🙏 *రమణోదయం* 🙏
*అన్యములు కనబడినా కనబడకపోయినా వాటి మీద భ్రాంతితో ఆత్మ స్ఫురణని వదలకుండా నిరంతరం ఆత్మలోనే నిల్చి ఉండాలి. జ్ఞాన స్వరూపడైన తనని మరచిన కాలవ్యవధి కొంచమైనా, దాని పరిణామాలు చాలా తీవ్రమైనవి.*
వివరణ: *గోచరించే త్రిపుటులను పట్టుకొని కలత చెందక నిరంతరం ఆత్మావలోకనంలో ఉండటమే జ్ఞానసమాధి. అదే ముక్తి.*
అజ్ఞానికి ఆలోచనరహితముగా
ఉండుట ఎంత కష్టమో,
జ్ఞానికి ఆలోచనలు కలుగజేసుకొనడం
అంత కష్టము!🙏
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.612)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment