[4/22, 07:53] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
నిన్ను తిట్టినట్టి నీ శత్రులకెపుడు
భయము పడగ వద్దు బ్రతుకునందు
నిన్ను మెచ్చుహితుల నెప్పుడు కనిపెట్టు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
*తాత్పర్యం:*
నిన్ను తిట్టే నీ శత్రువులకు ఎప్పుడు భయపడకు. నిన్ను ఇష్టపడేవారిని ఎప్పుడు విడిచి పెట్టకు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[4/22, 07:53] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. -డా.బి.ఆర్. అంబేద్కర్.*
[4/22, 07:53] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*మొక్కై వంగనిది, మ్రానై వంగునా?*
మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఏ మొక్కైనా మనకు కావలసిన రీతిలో వంగుతుంది. అదే మొక్క పెరిగి పెద్ద వృక్షమయ్యాక వంచాలని ప్రయత్నిస్తే అది వంగదు. ఆదే విధంగా పిల్లలను బాల్యంలోనే కావలసిన రీతిలో తీర్చిదిద్దుకోవాలి. వారు పెరిగి పెద్దవారైనాక వారి అలవాట్లు, పధ్ధతులు మార్చలేమని చెప్పటానికి ఈ సామెతను వాడుతారు.
[4/22, 07:53] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*అందని ద్రాక్షపండ్లు పుల్లన*
తనకు దక్కనిది మంచిది కాదని,
అవకాశవాదం,
స్వార్థం, పలాయనవాదం,
అందని పూలు దేవుడికే అర్పణం అన్నట్టు.
[4/22, 07:53] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*పిచుకమ్మా!*
పిచుకమ్మా! పిచుకమ్మా!
నీ గూడెక్కడ చెప్పమ్మా?
అవ్వ చెప్పిన కథలో
ఆ పొరుగు కాకి ఏదమ్మా?
పచ్చదనం కరిగిపోయి - చెట్టునీడ కనుమరుగై
ఈ కాంక్రీటు జనారణ్యం - జంతు నీతి సమాజాన
పంట పొలం బీడైతే - పరిగ గింజ కరువైతే
వరికంకుల కుచ్చులున్న - చూరులన్ని నిండుకుంటే "పిచుకమ్మా"
రెండు చేతుల జాతి - వేల వేల చేతులు చాచి
పర్యావరణ సమాతుల్యాన్నే - కకా వికలు చేస్తుంటే "పిచుకమ్మా"
సొంతలాభం మూర్ఖత్వం - భూమినంతా కబళిస్తే
పురుగూ పిట్టా చెట్టూ పుట్టా - ఉనికి మనకి పోతుంటే "పిచుకమ్మా"
No comments:
Post a Comment