు కోపం వచ్చినప్పుడు, మీలో కోపం ఎలా ప్రవహిస్తుందో గమనించండి. దానిని అణచివేయకండి. దాని గురించిన పూర్తి ఎరుకలో ఉండండి. ఈ కాస్త ఎరుకకి రుజువేమిటంటే, మీరు చీకటిలో ఒక కాంతి కిరణంలా వ్యవహరిస్తారు.”*

*హార్ట్ ఫుల్ నెస్  ధ్యానం*