*చిన్నపిల్లలు ఏదన్నా తినేప్పుడు ముద్దు ముద్దుగా తమ చిట్టి చేతులతో తల్లి లేదా తండ్రికి నోట్లో పెడుతూ వుంటారు పిల్లలు,*
*చాలా సంబరంగా ఉంటుంది కన్నవారికి*
*కానీ అదే పిల్లలు పెద్దయ్యాక ఇలాగే అమ్మా నాన్నలకి అన్నం పెడుతున్నారా ??*
*కారణం పూర్తిగా పెద్దలదే !!*
*వాళ్ళని అలా పెంచారు ప్రేమ బాధ్యత తెలియకుండా*
*పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా అంటారు పచ్చి అబద్ధం ఆ మాట*
*కానీ ఒకటి మాత్రం నిజం చిన్ననాటి నుంచి ప్రేమ బాధ్యత క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు*
*వాళ్లు ఉన్నత విద్యావంతులు కావాలన్నా జులాయిగా తిరిగే వాళ్ళుగా మారాలన్నా*
*సాటి మనిషిని ప్రేమించే వారిగా ఉండాలన్న*
*రౌడీ ల్లా అసాంఘిక కార్యకలాపాలు చేయాలన్న*
*కూలీ వాళ్ళు గా మారాలన్న*
*కలెక్టర్ హోదాలో మెరవాలి అన్నా*
*మీ పిల్లల తల రాత పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీ చేతుల్లో మీ ఆలోచనలో మీ పెంపకంలోనే ఉంది.*🙏🏻
*ప్రేమగా ఉండేలా, అందర్నీ* *గౌరవించే వారిలా, సమాజం పట్ల కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వారిగా చిన్ననాటి నుంచే నేర్పిస్తూ, అలవాటు చేస్తూ పెంచండి*
*బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్ధండి.*🥰
No comments:
Post a Comment