కాఫీ కబుర్లు సంఖ్య 866 (ఏప్రిల్ 15 - 2025) -- ప్రపంచ కళా దినోత్సవం (world art day) ---- పెయింటింగ్స్ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. వందల వేల సంవత్సరాలు నిక్షిప్తం చేయొచ్చు. శిల్పకళ కనువిందు చేస్తుంది. కర్ణాటక బేలూరు, ఒరిస్సా కోణార్క్, శ్రీకాళహస్తి వంటి అనేక ఆలయాలు అద్భుతమైన చిత్రకళకు అద్దం పడతాయి. ఏ మ్యూజియంకి వెళ్లిన అరుదైన చిత్రకళా ఖండాలు, లెక్కలేనన్ని పెయింటింగ్స్ మనకి దర్శనమిస్తాయి. చాలా ఏకాగ్రత తో కూడుకున్న కళ చిత్రకళ. ఎంతో సృజనాత్మక శిల్పకారులలో ఉండాలి. ప్రపంచంలో అద్భుత కళాఖండాలు సృష్టించిన చిత్రకారులు కొందరున్నారు. వారిలో అగ్రస్థానం ఇటలీ దేశానికి చెందిన లియొనార్డో దావిన్సీ ది. ఈయన సృష్టించిన మొనాలిసా, లాస్ట్ సప్పర్, వర్జిన్ ఆఫ్ ది రాక్ వంటి అనేక చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. చిత్రకళలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సృజనాత్మక గల చిత్రకారుడు ఈయన. 15వ శతాబ్దంలో ఈయన పుణ్యమా అని చిత్రకళా రంగానికి మంచి ఊపు వచ్చింది. చిత్ర శిల్ప కళలు మానవ మనుగడ, సంస్కృతి ఎదుగదలతో పాటే వికసిస్తూ వచ్చాయి. ప్రార్ధనా స్థలాలు, హైందవ దేవాలయాలు, బౌద్ధారామాలు, ఆధునిక ఫైవ్ స్టార్ హోటల్స్ వంటి కొన్ని స్థలాలు చిత్రకళకు కేంద్ర బిందువులయ్యాయి. యూరప్ లో క్రీస్తు బైబిల్ గాథలు చిత్రిత వస్తువులయ్యాయి. ఇటలీలో 1452లో జన్మించిన లియొనార్డో దావిన్సీ చిత్రకళలో ఆసక్తి పెంచుకున్నాడు. కళలో భాగంగా మానవ శరీర నిర్మాణ రీతిని లోతుగా అధ్యయనం చేశాడు. తొలి యుద్ధ శకటాన్ని ఈయనే రూపొందించాడు. తన 52వ ఏట సృష్టించిన మొనాలిసా ఒక అపురూప చిత్రం. ఈ చిత్రంలో.. యువతి వదనంలోని చిరు దరహాసంలో రహాస్యం ఏమైవుంటుందో అన్నది చర్చనీయాంశం అయింది. మరో అద్భుత చిత్రం.. లాస్ట్ సప్పర్.. ఇందులో క్రీస్తు తన 12 గురు శిష్యులతో కూర్చుండే అంశం యూరప్ లో అనేక చర్చి పైకప్పుల మీద దర్శనమిస్తుంది. సృజనాత్మక చిత్రకారుడు లియొనార్డో దావిన్సీ జయంతి గౌరవార్ధం ఏటా 2012 నుంచి ఈరోజు.. ఏప్రిల్ 15న.. వరల్డ్ ఆర్ట్ డే గా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని యునెస్కో తీసుకున్న నిర్ణయానికి అనేక దేశాలు మద్దతు పలికాయి. సృజనాత్మక చిత్రకళ పై అవగాహన పెంచుకోవడం కోసం పలు కార్యక్రమాలు చేపడతారు. అరుదైన చిత్రపటాలు సేకరిస్తారు. చిత్ర కళాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తారు కొన్ని దేశాల్లో. చిత్రకళాకారులకు, చిత్ర కళారాధకులకు పండుగే.. ఈ ప్రపంచ కళా దినోత్సవం.. ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment