*_పొందిన సహాయం... కృతజ్ఞత మరిచిన వ్యక్తి... పశువుతో సమానం... వాడు జీవితంలో... రాణించలేడు..._*
*_జీవితంలో పరిచయమైయ్యే ప్రతీ ఒక్కరు మనకు గురువులే. మంచివారు వెన్నుతట్టి నేనున్నానంటూ భరోసానిస్తారు, "జీవిత పాఠాలు" నేర్పుతారు._*
*_చెడ్డవారు "గుణపాఠాలు" నేర్పుతారు. వీరెవ్వరు నేర్పకపోయిన "విధి "అన్నింటిని నేర్పుతుంది._*
*_ఎవరైతే మన బాధను అర్థం చేసుకొని మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారో, మనలను మళ్ళీ జీవితంలో నిలబెడుతారో వారే మనకు నిజమైన ఆత్మీయులు, ఆత్మ బంధువులు. అలాంటి వారి పట్ల కృతజ్ఞతతో మెదలండి..._*
*_కృతజ్ఞత మనిషికి గొప్ప ఆభరణం. పొందిన సహాయం... మరిచిన వ్యక్తి జీవితంలో రాణించలేడు._*
*_అవసరం, అవకాశం లేనప్పుడు నీవు ఎలా ఉన్నావో... అవసరం, అవకాశం వచ్చినప్పుడు కూడా ఆలా మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం..._*
*_మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరు చేతులు కలుపుతారు కానీ, కష్టంలో ఉన్నప్పుడు కొందరు మాత్రమే చేయూతనిస్తారు._*
*_చేతులు కలిపిన వారిని మరువకుండా గుర్తు పెట్టుకో. చేయూత నిచ్చిన వారి పట్ల కృతజ్ఞుడవై ఉండు._*
*_అవసరం ఉన్నప్పుడు "పొగడ్తల"తో ముంచెత్తడం, అవసరం లేనప్పుడు "పొగరు"తో మాట్లాడడం అనేవి కృతజ్ఞతాహీనుల లక్షణం._*
*_జీవితంలో మనం ఎంత ముందుకెళ్లినా కొన్ని విషయాలు అంతుచిక్కవు._*
*_మన మంచి కోరేవారెవరో, మనలను ముంచేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, మనకోసం ఆరాటపడేవారెవరో, మనలను అవసరానికి వాడుకునే వారెవరో అర్థం కాని పరిస్థితి కొనసాగుతుంది..._*
*_జీవితంలో నీకు సంబంధించిన అన్నింటిని కోల్పోయిన పర్వాలేదు కానీ, ఆత్మ విశ్వాసం మాత్రం కోల్పోవొద్దు._*
*_ఉహలతో నీకాలం వృధాచేయకు ప్రయత్నించు... ఫలితం పరమాత్మకు వదిలేయ్... తప్పకుండా ఏదోరకంగా దైవం యొక్క సహాయం అందుతుంది._*
*_' దైవం మనుష్య రూపేన ' దైవము ఎక్కడో లేడు.. మనిషి రూపంలోనే నీకు సహాయం అందిస్తాడు. ఎందుకంటే, నారు పోసిన వాడు నీరు పోయడా..._*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌻🌷🌻 🏵️🙇🏵️ 🌻🌷🌻
No comments:
Post a Comment