Monday, April 21, 2025

 ఒక అడుగు, ఒక మాట, వెనక్కి ఉన్నా పర్వాలేదు. మనల్ని మనం తక్కువగా చూపించుకున్నా ఇబ్బంది లేదు. ఇలా ఉండటం వల్ల నిజస్వరూపాలు బయట పడతాయి. 

చాలామంది మన నుండి దూరంగా ఉంటారు. ఆత్మీయులు మాత్రమే మనతో ఉంటారు. వెనుక నిలబడే నలుగురు అప్పుడే మనకి దొరికేది. 

డబ్బు, సొల్లు కబుర్లు, గొప్పలకి పోవడం ఇవన్నీ పెనుభారం.. మోయలేక చావాలి. స్వేచ్ఛ ఉండదు. అబద్ధాలు, మోసాలు, వంగి వంగి ప్రతి ఒక్కడికి సలాం కొట్టాలి. 

లేనిదాన్ని ఉన్నట్లు చూపించాలి. ఇవ్వన్ని చేస్తూ పోతే ఒకానొక నాటికి ఇవన్నీ బయటికి వస్తె ఒక్కడు ఒక్కడంటె ఒక్కడు పక్కన నిలవడు. అవన్నీ ఎవరి కోసం చేశామో వాళ్లు కూడా మిగలరు..

ఉదృతంగా పొంగే గంగమ్మను అడ్డుకోవాలని రొమ్ము విరుచుకు నిలబడే మహావృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తుంది. ప్రవాహం వచ్చినప్పుడు అణిగిమణిగి ఉండే గడ్డిపరకను ఏమి చేయకుండా వెళ్ళిపోతుంది గంగ.. 

కాస్త తగ్గి ఉన్నంత మాత్రాన పోయేది ఏమి ఉండదు. మాయలు మోసాలు చేసే వారి నుండి, అహంకారుల నుండి దూరంగా ఉండొచ్చు. హాయిగా బ్రతికేయొచ్చు..

సదా సర్వదా మీ శ్రేయోభిలాషి వి ఎస్ బి టి వి సురేష్...

No comments:

Post a Comment