Monday, April 21, 2025

 *భగవత్ రామానుజులు వారి అతి ముఖ్య ఉపదేశాలు*

*శ్రీమతే రామానుజాయ నమః*
1,  ఆచార్యులను భక్తి తో పూజించాలి,
  2, ఇంద్రియములు కు బానిస కావద్దు ,
  3, భగవన్నామములు భక్తితో ఉచ్చరించునట్లే , భగవత్ భక్తుల నామాల్ని రసవత్తరంగా ఆనందంగా పారాయణం చేయండి, 
 4, రోజులో కొంతసేపు మీ ఆధ్యాత్మిక ఆచార్యులు కీర్తి ని మననం చేయండి,ఆళ్వార్ లు ఆచార్యుల రచనలు పఠించండి,
 5, హృదయపూర్వకంగా భగవంతుని శరణు పొందిన వారితో సజ్జన సాంగత్యం పెంచుకోండి,
 6, బాహ్య విషయములు పై అధిక ఆసక్తి కలిగిన వారితో
సహచర్యం విడనాడండి ,
7, పరిపూర్ణంగా భగవత్ పాదారవిందములు కడ శరణు పొందినవారు భవిష్యత్తు గురించి చింతిపనవసరం లేదు,
ఆ స్వామి అగు శ్రీమన్నారాయణ మూర్తి ప్రభువు మనకు  స్వయంగా రక్షణ కల్పిస్తాడు,
8, ఈ జన్మ అన్నది పూర్వ కర్మల ఫలితమే కనుక ఊరికే విచారిస్తూ వుండనవసరం లేదు,
9, మన బాధ్యతలు  నిర్వహించడం అంతా భగవత్ కైంకర్యమని తలస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం,
10, మీరు కోరుకునేది మీకు కావలసినది అంతా ఆ భగవంతుడు దయా సముద్రుడై  సమకూరుస్తడు...

*(జై శ్రీమన్నారాయణాయ)*

         🙏 🌹🙏🌹🙏

No comments:

Post a Comment