[4/24, 15:37] +91 79819 72004: *52.🤠 నేటి సామెత 🌸*
సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్ట్లు:
సరసాలు ఆడేటప్పుడు, చమత్కారాలు మాట్లాడేటప్పుడు, వరసైన వారిని గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ సామెత ప్రయోగంలో కనిపిస్తుంది. వినటానికి ఇంపుగాలేని గొంతును గాడిద గొంతుతో పోల్చిచెప్పటం, అంధవిహీనతను కోతిరూపంbతో పోల్చిచెప్పటం ఓ అలవాటుగా వస్తోంది.
[4/24, 15:37] +91 79819 72004: 44.*💎నేటి ఆణిముత్యం💎*
తోిటీవారి తోడ పోటీలు పడుచుండ
విద్య వృద్ధి యగును వెలుగు కలుగు
ఈర్ష ఉండరాదు ఇతరపిల్లలపైన
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
*తాత్పర్యం:*
పక్క పిల్లలతో పోటీ పడుతూ వాళ్లని గమనిస్తూ, మనం మన విద్యలో వృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే చాలా పైకి వస్తాము. అలా అని ఇతర పిల్లల మీద ఈర్ష్య ఉండకూడదు. తెలుసుకుని మసులుకో ఓ తెలుగు బాల.
No comments:
Post a Comment