Monday, April 21, 2025

 *1. బతికి గెలవండి రా బాబు... ఆత్మహత్యలతో ఏమి సాధించలేరు!*
*ఇవాళ న్యూయార్క్‌లో సాయి కుమార్ రెడ్డి అనే యువకుడు ICE అరెస్ట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని వార్త వచ్చింది. కానీ నిజంగా? ICE రాలేదు, అరెస్ట్ చేయలేదు, జైలు వేయలేదు, డిపోర్ట్ చేయలేదు. ఇది అంతా భయం, అనవసరమైన భయం!*

*2. అరెస్ట్ అయినా ఏమి అయింది?*
*ఈ దేశాల్లో అరెస్ట్ అయ్యినవారు కూడా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు అవుతున్నారు. భయంతో ఆత్మహత్య చేసుకోవడం దేనికి? భయం మనకు శత్రువు. ధైర్యం మన శక్తి. నిన్ను చూసి ఇంకెవరో ధైర్యంగా జీవించాలంటే, నీవు బతికే ఉండాలి.*

*3. ఇప్పుడు అమెరికా ఒక కల కాదు – ఓ కల్లోలమైన ఒత్తిడి.*
*ఇల్లు దొరకదు, బర్గర్ ధర 12 డాలర్లు, సెలవులు తీసుకుంటే ఉద్యోగం ఊడిపోతుంది. జీతం పెరగదు. ఉద్యోగ భద్రత లేదు. ఒక్కటే పని – పని – పని. మనిషిని రోబోగా చూస్తారు. మిత్రులు, ఆనందాలు, టచ్ అన్నీ మిస్ అవుతాయి.*

4. *ఇండియాలో ఇప్పుడు అవకాశాల వర్షం పడుతోంది!*
*ఇండియాలో ఉద్యోగం, వ్యాపారం, స్టార్టప్, టి కొట్టు – ఏదైనా మొదలుపెట్టొచ్చు. Uber, Zomato, YouTube, Instagram – ప్రతీ దాంట్లో కెరీర్ ఉంది. అమెరికాలో చిన్న టీ స్టాల్ పెట్టాలంటే రెండు ఏళ్లు పట్టినా, ఇండియాలో రెండు గంటల్లో కావచ్చు!*

*5. ఈ దేశాలు మనం వెళ్లే గమ్యాలు మాత్రమే... జీవించాల్సిన స్థలం కాదు.*
*ఇక్కడ ఉంటూ చనిపోవాల్సిన అవసరం లేదు. మన కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు ఉన్నారు. మనం ఒంటరి కాదు. ఆసియా 21వ శతాబ్దం నాయకత్వం తీసుకుంటోంది. ధైర్యంగా ఉండండి – ప్రాణం మీదే ఆశా వెలుగు ఉంటుంది. ప్రాణాలు కాపాడండి.*


---

No comments:

Post a Comment