Sunday, April 20, 2025

 🦚🪷🌻🌹💎🌈

 *🍁చేస్తున్న పని మంచి అని అవతలి వ్యక్తికి తెలియనప్పుడు,మనం చేసిన పని మంచిది అని మనకు మాత్రమే అనిపించి, అవతలి వ్యక్తికి అసలు అనిపించనపుడు,చెడు ఎదురవుతూ ఉంటుంది.మన ఉన్నతిని, మనకు వచ్చే కీర్తిని చూసి అసూయపడేవారు ఉన్నప్పుడు,చేసిన "మంచి" వల్ల వాళ్ళ ఇగో దెబ్బతిన్నప్పుడు, చెడు ఎదురవుతూనే ఉంటుంది.* 

 *మన కథలో మనం హీరోలం కావొచ్చు, అవతలివారి కథలో మనం విలన్ గా మారితే అది మన తప్పు ఎలా అవుతుంది..చెడు ఎదురవుతోంది కదా అని మనలో మార్పు వస్తే, మనం వారిలా మారితే, మనకూ వారికి తేడా ఉండదు. చేసేది,చేయాలని అనుకున్నది చేసుకుంటూ వెళదాం.మనం కూడా ఆపేస్తే మన తర్వాతి తరం ఇంకా అధ్వాన్నంగా తయారు అవుతారు.* 

 *రేపటి రోజు, మన అనుకున్నవారికి యాక్సిడెంట్ అయి రోడ్ మీద ఉంటే,పట్టించుకునే సమాజమే ఉండాలి.కాబట్టి,ఫలితం గురించిన ఆలోచనను వదిలేద్దాం.మనం ఈ రోజు ఆలోచించి చేసిన పని వల్ల ఏది జరిగినా స్వాగతిద్దాం. పూల దండలు పడొచ్చు,రాళ్లు పడొచ్చు ఏది జరిగినా స్థితప్రజ్ఞతతో మనం నిలబడే ఉండాలి అదే కదా జీవితం.** 

 *🌅శుభోదయం ⛳* 

   🦚🪷🌻🌹💎🌈

No comments:

Post a Comment