Sunday, February 1, 2026

 Pasupula Pullarao...8919291603..
     పంచ భూతాలు ఆకాశతత్వం, భుమితత్వం, అగ్ని తత్వం, నీటి తత్వం, వాయు తత్వం లో సమస్త మానవాళి శ్వాస ద్వారానే జీవన మనుగడ... జీవించి ఉండడం జరుగుతుంది... మిగతా తత్వాలు అవసరాన్ని బట్టి ఉపయోగించడం జరుగుతుంది...
     భూమ్మీద మనుగడ కొనసాగిస్తూ శ్వాసతో జీవిస్తూ ఉంటారు.
     అందుకే గురువులు, పురాణ ఇతిహాసాలు, అధ్యాత్మిక గ్రంధాలు శ్వాస కు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
     ధ్యాన గురువులు అయితే ఏకంగా శ్వాస గురువునే పట్టుకోమన్నారు..
     శ్వాస మీద ధ్యాస పెడితేనే కదా ధ్యాన సాధన యొక్క విశిష్టతను గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకునే అవకాశం కల్గేది...
     సాధన చేయకుండా మౌనంగా ఉండగలరా... ధ్యానం అంటేనే మౌనం... దానికి మౌన ధ్యానం అనే tyagulu ఎందుకు?
     సాధన చేయకుండా మనసును నిలకడగా ఉంచగలరా.
     సరైన సాధన చేయకుండా నాడీమండలం శుద్ది జరుగుతుందా.
     మద్యలో వచ్చిన నడమంత్రపు పుస్తకాలు, మిడి మిడి జ్ఞాన ప్రచారాలు పక్కన బెట్టి సరైన సాధన చేయడానికి ప్రయత్నం, ప్రాముఖ్యత ఇవ్వాలి.  ఒకే ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా అన్ని తత్వాలు అందుబాటులోకి వస్తాయి.







 



భవ చక్రం (Bhava Chakra), దీనిని 'సంసార చక్రం' అని కూడా అంటారు, ఇది  మన ఉనికిని మరియు మనసు పనితీరును వివరించే ఒక గొప్ప మ్యాప్ వంటిది.
సాధారణంగా దీనిని కేవలం పునర్జన్మలకు సంబంధించిన చిత్రంగా చూస్తారు, కానీ లోతుగా పరిశీలిస్తే ఇది మన మానసిక ప్రవృత్తులకు అద్దం పడుతుంది. ఈ చక్రంలోని ముఖ్యమైన భాగాలు మరియు నేటి కాలానికి వాటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి:

1. కేంద్ర బిందువు (The Hub): మూడు విషాలు
చక్రం మధ్యలో మూడు జంతువులు ఒకదాని తోకను ఒకటి పట్టుకుని ఉంటాయి. ఇవే మన అన్ని సమస్యలకు మూలం:

 * పంది (మోహం/Ignorance): వాస్తవాలను గ్రహించలేకపోవడం.

 * పాము (ద్వేషం/Anger): నచ్చని వాటిపై కోపం, అసూయ.

 * కోడి (రాగం/Attachment): వస్తువుల మీద, వ్యక్తుల మీద అతిగా ఆశ పడటం.

మన మనసులో ఈ మూడు ఉన్నంత కాలం మనం ప్రశాంతంగా ఉండలేము, ఆలోచనల చక్రంలో తిరుగుతూనే ఉంటాము.

2. ఆరు లోకాలు (The Six Realms)
చక్రం చుట్టూ ఆరు భాగాలు ఉంటాయి. ఇవి చనిపోయాక వెళ్లే లోకాలు అని కొందరు అంటారు, కానీ ఇవి మనం నిత్యం అనుభవించే మానసిక స్థితులు:

 * దేవ లోకం: అతిగా సుఖపడటం (దీని వల్ల మనం జీవిత సత్యాన్ని మర్చిపోతాం).

 * అసుర లోకం: నిరంతరం పోటీ, ఈర్ష్య, అధికారం కోసం ప్రాకులాడటం.

 * మనుష్య లోకం: సుఖ దుఃఖాల కలయిక (ఇక్కడే జ్ఞానోదయం పొందే అవకాశం ఎక్కువ).

 * తిర్యక్ (జంతు) లోకం: కేవలం తినడం, నిద్రపోవడం, భయం - అంటే కేవలం ప్రాథమిక అవసరాలకే పరిమితమవ్వడం.

 * ప్రేత లోకం: తీరని కోరికలు. ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఆకలి (Consumerism కి ఇది ఒక ఉదాహరణ).

 * నరక లోకం: విపరీతమైన కోపం, బాధ, డిప్రెషన్ వంటి నరకప్రాయమైన మనోస్థితులు.

3. ద్వాదశ నిదానాలు (The 12 Links)

చక్రం అంచున 12 చిత్రాలు ఉంటాయి. ఇవి ఒక మనిషి బాధలోకి (Suffering) ఎలా వెళ్తాడో వివరిస్తాయి.

 * ఇది అవిద్య (తెలియకపోవడం) తో మొదలై, జరా-మరణం (ముసలితనం మరియు మరణం) తో ముగుస్తుంది.
 * మనం ఒక విషయాన్ని చూసినప్పుడు (Contact), దాని మీద ఒక భావన కలుగుతుంది (Feeling), ఆ భావన కోరికగా మారుతుంది (Craving), ఆ కోరిక బంధనంగా మారుతుంది (Clinging). ఇదే మనల్ని కర్మ చక్రంలో బంధిస్తుంది. 

4. కాలచక్రం (The Monster holding the wheel)
ఈ చక్రాన్ని ఒక భయంకరమైన రూపం (యమధర్మరాజు లేదా కాలం) పట్టుకుని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే—ఏదీ శాశ్వతం కాదు (Impermanence). ప్రతిదీ కాల గర్భంలో కలిసిపోవాల్సిందే.

మనం ఈ చక్రం నుండి బయటపడటం ఎలా?
చక్రం పక్కన బుద్ధుడు నిలబడి ఆకాశం వైపు చూపిస్తూ ఉంటాడు. అది నిబ్బాన (Nirvana) కు సంకేతం.

 * అవగాహన: మనం ఏ మానసిక స్థితిలో ఉన్నామో గమనించడం.

 * నిగ్రహం: మధ్యలో ఉన్న ఆ మూడు విషాల (రాగ, ద్వేష, మోహాల) ప్రభావాన్ని తగ్గించుకోవడం.

 * ప్రస్తుతం: గతాన్ని, భవిష్యత్తును కాకుండా ప్రస్తుత క్షణాన్ని స్పృహతో గమనించడం.


 భవ చక్రం (Bhava Chakra - The Wheel of Life)
చాలామంది 'భావ చక్రం' అంటే కేవలం చనిపోయిన తర్వాత పుట్టే ఆరు లోకాలు అని అనుకుంటారు. కానీ దీని అసలైన అర్థం మనసు యొక్క స్థితి.

 * నేటి అర్థం: మనం ప్రతిరోజూ అనుభవించే మానసిక అవస్థలే ఈ చక్రం.

 * అయోమయం: ఇది ఏదో మరణం తర్వాత జరిగే ప్రక్రియ అని భావించడం.

 * వాస్తవం: కోపంలో ఉన్నప్పుడు మనం 'నరక' స్థితిలో ఉంటాం, అత్యాశలో ఉన్నప్పుడు 'ప్రేత' స్థితిలో ఉంటాం. మన ఆలోచనలు, కోరికలు (తృష్ణ) మనల్ని ఎలా ఒకదాని వెంట ఒకటి తిప్పుతున్నాయో చెప్పేదే భవ చక్రం. ఈ క్షణంలో మీరు పడే తపనే మీ చక్రం.

 నిబ్బాన / నిర్వాణం (Nirvana/Nibbana)

నిర్వాణం అనగానే అందరూ "మరణం" లేదా "శూన్యం" అని భయపడుతుంటారు. ఇది అతిపెద్ద కన్ఫ్యూజన్.

 * నేటి అర్థం: మనసులోని అశాంతి ఆగిపోవడం.

 * సరళమైన వివరణ: ఒక కొవ్వొత్తి ఆరిపోతే ఏమవుతుంది? మంట ఆరిపోతుంది కానీ శక్తి నశించదు. అలాగే మనలోని రాగం (Attachement), ద్వేషం (Hatred), మోహం (Ignorance) అనే మూడు మంటలు ఆరిపోవడమే నిబ్బాన.

 * జీవించి ఉండగానే: నిబ్బాన అనేది చనిపోయాక వచ్చేది కాదు. బ్రతికి ఉండగానే మానసిక ప్రశాంతతను, సమస్థితిని పొందడం. ఇది ఏమీ లేకపోవడం కాదు, అనవసరమైన భారం (దుఃఖం) లేకపోవడం.

 బౌద్ధాన్ని ఒక జీవన విధానం కన్నా మతంగా చూడటం వల్ల మూఢనమ్మకాలు వచ్చి చేరాయి.
 
బుద్ధుడి బోధనల సారాంశం ఒక్కటే - "ప్రస్తుత క్షణంలో స్పృహతో (Mindfulness) జీవించడం". మనసును గమనిస్తే భవ చక్రం అర్థమవుతుంది, మనసు నిశ్చలమైతే నిబ్బాన అనుభవంలోకి వస్తుంది.
 *శ్వాసే మనస్సు, మనస్సే శ్వాస.”* 

అనంత ఆకాశంలో విస్తరించి ఉన్న వాయువు — అంటే ప్రాణశక్తి. ఈ వాయువు కేవలం భౌతిక గాలిగా మాత్రమే కాదు, దైవశక్తి, చైతన్యశక్తి, జీవనాధార శక్తిగా ఉంది.
మన శరీరంలోకి అది శ్వాస ద్వారానే ప్రవేశిస్తుంది. ప్రతి శ్వాసలో ఆ అనంత ప్రాణం, ఆకాశంలోని ఆ దైవశక్తి మనలోకి ప్రవహిస్తుంది.
ఇది లోపలికి వెళ్ళినప్పుడు మనలోని సూక్ష్మమైన స్థాయిల్లో మార్పు చెందుతుంది —
మొదట అది అహంకారంగా (నేను) రూపాంతరం చెందుతుంది.
తర్వాత అది **కర్ణం (బుద్ధి)**గా,
మనస్సుగా,
చివరికి ఆలోచనలుగా అవతరిస్తుంది.
అంటే — మన ఆలోచనలు కూడా ప్రాణం నుండి పుట్టినవే.
ప్రాణం → మనస్సు → ఆలోచన — ఇది ఒక జీవన శ్రేణి (life chain).
మన ఆలోచనలు అసమతుల్యంగా ఉన్నప్పుడు — శ్వాస కూడా అసమతుల్యమవుతుంది.
అదేవిధంగా, శ్వాసను సరిచేసుకుంటే ఆలోచనలు సరిచేయబడతాయి.
అందుకే యోగశాస్త్రం చెబుతుంది:
“ *శ్వాసే మనస్సు, మనస్సే శ్వాస.”* 
మన శ్వాస నిశ్చలంగా, సుందరంగా, సమతుల్యంగా మారినప్పుడు మన ఆలోచనలు, భావనలు, ప్రవర్తన కూడా అదే విధంగా ప్రశాంతంగా మారతాయి.
 సారాంశం:
 *శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ ప్రవాహం కాదు. అది ప్రాణం నుండి ఆలోచన వరకు సాగే చైతన్య సేతు.* 
 *మనం శ్వాసను జాగ్రత్తగా, ప్రేమగా గమనించినప్పుడు — మనలోని మనసు, బుద్ధి, అహంకారం అన్నీ* *శాంతమవుతాయి* .🧘‍♂️🧘‍♂️
 Pasupula Pullarao...8919291603...
     కొన్ని సందర్భాల్లో సమయాల్లో మౌనంగా ఉండడం ద్వారా విమర్శలకు కాలమే తప్పకుండా సమాధానం ఇస్తుంది... మౌనంగా ఉండడం అనేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం... మౌనం ద్వారా అంతరంగ ప్రవేశం తద్వారా పాజిటివ్ ఆలోచనలు... పాజిటివ్ ఆలోచనలు విజ్ఞానానికి, విజయానికి మెట్లు... కొన్నిసార్లు అజ్ఞానులు నుండే కాకుండా జ్ఞానం ఉన్నవారి నుండి కూడా కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు... ఎందుకంటే అందరూ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వారే...
     విలక్షణ, విచక్షణా జ్ఞానం,
 విజ్ఞానం అనేది మౌనం ద్వారా నే సాధ్యం.
     మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నారు ఒక కవి... మాటలు రాని మనసు చేసేవి, చేపించేది ద్వారానే మనసు ద్వారానే.
     మనసును అదుపులో పెట్టేది, నిలకడైన అలోచనలు చేసేది మౌనం మాత్రమే.
     మౌనంగా ఉండడం అనేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
 Pasupula Pullarao...8919291603...
     భయమే దయ్యం... ధైర్యమే దైవం..
     సరైన సాధన ద్వారా భయమనే దయ్యాన్ని బయటకు పంపించి ధైర్యం అనే దైవాన్ని ఆహ్వానించాలి.
అపుడే మనసు నిలకడగా పాజిటివ్ ఆలోచనలు చేయడం మొదలు పెడుతుంది.. శ్వాస ఉన్నంతవరకు జీవిస్తునే ఉంటారు... అదే శ్వాసను గమనిస్తూ ఉంటే మనిషి మనీషి గా అనగా నరుడే నారాయణుడు గా ఎదిగి పోతారు...నారాయణుడు కి సాధ్యం కానిది ఈ అనంత విశ్వంలో ఏది లేదు.
     భౌతిక జీవితంలో జీవిస్తున్నాం కాబట్టి నెగటివ్ అలోచనల వ్యక్తుల ప్రభావం కూడా కొంత పని చేస్తుంది... వారు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధు మిత్రులు కావచ్చు, ఏ మాత్రం సంబంధం లేని సమాజంలోని వ్యక్తులు/దుష్ట శక్తులు కావచ్చు.
     అందుకే గురువు చెప్పిన అధ్యాత్మిక సత్యం ఎరుకతో (అవేర్నెస్) ఉండాలని.
     అవేర్నెస్ అనేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... కొద్దిగా అర్దం చేసుకోండి మరికొద్దిగా సరైన సాధన చేయండి.
 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

                        భక్తుడు :
భగవాన్! ప్రాణాయామానికి మనోనిరోధానికి సంబంధమేమి?

                         మహర్షి : 
     తలపు(ఆలోచన), శ్వాస(రక్త ప్రసరణ మొదలు సకల శరీర ధర్మాలు) రెండూ వ్యక్తి బ్రతుకులో రెండు వేర్వేరు భావాలు. ఆ రెంటికి ప్రాణశక్తే ఆధారము లేక ఆశ్రయము. వ్యక్తిత్వము, ఇతర సకల వృత్తులు(వ్యవహారాలు) ఆ శక్తి నుండియే పుడతాయి.

   శ్వాస మొదలగు శరీర ధర్మాలను బలవంతంగా అణచివేస్తే, ఆలోచన అణగిపోతుంది. ఆలోచనల వేగాన్ని మందగింపజేసి, దాన్ని ఒకేచోట ఏకాగ్రం చేస్తే, శ్వాసాది ప్రాణవేగము కూడ మందగించి సమ వేగమై, జీవధారణానికి (ప్రాణము నిలబడటానికి) సరిపడే మాత్రంగా సరిపోతుంది. 

    ఆ రెండు పద్ధతులలోనూ అనేకరకాల ఆలోచనలు రావడం తాత్కాలికంగా నిలిచిపోతుంది. వాని పరస్పర సంబంధం ఇంకోరకంగా కూడా కనిపిస్తుంది. జీవశక్తి ఇక పోతుందన్నప్పుడు కూడ ప్రాణాన్ని కూడగట్టి మృత్యువు రాకుండా ఆలస్యం చేసేది సంకల్ప శక్తియే. ఆ శక్తి లేనప్పుడు మరణం త్వరపడుతుంది. ప్రతి శరీరిలోనూ బ్రతుకు భారం వహించేది ఆలోచనయే.
 Pasupula Pullarao...8919291603...స్వాతంత్య్ర పోరాటం చేయాలి ఎవరికి వారు వారియొక్క మనసు మాయగాడు మీద, నిరంతర నెగటివ్ అలోచనలు మీద..
     పోరాటానికి కావాల్సిన ఆయుధం శ్వాస మీద ధ్యాస అనే సాధన...
     అపుడే సకల సమస్యల నుండి విడుదల అనే స్వాతంత్య్రం సాధ్యం..
     అపుడే అందరితో కలసి మెలిసి ఉంటే ఆత్మ శక్తి సామర్థ్యాలు కలిగియుండుట జరుగుతుంది...
    అందుకే ధ్యాన సాధన చేయడం అద్భుతం అమోఘం అపూర్వం.
     సరైన సాధన మనసుకు విశ్రాంతి, ప్రశాంతత, మౌనానికి మార్గదర్శి... విశ్వ ప్రణాళికలో భాగంగా విశ్వ కళ్యాణం లో భాగ స్వామ్యం కల్గి యుండడం..
     ఒకే ఒక్క సాధనతో అంతులేని అనంతమైన ప్రయోజనాలు.
 చిన్నకథలు - పెద్ద అర్థాలు 
కథ : నిషేధం
రచన : డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
"ఈ గ్రామంలో పగటి పూట నైటీలు ధరించడం నిషేదించబడినది. నిబంధన అతిక్రమిస్తే అక్షరాలా ₹2000 రూపాయలు జరిమానా గ్రామ పంచాయితీకి చెల్లించ వలసింది. పగటిపూట నైటీలు ధరించిన వారి సమాచారాన్ని గ్రామపంచాయతీకి తెలియజేసిన వాళ్లకు ₹1000 అవార్డు కూడా ప్రకటించడ జరిగింది. సమాచారం అందించిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతాము. అట్లాగే వృద్ధులు అనారోగ్య పీడితులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ నిబంధన  మినహాయించడం జరిగింది. మన సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించడంలో భాగంగా మాత్రమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము"  గ్రామస్తులు అందరి సమక్షంలో రచ్చబండ వద్ద ప్రకటించాడు గ్రామపెద్ద అరవై ఏండ్లు పైబడిన రామనాథం.

అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కిమ్మనలేదు. మగవాళ్ళు మాత్రం "హమ్మయ్య నైటీల దరిద్రం వదిలింది" లోలోపల సంబరపడిపోయారు. అదే విషయం ఆ సాయంత్రమే గ్రామంలో చాటింపు కూడా వేయబడింది.అంతేకాదు సమాచారం రాసిన బోర్డు కూడా ఊరు రచ్చబండ వద్ద పాతించబడింది.

ఇక ఆరోజు మొదలు ఆ గ్రామంలో పగటి పూట ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా నైటీలు ధరించి కనబడటం మానేశారు. గృహిణులు చక్కగా చీరలు కట్టుకుని, అమ్మాయిలైతే పంజాబీ డ్రెస్సులు ధరించి కనబడసాగారు. అవిధంగా గ్రామంలో స్త్రీ వస్త్రధారణ విషయమై వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయం వార్తల్లోకి కూడా ఎక్కింది.

వారం రోజుల తర్వాత -
ఒకరోజు సాయంత్రం రచ్చబండ వద్ద కూర్చుని ఇద్దరు యువకులు మాట్లాడుకుంటున్నారు.

" నైటీ...నైటీ...దుకాణానికి పోయినా నైటీ, పక్కింటికి పోయినా నైటీ, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి పోయినా నైటీ, పైన ఒక తువ్వాలు కప్పుకుని సంతకు పోయినా నైటీ.. ఈ ఆడోళ్ళను ఎప్పుడో పెండ్లిళ్ళకు పండుగలకు తప్పిస్తే చీరల్లో చూసింది లేదు. పొద్దుట లేసింది మొదలు రాత్రి పడుకునే వరకే నైటీ. అస్సలు ఆ నైటీ తప్ప వేరే డ్రెస్సె ఈ ఆడోళ్ళకు తెలువట్లేదు.పీడ విరగడయ్యింది.. " గుండెల నిండుగా అంటున్నాడు 
నలభై ఏండ్ల మహేందర్.
" అవునన్నా. ఈ నైటీల బాధ తప్పింది. కొత్త మోడల్స్ వొచ్చాయని నెలకు నాలుగు చీరలు కొనుడు... బీరువాల్లో పెట్టుడు. కట్టేది లేదు.... పెట్టేది లేదు. ఇదో పెద్ద తతంగం అయిపోయింది.మన సర్పంచి రామనాథం మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా అతడికి మొక్కాలే " అదే వయసున్న మరో యువకుడు దయాకర్ కూడా సంతోషం అవ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు..

వాళ్ళు ఇద్దరూ పక్కన మండల కేంద్రంలో  చక్కర ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. ఆరోజు సెలవు దినం కావడంతో హాయిగా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు.వాళ్ళ మాటల్ని వింటూ అక్కడే కూర్చుని ఉన్న ఒక పెద్దాయన కూడా  ఆఖరకు కల్పించుకుంటూ -" అవునప్పా రామనాథం మంచి పని చేసిండు" తృప్తిగా అన్నాడు.

*****
నెల రోజులు గడిచిపోయాయి.
మహేందర్, దయాకర్, పనిచేస్తున్న చక్కెర ఫ్యాక్టరీలో
అగ్ని ప్రమాదం సంభవించింది.మరమ్మత్తుల నిమిత్తం  సిబ్బందికి సెలవులు ప్రకటించారు. ఆ నెల రోజులకు మరో ఉద్యోగం చూసుకోలేక మహేందర్, దయాకర్,ఇద్దరూ  తమ ఇండ్ల వద్దే ఉండిపోయారు.ఇట్లాగని ఖాళీగా కూర్చోలేదు. ఇద్దరూ మాట్లాడుకుని,  ఊర్లో ఉన్న కొవ్వొత్తుల కుటీర పరిశ్రమ నుండి లెక్క ప్రకారం కొవ్వొత్తులు తెప్పించుకుని, వాటిని 
ప్యాకింగ్ చేసే పని మొదలెట్టారు. అట్లా ఒక మూడు వారాలు గడిచిపోయాయి.

******
ఒకరోజు- 
మహేందర్ భార్య మంజుల, దయాకర్ భార్య దమయంతి, గుడి వద్ద కలుసుకున్నారు. దేవుడి దర్శనం తర్వాత ఇద్దరు అక్కడే ఉన్న అరుగు మీద కూర్చొని మాట్లాడుకోసాగారు.

" ఇంటి వద్ద ఉంటూ... పిల్లల పని, ఇంటి పని, వంట పని, చేసుకుంటూ.... మన సౌలభ్యం కోసం నైటీలు తొడుక్కుంటే నిషేధం పెట్టిన్రు. ఇప్పుడు చూసావా? మూడు వారాల నుండి ఇంట్లో కూచోని మాసిపోయిన లుంగీ, రెక్కలు లేని బనియను, తొడుక్కుని ఉంటున్నడు.మనం నైటీ ధరిస్తే శరీరంలో ఏ భాగం కూడా కనబడదు.... అయినా వద్దంటున్నరు. సర్లే...! మరి ఇదేం ఏషం?  రచ్చబండ కాడికి పోయినా లుంగీ, పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించడానికి పోయినా లుంగీ, పైన ఒక తువ్వాలు కూడా లేకుండా  సిగరెట్టుకు దుకాణానికి పోయినా లుంగీ..పొద్దస్తమానం లుంగీ...లుంగీ...వీళ్లకు 
సౌలభ్యం కావాలే... ఆడోళ్ళకు ఉండొద్దా? " ఆవేదన ఆవేశం రెండూ కలగలసిన స్వరంతో మాట్లాడింది మంజుల.

 ఆ మాటలు వినగానే దమయంతిలో కూడా  ఆవేదన - ఆవేశంతో  ఆక్రోషం తన్నుకొచ్చింది.
" మీ అయన లుంగి కట్టుకుంటున్నాడు. జరా నయం. ఏదో ఒక టైంలో లుంగిని కిందకు వదులుకుని నిండుగా కనిపిస్తడు. మా ఆయన మరీ అద్వాన్నం. పాత ప్యాంటు కత్తరించుకుని షార్ట్ చేసుకుని, తోడుగా రెక్కలు లేని బనియన్ తొడుక్కుని ఊరంతా తిరుగుతున్నడు.. " 
అంటూ రుస రుస లాడింది.

తర్వాత -
 అదే విషయమై ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ  మగాళ్లను మొగుళ్ళను తిట్టుకున్నారు. అఖరుగా- 
"ఆడవాళ్లకు ఒక న్యాయం....మగవాళ్లకు ఒక న్యాయమా? మన ఇద్దరం కలిసి రామనాథనికి ఈ యవ్వారం గురించి ఫిర్యాదు చేద్దాం. మన పేర్లు గోప్యంగా ఉంచాలని చెబుదాం. మగవాళ్ళు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ప్యాంటు షర్టు ధరించక పోయిన పర్వాలేదు కానీ అర్థనగ్నంగా ఉండొద్దని మాత్రం చెప్పేద్దాం..." ఒక నిర్ణయానికి వచ్చింది మంజుల.
" నేనూ ఇదే అనుకుంటున్నా" చేతులు కలిపింది దమయంతి.

******
మరునాడే....
మంజుల, దమయంతి ఇద్దరూ సర్పంచ్ రామనాథం ఇంటికి వెళ్లారు.వాకిట్లో పూల మొక్కల వద్ద పూలు కోస్తూ.... జరీ అంచు కాటన్ చీరతో- పెద్దబొట్టుతో మహాలక్ష్మిలా కనిపించింది రామనాథం భార్య రామమ్మ.
" రండి బిడ్డా " చూడగానే అచ్చు అమ్మలా ఆహ్వానించింది.
సరిగ్గా అదే సమయంలో. ఇంట్లోంచి బయటకు వచ్చాడు రామనాథం.

అతడు-
కింద ఒక లుంగీ ధరించి, దాన్ని పైకి ఎగ్గట్టి, పై భాగంలో కనీసం ఏ అచ్చాధన లేకుండా ముప్పావు భాగం అర్దనగ్నంగా కనిపించాడు.
అది చూడగానే మంజుల, దమయంతి, ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"ఆచార్య సూక్తులు బాగున్నాయి కానీ..." నానుడి ఆ ఇద్దరి కళ్ళల్లో ఎగిసి పడింది.

" ఏం తల్లీ... ఇద్దరూ కలిసివచ్చారు? " ఏంటి విషయం అన్నట్టుగా ఆత్మీయంగా పలకరించాడు రామనాథం.
ఏం చెప్పాలో ఇద్దరికీ వెంటనే అర్థం కాలేదు. అయినప్పటికీ  తేరుకుంటూ ఇద్దరూ ఒకేసారి నోరు విప్పారు.
"ఆ....పూలమొక్కల కోసం...."
"అదే....అంటు మొక్కల  కోసం"
------------------------------------------
( పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లె గ్రామంలో పగటిపూట 'నైటీలు' ధరించడాన్ని  నిషేధించడం ఘటన ఆధారంగా హాస్యం కోసం రాసిన కల్పిత కథ)
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏
 💓మనసు కధలు💓 ( 85 )

🌺💚🌺 అమృత 🌺💚🌺

విశాల్ అనుకుంటున్నాడు తన తల్లి అమృత గురించి అమ్మ పిచ్చి అమ్మ అని...అలా అనుకోటానికి చాలాకాలం నాటి నుండీ జరుగుతూ వస్తున్న ఎన్నో సంఘటనలు కారణం...

చంద్రం, శాంతికి ఇద్దరుపిల్లలు అమృతవర్షిణి అమరేంద్ర వారి పేర్లు..

అమృతవర్షిణి... పేరుకి తగ్గట్టే ప్రేమవర్షం కురిపించే మంచిమనసు ఆమె సొంతం..తమ్ముడు అమర్ అంటే అమృతకు అపురూపం..

అంతులేని సహనంతో ప్రవర్తించే అమృత.... ఇంట్లో ప్రశాంతత కోసం  తన ఇష్టాలను కూడా పట్టించుకోదు..అమ్మానాన్న మాటకు ఎదురుచెప్పేదే కాదు..సత్తెకాలం సత్తెమ్మ లాగా కలికాలం కల్మషం పెద్దగా అంటని మనిషి...రెండు నాలుకల ధోరణి తనకి అలవాటు లేదు...ఆ అలవాటు ఉన్న మనుష్యులకు దూరంగా ఉంటుంది...లోపలొకటి బయటొకటి మాట్లాడేవాళ్ళంటే ఇష్టపడదు అమృత..అమృత బాగా చదువుతుంది..డాక్టర్ అవ్వాలని ఊహ తెలిసినదగ్గరనుంచీ అనుకుంటోంది..తీరా డాక్టర్ చదువుకి సిద్ధమయ్యే సమయంలో తండ్రి కూతురికి చెప్పాడు...తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించాలి, సంవత్సరానికి ఓ లక్ష కట్టాల్సి వస్తుంది...నీకు పెళ్ళికి ఎలానూ ఖర్చు పెట్టాలి..ఇప్పుడు డాక్టర్ చదువుకి కూడా అంటే బరువవుతుంది అని..

తండ్రి ఇలా చెప్పగానే అలా ఒప్పేసుకుంది అమృత డాక్టర్ చదువుని వదిలేసి డిగ్రీ చదువుకి అడుగులేసింది..

పెళ్ళయ్యింది...తమ్ముడి కోసం ప్రాణం పెట్టే అమృత తన పెళ్ళయ్యాక కూడా తమ్ముడి గురించి కూడా ఆలోచించేది..తమ్ముడికీ అక్కంటే చాలా ప్రేమ..

కానీ అన్నిరోజులూ ఒక్కలా ఉండవుగా...తమ్ముడి పెళ్ళయ్యి ఫారెన్ లో స్థిరపడి..భార్యాబిడ్డలతో, బాధ్యతలతో సమయం కుదరక నెమ్మది నెమ్మదిగా అక్కతో కబుర్లు, అక్క కోసం వెచ్చించగలిగే సమయాలు తగ్గిపోయాయి..

అమృత మాత్రం... ఒకరోజు నా తమ్ముడలా చేసేవాడు..నా తమ్ముడు ఇది చెప్పేవాడు అని కొడుకు విశాల్ కి మేనమామ గురించి బోలెడు జ్ఞాపకాలు పంచుకునేది...కొడుకు విశాల్ కి తల్లి చెప్పే కబుర్లంటే చాలా ఇష్టం..

మరదలు వైపు చుట్టాల పెళ్ళికి తమ్ముడూ వాళ్ళు ఇండియా వస్తున్నారని తెలిసి..తనదగ్గరకి కూడా వస్తారని అమృత చేసిన హడావుడి అంతా ఇంతా కాదు...తమ్ముడికి ఇష్టమని నిమ్మకాయ ముక్కలు తరిగిపోసింది, నిమ్మకాయ ఊరగాయకి..కిలో పచ్చిమిరపకాయలు పిన్నీసులతో చీరి మజ్జిగలో ఊరబోసింది ఊరమిరపకాయలకి...బియ్యంపిండిని చిక్కటి మీగడపెరుగులో వాము వేసి కలిపి కరకరలాడే చల్లకారప్పూస తయారుచేసి డబ్బాల్లో పోసి దాచింది...

మరదలు కోసం డిజైనర్ చీర, మేనకోడలికి మంచి డ్రెస్ తీసుకుంది...

పదిరోజుల్లోనే నెలరోజుల కష్టం పడింది...తమ్ముడి ఫోన్ వచ్చింది..అక్కా రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది మాకు...ఈ రాత్రికి బయలుదేరి తెల్లారేటప్పటికి నీ దగ్గర ఉంటాను అని...ఆ రాత్రి అంతా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అమృతకి...విశాల్ తల్లి ని గమనిస్తూనే ఉన్నాడు...

పొద్దున్నే అమర్ వాళ్ళు వచ్చారు...కొబ్బరి పచ్చడీ వేడి వేడి ఇడ్లీలు, గారెలుతో బ్రేక్ఫాస్ట్ చేసిచ్చింది...కమ్మటి కాఫీ వాసనతో ఫిల్టర్ కాఫీ తాగుతూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నవ్వుకున్నారు అందరూ...

విశాల్ సరదాగా మరదలు మేఘనని ఆటపట్టిస్తూ జుట్టు పట్టుకు లాగాడు...ఏయ్ ఏంటీ పిచ్చిపని అంది మేఘన...విశాల్ సరదాగా చేసాను అన్నాడు నవ్వుతూ..అమర్ భార్య నీలిమ కోపంగా వీళ్ళింతే మేఘా మోటు మనుషులు, వీళ్ళ సరదాలు ఇలానే ఉంటాయి అంది తేలిగ్గా..

అమృత అమర్ వైపు చూసింది, తను నీలిమకో మేఘనకో సర్దిచెప్పి అలా అనకూడదు అంటాడని...అమర్ అసలు విశాల్ అమృత హర్ట్ అయ్యారన్న విషయమే పట్టనట్టు ఉన్నాడు...

అమృత మనసు సున్నితం..ఎంత ప్రేమో, అంత రోషం ఉన్న మనిషి..

వంట అయింది..పండుమిరప పచ్చడి, గోంగూర పప్పు, వంకాయ వేపుడుతో కమ్మటి తెలుగుభోజనం చేసారు అందరూ...

తమ్ముడికి చేసినవన్నీ డబ్బాలలో పోసి ఇచ్చింది అమృత, డబ్బాలన్నీ ఒక అట్టపెట్టెలో ఫ్లైట్ జర్నీ లో ఇబ్బందిపడకుండా సర్దారు విశాల్ , అమర్ కలిసి...

బొట్టుపెట్టి మరదలికి మేనకోడలికి బట్టలు పెట్టింది అమృత...ఇలాంటివి మేము వాడము అని అక్కడే వదిలేసారు వాళ్ళు...విశాల్ కి కోపం వచ్చింది, వారి ప్రవర్తన తల్లినెక్కడ గాయపరుస్తుందో అని...విశాల్ భావం అర్ధం అయిన అమృత విశాల్ చెయ్యిపట్టుకుని కళ్ళతోనే ఊరుకోమని ఊరడించింది...

అమర్ అక్కను దగ్గరకు తీసుకుని అక్కా మనసుకి ప్రశాంతంగా ఉంది..అమ్మలేని లోటు తెలీనట్టుగా నువ్వు నన్ను ఆదరించావు..నీ ప్రేమ ఎప్పుడూ అమృతమే, అది అందుకుని ఆనందపడే మామూలు మనుషులం మేము, నీ అంత ప్రేమ తిరిగిచ్చేంత మనసులు మాకు సాధ్యం కాదు, విశాల్ అమ్మ జాగ్రత్తరా వట్టి పిచ్చి మాలోకం అని విశాల్ కి అక్కని అప్పగించి ఫ్లైట్ ఎక్కేసాడు అక్క ఇచ్చినవి అన్నీ మూట కట్టుకుని...

పిచ్చిమాలోకం అంటా పిచ్చిమాలోకం..పోనీలే నా ప్రేమ వాడికి పిచ్చిలా కనిపిస్తోందనుకుంటా అని తనలో తనే గొణుక్కుంటూ పనులు చేసుకుంటున్న అమ్మ దగ్గరకెళ్ళి చెప్పాడు విశాల్...అమ్మా మనకి ఏది సరైనది అనిపిస్తే మనం అలా ఉంటాము.ఒకరు ఏదో మనని అన్నారని, మనం అలానే ఉన్నామని కాదు అర్ధం..వాళ్ళు వాళ్ళకి అర్ధమయినట్టుగా మనని తీసుకుంటారు, అంతే..నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు అంతే అని పెద్దరికంగా తల్లికి సలహా చెప్పి అనునయించాడు విశాల్ అమృతని..

విశాల్ కి పెళ్ళి అయ్యి కోడలు సుప్రియ వచ్చింది..అమృత సుప్రియని ప్రేమగా చూసుకునేది...తనకు ఓపికున్నంతలో పనులు చేసిపెట్టేది...సుప్రియ మంచి అమ్మాయే..అత్తగారి చాదస్తం కి అలవాటు పడింది...

మనవరాలు పుట్టింది..లాస్య అని పేరుపెట్టుకున్నారు...లాస్య అంటే అమృతకి ప్రాణం..

ఆ రోజు లాస్యకి జ్వరం వచ్చింది..సుప్రియ మీటింగ్ ఉందని ఆఫీసుకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళింది...లాస్య జ్వరబాధలో అమ్మా అమ్మా అంటూ ఒకటే కలవరిస్తోంది...సుప్రియకి ఫోన్ చేస్తోంది అమృత..ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుప్రియ ఫోన్ తియ్యట్లేదు, బిజీ అని వస్తోంది..లాస్యకి అమృత ఎన్ని జాగ్రత్తగా చేసినా జ్వరం తగ్గట్లేదు...అమృతకి పిచ్చికోపం వచ్చింది సుప్రియ మీద...విశాల్ ఎందుకైనా మంచిదని లాస్యని హాస్పిటల్ కి తీసుకెళితే హాస్పిటల్ లో జాయిన్ చేయమని చెప్పారు...

చిన్నబిడ్డకు సిలైన్ ఎక్కించారు నీరసంగా ఉంది అని...అది చూసి అమృతకి గుండె తరుక్కుపోయింది...సుప్రియకు ఫోన్లు చేస్తున్నా మెసేజులు పెడుతున్నా సుప్రియ అందుబాటులోకి రాలేదు...ఇహ లాభం లేదని తల్లికి లాస్యని చూసుకోమని చెప్పి, సుప్రియ ఆఫీసుకి వెళ్ళాడు విశాల్...

లాస్యకు జ్వరం ఎక్కువై ఫిట్ లాగా వచ్చింది...అమృత అది చూసి తల్లడిల్లిపోయింది...నెమ్మదిగా లాస్య తిప్పుకుని తేరుకుంది....అప్పటివరకూ అమృత డాక్టర్లను తిట్టేసి శ్రద్ధగా చూడండని నర్సులను విసుక్కుని కొంచెం హడావుడి చేసింది....

గంట తరువాత సుప్రియ విశాల్ హాస్పిటల్ కి పరుగున వచ్చారు..నీరసంగా పడున్న లాస్యను నుదుటిపైన చెయ్యివేసి చూడబోయింది సుప్రియ...ఆడపులిలా పిచ్చికోపంతో తిట్టిపోసింది అమృత సుప్రియని...నువ్చసలు తల్లివేనా అని కూడా సాధించింది కోడలిని...

సుప్రియ కారణాలు చెబుతున్నా వినిపించుకునే స్థితిలో లేదు అమృత...ఫో ముందు ఇక్కడినుంచీ, నేను నా ప్రాణాలైనా అడ్డేసి లాస్యను బతికించుకుంటా, నువ్వు నీ ఆఫీసుని పట్టుకుని ఊరేగు అని కొంచెం హద్దులు దాటి మరీ మాట్లాడేసింది అమృత కోడలితో..

విశాల్ తల్లి మీద మొదటిసారి కోప్పడ్డాడు...అమ్మా ఊరుకుంటావా ఇంక..లాస్య కలవరించేది సుప్రియని, ఇప్పుడు సుప్రియ పాప దగ్గర ఉండటం చాలా అవసరం..నీ పిచ్చి ప్రేమతో మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, కాస్త కుదుటపడి ఆలోచించి మాట్లాడు అని...

ఏదో దెబ్బ తాకినట్టుగా మనసు మూగబోయి మాటలురానట్టు మౌనముగా కూర్చుండిపోయింది అమృత...

సుప్రియ లాస్యను పలకరిస్తూ ఉంది...కాసేపటికి లాస్యకు స్పృహ బాగా వచ్చి అమ్మా అంటూ తల్లిని చూసుకుంది, చిన్నగా నవ్వింది...సుప్రియ లాస్య చెంపలు నిమిరి, నుదుటిన ముద్దుపెట్టింది...కోరుకున్న అమ్మచేతి స్పర్శ అందినందుకో, మందులు పనిచేసాయో రెండుగంటలు గడిచాక లాస్యకు జ్వరం తగ్గుముఖం పట్టింది...

సుప్రియ అమృత పక్కనొచ్చి కూర్చుని అత్తగారి చెయ్యి పట్టుకుని..లాస్యకు భయం లేదు అత్తయ్యా, ఇప్పుడు జ్వరం తగ్గుతోంది, మీరు దిగులు పడకండి..అని అమృతను పలకరించింది సుప్రియ...విశాల్ వాళ్ళిద్దరినీ చూస్తూ కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఛైరులో...

కొన్ని నెలలకి ప్రమోషన్ వచ్చింది విశాల్ కి...వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యాడు విశాల్...అమృతకు చెప్పాడు...అమ్మా మేము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చేలా ఉందీ అని..అంతే అమృత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి...చదువులకి కూడా ఏనాడూ కొడుకుని వేరే ఊరు పంపించలేదు అమృత..ఈరోజు ఉద్యోగనిమిత్తం వేరే ఊరు కొడుకు వాళ్ళు వెళ్తారు అన్న విషయం తట్టుకోలేకపోతోంది అమృత...

విశాల్..నాది పిచ్చిప్రేమే, చాదస్తమే, నువ్వూ సుప్రియ భరించలేకపోతున్నారు ఈ పిచ్చిమాలోకాన్ని అనుకుంటే, నువ్వు చెప్పరా నాన్నా , ఎలా ఉండమంటే అలానే ఉంటానుగా...మీ ముగ్గురూ నాకళ్ళముందు లేకుండా నాకు రోజు గడవదురా...లాస్య తల్లి ఆటలు చూసుకుంటూ, ముద్దుముద్దు మాటలు వినుకుంటూ ఉండగలిగే అదృష్టాన్ని నాకు దూరం చెయ్యద్దురా అంది అమృత స్పష్టంగా...

అమ్నా నిన్నొదిలి వెళ్ళటం నాకూ కష్టమే, కానీ ఉద్యోగంలో ఎదిగేటప్పుడు ఇవన్నీ తప్పవు కదా అమ్మా...వీలున్నంతలో నెలకో రెండు నెలలకో వస్తూ వెళుతూ ఉంటామమ్మా, నువ్వూనాన్న కూడా మాదగ్గరొచ్చి ఉండండి, ఎన్నిరోజులైతే అన్నిరోజులు అని సర్దిచెప్పాడు విశాల్...

గుంటూరు నుంచీ బెంగుళూరుకి సుప్రియ కూడా  జాబ్ మారింది...అమృత కి ఎంత మనసుకి సర్దిచెప్పుకున్నా ఈ మార్పు తట్టుకోలేకపోయింది...తిండి సయించదు, నిద్ర పట్టదు...చిక్కి సగమయ్యింది...వినాయకచవితి పండుగకి ఇంటికొచ్చిన విశాల్ అమృతను చూసి బాధపడ్డాడు..అమ్మా ఎందుకమ్మా ఇంతలా మనసుకి తీసుకుంటావు...ప్రేమ మనుష్యులకి బలం అవ్వాలే కానీ, బలహీనత కాకూడదు...ఇలా నువ్వు, నిన్ను నువ్వు ఇంతలా బాధపెట్టుకునేట్టు అయితే నువ్వునాన్న ఎప్పటికీ నా దగ్గరే ఉండండి అన్నాడు...

మీ నాన్నగారు ఈ ఇల్లు వదిలిరారురా, ఆయనకు తన తల్లితండ్రితో ఈ ఇంట్లో గడిపిన గుర్తులు వదిలి ఎక్కడికీ రారు, ఆయన బాధపడితే నేను చూడలేను అంది నీరసంగా నవ్వుతూ అమృత, మరి నువ్విలా బాధపడితే నేను చూడలేను అన్నాడు విశాల్ అమృతనుద్దేశించి...

బుడ్డిది లాస్య అంతా విని సుప్రియవళ్ళోంచి లేచివచ్చి అమృత ని మెడచుట్టూ తన చిట్టి చేతులేసి హత్తుకుని నానమ్మా నేను ఇక్కడే ఉంటాను నీతోనే అంది...ఒక్కసారి అమృత కళ్ళల్లో మెరుపు వచ్చింది..నా బంగారుతల్లే, నా దగ్గరే ఉంటావా అంది ఆశగా...ఊ అమ్మ ఉంటే నేను నీ దగ్గరే ఉండిపోతా..అంది లాస్య...

సుప్రియ చెప్పింది విశాల్ కి నేను ఇక్కడే ఏదన్నా జాబ్ చూసుకుంటాలెండి, అత్తయ్యని ఇలా హుషారు లేనట్టు చూస్తుంటే నాకూ ఏమీ బాలేదు...కళకళలాడే ఇల్లు ఇలా బోసిపోతుంటే ఏమీ బాలేదు...అత్తయ్యా మీ హుషారంతా ఈ పండుగరోజు తిరిగిరావాలి అంది సుప్రియ హక్కుగా...

అన్నిరోజులూ అన్నం పప్పు ఉడికించేందుకు కూడా ఓపికలేనట్టుగా పడి ఉన్న అమృత, ఆ రోజు వెయ్యేనుగుల బలం వచ్చినట్టు పూర్ణం బూరెలు, చింతపండు పులిహోర, లాస్యకి ఇష్టం అని గులాబ్ జామూన్ చేసింది...

పిచ్చి అమ్మా ప్రేమే తన బలం, ప్రేమే తన బలహీనత అనుకున్నాడు విశాల్...

అమృత కల్మషం లేని ప్రేమను అర్ధం చేసుకున్నారు సుప్రియ విశాల్...వారు కూడా అమృతకు తగ్గట్టే ఉన్నారు...ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది....కోపం చూపిస్తే కోపమే మిగులుతుంది...ఎవ్వరికైనా...

లాస్య కి పద్ధెనిమెదేళ్ళు...కాలేజీ చదువు, ఫ్రెండ్స్..కొత్త కొత్త ఫాషన్లు, కొత్త ట్రెండ్సు...లాస్యకి నెమ్మది నెమ్మదిగా ఇంట్లో పెద్దవాళ్ళ అలవాట్లు, ఆలోచనలు చాదస్తంగా అనిపిస్తున్నాయి...

పెద్దచదువులకి వేరేఊరు వెళ్ళటానికి సిద్ధపడింది లాస్య...అసలే రోజులు బాలేవు అని సుప్రియ విశాల్ హైదరాబాదులో ఇల్లు తీసుకుని లాస్యను చదివించుకుంటున్నారు...

రోజూ విశాల్ తల్లితో ఫోనులో మాట్లాడుతాడు...అమృతకి మతిమరుపు కూడా వచ్చేసింది...ఎవ్వరినీ గుర్తు పట్టట్లేదు కూడా...ఒక పనమ్మాయిని తల్లితండ్రికి తోడుగా ఉంచి తాము లాస్యకోసం వేరే ఊరిలో స్థిరపడ్డారు విశాల్ సుప్రియ...

అమృత తనలో తానే పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఏదో మాటలు గొణుక్కుంటూ కూర్చుంటుంది..భర్త ఎంత అర్ధం చేసుకోవాలని చూసినా అమర్ అనో విశాల్ అనో లాస్యాతల్లి అనో పేరులు తప్ప ఇంకేమాటలూ అర్ధమయ్యేలా వినపడవు అమృతనుంచీ...కాలం మారుతూ ఉంటుంది....మనుషులూ మారాల్సి వస్తూ ఉంటుంది మరి...కొందరి ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు.
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏
 😊❤ సుమతీసత్యం ❤😊

భోజనం వడ్డించింది సుమతి.. 

" ఏం కూరోయ్ ఇది , బహుశా బీరకాయ్ , ఊ కాదులే .. సొరకాయ్ , కాదు కాదు బీరకాయ్... బాగానే ఉంది కానీ కాస్త నీరు ఇంకొంచెం ఇగిరాక స్టవ్ మీద నుంచీ దించుంటే బావుండేదేమో.." అన్నాడు సత్యమూర్తి... 

అతని మాటలు వింటూ మౌనంగా అన్నం తింటోంది సుమతి, అదే బీరకాయ్ కూరతో.. 

భార్య తన కామెంట్స్ విని కూడా, కామ్ గా ఉందిలే అనుకున్నాడు సత్యమూర్తి , పిచ్చి మానవుడు.. 
" చాల్లెండి వంకలూ , బానేఉందిగా కూర , తినండి.." అని భార్య వెంటనే ఓ సమాధానం చెప్పేస్తే , కాస్తలో కాస్త నయం.. 

అదే ఆవిడ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉందంటే అర్థం .. పులి దాడి చేసేముందు నెమ్మదిగా సవ్వడి చేయకుండా నాలుగు అడుగులు వెనక్కి వేస్తోంది అంటే , మరింత వేగంగా, బలంగా ,.. విడిచిన బాణంలా ముందుకు వెళ్ళి గాయపరచడానికే... అని అప్పటికి సత్యమూర్తికి ఇంకా అనుభవంలోకి రాలేదు పాపం...

" పదండీ " అంటూ బయటికి వెళ్ళేందుకి తయారయి వచ్చింది అదేరోజు సాయంత్రం సుమతి ,... " ఇప్పుడెక్కడికీ " అన్నాడు సాగదీస్తూ సత్యమూర్తి... 
" ఇందాక మనమేమీ బయటకు వెళ్దామని అనుకున్నట్లు లేమే .. " అని కూడా సందేహం వెలిబుచ్చాడు...

" వెళ్ళాలని నేను అనుకున్నాలెండి ఇందాక.., మీతో ఇప్పుడు చెబుతున్నాగా , పదండి పదండి.." అంది సుమతి శాసనం జారీ చేస్తున్నట్లుగా... 

" ఓ .. ఏదైనా సినిమాకి వెళ్దామా , పద పదా .. వచ్చేటప్పుడు దారిలో మల్లెపూలు తీసుకుందాం , .. " అన్నాడు చిలిపిగా నవ్వుతూ సత్యమూర్తి...

స్కూటర్ మీద బయలుదేరారు ఇద్దరూ... అరగంట తరువాత సామాన్ల షాప్ ఒకటి పెద్దది , అక్కడ బండి ఆపమంది సుమతి.. షాప్ లోకి వెళ్ళి , మందంగా , పెద్దగా ఉన్న బాండీలు , గిన్నెలూ చూస్తోంది ..

" ఇప్పుడెందుకు ఇవన్నీ.. ఇంట్లో బొచ్చెడు సామాన్లు ఉండగా " అన్నాడు సత్య... " ఆ ఆ.. ఉన్నాయ్ సామాన్లు , ఆవిడకి ఊరిలో ఇంట్లో మోతబరువు అనుకున్న సామాన్లు తెచ్చి , నా మొహాన పడేసారు మా అత్తగారు , ఆ అరిగి కరిగిపోయిన బాండీలో వంట చేస్తుంటే , మద్యాహ్నం చూసారుగా , కూరలు రుచిగా కుదరటంలేదు కూడానూ.." అంటోంది సుమతి...

" కూర రుచిగా రావాలంటే , మనకి వంట బాగా చేయటం వచ్చుండాలి , అంతేగానీ .. " అని అంటున్న సత్య వైపు ఉరిమినట్లుగా చూసింది సుమతి... 
" అవునా , సర్లేండి , పోనీ మా ఫ్రెండ్ చెప్పింది మైక్రోవేవ్ లో ఒకేసారి , గిన్నెలో అన్నీ పెట్టేసి టైమ్ సెట్ చేసి పెట్టేస్తే , హాయిగా మధ్యమధ్యలో కలపకుండా ఉన్నా సరే కూర చక్కగా తయారయిపోతుందిట.. పోనీ మైక్రోవేవ్ కొనుక్కుంటా.. " అంది సుమతి , భర్త వైపు చూస్తూ ,  నవ్వు నవ్వుతూనే పళ్ళు నూరుతూ...

" హబ్బే.. వద్దొద్దు నాకు సరిపడవు అలా వండితే , చక్కగా పొయ్యి మీద వండుకుందాం మనం.. కరెంటు ఖర్చు పెట్టి మరీ , ఎందుకు వండుకోవడం.. నీకు నచ్చిన బాండీ కొనుక్కో బంగారం.." అనేసాడు గబగబా సత్య ఒక పిచ్చి నవ్వు బలవంతంగా మొహానికి అతికించుకుంటూ...

సుమతి ఇందాక సత్యతో మాట్లాడే ముందు నడుము దగ్గర దోపిన చీరకొంగు బయటకు తీసి , సత్యను చూస్తూ ఒకసారి చీరకొంగును దులిపి మామూలుగా వెనక్కి  వదిలేసింది చీరకొంగుని... 
" ఒహో కయ్యానికి కాలు దువ్విందా ఇందాక మన మీద, నా సత్యభామ , ఈ సత్యకి దొరికిన భామ " అని సత్య , సత్యం తెలుసుకున్నాడు , ఇహపై ముందుముందు భార్య దగ్గర ఎలా మెలగాలో , మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడకపోతే , జేబు బరువు అమాంతంగా ఎలా తగ్గిపోతుందో బాగా తెలిసొచ్చింది...

అలా అలా సత్యమూర్తి నోరు ఆగక ఏదో ఒకటి అనెయ్యటం, తరువాత సత్యగారి భామగారు ఆ అనేసిన భర్త మాటలకు భారీగా జరిమానాలు అందిపుచ్చుకోవడం జరుగుతూనే ఉంది...

ఇడ్లీపప్పు తేవయ్యా అంటే పెసరపప్పు, ఇడ్లీరవ్వ ఏదయ్యా అంటే బొంబాయిరవ్వ తేవటం, సత్యమూర్తి తప్పిదాలు... 

తిక్కరేగిన సుమతి, మతి తిరిగి ఒకరోజు, తనే షాపుకెళ్ళి ఇడ్లీరవ్వ తెచ్చి, రాత్రికి అదే రవ్వతో ఉప్మా చేసి పెట్టింది సత్యమూర్తికి...

ఉప్మా మొదటిముద్ద తిన్నాడు సత్య, అబ్బే రుచి బాలేదే,.. అమ్మో బయటికి చెబితే, మళ్ళీ  ఎంత పెనాల్టీ కట్టాలో అనుకుని , గుటుక్కున ఒక ముద్ద మింగేసి, ఒక గ్లాసుడు నీళ్ళు తాగుతున్నాడు...

అలా భర్త ఓ నాలుగు ముద్దలు తిప్పలు పడి తిన్నాక, " ఇహ చాల్లే, మీ శిక్ష పూర్తయ్యింది, ఇడ్లీరవ్వతో ఉప్మా ఇంకెంతసేపు తింటారూ,.." అని సుమతి మంచితనం చూపించి, భర్తకి ఇష్టమైన జీడిపప్పు టమోటాభాత్ పళ్ళెం, సత్యమూర్తికి ఎదురుగా పెట్టింది...

" ఒసే రాక్షసీ.." అని మనసులోనే గట్టిగా అరుచుకుని, కోపంతో మొహం ఎర్రగా చేసుకుని, బహు రుచిగా నోటికి ఆనుతున్న జీడిపప్పు ఉప్మా, చకచకా తినేసాడు సత్యమూర్తి...

ఇలాంటి ఎన్ని శిక్షలు పడినా,  అయ్యగారికి సరుకుల విషయంలో అయోమయం మాత్రం పోనే పోలేదు...

అసలే అంతంతమాత్రం మన సత్యం షాపింగూ , ఇహ పిల్లలు పుట్టి పెద్దాళ్ళయ్యాక, సత్యమూర్తికి అటూఇటూగా ఓ యాభై యేళ్ళు వచ్చేసాయి.

ఓ రోజు పులిహోర చేస్తోంది సుమతి.. " అయ్యో వేరుశెనగ గుళ్ళు అయిపోయాయే, పిల్లలకు అవి వేయనిదే పులిహోర నచ్చదు " అంది సుమతి...

" నేను తెచ్చేస్తాగా, ఎంతసేపు, .. నువ్వు అన్నం, పసుపు కలిపి రెడీగా పెట్టుకో, తిరగమోతకి పొయ్యి మీద బాండీ పెట్టేసుకో.." అంటూ సత్యమూర్తి ధీమాగా భార్యకు భరోసా ఇచ్చి బయటకు వెళ్ళాడు...

ఐదు నిముషాల్లో రావల్సిన మనిషి పావుగంట అయినా రాడాయే... " హూ, ఇంకా రాలేదేమిటీ ఈయనా.." అనుకుంటూ టీ వీ లో సీరియల్ చూస్తోంది సుమతి..భర్త నుంచీ ఫోన్ వచ్చింది , 
" హెలో.." అంది..

" అవునోయ్ , బంగాళదుంపలు తీసుకున్నా, మ్యారీ బిస్కెట్లు తీసుకున్నా, ఈనో ప్యాకెట్లూ తీసుకున్నా.. ఇంకోటేదో అసలుదే మరిచిపోయినట్లున్నాను అనిపిస్తోంది, హేవిటదీ.." అన్నాడు అయోమయంగా...

ముసలాయన మతిమరుపుకి, సుమతికి బాగా నవ్వొచ్చేసింది, " ఓరి నీ మతిమరుపు దొంగలు తీసుకెళ్ళా, అసలు వెళ్ళిందే వేరుశేనగపప్పులు కోసం, అవే మరిచిపోయారా.. " అని నవ్వుతూ చెప్పింది...

" ఆ.. అవును కదూ వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలి, సరే సరే ఫోన్ పెట్టేయ్, త్వరగా తీసుకొస్తా.." అని ఫోన్ పెట్టేసాడు పెద్దాయన సత్యం..

అలా అలా ఒకరినొకరు, తిప్పలు పెట్టుకుంటూ ఏళ్ళు గడిచాయి..

ఆ రోజు ఇద్దరికీ షష్టిపూర్తి మహోత్సవం... స్టేజీ మీద సత్యమూర్తి ఒహటే జోకులు, చిలిపిదనం, అల్లరి.. ఇహ రమ్మనండర్రా సుమతిని దండలు మార్చుకుంటారు, షష్టిపూర్తి దంపతులు.. అన్నారు పెళ్ళి జరిపించే అయ్యవారు...

స్టేజీ మీదకి వస్తోంది గులాబీచీరకు ఆకుపచ్చని జరీ అంచుతో విమల, సుమతి చెల్లెలు... దూరం నుంచీ వస్తున్న విమలను చూసాడు సత్యం, ఇంతలో ఎవరో పలకరించారు ఇటుపక్కనుంచీ సత్యంని, వారితో మాట్లాడి అటు తిరిగి తలనిండా పూలతో కిందకి వంగి సర్దుతున్న విమలతో చెప్పాడు, మా పెళ్ళిరోజున ముఫ్ఫైరెండేళ్ళ క్రితం గులాబీరంగు వోణీలో ఎంతందంగా ఉన్నావో విమలా, ఈ రోజున కూడా ఈ గులాబీ చీరలో అంతే బావున్నావు, మీ అక్క కంటే ముందే నిన్ను చూసుంటే, నిన్నే పెళ్ళి చేసుకునేవాడిని.." అని చిలిపిగా, సరసంగా చెబుతున్నాడు సత్యం...

" అవునా, "..అంది.. తన గులాబీ రంగు పట్టుచీర కొంగును, నడుము దగ్గర దోపుకుంటూ సుమతి, తల పైకెత్తి భర్తని సూటిగా చూస్తూ...

" బావోయ్, మా అక్కచెల్లెళ్ళం అందరం కలిసి, ఇవ్వాళ గులాబీరంగు చీరలే కట్టుకున్నామోచ్.." అంది విమల బావని ఆట పట్టిస్తూ...

" అదే సుమతి , మీ అందరినీ ఇలా చూసి నా మతి పోయి.." అని సత్యం తడబడుతుంటే.. 

" మతి అనేది అసలు ఉంటే కదా మహానుభావా మీకు.." అంది సుమతి మూతి మూడు వంకర్లు తిప్పుతూ , సత్యంకి మెడలో దండ వేస్తూ, తన చేతిలో రెడీగా పట్టుకుని ఉన్న పిన్నీసుతో సత్యం చేయి మీద గుచ్చుతూ... " కెవ్ .." అని నొప్పితో కేక వెయ్యబోయి, " తప్పదులే, భార్యని అనవసరంగా బాధపెడితే శిక్ష తప్పదుగా " అనుకున్నాడు సత్యం, ఎప్పటికయినా భరించేవాడు భర్త కదా.. అని అనుకుంటూ...
🙏🙏🙏🙏🙏🙏
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏
 *_ముద్దబంతి పూవులో_*
*_మూగకళ్ళ ఊసులో.!_*

(మూగమనసులు సినిమాకి
అరవై రెండు..31.01.1964)

*_మూగమనసులు.._*
ఏమనుకుని పెట్టారో 
ఆ పేరు..
ఏ ముహూర్తాన 
ఆ సినిమా
పాటల కోసం కలం పట్టాడో
మనసు కవి..

మనసును ఆవిష్కరిస్తూ
ఏం పాటలవి..
ప్రతి హృదయాన్ని స్పృశిస్తూ..
ప్రతి మనసును తడుతూ..
తడుపుతూ..
ఆత్రేయ కలం సాగింది..
ఆర్ద్రత అనే సిరాతో..
మామ సంగీతం
మెలోడీ అనే చిరునామాతో..
అక్కినేని..సావిత్రి.. జమున
అభినయాలు 
పరాకాష్ట అనే నిష్టతో..
ఆదుర్తి దర్శకత్వం
పరిపూర్ణత అనే 
తాదాత్మ్యతతో..!

ఒక జంట..
ఆ ఇద్దరి నడుమ
ప్రేమే ఉందో..
అభిమానమే పెనవేసుకుందో..
ఆరాధన అలముకుందో..
బంధమే ముడిపడిందో..

ఒక పడవ వాడు...
ఒక అమ్మాయిగారు..
సజీవ పాత్రలు..
ఎప్పుడూ ప్రేమ గురించి
మాట్లాడుకోని ప్రేమికులు..
మూగ భావాలు..
పైకి చెప్పుకోని
హృదయ స్పందనలు..
వీటితో కథ నడిపిన తీరు..
ఉందో లేదో తెలియని 
మరుజన్మ వరకు
ఆ బంధాన్ని లాగిన 
గోదావరి హోరు..
మూగమనసులు అనే పేరు..

*_నా పాట నీ నోట_* 
*_పలకాలి సిలక.._*
సరిగా పలకని
అమ్మయిగారిపై సిరాకు..

అదే అమ్మాయిగారికి
మనువై పోతే...
*_మనసు మూగదే గాని_*
*_బాసుంటది దానికి_*
*_సెవులుండే మడిసికే_*
*_ఇనిపిస్తుందా అది.._*
పాడింది బైటికే..
లోన అంతులేని బాధ..
తనకే అర్థం కాని సొద..
మూగ మనసు రొద..
తెలియని వ్యధ..!

కలత చెంది నిదురకు
దూరమైన అమ్మాయిగారికి
*_పాడుతా తీయగా సల్లగా.._*
*_పసిపాపలా నిదురపో తల్లిగా_*
ఇలా జోల పాడుతూ
*_కునుకు పడితె మనసు కాస్త_*
*_కుదుటపడతది.._*
*_కుదుట పడ్డ మనసు తీపి_*
*_కలలు కంటది.._*
అవి తత్వాలా..
ఆ ఇద్దరి మనస్తత్వాలా..
మొత్తానికి 
హత్తుకుపోయిన పాటలు..
వెంటాడే స్వరాలు..
నీలో...నాలో సుడులు
తిరిగే భావాలు..
పదాల్లోనే తొణికిసలాడే
హావభావాలు..!

అటు ప్రశాంత గోదారిలా 
రాధమ్మ..
ఇటు ఆ గోదావరిలోని
ఆటుపోట్లు ఎరిగిన గోపి..
ఆ ఇద్దరి నడుమ
గలగలా గోదారి గౌరి..
ఆ గౌరి 
*_సెట్టుకొమ్మన పిట్ట.._*
*_పిట్ట మనసులో ఏముందో_*
ఎవ్వరికీ తెలియకపోయినా
*_మానూ మాకును కాను_*
*_రాయిరప్పను కానేకాను.._*
*_మామూలు మడిసిని నేను_*
*_నీ మడిసిని నేను.._*
ఆ గౌరి మనసులో
గోదావరి సుడులు..
మళ్లీ గోపీ వచ్చే వరకు
కొట్టుమిట్టాడిన ప్రాణం..
నచ్చిన మడిసి చేతిలోనే
ఆ పేనం వదిలిన 
పండు ముసలి..
మొసలి నాగభూషణం..
కూతురి కోసం
అలమటించిన గుమ్మడి..
అలవాటైన పాత్ర..
గయ్యాళి సవతి తల్లి
సూర్యకాంతం..
కొట్టిన పిండి క్యారెక్టర్..
అల్లు మినీ విలనీ..
క్యాస్టింగ్ ఎంతటిదో..
ఆనాటి ఆ బంధమేనాటిదో!

ఆదుర్తి ఆలోచన..
కథ ముళ్ళపూడి 
తొలి రచన..
ఆత్రేయతో సమాలోచన..
ఘంటసాల..సుశీల..
జమునారాణి 
స్వరాల సమ్మేళన..
మూగమనసులు
చలువల పందిరి వేసింది..
తొలి వలపుల 
వానై కురిసింది..!

*_సురేష్..9948546286_*
          *_..7995666286_*
 క్రమ సంఖ్య  10/2026
తేది 31/01/2026

*బంధం*

by -ఎస్. లలిత

“అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే  ఎక్కువవు తున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో…

“ఎవరి గురించి నీవు చెప్పేది… నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం.ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా కుటుంబం కోసం కాదనుకుంది.. ఒక్కర్తే కూతురు.. పెళ్ళి చేసేసావు… ఎక్కడో అమెరికాలో ఉంది.. కనుక పైకి, దిగువకు అనేది నీకు తెలియదు.. జాలి తప్ప” అన్నాడు విశ్వనాథం నవ్వుతూ…

“నీకేమైంది… నీది కూడా నాలాంటి జీవితమే కదా.. మన మధ్య స్నేహానికి నాలుగు దశాబ్దాల కాలముంది.. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా…” అన్నాను.

ఈ రోజు మా కాలేజీలో అకడమిక్ ఆడిట్ ఉంది.. తొందరగా వెళ్ళాలి.. అన్నీ సర్దుకునే ఉన్నాను.. ఈలోగా ఇదిగో మిత్రుడు విశ్వనాథం వాడి మనవరాలు గురించి మాట్లాడడానికి వచ్చాడు.. వాచీ చూసుకున్నాను.. ఉదయం.. ఎనిమిదయింది.. ఫర్వాలేదు.. మరో గంటన్నర సమయముంది.

“ఇంతకీ… ఈ అవమానం, ఆకలి… డైలాగ్ ఎవరి కోసం నాయనా.. మీ కాలేజీలో మధుమిత కోసమేనా… మగాడు ప్రక్కన లేకపోతే… పూట గడవదట కదా…” అన్నాడు విశ్వనాథం.. ‘ప్రక్క’ అనే పదం మీద వత్తి పలుకుతూ…

“ఆమెది కాంట్రాక్ట్ పోస్ట్… షోకులెక్కువ.. ఆదాయం తక్కువ, భర్త చనిపోయాడు. చంపేసిందనే అనుకుంటారు… ఒక్కగానొక్క కొడుకు డిగ్రీ చదువుతున్నాడు.. కులమే మిటో నాకు తెలియదులే.. తెల్లగా ఉంటుంది.. ఇంకా..” ఇంతలో మా ఆవిడ క్యారేజ్ తో వచ్చింది..

బయలుదేరదామనుకున్నాము.. ఇద్దరం..

ఒక పాపను ఎత్తుకొని.. ఓ మధ్య వయసు స్త్రీ “శంకరం మాష్టారిల్లు ఇదేనా..” అని అడుగుతున్నది గుమ్మంలో నుంచి.

“ఇదేనమ్మా… నేనే ఆ శంకరం మాష్టారిని.. నువ్వెవరమ్మా… దామ్మా లోపలికి వచ్చి చెప్పు ఏం కావాలో..” మళ్ళీ ఇద్దరం కూర్చున్నాం… సమయం తొమ్మిది కావస్తున్నది…

“నీవు.. రామనాథం మేస్త్రి దగ్గర పనిచేసేదానవు కదా..” అన్నాడు విశ్వనాథం.. అతని మాటల్లో నీ గురించి “నాకు  తెలుసులే” అనే సూచనుంది. ఆమె మౌనంగా నిలుచుంది.. చంకలో రెండేళ్ళ బాబు.. బహుశా ఉండవచ్చు.

ఆమె.. వయసు నాలుగు పదులు దాటి ఉండవచ్చు. చామనఛాయ.. చర్మ సంరక్షణ లేక శరీరం శుష్కించి ఉన్నా, కళ్ళల్లో కాంతి ఉంది. ముఖం కళగా ఉంది.. నిద్రలేమి, భయం వలన కళ్ళు కింద నల్లని చారలు.. జీవితానుభావ పాఠాల సారాంశంను చెబు తున్న నుదుటి మీద గీతలు… వెలిసిన వాయిల్ చీర.. లోతుకుపోయిన బుగ్గలు.. చంకలో బాబుతో.. కళ్ళలో భయంతో.. ఆమె అలా నిలుచుండి పోయింది.. ఇంతలో.. నా భార్య వస్తూ..

“ఏమండీ.. ఆ పనిమనిషికి ఫోన్ చేయండి.. రెండు రోజులుగా రాలేదు.. పండగ వస్తున్నది.. పాప అల్లుడు రావచ్చు. చేయవలసిన చాలా ఉన్నాయి..” అని వచ్చి.. ఆమెను చూసి ఆగి.. ‘ఎవరీమె’.. అన్నట్టుగా చూసింది..

నేనేమీ చెప్పలేదు.. నాకు తెలియదుగా.. వాచి చూసుకున్నాను.. సమయం తొమ్మిదింపావు.. అమ్మో.. “ఆమె ఎవరో తెలియదు.. నా కోసం వచ్చిందట.. కాస్త కనుక్కో..” అని చెప్పి ఆమె వైపు తిరిగి “అమ్మ.. ఈమె నా ఇంటి హోమ్ మినిస్టర్.. నా గురించి ఏమైనా నీకు కావాలంటే ఆమెను అడుగు.. నాకు కాలేజీలో పని ఉంది.. పదరా…” అని ఇద్దరం బయటకు బయలుదేరాం.. ఇతరుల నుంచి తమకు కావాల్సింది అధికారంతో ఆత్మవిశ్వాసంతో తీసుకోగలిగిన వారే అంత నిస్వార్థంతో అంతే సంతోషంతో ఇతరుల కివ్వగలరు. ఇందుకు నా భార్య మినహాయింపు కాదు..

***

          సాయంత్రం ఆరైంది… మా కాలేజీలో ఆడిట్ ముగిసింది. ఇది ప్రతి సంవత్సరం రొటీన్ గా జరిగే తంతే.. నా ముందు ఆటో ఆగింది. నేను.. విశ్వనాథం ఎక్కాము.. ఆటో డ్రైవర్ చక్రవర్తి నాకు బాగా తెలుసు.. అతని తండ్రి ఇదే ఆటోలో మా పాపను బడి దశ నుండి కాలేజీ దశ వరకు తీసుకువెళ్ళాడు.. ఆక్సిడెంట్ లో చనిపోయాడు.. ఇద్దరు కొడుకుల్లో ఒకడికి బ్యాంకు జాబ్ వచ్చి… ప్రేమించిన అమ్మాయితో.. రెండు గదుల ఇంట్లో ఉండలేక తన దారి తాను చూసుకున్నాడు..” పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పు కాదు.. వారు తిరిగి ఆ ప్రేమను ఇవ్వాలనే నిబంధన మహా పాపం” అనే ఖలీల్ జిబ్రాన్ మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకునే తండ్రి లేడు.. తల్లికి చదువు లేదు.. ఉన్న ఒక తమ్ముడు తల్లిని ఎలా బ్రతికిస్తాడు అనే ప్రేమ పెద్ద కొడుకుకు రాలేదు.. ఇంజనీరింగ్ చదువుకున్న చక్రవర్తి నా కోసం ఆటో డ్రైవరయాడు.. నన్ను ఉదయం కాలేజీలో దింపేసి.. తను అదే ఆటో వేసుకొని సాయంత్రం వరకు సర్వీస్ చేసుకొని.. నా కోసం వస్తాడు.. అతనికి మూడు పదులు దాటాయి.. తోడు అవసరం.. కానీ.. ఎవరు పిల్లనిస్తారు.. వ్యసనాలు లేవు.. ఆటోకి డబ్బులు నేనే ఇచ్చాను.. అప్పు తీర్చేసాడు.. సొంత ఆటో యజమాని.. కానీ.. ఎవరికి కావాలి ఇవన్నీ.. ఇప్పటి ఆడపిల్లలకు.. ఏం కావాలో ‘వారికే  తెలియదు..’ మేమిద్దరం మౌనంగా ఉన్నాము.. ఆమె ఎవరు? నా కోసం ఎందుకు వచ్చింది.. ఇంటికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి.. నన్ను ఇంటి దగ్గర దింపేసి, విశ్వనాథంను తీసుకుని చక్రవర్తి ఆటో వెళ్ళిపోయింది.. నేను ఇంట్లోకి వెళ్ళాను..

***

          నన్ను చూడగానే.. ఉదయం నా కోసం వచ్చినామే ప్రక్కకు వెళ్ళిపోయింది.. మా ఆవిడ తనకున్న పాత చీరల్లో ఒకటిచ్చినట్టుంది. చీరలో ఆమె కడిగిన ముత్యంలా ఉంది.. నేను నా గదిలోకి వెళ్ళిపోయాను..

అరగంట తర్వాత.. నా భార్య టీ గ్లాస్ తో వచ్చింది..

“ఇంతకీ ఎవరామె.. ఎందుకొచ్చింది” అడిగాను.. టీ తాగుతూ.. వేసవి.. సాయంత్రం.. ఆరున్నర కావస్తున్నది.. నా భార్య చాలా రిలాక్స్డ్ గా ఉంది.. “పనులన్నీ తనకి అప్పగిం చేసాను.. మరి పనిమనిషి అవసరం లేదు. తను ఇక్కడే ఉంటుంది.”

గదిలో ఏ.సీ.. చల్లగా ఉంది.. ఆమె హృదయం కూడా.. కానీ.. నా భార్య అంత అమాయకురాలు అయితే కాదని నాకు తెలుసు.. బహుశా వచ్చినామె గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేసి ఉంటుంది. ‘ఇంతకీ ఏమిటామే కథ’  అన్నాను ఆసక్తితో.. ఆమె మెల్లగా చెప్పడం ప్రారంభించింది..

***

          “ఏమే.. రాజి.. నా దగ్గర జాయినయ్యి రెండు నెలలు కావస్తున్నది. ప్రతిరోజు నీకు పనిస్తున్నాను. ఎందుకో తెలుసా.. నీ బాబుని చూసి.. నీ లేచిపోయిన మొగుడిని చూసి కాదు. నిన్ను.. చూసి..” ఆమెను ఎగాదిగా చూస్తూ అన్నాడు పెద్ద మేస్త్రి రామనాథం..

“అది కాదు.. బాబు.. నువ్వు దేవుడివే.. నేను కాదనను. అయినా.. నీ దగ్గరకు, ఎందరో వస్తున్నారు.. నేను చూస్తున్నాను.. నేను కూడా ఎందుకని.. కొద్దికాలం ఓపికపట్టయ్య.. ఈ పని కాక.. నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతాను” రాజేశ్వరి మాటలు ఆమె గుండెలో మంటలు.. కళ్ళలో ఇంకిన కన్నీళ్ళు దూరంగా.. ఉయ్యాల్లో బాబు.. భవిష్యత్తు లేని ప్రశ్నార్ధకమైన జీవితం.. ఎలా.. ఏం చేయాలి.. ఈ మేస్త్రీకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ‘అందరూ కావాలి..’ నాతో కూడా.. ఏదో పని మిషతో నా దగ్గరకు వచ్చి.. శరీరాన్ని తాకుతూ.. అప్పుడప్పుడు.. భోజనం ప్యాకెట్స్, బాబుకు పాల ప్యాకెట్స్ కొంటాడు.. వాటి అర్థం ‘తనకు’ తెలుసు..

ఒకరోజు.. రాత్రి.. మేస్త్రి బాగా తాగి.. ఆమె ఉంటున్న పూరింట్లోకి వచ్చేసాడు..

ఆమె బాబుతో… బయటకు వచ్చేసింది.. కానీ.. ఆ రాత్రివేళ.. ఎంతమంది.. ఆ తరహా ‘మేస్త్రీ’ల నుంచి తనను తానుగా కాపాడుకొందో..!?

నా భార్య చెప్పటం ఆపింది. మా మధ్య క్షణం.. మౌనం..

‘మనసు ఆర్ధ్రమయినప్పుడు మౌనమే మాట్లాడుతుందని’ ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది.

‘అవును.. మనమెంత కాలం.. ఆమెను..” అన్నాను. “మనకో పనిమనిషి కావాలి.. ఆమెకు తాత్కాలిక ఆసరా కావాలి.. రానున్నది పండుగ.. పిల్లలు వస్తారు.. నాకు తోడు కావాలి.. రాజేశ్వరి.. చక్కగా అల్లుకుపోతున్నది.. పిల్లాడు మంచివాడే అల్లరి చేయకుండా ఆడుకుంటున్నాడు.. ప్రస్తుతం అవనియ్యండి.. తర్వాత చూద్దాం..” అంది.. ఆమెకు.. రాజేశ్వరి నచ్చినట్టుంది..

“ఇంతకీ ఆమె ఎక్కడ ఉంటుంది..” అన్నాను ప్రశ్నార్థకంగా..

“పాప గదిలో.. క్రింద పడుకుంటానని చెప్పింది.. పాప వస్తే.. మెయిన్ హాల్లో పడుకుంటానంది.. తనను పంపవద్దని ఏడ్చింది..” చెబుతున్న నా భార్య గొంతు ఆర్ధ్రమవ్వటం నేను గుర్తించాను.. “సరే.. నీ ఇష్టం.. అదేదో నువ్వే చూసుకో.. ఒకే..నా..” అన్నాను.. “గుడ్ బోయ్..” అని లేచి.. టీ గ్లాస్ తీసుకుని.. నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నవ్వుతూ వెళ్ళింది.. అంటే.. ఆమె.. చెప్పలేని ఆనందంలో ఉందన్నమాట..

పండగ వెళ్ళిపోయింది.. పాప కూడా రాజేశ్వరితోను, బాబుతోను తిరగటం, అక్క అక్క అని మా పాప ఆమెను పిలవడం నాకర్థమయ్యాయి.. నాతోనూ.. ఎంతవరకు అంతవరకే ఉంటున్నది.. బాబు మెల్లగా నడుస్తున్నాడు.. పాప అల్లుడు వెళ్ళిపోయే ముందు ఆమె చేతిలో చీర, జాకెట్టు, కొంత డబ్బు పెట్టారు.. వారి మధ్య స్నేహం నాకు అర్థమైంది.. రాజేశ్వరి.. మునుపటికన్నా బాగా తయారయింది. గౌరవంగా ఉంటుంది. నా భార్య ఆమెకు కొన్ని మేనర్స్ నేర్పింది. ఆరు నెలలు.. సజావుగా గడిచాయి.. ఓ రోజు బయలుదేరుతుంటే నా భార్య నా దగ్గరకు వచ్చింది..

“ఆమె, ఈ రోజు వరకు నయాపైస తీసుకోలేదు. పాప అల్లుడి ఇచ్చిన డబ్బులు కూడా నా దగ్గరే ఉంచేసింది. అడిగితే అన్ని మీరే ఇస్తున్నారు. నాకెందుకు డబ్బులు అంటుంది. ఆమె మనసులో ఏముందో అడగండి..” అంది..

“సరే.. రేపు ఆదివారం.. ఇంటి దగ్గరే ఉంటాను కదా.. అడుగుదాం..” అని..  బయలు దేరాను..

ఆ రోజు.. క్యాంటీన్లో విశ్వనాథం.. మధుమిత నా దగ్గరకు వచ్చారు..

“మాస్టారు.. ఎవరో.. ఒకామె… ఆరు నెలలుగా మీ ఇంట్లోనే ఉంటుందట.. ఏమిటో.. ఎందుకో..” అంది.. వ్యంగ్యంగా మధుమిత..

స్త్రీలు ద్రవపదార్థంలా ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించడం వింతేమీ కాదు.. మధుమిత.. అటువంటిదే.. ఆమె కథలు నాకు తెలియనిది కాదు.. “రేపు ఆదివారం మీ ఇద్దరూ మా ఇంటికి రండి మా ఆవిడ కూడా ఉంటుంది ఆమె చెబుతుంది. ఏమిటో.. ఎందుకో..” అన్నాను ఆమె అన్న ధోరణితోనె మధుమిత విసవిసా వెళ్ళిపోయింది.. నేను విశ్వనాథంతో.. టీ తాగుతూ..

“మధుమిత ఎటువంటిదో నీకు తెలుసు. పిల్లాడి హాస్టల్లో పడేసి.. ఇక్కడెవరో కలెక్టరేట్లో పని చేస్తున్నవాడితో తిరుగుతున్నదని అందరికీ తెలుసు.. నువ్వు కూడా ఆమెతో కలిసి.. తిరిగితే.. ఎలా.. నీకో విషయం చెప్పనా.. మన స్త్రీల మీద మనకి ఎంతో చిన్నచూపు.. మధుమిత గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కూడా తప్పే.. రేపు ఆదివారం ఆమెను తీసుకువచ్చే బాధ్యత నీదే సుమ.. తనకి చెబుతాను మీరిద్దరూ వస్తారని” అన్నాను.. ఇద్దరం లేచాం.. నాలుగడుగులు వేశాక.. ‘బహుశా ఆమె రాక పోవచ్చు..’ అన్నాడు. విశ్వనాథం సాలోచనగా నా వైపు చూస్తూ..

‘ అవునా.. సరే..’ అన్నాను.. ముక్తసరిగా

***

          ఆ రాత్రి పదిగంటల సమయంలో…

“ఈ మధ్య అన్ని పనులు.. అంటే బజారు పనులు కూడా రాజేశ్వరం మీదనే పడేస్తున్నావు. ఒళ్ళు పెరిగి.. వందకేజీలు అయిపోగలవు చూడు..” అన్నాను నా భార్యతో సరదాగా..

“ఆ ఇబ్బంది లేదులెండి.. అమ్మా.. నేను వచ్చి దాదాపు ఆరేడు నెలలు కావస్తు న్నది.. ఇంకెన్నాళ్ళు మీ ఇంట్లో.. అయినా.. నాకు మీరు దేవుళ్ళు.. మిమ్మల్ని వదులు కోను.. వదలను.. కానీ.. ఇలా.. మీ ఇంట్లో ఉండటం వలన.. పదిమంది.. పది రకాలుగా.. ముఖ్యంగా బాబు గారి గురించి.. నాకు ఏడుపు వస్తున్నదని ఏడ్చింది ఏం చెప్పమం టారు.” అంది నెమ్మదిగా.

“అవును.. మా కాలేజీలో విశ్వనాథం, మధుమిత అని ఓ లెక్చరర్ క్యాంటీన్లో ఇదే ప్రశ్న వేశారు..” అన్నాను.

“ ఏంటి విశ్వనాథం అన్నయ్య అలాగన్నాడా..” అంది ఆశ్చర్యంగా..

“అతడనలేదు.. ధైర్యం కోసం.. అతనిని మధుమిత వెంట తెచ్చుకుంది.. ఆమె అన్నది.. అతడు విని ఊ..రు..కు..న్నా..డు”

ఆమె ఏదో అడగబోయింది.. ‘వదిలేయ్.. ఎవరిని తప్పు పట్టవద్దు.. ఆమె కూడా అడుగుతున్నది కదా.. చూద్దాం.. కాలం చాలా వాటికి సమాధానాలు ఇస్తుంది.. రిలాక్స్.. లైటార్పి పడుకో అన్నాను.. కాలం నాకో చక్కని పరిష్కారం రేపటి ఆదివారం నాడు సూచిస్తుందని నేనూహించలేదు..

***

          ఆదివారం ఉదయం పదిగంటల సమయం..

ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బహుశా వాన రావచ్చు.. వేసవిలో వర్షం.. నేను కిటికీ తలుపులన్నీ తీసేసాను.. కమ్మని మట్టి వాసనతో కూడిన పరిమళం.. బాగుంది..

విశ్వనాథం.. నేను.. నా భార్య సోఫాలలో కూర్చున్నాం..

“అన్నయ్య.. మీ స్నేహితుడు గురించి నీకు తెలియదా.. చెప్పండి” అంది..

“తెలుసమ్మా.. కానీ.. నీ గురించి కూడా బయట అనుకుంటున్నారు. మన సంగతి మనకు తెలుసు. ఆమె సంగతి కూడా..” అని ఆగిపోయాడు.

రాజేశ్వరి మా ముగ్గురికి కాఫీలు తెచ్చింది.. ఇంతలో “అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదు.” ఇది కూడా నా భావన కాదు.. రాజేశ్వరిని ఆగమన్నాను. ఎదురు సోఫాలో కూర్చోమన్నాను. ఆమె నిలబడే ఉంది. కాస్త దూరంలో ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు.. బయట మబ్బులు పెరుగుతున్నాయి.. దూరంగా మెరుపులు కూడా.. దట్టమైన నల్లని మబ్బులు.. నగరం పైన, మబ్బులు.. వర్షిస్తాయా..? ఏమో..

ఆమె నిలబడే ఉంది.. మా ఆవిడ అనునయంగా..

“రాజేశ్వరి.. నీవు మా ఇంట్లో మనిషివే.. ఏనాడు నిన్ను పనిమనిషిలా చూడలేదు. పర్వాలేదు కూర్చో..” నా భార్య మాటలు

ఆమె నిలబడే ఉంది’

“ సరే.. నీ గురించి చెప్పగలవా.. ఇబ్బంది లేకుంటే.. సుమా” నా భార్య మరో ప్రశ్న

“ఏముందమ్మ చెప్పడానికి.. మాది కాకినాడ దగ్గర సర్పవరం. మా నాన్న వ్యవసాయ దారుడు. అక్కడ ఐదు ఎకరాల పొలం ఉంది. మేము ఇద్దరం ఆడపిల్లలమే. నేను పదవ తరగతి తప్పాను. నాకు చదువు మీద కంటే వ్యవసాయమంటేనే ఇష్టం. కానీ.. అక్క బాగా చదువుకుంది. ఎక్కడో టీచరుగా ఉందని విన్నాను. కాకినాడ చదువుకుంటున్నప్పుడే మంచి డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంది..” ఆమె మాటల్లో ఇది అని చెప్పలేని బాధ ఉన్నా పిసరంత ‘హేళన’ కూడా ఉంది.

ఇంతలో ఉయ్యాల కదిలింది.. బాబు లేస్తాడేమోనని ఊపి వచ్చింది.. నిశ్శబ్దం.. బయట జోరుగా వాన పడుతున్న శబ్దం.. ఇంకా మబ్బులు వీడలేదు. ఆమె తిరిగి “నాకు మా అయ్య లక్షలు ఖర్చుపోసి ఓ ఆఫీసరని చెప్పుకునే దొంగను తెచ్చి నాకు పెళ్ళి చేశారు. వాడు నాకో బిడ్డనిచ్చి.. ఎక్కడికో పోయాడు. అప్పులుకు ఆస్తి కరిగిపోయింది. నాన్న ప్రాణం పోయింది..’ ఆమె కళ్ళలో నీరు.. తుడుచుకుంది.. “నేను అనాధగా మిగిలాను. ఎన్నెన్నో పనులు చేశాను. బాబు కోసం వాడిని అనాధను చేయదలుచుకో లేదు. నేను ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాను.. ఒళ్ళమ్ముకొని మాత్రం కాదు.. “ఆమె మాట్లాడలేక, క్రింద కూర్చుండిపోయింది.. గబగబా నా భార్య వెళ్ళి భుజం పైన చేయి వేసి..” వద్దులే మరి చెప్పకు..” అని ఓదార్చింది. “లేదమ్మా.. మీ ఇంట్లో నాకు లభించిన ధైర్యం, ఆదరణ.. నేనేనాడు.. నా ఇంట్లో కూడా చూడలేదు..” అని చెబుతుండగా చక్రవర్తి వచ్చాడు. ఈ మధ్యనే అతనికున్న ఒక్క తల్లి చనిపోయింది. నేను విశ్వనాథం సహాయం చేసాం.. ఆటో మీద వచ్చే డబ్బుతో నెలవారి  వద్దన్నా సరే.. వద్దన్నా సరే..

చక్రవర్తి రాగానే రాజేశ్వరిలో మార్పు.. చక్రవర్తి మెల్లగా..

“ అయ్యా మీ దగ్గర ఏమీ దాచకూడదు.. నేను.. రాజేశ్వరి..” అని ఆగాడు.

మా అందరికీ అర్థమైంది.. రాజేశ్వరి బయటకు వెళ్ళినప్పుడు.. ఆమె, చక్రవర్తి..

ఇక నేను.. నా భార్య ‘ఆమె’ కోసం ఇబ్బంది పడనవసరం లేదు.. చక్రవర్తి.. రాజేశ్వరి..  మా దగ్గరే ఉంటారు.. వారింట్లో వారు ఉంటారు. బయట వర్షం ఆగింది.. మబ్బుల్లో ఏముందో.. తెలిసింది.

నా దినచర్యలో మార్పు లేదు..

చక్రవర్తి, రాజేశ్వరిల వయసులో తేడా ఉంది కానీ, వారి జీవితాల్లో లేదు.. కనుకనే కొత్త జీవితం ప్రారంభించారు..

చీకట్లో ఉన్నామని దిగులు పడుతూ కూర్చుంటే జీవితం చివరి వరకు అగ్గిపెట్టి గూట్లోనే ఉండిపోతుంది.. ఆఫ్ కోర్స్ ఇది కూడా నాది కాదండోయ్..

ఒకరోజు విశ్వనాథం.. క్యాంటీన్లో టీ తాగుతున్న నా దగ్గరకు వచ్చి.. “నీకు తన అక్క ఎవరో రాజేశ్వరి చెప్పిందా” అని మెల్లగా అడిగాడు..

“లేదు.. ఎవరుట…” అన్నాను…

దూరంగా.. మధుమిత.. రావటం చూసి విశ్వనాథం ఆ..గి..పో..యాడు..

*****

🙏🙏🙏🙏🙏🙏
 నీకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నీది కానిది ఏదైతే ఉందో దానిని వదులుకోవాలి!_*

*_నీకు రాని దానికోసం, నీది కానీ దానికోసం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పొందలేవు!_*

*_వాటి కోసం ప్రయత్నం చేసే కన్నా దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నం చెయ్యి.._*

*_నీకు దక్కవలసినది అయినా సరే దక్కాలంటే దైవ సంకల్పం ఉండాలి!_*

*_నీ పరిస్థితులకు అనుగుణంగా నీకు అనుకూల ఫలితాలు రావాలంటే నువ్వు  దేవుణ్ణి నమ్మి తీరాలి.._*

*_మందు బిళ్ళలు, నొప్పి తెలియకుండా సమర్థవంతంగా పని చేసినట్లు, నమ్మకం అనేది నీకు తెలియకుండానే నీ పరిస్థితులను చక్కదిద్దుతుంది._* 

*_దేవునిపై నమ్మకం పెట్టడానికి నువ్వేమి నీ సొమ్ము ఖర్చు చేయవలసిన పని లేదు కదా!! విశ్వాసం కలిగి ఉండు.."_*

*_భగవన్నామము చాలా విశిష్టత గలది._*

*_ఆర్తితో తలచిన వెంటనే ఆదుకోగల  మహిమ గలది._*

*_ఎంతటి కర్మ ఫలమునైనా సరే కాల్చివేయగల శక్తి గలది._*

*_ఇలలో సంసార బంధాల సాగరం నుండి ఒడ్డుకు చేర్చగల నావ వంటిది._*

*_స్మరించినవాడు ఎంతటి పాపి అయినా సరే పావనం చేయగల మహత్యం గలది._* 

*_కుల, మత లింగ బేధాలు, కాల నియమాలు, వయసు తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరూ ఎప్పుడైనా ఎక్కడైనా సరే స్మరించుకోగల అతి అనువైన, సులువైన సాధనా మార్గం._*

*_ఇట్టి మార్గాన్ని మనం విస్మరించకూడదు. చేద్దాం! ప్రతి దినమూ క్రమము తప్పక నామ స్మరణ చేద్దాం. ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయక భగవంతుణ్ణి స్మరించుకుందాం. నామిని చేరుకోవాలంటే నామ స్మరణ కంటే సులువైన మార్గం మరొకటి లేదు._*


*_సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏_*🧘🇮🇳🌎🧘🧘🧘🧘🧘🧘🇮🇳🌎🧘🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘🧘🧘🇮🇳🌎🧘🇮🇳🌎🧘🧘🧘🧘🪷💐
 రాజ్యం చేపట్టే విషయంలో శ్రీరామ భీష్ముల అభిప్రాయాలు :—
పెద్దవాడు యోగ్యడైనపుడు అతడే రాజ్యాధికారం చేపట్టడం పరంపరాగత ధర్మం.

శంతనుడు గానీ, దశరథుడు గానీ , ఈ ధర్మం తప్పడం అనుచితమని నమ్మినవారే.

రాముడికి యౌవరాజ్య పట్టాభిషేకం జరగబోయే క్షణంలో కైక కారణంగా అవరోధం కలిగింది.

దశరథుడు కైకకు మాట ఇచ్చాడు. కొడుకుగా అది నెరవేర్చి తండ్రికి బ్రహ్మలోక ప్రాప్తి కలిగించడం పుత్రధర్మంగా భావించాడు శ్రీ రాముడు .. కైక అడిగినది రెండు అంశాలు. ఒకటి రామవనగమనం. రెండు భరతపట్టాభిషేకం.

భరతుడు ఇది ఏమాత్రం ఇష్టపడలేదు. పెద్దవాడు రాజు కావడం అనే పూర్వాచారం అతడు ఉల్లంఘించదలచలేదు.

రాముడికి అనూచానధర్మపాలనే లక్ష్యం. అంతేగానీ రాజ్యకాంక్ష లేదు.. రావణవధానంతరం గూడా భరతుడికి ఒకవేళ ఆసక్తి ఉంటే ఆతడే రాజ్యం ఏలనీ అని అనుకొన్నాడు.

అరణ్యవాస ఆరంభంలో తండ్రి కామవశుడై ధర్మం తప్పాడే అని లక్ష్మణుడితో అంటాడు. కామపాశబద్ధుడైనాడు..పరంపరగా వచ్చే సంప్రదాయం పాటించలేకపోయాడే అని చింతించడం అది.

ముందు ఇచ్చిన వరాలు తీర్చడం ఇపుడు ఆయనకు బాధ్యతగా నిలబడింది.. చేయక తప్పలేదు— అని బాధపడ్డాడు.

శంతనుడు సత్యవతి వలపులోపడలేదు. బహుపుత్రత వంశం నిలవడానికి అవసరం అని తలచాడు. దాశరాజు షరతులకు లొంగినవాడు కాలేదు .

భీష్ముడే తండ్రి ధార్మికవాంఛకు తాను అడ్డు కాకూడదని తానుగానే తండ్రి ప్రమేయం లేకుండా దాశరాజుకు మాట ఇచ్చాడు. చిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టారు. ఆ విధంగా పరోక్షంగా తండ్రికి సంతోషం కలిగించాడు. తల్లికీ ( సత్యవతికి) ఆనందం కలిగించాడు . సత్యవతి పుత్రులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. భీష్ముడే వివాహాలూ చేసి, రాజ్యరక్షణ చేస్తున్నాడు .

ఇంతకాలం కేవలం రక్షణబాధ్యతే స్వీకరించి ఇపుడు రాజ్యం ఏలుతాననడం సమంజసం అనిపించలేదు ఆయనకు.

శాశ్వత బ్రహ్మచర్యంలో ఉంటానని మాట ఇచ్చాడు.

సత్యవతి విచిత్రవీర్య మరణానంతరం ఆయనను వివాహమాడి రాజ్యం చేపట్టమనింది.

ఇపుడు వివాహం చేసుకోవడం తండ్రికోసం చేసిన ఒక మాటను తానన్న మాటను తానే తప్పడం.

రాజ్యం ఎక్కడా పోదు . తన భుజస్కంధాల మీద మోస్తునే ఉన్నాడు. చిత్రాంగద విచిత్రవీర్యులున్నపుడూ తానే రక్షణ చేస్తున్నాడు అనధికారికంగా.

సత్యవతికి ఇంతకాలం తన వంశం అధికారంలో ఉంటున్నది గాబట్టి అదే కొనసాగడం ఆమె ఇంగితం. దాశరాజు కోరికా అదే. తన కూతురివంశం పాలనలో పరంపరగా సాగాలి అని. అవన్నీ మనసులో పెట్టుకొని అన్నీ తీరే మరో మార్గం సూచించాడు.

ఫలితంగా—

పాండురాజు రాజై రాజ్యం విస్తరించాడు.. ఆయన సంతు (తన మనవలు) మరింత విస్తరించారు. ఏదీ ఆగలేదు. భీష్ముడికి సంతృప్తే కలిగింది.

తనవాళ్ళు ఎవరూ చేయలేని రాజసూయం చేశారు. వంశానికి కీర్తి తెచ్చారు.

తాను ప్రతినపట్టిన తర్వాత రెండు తరాలు నడిచి, ఆ తర్వాత యుద్ధం వచ్చింది.

ఈ పరిణామం కాలగతిలో జరిగింది. దీనికి ఎపుడో ఒక మంచి కోరి చేసిన చర్యలు కారణం అనుకోగూడదు.

వ్యక్తి తాను అనుకొన్న ధార్మిక నియమాలు పాటించి కడతేరుతాడు . తనకది దారి అనుకొని అందులో నడుస్తాడు. అది లోకసహజం. జీవుడి ధర్మం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం.

తనకు విస్తారంగా పుణ్యలోకాలున్నాయి. వివాహం లేమి తనకు పుణ్యలోకాలకు అవరోధం కాదు( సభా పర్వం ఆ 1)— అని కచ్చితంగా ఎరిగి , కర్మశేషానుభవం అయి తన వసులోకానికి సంతోషంగా వెళ్లిపోయాడాయన .

రాముడి విషయం—

అరణ్యవాసకాల ఆరంభంలోనే " రాజ్యం స్వీకరించడం నీ ధర్మం— అని వసిష్ఠాది ఋషులు చెప్పారు. భరతుడు వద్దంటూ ఆత్మత్యాగానికి సిద్ధపడుతున్నాడు.

దశరథుణ్ణి ఆనాడు బలవంతపెట్టిన కైకమ్మే తిరిగివచ్చి రాజ్యం గ్రహించు అంటున్నది.

తండ్రికి ఆయన మాట నిలపడం ద్వారా సద్గతి కలిగించాడు.

తాను రాజ్యం స్వీకరించడం ద్వారా తండ్రి అభీష్టమూ తీరినట్లయింది.

రాముడు అందరికీ శాశ్వతానందం కలిగించినవాడైనాడు.

చక్రం పట్టి భీష్ముణ్ణి వధించబోవడం ధర్మమా? అని పలువురికి సందేహం.

రథి, సారథి చేరి ఒకే విభాగం. రెండు కాదు. పరస్పరం రక్షించుకోవడం యుద్ధధర్మం. ..చక్రం పట్టడం కృష్ణుడు మాటతప్పడం కాదు. కృష్ణుడు తానొక రథం ఎక్కి ఆయుధం పట్టడమే ఆయన మాఅన్న మాట తప్పడం ఔతుంది.

ఒకే రథంలో ఉన్నపుడు సారథి ప్రాణాలు కాపాడడం రథికుడి కర్తవ్యం . అలాగే సారథి రథికుణ్ణీ.
అరణ్య పర్వం( 1 ఆ.)లో వచ్చే ఒక సంఘటన.

సాల్వుడితో యుద్ధంలో ప్రద్యుమ్నుడు స్పృహకోల్పోయాడు..అపుడు సారథి యుద్ధభూమి నుంచి దూరంగా రథం తోలుకొని పోయాడు. నగరంలో బలరామకృష్ణులు లేనపుడు ఈ దాడి జరిగింది.

ప్రద్యుమ్నుడు తనకు వీరలోకంలో అవమానం జరిగిందనీ ఇలా ఎందుకుచేశావు? అనీ సారథినంటాడు. అందుకు సారథి సమాధానం ఇది.

కృష్ణుడు చేసినది యుద్ధధర్మోల్లంఘన ఐతే అపుడే కౌరవపక్షం పెద్ద రచ్చ చేసేది. ఎన్నో ప్రశ్నలు వేసిన ధృతరాష్ట్రుడూ ఈ విషయం ప్రస్తావించలేదు.
 #పల్లె_పిలుస్తోంది

నేను ఈ సంక్రాంతికి మా ఊరికి ఇద్దరిని పరిచయం చేసాను. మా వాడి స్నేహితుడు కార్తికేయ, వాళ్ళ అమ్మ..

మా అపార్ట్మెంట్లో వీళ్ళ పరిచయం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మొదటిసారి ఇలాంటి వారు కూడా ఉంటారు అని తెలుసుకున్నాను. వాడికి కానీ, కనీసం వాళ్ళ అమ్మకి కానీ పల్లెటూరు అంటే తెలియదు. ఒక్కసారి కూడా ఊరు వెళ్ళలేదు, చూడలేదు.  

కార్తికేయకి అపార్ట్మెంట్ నాలుగు గోడలే ప్రపంచం. అమ్మమ్మ, నాన్నమ్మ, బంధువులు మొత్తం మహా నగరాల్లో, విదేశాల్లో స్థిరపడినవాళ్ళు..సెలవుల్లో అందరు పిల్లలు ఊరు వెళ్తుంటే వాడు మాత్రం హైదరాబాదులో ఉన్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేవాడు..పుట్టాక వాడికి తెలిసిన ఇళ్ళు (ఫ్లాట్స్) ఈ రెండే.. 

ఒకసారి ఊరు అంటే ఏంటి అని అడిగాడు. మేము ఊరు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి మా చిన్న ఇల్లు, పక్కన కోళ్ళు, పశువులు చూపిస్తే వాడు అడిగిన ప్రశ్న మీరు ఫార్మ్ హౌస్ లో ఉంటున్నారా అని..నవ్వాలో, బాధపడాలో అర్థం కాలేదు నాకు...అప్పటి నుండి వాడికి మా ఊరు చూపించాలనే ఆశ..

ఊరు వెళ్దాం వస్తావా అంటే చక్కగా మాతో వాళ్ళ అమ్మ, నాన్న లేకుండా వచ్చేసాడు..మా ఇంటికి చేరగానే వాడు అడిగిన మొదటి ప్రశ్న..మీ బాత్ రూమ్స్ ఏంటి ఇలా విడివిడిగా ఉన్నాయి..ఇంటి బయట ఉన్నాయి అని..అలాగే కోళ్ళు ఎక్కడ ఉన్నాయి అని..తర్వాత రోజు చాలా పొద్దున్నే లేచి నన్ను కోడి కొక్కొరొకో అని లేపిందమ్మా అంటూ వాళ్ళ అమ్మకి చెప్పాడు..    

మొదటి మూడు రోజులు అందరితో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డాడు..నాలుగో రోజు తెలుగులో మాట్లాడితే..వీడికి మూడు రోజుల్లో తెలుగు మాట్లాడటం వచ్చేసింది అనుకున్నారు.

మా ఇంటి చుట్టుపక్కల అన్ని ఇళ్ళకీ వెళ్ళాడు..అందరి ఇళ్ళ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండటం...ఇళ్ళళ్ళోకి అలా అనుమతి లేకుండా వెళ్ళడం...అందరూ వీడిని స్పెషల్ గా చూడటం వాడికి బాగా నచ్చింది. రెక్కలు వచ్చిన పక్షిలా తిరిగాడు.  

వాడు మొదటిసారి 
- ఊరు చూసాడు..
- చెరువుని చూసాడు..
- కాకులని, కోళ్ళని, పిచ్చుకలని,పశువులని చూసాడు..
- పాలు పితకడం చూసాడు..
- ఎడ్లబండిని చూసాడు..
- కట్టెల పొయ్యిని చూసి ఇదేంటి అని అడిగాడు..
- జామచెట్టుని, దానిపై కూర్చుని జామపండు తింటున్న చిలకమ్మని చూసి మురిసిపోయాడు.. 
- కొబ్బరి, తాటి,మర్రి,రావి అన్ని రకాల చెట్లని, మొక్కలని చూసాడు..
- పెద్ద చెట్లపై ఉండి ఉదయం, సాయంత్రం విపరీతంగా గోల చేసే వందల పక్షులని చూసాడు..   
- అప్పుడే పుట్టిన కోడిపిల్లలని తడిమి చూసాడు..
- గేదెలతో, దూడలతో, కోడిపిల్లలతో ప్రతిరోజూ ఆడుకున్నాడు..
- విశాలమైన పూరిళ్ళని, పెంకుటిళ్ళని చూసాడు
- వరి పొలం, అరటి తోటలని చూసాడు..
- భోగి రోజు భోగి మంటలలో కాగిన వేడినీళ్ళతో స్నానం చేసాడు..
- కట్టెల పొయ్యి మీద చేసిన పరమాన్నం తిన్నాడు.. 
- కమ్మటి నెయ్యి, గడ్డ పెరుగు తిన్నాడు..
- కూరగాయలు, పూలు, పండ్లు కోసాడు.. 
- సంక్రాంతికి మాత్రమే వేసే పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు చూసాడు..
- హరిదాసుని, గంగిరెద్దుని, కోడిపందేలని చూసాదు..
- తొంబై యేళ్ళు దాటి, ఆరోగ్యంగా ఉన్న ముసలి వారిని చూసాడు.. 
- పూరి గుడిసెలో పెరుగుతున్న ఇద్దరి పిల్లలతో ఆడుకుని..వాళ్ళకి  వాడి బొమ్మలు,స్వెట్టర్  ఇచ్చేసాడు..
- మొదటిసారి బస్సు ఎక్కాడు.. 

ఇంకా ప్రతిచోట ఆ చిన్ని బుర్రలో ఎన్ని ప్రశ్నలో...వెళ్ళిన ప్రతి ఇంట్లో కొత్త అని లేకుండా ఎన్నో ప్రశ్నలు..ఊరి నిండా వాడికి ఎన్ని వింతలు కనిపించాయో...

వెళ్ళే ముందు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి రావాలని, అందరికీ మళ్ళీ వేసవి సెలవులకి వస్తా అని చెప్పి వచ్చాడు. సిటీ కంటే ఊరు బాగుందని చెప్పాడు. వాడు వెళ్ళిన తర్వాత కూడా అందరూ వాడిని గుర్తు చేసుకున్నారు. అంతలా అందరితో కలిసిపోయాడు. వాడి ఫోటొస్, వీడియోస్ చూసి అమెరికాలో ఉన్న వాళ్ళ అత్త కొడుకు, వాళ్ళ అమ్మని అడిగాడంట...అమ్మా నన్ను ఆ ఊరు తీసుకెళ్ళు అని... 

ఇలాంటి తరం కూడా పెరుగుతోంది..ప్రకృతికి దూరంగా, పల్లెలకి దూరంగా, భాషకి దూరంగా, సంప్రదాయాలకి దూరంగా అంటే భయం వేస్తోంది. ఉద్యోగాల పేరిట,అభివృద్ధి పేరిట, గొప్ప చదువుల పేరిట చిన్ననాటి నుండే ఇలాంటి జీవనశైలిని పిల్లలకి అలవాటు చేస్తున్న మనం, వాళ్ళు ఎంత విలువైన బాల్యం కోల్పోతున్నారో కూడా ఆలోచించుకోవాలి. కనీసం బాధ్యతలు తీరిపోయిన అమ్మమ్మ, నానమ్మలు, సిటీ అవసరం లేని ప్రతి ఒక్కరు, విదేశాల అవసరం తీరిపోయిన వాళ్ళు, తమ సొంత ఊర్లకి తిరిగి వెళ్ళే ఆలోచన చేయాలి.  అప్పుడే సెలవు రోజుల్లో అయినా పిల్లలకి ఊరు వెళ్ళే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఊరు అంటే తెలుస్తుంది. గ్రామీణ వాతావరణం అలవాటు అవుతుంది. అన్ని రకాల మనుషులని, అన్ని రకాల పనులని చూస్తారు. లోకం తెలుసుకుంటారు.  గేటెడ్ అనే మాయా ప్రపంచానికి దూరంగా అప్పుడప్పుడు స్వచ్ఛమైన ప్రపంచంలో కొన్ని రోజులైనా గడిపే వీలు ఉంటుంది.  మన ఊరు, మన వాళ్ళు, మన చెరువు, మన ఆవు, మన చేను..అనే బంధాలు ఏర్పడతాయి. చెట్టు, పుట్ట, మట్టితో అనుబంధం ఏర్పడుతుంది. ప్రకృతి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. ఊర్లు కూడా సుభిక్షంగా ఉంటాయి. ఏమో పెద్దయ్యాక వాళ్ళే ఊరి మీద మమకారంతో ఊరి కోసం ఏమైనా చేస్తారేమో..మరో కొసరాజుగా అవుతారేమో, ఒక గొప్ప రైతుగా మారి స్వచ్చమైన ఆహారం అందిస్తారేమో, మరో శ్రీధర్ వేంబు అవుతారేమో..ఎవరు చెప్పగలరు? 

పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఇంటెర్నేషనల్ బళ్ళో ఖరీదైన చదువులు, అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి కొనే కోట్ల విలువైన ఖరీదైన మూడు గదుల ఫ్లాట్, బెంజ్ కార్, మినరల్ వాటర్, కలుషితమైన  గాలి, కల్తీ ఆహారం, చిన్నప్పటి నుండే కళ్ళజోళ్ళు, విటమిన్ లోపాలు,  జీవితాంతం మందులపై ఆధారపడి జీవించే ఆరోగ్యం, కష్టం తెలియని జీవితమేనా ?

కాదు..అంతకి మించి విలువైన ఆస్తి మన పల్లెటూరు అనే అద్భుత ప్రపంచంలోనే ఉంది. ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేని ఆస్తి.. పాడిపంట, ప్రకృతితో మమేకమైన జీవితం..
వెలకట్టలేని గాలి, నీరు, ఆహారం..
ఏ బంధం లేకున్నా ఎప్పటికీ మన వారే అనిపించే ఆత్మ బంధువులు..
ఎండావానలో రోజంతా శ్రమించి స్ఫూర్తినిచ్చే కష్టజీవులు..
ఉన్నంతలోనే తృప్తిగా బతకడం..
కొత్తవారిని కూడా మనవారిలా ఆదరించడం..
ప్రతి రోజూ జీవితం నేర్పే ఎన్నో పాఠాలు...
ఎంత పెరిగినా మర్చిపోలేని సంప్రదాయాలు, జ్ఞాపకాలు....
కేవలం మన కోసం కాకుండా నలుగురి కోసం జీవించే గొప్ప జీవన విధానం..
బతకడం మాత్రమే కాకుండా ప్రతిరోజూ కొత్తదనంతో జీవించడం..
ఇచ్చిపుచ్చుకోవడం, కలిమిలేముల్లో సాయపడటం..
పొదుపుగా వాడటం, ప్రకృతికి హాని చేయకుండా బతకడం నేర్పించే గొప్ప నాగరిక ప్రపంచం..

పిల్లల భవిష్యత్తుని కనీసం సూర్యుడు,చంద్రుడు, నక్షత్రాలు కనపడకుండా కేవలం నాలుగు గోడలకే పరిమితం చేసి, ఎంతో అందమైన బాహ్య ప్రపంచానికి దూరంగా, కలలు, కళలు, బంధాలకి దూరంగా, ఫారం కోడిపిల్లల్లా, మరబొమ్మల్లా పెంచే హక్కు మనకి ఉందా ?

*ప్రకృతికి దూరమైన నాటి నుండే మనిషి రోగాలకి దగ్గర కావడం మొదలయింది.  పల్లె మనకి ఎంతో మంచి ఆరోగ్యం, మధురమైన అనుభూతులు, విలువైన జీవితం  ఇచ్చింది. నిర్జీవమైపోతున్న పల్లెల ఋణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది*.

AdminPost
 *_ఆయన కలం.._*
*_వాగ్దేవి ఘంటం!_*

******""""******""""******

    _వేటూరి జయంతి_  _సందర్భంగా ప్రణామాలు_

______________________

వేటూరి రాసినట్టే..
ఆయన పాట *_తెలుగుపదానికి_*
*_జన్మదినం.._*
*_జానపదానికి జ్ఞానపథం.._*
అక్షరాల ప్రవాహం..
భావాల సందోహం..
ఆ మహాకవి దూరమైనా
మన హృదయ తంత్రులను
మీటుతూనే ఉంటుంది అహరహం..!

సుందరరామమూర్తి
కలం పడితే
కోకిలమ్మ 
సంబరపడిపోతుంది
*_తన పెళ్ళికి_* 
*_కోనంతా సందడని.._*
తానే *_చిగురాకుల తోరణాలు_*
*_కట్టి చిరుగాలి సన్నాయి_* వింటూ మురిసిపోతుంది..!

ఆయనే అన్నట్టు..
*_ఎరక్కపోయి వచ్చాను_* *_ఇరుక్కుపోయాను.._*
అంటూ మొదలైంది 
ఆయన సినీ  ప్రయాణం
ఆనాటి నుంచి ఆయన
కలమే అయింది 
*పాటకు ప్రమాణం..!*

వేటూరి పాట 
*ప్రేమకు పట్టాభిషేకం..*
*భక్తికి పుష్పాభిషేకం..*
*రౌద్రానికి రుధిరాభిషేకం..*

_*శంకరాభరణం*_ తో అఖిలాంధ్రను
అలరించినా..
_*అన్నమయ్య*_ తో అఖిలాండకోటి
బ్రహ్మాండ నాయకునే మెప్పించినా..
*_దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి_*
*_లోకంలో_* దుండగులను ఎదిరించినా..
*_వేణువై వచ్చి భువనానికి_*
*_గాలి అయి వెళ్ళినా గగనానికి_*
వేటూరి కలం కలకలం..
జీవించి ఉండు కలకాలం..
అందులో సిరా..
వేలపాటలను
రాసేసింది బిరాబిరా..!

ఆ కలం..
మహా పండితుల 
చేతి ఘంటం..
అద్భుత గీతాలు 
ఆయన చేతివాటం..
నవరసాలు ఆయన పాటకు
రుచులు గూర్చే గసగసాలు..
పదాలు ఇట్టే జాలువారే పాదరసాలు..
కొన్ని గీతాలైతే 
వానకురిసే వేళలో 
నోటికి వేడిగా 
అందే సమోసాలు..!

*_వలపు కోయిలలు_* 
*_పాడే వసంతం_* 
వేటూరి 
పాటకు సొంతం..
*_ఎడారిలో కోయిల_* 
*_తెల్లారని రేయిలా_*
ఆయన ఇంటిముందే 
కాపు వేస్తుందేమో 
ఆ కలం నుంచి 
జారే పాటను తానే ముందు ఆలపిద్దామని..
_జగతికి జానకి కంటే_ 
_ముందుగా వినిపిద్దామని.._
_బాలుతో గొంతు కలిపి ఆలపిద్దామని..!_

సుందర రామ్మూర్తి 
ఆగమనం వెండితెరపై
తెలుగు పాటకు పండగ..
ఆయన కలం కోపగిస్తే
అది పాము పడగ..
ఆయన పాటల్లో తెలుగుతనం
తన సొగసులను
*_ఆరేసుకోబోయి_* 
*_పారేసుకుంది హరి హరి.._*
ఆ పదాలను 
ఎత్తుకుపోయిన 
_*కొండగాలి ఉడుకెత్తిపోయిందేమో*_
పాటల ఖుషీతో..
తన *స్వయంకృషి* తో
ఈ కలం మనిషి 
పాటల రుషి అయ్యాడు..
ఆయన పాటల్లో 
*_గగనవీణ_*
*_స్వరజతులనాడగా.._*
అన్నమయ్య రీతులు
రామదాసు కృతులు..
అందంగా అమరి
అభిమానులకు 
వీనులవిందుని..
తెలుగు సినిమాకి
అయిదువేల పాటల పసందుని 
అందించి ఆయనను 
అమరుడిని చేశాయి..
సుందరరామ్మూర్తి కలం 
ఎదురులేని బాణం
*_తిరుగులేని దీక్షకు_* 
*_అతడే ప్రాణం..!_* 
మనసు పాటకు 
*_ఆత్రేయ పెట్టింది పేరు.._*
సొగసు పాటకు 
*_వేటూరి అక్షరాలే_* 
*_కాసుల పేరు!_*

************************

తెలుగు పాటకు
కోనంతా సందడి
చిగురాకుల తోరణాలు కట్టి
చిరుగాలి సన్నాయి
వినిపించిన 
వేటూరి సుందర రామ్మూర్తి
జయంతి సందర్భంగా 
ప్రణామాలు అర్పిస్తూ..
 
🙏🙏🙏🙏🙏🙏🙏

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
        9948546286
        7995666286
 నువ్వు "స్పెషల్" కాదు... కేవలం ఒక "శాంపిల్" మాత్రమే! (నిజం చేదుగా ఉంటుంది, మింగాల్సిందే) - నల్లమోతు శ్రీధర్

వినరా మనిషి,

నీ గురించి నీకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది కదా?

 "నేను ఏదో ఒక రోజు ప్రపంచాన్ని మార్చేస్తాను, నాలో అద్భుతమైన టాలెంట్ ఉంది, నా టైమ్ ఇంకా రాలేదు" అని రోజూ నీకు నువ్వు కథలు చెప్పుకుంటూ నిద్రపోతున్నావ్.

నీకు ఒక చేదు నిజం చెప్పనా? నీలాంటోళ్ళు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. స్మశానంలో సమాధుల మీద పేర్లు చదువు... అక్కడ పడుకున్న ప్రతీ ఒక్కడూ బ్రతికున్నప్పుడు "నేను స్పెషల్, రేపు ఏదో పీకుతాను" అని అనుకున్నవాడే. కానీ చివరికి ఏం మిగిలింది? మట్టి, ఒక రాయి తప్ప.

నువ్వు కూడా ఆ లిస్ట్ లో చేరడానికి రెడీగా ఉన్నావ్.

 ఎందుకంటే నీకు ఒక భయంకరమైన రోగం ఉంది. దాని పేరు "రేపు".

మనం మనుషులం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ మనంత అమాయకులు ఎవరూ ఉండరు.
ఎందుకంటే మనం "రేపు" అనే దానిని అతిగా నమ్ముతాం.

"రేపు పొద్దున్నే లేచి ఎక్సర్ సైజ్ చేస్తా."
"వచ్చే సోమవారం నుంచి చదవడం స్టార్ట్ చేస్తా."
"రేపటి నుంచి నా లైఫ్ స్టైల్ మార్చేస్తా."

అసలు ఆ "రేపు" ని ఎప్పుడైనా చూసావా? అది ఎప్పుడూ రాదు. నువ్వు నిద్రలేచే సరికి అది "ఈ రోజు" అయిపోతుంది. మళ్ళీ నువ్వు దాన్ని "రేపు" కి పోస్ట్ పోన్ చేస్తావ్. నీ జీవితం మొత్తం ఇలా వాయిదాల మీద బ్రతికేస్తున్నావ్. బ్యాంకులో అప్పు తీసుకుని వాయిదాలు కట్టకపోతే వాడు వచ్చి సామాన్లు తీసుకెళ్తాడు. మరి జీవితం అనే బ్యాంకులో, సమయం అనే అప్పు తీసుకుని, పని అనే వాయిదా కట్టకపోతే... యముడు వచ్చి ప్రాణం తీసుకెళ్తాడు. అప్పుడు కూర్చుని "ఇంకొక్క రోజు టైమ్ ఇవ్వండి సార్" అని అప్లికేషన్ పెట్టుకుంటావా? అక్కడ ఆప్షన్ ఉండదు.

నీకు పని చేయడం కంటే, ప్లాన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్లాన్ వేస్తున్నప్పుడు ఒక కిక్ వస్తుంది.
ఒక ఖరీదైన డైరీ కొంటావ్. రంగు రంగుల పెన్నులు కొంటావ్.

"ఉదయం 5 గంటలకు లేవాలి, 6 గంటలకు యోగా, 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్..." అని పేజీలు పేజీలు రాస్తావ్.
ఆ రాయడం అయిపోగానే నీకు ఏదో తెలియని తృప్తి వచ్చేస్తుంది. "అబ్బా, నా లైఫ్ సెట్ అయిపోయింది" అని ఫీల్ అయిపోతావ్. ఆ కిక్ లోనే పడుకుంటావ్.

తెల్లారేసరికి ఆ డైరీ ఎక్కడో మూలన పడి ఉంటుంది, నువ్వు దుప్పటి ముసుగులో ఉంటావ్.

ప్లానింగ్ అనేది కేవలం ఒక మత్తు మందు. అది నీకు పని చేసిన ఫీలింగ్ ని ఇస్తుంది కానీ, రిజల్ట్ ని ఇవ్వదు.

వంద పేజీల ప్లానింగ్ కంటే, ఒక గంట యాక్షన్ మిన్న.

ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళెవరూ పర్ఫెక్ట్ ప్లాన్ తో మొదలుపెట్టలేదు. వాళ్ళు కేవలం మొదలుపెట్టారు. దారిలో ప్లాన్ మార్చుకున్నారు. నువ్వు మాత్రం పర్ఫెక్ట్ మ్యాప్ దొరికేదాకా కాలు కదపను అని భీష్మించుకుని కూర్చున్నావ్. ఆ మ్యాప్ దొరికేలోపు నీ ఆయుష్షు అయిపోతుంది.

ఈ రోజుల్లో అందరూ చెప్పే డైలాగ్: "నేను చాలా బిజీ".

ఒక ఈగను చూడు... అది కూడా రోజంతా చాలా బిజీగా ఉంటుంది. ఎక్కడా ఆగదు. అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. కానీ చివరికి అది సాధించింది ఏంటి? ఏమీ లేదు.

నువ్వు కూడా ఆ ఈగలాగే ఉంటున్నావ్.

పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు హడావిడి. ఫోన్ కాల్స్, మీటింగ్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా స్క్రోలింగ్.

రాత్రి పడుకునేటప్పుడు అలుపు వస్తుంది కానీ, "ఈ రోజు నేను సాధించింది ఏంటి?" అని చూసుకుంటే జీరో ఉంటుంది.

బిజీగా ఉన్నానని గొప్పలు చెప్పుకోకు. "నేను ఈ రోజు ఈ పని పూర్తి చేసాను" అని రిజల్ట్ చూపించు.

నీ కష్టం ఎవడికీ అక్కర్లేదు. నీ చెమట వాసన ఎవరికీ ఇష్టం ఉండదు. అందరికీ కావాల్సింది నువ్వు పండించిన పంట మాత్రమే. చాలామందికి ఒక ఏడుపు ఉంటుంది. "నాకు టాలెంట్ ఉంది కానీ అవకాశం ఇవ్వట్లేదు. నా దగ్గర ఐడియా ఉంది కానీ పెట్టుబడి పెట్టట్లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకోవట్లేదు."

నీకు ఒక విషయం క్లియర్ గా చెప్పనా?

ఈ ప్రపంచం నీకు ఏమీ బాకీ లేదు. నువ్వు పుట్టకముందే ఈ ప్రపంచం ఉంది. అది నీ కోసం రాలేదు. నువ్వే ఇందులోకి వచ్చావ్.

నీకు ఆకలి వేస్తే నువ్వే వేటాడాలి. నీకు దాహం వేస్తే నువ్వే బావి తవ్వుకోవాలి. ఎవరో వచ్చి నీ నోట్లో నీళ్లు పోస్తారు అనుకుంటే... అది నీ అవివేకం.

నీ ఫెయిల్యూర్ కి మీ నాన్ననో, మీ టీచర్ నో, మీ బాస్ నో, లేదా ఆ దేవుడినో నిందించడం ఆపేయ్.

నీ జేబు ఖాళీగా ఉందంటే, దానికి కారణం నువ్వే.
నీ శరీరం షేప్ అవుట్ అయ్యిందంటే, దానికి కారణం నువ్వే.
నీ లైఫ్ బోరింగ్ గా ఉందంటే, దానికి కారణం నువ్వే.

అద్దంలో కనిపించే వ్యక్తిని తప్ప, ఇంకెవరినీ నిందించడానికి నీకు హక్కు లేదు.

బాధ్యత తీసుకో. "నా లైఫ్ నా చేతుల్లో ఉంది" అని ఫిక్స్ అవ్వు. అప్పుడే ఏదైనా మారుతుంది.

"నేను రిస్క్ తీసుకోను, సేఫ్ గా ఉంటాను" అని నువ్వు అనుకుంటావ్.

అసలు సేఫ్ అంటే ఏంటి?

ఒక గదిలో కూర్చుని, ఏ పనీ చేయకుండా, ఏ కొత్త ప్రయత్నం చేయకుండా, టీవీ చూస్తూ బ్రతకడం సేఫ్ అనుకుంటున్నావా? అది సేఫ్టీ కాదు, అది స్లో పాయిజన్.

నీ మెదడు తుప్పు పట్టిపోతుంది. నీ కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది.

పడవ రేవులో ఉంటే సేఫ్ గానే ఉంటుంది. కానీ పడవను తయారు చేసింది రేవులో కట్టేయడానికి కాదు, సముద్రంలో అలలతో పోరాడటానికి!

నువ్వు కూడా అంతే. ఇంట్లో కూర్చోవడానికి పుట్టలేదు. బయటకు వెళ్ళు.

దెబ్బలు తగులుతాయేమో అని భయపడకు. గాయాలు లేని సైనికుడు అంటే, వాడు యుద్ధం చేయలేదని అర్థం. ఫెయిల్ అవ్వడాన్ని ఒక అవమానంగా చూడకు. అది ఒక అనుభవం.

అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఓడిపోవడం కంటే, ప్రయత్నించి ఓడిపోవడం వెయ్యి రెట్లు నయం. కనీసం నీకు "నేను ట్రై చేసాను" అనే గట్స్ అయినా ఉంటాయి.
నీకు అందరూ నిన్ను గమనిస్తున్నారని, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నవ్వుతారని ఒక భయం ఉంటుంది కదా?
నిజం చెప్పనా? ఎవరికీ నీ గురించి పట్టించుకునేంత టైమ్ లేదు.

వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ గొడవల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.
నువ్వు రోడ్డు మీద పడిపోయినా, ఒక రెండు నిమిషాలు చూసి, నవ్వి, ఎవరి దారిన వాళ్ళు పోతారు. అంతే తప్ప, నీ గురించి రోజంతా ఆలోచించేంత ఖాళీ ఎవరికీ లేదు.
కాబట్టి, ఆ "జనం ఏమనుకుంటారో" అనే చెత్త భయాన్ని తీసి చెత్తబుట్టలో పడేయ్.

నీకు నచ్చిన బట్టలు వేసుకో. నీకు నచ్చిన పని చెయ్యి. నీకు నచ్చినట్టు బ్రతుకు.

పిచ్చోడు అని పిలిచినా పర్లేదు. పిచ్చోళ్ళే చరిత్ర సృష్టించారు. తెలివైన వాళ్ళు ఆ చరిత్రను చదువుకుంటూ కూర్చున్నారు.

ఇదంతా చదివాక, "అబ్బా, సూపర్ రాసాడురా, రేపటి నుంచి ఫాలో అయిపోదాం" అని అనుకుంటున్నావ్ కదా?

అక్కడే నువ్వు మళ్ళీ పప్పులో కాలేసావ్.

రేపు కాదు... ఇప్పుడు!

ఈ ఆర్టికల్ చదవడం ఆపేసి, ఫోన్ పక్కన పడేసి, నువ్వు ఇన్నాళ్లుగా వాయిదా వేస్తున్న ఆ పనిని ఇప్పుడు మొదలుపెట్టు.

అది జిమ్ కి వెళ్ళడమా? బుక్ చదవడమా? బిజినెస్ ప్లాన్ రాయడమా? లేదా ఎవరికైనా సారీ చెప్పడమా?

ఏదైనా సరే... జస్ట్ డూ ఇట్.

మోటివేషన్ అనేది స్నానం లాంటిది. రోజూ చేయాలి. లేకపోతే కంపు కొడుతుంది.

కానీ డిసిప్లిన్ అనేది ఊపిరి లాంటిది. అది ఆగిపోతే నువ్వు ఆగిపోతావ్.

మోటివేషన్ కోసం వెతకకు, డిసిప్లిన్ ని నమ్ముకో.

నీ లైఫ్ అనే సినిమాకి నువ్వే హీరోవి, నువ్వే డైరెక్టర్ వి, నువ్వే రైటర్ వి.

ఫ్లాప్ సినిమా తీస్తావా? బ్లాక్ బస్టర్ హిట్ కొడతావా? అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది.

స్క్రిప్ట్ మార్చుకో. క్లైమాక్స్ అదిరిపోయేలా ప్లాన్ చెయ్యి.
లే! దులుపుకో!

నీలో ఉన్న ఆ "లేజీ ఫెలో" ని గట్టిగా ఒక్కటి పీకి, పనిలో పెట్టు.

ప్రపంచం నీ కోసం ఎదురుచూడట్లేదు, నువ్వే ప్రపంచాన్ని నీ వైపు తిప్పుకోవాలి.

ఆల్ ది బెస్ట్ చెప్పను... గెట్ లాస్ట్ అండ్ గెట్ టు వర్క్!

- నల్లమోతు శ్రీధర్
 *_నవ్విపోదురుగాక నాకేటి!_*

🙊🙊🙊🙊🙊🙊🙊

వినరా వినరా 
ఈ చోద్యం గురించి విని 
నవ్వరా..నవ్విపోరా!
_ప్రజాస్వామ్యాన్ని_ _అపహాస్యం చేస్తూ_
*అదెంత సంబరం!*

ఒక ప్రజాప్రతినిధి 
జీవిత కథను 
సినిమాగా తీస్తే కాస్ట్యూమ్స్ 
ఖర్చు ఉండదట..
*ఇది నిర్మాత సంబరం!*

ఇస్త్రీ బట్టలు తీసి
ఫోన్లో పరస్త్రీకి వేధింపులు..
ప్రజల్లో నాయకుడి ముసుగు..
ఫోన్లో మాత్రం దిగంబరం..
_ఇలా ఉండడం_
*ఆయనకెంత సంబరం!*

శాపం దివ్యాంగం...
మరి చూపిస్తే ఇలా అంగం
మద్దతు ఇస్తూ 
ఎంత పెద్ద యంత్రాంగం..
వెనక ఎంతమంది పెద్దల మంత్రాంగం..
పైగా ఇదంతా కుట్ర
అంటూ భుజాలు చరచుకునే
*వికృత సంబరం..!*

నీ వీడియో..నీ ఆడియో..
నీ దగ్గరుంటే సంబరం
జనాలకి చేరితే జుగుప్స
గుప్త నిధి..గుప్త అవయవం..
బయటపడితే గుప్తరోగం..
అయినా కొనసాగుతున్న 
పదవీయోగం..
పైరవీ యాగం...
ప్రజాస్వామ్య దేశంలో
*దుర్మార్గమే పెద్ద సంబరం!*

అధినేతను చేరిన పంచాయతీ
ఉండరాదు ఏ రాయితీ..
రుజువైతే తప్పు..
పదవికి ఉండాలి ముప్పు..
అలా చేస్తేనే..అది జరిగితేనే
సమాజం ఒప్పు..

🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️

                 *_ఈఎస్కే_*
 మను ధర్మం ఎక్కడ ఉన్నది ?. ఎవరు ఆచరిస్తున్నారు ?.

భారతదేశ చరిత్రలో, కృత, త్రేతా, ద్వాపర యుగాల కాలంలో, వర్ణ వ్యవస్థ ఉండేది. వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే, మనుధర్మ శాస్త్రమును ఆచరించటం జరిగినది. వర్ణ వ్యవస్థతో కూడిన సమాజంలో, నాలుగు వర్ణముల వారు, మనువు చెప్పిన ధర్మ శాస్త్రమును పాటించే వారు. వారి రాజ్యాంగము కూడాను, మను ధర్మ శాస్త్రమే. మనం ఉన్నది కలి యుగంలో. కలియుగం మొదలై 5000 సంవత్సరములు అవుతున్నది.  

భారతీయ సమాజంలో, నాలుగు వర్ణములతో కూడిన, వర్ణ వ్యవస్థ కూలిపోయి, 5000 సంవత్సరములు అవుతున్నది. గత 5000 సంవత్సరాల కాలములో, వర్ణ వ్యవస్థ స్థానంలో వర్గ వ్యవస్థ వచ్చినది. వర్గ వ్యవస్థ స్థానంలో కుటుంబ వ్యవస్థ వచ్చినది. ఈ కుటుంబ వ్యవస్థ, కాల క్రమేణా, కుల సమాజముగా వృద్ధి చెందినది. 

ఈ సంధి కాలములో, భారతీయ సమాజంలో, ఎన్నో ధర్మములు రావటం, పోవటం జరుగుతున్నది. క్రొత్తగా వచ్చిన ధర్మములు, మనుధర్మ స్థానంలోనే వచ్చినవే. ఎందుకంటె, సనాతన ధర్మం కంటే ముందు, భారతీయ సమాజంలో వేరే ధర్మములు ఉన్నట్టుగా, మనకు ఏ చరిత్ర చెప్పుట లేదు. క్రొత్తగా వచ్చిన ధర్మ ముల గురువులు, వారి వారి సిద్ధాంతములు, ప్రజలకు చెప్పుతూనే ఉన్నారు.      

జైనం, బౌద్ధం, చార్వాకం, సిక్కు, శైవం, వైష్ణవం, శాక్తేయం, ద్వైతం, అద్వైతం, విశిష్ఠాద్వైతం, వీర శైవం, అచల తత్త్వం మరియు ఆర్య తత్త్వం. ఈ తత్వములు అన్నియు కూడాను, సనాతన ధర్మం నుండి పుట్టినవే. వీరు అందరు, మనుధర్మ శాస్త్రంలో చెప్పబడిన అంశములను, వారి వారి అవగాహనా శక్తిని బట్టి గ్రహించి, వారి వారి విధానములలో, ప్రజలకు చెప్పటం జరుగుతున్నది.  

అయినప్పటికిని, కొందరు మాత్రం, మనువాదం నశించాలి. సమాజంలో అన్ని రుగ్మతలకు కారణం మను వాదమే అని పిచ్చి వాదనలు చేస్తారు. ఎందుకంటె, 5000 సంవత్సరముల క్రిందట, ఆగిపోయిన ధర్మమును కించపర్చటం, వెఱ్రి కాకపోతే ఏమనాలి. అసలు మనువాదం అంటే ఏమిటో వీళ్ళకు తెలియదు. మను ధర్మం అమలులో ఉన్నదో లేదో కూడా విమర్శలు చేసే వాళ్ళు ఆలోసించటం లేదు.  

కులమును సృష్టించింది, మను ధర్మశాస్త్రం అని కొందరు అంటున్నారు. ఇది అబద్దం. మనుధర్మ శాస్త్రంలో కులము అనే పదం వాడటం జరిగింది. అది కుటుంభం గురించి ప్రస్తావించే సందర్భంలో వాడినారు. మనుధర్మ శాస్త్రంలో కుటుంభం, కులము అనేవి ఒకే అర్థంతో కూడినవి. కనుక, మనుధర్మ శాస్త్రం, అమలు జరిగిన కాలములో, ఆ సమాజములో ఉన్నది, నాలుగు వర్ణములతో కూడిన, వర్ణ వ్యవస్థ మాత్రమే. 

మను ధర్మం శాస్త్రం  ప్రకారం, ధర్మమును కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణులది. రాజ్యమును కాపాడవల సిన బాధ్యత క్షత్రియులది. వస్తు వినిమయం, వ్యాపారం కాపాడవలసిన బాధ్యత వైశ్యులది. వ్యవసాయము ను కాపాడవలసిన బాధ్యత శూద్రులది.  

గత 5000 సంవత్సరముల నుండి, అన్ని వర్గముల వారు, అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. దీనిని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏమంటే, చేస్తున్న పని, పొట్ట కుటికోసమే తప్ప. మరే విధమైన నిర్ధారణకు ఆధారము కాదు. అంతేకాదు, అన్ని వర్గముల ప్రజలు, అన్ని రకముల పనులు చేస్తున్నారు అంటే, మను ధర్మం శాస్త్రం అమలులో లేదు అని రూడి అవుతున్నది.  

భారతదేశంలో ప్రజలు అనాదిగా ఆచరిస్తున్నది సనాతన ధర్మం. దీనినే హిందూ ధర్మం అని కూడా అంటారు. సనాతన ధర్మంలో భాగమే మనుధర్మ శాస్త్రం. ఇది స్వాయంభువ మునువుచే చెప్పబడినది. దీనియందు, ధర్మముగా చేయవలసిన పనులు, అధికారములు, బాధ్యతలు మరియు శిక్షలు అన్నియు పొందుపర్చబడి నవి. అంటే, పరిపాలనకు మార్గదర్శి (రాజ్యాంగము) కూడాను. 

గత 5000 సంవత్సరముల నుండి, మనుధర్మ శాస్త్రం అమలులో లేనప్పటికిని, ప్రజలు, సనాతన ధర్మము ను, ఎవరికి తోచిన విధముగా వారు ఆచరిస్తున్నారు. సనాతన ధర్మమే, మనుధర్మం అని కొందరు భ్రమపడు తున్నారు. ఇది భ్రమ మాత్రమే. 

భారతదేశంలో కులము ఎలా ఏర్పడినదో తెలియటం లేదు, అని వ్యాసములు వ్రాచిన ప్రబుద్ధులే, కులమును నశింపజేయాలి అని కూడా వ్యాసాలు వ్రాయటం జరిగింది. ఇది భూత వైద్యుడి బొంకులాంటిది మాత్రమే. ఇటు వంటి ప్రబుద్ధులే, వాళ్ళ కులము గొప్పదని వ్రాచుకున్న సందర్భములు కలవు. 

మనం, ఏ ధర్మం పాటిస్తున్నాము అనేది, మనకు మనం విశ్లేషించుకోవాలి. మనం పాటించని ధర్మం గురించి మాట్లాడటం, అజ్ఞానమే. కనుక ఎవరికి నచ్చిన ధర్మమును వారు పాటించుకుంటూ, వారి వారి సరిహద్దులలో వారు జీవిస్తే, అందరికి మంచిది. అందుకే అన్నారు, ధర్మో రక్షతి రక్షతః అనే వేద సూక్తిని. అంటే, మనం ధర్మముగా జీవిస్తుంటే, ఆ ధర్మమే మనకు రక్షణగా ఉంటది.        
డాక్టర్. ఎక్కిరాల వెంకటనరసయ్య
9391129992.
 *****                    
                        *రాణీ...నా రాణీ*
                        ============
                       (జ్ఞాపకాల పందిరి)

(అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలతో)

రచన. ::
బుద్ధవరపు కామేశ్వరరావు 
హైదరాబాద్ 

మా తల్లిదండ్రులకు మేము 11 మంది సంతానం. మా ఇంట్లో ఇలాగే మనుష్య సంపదే కాకుండా పశు సంపద కూడా ఎక్కువగానే ఉండేది. మా సొంత ఊరు జగన్నాథగిరిలో మా ఇంటి పక్కనే ఉన్న కొత్త దొడ్డిలో రెండు ఆవులు, రెండు గేదెలు రెండు ఎద్దులు అలాగే ఓ రెండు దూడ పిల్లలు కూడా ఉండేవి.

వీటిని చూసుకోవడానికి చందన్న అనే ఒకతను ఉండేవాడు. పాలు వెతకడానికి వీరన్న అని ఒక అతను వచ్చేవాడు. 

ఇక మా పెద్ద అక్కయ్యకి తొమ్మిది సంవత్సరాలకే 1957 లో వివాహం అయింది. దానికి ఆ తరువాత 13 సంవత్సరాల వరకు పిల్లలు పట్టుకపోవడంతో 1964 సంవత్సరంలో తను కాపురానికి వెళుతున్నప్పుడు నన్ను కూడా తనతో పాటు రాజమండ్రిలో  సీతంపేట రామాలయం సందులో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ నేను రెండవ తరగతిలో జాయిన్ అయ్యాను.

అక్కడ వాళ్లకి రాణి ఒక ఆల్సేషియన్ డాగ్ ఉండేది. అది నాతో చాలా చనువుగా ఉండేది. నేను బడి నుంచి రాగానే, తోక ఊపుకుంటూ నాకు ఎదురు వచ్చేది. మా అక్క నాకు ఇచ్చిన ఆరు పీవీసీ బిస్కెట్లలో ఓ రెండు బిస్కెట్లు దానికి వేసేవాడిని.  (ఫొటో అదే)

అయితే ఆ తర్వాత వేసవి సెలవులకు నేను మా స్వగ్రామం రావడం జరిగింది. ఆ తర్వాత బడి తెరిచిన తర్వాత మళ్లీ రాజమండ్రి వెళ్లే సరికి నా రాణి కనబడలేదు‌.  మా అక్క బావలని అడిగితే నీ గురించి బెంగ పెట్టుకొని పోయిందిరా అనేవారు. నాకు అసలు ఏమీ అర్థం అయ్యేది కాదు.

ఆ తర్వాత రోజుల్లో తెలిసింది ఏమిటంటే, నేను వెళ్లిన మర్నాడు సాయంత్రం ఎవరో ఆ గేటు తెరిచారుట. అది చూసి నేను వచ్చాను అనుకుని అది గబగబా గేట్ దగ్గరికి వచ్చేసిందిట. ఈలోగా పేపర్ మిల్లు నుంచి స్పీడుగా వస్తున్న ఒక లారీ దాన్ని గుద్దేయడంతో, అలా అది అక్కడ నుంచి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోయింది.

అదే అండి నాకు పశువులతోనూ పెంపుడు జంతువులతో ఉన్న అనుబంధం. 

                     **సమాప్తం**
 *"నువ్వు చేసే "మంచిని" నువ్వు మరిచిపోయినా - దైవం మరిచిపోదు..!!*

*'నువ్వు చేసే "చెడుని" దైవం మరిచిపోయినా- "కర్మ" మరిచిపోదు..!!*

*"మనం చేసే ఏ పనైనా వృథా పోదని చెబుతోంది. మనం చేసే మంచి పనులను దైవం గుర్తుంచు కుంటుందని.."'*

*"అలాగే మనం చేసే తప్పుల నుండి '"కర్మ'" సిద్ధాంతం నుండి ఎవరూ తప్పించుకోలేరని.. ఎంతటి వారినైనా "కర్మ" వదిలిపెట్టదు అని ఇది హెచ్చరిస్తోంది. అంటే ప్రతి పనికీ "ప్రతిఫలం.." ఖచ్చితంగా ఉంటుందని దీని అర్థం."*

*"మనుషులు సృష్టించిన  కంప్యూటర్, ఇంటర్ నెట్, cc కెమెరాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), వాట్సాప్ మొదలగునవి.. వాటిని కనిపెట్టిన మనుషులకే ఇంత శక్తి సామర్థ్యాలు ఉంటే.. మనుషులను సృష్టించిన భగవంతునికి🕉️ సర్వశక్తివంతునికి ఎంత నెట్వర్క్ ఉంటుందో.. ఎంత అనంతమైనశక్తి సామర్థ్యాలు ఉంటాయో కొద్దిగా అర్దం చేసుకోండి..."*

*"ఎవరూ చూడరు, ఎవరూ వినరు అని.. ఎన్నో ఎన్నెన్నో చెడు కర్మలు చేస్తుంటే సృష్టి కర్త- పరంపిత పరమాత్మ- ప్రకృతి మాత చూస్తూ ఉండాలా..."*

*"చేసే మంచి చెడు కర్మల ఫలితాలు ఏదో ఒకరోజు అనుభవించి తీరవలసిందే..."* 

*"దైవానికి' కాదు 'కర్మకు' 'భయపడు"*
*"దైవం' క్షమించినా 'కర్మ' అనుభవించి తీరాల్సిందే!!!*

*పాప-పుణ్యాలు నిర్ణయించేది శివచైతన్య 🎇శక్తి.. అది ఏ సన్నివేశాన్ని, ఏ కర్మణి మర్చిపోదు.. శివ చైతన్య🎇 శక్తికి అనంతమైన జ్ఞాపకశక్తి ఉన్నది.. కాలం నీ కర్మని వడ్డీతో సహా నీకే తిరిగి ఇచ్చేస్తుంది.*

*చిన్న🌰విత్తనం పెరిగి మహా వృక్షం🌳అవుతుంది. అదే విధంగా మనం చేసిన కర్మలకు ఫలితంగా కాలక్రమంలో విధిని అనుసరించి కర్మఫలం (కర్మ ఫలితం) లభిస్తుంది.*

*ఆ కర్మఫలాన్ని సరైన సమయంలో, తగిన విధంగా అందించే ఏకైక స్వాభావిక శక్తి ఈశ్వరుడు (🕉️భగవంతుడు శివ పరమాత్మ🎇). సకల జగత్తుకూ తండ్రి అయిన ఆయనకు ఒకరి మీద ఇష్టం, మరొకరి మీద ద్వేషం ఉండవు.*

*ప్రతి కర్మకు కర్మానుగుణంగా ఫలాన్ని ఇచ్చేదే భగవంతుని శక్తి, దీన్ని మనం ఈశ్వర శక్తి -శివశక్తి
గా భావిస్తాం.*

*శాస్త్రాల్లో దీన్ని విధి లేదా కాలం అని పేర్కొన్నారు. ఏది ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించేది నియతి లేదా విధి.. దీన్ని నియమబద్ధంగా నడిపించేది కాలం*

*"ఇప్పుడు సరైన సాధన ద్వారా మనసును అందాల బృందావనం గా మార్పు చేసుకోవాలి..."* 

*"భగవంతుడు మానవ జన్మ ఉత్తమమైన జీవన విధానము కొరకే ఇచ్చాడు.. మహనేయమైన మానవ జన్మ ను మహోన్నతంగా తీర్చి దిద్దుకోవాలి..."*

*"అది నీ చేతుల్లోనే నీయొక్క పాజిటివ్ ఆలోచనలు లోనే ఉంది..."* 

*"అందుకే నిత్యం, నిరంతరం నీలోకి నీవు ప్రవేశించాలి.. అలా ప్రవేశించే అవకాశం, మార్గం సరైన సాధన ద్వారానే సాధ్యం..."*

 *"ముందుగా నిన్ను మనిషిగా పుట్టించిన భగవంతునికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేయాలి..."*

 *"సక్రమమైన పద్ధతిలో జీవించడానికి మార్గం చూపిన గురువులకు, జన్మ నిచ్ఛిన తల్లి దండ్రులకు కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలపాలి..."* 

*"విశ్వాని ప్రకృతి తల్లిని (మాతని) చేసిన తప్పులకు క్షమాపణ కోరాలి..."*
 *"నువ్వు చేసే "మంచిని" నువ్వు మరిచిపోయినా - దైవం మరిచిపోదు..!!*

*'నువ్వు చేసే "చెడుని" దైవం మరిచిపోయినా- "కర్మ" మరిచిపోదు..!!*

*"మనం చేసే ఏ పనైనా వృథా పోదని చెబుతోంది. మనం చేసే మంచి పనులను దైవం గుర్తుంచు కుంటుందని.."'*

*"అలాగే మనం చేసే తప్పుల నుండి '"కర్మ'" సిద్ధాంతం నుండి ఎవరూ తప్పించుకోలేరని.. ఎంతటి వారినైనా "కర్మ" వదిలిపెట్టదు అని ఇది హెచ్చరిస్తోంది. అంటే ప్రతి పనికీ "ప్రతిఫలం.." ఖచ్చితంగా ఉంటుందని దీని అర్థం."*

*"మనుషులు సృష్టించిన  కంప్యూటర్, ఇంటర్ నెట్, cc కెమెరాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI), వాట్సాప్ మొదలగునవి.. వాటిని కనిపెట్టిన మనుషులకే ఇంత శక్తి సామర్థ్యాలు ఉంటే.. మనుషులను సృష్టించిన భగవంతునికి🕉️ సర్వశక్తివంతునికి ఎంత నెట్వర్క్ ఉంటుందో.. ఎంత అనంతమైనశక్తి సామర్థ్యాలు ఉంటాయో కొద్దిగా అర్దం చేసుకోండి..."*

*"ఎవరూ చూడరు, ఎవరూ వినరు అని.. ఎన్నో ఎన్నెన్నో చెడు కర్మలు చేస్తుంటే సృష్టి కర్త- పరంపిత పరమాత్మ- ప్రకృతి మాత చూస్తూ ఉండాలా..."*

*"చేసే మంచి చెడు కర్మల ఫలితాలు ఏదో ఒకరోజు అనుభవించి తీరవలసిందే..."* 

*"దైవానికి' కాదు 'కర్మకు' 'భయపడు"*
*"దైవం' క్షమించినా 'కర్మ' అనుభవించి తీరాల్సిందే!!!*

*పాప-పుణ్యాలు నిర్ణయించేది శివచైతన్య 🎇శక్తి.. అది ఏ సన్నివేశాన్ని, ఏ కర్మణి మర్చిపోదు.. శివ చైతన్య🎇 శక్తికి అనంతమైన జ్ఞాపకశక్తి ఉన్నది.. కాలం నీ కర్మని వడ్డీతో సహా నీకే తిరిగి ఇచ్చేస్తుంది.*

*చిన్న🌰విత్తనం పెరిగి మహా వృక్షం🌳అవుతుంది. అదే విధంగా మనం చేసిన కర్మలకు ఫలితంగా కాలక్రమంలో విధిని అనుసరించి కర్మఫలం (కర్మ ఫలితం) లభిస్తుంది.*

*ఆ కర్మఫలాన్ని సరైన సమయంలో, తగిన విధంగా అందించే ఏకైక స్వాభావిక శక్తి ఈశ్వరుడు (🕉️భగవంతుడు శివ పరమాత్మ🎇). సకల జగత్తుకూ తండ్రి అయిన ఆయనకు ఒకరి మీద ఇష్టం, మరొకరి మీద ద్వేషం ఉండవు.*

*ప్రతి కర్మకు కర్మానుగుణంగా ఫలాన్ని ఇచ్చేదే భగవంతుని శక్తి, దీన్ని మనం ఈశ్వర శక్తి -శివశక్తి
గా భావిస్తాం.*

*శాస్త్రాల్లో దీన్ని విధి లేదా కాలం అని పేర్కొన్నారు. ఏది ఎప్పుడు జరగాలో దాన్ని నిర్ణయించేది నియతి లేదా విధి.. దీన్ని నియమబద్ధంగా నడిపించేది కాలం*

*"ఇప్పుడు సరైన సాధన ద్వారా మనసును అందాల బృందావనం గా మార్పు చేసుకోవాలి..."* 

*"భగవంతుడు మానవ జన్మ ఉత్తమమైన జీవన విధానము కొరకే ఇచ్చాడు.. మహనేయమైన మానవ జన్మ ను మహోన్నతంగా తీర్చి దిద్దుకోవాలి..."*

*"అది నీ చేతుల్లోనే నీయొక్క పాజిటివ్ ఆలోచనలు లోనే ఉంది..."* 

*"అందుకే నిత్యం, నిరంతరం నీలోకి నీవు ప్రవేశించాలి.. అలా ప్రవేశించే అవకాశం, మార్గం సరైన సాధన ద్వారానే సాధ్యం..."*

 *"ముందుగా నిన్ను మనిషిగా పుట్టించిన భగవంతునికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేయాలి..."*

 *"సక్రమమైన పద్ధతిలో జీవించడానికి మార్గం చూపిన గురువులకు, జన్మ నిచ్ఛిన తల్లి దండ్రులకు కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలపాలి..."* 

*"విశ్వాని ప్రకృతి తల్లిని (మాతని) చేసిన తప్పులకు క్షమాపణ కోరాలి..."*
 💦 *చందమామ కథలు (Chandamama Kathalu) - 356*

*🐥స్థూలకాయానికి చికిత్స*

*సమస్యలన్నీ తీరిపోవడంతో రాజ్యపాలకుడైన రాజాధిరాజు దృష్టి రుచికరమైన ఆహారపానీ యూలవైపు మళ్ళింది. సుష్టుగా తినడం, హాయిగా నిద్రపోవడం ఇవే దినచర్యగా మార డంతో, రాజు మరీ లావుగా తయూరయ్యూడు. ఆయన స్థూలకాయూన్ని చూసి ప్రజలు నవ్వుకో సాగారు. రాజోద్యోగులు ఎదురుపడినప్పుడు నవ్వలేక తలలు పక్కకు తిప్పుకోసాగారు. యువరాజుగా ఉన్నప్పుడు రాజాధిరాజు చాలా చలాకీగా, అందంగా ఉండేవాడు.*
 
*ఆయన ఠీవిగా గుర్రంపై వెళుతూంటే చూసే వాళ్ళు ఆనందాశ్చర్యాలు చెందేవారు. ఆయన తండ్రి మరణానంతరం యువరాజు సింహాసనాన్న ధిరోహించాడు. రాజాస్థానంలో ఆరుగురు మంత్రు లున్నారు. వారిలో ప్రధానమంత్రి కావాలనే తపన నలుగురిలో విపరీతంగా ఉండేది. అందువల్ల తమలో తాము పోటీ పడసాగారు. కొత్తగా అధికారానికి వచ్చిన రాజాధిరాజుకు అది పెద్ద సమస్యగా తయూరయింది. ఆయన త్వరగా ఒకనిర్ణయూనికి రాలేక పోయూడు.*
 
*అందువల్ల మంత్రులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చూప సాగారు. దాంతో పరిపాలనా వ్యవస్థ అస్త వ్యస్త మయింది. రాజాధి రాజు తీవ్రంగా ఆలోచిం చాడు. విశ్వాస పాత్రులైన అధికారుల సాయంతో పరిపాలనా వ్యవహారా లను చక్కదిద్దాడు. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతూన్న నలుగురు మంత్రులనూ తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియ మించి వారికి మరిన్ని అధికారాలు ఇచ్చాడు.*
 
*దాంతో పరిపాలనావ్యవస్థ పూర్తిగా అదుపులోకి వచ్చింది. సమస్యలన్నీ సమసిపోయి, రాజ్యంలో శాంతిసుఖాలు వెలిశాయి. వెంటనే దృష్టి సారించ వలసిన సమస్యలేవీ లేవు గనక రాజుగారి దృష్టి ఆహారపానీయూలవైపు మళ్ళింది. పర్య వసానంగా ఆయన మితిమించిన స్థూల కాయుడైపోయి, చూసే వాళ్ళందరూ నవ్వుకు నేలా తయూరయ్యూడు. అదీ ఇప్పటి సమస్య! తనను చూసేవారందరూ ఎందుకు నవ్వు కుంటున్నారో రాజుకు ఓ పట్టాన అర్థం కాలేదు.*

*విశ్వాస పాత్రుడైన ఒక మంత్రిని పిలిచి కారణం అడిగాడు. ‘‘ప్రభువులు ఆగ్రహం చెందరని మాట ఇస్తే అసలు విషయం చెబుతాను,'' అన్నాడు మంత్రి. ‘‘నిర్భయంగా చెప్పు,'' అని రాజు మాట ఇచ్చాక, ‘‘తమ ఆకారాన్ని చూసుకుంటే ప్రభు వులకే తెలుస్తుంది ఎంత లావుగా ఉన్నారో,'' అన్నాడు మంత్రి కంఠస్వరాన్ని తగ్గించి. రాజు ఒకసారి తనకేసి పరిశీలనగా చూసు కుని, ‘‘అవును. లావుగానే ఉన్నాను.*
 
*మరి నన్నేం చేయమంటావు?'' అని అడిగాడు. ‘‘ప్రభు వులు, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం తగ్గించాలి,'' అన్నాడు మంత్రి. ‘‘అది, అసాధ్యం!'' అన్నాడు రాజు దృఢనిర్ణయంతో. మంత్రి మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయూడు. రాజు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి, ఉన్నట్టుండి, ‘‘ఆ, ఇప్పుడు తెలిసి పోయింది. నా ప్రజలందరూ కూడా రుచికర మైన వంటకాలను సుష్టుగా భుజించి నాలాగే లావుగా తయూరవ్వాలి.*
 
*అప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వలేరు కదా. ప్రజలందరికీ కావలసిన సరుకులను సరసమైన ధరకు ఇవ్వాలని వ్యాపారులను పురమాయించు. అందరూ కడుపు నిండా తినాలి. ఆరు నెలలలోగా ప్రతి ఒక్కరూ లావెక్కాలి. ఆ తరవాత కూడా సన్నగా ఉన్న వారిని జైల్లో పెట్టి బలవంతంగా తినిపిస్తామని ప్రజలను హెచ్చరించు!'' అన్నాడు. రాజాజ్ఞ క్షణాలలో నెరవేర్చబడింది. ఎవరికీ జైలుపాలవడం ఇష్టం ఉండదు గనక, అందరూ మితిమించి తినసాగారు.*
 
*కావలసిన పానీయూ లను తాగసాగారు. అందువల్ల ప్రజలందరూ స్థూలకాయులుగా తయూరయ్యూరు. రాజాధి రాజు రాజవీధిలో గుర్రంపై వెళుతూ, దారికి ఇరువైపులా బారులుతీరి నిలబడిన స్థూలకా యులను చూసి ఎంతో సంతోషించాడు. అయితే ఈ సంతోషం ఆట్టేకాలం నిలవ లేదు. అంతవరకు మెరుపుతీగలా అందంగా కనిపించిన రాజుగారి ఏకైక కుమార్తె మాళవిక కూడా రోజురోజుకూ లావు కాసాగింది.*
 
*ఆమె స్థూలకాయూన్ని రాజు చూడలేకపోయూడు. ఆయన మంత్రులను సంప్రదించాడు. వాళ్ళూ పోటీపడి లావెక్కుతున్నారు. రాజాజ్ఞ నుంచి యువరాణిని మినహాయించాలని ఏకగ్రీవంగా సలహాయిచ్చారు. అయితే, యువరాణికి అప్ప టికే ఎల్లప్పుడూ తింటూండడం అలవాటై పోయింది గనక, ఆ అలవాటును ఆమె మాను కోలేక పోయింది.*

*అందువల్ల ఆమె ఎప్పటిలాగే తింటూ లావుగానే ఉండిపోయింది. దీనికేదైనా వైద్యం వుండక పోదని ఆశిం చిన రాజు మరో ప్రకటన చేశాడు: యువరాణి స్థూల కాయూన్ని తగ్గించిన వైద్యుణ్ణి ఘనంగా సన్మానిస్తాం. ఆ వైద్యుడే గనక సన్నగా, అందంగా వున్న యువకుడైతే యువరాణిని అతనికే ఇచ్చి వివాహం చేస్తాం. అతడే భవిష్యత్తులో ఈ రాజ్యా నికి రాజవుతాడు. అయితే, స్థూల కాయూన్ని తగ్గిస్తానని వచ్చి, చేయ లేనివాడికి శిరశ్ఛేదం తప్పదు!*
 
*ఆ చాటింపు విని రాజ్యంలోని కొందరు వైద్యులు, రాజు ఎదుటికి రావడానికి భయపడి ఎక్కడెక్కడో దాక్కున్నారు. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కాని ఒక్క వైద్యుడూ ముందుకు రాలేదు. ఒకనాటి ఉదయం, రాజధాని సమీపంలోని అరణ్యప్రాంతంలో ఒక యువకుడు చెట్లమధ్య ఏవో ఆకులలములు వెతుకుతూండడం రాజ భటులు చూశారు. విచారించగా, అతడు పొరుగు దేశానికి చెందిన వైద్యుడనీ ఒక ముఖ్య మైన మూలిక కోసం వెతుకుతున్నట్టూ తెలి సింది.*
 
*రాజభటులు అతన్ని రాజు సమక్షానికి తీసుకువచ్చారు. ఆ యువకుడు వైద్యుడని తెలియగానే రాజు సంతోషించాడు. పైగా అతడు సన్నగా అందంగా ఉన్నాడు. రాజు, యువరాణి సమస్య అతనికి చెప్పాడు. అంతావిన్న ఆ యువకుడు, ‘‘ప్రభూ, రాజ్యంలో ప్రజలందరూ స్థూలకా యులుగానే ఉన్నారు; అలాంటప్పుడు యువ రాణి స్థూలకాయూన్ని మాత్రం తగ్గించాలంటే నావల్ల అవుతుందా? ఇదేదో ఈ రాజ్యాన్నంతటినీ పట్టి పీడిస్తూన్న రుగ్మత.*
 
*నామీద కరుణించినన్ను వదిలిపెట్టండి. వెళ్ళి అడవిలో మూలికలు వెతుక్కుని మా రాజ్యానికి వెళ్ళిపోతాను,'' అన్నాడు. ‘‘నువ్వేం చెప్పినా నేను వినను. నాతో రా. నీకెన్ని బహుమానాలు కాచుకుని ఉన్నాయో చూడు. నా కుమార్తెను వివాహ మాడి, ఈ రాజ్య సింహాసనానికే వారసుడివి కాగలవు,'' అంటూ రాజు ఆ యువవైద్యుడి చేయిపట్టుకుని, యువ రాణి శయనగృహానికి లాక్కుపోయి ఆమెను చూపుతూ, ‘‘నయం చేయగలవేమో చూడు.*
 
*అందుకు కావలసిన సకల సదుపాయూలూ సమకూర్చగలం,'' అన్నాడు. యువవైద్యుడు యువరాణి కళ్ళకేసి పరీ క్షగా చూశాడు. ఆమె నొసటిని అరచేత్తో తాకి చూశాడు. ఆ తరవాత ఆమె చేతిని పట్టుకుని నాడి పరీక్షించాడు. ఆ పిమ్మట కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపైకెత్తి, ‘‘ప్రభువులు క్షమించాలి.*

*మీ కుమార్తె మరో నూట మూడు రోజులు మాత్రమే ప్రాణాలతో ఉండగలదు! అందువల్ల ఆమె స్థూలకాయూన్ని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు,'' అన్నాడు విచారంగా. ఆమాట వినగానే, రాజదంపతులు దిగ్భ్రాంతి చెందారు. కొంతసేపటికి నెమ్మదిగా కోలుకున్న రాజు, ‘‘నువ్వు నా కుమార్తె భవిష్యత్తు చెప్పి నందుకు నిన్ను శిక్షించను. అయితే, నూట మూడు రోజులకు పైగా ఆమె ఒక్కరోజు ప్రాణా లతో ఉన్నా నీ ప్రాణాలు దక్కవు.*
 
*అంతవరకు నీకు కారాగారవాసం తప్పదు,'' అన్నాడు. యువరాణి మాళవిక రానున్న తన మర ణాన్ని తలుచుకుని కొన్నాళ్ళు దీనాతి దీనంగా విలపించింది. చెలికత్తెలనూ, తల్లిదండ్రులనూ శాశ్వతంగా వదిలి వెళ్ళడం ఆమెకు తీరని వేదనను కలిగించింది. భోజనం అంటే విరక్తి పుట్టింది. కొన్నాళ్ళకు ఆహారం ముట్టుకోలేక పోయింది. మరికొన్నాళ్ళకు పానీయూలు తీసు కోవడం కూడా మానివేసింది. ఒట్టి నీళ్ళతోనే సరిపెట్టుకోసాగింది.*
 
*కుమార్తెకు రానున్న అకాల మరణాన్ని తలుచుకుంటూ రాజూ, రాణీ కూడా ఆహారపానీయూలు మానేశారు. ముఖ్యంగా రుచికరమైన వంటల జోలికి పోలేదు. నూరు రోజులు గడిచి పోయూయి. కుమార్తె శోక వదనాన్ని చూడలేక రాజు అటు వెళ్ళడం తగ్గించాడు. అయినా ఆమె ఆరోగ్య స్థితిని చెలి కత్తెల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. నూట ఒకటవ రోజు ఒక చెలికత్తె వచ్చి, ‘‘ప్రభూ, యువరాణి మందహాసం చేస్తున్నది. సుదీర్ఘకాలం జీవిస్తానంటున్నది,'' అని చెప్పింది.*
 
*రాజు తన మెడలోని ఒక ముత్యాల హారాన్ని తీసి ఆ చెలికత్తెకు బహూకరించాడు. మరునాడు మరొక చెలికత్తె వచ్చి, ‘‘ప్రభూ, ఈరోజు యువరాణి దానిమ్మరసం అడిగింది,'' అని చెప్పడంతో రాజు ఆమెకు కూడా మరొక హారం ఇచ్చాడు. అందరూ ఆతృతతో ఎదురు చూస్తూన్న మూడో రోజు రానేవచ్చింది. ‘‘ప్రభూ, ఇన్నాళ్ళ తరవాత ఈ రోజు యువరాణి, భోజనం చేశారు,'' అంటూ ఇంకొక చెలికత్తె ఆనందకరమైన వార్త తెచ్చింది.*
 
*రాజు ఆమెకు మరో హారాన్ని బహూ కరిస్తూ, ‘‘నేను రేపే వచ్చి మాళవికను చూస్తా నని చెప్పు,'' అన్నాడు పరమానందంతో. అయినా ఆమె అటువెళ్ళగానే, ‘‘నా గారాల పట్టి నిజం గానే రేపు ప్రాణాలతో ఉంటుందా?'' అన్న ఆలోచన రావడంతో రాజు మళ్ళీ విచారగ్రస్తు డయ్యూడు. మరునాడు తెల్లవారే సరికల్లా, యువరాణి భవనానికి వెళ్ళడానికి రాజు సంసిద్ధుడయ్యూడు. కాని అంతలోనే యువరాణి తన చెలికత్తెలతో కలిసి తండ్రిని చూడడానికి అక్కడికి వచ్చింది.*

*‘‘మాళవికా! వచ్చావా? ఎంత చురుగ్గా ఉన్నావు తల్లీ!'' అన్నాడు రాజు ఆనందాతిరేకంతో. ‘‘నాన్నా, ఆ వైద్యుణ్ణి పిలిపించండి. నేన తణ్ణి చూడాలి,'' అన్నది యువరాణి. ‘‘తప్పక రప్పిస్తాను. అయితే, భవిష్యత్తు తప్పుగా చెప్పినందుకు అతణ్ణి ఉరికంబం ఎక్కిస్తాను,'' అన్నాడు రాజు. ‘‘నేను ఆరోగ్యంగా ప్రాణాలతోనే ఉన్నాను కదా? అతడెందుకు మరణించాలి?'' అని అడి గింది యువరాణి. కొంతసేపటికి వైద్యుణ్ణి రాజు వద్దకు తీసుకువచ్చారు.*
 
*‘‘నువ్వు చెప్పిన భవిష్యత్తును గురించి ఇప్పుడేమంటావు?'' అని అడిగాడు రాజు. వైద్యుడు ఏమాత్రం భయపడకుండా గట్టిగా నవ్వుతూ, ‘‘ప్రభూ, ఇప్పుడు యువరాణి సన్నగా, చాలా చలాకీగా ఉంది కదూ? ఆమె స్థూలకాయం ఏమయింది? అంతెం దుకు, మిమ్మల్నే మీరు ఓసారి చూసు కోండి. ఎంత సన్నబడి పోయూరో!'' అన్నాడు. రాజు తన్ను తాను ఒకసారి పరిశీలనగా చూసు కుంటూ, ‘‘అవును, నిజమే. సన్నబడి పోయూను. అవును, ఇదంతా ఎలా జరిగింది?'' అన్నాడు ఆశ్చర్యంగా.*
 
*‘‘ప్రభూ నేను ఎలాంటి భవిషత్తూ చెప్పలేదు. మీరు మితి మించి భుజించ కుండా ఉండడానికి తగిన పరిస్థితిని కల్పించాలనుకున్నాను. మీ స్థూల కాయూనికి అసలు సమస్య అమిత ఆహారం. ఇప్పటికైనా దయచేసి, ప్రజలు స్థూలకాయు లుగా ఉండాలన్న మీ ఆనతిని ఉపసంహ రించుకోండి. వాళ్ళను స్వతంత్రంగా వాళ్ళకు కావలసిన ఆహారాన్ని తీసుకోనివ్వండి,'' అన్నాడు వైద్యుడు వినయంగా.*
 
*‘‘తప్పకుండా ఆ పని చేస్తాను. అంతకు ముందు నేను నీకిచ్చిన మాటను కూడా నిల బెట్టుకోవాలి కదా! నీకూ, మాళవికకూ త్వరలో వివాహం ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు రాజు మందహాసం చేస్తూ. కొన్నాళ్ళకు మాళవిక, యువవైద్యుడి వివాహం ఘనంగా జరిగింది. రాజాధిరాజు వానప్రస్థానికి వెళ్ళడంతో యువవైద్యుడు సింహాసనం అధిష్ఠించాడు.*
       💦🐬🐥🐋💦