*ప్రేరణ 🎯మార్గ*
🍁పిలవడాన్ని సంబోధన అంటారు. పెద్దవారైనా చిన్నవారైనా వయసు, హోదాలతో నిమిత్తం లేకుండా ఆత్మీయతతో, ఆర్తితో పిలిచినప్పుడు ప్రసన్నులవుతారు. ఎక్కువగా ఆవేదనతో, ఆర్తితో రగులుతున్నప్పుడు తమ ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సంబోధనలు చేస్తూ ఉంటారు.
🍁ఉదాహరణకు వాల్మీకి రామాయణంలో తన వెంట అడవులకు పయనమైన రామలక్ష్మణులు నిద్రించి ఉండగా- విశ్వామిత్రుడు రాముణ్ని ఉద్దేశించి-
'కౌసల్య ప్రియసుతుడా! నరుల్లో సింహం వంటి పరాక్రమం కలవాడా... మేలుకో అని సంబోధిస్తాడు.
🎯🎯🎯
🍁రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడు చేసిన విన్నపం అందులో కనిపిస్తోంది. భాగవతంలోని గజేంద్ర మోక్షఘట్టంలో మొసలికి బలి కాబోతున్న దీనావస్థలో గజేంద్రుడు 'రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!' అని దీనంగా ప్రార్ధించడంలో ఒక ప్రాణి ఆర్తి ప్రస్ఫుటమవుతుంది. పుట్టుకతోనే వైరాగ్యభావంతో తపస్సు చేయడానికి వెళ్లిపోయిన పుత్రప్రేమతో వ్యాసుడు- 'పుత్రా! పుత్రా!! ఎక్కడున్నావు?' అంటూ ఆయన తిరుగుతుంటే లోకోత్తర పురుషులకు కూడా ఆర్తి ఉంటుందనే విషయం అవగతమవుతుంది. వ్యాసుడు అలా బిగ్గరగా పిలుస్తూ అడవులు, కొండలు, కోనలు తిరుగుతుంటే చెట్లు, గుట్టలు, లోయలు... సమస్తo
🎯🎯🎯
🍁శ్రీశుకుణ్ని తలచుకుంటూ శోకిస్తాడు వ్యాసుడు.
🍁ప్రకృతి 'పుత్రా! పుత్రా!!' అని ప్రతిధ్వనించిందట. అందుకే వ్యాసుడు పరమ దయాళువని, సర్వభూత హృదయుడనీ ప్రస్తుతిని పొందాడు. దాశరథి శతకంలో కూడా కవి, రాముణ్ని నిలదీసి ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలలో జీవుడి ఆర్తి గోచరమైంది. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో పరమేశ్వరుణ్ని ఉద్దేశించి చేసిన సంబోధనలూ ఇలాంటివే సుమతి, వేమన, భాస్కర వంటి శతకాల్లో సైతం అన్యాపదేశంగా కవులందరూ తమ ఆర్తిని ప్రతిబింబించినవారే.
🍁ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో అగ్రభాగం ఆర్తిని ప్రతిబింబించే మాటలే కనిపిస్తాయి. భాగవతంలో రుక్మిణి కృష్ణుడి కోసం పంపిన సందేశంలో ఆమె మనోవేదన స్పష్టమవుతుంది. భ్రమరగీతలు, శ్రుతిగీతలు, గోపికాగీతల్లో కృష్ణుడిపై గోపికలకు గల ప్రేమాతిశయం ప్రస్ఫుటమవుతుంది. భారతంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో తన మానాన్ని కాపాడమని ద్రౌపది చేసిన స్తుతులలో కృష్ణుడి పట్ల భక్తి, అతడే తనను రక్షించగలడనే విశ్వాసం కనిపిస్తాయి.
🍁 మానవులు తమ జీవనకాలాల్లో పొందే కష్టాలు, బాధలు, కడగండ్లు- దేవతలను ఆర్తిగా సంబోధిస్తున్నప్పుడు వ్యక్తమవుతాయి. తమకు ఇష్టమైనవారు మరణించిన దుఃఖసమయంలో మనుషులు వారిని సంబోధిస్తూ మాట్లాడే మాటలు, ఆవేదనలకు అద్దం పడతాయి.
🍁భాషలో కూడా 'సంబోధన'ను ప్రథమా విభక్తిగా వాడటం వెనక కూడా ఇదే పరమార్ధం కనిపిస్తుంది. 'ఏ తీరుగ నను దయజూసెదవో ఇన వంశోత్తమ! రామా!' అనే కీర్తనలో భక్తుడు తనను రక్షించమని చేసే విన్నపం ఆర్తి రూపంలో కనిపిస్తుంది. ఆర్తితో పిలిస్తే దేవతలు ప్రసన్నమవుతారంటారు. సాటి మానవులు సహానుభూతిని వ్యక్తం చేస్తారు. కనుక ఆర్తితో కూడిన సంబోధన గుణాత్మకమే.
No comments:
Post a Comment