*_🙏దేవుడున్నాడుగా...!_*
*ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు...!మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు..!*
*సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు..! అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు...! తాను దారి తప్పి పోయాడని..!*
*అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి..! ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు..!*
*ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది...! నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు..!*
*అతనికి ఏం చేయాలో పాలుపోలేదు..! ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని, తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు..!*
*పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు...! తనకు తెలియకుండానే… 'భగవంతుడా...! నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు...!*
*వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??' అని అనుకున్నాడు...!*
*అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు..!*
*వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి,తన మనసులో 'నారాయణా ..!నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు...!' అని మొక్కాడు..! మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది...!*
*ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు...! ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు...!*
*అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది!మీరేమైనా చూసారా?" అని అడిగాడు..! అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కలా కూర్చున్నా..!ఈ వైపు ఏ కుందేలు రాలేదు..!" అన్నాడు..!*
*ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది!ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు..!ఈ రోజు వేట వృథా అయినట్టే...." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు...!*
*వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు..!నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్నా.!నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా...!" అంటూ కొంచం ధీనంగా అడిగాడు...!*
*అందుకు,ఆ వేటగాడు-ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు..*
*నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా...!ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు..!మనిషే కాపాడాడు..!నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి...!" అన్నాడు..!*
*ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి "ఏందయ్యా సామి?? దేవుడు లేడంటావా? మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు..! అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది..! ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను..!అలాంటిది,ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను..!అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు..! నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని, పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది..! అంతా విష్ణులీల" అన్నాడు...!*
*దానికి నాస్తికుడు "అంతా వైష్ణవ లీలనా? ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు, విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా...?" అని నవ్వుతూ ప్రశ్నించాడు..!*
*అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే, అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా...!" అంటూ......*
*ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి, తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు...!*
*ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి,కొంత డబ్బు తీసి,ఆ వేటగానికి ఇవ్వబోయాడు...!*
*అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు...!*
*అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు...!*
*ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి!కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని, నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయట పడేసావు..! నీవు నారాయణుడివో? నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణా ....! ఇదంతా నిజంగా నీ లీలనే...!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు..!*
🪷🪷🪷🪷🪷
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment