Thursday, February 13, 2025

 *పరీక్ష*

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి ఎదగాలి అంటే పరీక్ష తప్పదు.

మంచి వారికి కూడా భగవంతుడు పరీక్ష పెడతాడు, వారి మంచితనం వెల్లడి కావాలి కనక.

బంగారం శుద్దము కావాలి అంటే అగ్నిలో శుద్దము కాక తప్పదు. 

అలానే ఏదైనా ఒక విషయం నిరూపణ కావాలి అంటే కూడా పరీక్ష తప్పదు. 

పూర్వం భక్తి గొప్పదా,  శక్తి గొప్పదా, అన్నదాన్ని నిరూపణ కోసం "శ్రీరామ హనుమ యుద్దం"  జరిగింది అని ఆమధ్య వచ్చిన సినిమా చెప్పింది.

ఇక్కడ పరీక్ష పెట్టె వాడు, మనకి ఉన్నత స్థితి ఇచ్చే వాడు, వాడు భగవంతుడు కావచ్చు, గురువు కావచ్చు, ఉపాద్యాయుడు కావచ్చు, ఇంకెవ్వరైన కావచ్చు. 

పరీక్షని ఎదుర్కొంటున్నవాడు ఉన్నత స్థితికి ఎదగాలి అని కోరుకున్న వాడు. 

పరీక్షలో ఏముంటుంది?

పరీక్షలో మనం నేర్చుకున్నదానిలో మన నైపుణ్య ప్రదర్శన ఉంటుంది. మనం ఎంతవరకు మనం నేర్చుకున్నదానిని అవహాగన చేసుకున్నాం, ఎంతవరకు దానిని ఊపయోగిస్తున్నాము అన్న దానిపై ఉంటుంది.

పరీక్ష ఒక నైపుణ్య ప్రదర్శన మాత్రమే, ఇక్కడ బట్టి కొట్టడాలు (కంఠతాపట్టడం) కాపీ కొట్టడాలు పనికి రావు. ఎంతవరకు నేర్చిన విషయం అవహాగన అయ్యింది, ఎంతవరకు అది గుర్తు ఉంది అన్నది ముఖ్యం.

సాధారణముగా మన విద్యార్జనలో పరీక్షలు ఎప్పుడు ఉంటాయో, ఎంత మేరకు విషయం ఉంటుందో మనకి ముందే తెలుసు, పరీక్షకి తయారు అవడానికి సమయం కూడా ఉంటుంది. సరే పరీక్ష ఫలితం ఎటు ఉంటుంది. ఈ భౌతిక విద్యార్జన పరీక్షలలో బట్టి కొట్టడాలు, కాపీకొట్టడాలు జరగచ్చు.

మనకి మన జీవితంలో విద్యార్జన అయిపోయాక కూడా పరీక్షలు ఉండచ్చు. ఉదాహరణకి హనుమంతునికి సముద్రయానం సమయంలో దేవతలు "సురస" అనే నాగ దేవతను పంపి పరీక్ష చేస్తారు. మహా భారతంలో ధర్మరాజు వివిధ సందర్భాలలో పరీక్ష ఎదుర్కొంటాడు. ఉదాహరణకి, మహా ప్రస్థాన పర్వంలో కూడా ఆయన వెంట ధర్మదేవత ఒక కుక్క రూపంలో వెంటాడి పరీక్ష చేస్తుంది.

పరీక్ష అంటే బెంబేలు పడాల్సిన పని లేదు, 
పరీక్షలో పాస్ అయితే గర్వ పడాల్సిన పని లేదు, ఫెయిల్ అయితే నిరుత్సాహ పడాల్సిన పని లేదు. పాస్ అయితే, మనకి మనం నేర్చుకున్నది, ఉపయోగపడే విధానం తెలుసు అని అర్థం, ఫెయిల్ అయితే అది తెలియదు అని అర్థం అంతే.

ఇలానే మన భక్తి విషయంలో కుడా పరీక్షలు ఉంటాయి. భక్తిలో జరిగే పరీక్షలో యుక్తికి పరమాత్మపై ఉన్న విశ్వాసానికి మాత్రమే పరీక్ష ఉంటుంది. ఇక్కడ జ్ఞానం, దాని నైపుణ్యం వగైరాలపై ఉండదు. కన్నప్ప భక్తి పై పరీక్ష జరిగింది. అర్జనుని కి శ్రీకృషుడు తాను కావాలా, తన సైన్యం కావాలా అన్న పరీక్ష పెట్టాడు. ఇదిగో ఇలా ఉంటాయి పరీక్షలు.

ఇంతవరకు అన్ని సరే కానీ

మానవ జీవిత అంతిమ లక్ష్యం మోక్ష సాధన, అంటే పునర్జన్మ లేకుండా చేసుకోవడం, దీనికోసం ఎంతో జ్ఞానం సంపాదిస్తాము, ఎన్నో ఉపన్యాసాలు ఇస్తాం, ఫేస్ బుక్ లో ఎన్నో పోస్ట్లు పెడతాము, వాటిని ఎంత మంది మెచ్చుకున్నారో లెక్కలు వేస్తాం. కాని ఇవేవీ మన లక్షసాధన కి పనికి రావు, అంత్య కాలంలో పరమాత్మ స్మరణ అంత సులభంగా రాదు. దానికై జీవితమంతా ఎంతో సాధన చెయ్యాలి. అందుకే పరమాత్మ తన భోద అయిన భగవద్గీత లో
"అన్యన చింతన" ఉండాలి అన్నారు. అనన్య అంటే అన్యము లేకుండా ఉండడం, కానీ మనం ఆయన చింతన ఎదో ఒక మొక్కుబడిగా "పూజ"  అని పేరు పెట్టుకోని దానికోసం కొంత సమయం కేటాయించి, ఆ సమయంలో పలు మార్లు వాచి చూసుకొంటు, ఆయింది అనిపిస్తాం. 

అంతిమ లక్ష సాధనలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఆచారణలో పెట్టాల్సింది, పరీక్షలు ఏదుర్కోనాల్సి కేవలం రెండే రెండు విషయాలలో. 

 అవి అహంకార మమకారం త్యాగం, రాగ ద్వెషం త్యాగం. 

ఇదిగో వీటి మీద పరీక్షలు ఉంటాయి. అవి అనుభవాల రూపంలో ఉంటాయి. ఇవి భౌతిక పరీక్షలలో లాగా ముందే చెప్పి పెట్టరు, ఇందులో పాస్ అయ్యమా, ఫెయిల్ అయ్యమా కూడా తెలియదు. పరీక్ష లాంటి అనుభవాలు మాటి మాటికి ఏదుర్కోనాల్సి వస్తె మనం ఫెయిల్ అయినట్టు లెక్కేమరి.        

No comments:

Post a Comment