(243) (20.04.2025)
మిత్రమా బ్రహ్మచారి జీవితాన్ని వదిలి పెట్టు
నీకు నచ్చిన – నిను మెచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టు
ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు
అన్న-వదినని ఎందుకు కష్ట పెడతావు //
బ్రహ్మచారి జీవితం కూజా లాంటిది
కొద్ది రోజులే చల్లగా ఉంటుంది
పెళ్ళైన జీవితం MAAZA లాంటిది
తాగిన కొద్దీ తాగాలని అనిపిస్తుంది //
బ్రహ్మచారి జీవితంలో నీ బాధను పంచుకునేది ఎవరు
అదే పెళ్ళైతే నీ బాధను పంచుకోకుండా ఉండేది ఎవరు
బ్రహ్మచారి జీవితం ఒంటరిగా గడపాల్సి రావొచ్చు
అదే పెళ్ళైతే ఇల్లాలు-పిల్లలతో గడపొచ్చు //
ఒంట్లో నలతగా ఉన్నా
ఇంట్లో ఏమి తోచకున్నా
ఇల్లాలు-పిల్లలు నీకు తోడుగా ఉంటారు
నిను కంటి రెప్పలా చూచుకుంటారు //
బ్రహ్మచారి జీవితంలో ఆరోగ్యం బాగుండకున్నా
వంట చేసుకునే ఓపిక లేకున్నా
అన్ని పనులు నీవే చేసుకోవాలి
నీకు నీవే సమాధానం చెప్పుకోవాలి //
మందు అలవాటు ఉంటే బ్రహ్మచారి జీవితం హాయి అనుకుంటావు
ఇంట శ్రీమతి ఉన్నా ఎటువంటి ఆటంకం ఉండదని తెలుసుకోవు
బంధుగణంతో ఇల్లు ఎప్పుడూ కళకళ లాడుతుంటుంది
అదే బ్రహ్మచారి ఇల్లు ఎపుడూ వెల వెల పోతుంది //
ప్రతి రోజూ చేయి కాల్చుకుంటూ
ఉడికి-ఉడకంది తింటూ
రోజులు నెట్టుకు రావాలి
లేకుంటే ప్రతి రోజూ పస్తులు ఉండాలి //
పెళ్ళి చేసుకుంటే ఇల్లాలు వేడి వేడి భోజనం వడ్డిస్తుంది
గోరు ముద్దలు – లేత ముద్దులు కలిపి తినిపిస్తుంది
ఇంత కన్నా అదృష్టం ఉంటుందా
బ్రహ్మచారి జీవితంలో ఇలాటి అదృష్టం కలుగుతుందా //
ఇంటికి రాగానే నాన్న అంటూ పిల్లల పిలుపులు
ఏమండి అంటూ ఆప్యాయంగా పిలిచే ఇల్లాలు
కప్పు కాఫీతో ఎదురు వస్తుంది
నీ అలసటను పోగొడుతుంది //
శ్రీమతి నీ పక్కనే కూర్చొని నీ వంటి మీద చేయి వేయగానే
ఏమండి అంటూ ప్రేమగా నిను పిలువగానే
ముందుగా నీ ఫ్యూజులు ఎగిరి పోతాయి
నీ ఒళ్ళు – కాళ్ళు గాలిలో తేలుతాయి //
బ్రహ్మచారి జీవితంలో ఇటువంటివి కానరావు
డబ్బులు ఇచ్చి కొనుక్కుందామన్నా బజారులో దొరకవు
ఇల్లాలిని పక్కన పెట్టుకుని పక్క వాళ్ళని లైనులో పెట్టొచ్చు
అదృష్టం ఉంటే ఇంకో చిన్న ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు //
నీవు ఆరోగ్యంగా ఉండాలన్నా
నీ జీవితంలో అనారోగ్యం రాకూడదని అనుకున్నా
ముందుగా పెళ్ళి చేసుకో
ఇల్లాలితో MAAZA పంచుకో //
బావమరదులు ఉంటే నీ పంట పండినట్టే
నీవు ఉన్న ఊళ్ళో ఉంటే నీకు సగం ఖర్చు తగ్గినట్టే
అవసరానికి నిను ఆదుకుంటారు
హాచ్ కుక్కలా ఎపుడూ నీ వెంటే ఉంటారు //
ఇప్పటికైనా నీ మనసు మార్చుకో
పెళ్ళి చేయమని నీ వాళ్ళని బ్రతిమలాడుకో
నీకు కాబోయే పిల్ల ఎక్కడో పుట్టే ఉంటుంది
నీవు ఊ అంటే నీ ఇంట్లో కాలు పెడుతుంది //
మధిర వెంకట రమణ, హైదరాబాద్
No comments:
Post a Comment