Vedantha panchadasi:
నయమేనా జపం కుర్యాదకృతౌ ప్రత్యవాయతః |
అన్యథాకరణేఽ నర్తకి స్వరవర్ణ విపర్యయాత్ || 116 ||
116. జపం నియమపూర్వకముగ చేయవలెను.
విపర్యయముగ స్వరము వర్ణము చెరిచిన అనర్థమే సిద్ధించును.
వ్యాఖ్య:- జపమనేది నియమపూర్వకముగా చేయాలి.
అట్లాచేయకపోతే పాపం వస్తుంది.ఇతర విధంగా చేస్తే పరవాలేదు గదా ! -
పాపం రాదు గదా ! - అంటే ,
అట్లా కాదు !
తప్పుడు పద్దతిలో చేస్తే అనర్థానికి కారణమౌతుంది.
"మంత్రోహీనః స్వరతో వర్ణతోవా మిథ్యాప్రయుక్తో న తమర్థమాహ. స వాగ్వజ్రో యజమానం హినస్తి యథేన్ధ్రశత్రుః సర్వతోఽ పరాధాత్ "
(పాణినీయ శిక్షా - 52)
వృత్తాసురుడు ఇంద్రుడిని చంపాలనే తలంపుతో యజ్ఞంలో ఆహుతి ఇస్తూ యాజ్ఞికులచేత మంత్రజపం చేయించాడు.కాని,
ఉదాత్త అనుదాత్త స్వరిత భేదంవల్లను, అక్షరహీనమవటం వల్లను, -
తప్పుగా మంత్రన్ని ఉచ్ఛారణ చేయటము వలన అతని కోరిక వ్యక్తం కాలేదు.
ఆ వాక్కే వజ్రాయుధమై యజమానినే -
వృత్రాసురుడినే - నాశనం చేసింది.
స్వరంవల్ల కలిగిన - ఉచ్ఛారణదోషం వలన కలిగిన అపరాధంతో వృత్తాసురుడే మరణించాడు. -
"ఇంద్ర శతుర్వి వర్థస్వ" ఈ మంత్రంలో ఇంద్రునియొక్క శత్రువు వర్థిల్లుగాక అనే షష్ఠీతత్పురుష అర్థానికి బదులుగా ఇంద్రుడనే పేరుగల శత్రువు వర్థిల్లుగాక అనే సంభావన పూర్వపద కర్మధారయ అర్థం రావటము వలన ఇంద్రుని వృద్ధి,
వృత్రాసురునికి హాని కలిగినది.
కామ్యసిద్ధికై చేయు జపమున ఇట్టి ప్రమాదములుండును.
భగవత్ర్పీతికై చేయు జపమునందు దోషములంటవు.
క్షుదేవ దృష్టభాధాకృద్విపరీతా చ భావనా ।
జేయా కేనాప్యుపాయేన నాస్త్యత్రానుష్ఠితే క్రమః
।। 117 ।।
117. ఆకలి వలె విపరీతభావనయు దుఃఖమును కలిగించును. ఎలాగయ్నా జయుంచాలి తప్ప నియమక్రమములు లేవు.
ఉపాయః పూర్వమేవోక్తస్తచ్చింతాకథనాదికః ।
ఏక దేకపరత్వేఽ పి నిర్బంధో ధ్యానవన్న హి ।। 118 ।।
118. ఈ ఉపాయము మునుపు చెప్పబడినది, బ్రహ్మచింతనము మెుదలైనవి.(చూ.106).తత్పరతయందు కూడా మూర్తిధ్యానము నందువలె నిర్భందమేమీ లేదు.
మూర్తిప్రత్త్యయసాన్తత్యమన్యనన్తరితం ధియః।
ధ్యానం తత్రాతి నిర్బంధో మనసశ్చంచలాత్మనః ।। 119 ।।
119. మూర్తి ప్రత్యయము మాత్రమే ధ్యానమనబడును.మనోచాంచల్యము ధ్యానమందు నిర్భంధము ఎక్కువ.
వ్యాఖ్య:- విపరీతభావన వలన కలుగు పర్యావసానము ఏమిటి ? అంటే -
ఆకలిలాగానే విపరీత భావన కూడా ప్రత్యక్షంగా దుఃఖాన్ని కలిగిస్తుంది.
అంటే ఆకలిగొన్నవానికి ఆకలివల్ల కలిగే దుఃఖము ప్రత్యక్షముగా అనుభవంలోకి వస్తుంది.
అట్లాగే అనాత్మవాదికి కూడా విపరీత భావనవలన లోపల ఎల్లప్పుడూ క్లేశం కలుగుతూనే వుంటుంది.
కాబట్టి ఎట్లాగయినా సరే ఆ విపరీత భావనను జయించాలి.ఏదో ఒక ఉపాయము చేతనైన సరే దానిని అధిగమించాలి.
అందుచేత నియమములు,
క్రమములు ఉండజాలదు.
అయితే, ఈ విపరీత భావనా నివృత్తికి ఉపాయం చెప్పాల్సిందే ! అంటే -
ఈ విపరీత భావనను నివారించుటకోసం ఉపాయంగా బ్రహ్మభావ విషయకమైన విచారణము, పరస్పర కథనాదులు లోగడ చెప్పబడ్డాయి.ఇంతకు మించిన ఉపాయం లేదు.వీటికి నియమాలు,నిర్భంధాలూ ఏమీలేవు.
మూర్తిపూజాదికాలకు,
సగుణ విగ్రహారాధనలకు ఉన్న కఠిన నియమాలుగానీ,
జపాదులకుండే - తూర్పుకు తిరిగి కూర్చోవటం లాంటి నిర్బంధాలుగాని ఏమీ లేవు.
సుగుణ స్వరూప ధ్యానంతో ఉండే నిర్బంధాలు,
ధ్యాన స్వరూపం ఎటు వంటిదో చూద్ధాం -
దేవతాదుల మూర్తి గోచరమైన ప్రతీతి.విజాతీయమైన ఏ ప్రతీతీ లేకుండా - అంటే విజాతీయ వృత్తి శూన్యమై, అనవచ్ఛిన్నమై,అవ్యవహిత రూపంలో ప్రవహించటాన్నే ధ్యానం అంటారు.
ఇతర ప్రత్యయములు లేక మూర్తి ప్రత్యయము మాత్రమే తైలధారవలె సంతతముగా వుండుట ధ్యానమనబడును.
మనస్సు సహజముగానే చంచలము గనుక ,
ఈ విధమైన ధ్యానమునందు చంచలమైనట్టి మనస్సు పూర్తిగా బంధింపబడుతుంది. అంటే , ధ్యానములో ఈ విధమైన మానసిక చాంచల్యానికి నిర్బాధం చాలా ఎక్కువగా ఉంది.
భ్రమణశీలమైన ఏనుగులను,గుఱ్ఱాల్ని కట్టివేసినట్లుగా మనస్సును బంధించాలి.
విచారమందును మనస్సు స్థిరముగా నిల్వక ఇతర విషయములందు పరుగిడి పోవు చుండును.ఇట్టివానిని విక్షేపసహితునిగా చెప్పబడును.
కావున ధ్యానము ద్వారా భగవద్భక్తి ద్వారా చిత్తము ఏకాగ్రమగును.
మనస్సుకుండే చాంచల్యాన్ని గురించి భగవద్గీత - 6 -34 లో వివరించియున్నారు.
No comments:
Post a Comment