ప్రయాగ గంగ, యమున, సరస్వతీ నదుల సంగమక్షేత్రము. అక్కడ స్నాన మాచరించటం పుణ్యప్రదం. అందులోను మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే అపరిమితమైన ఫలితం వస్తుందంటోంది నారదపురాణం.
ప్రయాగలో స్నానఫలం : కుంభమేళా జరిగే సమయంలో ప్రయాగలో స్నాన మాచరించటం అత్యంత ఫలప్రదం. స్కాందపురాణంలో
అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతానిచ ।
లక్షం ప్రదక్షిణా భూమేః కుంభస్నానేన తత్ఫలం I
వెయ్యి అశ్వమేధ యాగాలు, వంద వాజపేయాలు, లక్ష భూ ప్రదక్షిణాలు చేసిన ఫలితం ఒకసారి కుంభస్నానం చేస్తే వస్తుంది.
సహస్రం కార్తికే స్నానం । మాఘే స్నాన శతానిచ
వైశాఖే నర్మదాకోటిః । కుంభ స్నానేన తత్ఫలం I
ఒకసారి కుంభ స్నానం చేస్తే వెయ్యి కార్తీకస్నానాలు, వంద మాఘస్నానాలు గంగలో చేసిన ఫలితం వస్తుంది. నర్శదానదిలో కోటి వైశాఖస్నానాలు చేసిన ఫలితం వస్తుంది.
ఈ రోజులలో ఇక్కడ పిత్రుదేవతలకు పిండప్రదానం చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తారు..
No comments:
Post a Comment