Vedantha panchadasi:
యద్యథా వర్తతే తస్య తత్త్వం హిత్వాన్యథాత్వధీః ౹
విపరీతా భావనా స్యాత్పిత్రాదావరిధీర్యథా
౹౹ 110 ౹౹
110. యధార్థమునకు విరుద్ధముగ గ్రహించుట విపరీత భావన.
ఆత్మ దేహాదిభిన్నోఽ యం మిథ్యా చేదం జగత్తయోః ౹
దేహాద్యాత్మత్వ సత్యత్వధీర్విపర్యయ భావనా
౹౹ 111 ౹౹
111. దేహేంద్రియాదులకంటే భిన్నమైనదయినా అవే ఆత్మగా భావించటమే విపరీతభావన.
తత్త్వభావనయా నశ్యేత్సాఽ తో దేహాతిరిక్తతామ్ ౹
ఆత్మనో భావయేత్తద్వన్మిథ్యాత్వం జగతోఽ నిశమ్ ౹౹ 112 ౹౹
112. తత్త్వవిచారణ వలన జగత్ విపరీత భావన నశించును.
కిం మంత్రజపవన్మూర్తి ధ్యానవద్వాత్మభేదధీః ౹
జగన్మిథ్యత్వధీశ్చాత్ర వ్యావర్త్యా స్యాదుతాన్యథా ౹౹113౹౹
అన్యథేతి విజానీహి దృష్టార్థత్వేన భుక్తివత్ ౹
బుభుక్షుర్జపవద్భుంఙ్త్కేన కశ్చిన్నియతః క్వచిత్ ౹౹114౹౹
113,114. (సంశయము)
దేహాతిరిక్తత,జగన్మిథ్యలను మంత్ర మూర్తి ధ్యానములవలె ఆవర్తించి చెప్పుచుండవలెనా?
మరొక విధముననా?
మరొక విధమే ! నియములేవీ లేవని ఉద్దేశము.
అశ్నాతివా న వాశ్నాతి భుంఙ్త్కేవా స్వేచ్ఛయాన్యథా ౹
యేన కేన ప్రకారేణ క్షుధా మపనినీషతి ౹౹115౹౹
115.ఆకలి తీరుటకు భోజనము చేయవలసినట్లే, దుఃఖములు తీరుటకు తత్త్వవిచారణే కర్తవ్యము.
వ్యాఖ్య:- దేహాదిభిన్నమైన ఆత్మభావన(ఆత్మ అనేది దేహాదులకంటె భిన్నమైనది అనే భావం),జగన్మిథ్యాత్వ భావనలను గూర్చిన చింతనము.
మంత్రాన్ని జపించినట్లుగా ఏదో దేవతామూర్తిని ఉపాసించినట్లుగా నియమపూర్వకంగా గాని,
విధినియమాలు లేకుండా గాని,
ఇష్టం వచ్చినప్పుడు అనుకూలాన్ని బట్టి చేయవచ్చునా ? అంటే -
ఈ తత్త్వభావనమనేది ప్రత్యక్ష ఫలాన్ని యిచ్చేది కాబట్టి నియమం లేకుండానే చేయవచ్చు - అనగా జపాదులకు వలె నియముములేవీ లేవని ఉద్ధేశము.
అన్నము తినుటయందు వలె విచారణనందు కూడా ఫలము నేరుగనే కనబడును. ఆకలిగొనిన వ్యక్తి భుజించునపుడు ఒక్కొక్క ముద్దతో ఆకలి అంతంతగా తగ్గిపోవుట తెలియుచునే ఉండును.ఇచ్చట జపము వలె భుజించుటగాని నియమములతో భుజించుటగాని జరగదు.
భోజనం చేయాలని అనుకొనే వాడెవడూ జపంచేసే వానిలాగా శ్రుతి స్మృతుల్లో చెప్పిన నియమాలను అనుసరించి నియమంగా భోజనం చేయడు.ఏ విధంగా ఆకలి తీరితే ఆ విధంగా భోజనం చేస్తాడు. అంటే -
ఆకలి చేత పీడింపబడేవాడు (క్షుధార్తుడు)ఎప్పుడు దొరికితే అప్పుడు అన్నమున్నచో తింటాడు, అన్నము లేనిచో తినడు.ఇతర కార్యాలలో నిమగ్నుడైనప్పుడు కూడా తినడు .అంటే -
జూదము మొదలగునవి.
కూర్చున్నప్పుడు,
నడిచేటప్పుడు,పవళించియుకూడా ఏదోక విధముగ తన ఆకలిని తీర్చుకునేందుకు ప్రయత్నింస్తాడు -
ఆకలి అనేది ఉంటే !
అంటే- భోజనమనేది క్షుధానివృతి(ఆకలి తీరటం) అనే ప్రత్యక్ష ఫలం కోసం చేసేది.
ఇప్పటి ఆకలి తీరుటకు భోజనము చేయవలసినట్లే ,
ఇహ జీవితపు దుఃఖములు తీరుటకు తత్త్వవిచారణే కర్త్వమని భావము. నియమాలు పరలోకము కొరకు.
ఇక నియమపూర్వకంగా చేసే పనులన్నీ స్వర్గాది పరలోకాన్ని సాధించటంలాంటి
అప్రత్యక్ష ఫలం కోసం చేసేవి అన్నమాట.
అట్లాగే తత్త్వచింతనమనేది నియమం లేకుండానే జరగవచ్చు.
జిజ్ఞాసువు తత్త్వచింతన చేయునపుడు ఫలము నేరుగనే
తెలియుచుండును.
ఆవర్తించుటలు నియమములు
అనావశ్యకములు.
No comments:
Post a Comment